![విశాఖకు గాయం](/styles/webp/s3/article_images/2017/09/2/51396724365_625x300.jpg.webp?itok=nq4H5lPQ)
విశాఖకు గాయం
నటి విశాఖ సింగ్‌కు షూటింగ్‌లో ప్రమాదవశాత్తు పక్కటెముక విరిగింది. దీంతో ఆమెను చిత్ర యూనిట్ వెంటనే సమీపంలోని ఆస్పత్రిలో చేర్చారు. చిత్ర షూటింగ్ రద్దు అయ్యింది. తమిళంలో కన్నా లడ్డు తిన్న ఆశయా చిత్రంలో హీరోయిన్‌గా నటించిన విశాఖ సింగ్ ప్రస్తుతం తెలుగులో రౌడీ ఫెలో అనే చిత్రంలో నారారోహిత్‌కు జంటగా నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ఆంధ్రప్రదేశ్‌లోని భీమవరం ప్రాంతంలో జరుగుతోంది. విశాఖసింగ్ రోడ్డుపై వేగంగా పరిగెత్తే సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండగా సహాయదర్శకుడు చేతితో నెట్టడంతో ఆమె కిందపడిపోయారు. దీంతో ఆమె పక్కటెముక విరిగింది. దీనిపై నటి విశాఖ సింగ్ మాట్లాడుతూ రన్నింగ్ సన్నివేశంలో రిహార్సల్లో బాగానే చేశానన్నారు.
టేక్‌లో దర్శకుడు యాక్షన్ చెప్పగానే పరిగెత్తడం ప్రారంభించానన్నారు. ఇంకా వేగంగా పరిగెత్తాలంటూ సహాయ దర్శకుడు తనను నెట్టారన్నారు. దీంతో బ్యాలెన్స్ తప్పి తాను కింద పడిపోయినట్లు తెలిపారు. బాధతో గిలగిల్లాడుతుంటే చిత్ర యూనిట్ వెంటనే ఆస్పత్రిలో చేర్చారని చెప్పారు. అయితే పరీక్ష చేసిన వైద్యులు తన పక్క టెముక విరిగిందని చెప్పగానే కంట తడిపెట్టేశానన్నారు. షూటింగ్ చివరి రోజని, పూర్తి అవ్వగానే లండన్ వెళ్లిపోయేదాన్నని ఇప్పుడు వైద్యులు రెండు వారాల పాటు బెడ్ రెస్ట్ అవసరం అంటున్నారని పూర్తిగా కోలుకోవడానికి నాలుగు వారాలు పడుతుందని చెప్పారని విశాఖ తెలిపారు.