ex boyfriend
-
ప్రియురాలి నిర్వాకం.. ప్రియుడిపై కోపంతో సినిమా తరహా పక్కా స్కెచ్
సాక్షి, హైదరాబాద్: తనను దూరం పెడుతున్నాడనే కోపంతో మాజీ ప్రియుడిపై పగ తీర్చుకునేందుకు సినిమాను తలదన్నే రీతిలో స్కెచ్ వేసింది ప్రియురాలు. మాజీ ప్రియుడిని గంజాయి కేసులో ఇరికించింది. స్నేహితుల సాయంతో మాజీ ప్రియుడి కారులో గంజాయి పెట్టించిన యువతి.. పోలీసులకు సమాచారం ఇచ్చి అరెస్ట్ చేయించింది. జూబ్లీహిల్స్ పోలీసులు విచారణ చేయగా యువతి నిర్వాకం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆ యువతితో పాటు ఏడుగురు వ్యక్తులను అరెస్ట్ చేసిన పోలీసులు.. రిమాండ్‌కు తరలించారు. ఇదీ చదవండి: ‘నాన్నా.. వేధింపులు భరించలేకపోతున్నా.. చావుతోనే నాకు విముక్తి’ -
సల్మాన్ ముఖంపై పంచ్ ఇచ్చిన మాజీ ప్రేయసి
-
జాన్వీకపూర్ బాయ్‌ఫ్రెండ్ ఎవరో తెలుసా? ఫోటో వైరల్
అతిలోక సుందరి శ్రీదేవి కూతురిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది జాన్వీ కపూర్. ధడక్, గుంజన్ సక్సేనా ది కార్గిల్ గర్ల్ వంటి సినిమాలతో మెప్పించినా కమర్షియల్ సక్సెస్ మాత్రం దక్కలేదు. స్టార్ కిడ్‌గా ఎంట్రీ ఇచ్చినప్పటికీ స్టార్ హీరోయిన్ లిస్టులోకి ఇంకా వెళ్లలేదు జాన్వీ. మరోవైపు సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటూ గ్లామరస్ ఫోటోలు షేర్ చేస్తుంటుంది ఈ బ్యూటీ. తాజాగా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో దివాళీ సెలబ్రేట్ చేసుకున్న జాన్వీ ఆ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్చేసింది. ఇందులో తన చిన్ననాటి స్నేహితుడు, బాయ్‌ఫ్రెండ్ అక్షత్ రాజన్‌తో జాన్వీ క్లోజ్‌గా దిగిన ఓ ఫోటో కూడా ఉంది. కొంతకాలం క్రితమే వీళ్లిదరు బ్రేకప్ చెప్పేసుకున్నారంటూ బీటౌన్‌లో వార్తలు గుప్పుమన్నాయి. అయితే వీరిద్దరూ మళ్లీ కలిసి కనిపించడంతో ఈ ఫోటో నెట్టింట తెగ షికార్లు కొడుతుంది. కాగా ఇక సినిమాల విషయానికి వస్తే.. జాన్వీ త్వరలోనే 'మిలి' అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించనుంది. -
ప్రియుడితో శ్రీసత్య ఎంగేజ్మెంట్ బ్రేక్.. అసలు కారణమిదే!
బిగ్‌బాస్ కంటెస్టెంట్, నటి శ్రీ సత్య గురించి ఇప్పుడు బుల్లితెర ప్రేక్షకులు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈ సీజన్లో కంటెస్టెంట్‌గా అడుగు పెట్టిన ఆమె తనదైన తీరుతో రాణిస్తోంది. టాస్క్‌లో చురుగ్గా ఉండకపోయిన.. ముక్కుసూటి తనంతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. అయితే హౌజ్‌లో అందరితో కలవకపోవడం, తనకంటూ ఓ పరిధిని పెట్టుకున్న శ్రీసత్య దీని వెనక ఉన్న అసలు కారణమేంటో ఇటీవల సిసింద్రీ టాస్క్‌లో బయటపెట్టిన సంగతి తెలిసిందే. ఇలా వ్యవహరించడానికి కారణం తనకు ఎదురైన కొన్ని చేదు అనుభవాలని చెప్పింది. చదవండి: విషాదం.. స్టాండప్ కమెడియన్ రాజు శ్రీవాత్సవ మృతి తనకు బ్రేకప్ స్టోరీ ఉందని, ప్రేమించిన వ్యక్తి మోసం చేశాడంటూ ఆమె వాపోయింది. దీంతో తాను ఆత్మహత్యాయత్నం చేశానంటూ షాకింగ్ విషయం చెప్పింది. ఈ ఘటనతో మనోవేదనకు గురైన వాళ్ల అమ్మ ప్రస్తుతం ఆస్వస్థతకు గురైందని, తను ఇప్పుడు లేవలేని స్థితిలో ఉందటూ కన్నీరు పెట్టుకుంది. ఇదిలా ఉంటే శ్రీసత్య తనపై తప్పుడు ఆరోపణలు చేసిందని అంటున్నాడు ఆమె మాజీ ప్రియుడు పవన్ రెడ్డి. శ్రీసత్యను తాను మోసం చేయలేదని, అలాంటి ఉద్దేశమే ఉంటే తనతో నిశ్చితార్థం, పెళ్లి వరకు ఎందుకు వస్తానంటూ పవన్ రెడ్డి తన స్నేహితులతో చెప్పుకుని మండిపడ్డాడని సన్నిహితవర్గాల నుంచి సమాచారం. చదవండి: సాఫ్ట్వేర్ జాబ్ వదులుకుని వచ్చా: ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’ హీరోయిన్ అయితే బిగ్‌బాస్ వంటి పెద్ద షోలో శ్రీసత్య తనని బ్యాడ్ ప్రోజెక్ట్ చేయడం పవన్‌రెడ్డి అసహనం వ్యక్తం చేశాడని తెలుస్తోంది. మరోవైపు బిగ్‌బాస్ హౌజ్ అడుగుపెట్టడానికి ముందు ఓ యూట్యూబ్ చానల్‌తో ముచ్చటించిన శ్రీసత్య బ్రేకప్‌పై స్పందించింది. టీనేజ్‌లో ఉన్నపుడు పవన్ రెడ్డి అనే వ్యక్తిని ప్రేమించానని, అయితే ఆ రిలేషన్ ఇప్పుడు బ్రేక్ అయ్యిందని తెలిపింది. ‘ప్రేమించిన వ్యక్తితోనే నిశ్చితార్థం జరిగింది. అయితే మొదటి నుంచే మా కుటుంబాలకు పెళ్లి ఇష్టం లేదు. మా ప్రేమను వారు అంగీకరించలేదు. ఈ క్రమంలో రెండు కుటుంబాల మధ్య కొన్ని మనస్పర్థలు వచ్చాయి. అందుకే మా నిశ్చితార్థం రద్దయింది’ అని ఆమె పేర్కొంది. -
సుష్మితా సేన్ లైవ్ వీడియోలో మాజీ బాయ్‌ఫ్రెండ్.. లలిత్ ఎక్కడ?
Sushmita Sen Parties With Her Ex Boyfriend Rohman Shawl: గత కొద్ది రోజులుగా మాజీ విశ్వసుందరి సుష్మితా సేన్ వార్తల్లో ప్రధానంగా నిలుస్తూ వస్తోంది. సుష్మితా సేన్ తనతో డేటింగ్లో ఉందని వ్యాపారవేత్త, ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ జులై 14న సాయంత్రం సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే. లలిత్‌తో సుష్మితా డేటింగ్ చేయడాన్ని పలువురు విమర్శిస్తే, కొంతమంది ఆమెకు మద్దుతుగా నిలిచారు. ఇదిలా ఉంటే వారు డేటింగ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసినప్పటి నుంచి వీరిద్దరూ ఏం చేసిన హాట్ టాపిక్‌గా మారింది. అయితే తాజాగా లలిత్ మోది ఎక్కడా అంటూ సుష్మితా సేన్‌పై ప్రశ్నల వర్షం కురింపించారు నెటిజన్లు. సుష్మితా సేన్ తల్లి సుభ్రా సేన్ ఆగస్టు 8న పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ వీడియోను పోస్ట్ చేసింది సుష్మితా సేన్. ఈ వీడియోలో సుష్మితా సేన్ ఎక్స్ బాయ్‌ఫ్రెండ్ రోహ్మాన్ షా దర్శనమిచ్చాడు. ఇది చూసిన నెటిజన్లు 'లలిత్ ఎక్కడ?', 'ఎక్కడ మోది?' అంటూ ప్రశ్నించారు. ఈ వీడియోలో సుష్మితా కూతుళ్లతో మాట్లాడుతూ కనిపించాడు రోహ్మాన్ షా. అలాగే సుష్మితా సేన్ లైవ్‌లో కనిపించమని అందరిని కోరినప్పుడు రోహ్మాన్ మాత్రం దూరంగా ఉండటాన్ని గమనించవచ్చు. కాగా తనకంటే 15 ఏళ్లు చిన్నవాడైన మోడల్ రోహ్మన్ షాతో సుష్మితా సేన్ మూడేళ్లు డేటింగ్ చేసిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Nikhil Rao (@bg0260) View this post on Instagram A post shared by Lalit Modi (@lalitkmodi) -
లలిత్ మోదీతో డేటింగ్‌పై సుష్మితా మాజీ ప్రియుడి స్పందన
వ్యాపారవేత్త, ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ నటి సుష్మితా సేన్ల డేటింగ్ ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశమైంది. వారిద్దరు జంటగా మాల్దీవులు, లండన్ చూట్టేసిన ఫొటోలను షేర్ చేస్తూ తామిద్దరం ప్రేమలో ఉన్నామని ప్రకటించాడు లలీత్ మోదీ. సుష్మితా సైతం లలిత్ కుమార్‌తో డేటింగ్‌పై క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం తాను సంతోషంగా ఉన్నానని, అయితే ఇప్పటికి పెళ్లి, నిశ్చితార్థం జరగలేదు.. కానీ సంతోషంగా ఉన్నానని చెప్పింది. చదవండి: Aadhi Pinisetty: మొదట్లో నిక్కీకి నాకు గొడవలు, మనస్పర్థలు.. ఆ తర్వాత.. అంతేకాదు షరతులు లేని ప్రేమ తనను చుట్టుముట్టేసిందంటూ లలిత్‌తో డేటింగ్‌పై సోషల్ మీడియాలో స్పష్టం చేసింది. దీంతో వీరిద్దర రిలేషన్‌పై బి-టౌన్లో ఎక్కడ చూసిన చర్చ జరుగుతోంది. అలాగే ఆమె మాజీ ప్రియుడు, మోడల్ రోహ్మాన్ షాల్ సైతం సుష్మితా తాజా ప్రేమపై స్పందించాడు. బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్య్వూలో అతడు మాట్లాడుతూ.. వారి ప్రేమ పట్ల మనం సంతోషంగా ఉందామని పిలుపునిచ్చాడు. చదవండి: లలిత్ మోదీ కంటే ముందు 9 మందితో సుష్మితా డేటింగ్, వారెవరంటే! ‘ప్రేమ చాలా అందంగా ఉంటుంది. సుస్మితా ఎవరినైనా ఎంచుకుందంటే.. ఖచ్చితంగా అతడు చాలా విలువైనవాడు అయ్యింటాడు’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కాగా మూడేళ్ల పాటు రిలేషన్లో ఉన్న సుష్మితా సేన్, రోహ్మాన్ షాల్లు ఇటీవల బ్రేకప్ చెప్పికున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని సుష్మితా సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ.. ‘స్నేహితులుగా మా ప్రయాణం ప్రారంభమైంది. ఇకపైనా అలాగే ఉంటాం. రిలేషన్షిప్ ముగిసి చాలాకాలమైంది. ప్రేమ మాత్రం ఉంది’ అంటూ రాసుకొచ్చింది. -
మాజీ బాయ్‌ఫ్రెండ్‌తో రెస్టారెంట్‌కు వెళ్లిన హీరోయిన్
బాలీవుడ్ మాజీ లవ్ బర్డ్స్ సుష్మితా సేన్- రోహ్మన్షా బ్రేకప్ తర్వాత తొలిసారిగా కలుసుకున్నారు. ముంబైలోని ఓ రెస్టారెంట్‌కి వెళ్లొస్తూ ఈ జంట మీడియా కంట పడింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. ఇక సుష్మితా సేన్ కనపడగానే సెల్ఫీల కోసం అభిమానులు ఒక్కసారిగా ఎగబడ్డారు. దీంతో అక్కడే ఉన్న మాజీ ప్రియుడు రోహ్మన్ వారిన అడ్డుకొని సుష్మితకు బాడీగార్డ్‌లా నిలిచాడు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) చాలా జాగ్రత్తగా ఆమెను కారు ఎక్కించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో వీరిద్దరూ మళ్లీ కలిసిపోయారా అని నెటిజన్లు సందేహం వ్యక్తం చేస్తున్నారు. వీళ్లు ఎప్పుడూ ఇలాగే కలిసి ఉండాలంటూ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా సుష్మిత తనకంటే 15 సంవత్సరాలు చిన్నవాడైన రోహ్మన్తో మూడేళ్లపాటు డేటింగ్ చేసింది. అయితే ఏమైందో తెలియదు కానీ తమ బంధం ముగిసిందంటూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. -
Disha Patani టార్గెట్‌గా సెటైర్లు.. వెంటనే ఫొటోలు డెలీట్!
ముంబై: దేశంలోని అన్ని భాషల అగ్ర హీరోలను టార్గెట్ చేస్తూ.. అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తుంటాడు సినీ నటుడు, విమర్శకుడు కమాల్ ఖాన్ అలియాస్ కేఆర్కే. రాధే సినిమా, హీరో సల్మాన్ ఖాన్‌పై అనుచిత కామెంట్లు చేసి కోర్టు నోటీసుల దాకా పరిస్థితి తెచ్చుకున్నాడు. అయితే ఇంత జరుగుతున్నా తగ్గేది లేదంటున్నాడు కేఆర్కే. తాజాగా రాధే హీరోయిన్ దిశాపటానీని టార్గెట్ చేసి వెటకారపు కామెంట్లు చేశాడు. నటి దిశా పటానీ ఒకప్పుడు ఆర్టిస్ట్ పార్థ్ సమథాన్‌తో సన్నిహితంగా ఉండేది. దీంతో వాళ్లిద్దరూ డేటింగ్ చేసినట్లు పుకార్లు నడిచాయి. అయితే మీడియాకు చిక్కని వాళ్ల క్లోజ్ ఫొటోలను కొన్నింటిని కేఆర్కే సంపాదించాడు. వాటిని తన ట్విట్టర్లో పోస్ట్ చేసి ‘దిశ బ్రదర్’ అంటూ వెటకారపు కామెంట్స్ చేశాడు. అయితే వెంటనే ఆ ఫొటోలను డిలీట్ చేశాడు కమాల్. కొందరు నాకీ ఫొటోలు పంపారు. ఆమె దిశకి బ్రదర్ అని చెప్పారు. నాకీ ఫొటోలు నచ్చి పోస్ట్ చేశా. కొందరు కుక్కల్లా మొరుగుతుంటారు. ఆమె అతనికి బ్రదరో కాదో తెలియదు. అందుకే ఆ ఫొటోలు డిలీట్ చేశా. అని మరో పోస్ట్ పెట్టాడు కేఆర్కే. Someone did send me some photos on Twitter only and he said that he is #DishaPatani brother with her. I liked photos, so I posted with good caption. But people were barking like DOGS. I deleted photos because I don’t know that boy and I am not sure if he is really her brother. — KRK (@kamaalrkhan) June 2, 2021 పరోక్షంగా సల్లూభాయ్‌పై.. ఇక పనిలో పనిగా సల్మాన్ ఖాన్‌పై పరోక్ష వ్యాఖ్యలతో కేఆర్కే విరుచుకుపడ్డాడు. నువ్వేం బాలీవుడ్ గుండా భాయ్వి. నీకు ఒక్క బాలీవుడ్ యాక్టర్ కూడా సపోర్ట్ రావట్లేదంటూ సల్మాన్‌కే కౌంటర్ ఇచ్చేలా రెండు రూపాయల ఆర్టిస్ట్ వంటూ ఒక ట్వీట్ చేశాడు కేఆర్కే. ఇక షారూఖ్‌పై తాను అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి. షారూఖ్ తనకు సోదరుడు లాంటి వాడని, అతన్ని ఏనాడూ అలాంటి కామెంట్లు చేయబోనని కేఆర్కే మరో ట్వీట్ చేశాడు. చదవండి: కారులో షికారు.. పోలీసుల ఎంట్రీ Aur Tu Ek Baat Bata Yaar, Tu Kaisa Bollywood Ka Maalik Gunda Bhai Hai, Ki Ek Bollywood Wala Teri Support Main Nahi Aaya! Tujhe Inn Chirkut #BiggBoss Ke Nallon Ko Apne Support Main Laana Pada! Hahaha! Kaya Izzat Hai Teri Bollywood Main Yar? You are real #2RsPerson of Bollywood. — KRK (@kamaalrkhan) June 1, 2021 -
పెళ్లిలో భర్త పర్మిషన్తో లవర్ని..
జకార్తా: ప్రేమించిన వారంతా పెళ్లి చేసుకోవాలని లేదు. వేర్వేరు కారణాల వల్ల ప్రేమికులు విడిపోవడం.. వేరే వ్యక్తులతో వివాహం కావడం సాధారణంగా జరుగుతుంది. ఇక ఇలాంటి పెళ్లికి మాజీ ప్రియుడు, గర్ల్ ఫ్రెండ్ వస్తే.. ఆ పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇక వారి ఎదుటే మరో వ్యక్తిని జీవిత భాగస్వామిగా అంగీకరించడం ఎంత ఇబ్బందిగా ఉంటుందో మాటల్లో వర్ణించలేం. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే ఓ యువతికి ప్రేమించిన వ్యక్తితో కాకుండా మరోకరితో వివాహం జరిగింది. మాజీ ప్రియుడు ఆ పెళ్లికి హాజరయ్యాడు. దాంతో యువతి భర్త అనుమతితో అతడిని హగ్ చేసుకుంది. ఇండోనేషియాలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. వివరాలు.. ఈ వీడియోలో ఓ యువతికి ప్రేమించి వ్యక్తితో కాకుండా మరొకరితో వివాహం అవుతుంది. ఇక ఈ వేడుకకి ఆమె మాజీ బాయ్‌ఫ్రెండ్ హాజరవుతాడు. అతడు వేదిక మీదకు ఎక్కి నూతన దంపతులకు శుభాకాంక్షలు చెప్పాలని భావిస్తాడు. తన మాజీ గర్ల్ ఫ్రెండ్‌కి షేక్ హ్యాండ్ ఇవ్వాలనకుంటాడు. కానీ ఆమె అతడికి చేయి ఇవ్వకుండా.. భర్త వైపు చూసి.. ఒక్కసారి నేను తనను హగ్ చేసుకోవచ్చా అని అడుగుతుంది. (చదవండి: దట్టమైన సుడిగాలిలో క్రికెట్) ఊహించని ఈ సంఘటనకి వరుడు తొలుత షాక్ అయినా.. ఒప్పుకుంటాడు. దాంతో వధువు తన మాజీ ప్రియుడిని హత్తుకుంటుంది. ఆ తర్వతా సదరు వ్యక్తి వరుడికి షేక్ హ్యాండ్ ఇచ్చి.. హగ్ చేసుకుని అభినందనలు తెలపుతాడు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. ఇక నెటిజనలు వధువును విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ‘‘నీ భర్త ఎంత మంచి వాడైనా.. మరీ ఇలా అతడి ముందే.. తన అనుమతితోనే హగ్ చేసుకోవడం దారుణం’’.. ‘‘నీవ్వు అతడి భార్యగా తగవు’’.. ‘‘బ్రో నీ కళ్లు నిజం చేప్తున్నాయి... నీ భార్య ప్రవర్తన నిన్ను బాధపెట్టింది’’.. ‘‘భర్త ముందే మాజీ ప్రియుడ్ని హగ్ చేసుకున్నావ్.. నీకు అతడంటే ఏ మాత్రం గౌరవం లేదు’’ అంటూ విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. -
మాజీ ప్రియుడిపై అమలాపాల్ కేసు
చెన్నై : తన మాజీ బాయ్‌ప్రెండ్‌గా ప్రచారంలో ఉన్న బాలీవుడ్ సింగర్ భువ్‌నిందర్ సింగ్‌పై నటి అమలా పాల్ ఫిర్యాదు చేశారు. ప్రొఫెషనల్ షూట్ కోసం తీసిన ఫోటోలను భువ్‌నిందర్ తప్పు అర్థం వచ్చేలా పోస్టు చేసి తన పరువుకు నష్టం కలిగించాడని చెన్నై హైకోర్టును ఆశ్రయించారు. ఈ ఏడాది మార్చిలో బాలీవుడ్ సింగర్ భువ్‌నిందర్ సింగ్‌తో పెళ్లి దుస్తుల్లో ఉన్న అమలా పాల్ ఫోటోలను అతను సోషల్ మీడియాలో పోస్టు చేసిన విషయం తెలిసిందే. ఇవి అప్పట్లో నెట్టింట వైరల్‌గా మారాయి. కాసేపటికే ఆ ఫోటోలు డిలీట్ అయ్యాయి. దీనిపై స్పందించిన నటి అవి పెళ్లికి సంబంధించిన ఫోటోలు కావని స్పష్టం చేశారు. చదవండి:కట్ చెప్పలేదు.. కట్టేసుకున్నారు..! అక్కడితో ఈ టాపిక్ ముగియగా.. తాజాగా ఈ ఫోటోలపై అమాలాపాల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. వేరే కారణం కోసం తీసిన ఫోటోలను భువ్‌నిందర్ తన అనుమతి లేకుండా ఉపయోగించాడని అమలాపాల్ ఆరోపించారు. ఇందుకు అతడిపై పరువు నష్టం దావా వేశారు. అమలాపాల్ ఆరోపణలు విన్న న్యాయమూర్తి.. భువ్నిందర్పై కేసు నమోదు చేసేందుకు అనుమతి ఇచ్చారు. కాగా భువ్‌నిందర్ సింగ్, అమలాపాల్ రహస్యంగా పెళ్లి చేసుకుని విడిపోయారని బాలీవుడ్లో ప్రచారం జరుగుతోంది. ఇద్దరూ విడిపోయిన తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో భువ్‌నిందర్ ను ఆమె అన్‌ఫాలో చేసిందని టాక్. చదవండి: రెండో పెళ్లి చేసుకోలేదు.. అవి ఫోటో షూట్ అంతే ఇదిలా ఉండగా ఇప్పటికే తమిళ తర్శకుడు ఏఎల్ విజయ్ను 2014లో ప్రేమించి పెళ్లాడిన అమలా పాల్ కొంత కాలానికే అతనితో విడిపోయారు. ఇద్దరి మధ్య తలెత్తిన మనస్పర్థలతో 2017 విడాకులు తీసుకున్నారు. అనంతరం ఇటీవల వేరొకరితో రిలేషన్షిప్లో ఉన్నట్లు వెల్లడించారు. తనను బాగా అర్ధం చేసుకున్న వ్యక్తి తన జీవితంలోకి వచ్చాడని చెప్పినా.. తన పేరు మాత్రం వెల్లడించలేదు. ఇక అమలాపాల్ నటించిన తమిళ చిత్ర అధో ఆంధ పరవై పోలా కరోనా కారణంగా విడుదల వాయిదా పడింది. చదవండి: నన్ను నేను తెలుసు కుంటున్నాను -
బెదిరించిన మాజీ ప్రియున్ని నమ్మించి..
సాక్షి, న్యూఢిల్లీ : తన నగ్న ఫొటోలు ఇంటర్నెట్లో పెడతానని బెదిరింపులకు దిగిన మాజీ ప్రియుడిని ఓ యువతి కిరాతకంగా హతమార్చింది. కూల్‌డ్రింక్‌లో నిద్రమాత్రలు కలిపి ప్రాణాలు తీసింది. అనంతరం మరో యువకుడి సాయంతో మృతదేహాన్ని యమునా నదిలో విసిరేసింది. ఈ ఘటనలో యువతికి సహాయం చేసింది ఆమెను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి కావడం గమనార్హం. ఉత్తరప్రదేశ్‌లోని మథురలో ఈ ఘటన మూడు వారాల క్రితం జరిగింది. వివరాలు.. సుశీల్ కుమార్ (23), డాలీ చౌదరీ (20) కొంతకాలం కలిసి ఉండి విడిపోయారు. అనంతరం తనకు నొయిడాలో ఉద్యోగం ఇప్పించిన మోహిత్ మావితో డాలీ స్నేహం చేసింది. ఈ విషయం తెలుసుకున్న సుశీల్ డాలీపై బెదిరింపులకు దిగాడు. మళ్లీ తనతో కలిసి ఉండాలనీ, లేదంటే తనతో సన్నిహితంగా ఉన్నప్పుడు దిగిన ప్రయివేటు ఫొటోలను ఇంటర్నెట్లో పెట్టి పరువు తీస్తానని బ్లాక్మెయిల్ చేశాడు. మాజీ ప్రియుడి వ్యవహారంతో ఆందోళనకు గురైన డాలీ అతన్ని అంతమొందించాలని భావించింది. తను పెళ్లిచేసుకోబోతున్న మనీష్ చౌదరీతో పథకం రచించింది. ఓ హోటల్లో ఆగస్టు 11న డాలీ సుశీల్ కలుసుకున్నారు. అక్కడ ఎలాంటి అనుమానం రాకుండా వ్యవహరించిన డాలీ సుశీల్‌ను నమ్మించింది. నిద్రమాత్రలు కలిపిన కూల్‌డ్రింక్‌ని అతడి చేత తాగించింది. మనీష్ ప్రాణాలు విడిచిన అనంతరం మృతదేహాన్ని కాబోయే భర్త మనీష్‌తో కలిసి యమునా నదిలో పడేసింది. బయటపడిందిలా..! తన కొడుకు కనిపించడం లేదని సుశీల్ తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. సుశీల్ తన ప్రేయసి చేతిలో హత్యకు గురయ్యాడని కనుగొన్నారు. కాగా, నిందితులు డాలీ, మనీష్‌లను అరెస్టు చేశామని మథుర డీసీపీ మనుదీప్‌సింగ్ రంధ్వా తెలిపారు. మరిన్ని వార్తలకు క్లిక్ చేయండి..! -
మాజీ ప్రియుడిని ముక్కలుముక్కలు చేయాలని..
దేశీయ బాంబులతో మహిళ పథకం మాజీ ప్రియుడిపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఓ మహిళ పక్కా ప్లాన్ వేసింది. దేశీయ బాంబులతో అతన్ని ముక్కలుముక్కలుగా పేల్చేసి పగ తీర్చుకోవాలనుకుంది. ఇందుకు మరో మాజీ ప్రియుడి సహకారం తీసుకుంది. అయితే అంతకుముందే ఓ 65 ఏళ్ల వృద్ధుడిని కిరాతకంగా హతమార్చిన వ్యవహారంలో పోలీసులకు ఆమె దొరికిపోవడంతో వారి బండారం బయటపడింది. ఆ కిలాడీ లేడి, ఆమె మాజీ ప్రియుడిని అరెస్టు చేసిన పోలీసులు.. వారి పథకం గురించి తెలుసుకొని నివ్వెరపోయారు. వారు తమ స్నేహితురాలి ఇంట్లో లగేజ్ పేరిట దాచిపెట్టిన మూడు దేశీయ బాంబులను స్వాధీనం చేసుకొని.. దాదాపు నాలుగు గంటలు కష్టపడి వాటిని నిర్వీర్యం చేశారు. ఈ ఘటన హర్యానాలోని పల్వాల్ జిల్లాలో జరిగింది. ఆర్తి (35), రాకేశ్ 2010లో కలిశారు. అప్పటికే పెళ్లయి, ముగ్గురు పిల్లలు ఉన్న రాకేశ్ ఆర్తి మాయలో పడి.. భార్యా పిల్లలను వదిలి వచ్చేశాడు. ఆమెతో కలిసి జీవిస్తున్నాడు. ఆరేళ్ల అనంతరం దూరపు బంధువైన బాబూలాల్ సాయంతో తిరిగి భార్య పిల్లలకు రాకేశ్ చేరువయ్యాడు. ఆర్తిని వదిలేసి తిరిగి తనవారి వద్దకు వెళ్లేందుకు నిశ్చయించుకున్నాడు. దీంతో రగిలిపోయిన ఆర్తి.. ఇందుకు రాకేశ్ బంధువు బాబూలాలే (65) కారణమని భావించి అతని గొంతు కోసి హతమార్చింది. ఆ తర్వాత రాకేశ్‌ను కూడా అంతం చేయాలని పథకం రచించింది. ఇందుకు మరో మాజీ ప్రియుడు ప్రదీప్ అలియాస్ దరోగా సాయం తీసుకుంది. ఈ ఇద్దరు కలిసి టపాసుల పౌడర్, గాజుముక్కలు, రాళ్లు కలిపి.. దేశీయ ముడి బాంబులను తయారుచేశారు. రాకేశ్‌ను బాంబులతో పేల్చేసేందుకు ఆర్తి అదను కోసం చూస్తుండగా.. బాబూలాల్ హత్యకేసుపై దర్యాప్తు చేస్తున్న పోలీసులకు ఆమె అడ్డంగా దొరికిపోయింది. ఆమెను, ఆమె ప్రియుడిని పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో అసలు రహస్యాలు వెలుగులోకి వచ్చాయి. -
ఆస్పత్రిలో కత్రినా.. అసలు కారణం అదేనట!
సెలబ్రిటీలు ఏం చేసినా హాట్ టాపిక్ అయిపోతుంది. ఒంట్లో కాస్తంత నలతగా ఉండి ఆస్పత్రికి వెళితే దాని గురించి చిలవలు పలవలుగా మాట్లాడేసుకుంటారు. ఇప్పుడు కత్రినా కైఫ్ గురించి బాలీవుడ్లో అలానే మాట్లాడుకుంటున్నారు. విషయం ఏంటంటే.. ఈ బ్యూటీ ముంబయ్‌లోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చేరారట. దాంతో కత్రినాకు ఏమైంది? ఎందుకు ఆస్పత్రికి వెళ్లారు? అని ఔత్సాహికరాయుళ్లు కూపీలాగే పని మీద పడ్డారు. అసలు కత్రినా ఎందుకు ఆస్పత్రికి వెళ్లారనే విషయానికి వస్తే.. రణ్‌బీర్ కపూర్, కత్రినా జంటగా అనురాగ్ బసు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘జగ్గా జాసూస్’. ఈ చిత్రం షూటింగ్ కోసం చిత్ర బృందం మొరాకో వెళ్లింది. షూటింగ్లో పాల్గొన్న కత్రినాకు అక్కడి వాతావరణం సరిపడలేదు. మధ్యలో షూటింగ్ ఆపితే తన కారణంగా నిర్మాతకు నష్టం వస్తుందని భావించిన కత్రినా ఎలాగోలా షెడ్యూల్ ముగించారు. ముంబయ్ రాగానే ఖర్ ప్రాంతంలోని ఓ ఆస్పత్రికి వెళ్లారట. తాను ఆస్పత్రికి వెళ్లిన విషయం ఎవరికీ తెలియకూడదనుకున్నారామె. ఆస్పత్రికి వెళితే తప్పేంటి? దాన్ని సీక్రెట్‌గా ఉంచాల్సిన అవసరం ఏంటి? అన్నది టాపిక్ అయ్యింది. షూటింగ్లో కత్రినా ఉన్నది తన ఎక్స్ బాయ్‌ఫ్రెండ్‌తోనే కాబట్టి, షూటింగ్ గ్యాప్‌లో చెట్టాపట్టాలు వేసుకుని తిరిగి ఉంటారని, దాంతో అనారోగ్యానికి గురై ఉంటుందనే దిశగా కథ అల్లేశారు. ఆస్పత్రికి వెళ్లడానికి అసలైన కారణం ఏదో ఉండే ఉంటుందని ఊహాగానాలు చేస్తున్నారు. వాటికి ఫుల్స్టాప్ పెట్టించాలనే ఉద్దేశంతో ‘‘స్వల్ప అస్వస్థత కారణంగానే కత్రినా ఆస్పత్రికి వెళ్లారు. వేరే ఏమీ లేదు’’ అని ఆమె మేనేజర్లు క్లారిటీ ఇచ్చారు. -
ప్రియాంక ఒప్పుకుంటుందా!
తమ కథను సినిమాగా చూసుకునే అదృష్టం ఇప్పటివరకూ మన దేశంలో చాలా తక్కువమందికే దక్కింది. అయితే... ఆంతరంగికమైన విషయాలకు కూడా తెరరూపాన్ని ఇస్తే మాత్రం అది చాలా ఇబ్బందికరం. త్వరలో ప్రియాంకా చోప్రా ఆ ఇబ్బందిని ఎదుర్కోబోతున్నారు. ఆమె మోడల్‌గా ఉన్న రోజుల్లో జరిగిన కొన్ని ఆసక్తికరమైన సంఘటనల ఆధారంగా ఓ చిత్రం తెరపైకి రానుంది. ఈ సినిమాకు నిర్మాత ఎవరో కాదు.. ప్రియాంక మాజీ ప్రియుడు అసీమ్ మర్చంట్. నిర్మాతగా తన తొలి సినిమా ఇది. మోడలింగ్ చేసే రోజుల్లో అసీమ్‌ని ప్రియాంక ప్రేమించారు. అయితే... మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకున్న రెండేళ్ల తర్వాత మర్చంట్ నుంచి విడిపోయారామె. అప్పట్నుంచి వీరిద్దరూ పెద్దగా టచ్‌లో లేరట. ప్రస్తుతం అసీమ్ నటుడుగా కొనసాగుతున్నారు. సల్మాన్ ‘వాంటెడ్’లో కీలక భూమికను కూడా పోషించారు. ఇప్పుడు తానే... తన మాజీ ప్రియురాలైన ప్రియాంక మోడలింగ్ రోజుల్ని ఆధారంగా తీసుకొని ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. అంతేకాదు... 2008లో ప్రియాంకకు తన మేనేజర్ ప్రకాశ్ జాజుతో ఆర్థిక పరమైన గొడవలొచ్చాయి. ఆ ఇష్యూని కూడా ఈ సినిమాలో చూపించబోతున్నారట అసీమ్. ఇప్పుడు బాలీవుడ్లో ఎక్కడ చూసినా ఇదే చర్చ. అయితే... ప్రియాంక నుంచి మాత్రం ఈ విషయంపై ఎలాంటి స్పందనా రాలేదు. తన విజయాలకు తెరరూపాన్నిస్తే... అది నిజంగా ప్రియాంక ఆనందించదగ్గ విషయమే. కొంపదీసి తన ఆంతరంగికమైన విషయాలను కూడా అందులో చూపిస్తే అది కచ్చితంగా ఆమెకు ఇబ్బందే. మరి తన కథకు తెరరూపాన్ని ఇవ్వడానికి ప్రియాంక అంగీకరిస్తారో లేక, అభ్యంతరం వెలిబుచ్చుతారో చూడాలి.