
బాలీవుడ్ మాజీ లవ్ బర్డ్స్ సుష్మితా సేన్- రోహ్మన్‌షా బ్రేకప్ తర్వాత తొలిసారిగా కలుసుకున్నారు. ముంబైలోని ఓ రెస్టారెంట్‌కి వెళ్లొస్తూ ఈ జంట మీడియా కంట పడింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. ఇక సుష్మితా సేన్ కనపడగానే సెల్ఫీల కోసం అభిమానులు ఒక్కసారిగా ఎగబడ్డారు. దీంతో అక్కడే ఉన్న మాజీ ప్రియుడు రోహ్మన్ వారిన అడ్డుకొని సుష్మితకు బాడీగార్డ్‌లా నిలిచాడు.
చాలా జాగ్రత్తగా ఆమెను కారు ఎక్కించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో వీరిద్దరూ మళ్లీ కలిసిపోయారా అని నెటిజన్లు సందేహం వ్యక్తం చేస్తున్నారు. వీళ్లు ఎప్పుడూ ఇలాగే కలిసి ఉండాలంటూ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా సుష్మిత తనకంటే 15 సంవత్సరాలు చిన్నవాడైన రోహ్మన్‌తో మూడేళ్లపాటు డేటింగ్ చేసింది. అయితే ఏమైందో తెలియదు కానీ తమ బంధం ముగిసిందంటూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment