
బాలీవుడ్ జంట సుష్మితా సేన్, రోహ్మన్ షా డిసెంబర్ నెలలో విడిపోయిన విషయం తెలిసిందే! తాజాగా వీరిద్దరూ మళ్లీ కలిశారట! బ్రేకప్ చెప్పుకున్న తర్వాత తొలిసారిగా వీరిద్దరూ కలుసుకోవడమే కాకుండా ఒకే కారులో వెళ్లారంటూ బాలీవుడ్‌లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. దీని ప్రకారం.. ఇద్దరికీ పరిచయమున్న ఒక ఫ్రెండ్‌ను కలవడానికే వీళ్లు సిద్ధం అయ్యారట.
ఇందుకోసం రోహ్మన్.. సుష్మిత ఇంటికి చేరుకోగా అక్కడ అరగంట పాటు ఇద్దరూ మాట్లాడుకున్నారని, ఒకరి యోగక్షేమాలను మరొకరు అడిగి తెలుసుకున్నారని సమాచారం. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఒకే కారులో బయలు దేరి వారి కామన్ ఫ్రెండ్‌ను కలిసినట్లు తెలుస్తోంది. కాగా సుష్మిత పిల్లలతో రోహ్మన్‌కు విడదీయలేని అనుబంధం ఏర్పడింది. వారిని ఆడిస్తూ, ఆలనాపాలనా చూస్తూ తండ్రిలా అండగా ఉండేవాడు. బ్రేకప్ చెప్పుకున్నప్పటికీ రోహ్మన్‌కు మాత్రం పిల్లలపై ప్రీతి ఏమాత్రం తగ్గలేదు.
ఇదిలా వుంటే సుష్మిత తనకంటే 15 సంవత్సరాలు చిన్నవాడైన రోహ్మన్‌తో మూడేళ్లపాటు డేటింగ్ చేసింది. ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ 'ఫ్రెండ్స్‌గా మొదలైన మా ప్రయాణంలో ఫ్రెండ్స్‌గానే మిగిలిపోతున్నాము. చాలాకాలం క్రితమే రిలేషన్‌షిప్ ముగిసింది' అంటూ డిసెంబర్‌లో వారు విడిపోతున్నట్లు ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment