Vishakha Singh: ఆస్పత్రిలో హీరోయిన్‌, బెడ్‌పై లేవలేని స్థితిలో.. | Actress Vishakha Singh Hospitalised, Shares Photos - Sakshi
Sakshi News home page

ఆస్పత్రిలో హీరోయిన్‌, భయంకరమైన సంఘటనలు వేధిస్తున్నాయంటూ..

Published Wed, Apr 12 2023 9:24 PM | Last Updated on Thu, Apr 13 2023 8:41 AM

Actress Vishakha Singh Hospitalised Photo Goes Viral - Sakshi

విశాఖ సింగ్‌.. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవచ్చు కానీ, కోలీవుడ్‌లో మాత్రం ఈ పేరు సుపరిచితమే. ఈ అమ్మడు ‘జ్ఞాపకం’ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన ఆ చిత్రం సక్సెస్‌ సాధించకపోవడంతో ట్రాక్‌ మార్చి కోలీవుడ్‌పై ఫోకస్‌ పెట్టింది. ఆటు టాలీవుడ్‌, ఇటు కోలీవుడ్‌లో తాను నటించిన తొలి చిత్రాలు బోల్తా పడ్డా.. చివరికి తమిళ చిత్రం కన్న లడ్డు తిన్న ఆశయ్యా హిట్‌గా నిలవడంతో విశాఖ సింగ్ గుర్తింపు సంపాదించుకుంది.

ఆ తర్వాత వరుస ఆఫర్లతో తెలుగు, కన్నడ, హిందీ, మలయాళం సినిమాల్లో కూడా నటించింది. అయితే ఈ సినిమాలు కూడా ఆమెకు నిరాశనే మిగిల్చాయి. దీంతో అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. అయితే సినిమాలకు దూరంగా ఉన్నా.. సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది ఈ భామ. తనకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ వస్తోంది. తాజాగా, విశాఖ సింగ్‌ తను ఆసుపత్రిలో బెడ్‌ మీద ఉన్న ఫొటోను ఇన్‌స్టాలో షేర్‌ చేసింది. ప్రస్తుతం అది కాస్త వైరల్‌గా మారింది.

ఆ ఫోటో కింద ఈ విధంగా రాసుకొచ్చారు.. ‘‘నేను అనారోగ్యం నుంచి కోలుకుంటున్నాను. నా జీవితంలో నేను ఎదుర్కొన్న కొన్ని ప్రమాదాలు, భయంకరమైన సంఘటనలు,, వీటితో పాటు చలికాలంలో వస్తున్న ఆరోగ్య సమస్యలు తరచుగా వేధిస్తున్నాయి. అయినా వీటిని పక్కన పెడుతూ సంతోషకరమైన సమ్మర్‌ కోసం సిద్దం అవుతున్నా. ఎందుకో గానీ ఏప్రిల్‌ నెల ప్రతీసారి నాకు ఓ కొత్త సంవత్సరంలా అనిపిస్తుంది. బహుశా అది కొత్త ఆర్థిక సంవత్సరం కారణంగానో లేక నేను పుట్టిన సంవత్సరం అవటం వల్ల కూడా కావచ్చు. ఎ‍న్ని అవరోధాలు వచ్చినా దృఢసంకల్పంతో ముందుకు సాగుతున్నాను’’ అని తెలిపింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement