ఆస్పత్రిలో కత్రినా.. అసలు కారణం అదేనట! | Katrina Kaif visits hospital after returning from Moracco shoot | Sakshi
Sakshi News home page

ఆస్పత్రిలో కత్రినా.. అసలు కారణం అదేనట!

Published Thu, Jun 2 2016 11:09 PM | Last Updated on Mon, Sep 4 2017 1:30 AM

ఆస్పత్రిలో కత్రినా.. అసలు కారణం అదేనట!

ఆస్పత్రిలో కత్రినా.. అసలు కారణం అదేనట!

సెలబ్రిటీలు ఏం చేసినా హాట్ టాపిక్ అయిపోతుంది. ఒంట్లో కాస్తంత నలతగా ఉండి ఆస్పత్రికి వెళితే దాని గురించి చిలవలు పలవలుగా మాట్లాడేసుకుంటారు. ఇప్పుడు కత్రినా కైఫ్ గురించి బాలీవుడ్‌లో అలానే మాట్లాడుకుంటున్నారు. విషయం ఏంటంటే.. ఈ బ్యూటీ ముంబయ్‌లోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చేరారట. దాంతో కత్రినాకు ఏమైంది? ఎందుకు ఆస్పత్రికి వెళ్లారు? అని ఔత్సాహికరాయుళ్లు కూపీలాగే పని మీద పడ్డారు. అసలు కత్రినా ఎందుకు ఆస్పత్రికి వెళ్లారనే విషయానికి వస్తే..

రణ్‌బీర్ కపూర్, కత్రినా జంటగా అనురాగ్ బసు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘జగ్గా జాసూస్’. ఈ చిత్రం షూటింగ్ కోసం చిత్ర బృందం మొరాకో వెళ్లింది. షూటింగ్‌లో పాల్గొన్న కత్రినాకు అక్కడి వాతావరణం సరిపడలేదు. మధ్యలో షూటింగ్ ఆపితే తన కారణంగా నిర్మాతకు నష్టం వస్తుందని భావించిన కత్రినా ఎలాగోలా షెడ్యూల్ ముగించారు. ముంబయ్ రాగానే ఖర్ ప్రాంతంలోని ఓ ఆస్పత్రికి వెళ్లారట. తాను ఆస్పత్రికి వెళ్లిన విషయం ఎవరికీ తెలియకూడదనుకున్నారామె. ఆస్పత్రికి వెళితే తప్పేంటి? దాన్ని సీక్రెట్‌గా ఉంచాల్సిన అవసరం ఏంటి? అన్నది టాపిక్ అయ్యింది.

షూటింగ్‌లో కత్రినా ఉన్నది తన ఎక్స్ బాయ్‌ఫ్రెండ్‌తోనే కాబట్టి, షూటింగ్ గ్యాప్‌లో చెట్టాపట్టాలు వేసుకుని తిరిగి ఉంటారని, దాంతో అనారోగ్యానికి గురై ఉంటుందనే దిశగా కథ అల్లేశారు. ఆస్పత్రికి వెళ్లడానికి అసలైన కారణం ఏదో ఉండే ఉంటుందని ఊహాగానాలు చేస్తున్నారు. వాటికి ఫుల్‌స్టాప్ పెట్టించాలనే ఉద్దేశంతో ‘‘స్వల్ప అస్వస్థత కారణంగానే కత్రినా ఆస్పత్రికి వెళ్లారు. వేరే ఏమీ లేదు’’ అని ఆమె మేనేజర్లు క్లారిటీ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement