48 ఏళ్ల వయసులో పెళ్లిపై స్పందించిన నగ్మా.. త్వరలోనే.. | Actress Nagma Open Comments About Her Wedding At Age Of 48, Know About Her Love Affairs - Sakshi
Sakshi News home page

Nagma On Her Marriage: పెళ్లైన హీరోలతో ప్రేమాయణం.. 48 ఏళ్ల వయసులోనూ సింగిల్‌గానే..

Published Wed, Aug 30 2023 10:26 AM | Last Updated on Wed, Aug 30 2023 11:15 AM

Nagma Open up on Wedding At Age of 48 - Sakshi

పెళ్లి చేసుకోకూడదు అన్న ఆలోచన నాకు లేదు. ఇంకా చెప్పాలంటే నాకంటూ ఓ తోడు ఉండాలి, పిల్లలుండాలి. పెళ్లి ద్వారా ఓ కుటుంబాన్ని ఏర్పరుచుకోవాలని ఉండేది. ఒకవేళ త్వరలోనే నా

'పెద్దింటి అల్లుడు' సినిమాతో హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది నగ్మా. ఆమె నటనకు, అందానికి యూత్‌ దాసోహమైపోయింది. దర్శకనిర్మాతలు తన ఇంటిముందు క్యూ కట్టారు. నచ్చిన కథలు సెలక్ట్‌ చేసుకుంటూ ఏడాదికి ఐదారు సినిమాలు చేసుకుంటూ పోయింది. తక్కువ కాలంలోనే స్టార్‌ హీరోయిన్‌ స్టేటస్‌ అందుకుంది. తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ, కన్నడ, హిందీ, భోజ్‌పురి, పంజాబీ, బెంగాలీ, మరాఠి భాషల్లోనూ హీరోయిన్‌గా రాణించింది. మొదట హీరోయిన్‌గా చేసిన నగ్మా తర్వాత తల్లి, అత్త పాత్రల్లోనూ మెరిసింది. ఈమె తెలుగు వెండితెరకు దూరమై దాదాపు 20 ఏళ్లవుతోంది. ఆ తర్వాత ఇతర భాషల్లో నటించినప్పటికీ 2008లో నటనకు గుడ్‌బై చెప్పేసి రాజకీయాల్లో ప్రవేశించింది.

ఇక స్టార్‌ హీరోయిన్‌గా ఉన్న సమయంలో ఎంతోమందితో ప్రేమాయణం సాగించిన నగ్మా ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా మిగిలిపోయింది. 48 ఏళ్ల వయసున్న నగ్మా తాజాగా తన పెళ్లి గురించి స్పందించింది. 'పెళ్లి చేసుకోకూడదు అన్న ఆలోచన నాకు లేదు. ఇంకా చెప్పాలంటే నాకంటూ ఓ తోడు ఉండాలి, పిల్లలుండాలని నా ఆశ. పెళ్లి ద్వారా ఓ కుటుంబాన్ని ఏర్పరుచుకోవాలని ఉండేది. కాలం కలిసొస్తే త్వరలోనే నా పెళ్లి జరుగుతుందేమో చూద్దాం. నిజంగా పెళ్లయితే మాత్రం చాలా హ్యాపీగా ఫీలవుతాను. సంతోషమనేది జీవితంలో కొంతకాలానికే పరిమితం కాదు కదా!' అని చెప్పుకొచ్చింది.

కాగా నగ్మా గతంలో పెళ్లైన నలుగురిని ప్రేమించిందని ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటారు. నటుడు శరత్‌ కుమార్‌, మనోజ్‌ తివారి, రవి కిషన్‌లతో పాటు క్రికెటర్‌ సౌరవ్‌ గంగూలీతోనూ లవ్‌లో పడిందని, కానీ పెళ్లిదాకా వెళ్లకముందే వీరితో బ్రేకప్‌ అయిందని ప్రచారం నడిచింది. అయితే రవి కిషన్‌.. నగ్మాతో తనది స్నేహం మాత్రమేనని ఇటీవలే క్లారిటీ ఇచ్చాడు.

చదవండి: దత్తత తీసుకున్న పిల్లల వల్లే సుస్మితా సేన్‌ కెరీర్‌ క్లోజ్‌ అయిందా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement