Nagma
-
స్టార్ హీరోయిన్లుగా ఎదిగారు.. అంతలోనే కనుమరుగైన స్టార్స్ వీళ్లే!
సినిమా అంటే రంగుల ప్రపంచం. ఈ రంగంలో ఒక్కసారి ఫేమ్ వచ్చిందంటే చాలు.. అవకాశాలు కూడా అలా వెతక్కుంటూ వస్తాయి. అయితే అదే క్రేజ్ కెరీర్ మొత్తం ఉంటుందనుకోవడం పొరపాటే. ముఖ్యంగా హీరోయిన్ల విషయానికొస్తే ఈ పరిస్థితి కాస్తా భిన్నంగా ఉంటుంది. ఒకసారి గుర్తింపు వచ్చినా.. దాన్ని కెరీర్ మొత్తం నిలబెట్టుకోవడం కష్టమే. అలా మొదట స్టార్ హీరోయిన్లుగా ఫేమ్ తెచ్చుకున్న కొందరు స్టార్స్ తర్వాత తెరపై పెద్దగా కనిపించలేదు. అలాంటి వారి గురించే ఇప్పుడు తెలుసుకుందాం. ఇంతకీ స్టార్ డమ్ నుంచి కనుమరుగైన నటీమణులెవరో మీరు చూసేయండి.అమ్మా, నాన్న ఓ తమిళ అమ్మాయి..తెలుగులో రవితేజ సరసన అమ్మా, నాన్న ఓ తమిళ అమ్మాయి చిత్రంలో మెప్పించిన కోలీవుడ్ భామ ఆసిన్. తెలుగుతో పాటు తమిళం, హిందీ సినిమాల్లో నటించింది. అంతేకాకుండా స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ఆమె తన కెరీర్ తమిళంలో పోక్కిరి, కావలన్, తెలుగులో లక్ష్మీ నరసింహ, రెడీ, ఘర్షణ, హిందీలో గజిని, హౌస్‌ఫుల్ 2 వంటి భారీ విజయాలు దక్కించుకుంది. అంతేకాకుండా ఆసిన్, ఫిల్మ్‌ఫేర్, సైమా లాంటి అనేక అవార్డులను గెలుచుకుంది. తన కెరీర్లో అత్యున్నత స్థాయిలో ఉన్నప్పుడు వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత తన 2015 నుంచి చిత్ర పరిశ్రమ నుండి పూర్తిగా కనుమరుగైంది.అజిత్ భార్య శాలిని..తొలి రోజుల్లో బేబీ శాలినిగా గుర్తింపు పొందిన శాలిని అజిత్ కుమార్. 1980లలో మలయాళం, తమిళ సినిమాల్లో నటించింది. ఎంటే మమట్టిక్కుట్టియమ్మక్కు, టీవీ సిరీస్ అమ్లూ వంటి చిత్రాలలో బాలనటిగా మెప్పించింది. అంతేకాకుండా పలు క్లాసిక్ చిత్రాలతో స్టార్ హీరోయిన్గా ఎదిగింది. కానీ 2000 ఏడాదిలో నటుడు అజిత్ కుమార్‌ను వివాహం చేసుకున్న తర్వాత వెండితెరపై కనిపించలేదు. 2002 తర్వాత నటనకు పూర్తిగా దూరమైంది.నగ్మాతెలుగులో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన నటి నగ్మా. 1990లో తమిళం, తెలుగు, హిందీ, భోజ్‌పురి సినిమాల్లో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. తెలుగులో ఘరనా మొగుడు, మేజర్ చంద్రకాంత్, అల్లరి అల్లుడు లాంటి హిట్ సినిమాల్లో కనిపించింది. తమిళంలో కాదలన్, బాషా, మెట్టుకుడి, తమిళంలో చతురంగం, చిత్రాలతో మరింత గుర్తింపు తెచ్చుకుంది. కానీ 2008లో తన సినీ కెరీర్లో దూసుకెళ్తున్న సమయంలోనే నగ్మా రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత నటనకు పూర్తిగా గుడ్ బై చెప్పేసింది.గోపికమలయాళంలో స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న నటి గోపిక. ముఖ్యంగా ఫోర్ ది పీపుల్ అనే మలయాళ చిత్రంతో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత తెలుగు, తమిళ చిత్రాల్లో కూడా గోపిక తనదైన ముద్ర వేసింది. రవితేజ నటించిన నా ఆటోగ్రాఫ్ మూవీలో అభిమానులను మెప్పించింది. అయితే 2008లో వివాహం తర్వాత గోపిక సినీ పరిశ్రమను పూర్తిగా విడిచిపెట్టేసింది.తెలుగులో స్టార్ హీరోయిన్..రంభ గురించి తెలుగువారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పట్లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. ఆమె అసలు పేరు విజయలక్ష్మి యీది కాగా.. సినిమాలతో వచ్చిన గుర్తింపు వల్ల రంభగా మార్చుకుంది. 1990ల్లో దక్షిణ భారత సినీ పరిశ్రమలో స్టార్‌గా ఎదిగింది. అరుణాచలం, ఉల్లతై అల్లిత, క్రానిక్ బ్యాచిలర్ వంటి చిత్రాల్లో గుర్తుండిపోయే పాత్రలు చేసింది. తమిళంతో పాటు తెలుగు, హిందీ చిత్రాలలో ప్రేక్షకులను అలరించింది. తెలుగులో భైరవ ద్వీపం, బంగారు కుటుంబం, హిట్లర్, గణేష్ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు కూడా ఉన్నాయి. చిత్ర పరిశ్రమలో విజయవంతంగా దూసుకెళ్తోన్న రంభ 2011లో నటనకు ఎండ్ కార్డ్ ఇచ్చేసింది. -
అతిలోక సుందరితో ముగ్గురు హీరోయిన్లు.. ఎవరో గుర్తుపట్టారా?
పై ఫోటోలో శ్రీదేవితోపాటు కలిసి కూర్చున్న ముగ్గురు అక్కాచెల్లెళ్లు సౌత్ ఇండస్ట్రీలో చాలా పాపులర్ హీరోయిన్లు. తెలుగులో స్టార్ హీరోల సరసన నటించారు. మెగాస్టార్ చిరంజీవితో ఈ ముగ్గురూ యాక్ట్ చేశారు. ఇంతకీ ఈ కథానాయికలెవరో గుర్తుపట్టారా?తెలుగులో ఆ చిత్రంతో ఎంట్రీఫోటోలో అతిలోక సుందరి శ్రీదేవి పక్కన కూర్చుని క్యూట్‌గా కనిపిస్తున్న ఈ ముగ్గురు నగ్మా, జ్యోతిక, రోషిణి. నగ్మా విషయానికి వస్తే సల్మాన్ ఖాన్ భాగి: ఎ రెబల్ ఫర్ లవ్ అనే సినిమాతో తన కెరీర్ మొదలైంది. పెద్దింటి అల్లుడు చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ఘరానా మొగుడు, మేజర్ చంద్రకాంత్, కొండపల్లి రాజా, అల్లరి అల్లుడు, ముగ్గురు మొనగాళ్లు, రిక్షావోడు, అల్లరి రాముడు.. ఇలా అనేక చిత్రాల్లో యాక్ట్ చేసింది.అక్కడ ఫుల్ బిజీజ్యోతిక.. డోలి సజా కే రఖ్ణా అనే హిందీ చిత్రంతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. తర్వాత బిజీ అయింది మాత్రం తమిళ ఇండస్ట్రీలోనే! ఠాగోర్, మాస్, చంద్రముఖి, షాక్ చిత్రాలతో తెలుగువారికీ దగ్గరైంది. హీరో సూర్యను పెళ్లి చేసుకుని సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఆమె సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ సక్సెస్‌ఫుల్‌గా రాణిస్తోంది.తెలుగులో ఫేమస్రోషిణి.. తన ఇద్దరు అక్కల్లా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా రాణించలేకపోయింది. శిష్య అనే తమిళ చిత్రంతో కథానాయికగా పరిచయమైన ఈ మూవీ మాస్టర్, పవిత్ర ప్రేమ, శుభలేఖలు సినిమాతో తెలుగులో ఫేమస్ అయింది. రెండేళ్లు మాత్రమే సినిమాల్లో యాక్టివ్‌గా ఉన్న ఆమె తర్వాత చిత్రపరిశ్రమకు గుడ్‌బై చెప్పింది.పేరెంట్స్..కాగా ఈ హీరోయిన్ల తల్లి సీమా 1969లో అరవింద్ మొరార్జీని పెళ్లాడింది. వీరికి పుట్టిన కూతురే నగ్మా. మనస్పర్థల వల్ల ఈ దంపతులు 1974లో విడాకులు తీసుకున్నారు. తర్వాతి ఏడాది నిర్మాత చందర్‌ను పెళ్లాడింది. వీరికి ఒక బాబుతో పాటు జ్యోతిక, రోషిణి సంతానం.చదవండి: ఇండస్ట్రీలో విషాదం.. నటుడిని కాల్చిచంపిన దుండగులు! -
ప్రభుదేవా హిట్ సినిమా 'ప్రేమికుడు' రీ-రిలీజ్
ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా సూపర్ హిట్ సినిమా ప్రేమికుడు రీ-రిలీజ్ కానుంది. మెగా ప్రొడ్యూసర్ కే. టి. కుంజుమోన్ నిర్మాతగా, సెన్సేషనల్ డైరెక్టర్ ఎస్. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ. ఆర్. రెహమాన్ మ్యూజిక్ అందించారు. అందాల నటి నగ్మ ఇందులో హీరోయిన్గా నటించారు. ప్రస్తుతం ఈ సినిమాను నిర్మాతలు రమణ, మురళీధర్ రిలీజ్ చేస్తున్నారు. ఎస్పీ బాలసుబ్రమణ్యం, వడివేలు, రఘువరన్, గిరీష్ కర్నాడ్ ముఖ్యపాత్రలో నటించారు. ఈ రీ- రిలీజ్ కి సంబంధించిన వేడుక తాజాగా చాలా ఘనంగా జరిగింది. ఈ వేడుకలో నిర్మాతలు మురళీధర్ రెడ్డి, రమణ, ప్రముఖ నిర్మాత లగడపాటి శ్రీనివాస్, శోభారాణి పాల్గొన్నారు.ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా సూపర్ హిట్ సినిమా ప్రేమికుడు రీ-రిలీజ్ కానుంది. మెగా ప్రొడ్యూసర్ కే. టి. కుంజుమోన్ నిర్మాతగా, సెన్సేషనల్ డైరెక్టర్ ఎస్. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ. ఆర్. రెహమాన్ మ్యూజిక్ అందించారు. అందాల నటి నగ్మ ఇందులో హీరోయిన్గా నటించారు. ప్రస్తుతం ఈ సినిమాను నిర్మాతలు రమణ, మురళీధర్ రిలీజ్ చేస్తున్నారు. ఎస్పీ బాలసుబ్రమణ్యం, వడివేలు, రఘువరన్, గిరీష్ కర్నాడ్ ముఖ్యపాత్రలో నటించారు. ఈ రీ- రిలీజ్ కి సంబంధించిన వేడుక తాజాగా చాలా ఘనంగా జరిగింది. ఈ వేడుకలో నిర్మాతలు మురళీధర్ రెడ్డి, రమణ, ప్రముఖ నిర్మాత లగడపాటి శ్రీనివాస్, శోభారాణి పాల్గొన్నారు.30 సంవత్సరాల క్రితం వచ్చిన ప్రేమికుడు సినిమా మళ్లీ మే 1న 300కు పైగా థియేటర్లలో ఘనంగా రీ- రిలీజ్ అవుతోంది. బుకింగ్స్ ఓపెన్ అయి ప్రజల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఎస్. శంకర్ దర్శకత్వంలో ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా, నగ్మా జంటగా 30 సంవత్సరాల క్రితం వచ్చి యువతను ఆకట్టుకున్న సినిమా. ఇప్పటికి కూడా ఆ సినిమాలోని పాటలు యువతనే కాకుండా అందరినీ ఆకట్టుకుంటూనే ఉన్నాయి.ఈ సినిమాలో ప్రభుదేవా తండ్రిగా ఎస్. పి. బాలసుబ్రమణ్యం గారు నటించడం సినిమాకే పెద్ద ప్లస్ అయింది. అందమైన ప్రేమ రాణి చెయ్యి తగిలితే పాటలో ప్రభుదేవాతో సమానంగా ఎస్. పి. బాలు గారు డాన్స్ చేయడం విశేషం. టేకిట్ ఈజీ పాలసీ, ఓ చెలియా నా ప్రియ సఖియా పాటలు ఇప్పటికీ ఎప్పటికీ నిలిచిపోయేలా సాంగ్స్ ఉన్నాయి. ఒక మంచి యూత్ ఫుల్ లవ్ స్టోరీ గా వచ్చిన ఈ సినిమా అప్పటి రోజుల్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. నిర్మాత మురళీధర్ రెడ్డి గారు మాట్లాడుతూ : ప్రేమికుడు సినిమాని 30 సంవత్సరాల తర్వాత మళ్లీ సీ ఎం ఆర్ సంస్థ పైన మే 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నాము. బుకింగ్స్ ఓపెన్ చేసిన వెంటనే ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. డిస్ట్రిబ్యూటర్లు కూడా మాకు ఎంత సపోర్ట్ చేస్తున్నారు వారికి మా ధన్యవాదాలు. అదేవిధంగా ఈ సినిమా రిలీజ్‌కు అంగీకరించి మాకు సహకరిస్తున్న మా మెగా ప్రొడ్యూసర్ కొంచెం మోహన్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము అని అన్నారు. -
స్టార్ హీరోయిన్ బ్లాక్ బస్టర్ మూవీ.. దాదాపు 30 ఏళ్ల తర్వాత!
ప్రభుదేవా, నగ్మా జంటగా నటించిన ప్రేమికుడు చిత్రం రీ రిలీజ్‌కు సిద్ధమైంది. ప్రస్తుతం ఈ సినిమా రిలీజ్‌కు నిర్మాతలుగా రమణ, మురళీధర్ వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ సినిమా రీ రిలీజ్‌కు సంబంధించి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథులుగా తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్నకుమార్, దర్శకులు ముప్పలనేని శివ, శివనాగు, శోభారాణి పాల్గొన్నారు. ఈ చిత్రంలో ఎస్పీ బాలసుబ్రమణ్యం, వడివేలు, రఘువరన్, గిరీష్ కర్నాడ్ ముఖ్యపాత్రల్లో నటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ముప్పలనేని శివ మాట్లాడుతూ.. '30 ఏళ్ల క్రితం వచ్చిన ప్రేమికుడు ఇప్పుడు రీ రిలీజ్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. అప్పట్లో ప్రభుదేవని చూసి స్ప్రింగ్‌లు ఏమన్నా మింగాడా అనుకునేవాళ్లం. ఒక మంచి ప్రేమ కథగా సెన్సేషన్ సృష్టించిన సినిమా ఇప్పుడు మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అందరితోపాటు ఈ సినిమా కోసం నేను కూడా ఎదురు చూస్తున్నా' అని అన్నారు. తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్నకుమార్ మాట్లాడుతూ..' ఈ సినిమా రీ రిలీజ్ కూడా మంచి విజయం అందుకుంటుంది. గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం నటన అద్భుతంగా ఉంటుంది. ప్రభుదేవ నటన, డాన్సులు నగ్మ అందాలు ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ. మా సోదరి సుధారాణికి ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా' అని అన్నారు. దర్శకుడు శివనాగుమాట్లాడుతూ.. 'ప్రేమికుడు ఈ తరంలో వచ్చుంటే కచ్చితంగా రూ.100 కోట్ల వసూళ్లు సాధించేంది. అప్పుడున్న బడ్జెట్‌కి రూ.3 కోట్లతో చేసిన సినిమా ఇప్పుడు కూడా రూ.30 కోట్లు సాధిస్తుందని ఆశిస్తున్నా. ఎస్పీ బాలసుబ్రమణ్యం నటన అద్భుతంగా ఉంటుంది. ప్రభుదేవా డాన్సులు ఈ సినిమాకి హైలెట్. రీ రిలీజ్ కూడా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా' అని అన్నారు. కాగా.. ఈ చిత్రానికి శంకర్ దర్శకత్వం వహించగా.. కేటి కుంజుమన్ నిర్మించారు. ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతమందించారు. -
రీరిలీజ్‌కు రెడీ అవుతోన్న సూపర్ హిట్ లవ్ స్టోరీ
ప్రేక్షక్షుల ముందుకు మరోసారి వచ్చేందుకు ప్రేమికుడు సిద్ధం అవుతున్నాడు. ప్రభుదేవా హీరోగా, నగ్మా హీరోయిన్గా రూపొందిన చిత్రం ‘ప్రేమికుడు’(తమిళంలో ‘కాదలన్’). శంకర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ 1994లో విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ మూవీలోని ‘ముక్కాలా ముక్కాబులా’, ‘ఊర్వశి ఊర్వశి’, ‘ఓ చెలియా నా ప్రియ సఖియా’, ‘అందమైన ప్రేమరాణి’.. వంటి పాటలన్నీ యువతను ఉర్రూతలూగించాయి. క్లాసిక్ హిట్‌గా రూపొందిన ‘ప్రేమికుడు’ తెలుగులో రీ రిలీజ్‌కి సిద్ధమవుతోంది. తెలుగు రీ రిలీజ్ హక్కులను నిర్మాతలు మురళీధర్ రెడ్డి, రమణ దక్కించుకున్నారు. సీఎల్ఎన్ మీడియా ద్వారా త్వరలో సినిమా రిలీజ్‌కు సన్నాహాలు చేస్తున్నారు. అతి త్వరలో రిలీజ్ డేట్ ప్రకటిస్తామని నిర్మాతలు పేర్కొన్నారు. -
ఈ ఫొటోలోని నలుగురూ చిరంజీవి హీరోయిన్లే.. ఎవరో చెప్పుకోండి చూద్దాం?
ఇండస్ట్రీలో నెపోటిజం ఉంది. ఈ విషయం అందరికీ తెలుసు. కానీ టాలెంట్ ఉన్నోడే నిలబడతాడు. స్టార్ అవుతాడు. తెలుగులో ఇప్పటికే చాలామంది హీరోలు.. తండ్రి బాటలో వచ్చి సక్సెస్ అయ్యారు, అవుతున్నారు. అలా ఓ హీరోయిన్ తొలుత టాలీవుడ్లో అడుగుపెట్టింది. ఆ తర్వాత ఈమె ముగ్గురు చెల్లెళ్లు కూడా ఎంట్రీ ఇచ్చారు. వీళ్లందరూ చిరంజీవితో సినిమాలు చేశారు. మరి వీళ్లెవరో గుర్తుపట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా? మీలో చాలామంది.. పైన కనిపిస్తున్న ఫొటోలో శ్రీదేవిని అయితే గుర్తుపట్టేసుంటారు. ఈమె పక్కన కూర్చున్న ముగ్గురు చిన్నారులు ఆమెకు చెల్లెళ్లు అవుతారు. కుడివైపు ఉన్న అమ్మాయి నగ్మా. ఎడమ వైపు శ్రీదేవి పక్కనే కూర్చున్న పాప జ్యోతిక. ఆ పక్కన ఉన్న చిన్నారి రోషిణి. వీళ్లందరూ మెగాస్టార్ చిరంజీవితో కలిసి పలు మూవీస్ చేశారు. (ఇదీ చదవండి: మెగాస్టార్ చిరంజీవి ఖరీదైన కొత్త వాచ్.. రేటు తెలిస్తే మైండ్ బ్లాకే) చిరు-శ్రీదేవి కాంబోలో 'జగదేకవీరుడు అతిలోక సుందరి', ఎస్పీ పరశురాం, కొండవీటి రాజా తదితర చిత్రాలు వచ్చాయి. చిరు-నగ్మా కలిసి ఘరానా మొగుడు, రిక్షావోడు, ముగ్గురు మొనగాళ్లు చిత్రాలు చేశారు. చిరు-జ్యోతిక కాంబోలో 'ఠాగూర్' లాంటి బ్లాక్ బస్టర్ వచ్చింది. ఇక చిరు-రోషిణి కలిసి 'మాస్టర్' చేశారు. ఇలా నలుగురు అక్కా చెల్లెళ్లతో సినిమాలు చేసిన హీరోగా మెగాస్టార్ రికార్డ్ సృష్టించారని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ నలుగురు హీరోయిన్లలో శ్రీదేవి చనిపోగా.. నగ్మా రాజకీయాల్లోకి వెళ్లిపోయారు. జ్యోతిక.. సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. భర్త సూర్యతో కలిసి పలు సినిమాలని నిర్మిస్తూ బిజీగా ఉన్నారు. రోషిణి మాత్రం ఇప్పుడెక్కడ ఉన్నారనేది పెద్దగా తెలీదు. తాజాగా ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎవరబ్బా అని నెటిజన్స్ అనుకున్నారు. సో అసలు విషయం తెలిసి మూవీ లవర్స్ రిలాక్స్ అయిపోయారు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 32 సినిమాలు.. అవేంటో తెలుసా?) -
గుర్తుపట్టలేనంత బొద్దుగా మారిపోయిన స్టార్ హీరోయిన్.. గుర్తుపట్టారా?
మహారాష్ట్రకు చెందిన నగ్మ 'పెద్దింటి అల్లుడు' సినిమాతో హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. చాలా ఏళ్లుగా ఆమె మీడియాకు దూరంగానే ఉన్నారు. తాజాగా ఆమెకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌మీడియాలో వైరల్ అవుతుంది. 90వ దశకంలో ఆమె నటనకు, అందానికి యూత్ దాసోహమైపోయింది. దర్శకనిర్మాతలు తన ఇంటిముందు క్యూ కట్టారు. నచ్చిన కథలు సెలక్ట్ చేసుకుంటూ ఏడాదికి ఐదారు సినిమాలు చేసుకుంటూ పోయింది. తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుంది. తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ, కన్నడ, హిందీ, భోజ్‌పురి, పంజాబీ, బెంగాలీ, మరాఠి భాషల్లోనూ హీరోయిన్గా రాణించింది. కానీ ఈమె తెలుగు వెండితెరకు దూరమై దాదాపు 20 ఏళ్లవుతోంది. ఆ తర్వాత ఇతర భాషల్లో నటించినప్పటికీ 2008లో నటనకు గుడ్‌బై చెప్పేసి రాజకీయాల్లో ప్రవేశించింది. కానీ ఎప్పుడు సుమారు పదేళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీ తరుపున ఎన్నికల ప్రచారంలో కనిపించిన నగ్మ తర్వాత ఎక్కడా కూడా పెద్దగా కనిపించలేదు. తాజాగా ఆమె కంట పడింది. అందుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతుంది. ప్రస్తుతం నగ్మా వయసు 48 ఏళ్లు కాగా ఇప్పుడు ఆమెను చూడగానే గుర్తుపట్టడం కాస్త కష్టం అని చెప్పవచ్చు. బాగా బొద్దుగా ఆమె కనిపిస్తుంది. ఇప్పుడు ముంబైలో ఒంటరిగానే నగ్మ ఉంటుంది. కొద్దిరోజుల క్రితం బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి ఇలా మాట్లాడింది. 'పెళ్లి చేసుకోకూడదు అన్న ఆలోచన నాకు లేదు. ఇంకా చెప్పాలంటే నాకంటూ ఓ తోడు ఉండాలి, పిల్లలుండాలని నా ఆశ. పెళ్లి ద్వారా ఓ కుటుంబాన్ని ఏర్పరుచుకోవాలని ఉండేది. కాలం కలిసొస్తే త్వరలోనే నా పెళ్లి జరుగుతుందేమో చూద్దాం. నిజంగా పెళ్లయితే మాత్రం చాలా హ్యాపీగా ఫీలవుతాను. సంతోషమనేది జీవితంలో కొంతకాలానికే పరిమితం కాదు కదా!' అని చెప్పుకొచ్చింది. జ్యోతిక, రోషిణిలకు నగ్మా సోదరి అనే విషయం తెలిసిందే. View this post on Instagram A post shared by Varinder Chawla (@varindertchawla) -
48 ఏళ్ల వయసులో పెళ్లిపై స్పందించిన నగ్మా.. త్వరలోనే..
'పెద్దింటి అల్లుడు' సినిమాతో హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది నగ్మా. ఆమె నటనకు, అందానికి యూత్ దాసోహమైపోయింది. దర్శకనిర్మాతలు తన ఇంటిముందు క్యూ కట్టారు. నచ్చిన కథలు సెలక్ట్ చేసుకుంటూ ఏడాదికి ఐదారు సినిమాలు చేసుకుంటూ పోయింది. తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుంది. తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ, కన్నడ, హిందీ, భోజ్‌పురి, పంజాబీ, బెంగాలీ, మరాఠి భాషల్లోనూ హీరోయిన్గా రాణించింది. మొదట హీరోయిన్గా చేసిన నగ్మా తర్వాత తల్లి, అత్త పాత్రల్లోనూ మెరిసింది. ఈమె తెలుగు వెండితెరకు దూరమై దాదాపు 20 ఏళ్లవుతోంది. ఆ తర్వాత ఇతర భాషల్లో నటించినప్పటికీ 2008లో నటనకు గుడ్‌బై చెప్పేసి రాజకీయాల్లో ప్రవేశించింది. ఇక స్టార్ హీరోయిన్గా ఉన్న సమయంలో ఎంతోమందితో ప్రేమాయణం సాగించిన నగ్మా ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా మిగిలిపోయింది. 48 ఏళ్ల వయసున్న నగ్మా తాజాగా తన పెళ్లి గురించి స్పందించింది. 'పెళ్లి చేసుకోకూడదు అన్న ఆలోచన నాకు లేదు. ఇంకా చెప్పాలంటే నాకంటూ ఓ తోడు ఉండాలి, పిల్లలుండాలని నా ఆశ. పెళ్లి ద్వారా ఓ కుటుంబాన్ని ఏర్పరుచుకోవాలని ఉండేది. కాలం కలిసొస్తే త్వరలోనే నా పెళ్లి జరుగుతుందేమో చూద్దాం. నిజంగా పెళ్లయితే మాత్రం చాలా హ్యాపీగా ఫీలవుతాను. సంతోషమనేది జీవితంలో కొంతకాలానికే పరిమితం కాదు కదా!' అని చెప్పుకొచ్చింది. కాగా నగ్మా గతంలో పెళ్లైన నలుగురిని ప్రేమించిందని ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటారు. నటుడు శరత్ కుమార్, మనోజ్ తివారి, రవి కిషన్లతో పాటు క్రికెటర్ సౌరవ్ గంగూలీతోనూ లవ్‌లో పడిందని, కానీ పెళ్లిదాకా వెళ్లకముందే వీరితో బ్రేకప్ అయిందని ప్రచారం నడిచింది. అయితే రవి కిషన్.. నగ్మాతో తనది స్నేహం మాత్రమేనని ఇటీవలే క్లారిటీ ఇచ్చాడు. చదవండి: దత్తత తీసుకున్న పిల్లల వల్లే సుస్మితా సేన్ కెరీర్ క్లోజ్ అయిందా? -
పెళ్లి తర్వాత మరో నటితో ఎఫైర్?.. స్పందించిన నటుడు
ప్రముఖ నటుడు, బీజేపీ ఎంపీ రవికిషన్ పరిచయం అక్కర్లేని పేరు. రేసు గుర్రం సినిమాతో టాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకున్నారు. మద్దాలి శివారెడ్డి పాత్రతో తెలుగు వారికి దగ్గరయ్యారు. ప్రస్తుతం ఆయన గోరఖ్‌పూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎంపీగా ఉన్నారు. అయితే ఇటీవల ఆప్ కీ అదాలత్ షోలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతనికి ఓ క్లిష్టమైన ప్రశ్న ఎదురైంది. సీనియర్ నటి నగ్మాతో మీకు ఎఫైర్ ఉండేదా? అని ప్రశ్నించారు. దీంతో ఆయన స్పందించారు. అయితే ఆమెతో ఎక్కువ సినిమాలు చేయడం వల్లే అలా రూమర్స్ సృష్టించారని చెప్పుకొచ్చారు. రవి మాట్లాడుతూ, 'నగ్మాతో చాలా సినిమాలు చేశా. మా సినిమాలు బ్లాక్ బస్టర్లుగా కూడా నిలిచాయి. అయితే మేము మంచి స్నేహితులం కాబట్టి ఎక్కువ సినిమాలు చేసేవాళ్లం. మరీ ముఖ్యంగా నాకు పెళ్లి అయిన విషయం అందరికీ తెలుసు. నేను నా భార్య ప్రీతి శుక్లాను చాలా గౌరవిస్తా. నేను ఆమె పాదాలకు నమస్కరిస్తా. నా భార్య మొదటి నుంచి నాతోనే ఉంది. నా వద్ద డబ్బు లేనప్పుడు కూడా ఆమె నాతో ఉంది' అని అన్నారు. అయితే తాను సూపర్‌స్టార్ అయ్యాక అహంకారం ప్రదర్శించానని.. ఆ తర్వాత తనను బిగ్‌బాస్‌లో పాల్గొనాల్సిందిగా భార్య సూచించిందని రవి తెలిపారు. రవికిషన్ మాట్లాడుతూ.. 'నా సినిమాలు సూపర్ హిట్ కావడంతో ఆ తర్వాత నేను కాస్తా గర్వం ప్రదర్శించా. దీంతో వెంటనే నా భార్య బిగ్ బాస్‌కు వెళ్లమని సలహా ఇచ్చింది. మొదట ఇష్టం లేకపోయినా సరే తర్వాత వెళ్లాను. మూడు నెలల పాటు హౌస్‌లో ఉన్నా. బయటకు వచ్చేసరికి నాలో చాలా మార్పు వచ్చింది. నేను పాపులర్ అవ్వడమే కాకుండా సాధారణ వ్యక్తిగా మారిపోయా. ఆ తర్వాత నా కుటుంబాన్ని, నా భార్య, పిల్లలను బాగా చూసుకున్నా.' అని రవికిషన్ వెల్లడించారు. -
సైబర్ వలలో చిక్కుకున్న నటి నగ్మా.. ఒక్క క్లిక్‌తో రూ.లక్ష మాయం!
ఇటీవల కాలంలో సైబర్ నేరాలు మరింత పెరిగిపోతున్నాయి. కొత్త కొత్త తరహాలో మోసాలలకు పాల్పడుతున్నారు సైబర్ నేరగాళ్లు. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా ఈ సైబర్ మోసగాళ్ల ఉచ్చులో చిక్కుకుంటున్నారు. తాజాగా సినియర్ హీరోయిన్ నగ్మా కేటుగాళ్ల వలలో చిక్కి పెద్ద మొత్తంలో మోసపోయారు. తన మొబైల్‌కు వచ్చిన మెసేజ్‌ని క్లిక్ చేసి రూ. లక్ష పోగొట్టుకున్నారు. ఫిబ్రవరి 28న నగ్మా మొబైల్‌కు బ్యాంకు వాళ్లు పంపినట్లు ఓ మెసేజ్ వచ్చిందట. అందులో ఉన్న ఓ లింక్‌ని ఓపెన్ చేయగానే వెంటనే ఆమెకు ఓ ఫోన్ కాల్ వచ్చిందట. బ్యాంక్ ఎంప్లాయ్‌గా తనను తాను పరిచయం చేసుకున్న కేటుగాడు.. కేవైసీ అప్డేట్ చేయమని చెప్పారు. ఆమె తన బ్యాంకు వివరాలు తెలియజేయనప్పటికీ.. తన్ ఆన్లైన్ బ్యాంకులోకి లాగిన్ అయి.. బెనిఫిషియరీ అకౌంట్ క్రియేట్ చేసుకుని దాదాపు లక్ష రూపాయలు ట్రాన్స్ఫర్ చేసుకున్నాడట. నేరగాడు లాగిన్ అయ్యే క్రమంలో తన మొబైల్‌కి దాదాపు 20 సార్లు ఓటీపీలు వచ్చాయని నగ్మా వెల్లడించారు. పెద్ద అమౌంట్ కాకుండా కేవలం లక్ష రూపాయలతో ఈ ఫ్రాడ్ నుండి బయటపడినందుకు నగ్మా బాధలో సంతోషం వ్యక్తం చేశారు. నగ్మా మాదిరే సదరు బ్యాంకులో ఖాతాలు ఉన్న మరో 80 మంది కూడా ఇదే తరహాలో మోసపోవడం గమనార్హం. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ముంబై సైబర్ పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. -
సోనియా జీ.. నాకు ఆ అర్హతే లేదా?: నటి నగ్మా
ముంబై: గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్‌కు కొత్త కష్టాలు వచ్చి పడ్డాయ్. నాయకత్వ లోపాల కారణంగా సీనియర్లు సైతం ఓవైపు పార్టీని వీడుతుంటే.. మరోవైపు ఇప్పుడు ‘రాజ్యసభ’ చిచ్చు మరికొందరిలో తీవ్ర అసంతృప్తిని రాజేస్తోంది. తాజాగా మాజీ నటి, కాంగ్రెస్ నేత నగ్మా కాంగ్రెస్‌పై బహిరంగంగానే వ్యతిరేక పోస్ట్ చేశారు. సోనియా జీ.. కాంగ్రెస్ చేరిక సమయంలో రాజ్యసభ సీటును నాకు ఇస్తామని ఆఫర్ చేశారు. 2003 నాటికి కాంగ్రెస్ అధికారంలో లేదు. అప్పటి నుంచి 18 ఏళ్ల పాటు అవకాశం కోసం ఎదురు చూడడంతోనే సరిపోయింది. ఇప్పుడు ఇమ్రాన్(ఇమ్రాన్ ప్రతాప్ఘడిని ఉద్దేశించి)ను మహారాష్ట్ర నుంచి పెద్దల సభకు పంపిస్తున్నారు. అసలు నాకు ఆ అర్హతే లేదా? అని నగ్మా ట్విటర్ ద్వారా అసంతృప్తిని వ్యక్తం చేశారు. SoniaJi our Congress president had personally committed to accommodating me in RS in 2003/04 whn I joined Congressparty on her behest we weren’t in power thn.Since then it’s been 18Yrs they dint find an opportunity Mr Imran is accommodated in RS frm Maha I ask am I less deserving — Nagma (@nagma_morarji) May 30, 2022 మా 18 ఏళ్ల తపస్సు కూడా ఇమ్రాన్ భాయ్ ముందు వెనుకబడి పోయింది అంటూ ఓ ట్వీట్లో వైరాగ్యం ప్రదర్శించారు ఆమె. हमारी भी १८ साल की तपस्या कम पड़ गई इमरान भाई के आगे । https://t.co/8SrqA2FH4c — Nagma (@nagma_morarji) May 29, 2022 ఇదిలా ఉంటే.. జూన్ 10న జరగబోయే రాజ్యసభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ఏడు రాష్ట్రాల నుంచి పది మంది సభ్యులతో కూడిన అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఛత్తీస్‌గఢ్ నుంచి రాజీవ్ శుక్లా, రంజిత్ కుమార్, హర్యానా నుంచి అజయ్ మాకెన్, మహారాష్ట్ర నుంచి ఇమ్రాన్ ప్రతాప్‌ఘడి, కర్ణాటక నుంచి జైరామ్ రమేష్, మధ్యప్రదేశ్ నుంచి వివేక్ తన్హా, తమిళనాడు నుంచి చిదంబరం, రాజస్థాన్ నుంచి రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా, ముకుల్ వాస్నిక్, ప్రమోద్ తావారి(ముగ్గురు రాజస్థాన్ వాళ్లు కాకపోవడం గమనార్హం) పేర్లను ప్రకటించింది. ఇక బీజేపీ ఎనిమిది రాష్ట్రాల నుంచి 16 మందికి సీట్లు ఖారారు చేసింది. వీరిలో కేంద్ర మంత్రులు పీయూష్ గోయెల్(మహారాష్ట్ర), నిర్మలా సీతారామన్(కర్ణాటక) సైతం ఉన్నారు. Congratulations to all those who made it to the Rajya Sabha @ShuklaRajiv ji Ranjeet Ranjan ji @ajaymaken ji @Jairam_Ramesh ji @VTankha ji @ShayarImran ji @rssurjewala ji @MukulWasnik ji @pramodtiwari700 ji & @PChidambaram_IN ji. And to all those who r selected to the Rajya Sabha https://t.co/GSQ070QgOk — Nagma (@nagma_morarji) May 30, 2022 -
నగ్మాతో గంగూలీ పీకల్లోతు ప్రేమ.. ఆ ఫోటోలు చూసి డోనా ఫైర్..బ్రేకప్ స్టోరీ
‘ఉరుము ఉరిమి మంగలం మీద పడ్డట్టు’ అనే జాతీయం తెలుసు కదా! అభిమాన క్రికెటర్ ఆశించిన ఆటతీరును కనబర్చలేకపోతే ఆ ఆటగాడి స్నేహితురాలో.. ప్రేమికురాలో ఆ నిందను మోయాల్సి వస్తోంది! క్రికెట్ అభిమానుల ఈ ఆగ్రహం సర్వసాధారణమైపోయింది.. ఈ రీతికి అనుష్కా శర్మనే కాదు.. అంతకుముందే నటి నగ్మా కూడా బలైంది!! ఎవరి విషయంలోనో చెప్పేలోపే ఆ వ్యక్తి మీ ఊహకు అందే ఉంటాడు.. సౌరవ్ గంగూలీ అని!! 1999.. వరల్డ్ కప్ మ్యాచ్ రోజులవి.. అప్పుడే కామన్ ఫ్రెండ్స్ ద్వారా సౌరవ్‌కి నగ్మా పరిచయం అయింది. లౌక్యం తెలియని ఆమె ప్రవర్తన అతణ్ణి ఆకట్టుకుంది. నగ్మాకూ అంతే.. ఇండియన్ క్రికెట్ టీమ్ కెప్టెన్‌గా ఉన్న సౌరవ్ పాపులారిటీ కన్నా అతని స్నేహపూర్వకమైన నడతే నచ్చింది. అన్ని జంటల ప్రయాణంలాగే ఈ జంట ప్రయాణమూ పరిచయం.. స్నేహం మీదుగా ప్రేమ పిచ్ చేరుకుంది. ఎప్పటిలాగే మీడియా ఆ కబుర్లను దేశమంతా బట్వాడా చేసింది. ఆ ప్రేమ వ్యవహారంలో పడిపోయి సౌరవ్ ఆట మీద దృష్టి పెట్టలేకపోతున్నాడనే విమర్శలనూ వినిపించింది. వరల్డ్ కప్ చేజారిపోవడానికీ సౌరవ్ ఏకాగ్రత లోపమనీ.. దానికి కారణం నగ్మాయేననీ క్రికెట్ అభిమానులు.. సౌరవ్ వీరాభిమానులూ తీర్మానం చేశారు. సౌరవ్ సారథ్యంలోని జట్టు ఎక్కడ ఏ మ్యాచ్ ఓడిపోయినా ‘అంతా నీవల్లే.. నీవల్లే’ అంటూ నగ్మాను ట్రోల్ చేయసాగారు. అన్నిటినీ సహించింది నగ్మా. కానీ డోనా భరించలేకపోయింది. ఆ ట్రోలింగ్స్‌ను కాదు.. భర్త ప్రవర్తనను. నగ్మాతో ప్రేమలో పడేటప్పటికే సౌరవ్ .. డోనాకు భర్త. ఆమె.. అతని చిన్ననాటి స్నేహితురాలు. మనసిచ్చి.. పుచ్చుకున్న నెచ్చెలి. పెద్దవాళ్లను ఎదిరించి మరీ డోనాను పెళ్లాడాడు. తర్వాత రెండేళ్లకే నగ్మా ఎదురైంది. అతని మనసు గెలుచుకుంది. తర్వాత కథనంతా మీడియాలో వినింది.. చదివింది.. కనింది డోనా. అవన్నీ రూమర్సే అని తేలిగ్గా తీసుకుంది కూడా.. నగ్మా, సౌరవ్ తిరుపతి వచ్చి దర్శనం చేసుకున్నారని.. రహస్యంగా పెళ్లీ చేసుకున్నారనే వార్త వచ్చే వరకూ. వట్టి వార్తగానే వస్తే దాన్నీ పట్టించుకోకపోవునేమో డోనా.. కానీ సౌరవ్, నగ్మా ఇద్దరూ కలసి తిరుమలలో దర్శనానికి వెళ్తున్న ఫొటోతో సహా అచ్చయింది పత్రికల్లో. విడాకులకు సిద్ధం.. అందుకే డోనా ఆ వ్యవహారాన్ని తేలిగ్గా తీసుకోలేకపోయింది. ఆ రుజువులు చూపిస్తూ సౌరవ్‌ను నిలదీసింది. ‘ఇవన్నీ రూమర్స్.. మా మధ్య అలాంటిదేం లేదు అంటూ అదే మీడియాకు స్టేట్మెంట్ ఇస్తారా? నన్ను విడాకులు ఇమ్మంటారా?’ అని అడిగింది డోనా .. సౌరవ్‌ను. డోనా స్వరంలోని స్థిరత్వానికి భయపడిపోయాడు సౌరవ్. చైల్డ్‌హుడ్ స్వీట్ హార్ట్.. హార్ట్ బ్రేక్ అయిందని అర్థమైంది ఆ భర్తకు. కళ్లనిండా నీళ్లతో ‘క్షమించు’ అని విన్నవించుకున్నాడు. ‘జీవితంలో ఇలాంటి ఆకర్షణలు సాధారణం. అదే సమయంలో స్థిర చిత్తమూ అవసరం’ అని అనునయిస్తున్నట్టుగా సౌరవ్ చేతిని తన చేతుల్లోకి తీసుకుంది డోనా. అవన్నీ రూమర్సే.. ఆ తర్వాత మీడియాలో స్టేట్మెంట్ వచ్చింది.. ‘నగ్మాతో అలాంటిదేం లేదు.. అవన్నీ రూమర్స్’ అంటూ. అది సౌరవ్, డోనా ఇద్దరి నుంచీ వెలువడింది. ఇప్పుడు నగ్మా హర్ట్ అయింది. మౌనంగా ఏడ్చింది. సౌరవ్ మాటకు గౌరవం ఇచ్చి అతని జీవితంలోంచి తప్పుకుంది. ఒంటరిగానే జీవితం కొనసాగిస్తోంది. అయితే.. నగ్మా, సౌరవ్ తమ ప్రేమను మీడియా ముఖంగా ఎప్పుడూ నిర్ధారించలేదు. ‘ఇద్దరికీ సంబంధించిన ఒక వ్యవహారంలో ఒకరికి కెరీర్ ప్రధానమైనప్పుడు ఇంకొకరు దాని పర్యవసానాల బరువును మోయాల్సి వస్తుంది. అయినా నాతోనే ఉండాలనే ఈగోకి వెళ్లే బదులు ఆ అనుబంధాన్ని తెంచుకొని బయటకు రావడమే మంచిది. అవతలి వ్యక్తి ఆశయం కోసం మన ఆసక్తి, ఇష్టాలను త్యాగం చేయాల్సి వస్తుంది. వాళ్ల జీవితంలో మన ఉనికి వాళ్లకు సంతోషాన్ని పంచకపోగా నరకాన్ని తలపిస్తుంటే అక్కడి నుంచి మనం తప్పుకోవడమే మేలు’ అని చెప్పింది నగ్మా .. ‘సావి’ పత్రికకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో. ఆ మాటలు సౌరవ్నుద్దేశించేనని భావించారు ఆమె అభిమానులు. - ఎస్సార్ -
అప్పట్లో వివాదంగా నగ్మా-గంగూలీ ప్రేమ వ్యవహారం, ఏమైందంటే!
ఇక్కడ సినిమా, క్రికెట్‌కు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమాలను ఎంతగా ప్రేమించేవారున్నారో.. అంతకంటే ఎక్కువగా క్రికెట్‌ను ఆరాధించే వారు ఉన్నారనడంలో అతిశయోక్తి లేదు. సినీ నటులు రీల్ హీరోలు అయితే, మన క్రికెటర్స్‌ను రియల్ హీరోలుగా చూస్తారు. అయితే క్రికెటర్లు కొంతమంది బాలీవుడ్ హీరోయిన్స్‌తో ప్రేమాయణం సాగించిన సంగతి తెలిసిందే. మహమ్మద్ అజారుద్దీన్ నుంచి నేటీ తరం యువ క్రికెటర్స్ వరకు పలువురు హీరోయిన్స్‌తో డేటింగ్ చేసినవారే. అయితే అందులో కొందరు పెళ్లిపీటలు ఎక్కగా మరికొందరూ బ్రేకప్ చెప్పుకుని విడిపోయారు. ఇందులో మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ కూడా ఉన్నాడు. నేడు గంగూలీ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు చర్చనీయాంశం అయ్యాయి. అందులో నటి నగ్మాతో ఆయన నడిపిన ప్రేమ వ్యవహారం కూడా ఉంది. దాదా అంటూ క్రికెట్ అభిమానులు ముద్దుగా పిలుచుకునే సౌరవ్ ఒకప్పటి స్టార్ హీరోయిన్ నగ్మాతో పీకల్లోతూ ప్రేమలో మునిగిపోయారనే విషయం తెలిసిందే. గంగూలీ, నగ్మాల డేటింగ్ విషయం అప్పట్లో సంచలనంగా మారింది. ఎందుకంటే దాదా అప్పటికే 1997లో డోనాను ప్రేమ వివాహం చేసుకున్నాడు. 90లలో నగ్మా క్రేజ్ గురించి అందరికి తెలిసిందే. సౌత్ స్టార్ హీరోయిన్ అయిన నగ్మా బాలీవుడ్‌లోను నటించింది. హిందీలో దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి అక్కడ కూడా అగ్రనటిగా ఎదిగింది. తెలుగు, హిందీ, మలయాళం, కన్నడతో పాటు భోజ్‌పూరి, బెంగాలీ, పంజాబీ, మరాఠ వంటి భాషల్లో కూడా నగ్మా నటించి తన సత్తా చాటుకుంది. ఈ క్రమంలోనే దాదా ఆమెతో ప్రేమలో పడ్డాడు. అప్పట్లో ఇద్దరూ సీక్రెట్‌గా డేటింగ్ చేస్తూ విందులు, పార్టీలకు జంటగా హాజరయ్యేవారు. అప్పటి వరకు చిన్నపాటి రూమర్‌గా ఉన్న వారి లవ్ మ్యాటర్ 1999 వరల్డ్ కప్ సమయంలో ఒక్కసారిగా గుప్పుమంది. లండన్‌లో జరిగిన ప్రపంచ కప్ టోర్నమెంట్ సందర్భంగా వీరిద్దరూ అక్కడికి జంటగా వెళ్లారు. లండన్‌లో చెట్టాపట్టాలేసుకుంటూ తిరిగి వీరి ఫొటోలు బయటకు రావడంతో ఈ రూమర్లకు మరింత ఆధ్యం పోసినట్లు అయ్యింది. అప్పటి నుంచి వీరి రిలేషన్ హాట్‌టాపిక్ మారింది. ఇక గంగూలీ కెప్టెన్ అయ్యాక కూడా వారి ప్రేమ వ్యవహారం సాగింది. ఈ క్రమంలో నగ్మా, గంగూలీలు జంటగా శ్రీకాళహస్తి వెళ్లి పూజ చేయించుకుంటూ మీడియాకు చిక్కారు. ఇది అప్పట్లో మరింత వివాదాస్పదంగా మారింది. ఈ క్రమంలో వారిద్దరూ సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నారని, గంగూలీ, నగ్మాను రెండో వివాహం చేసుకున్నాడంటూ పుకార్లు హల్చల్ చేశాయి. దీంతో దాదా, నగ్మాలు స్పందిస్తూ వారి మధ్య ఏం లేదని, ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేల్చి చెప్పారు. అయితే అప్పటికే వారిద్దరూ వ్యక్తిగత కారణాలు వల్ల విడిపోయి ఒకరితో ఒకరూ సంబంధం లేకుండా ఉంటున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల నగ్మా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దాదాతో తన రిలేషన్, ప్రేమ, బ్రేకప్‌పై నోరు విప్పిన సంగతి తెలిసిందే. తను, గంగూలీ ప్రేమించుకున్న మాట నిజమేనని, కొన్ని వ్యక్తిగత కారణాలు వల్ల తాము విడిపోయినట్లు ఆమె అంగీకరించింది. ‘అప్పుడు నా సినీ కెరీర్ పీక్స్‌లో ఉంది. క్రికెటర్‌గా గంగూలీ కెరీర్ కూడా. ఆ సమయంలో ఈగో మా బంధానికి అడ్డుగా నిలిచింది. అనుబంధంలో అహానికి చోటు ఉంటే ఆ బంధాన్ని ఎక్కువ కాలం నిలుపలేం కదా’ అంటూ మనస్పర్థల వల్ల వారిద్దరూ విడిపోయినట్లు నగ్మా స్పష్టం చేసింది. కానీ నగ్మా ప్రవర్తన నచ్చకే గంగూలీ ఆమెతో రీలేషన్కు పుల్‌స్టాప్ పెట్టాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. -
టీకా తీసుకున్నా.. ప్రముఖ నటికి కరోనా
కరోనా వైరస్ సెకండ్ వేవ్ మొదలైంది. మరోసారి మహమ్మారి దేశంలో కోరలు చాస్తోంది. కోవిడ్ వ్యాక్సిన్ వచ్చినప్పటికి మహమ్మారి దాని ప్రతాపం చూపుతూ నిపుణులను, శాస్త్రవేత్తలను వెక్కిరిస్తోంది. కరోనా వ్యాక్సిన్ తీసుకుంటే మహమ్మారి దరి చేరదని.. అందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేసుకోవాలంటూ పలు ఆరోగ్య సంస్థలు, సినీ ప్రముఖులు ప్రచారం చేస్తుంటే.. మరోవైపు టీకా తీసుకున్న వారు కరోనా పాజిటివ్‌గా రావడం ఆందోళన కల్గిస్తోంది. తాజాగా ప్రముఖ నటి, కాంగ్రెస్ నేత నగ్మా సైతం కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్విటర్లో ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె ఏప్రిల్ 2వ తేదీన కరోనా ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్నట్లు వెల్లడించారు. కాగా వ్యాక్సిన్ తీసుకున్నప్పటికి ఆమె కరోనా సోకినట్లు స్పష్టం చేశారు. అయితే ప్రస్తుతం వైద్యుల సలహా మేరకు ఇంట్లోనే ఉండి చికిత్స తీసుకుంటున్నట్లు ఆమె తెలిపింది. కాగా నగ్మా తెలుగు, తమిళ భాషల్లో ప్రముఖ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్గా రాణించిన విషయం తెలిసిందే. Had taken my 1st dose of Vaccine a few days ago tested for Covid-19 yest, my test has come ‘Positive’ so Quarantined myself at home. All Please take care and take al necessary precautions even after taking the 1st dose of Vaccine do not get complacent in anyway manner #staysafe ! — Nagma (@nagma_morarji) April 7, 2021 చదవండి: కరోనా టీకా రెండో డోస్ తీసుకున్న ప్రధాని మోదీ కరోనా విలయం: సోనూసూద్ అతిపెద్ద టీకా డ్రైవ్ -
జయప్రదను టార్గెట్ చేసిన నగ్మ
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు అనేక మలుపులు తిరుగుతూ మాదకద్రవవ్యాల వినియోగం అంశం దగ్గర ఆగిన సంగతి తెలిసిందే. డ్రగ్స్ కోణం వెలువడటంతో కేసు మరో మలుపు తిరిగింది. పార్లమెంట్ వేదికగా దీనిపై వాదోపవాదాలు జరుగుతున్నాయి. ఇక మాదకద్రవ్యాల కోణం గురించి వ్యాఖ్యలు చేసిన కంగనకు, ఇతర నటులకు మధ్య మాటలయుద్ధం కొనసాగుతుంది. ఈ క్రమంలో నటి, కాంగ్రెస్ నాయకురాలు నగ్మ.. బీజేపీ నాయకులు, సీనియర్ నటి జయప్రదను టార్గెట్ చేశారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు నుంచి ప్రజలను దారి మళ్లించడానికి మాదకద్రవ్యాలు, బాలీవుడ్లో డ్రగ్ కల్చర్ అంశాలను తెర మీదకు తెచ్చారు అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ మేరకు నగ్మ ట్వీట్ చేశారు. (చదవండి: విమర్శలు... వ్యంగ్యాస్త్రాలు) CBI , NCB , ED pls answer to #BJP Member #JayaPrada Ji on what’s happening to #SSR case it’s been so long we are all waiting for what’s the outcome but no result and to cover up suddenly all #bjp members r talking about drugs in #Bollywood as Nation is still waiting #SSRDeathCase — Nagma (@nagma_morarji) September 17, 2020 ‘సీబీఐ, ఎన్సీబీ,ఈడీ దయచేసి సుశాంత్ కేసులో ఏం జరుగుతుందో బీజేపీ నాయకులు, జయప్రద గారికి తెలియజేయండి. సుశాంత్ చనిపోయి ఇప్పటికే మూడు నెలలు గడిచిపోయింది. దేశప్రజలంతా సుశాంత్ మృతికి కారకులేవరో తెలుసుకోవాలని ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. కానీ ఫలితం లేదు. దీన్ని కవర్ చేయడానికి ఉన్నట్లుండి బీజేపీ నాయకులు బాలీవుడ్లో మాదక ద్రవ్యాల వినియోగం గురించి మాట్లాడుతున్నారు. కానీ ఇప్పటికి కూడా దేశ ప్రజలు సుశాంత్ మృతికి కారకులేవరో తెలుసుకోవాలని భావిస్తున్నారు’ అంటూ ట్వీట్ చేశారు. ఎంపీ రవికిషన్ బాలీవుడ్లో డ్రగ్స్ వినియోగం ఉందంటూ చేసిన వ్యాఖ్యలకు జయప్రద మద్దతిచ్చారు. దాంతో నగ్మ ఈ వ్యాఖ్యలు చేశారు. టీవీ నటి కావ్యా పంజాబీ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ‘తొలుత జస్టిస్ ఫర్ సుశాంత్ అంటూ ప్రారంభమైంది.. తరువాత జస్టిస్ ఫర్ కంగనగా మారి ఇప్పుడు జస్టిస్ ఫర్ రవి కిషన్ అయ్యింది. మరి సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఎక్కడ అంటూ’ ట్వీట్ చేసింది. -
పాక్ జర్నలిస్ట్‌కు నగ్మా సపోర్ట్: నెటిజన్ల ఫైర్
న్యూ ఢిల్లీ: అలనాటి సినీ తార, ప్రస్తుత రాజకీయ నాయకురాలు నగ్మా వివాదాల్లో ఇరుక్కున్నారు. భారత్‌పై విషం కక్కుతూ మాట్లాడిన పాకిస్తాన్ జర్నలిస్టుకు మద్దతు పలుకుతూ మాట్లాడటంతో ఆమెపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. వివరాల్లోకి వెళితే.. బుధవారం నాడు ఓ హిందీ టీవీ ఛానల్ మైనారిటీలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చా కార్యక్రమం ప్రారంభించింది. ఇందులో నగ్మాతోపాటు తరీఖ్ పీర్జాదా అనే పాకిస్తాన్ జర్నలిస్ట్ కూడా పాల్గొన్నారు. ఈ డిబేట్లో పాక్ జర్నలిస్ట్.. భారత్‌ఫై విషం కక్కుతూ తన మాతృ దేశాన్ని పొగడడం ప్రారంభించారు. దీంతో ఛానల్ ప్రతినిధి అతనిపై తీవ్రంగా మండిపడ్డారు. (అందుకే సింధియా పార్టీ వీడారు : నగ్మా) అలా మాట్లాడటం తగదని విమర్శించారు. కానీ నగ్మా మాత్రం పాక్ జర్నలిస్ట్‌ను ఎండగట్టాల్సిందిపోయి యాంకర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని కించపరిచేందుకే డిబేట్‌కు ఆహ్వానించారా? అని మండిపడ్డారు. అనంతరం ట్విటర్లోనూ పాక్ జర్నలిస్టుకు మద్దతు తెలుపుతూ ట్వీట్ చేశారు. భారత్‌కు సపోర్ట్ చేయకుండా మన దేశానిపై ఇష్టానుసారంగా నోరుపారేసుకుంటున్న పాక్ జర్నలిస్టుకు మద్దతివ్వడం ఏంటని నెటిజన్లు నగ్మాని నిలదీస్తున్నారు. ఇలాంటి చర్యలతో ఆమె తన గౌరవాన్ని పోగొట్టుకుందని విమర్శిస్తున్నారు. తననే కాకుండా ఆమె కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీని కూడా ఓ ఆటాడుకుంటున్నారు. ఈ క్రమంలో ట్విటర్లో #NagmaStandsWithPakistan హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లో నిలిచింది. (కూతురికి కరోనా పేరు పెట్టిన ఎంపీ!) -
అందుకే సింధియా పార్టీ వీడారు : నగ్మా
న్యూఢిల్లీ : జ్యోతిరాదిత్య సింధియా రాజీనామా కాంగ్రెస్ పార్టీలోని అసమ్మతి నేతలకు మార్గం సుగమం చేసిందని నటి, ఆ పార్టీ నేత నగ్మా వ్యాఖ్యానించారు. సింధియా పార్టీని వీడటంపై కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ చేసిన వ్యాఖ్యలను ఆమె తోసిపుచ్చారు. బుధవారం ట్విటర్ వేదికగా ఆమె స్పందించారు. కాంగ్రెస్ పార్టీలోని చాలా మంది నాయకులు అసంతృప్తితో వేగుతున్నారని, దాన్ని కనిపెట్టడంలో పార్టీ విఫలమైందని అన్నారు. సరైన గుర్తింపు లభించకపోవటం మూలానే సింధియా పార్టీ వీడారని చెప్పారు. మరికొంతమంది అసమ్మతి నాయకులు పార్టీ వీడేందుకు అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ( ‘మహరాజ్’ కోసం ఏం చేయడానికైనా సిద్ధం..) కాగా, మూడు రోజుల రాజకీయ రసవత్తరతకు తెరదించుతూ సింధియా బుధవారం బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. మంగళవారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆయన నడ్డా సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. ఆ వెంటనే బీజేపీ సింధియాను మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించింది. ( రాజ్‌నాథ్‌తో సింధియా భేటీ ) There’s a lot of discontentment among many of us seems like the party totally fails to see it @SachinPilot after a time it’s not abt ideology anymore it’s abt recognition of ones efforts and given one an appropriate due so it’s not surprising @JM_Scindia left many will follow too https://t.co/G1QWEA2K2i — Nagma (@nagma_morarji) March 11, 2020 చదవండి : సింధియా నిష్క్రమణతో ‘చేతి’కి చిక్కులు -
గుంటూరులో మెరిసిన నగ్మా
గుంటూరు ఈస్ట్: నగరంలో ఓ ప్రైవేటు చానల్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకలకు సినీ నటి నగ్మా హాజరయ్యారు. సినీ నేపథ్య గాయకులు మనో, శ్రీలేఖ, సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ ఈ కార్యక్రమంలో తమ గానంతో సందడి చేశారు. జిల్లా కలెక్టర్ ఐ.శామ్యూల్ ఆనందకుమార్, ఎమ్మెల్యే మొహమ్మద్ ముస్తఫా ముఖ్య అతిథులుగా హాజరైన ఈ వేడుకల్లో ఆర్సీఎస్ఎం ఫాదర్ బాలా, ఏఈఎల్సీ అధ్యక్షుడు పరదేశిబాబు, ఏఎంజీ అధ్యక్షుడు మహంతి, పాస్టర్లు, ఫెలోషిప్ ప్రతినిధులు, విశ్వాసులు పాల్గొన్నారు. -
స్క్రీన్ టెస్ట్
ఎలక్షన్లు వచ్చేస్తున్నాయి. ఏ నోట విన్నా రాజకీయమే. రచ్చబండ మీద, పొలం గట్ల దగ్గర అక్కడా ఇక్కడా అనే తేడా లేదు. ఎక్కడ చూసినా రాజకీయాలే. రాజకీయాలు వేరు, సినిమాలు వేరు. సినిమా సీన్లలో ఉండే రాజకీయాలను కథ నిర్ణయిస్తుంది. ఒకప్పుడు సినిమా, రాజకీయాలు రెండూ రెండు భిన్న కోణాలు. ప్రస్తుతం రాజకీయాలు, సినిమాలు కలిసే ప్రయాణం చేస్తున్నాయి అంటే అతిశయోక్తి కాదేమో. సినిమాల్లో రాజకీయాలు కాదు, రాజకీయాల్లో సినిమా స్టార్స్ గురించి ఈ వారం స్పెషల్ క్విజ్. 1. సినిమా వాళ్లల్లో మెంబర్ ఆఫ్ పార్లమెంట్‌కు (యం.పి) ఎన్నికైన మొట్టమొదటి తెలుగు నటుడు ఇతను. కాంగ్రెస్ పార్టీ తరపున ఒంగోలు నుంచి గెలుపొందిన ఈ నటుడు ఎవరో తెలుసా? ఎ) చిత్తూరు నాగయ్య బి) కాంతారావు సి) కొంగర జగ్గయ్య డి) యస్వీ రంగారావు 2. 1989లో పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన నటుడెవరో కనుక్కుందామా? ఎ) కృష్ణ బి) శోభన్‌బాబు సి) హరనాథ్ డి) శరత్‌బాబు 3. ప్రముఖ నటుడు చిరంజీవి 2008లో ‘ప్రజారాజ్యం’ పార్టీని స్థాపించారు. ఆ పార్టీకి ఎన్నికల కమిషన్ కేటాయించిన గుర్తు ఏంటో కనుక్కోండి? ఎ) రైలు బి) కారు సి) విమానం డి) స్కూటర్ 4. 2009 ఎలక్షన్స్‌లో వైయస్ రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ తరపున యం.ఎల్.ఏ గా గెలిచిన సినీ నటి ఎవరో తెలుసా? ( సికింద్రాబాద్ నియోజకవర్గం) ఎ) కుష్బూ బి) నగ్మా సి) సుహాసిని డి) జయసుధ 5. నటి రోజా వైయస్ఆర్ సీపీ తరపున పోటీ చేసి యం.ఎల్.ఏగా గెలుపొందారు. ఆమె ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారో తెలుసా? ఎ) నగరి బి) చిత్తూరు సి) పీలేరు డి) తిరుపతి 6. ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ నియోజకవర్గం నుంచి పార్లమెంటేరియన్‌గా గెలుపొందిన నటి? ఎ) హేమమాలిని బి) జయప్రద సి) జయబాధురి డి) రేఖ 7. ఈయన ప్రముఖ సినిమా రచయిత. తమిళనాట రాజకీయాల్లో చాలా కీలక పాత్రను పోషించారు. ఎవరా రచయిత? ఎ) కరుణానిధి బి) యం.జీ.ఆర్ సి) స్టాలిన్ డి) నెపోలియన్ 8. నటి రాధిక భర్త శరత్‌కుమార్. అనేక తెలుగు సినిమాల్లో కూడా నటించారు. తమిళ రాజకీయల్లో క్రియాశీలక వ్యక్తి. 2007లో ఆయన తన సొంత పొలిటికల్ పార్టీని స్థాపించారు. ఆ పార్టీ పేరేంటి? ఎ) హిందూ మక్కళ్ కట్చి బి) కొంగునాడు మున్నేట్ర కళగం సి) తమిళ్ మానిల కాంగ్రెస్ డి) ఆల్ ఇండియా సమత్తువ మక్కళ్ కట్చి 9. 1999లో విజయవాడ తూర్పు నియోజకవర్గ యం.ఎల్.ఏగా గెలుపొందిన తెలుగు సినీ ప్రముఖుడెవరో కనుక్కోండి? ఎ) మురళీమోహన్ బి) ఏవీయస్ సి) అలీ డి) కోట శ్రీనివాసరావు 10. 1995వ సంవత్సరం నుంచి 6 సంవత్సరాలు రాజ్యసభలో పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగిన తెలుగు నటుడెవరు? ఎ) చిరంజీవి బి) మోహన్‌బాబు సి) బాలకృష్ణ డి) ఏయన్నార్ 11. 2019 కర్ణాటక ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తాను అని ఈ మధ్యే ప్రకటించిన నటుడెవరో కనుక్కోండి? ఎ) సాయికుమార్ బి) ప్రకాశ్ రాజ్ సి) అయ్యప్ప.పి.శర్మ డి) యశ్ 12. 1998లో భారతీయ జనతా పార్టీలో చేరి, మెదక్ నియోజక వర్గం నుంచి యం.పీ గా పోటీ చేసి గెలుపొందారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఎవరా నటి? ఎ) శారద బి) కవిత సి) విజయశాంతి డి) విజయనిర్మల 13. ప్రముఖ నటి సౌందర్య ప్రచారానికి వెళ్తూ ప్రమాదవశాత్తు హెలికాప్టర్ కుప్పకూలి మరణించారు. ఆమె ఏ సంవత్సరంలో మరణించారు? ఎ) 2000 బి) 2001 సి) 2002 డి) 2004 14. ఈ నటుడు 2017లో కర్ణాటకలోని ఓ పార్టీలో చేరారు. ఐదు నెలల తర్వాత ఆ పార్టీకి తిలోదకాలిచ్చి ప్రజాకీయ అనే సొంత పార్టీని ప్రారంభించారు. ఎవరా నటుడు? ఎ)ఉపేంద్ర బి) పునీత్ రాజ్‌కుమార్ సి) సుదీప్ డి) శివ రాజ్‌కుమార్ 15. 2006లో కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్యసభ సభ్యుడిగా నియమితులైన దర్శకుడెవరో కనుక్కోండి? ఎ) దాసరి నారాయణరావు బి) కె.రాఘవేంద్ర రావు సి) దిలీప్ కుమార్ డి) రాజేష్‌ఖన్నా 16. ‘మక్కళ్ నీది మయం’ అనే పొలిటికల్ పార్టీని స్థాపించిన తమిళ నటుడు ఎవరు? ఎ) కమల్‌హాసన్ బి) రజనీకాంత్ సి) విశాల్ డి) విజయ్‌కాంత్ 17. ఈయన ప్రముఖ నటుడు. యం.ఎల్.ఏ గా రెండుసార్లు గెలుపొందారు. రెండుసార్లు ఓడిపోయారు. ఆ నటుడెవరు? ఎ) సుమన్ బి) పోసాని కృష్ణమురళీ సి) బాబుమోహన్ డి) విజయ్ చందర్ 18. 1999లో పదమూడవ లోక్‌సభకు జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బాపట్ల నుంచి యంపీగా పోటీ చేసి గెలుపొందిన తెలుగు నిర్మాత ఎవరు? ఎ) సి.అశ్వనీదత్ బి) మాగంటి బాబు సి) జి.ఆదిశేషగిరిరావు డి) డి.రామానాయుడు 19. కాకినాడ నుంచి పోటీచేసి 12వ లోక్‌సభలో అడుగుపెట్టిన ప్రముఖ నటుడు ఎవరు? ఎ) కృష్ణ బి) మురళీమోహన్ సి) కైకాల సత్యనారాయణ డి) కృష్ణంరాజు 20. తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత తమిళ ప్రజల గుండెల్లో నిలిచారు. ఆమె మరణానంతరం ఆమెపై 3 బయోపిక్‌లు నిర్మితమవుతున్నాయి. అందులో ఓ చిత్రంలో జయలలిత పాత్రలో నటిస్తున్న నటి ఎవరో తెలుసా? ఎ) నిత్యామీనన్ బి) అనుష్క సి) హన్సిక డి) త్రిష మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) (సి) 2) (ఎ) 3) (ఎ) 4) (డి) 5) (ఎ) 6) (బి) 7) (ఎ) 8) (డి) 9) (డి) 10) (బి) 11) (బి) 12) (సి) 13) (డి) 14) (ఎ) 15) (ఎ) 16) (ఎ) 17) (సి) 18) (డి) 19) (డి) 20) (ఎ) నిర్వహణ: శివ మల్లాల -
అలా అనుకున్నారు.. ఇలా వచ్చేస్తున్నారా!
‘నాకు ఇంకా చాలా లైఫ్ ఉంది.. తెలుగులో చాలా సినిమాలు చేయాలనుకుంటున్నా’ అని ఇటీవల ‘టీఎస్ఆర్ టీవీ 9 నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్’లో లైఫ్‌టైమ్ ఎచీవ్మెంట్ అవార్డు ప్రకటించినప్పుడు నగ్మా అన్నారు. తెలుగు సినిమాలు చేయాలని ఆమె అలా అనుకున్నారో లేదో ఇలా నెరవేరనుందని ఫిల్మ్‌నగర్ ఖబర్. ‘బాషా’, ‘ఘరానా మొగుడు’, ‘ప్రేమికుడు’ వంటి చిత్రాలతో కథానాయికగా నగ్మా తెలుగులో చాలా పేరు తెచ్చుకున్నారు. ‘రూప్ తేరా మస్తానా నీకు డేరా వేస్తానా.., ‘ఏందిబె ఎట్టాగ ఉంది ఒళ్లు.. ఎక్కడో గుచ్చావు చేపముల్లు..., ‘మోగిందోయమ్మో శ్రుతి చేయని సిగ్గుల వీణ...’ వంటి పాటల్లో నగ్మా వేసిన స్టెప్స్‌ని అంత సులువుగా మరచిపోలేం. కప్పుడు సౌత్‌లో స్టార్ హీరోలందరితోనూ నటించిన నగ్మా రాజకీయాల్లోకి Ðð ళ్లాక సినిమాలకు దూరంగా ఉంటున్నారు. 2002లో ‘అల్లరి రాముడు’ సినిమాలో ఆర్తీ అగర్వాల్ తల్లిగా, అదే ఏడాది ‘నిను చూడక నేనుండలేను’ సినిమాలో చేసిన ప్రత్యేక పాట తర్వాత నగ్మా తెలుగు తెరపై కనిపించలేదు. 2007 వరకూ బెంగాలీ, భోజ్‌పురి, హిందీ తదితర భాషల్లో చేశారు. ఇప్పుడు నగ్మా తెలుగు చిత్ర పరిశ్రమకి రీ–ఎంట్రీ ఇస్తున్నారనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇవ్వనున్నారట. ఇందులో అల్లు అర్జున్‌కి తల్లి పాత్రలో కనిపించనున్నారని సమాచారం. -
మరో సీనియర్ బ్యూటీ రీ ఎంట్రీ
ఒకప్పుడు గ్లామర్ హీరోయిన్స్‌గా ఇండస్ట్రీని ఏళిన భామలు ఇప్పుడు అత్త, అమ్మ పాత్రల్లో రీ ఎంట్రీ ఇస్తున్నారు. యంగ్ హీరోలకు గ్లామర్స్ మధర్స్గా అలరిస్తున్నారు. ఇప్పటికే నదియా, ఖుష్బూ, మీనా, రమ్యకృష్ణ లాంటి హీరోయిన్స్ తల్లి పాత్రల్లో సత్తా చాటుతున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లో మరో సీనియర్ నటి చేరనున్నారు. 90లలో గ్లామర్ క్వీన్‌గా గుర్తింపు తెచ్చుకున్న నగ్మా రీ ఎంట్రీకి రెడీ అవుతున్నారు. ఇప్పటికే నదియా, ఖుష్బూలను పవర్ ఫుల్ రోల్స్‌లో చూపించి మెప్పించిన త్రివిక్రమ్ దర్శకత్వంలోనే నగ్మా రీ ఎంట్రీ ఇవ్వనున్నారన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కబోయే సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు త్రివిక్రమ్ ఈ సినిమాలో నగ్మా, బన్నీ తల్లి పాత్రలో కనిపించనున్నారట. 2002 లో రిలీజ్ అయిన నిను చూడక నేనుండలేను సినిమాతో చివరిసారిగా తెలుగు తెరపై కనిపించిన నగ్మా ఇన్నేళ్ల తరువాత టాలీవుడ్లో రీ ఎంట్రీ ఇస్తుండటం సినిమాకు కూడా కలిసొస్తుందని భావిస్తున్నారు చిత్రయూనిట్. -
పదేళ్ల క్రితం వచ్చిన ఆలోచన ఇది
‘‘కళాకారులకు జాతీయ స్థాయిలో ఫిల్మ్ అవార్డులు ఇవ్వాలని పదేళ్ల కిత్రం నాకో ఆలోచన వచ్చింది. అదీ ప్రజాభిప్రాయం తెలుసుకుని ఇవ్వాలని. ప్రజాభిప్రాయ సేకరణకు టీవీ చానల్ ఉంటే బాగుంటుందని టీ వీ9తో కలిసి ‘టీఎస్ఆర్ టీవీ9 నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్’ని స్థాపించా’’ అని కళాబంధు, ‘టీఎస్ఆర్ టీవీ9 నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్’ చైర్మన్ టి.సుబ్బరామి రెడ్డి అన్నారు. 2017, 2018 సంవత్సరాలకు ‘టీఎస్ఆర్ టీవీ9 నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్’కి ఎంపికైన వారి వివరాలను గురువారం సుబ్బరామిరెడ్డి ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘ఈ అవార్డ్స్ ఫంక్షన్‌ని ఈ నెల 17న విశాఖపట్నంలోని పోర్ట్ స్టేడియంలో నిర్వహిస్తున్నాం. తెలుగు, హిందీ, పంజాబీ, భోజ్‌పురి, తమిళ్, కన్నడ, మలయాళం.. ఇలా భారతదేశంలోని అన్ని భాషల నటీనటులకు అవార్డులు ఇస్తున్నాం. ఈ అవార్డుల జ్యూరీ మెంబర్లుగా నగ్మా, జీవితా రాజశేఖర్, మీనా, పరుచూరి గోపాలకృష్ణ, కేఎస్ రామారావు, నరేశ్, రఘు రామకృష్ణంరాజు, పింకీ రెడ్డి, శోభన కామినేని వ్యవహరించారు. వేలాది మంది ప్రజలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. అన్ని భాషల నుంచి దాదాపు 60మంది ఫిల్మ్ స్టార్స్ అవార్డులు తీసుకోనున్నారు’’ అన్నారు. జీవిత సాఫల్య పురస్కారానికి ఎంపికైన నటి నగ్మా మాట్లాడుతూ –‘‘నా లైఫ్ ఇంకా చాలా ఉంది.. ఇంకా చాలా సినిమాలు చేయాలి. అప్పుడే మీరు (సుబ్బరామిరెడ్డి) లైఫ్‌టైమ్ ఎచీవ్మెంట్ అవార్డు ప్రకటించారు (నవ్వుతూ). ఈ అవార్డుతో పాటు సామాజిక సేవ చేసినందుకు మార్చిలో ‘రాజీవ్‌గాంధీ’ అవార్డుకూడా అందుకోబోతున్నా. తెలుగులో నా సినీ ప్రయాణం ఇంకా కొనసాగాలి’’ అన్నారు. పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ– ‘‘అందరికంటే కష్టమైన పని ఏంటంటే జ్యూరీ సభ్యునిగా ఉండటం. నక్షత్రాల్లో చంద్రుడ్ని చూపించి ఇందులో ఎవరు పెద్ద, గొప్ప అంటే చంద్రుడ్ని చూపిస్తాం. అందరి చంద్రుల్ని చూపించి ఇందులో ఏ చంద్రుడు గొప్ప అంటే ఏం చెబుతాం? అలా ఈ హీరోలు, హీరోయిన్లందరూ చందమామలే. మా అదృష్టం ఏంటంటే కొన్ని వేలమంది చక్కగా ఓటింగ్‌లో పాల్గొన్నారు. మేం రెండు మూడుసార్లు చర్చించుకుని ఫైనల్ లిస్ట్ తయారు చేశాం. వర్షం పడితే రైతుకు ఆనందం. కళాకారుల ముఖం ఆనందంతో తడిస్తే మా సుబ్బరామిరెడ్డిగారికి ఆనందం. మహాభారతంలో ధర్మరాజును అజాతశత్రువు అంటారు. ఈ భారతదేశంలో నాకు సజీవంగా కనిపిస్తున్న ఏకైక అజాత శత్రువు సుబ్బరామిరెడ్డిగారు’’ అన్నారు. జ్యూరీ సభ్యులు శోభన కామినేని, రఘురామ కృష్ణంరాజు పాల్గొన్నారు. -
స్క్రీన్ టెస్ట్
కొత్త సంవత్సరం వచ్చింది. కొత్త నిర్ణయాలు, కొత్త ఆశయాలు, కొత్త కలలు... ఏడాదంతా బాగుండాలనే పాజిటివ్ ఫీలింగ్‌తో 2019 స్టార్ట్ అయింది. సంవత్సరంలో తొలి నెల, తొలి వారంలో ‘తొలి కబుర్లు’ ఈ వారం క్విజ్ స్పెషల్. 1. సిల్వర్ స్క్రీన్‌పై మొదటిసారి యన్టీఆర్ నటించిన చిత్రం ‘మన దేశం’. కానీ యన్టీఆర్ ఏ చిత్రం ద్వారా మాస్ హీరోగా చిత్రపరిశ్రమలో నిలబడ్డారో తెలుసా? ఎ) పాతాళ భైరవి బి) గులేబకావళి కథ సి) గుండమ్మకథ డి) పాండవ వనవాసం 2. ప్రముఖ నటి విజయశాంతి తెలుగులో నటించిన మొదటి సినిమా ‘కిలాడి కృష్ణుడు’. ఆ చిత్రంలో హీరో ఎవరో చెప్పుకోండి? ఎ) చిరంజీవి బి) మోహన్‌బాబు సి) నాగార్జున డి) కృష్ణ 3. తెలుగులో మొట్టమొదటి సూపర్‌స్టార్ ఈ ప్రముఖ నటి. ఆమె నటి, దర్శకురాలు, సంగీత దర్శకురాలు, సింగర్, రచయిత. ఇంతకీ ఆమెఎవరు? ఎ) అంజలీదేవి బి) జమున సి) సావిత్రి డి) భానుమతి 4. తెలుగులో వచ్చిన మొదటి 70 యం.యం సినిమా పేరేంటో తెలుసా? ఎ) అల్లూరి సీతారామరాజు బి) ఈనాడు సి) తెలుగువీర లేవరా డి) సింహాసనం 5. ‘బంగారక్క’ చిత్రం ద్వారా తెలుగులో హీరోయిన్గా పరిచయమైన నటి ఎవరో తెలుసా? ఎ) రాధ బి) జయప్రద సి) శ్రీదేవి డి) సుహాసిని 6. తాను హీరోయిన్గా నటించిన మొదటి చిత్రం హీరోనే పెళ్లి చేసుకున్న నటి ఎవరో కనుక్కోండి? ఎ) శ్రియ బి) సమంత సి) శ్వేతాబసు ప్రసాద్ డి) స్వాతి 7. నటుడు నాని నటించిన మొదటి చిత్రదర్శకుడెవరో చెప్పుకోండి? ఎ) ఇంద్రగంటి మోహనకృష్ణ బి) ‘పిల్లజమిందార్’ అశోక్ సి) సత్యం బెల్లంకొండ డి) నందినీరెడ్డి 8. వెంకటేశ్ నటించిన మొదటి చిత్రం ‘కలియుగ పాండవులు’. కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ద్వారా తెలుగుకి పరిచయమైన ప్రముఖ నటి ఎవరో తెలుసుకుందామా? ఎ) నగ్మా బి) ఖుష్బూ సి) సౌందర్య డి) రోజా 9. ‘సిరివెన్నెల’ చిత్రంలో పాటలు రాసినందుకు ఆయనకు ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి అనే పేరొచ్చింది. రచయితగా ఆయన తొలి సినిమా హీరో ఎవరో తెలుసా? ఎ) సర్వధమన్ బెనర్జీ బి) బాలకృష్ణ సి) సోమయాజులు డి) కృష్ణంరాజు 10. ప్రముఖ గాయకుడు యస్పీ బాలసుబ్రహ్మణ్యం ఏ హీరోకి తన మొదటి తెలుగు సినిమా పాట పాడారో తెలుసా? ఎ) శోభన్‌బాబు బి) చంద్రమోహన్ సి) రంగనాథ్ డి) గిరిబాబు 11. రామ్‌గోపాల్ వర్మ ‘రక్తచరిత్ర’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన బాలీవుడ్ నటి ఎవరు? ఎ) ఊర్మిళా మటోండ్కర్ బి) మైరా సరీన్ సి) రాధికా ఆప్టే డి) నిషా కొఠారి 12. ‘మంచి మనుషులు’ చిత్రంలో బాలనటునిగా నటించిన నటుడెవరు? చిన్న క్లూ: హీరోగా మెప్పించి, ఇప్పుడు నటుడిగా చాలా బిజీగా ఉన్నారాయన? ఎ) జగపతిబాబు బి) వెంకటేశ్ సి) నాగార్జున డి) కమల్‌హాసన్ 13. సుకుమార్‌కి దర్శకునిగా తొలి అవకాశం ఇచ్చిన నిర్మాత ఎవరో కనుక్కోండి? ఎ) అశ్వనీదత్ బి) సురేశ్‌బాబు సి) ‘దిల్’ రాజు డి) అల్లు అరవింద్ 14. అఖిల్ హీరోగా పరిచయమైన చిత్రం ‘అఖిల్’. ఆ చిత్రానికి దర్శకుడెవరో కనుక్కోండి? ఎ) శ్రీను వైట్ల బి) వీవీ వినాయక్ సి) పూరి జగన్నాథ్ డి) విక్రమ్ కె. కుమార్ 15. దేవిశ్రీ ప్రసాద్‌కి సంగీత దర్శకునిగా తొలి చిత్రం ‘దేవి’. ఆ చిత్రాన్ని యం.యస్. రాజు నిర్మించారు. చిత్ర దర్శకుడెవరు? ఎ) కోడి రామకృష్ణ బి) కృష్ణవంశీ సి) ఈవీవీ డి) శ్రీను వైట్ల 16. దర్శకుడు పూరీ జగన్నాథ్ 2000లో ఏ చిత్రం ద్వారా దర్శకునిగా మెగా ఫోన్ పట్టారో తెలుసా? ఎ) బాచీ బి) బద్రి సి) ఇడియట్ డి) శివమణి 17. నటుడు సుమంత్ హీరోగా పరిచయమైన చిత్రం ‘ప్రేమకథ’. ఆ చిత్రంలో సుమంత్ సరసన నటించిన నటి ఎవరు? ఎ) ఆంత్ర మాలి బి) ప్రీతీ జింతా సి) ప్రీతీ జింగ్యాని డి) అంజలా జవేరి 18. బాలీవుడ్ ప్రముఖ నటి కంగనారనౌత్ నటించిన ఒకే ఒక్క తెలుగు చిత్రానికి దర్శకుడు పూరి జగన్నాథ్. మరి ఆ చిత్ర హీరో ఎవరో తెలుసా? ఎ) మహేశ్‌బాబు బి) నితి¯Œ ∙సి) రానా డి) ప్రభాస్ 19. దాసరి దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘తాతా మనవడు’. ఆ చిత్రంలో తాతగా యస్వీఆర్ నటించారు. మరి మనవడిగా మురిపించిన నటుడెవరో గుర్తుందా? ఎ) చలం బి) శరత్‌బాబు సి) రాజనాల డి) రాజబాబు 20. హీరో రామ్ కెరీర్లో తొలి హీరోయిన్ ఎవరో కనుక్కోండి? ఎ) హన్సిక బి) జెనీలియా సి) ఇలియానా డి) అక్ష మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) ఎ 2) డి 3) డి 4) డి 5) సి 6) బి 7) ఎ 8) బి 9) ఎ 10) ఎ 11) సి 12) ఎ 13) సి 14) బి 15) ఎ 16) బి 17) ఎ 18) డి 19) డి 20) సి నిర్వహణ: శివ మల్లాల -
సోనియా దయతోనే కేసీఆర్‌కు పదవి :నగ్మా
సాక్షి, వరంగల్: తెలంగాణ ఏర్పాటుతో సామాన్య నాయకుడిగా ఉన్న కేసీఆర్ సోనియాగాంధీ దయ వల్లనే సీఎం అయ్యారని ఏఐసీసీ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి, నటి నగ్మా అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ప్రజాకూటమి అభ్యర్థుల తరపున ప్రచారం చేసేందుకు వరంగల్‌కు వచ్చిన నగ్మా పోచమ్మమైదాన్‌లో నిర్వహించిన రోడ్‌షోలో మాట్లాడారు. గత ఎన్నికల్లో హామీలు ఇచ్చి అమలు చేయకుండా విస్మరించిన ప్రభుత్వానికి ఎలా ఓట్లు వేస్తారని ప్రజలను ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష ప్రత్యేక రాష్ట్రాన్ని సోనియా ఇచ్చిందన్నారు. వరంగల్ జిల్లా చైతన్యం వంతమైందని, ఇక్కడ ప్రజలు మోసాన్ని తట్టుకోలేరన్నారు. ఇచ్చిన వాగ్ధానాలను మర్చిన టీఆర్ఎస్కు ప్రజలు తప్పకుండా బుద్ది చెబుతారని అన్నారు. ఈ ఎన్నికలు ప్రజల కోసమే వచ్చాయన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ ఫాంహౌస్‌లో ఉండి పాలిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో వందల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడితే వారిని పరమార్శంచిన పాపానా టీఆర్ఎస్ నేతలు పోలేదన్నారు. రాష్ట్రం ఇచ్చిన సోనియా రుణం తీర్చుకునేందుకు ప్రజా కూటమిని గెలిపించి దేశంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. దేశాయిపేట కాలేజీలో చదువుకున్న తాను పక్కా లోకల్ అని వరంగల్ తూర్పు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వద్దిరాజు రవిచంద్ర అన్నారు. తనను గెలిపిస్తే అభివృద్ధి ఎంటో చూపిస్తానన్నారు. కేసీఆర్ రెండు పదవులు ఉన్న వ్యక్తికి మళ్లీ ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వద్దిరాజు రవిచంద్ర సతీమణి విజయలక్ష్మీ, తోట వేణుమాధవ్, ఆయూబ్‌ఖాన్, కట్ల శ్రీనివాస్, మోతిలాల్నాయక్లు పాల్గొన్నారు. -
దేశంలో అత్యంత అవినీతిపరుడైన సీఎం కేసీఆర్
-
‘కేసీఆర్ మావద్ద కూలీగా పనిచేశాడు’
సాక్షి, సిద్దిపేట : తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పుకుని కేసీఆర్ పుణ్యానికి సీఎం అయ్యారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ అన్నారు. గజ్వేల్ మహాకూటమి అభ్యర్థి వంటేరు ప్రతాప్ రెడ్డికి మద్దతుగా మంగళవారం ప్రజ్ఞాపూర్ నుంచి గజ్వేల్ వరకు జరిగిన రోడ్‌షోలో ఆజాద్‌తో పాటు సినీ నటి నగ్మా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆజాద్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పాత్ర ఏమీ లేదని, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం తెలంగాణలో అమలులో ఉన్న సంక్షేమ పథకాలన్నీ గతంలో కాంగ్రెస్ పార్టీ అమలుచేసిన పథకాలేనని ఆయన గుర్తుచేశారు. హైదరాబాద్‌లో బీజేపీ అభ్యర్థులను గెలిపించేందుకు టీఆర్ఎస్ డమ్మీ అభ్యర్థులను పోటీలో ఉంచిందని ఆజాద్ ఆరోపించారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్ కారణంగా భూములు కోల్పోయిన వారికి టీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం 10 శాతం మాత్రమే నష్టపరిహారం చెల్లించిందని మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో మహాకూటమి 70 నుంచి 80 స్థానాల్లో విజయం సాధించి అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గతంలో తాను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌గా ఉన్న సమయంలో కేసీఆర్ తన వద్ద కూలీ మనిషిలా పనిచేశాడని ఎద్దేవా చేశారు. కేసీఆర్ డబ్బు సంపాదించుకోవడం కోసమే అధికారంలోకి వచ్చారని, మహాకూటమి ప్రజలకు సేవచేసేందుకు అధికారంలోకి రాబోతుందని ఆయన అన్నారు. ప్రజల స్పందన చూస్తుంటే గజ్వేల్‌లో ప్రతాప్‌రెడ్డి విజయం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. -
స్క్రీన్ టెస్ట్
1. ‘దీవానా’ చిత్రం ద్వారా హీరో అయిన బాలీవుడ్ ప్రముఖ నటుడెవరు? ఎ) ఆమీర్ ఖాన్ బి) సల్మాన్‌ఖాన్ సి) షారుక్‌ఖాన్ డి) సోహైల్ ఖాన్ 2. సూపర్‌స్టార్ కృష్ణ తన నట జీవితంలో ఎన్ని చిత్రాలకు దర్శకత్వం వహించారో తెలుసా? ఎ) 19 బి) 14 సి) 10 డి) 17 3. చిరంజీవి నటిస్తున్న ‘సైరా’ చిత్రానికి సంగీత దర్శకునిగా ఇప్పుడు బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది పని చేస్తున్నారు. ఈ చిత్రానికి మొదట అనుకున్న సంగీత దర్శకుడు ఎవరో తెలుసా? ఎ) ఏ.ఆర్.రెహమాన్ బి) యస్.యస్. తమన్ సి) మణిశర్మ డి) దేవిశ్రీ ప్రసాద్ 4. రణŠ బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా నటిస్తున్న చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. ఆ చిత్రంలో నటిస్తున్న తెలుగు హీరో ఎవరో కనుక్కోండి? ఎ) రాజశేఖర్ బి) నాగార్జున సి) వెంకటేశ్ డి) నాని 5. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ‘పైసా’ చిత్రంలో నాని సరసన నటించిన హీరోయిన్ ఎవరు? ఎ) రెజీనా బి) క్యాథరిన్ సి) ప్రణీత డి) హెబ్బా పటేల్ 6. ‘సాహసవీరుడు– సాగరకన్య’ చిత్రంలో నటించిన బాలీవుడ్ బ్యూటీ ఎవరో తెలుసా? ఎ) శిల్పాశెట్టి బి) రవీనా టాండన్ సి) దీప్తి భట్నాగర్ డి) నగ్మా 7. ‘సతీ లీలావతి’ చిత్రంలో కమల్‌హాసన్ సరసన నటించిన నటి ఎవరో తెలుసా? ఎ) ఊర్వశి బి) కోవై సరళ సి) హీరా డి) రమ్యకృష్ణ 8. ‘దేవుడు చేసిన మనుషుల్లారా, మనుషులు చేసిన దేవుళ్లారా.. గోవిందా హరి గోవిందా...’ అనే పాటను రచయిత ఎవరో గుర్తుందా? ఎ) శ్రీశ్రీ బి) దాశరథి సి) సముద్రాల డి) కృష్ణశాస్త్రి 9. ‘నేను పుట్టాను ఈ లోకం నవ్వింది, నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది...’ అక్కినేని సూపర్íß ట్ సాంగ్ ఏ చిత్రంలోనిదో తెలుసా? ఎ) ప్రేమాభిషేకం బి) ప్రేమనగర్ సి) మేఘ సందేశం డి) దసరా బుల్లోడు 10. నాగార్జున హీరోగా నటించిన మొదటి చిత్రానికి దర్శకుడెవరో తెలుసుకుందామా? ఎ) బోయిన సుబ్బారావు బి) వి.మధుసూదన్ రావు సి) దాసరి నారాయణరావు డి) కె.రాఘవేంద్రరావు 11. ‘ఛలో’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ ఎవరో తెలుసా? ఎ) రియా సుమన్ బి) పాయల్ రాజ్‌పుత్ సి) రష్మికా మండన్నా డి) కావ్యా థాపర్ 12. ‘నిన్నుకోరి’ చిత్ర దర్శకుడు శివనిర్వాణ దర్శకత్వంలో హీరో నాగచైతన్య నటిస్తున్నారు. ఈ నూతన చిత్రంలో ఆయన సరసన హీరోయిన్గా నటిస్తున్న కథానాయిక ఎవరు? ఎ) అనూ ఇమ్మాన్యుయేల్ బి) సమంతా అక్కినేని సి) తమన్నా డి) రాశీ ఖన్నా 13. సినిమాటోగ్రాఫర్, డైరెక్టర్ తేజ ఏ చిత్రానికి 6 నంది అవార్డులు అందుకున్నారో తెలుసా? ఎ) చిత్రం బి) జయం సి) నువ్వు నేను డి) నిజం 14. ఈమె ప్రముఖ నటి. ఆమె నిజమైన పేరు శ్రీలతారెడ్డి. మరి.. స్క్రీన్ నేమ్ ఏంటో తెలుసా? ఎ) విజయశాంతి బి) రోజా సి) జీవిత డి) వాణీ విశ్వనా«ద్ 15. ‘రోబో’ చిత్రంలోని ‘ఓ మరమనిషి నాలోకి రా! ఇనుములో హృదయం మొలిచెనే....’ పాటను పాడిందెవరో తెలుసా? ఎ) యస్పీ బాలసుబ్రహ్మణ్యం బి) కార్తీక్ సి) కారుణ్య డి) హేమచంద్ర 16. కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ‘సూత్రధారులు’ చిత్రంలో నటించిన ప్రముఖ కథానాయిక ఎవరు? ఎ) జయప్రద బి) రమ్యకృష్ణ సి) మీనా డి) శోభన 17. ‘కొండవీటి సింహం’ చిత్రంలో యన్టీఆర్ కుమారునిగా నటించిన నటుడెవరో కనుక్కోండి? ఎ) శ్రీధర్ బి) హరికృష్ణ సి) శోభన్ బాబు డి) మోహన్ బాబు 18. సాయిధరమ్ తేజ్ నటించిన ‘విన్నర్’ చిత్రంలో తన చిన్నప్పటి పాత్రను చేసిన చరిత్ మానస్ ఏ హీరో తనయుడో తెలుసా? ఎ) రవితేజ బి) మహేశ్‌బాబు సి) సుధీర్‌బాబు డి) జయం రవి 19. రాజేంద్రప్రసాద్, రజనీ నటించిన ఈ స్టిల్ ఏ సినిమాలోనిది? ఎ) అహ నా పెళ్లంట బి) మాయలోడు సి) ఏప్రిల్ 1 విడుదల డి) మేడమ్ 20. ఈ కింది ఫొటోలో ఉన్న చిన్నారి నటి ఎవరో చెప్పుకోండి? ఎ) అనుష్కా శర్మ బి) చార్మి సి) రకుల్ ప్రీత్‌సింగ్ డి) భావన మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) సి 2) బి 3) ఎ 4) బి 5) బి 6) ఎ 7) బి 8) ఎ 9) బి 10) బి 11) సి 12) బి 13) సి 14) బి 15) ఎ 16) బి 17) డి 18) సి 19) ఎ 20) బి నిర్వహణ: శివ మల్లాల -
నగ్మాకు చెక్
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు మహిళా కాంగ్రెస్ ఇన్చార్జ్ బాధ్యతల నుంచి పార్టీ అధిష్టానం నగ్మాను తప్పించింది. మంగళవారం ఈ మేరకు రాష్ట్ర కార్యాలయానికి ఉత్తర్వులు అందాయి. జాతీయ మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నగ్మాను ఈ బాధ్యతల నుంచి తప్పించడంలో పార్టీ అధికార ప్రతినిధి కుష్బు ప్రమేయం ఉండొచ్చని అంటున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ గురించి ఏమైనా చెప్పుకోవాలంటే అందరికీ ఠక్కున గుర్తొచ్చేది వర్గ పోరు మాత్రమే. ఆనాటి కామరాజనాడార్ మొదలు ఈనాటి తిరునావుక్కరసర్ వరకు వర్గపోరును భరించినవారే. ఒకరినొకరు బహిరంగా విమర్శించడంలో ఎవరికి వారే సాటిగా వ్యవహరిస్తుంటారు. తమిళనాడు కాంగ్రెస్‌లో తిరునావుక్కరసర్, ఈవీకేఎస్ ఇళంగోవన్, పి.చిదంబరం వర్గాలు ప్రధానమైనవిగా చెప్పుకోవచ్చు. ఇక ప్రస్తుత విషయానికి నగ్మా, కుష్బు ఇద్దరూ బాలీవుడ్ నుంచి కోలీవుడ్‌కు దిగుమతైన నటీమణులే. కానీ కాంగ్రెస్ కార్యక్రమాల్లో ఒకరంటే ఒకరికి పట్టనట్లుగా వ్యవహరిస్తారు. నగ్మా కార్యక్రమాలకు కుష్బు హాజరైన సందర్భాలు లేవు. ఇద్దరికీ కాంగ్రెస్ అధిష్టానం వద్ద మంచి పలుకుబడి ఉంది. అయితే కుష్బు తమిళం చక్కగా మాట్లాడతారు. నగ్మాకు తమిళం రాదు. కుష్బులా నగ్మా వివాదాస్పద వ్యాఖ్యలు చేయకున్నా రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఝాన్సీరాణిని లెక్కచేయడం లేదనే విమర్శ ఉంది. ఇటీవల ఒక సమావేశంలో ఝాన్సీరాణిని దూరంగా కూర్చోవాలని నగ్మా ఆదేశించడం కలకలం రేపింది. నగ్మాను వెంటనే బాధ్యతల నుంచి తప్పించాలని అధిష్టానానికి ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదుల ఫలితమే నగ్మాకు ఇన్చార్జ్ బాధ్యతల నుంచి ఉద్వాసనగా తెలుస్తోంది. -
సభలో పాటపాడి అలరించిన నగ్మా
టీ.నగర్: నటి నగ్మా పుదుచ్చేరిలో జరిగిన కాంగ్రెస్ సభలో పాట పాడి అక్కడి మహిళలను అలరించారు. పుదుచ్చేరి మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో తిరుక్కనూర్ కోరపట్టిలో ఆదివారం మహిళల చైతన్య శిబిరం, సంక్షేమ సహాయకాల పంపిణీ నిర్వహించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి నగ్మా పేద మహిళలకు సంక్షేమ సహాయకాలు అందజేసి ప్రసంగించారు. ఆ సమయంలో మహిళలను ఉత్సాహపరిచేందుకు పాట పాడాలని నిర్వాహకులను కోరగా పాట పాడారు. తర్వాత నగ్మాను పాడాల్సిందిగా నిర్వాహకులు అడిగారు. అంగీకరించిన నగ్మా మైక్ అందుకుని ‘నీ నడందాల్ నడై అళగు’ (నువ్వు నడిస్తే నడక అందం), స్టైల్ స్టైలు దాన్.. తంగమగన్.. అనే పాటలు పాడారు. అక్కడున్న మహిళలు కేకలు వేస్తూ హర్షం వ్యక్తం చేశారు. ఈ పాటలో తాను అందం అంటూ పేర్కొన్నది రాహుల్గాంధీనని, రజనీకాంత్ గురించి కాదన్నారు. రాహుల్ గాంధీ తమ బాషా.. ఆయనే ప్రధానిగా రావాలంటూ వివరణ ఇచ్చారు. -
వీక్షకుల కోసం చానళ్ల మధ్య పోటీ
రాయదుర్గం: దేశంలో ప్రస్తుతం 400 కంటే ఎక్కువ చానళ్లు వీక్షకుల కోసం పోటీపడుతున్నాయని ప్రముఖ టీవీ యాంకర్ నగ్మా సహార్ అన్నారు. గచ్చిబౌలిలోని మౌలానా అజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో ‘ఎలక్ట్రానిక్ మీడియా–ఆబ్జెక్టివిటీ అండ్ ప్రీజుడీసెస్ ఆఫ్ టీవీ న్యూస్ యాంకర్స్’ అంశంపై సదస్సు నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన నగ్మా మాట్లాడుతూ.. ఆదాయ వనరుల సేకరణ ప్రతికూల వార్తల సేకరణపై ప్రభావం చూపిస్తోందన్నారు. న్యూస్‌రూమ్‌లో అతిథులను పూర్తి స్థాయిలో మాట్లాడనివ్వరని పేర్కొన్నారు. కార్యక్రమంలో మనూ వైస్ చాన్సలర్ డాక్టర్ మహ్మద్ అస్లామ్ పర్వేజ్, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ డీన్ ప్రొఫెసర్ ఎతేశ్యామ్ ఆహ్మద్‌ఖాన్ మాట్లాడారు. -
జూలీ..లీలీ! జూలీ..లీలీ!!
అదీ సినిమా పాట. జూలీ సినిమాలో ఆ అందగత్తెను చూస్తూ అలాగే మొత్తుకుంటాడు హీరో. హెడ్ లైన్లో మేము రెండు సార్లు అన్నామంటే.. ఇప్పుడు మీరు చదువుతున్న వార్త జూలీ 2 గురించి. హిందీలో సూపర్‌స్టార్ ఖాన్‌తో తన మొదటి సినిమా చేసిన హీరోయిన్, పెళ్లయిన తమిళ్ సూపర్‌స్టార్‌తో అఫైర్ నడిపిన అమ్మాయి అని ఖ్యాతి చెందిన ఫిమేల్ స్టార్ జీవిత కథనమే జూలీ 2 అని ఆ సినిమా చేస్తున్నవాళ్లు చెప్పకపోయినా, ఇండస్ట్రీ అంతా జూలీ అయి కూస్తోంది. జూలీ 2 కథ మరి ఎవరిదనుకున్నారు? ఎస్. అవర్ నగ్మా మేడమ్! వెంటనే ఎవరో పోయి నగ్మాను కదిలించారట.. ‘ఈజ్ దిస్ ట్రూ?’ అని. ఇంగ్లిషులో అడిగినప్పుడు ఇంగ్లీషులోనే సమాధానం చెప్పుతుంది కదా. ‘ఓ ఈజిట్?’ దిస్ ఈజ్ న్యూస్ టు మి టూ. నిజమా. నేనూ ఫస్ట్ టైమ్ వింటున్నాను అని నగ్మా అన్నారట. ‘పద్మావతి’ సినిమానే పబ్లిసిటీ అంతా దండుకుంటోందని జూలీ 2 కి ఈ కొత్త యాంగిల్‌ని దండగా వేశారని అనుకుంటున్నారు. ఏమంటారు మేడమ్.. ఇదంతా పబ్లిసిటీ కోసమేనా అని ఇంకోసారి అడిగితే.. సినిమా రిలీజ్ కాకుండా ఇలాంటి విషయాల మీద కామెంట్ చేయడం కరెక్టు కాదు అని చెప్పారు. -
నాన్నకు ఆమే సరైన జోడీ
నాన్న కార్తీక్‌కు నటి నగ్మా సరైన జోడీ అని ఆయన కొడుకు, యువ నటుడు గౌతమ్ కార్తీక్ అన్నారు. కడల్ చిత్రం ద్వారా ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం పరిచయం చేసిన నటుడు గౌతమ్ కార్తీక్. ఆ తరువాత కొన్ని చిత్రాల్లో నటించినా సరైన గుర్తింపు రాలేదు. తాజాగా గౌతమ్ కార్తీక్ నటించిన రంగూన్ చిత్రం మంచి విజయాన్ని అందించింది. ప్రస్తుతం ఇవన్ తందిరన్ చిత్రంలో నటిస్తున్నారు శ్రద్ధా కథానాయకి. కండేన్ కాదలై చిత్రం ఫేమ్ ఆర్.కన్నన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎంకే.రామ్ ప్రసాద్‌తో కలిసి ఆయనే నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం రెండురోజుల క్రితం చెన్నైలో జరిగింది. నటుడు గౌతమ్ కార్తీక్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సరైన తరుణంలో విలేకరులతో మాట్లాడాలని భావించానన్నారు. అందుకు ఇది సరైన తరుణం అనిపించిందన్నారు. తాను నటించిన రంగూన్ చిత్రం సక్సెస్‌ఫుల్‌గా ప్రదర్శింపబడటం సంతోషంగా ఉందన్నారు. సిపాయ్, ఇవన్ తందిరన్, హరహర మహాదేవకీ చిత్రాలను పూర్తి చేశానని, ప్రస్తుతం విజయ్‌సేతుపతితో కలిసి నల్ల నాళ్ పార్తు సొల్రేన్ చిత్రంలో నటిస్తున్నానని చెప్పారు. నాన్న కార్తీక్ నటించిన చిత్రాల్లో అగ్నినక్షత్రం మంచి కథా చిత్రం అని పేర్కొన్నారు. ఆ చిత్రం రీమేక్‌లో నటించనని అన్నారు. తనకు నటనపై ఆసక్తి కలిగించిన చిత్రం కడల్ అని పేర్కొన్నారు. తనకు ఎప్పుడైతే నిసత్తు కలిగి ఉంటానో అప్పుడు తనను ఉత్సాహపరిచేది అమ్మేనన్నారు. అమ్మంటే తనకు చాలా ఇష్టం అని అన్నారు. ఇకపోతే తనది కచ్చితంగా ప్రేమ వివాహమే అవుతుందన్నారు. అయితే 35–40 వయసులోనే పెళ్లి చేసుకోవాలన్నది తన భావన అని పేర్కొన్నారు. తన తండ్రి, తాత చిత్రాలను తప్పకుండా చూస్తున్నానని చెప్పారు. నటుడిగా నాన్న లెజెండ్ అని పేర్కొన్నారు. షూటింగ్ స్పాట్లో ఆయన గురించి చెబుతున్నప్పుడు తనకు అర్థమైందని అన్నారు. కథానాయికల్లో ఆయనకు సరైన జోడీ నగ్మా, రేవతి అని అన్నారు.ఇకపై నటనలో మరింత శ్రద్ధ చూపుతానని గౌతమ్‌కార్తీక్ చెప్పారు. -
తెర మీదకు మళ్లీ రచ్చ
► నగ్మాతో ఝాన్సీ ఢీ చెన్నై: రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌లో మళ్లీ రచ్చ తెర మీదకు వచ్చింది. మహిళా నేతల మధ్య విభేదాలు వెలుగులోకి రావడంతో శనివారం జరగాల్సిన సమావేశాన్ని సైతం రద్దు చేయడం గమనార్హం. రాష్ట్ర కాంగ్రెస్‌లో గ్రూపులకు కొదవ లేదన్న విషయం తెలిసిందే. అనుబంధ విభాగంలోనూ ఈ గ్రూపుల గొడవ తరచూ వెలుగు చూడడం జరుగుతోంది. మహిళా కాంగ్రెస్‌లో గతంలో చోటు చేసుకున్న విభేదాలు పోలీసుస్టేషన్ వరకు సాగాయి. అప్పటి రాష్ట్రపార్టీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ మద్దతుదారులు, మహిళా అధ్యక్షురాలు విజయధరణిల మధ్య ఈ వివాదం సాగింది. చివరకు విజయధరణి పదవి ఊడింది. కొత్త అధ్యక్షురాలుగా ఝాన్సీరాణి పగ్గాలు చేపట్టినా, ఆమెకు కూడా గ్రూపు సెగ తప్పలేదు. అస్సలు ఆమె నియామకాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఆందోళనే సాగింది. ఎట్టకేలకు అధిష్టానం మద్దతు ఝాన్సీకి దక్కడంతో గ్రూపులు వెనక్కు తగ్గాయి. ఝాన్సీ పగ్గాలు చేపట్టినానంతరం రాష్ట్ర విభాగం మీద జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ నగ్మా ప్రత్యేక దృష్టి పెట్టారు. మహిళా వార్: ఝాన్సీ పెత్తనం కన్నా, నగ్మా వాయిస్ ఆ విభాగంలో పెరిగిందని చెప్పవచ్చు. దీంతో కొద్ది రోజులుగా నగ్మా చెన్నైకు వస్తున్న సమాచారంతో ఝాన్సీ డుమ్మా కొట్టే పనిలో పడ్డారన్న సంకేతాలు వెలువడ్డాయి. ఝాన్సీ కుటుంబ వ్యవహారాలు మహిళా విభాగానికి కొత్త చిక్కులు తెచ్చి పెట్టడం ఖాయం అన్న ఫిర్యాదులు ఢిల్లీకి పెరగడంతో గత వారం చెన్నైకు వచ్చిన నగ్మా విచారించే పనిలో పడ్డట్టు సమాచారం. నగ్మా ప్రశ్నలకు ఝాన్సీ సమాధానాలు దాటవేసినట్టు, తన మీద పెత్తనం ఏమిటో అన్నట్టుగా ఆమె అసహనం వ్యక్తం చేసినట్టు మహిళా కాంగ్రెస్‌లో చర్చ సాగుతోంది. నగ్మా రాష్ట్రంలో పర్యటించేందుకు సిద్ధమైనా, అందుకు ఝాన్సీ నుంచి సహకారం కరువుతో ఈ ఇద్దరి మధ్య వివాదం ముదిరినట్టు అయింది. తమిళనాడు మీద నగ్మా ప్రత్యేక దృష్టి కేంద్రీకరించిన నేపథ్యంలో మహిళా విభాగం అధ్యక్షురాలి నుంచి సహకారం కొరవడడం ఆ విభాగంలోని విభేదాలను మళ్లీ తెర మీదకు తెచ్చాయి. ఎవరికి వారు అధిష్టానంకు ఫిర్యాదులు హోరెత్తించుకునే పనిలో పడడంతో, మరి కొద్ది రోజుల్లో మళ్లీ ఆ విభాగం అధ్యక్షురాలు మార్పు అనివార్యం అయ్యేనా..? అన్న ప్రశ్న తలెత్తింది. ఈ వివాదాల పుణ్యమా శనివారం సత్యమూర్తి భవన్వేదికగా జరగాల్సిన మహిళా విభాగం రాష్ట్ర స్థాయి సమావేశం అర్ధాంతరంగా రద్దు కావడం గమనార్హం. అస్సలే, రాష్ట్రంలో కాంగ్రెస్ బలం అంతంత మాత్రంగా ఉన్న సమయంలో పార్టీలోనే కాదు, మహిళల్లోనూ విభేదాలు రచ్చకెక్కడం ఏఐసీసీ పెద్దలకు శిరోభారంగా మారింది. నగ్మా పెత్తనం పెరగడమో లేదా, మరేదైనా కారణాలో ఏమోగానీ, ఆ పార్టీ అధికార ప్రతినిధి నటి కుష్బూ సైతం పార్టీ వ్యవహారాల్లో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తుండడం గమనించాల్సిన విషయం. -
స్టాలిన్‌తో నగ్మా బేటీ
సాక్షి, చెన్నై: డీఎంకే కార్య నిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌తో మహిళా కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి నగ్మా భేటీ అయ్యారు. సోమవారం అన్నా అరివాలయంలో అరగంట పాటుగా ఈ భేటీ సాగింది. మహిళా కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి నగ్మా గత కొంత కాలంగా తన దృష్టిని తమిళనాడు మీద పూర్తి స్థాయిలో కేంద్రీకరించి ఉన్నారు. మహిళా కాంగ్రెస్ బలోపేతం లక్ష్యంగా సమావేశాలు, కేడర్‌తో మమేకం అయ్యే విధంగా ముందుకు సాగుతున్నారు. తమిళనాడు, పుదుచ్చేరిలో పర్యటన నిమిత్తం ప్రత్యేక కార్యాచరణతో ఉరకలు తీస్తున్న నగ్మా ఆదివారం దక్షిణ భారత చలన చిత్ర సూపర్‌స్టార్ రజనీ కాంత్‌తో భేటీ అయ్యారు. ఈ భేటీ రాజకీయంగా చర్చకు తెర లేపిందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో సోమవారం అన్నా అరివాలయం చేరుకున్న నగ్మా డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌తో భేటీ అయ్యారు. ఆమెకు స్టాలిన్ సాధర స్వాగతం పలికారు. అరగంట పాటుగా తమిళ రాజకీయ పరిస్థితుల గురించి వీరి బేటీ సాగింది. అనంతరం మీడియాతో నగ్మా మాట్లాడుతూ డీఎంకే కార్య నిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న స్టాలిన్‌ను మర్యాద పూర్వకంగా కలిసినట్టు వివరించారు. డీఎంకే, కాంగ్రెస్ కలిసి కట్టుగా ముందుకు సాగుతున్న విషయాన్ని గుర్తు చేశారు. తమిళనాడులో పాలన మరీ దారుణంగా ఉందని ధ్వజమెత్తారు. పదవుల్ని, ప్రభుత్వాన్ని కాపాడుకోవడం మీద చూపుతున్న శ్రద్ధ ప్రజల మీద చూపించడం లేదని మండి పడ్డారు. ప్రభుత్వ ఖజానా దోపిడీ లక్ష్యంగా పాలకుల చర్యలు ఉన్నాయని ఆరోపించారు. ఇందుకు నిదర్శనం ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో ఆ నియోజకవర్గంలో ఓటు కోసం నోట్ల కట్టలు తాండవించడమేనని గుర్తు చేశారు. వైఎంసీఏలో వజ్రోత్సవం: జూన్ మూడో తేదీ ప్రజల్లోకి డీఎంకే అధినేత ఎం.కరుణానిధి రానున్నారన్న సమాచారాన్ని ఇప్పటికే ఆ పార్టీ వర్గాలు పేర్కొన్న విషయం తెలిసిందే. ఆయన జన్మదినోత్సవాన్ని రాజకీయ వజ్రోత్సవంగా జరుపుకునేందుకు డీఎంకే వర్గాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇందుకు వేదికగా చెన్నై వైఎంసీఏ మైదానాన్ని ఎంపిక చేశారు. ఈ విషయంపై స్టాలిన్ మీడియాతో మాట్లాడుతూ వైద్యుల సూచన మేరకు కరుణానిధి ఆ రోజున వేదిక మీదకు వచ్చే విషయాన్ని తర్వాత ప్రకటిస్తామన్నారు. అధినేత కరుణానిధి రాజకీయ వజ్రోత్సవ వేడుకకు జాతీయ స్థాయి, వివిధ రాష్ట్రాల నుంచి రాజకీయ ప్రముఖులు హాజరవుతారన్నారు. వైఎంసీఏ మైదానంలో ఏర్పాట్లకు నిర్ణయించామని తెలిపారు. -
రజనీకాంత్‌తో నగ్మా భేటీ
చెన్నై: ఆలిండియా మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, సినీనటి నగ్మా ఆదివారం తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను కలిశారు. శాలువా, పుష్పగుఛ్ఛంతో ఆయనను సత్కరించారు. వీరిద్దరూ ఏం మాట్లాడుకున్నారన్నది వెల్లడి కాలేదు. మర్యాదపూర్వకంగానే రజనీకాంత్‌ను నగ్మా కలిశారని సన్నిహితులు వెల్లడించారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్‌బేడీపై తీవ్రస్థాయిలో మండిపడిన మరుసటిరోజే నగ్మా.. రజనీకాంత్‌ను కలవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలన్న డిమాండ్లు పెరుగుతున్న నేపథ్యంలో వీరిద్దరి భేటీ చర్చనీయాంశంగా మారింది. రజనీకాంత్ కెరీర్లో సూపర్‌హిట్ సినిమా 'భాషా'లో నగ్మా హీరోయిన్గా నటించింది. -
కిరణ్‌బేడీపై నగ్మా సంచలన వ్యాఖ్యలు
పుదుచ్చేరి: పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్‌బేడీపై ఆలిండియా మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, సినీనటి నగ్మా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆమె ఫక్తు బీజేపీ ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారని ఆమె మండిపడ్డారు. విధులు నిర్వర్తించటానికి బదులుగా ఆమె కేంద్రానికి అనుకూలంగా పుదుచ్చేరిలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. పేద విద్యార్థులకు స్కాలర్షిప్పులు, పేదలకు రేషన్ బియ్యం పంపిణీతోపాటు ఇతర సంక్షేమ కార్యక్రమాలను అమలు కాకుండా కిరణ్‌బేడీ అడ్డుపడుతున్నారని నగ్మా విమర్శించారు. గవర్నర్ ఇలా ఎందుకు చేస్తున్నారో అర్థం కావటం లేదని అన్నారు. రాజకీయాలు మాని రాష్ట్ర అభివృద్ధికి సాయపడాలని లెఫ్టినెంట్ గవర్నర్‌ను కోరారు. బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం అవరోధాలు సృష్టిస్తోందని నగ్మా ఆరోపించారు. -
రెచ్చగొట్టిన నగ్మా... మౌనంగా కుష్బు
సాక్షి, చెన్నై : తమిళనాడు కాంగ్రెస్‌లో ఇద్దరు స్టార్స్ మధ్య వార్ వెలుగులోకి వచ్చింది. వేదికపై పక్క పక్కనే ఒకటిగా కూర్చున్న వాళ్లు, ఆ తర్వాత కయ్యానికి కాలు దువ్వుకోవడం కాంగ్రెస్‌లో చర్చకు దారి తీసింది. ఈ స్టార్స్ ఎవరో కాదు, ఒకరు కుష్బు, మరొకరు నగ్మా. రెచ్చగొట్టే వ్యాఖ్యలతో నగ్మా స్పందిస్తే... కళ్లతో చూడలేదు, చెవులతో వినలేదంటూ కుష్బు దాట వేయడం గమనార్హం. రాష్ట్ర కాంగ్రెస్‌లో వివిధ గ్రూపులుగా ఉన్న నేతల్ని ఏకం చేసి ఒకే వేదిక మీద కూర్చోబెట్టడంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు తిరునావుక్కరసర్ సఫలీకృతులయ్యారు. పార్టీలో సినీ స్టార్స్‌గా, జాతీయస్థాయి పదవుల్లో ఉన్న ఇద్దరు మహిళా నాయకుల్ని సైతం ఆ వేదిక మీదకు ఎక్కించి, ఐక్యత అంటే తమదే అని చాటుకున్నారు. ఉదయం సాగిన ఐక్యత, అదే రోజు సాయంత్రానికి పటాపంచలు అయినట్టుంది. శుక్రవారం ఉదయం నిరసనకు హాజరైన కుష్బు.. సాయంత్రం నగ్మా నేతృత్వంలో సత్యమూర్తి భవన్ వేదికగా సాగిన మహిళా కాంగ్రెస్ సమాలోచనకు గైర్హాజరైంది. దీనిని తీవ్రంగా పరిగణించిన నగ్మా.. సమాలోచన సమావేశంలో కుష్బును ఉద్దేశించి తీవ్రంగా విరుచుకుపడింది. అంతేకాకుండా.. ఉమ్మడి పౌర స్మృతి గురించి కుష్బు చేసిన వ్యాఖ్యలపై ఢిల్లీ పెద్దలకు ఫిర్యాదు చేయడానికి నగ్మా సిద్ధమైనట్టు సంకేతాలు వెలువడ్డాయి. పార్టీ అధిష్టానం వైఖరికి భిన్నంగా ఉమ్మడి పౌరస్మృతిపై కుష్బు స్పందించిన విషయం తెలిసిందే. స్టార్ వార్: కాంగ్రెస్‌లో వివిధ గ్రూపులుగా ఉన్న నేతలు తాజాగా ఒకే వేదిక మీదకు రాగా.. జాతీయ స్థాయి పదవుల్లో ఉన్న ఇద్దరు మహిళా నేతలు మాత్రం ఒకరినొకరు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసుకోవడం పార్టీలో కొత్త చర్చకు తెర లేపింది. మహిళా కాంగ్రెస్ సమావేశంలో నగ్మా తీవ్రంగా స్పందించిన వ్యాఖ్యలకు కొన్ని తమిళ పత్రికలు ప్రాధాన్యతను ఇచ్చాయి. సినిమాల్లో బొట్టు పెట్టుకుని నటించవచ్చు కానీ, వాస్తవిక జీవితంలో ఏ ముస్లిం మహిళ అలా చేయదని, అయినా, హిందూ వ్యక్తిని వివాహం చేసుకున్న వాళ్లకు ముస్లిం చట్టాల గురించి ఏమి తెలుసునంటూ కుష్బును ఉద్దేశించి నగ్మా మండిపడ్డారు. షరియత్ గురించి అసలు ఏమి తెలుసునని, ఉమ్మడి పౌర స్మృతికి మద్దతుగా కుష్బు ఆ వ్యాఖ్యలు చేశారో తెలుపాలంటూ మండిపడ్డారు. ఉదయం జరిగిన నిరసనకు హాజరైన వాళ్లకు , సాయంత్రం జరిగిన సమావేశానికి వచ్చే తీరిక లేదా..? అని కుష్బుపై నగ్మా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కష్టపడి పనిచేసే వాళ్లకు పదవులు అంటూ తీవ్రంగానే నగ్మా స్పందించినా, కుష్బు మాత్రం కళ్లతో చూడలేదు...చెవులతో వినలేదంటూ ఆమె వ్యాఖ్యలను తోసిపుచ్చడం గమనార్హం. -
ఐక్యతతో
► ఒకే వేదిక మీద ప్రత్యక్షం ► కాంగ్రెస్‌లో ఆనందం ► కుష్భు, నగ్మాల ప్రత్యేక ఆకర్షణ ► రాహుల్ అరెస్టుకు వ్యతిరేకంగా నిరసన ► ఇక, రాష్ట్ర పర్యటనలో తిరునావుక్కరసర్ రాష్ట్ర కాంగ్రెస్‌లో ఐక్యత రాగాలు వెల్లి విరిశాయి. ఒకే వేదిక మీద గ్రూపు నేతలందరూ ప్రత్యక్షం కావడం కాంగ్రెస్ వర్గాలకు ఆనందమే. ఇక, నగ్మా, కుష్భు ప్రత్యేక ఆకర్షణగా వేదిక మీద కన్పించడంతో ఉత్సాహం పెరిగింది. రాహుల్ అరెస్టును వ్యతిరేకిస్తూ శుక్రవారం చెన్నైలో సాగిన నిరసనలో ఐక్యత అంటే తమదే.. అనుమానాలు ఉంటే, నివృతి చేసుకోండంటూ టీఎన్‌సీసీ అధ్యక్షుడు తిరునావుక్కరసర్ వ్యాఖ్యానించడం కేడర్‌లో జోష్‌ను నింపింది. సాక్షి, చెన్నై : రాష్ట్ర కాంగ్రెస్‌లోని గ్రూపుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అధ్యక్ష పగ్గాలు ఎవరు చేపట్టినా, ఈ గ్రూపులతో సతమతం కావాల్సిందే. ఇటీవల తిరునావుక్కరసర్ అధ్యక్ష పగ్గాలు చేపట్టినానంతరం అందర్నీ ఒకే వేదిక మీదకు తెచ్చేందుకు తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు. తిరుచ్చి వేదికగా గత నెల జరిగిన కావేరి దీక్షలో కొంత మేరకు నేతల్ని ఏకం చేయడంలో సఫలీకృతులయ్యారు. మరి కొందరు దూరంగా ఉండడంతో, వారిని కూడా తాజాగా, ఏకం చేసి ఐక్యత అంటే, తమదే అన్న ధీమాను తిరునావుక్కరసర్ వ్యక్తం చేయడం విశేషం. కావేరి దీక్షకు దూరంగా ఉన్న నేతలు, ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ విషయానికి వచ్చే కొద్ది ఏకం కావడం ఆలోచించాల్సిందే. కాగా, మహిళా నేతలు కుష్భు, నగ్మా సైతం ఇన్నాళ్లు అంటి ముట్టనట్టుగా ఉన్న విషయం తెలిసిందే. ఈ ఇద్దర్నీ కూడా ఒకే వేదిక మీదకు తీసుకురావడంలో తిరునావుక్కరసర్ సఫలీకృతులయ్యారు. ఐక్యత రాగం : రాహుల్‌గాంధీని అరెస్టు చేసి, ఢిల్లీ పోలీసులు ముప్పుతిప్పలు పెట్టడాన్ని ఖండిస్తూ తమిళనాడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉదయం వళ్లువర్‌కోట్టం వేదికగా నిరసన కార్యక్రమం జరిగింది. ఇందులో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు తిరునావుక్కరసర్, మాజీ అధ్యక్షులు ఈవీకేఎస్ ఇళంగోవన్, తంగబాలు, కృష్ణస్వామి, కుమరి ఆనందన్, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం తనయుడు కార్తీ చిదంబరంలతో పాటు పార్టీఅధికార ప్రతినిధి కుష్భు, మహిళా విభాగం జాతీయ ప్రధాన కార్యదర్శి నగ్మా ప్రత్యక్షం అయ్యారు. నగ్మా, కుష్భు పక్క పక్కనే కూర్చుని ముచ్చటించుకోవడం కన్పించడం ఆ నిరసనలో ప్రత్యేక ఆకర్షణగా మారింది. మోదీపై సెటైర్లు : తిరునావుక్కరసర్ తన ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీని గురి పెట్టి తీవ్రంగా విరుచుకు పడ్డారు. రాహుల్‌ను అడ్డుకునేందుకు తీవ్ర కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇక, కాంగ్రెస్‌లో ఐక్యత అంటే ఇదే...అనుమానాలు ఉంటే, నివృతి చేసుకోండంటూ వ్యాఖ్యానించారు. ఈవీకేఎస్ ఇళంగోవన్ ప్రసంగిస్తూ, ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన మోదీకి అక్కడి బుద్దులు వంట బట్టినట్టుందని మండిపడ్డారు. సర్వాధికారిగా పెత్తనం చెలారుుంచేందుకు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌తో చెలాగాటాలు ఆడిన వాళ్ల పరిస్థితి ఏమిటో ఓ మారు గుర్తు చేసుకుంటే మంచిదని హితవు పలికారు. దేశాన్ని ఏలేందుకు అన్ని అర్హతలు రాహుల్‌కు ఉన్నాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. కుష్భు, నగ్మా ప్రసంగిస్తూ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ తీరును ఎండగట్టే విధంగా స్పందించారు. ప్రజల మీద చిత్తశుద్ధిలేదని, విదేశాలను చుట్టి రావడం మీదే ప్రధాని దృష్టి అంతా అంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్ర పర్యటన : ఈ నిరసనానంతరం తిరునావుక్కరసర్, నగ్మా సత్యమూర్తి భవన్లో మీడియాతో మాట్లాడారు. పార్టీ బలోపేతం లక్ష్యంగా తనతో పాటు అందరూ నాయకులు రాష్ట్రంలో పర్యటించనున్నట్టు ప్రకటించారు. ఉప ఎన్నికల్లో డీఎంకే అభ్యర్థులకు మద్దతుగా కాంగ్రెస్ స్థానిక నేతలు ప్రచారంలో దూసుకెళుతున్నట్టు పేర్కొన్నారు. స్థానిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, ముందుగానే, అందరు నేతల సమన్వయంతో రాష్ట్ర పర్యటన సాగుతుందని వివరించారు. కోయంబత్తూరు, తిరునల్వేలి, తంజావూరు, తిరువణ్ణామలై, చెన్నై, మదురై డివిజన్లలో ఆయా ప్రాంతాల్ని కలుపుతూ పార్టీ వర్గాలతో సమీక్షలు, సమావేశాలు, సంప్రదింపులు సాగుతాయని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, సివిల్ చట్టానికి మద్దతుగా కుష్బు చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ వర్గాల్ని ఇరకాటంలో పడేస్తుండడం గమనార్హం. నేతల మధ్య ఐక్యత కుదిరినా, ఈ మద్దతు వ్యవహారం చర్చకు వచ్చినట్టు సంకేతాలు ఉన్నారుు. అదే సమయంలో కుష్భుకు వ్యతిరేకంగా సోషల్ మీడియాల్లో స్పందించే వాళ్లూ పెరిగారు. -
బాక్సింగ్ చాంప్స్ నగ్మా, ప్రవళిక
అండర్-19 జూ. కాలేజి, స్కూల్ గేమ్స్ టోర్నీ సాక్షి, హైదరాబాద్: అండర్-19 జూనియర్ కాలేజి, స్కూల్ గేమ్స్ బాక్సింగ్ పోటీల్లో షేక్ నగ్మా, ప్రవళిక విజేతలుగా నిలిచారు. ఎల్బీస్టేడియంలోని బాక్సింగ్ హాల్లో బుధవారం జరిగిన బాలికల 44-46 కేజీల కేటగిరీలో నగ్మా (సుల్తాన్ వులూమ్ జూనియర్ కాలేజి) గెలుపొందగా, త్రిపూజ (కస్తూర్బా కాలేజి) రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ద్రివిత (మహబూబియా కాలేజి)కు మూడో స్థానం దక్కింది. 46-48 కేజీల కేటగిరీలో ప్రవళిక (మహబూబియా) టైటిల్ సాధించింది. ఇతర పోటీల ఫలితాలు: 48-52 కేజీల కేటగిరీ: 1.మాధవి (మహర్షి కాలేజి); 50-52 కేజీలు: 1. అభిలాష (సెరుుంట్జార్జ్ కాలేజి), 2.స్మిత్ (కస్తూర్బా); 52-54 కేజీలు: 1. తన్మరుు (నారాయణ), 2. ఉమారాణి (కస్తూర్బా); 54-57 కేజీలు: 1. శాని (సెరుుంట్ ఫ్రాన్సిస్), 2. అంజలి (వనిత), 3. శ్రుతి గుప్తా (కస్తూర్బా); 57-60 కేజీలు: 1. నాగమణి (కస్తూర్బా), 2. ప్రతిభ (వనిత); 60-63 కేజీలు: 1. జుబియా అఫ్రిన్ (ఎన్ఏఎస్ఆర్), 2. క్యాథలిన్ (వనిత), 3. మనీష (వనిత); 63-66 కేజీలు: 1. సారుుశ్రీ (ఆదర్శ కాలేజి); 66-70 కేజీలు: 1. తబసుమ్ (కస్తూర్బా); 70-75 కేజీలు: సోని సింగ్ (వనిత); 75-81 కేజీలు: 1. అక్షిత (నారాయణ), 81-86 కేజీలు: 1. నాగనిక (సెరుుంట్ఆన్స కాలేజి). -
మాకో చాన్స్ ప్లీజ్ !
రాష్ట్ర కాంగ్రెస్‌లో సమర్థులైన మహిళా నాయకురాళ్లు ఉన్నారని, వారిలో ఎవరో ఒకర్ని రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవికి ఎంపిక చేయాలన్నదే తన వ్యక్తిగత అభిప్రాయంగా ఏఐసీసీ మహిళా విభాగం కార్యదర్శి, ఆ విభాగం రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ నగ్మా వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదని ఆందోళన వ్యక్తం చేశారు. సాక్షి, చెన్నై: రాష్ర్ట కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఈవీకేఎస్. ఇలంగోవన్ రాజీనామా చేసి వంద రోజులు అవుతోంది. అయితే, ఇంత వరకు అధ్యక్ష నియామకం జరగలేదు. ఇందుకు కారణం, ఇక్కడి నాయకుల్లో సాగుతున్న గ్రూపు వివాదాలే. ఈ పరిస్థితుల్లో పురుషులకు దీటుగా తామూ ఇక్కడ పార్టీ కోసం పనిచేస్తున్నామని చాటే విధంగా మహిళల తరఫున నగ్మా గళం విప్పే పనిలో పడడం విశేషం. అది కూడా అధ్యక్ష పదవికి మహిళలు అర్హులే అంటూ, వారిలోనూ సమర్థులు ఉన్నారని, వాళ్లలో ఎవర్నో ఒకర్ని అధ్యక్ష పదవికి ఎంపిక చేయాలన్నదే తన వ్యక్తిగత అభిప్రాయంగా వ్యాఖ్యానించడం గమనించాల్సిన విషయమే. నగ్మా వ్యాఖ్యలు మహిళా నాయకుల్లో జోష్‌ను నింపాయి. మహిళకు చాన్స్ ప్లీజ్: బుధవారం రాష్ట్ర మహిళా కాంగ్రెస్ కార్యవర్గం భేటీ చెన్నైలో జరగనుంది. ఇందు కోసం ఢిల్లీ నుంచి నగ్మా చెన్నైకు వచ్చారు. ఆమెకు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు జాన్సీరాణి, నిర్వాహకులు మనోహరి, సరస్వతి, మైథిల్ దేవి సత్యమూర్తి భవన్లో ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా రాష్ట్ర మహిళా విభాగం ముఖ్య నాయకులతో నగ్మా సమాలోచన నిర్వహించారు. తదుపరి మీడియాతో మాట్లాడారు. ధరల పెరుగుదల ప్రజల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ధరల కట్టడికి కేంద్రం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. రైతు ఆత్మహత్యలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కావేరి జల వివాదం గురించి తనకు పూర్తిగా తెలియదంటూ, ఈ విషయంగా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు చర్చించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. తమిళనాడులో మహిళలకు భద్రత కరువైందని ఆందోళన వ్యక్తం చేశారు. స్వాతి హత్య మొదలు తూత్తుకుడిలో చర్చ్‌లో ప్రార్థనల్లో ఉన్న యువతి హత్య వరకు చూస్తుంటే, ఇక్కడ మహిళలకు ఉన్న భ ద్రత ఏ పాటిదో స్పష్టం అవుతోందన్నారు. మహిళ నాయకులకు కూడా భద్రత లేని పరిస్థితిని ఇక్కడ తీసుకొస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం స్పందించాలని, మహిళలకు రక్షణగా నిలబడే విధంగా చర్యల్ని వేగవం తం చేయాలన్నారు. పార్టీ అన్నాక సమస్యలు సర్వసాధరణమేనని, త్వర లో అధ్యక్షుడ్ని నియమించేందుకు తగ్గ కార్యచరణతో అధిష్టానం పెద్దలు ముందుకు సాగుతున్నారన్నారు. సమర్థులైన మహిళలు ఇక్కడ ఉన్నారని, వారిలో ఒకరికి రాష్ట్ర పార్టీ అధ్యక్ష అవకాశం కల్పించాలన్నదే తన వ్యక్తిగత అభిప్రాయంగా పేర్కొన్నారు. అయితే, తాను ఇక్కడి నాయకుల్ని(పురుషులు) కించ పరచడం లేదని, పార్టీకి స్త్రీ, పురుషులు అన్న బేధం లేదని, అందరూ సమానమే అని వ్యాఖ్యానించారు. కష్టపడి పార్టీ కోసం పనిచేసే వారికి తప్పకుండా పదవులు దక్కుతాయని, త్వరలో అధ్యక్షుడు ఎవరో అన్నది తేలుతుందని ముగించారు. ముందుగా, విల్లుపురం జిల్లా పార్టీ నాయకురాలు రీటా అంటోని ఇటీవల మగబిడ్డకు జన్మనిచ్చారు. తన బిడ్డను నగ్మాకు చూపించి, ఆమె చేత పేరు పెట్టించుకున్నారు. ఈ బిడ్డకు నల్లతంబి రబి ఆంటోని అని నగ్మా నామకరణం చేశారు. -
సల్మాన్ రేప్ వ్యాఖ్యలపై స్పందించిన నగ్మా
రేప్ పై సల్మాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై ఒక వైపు ట్విట్టర్ లో దుమారం రేపుతుండగా.. మరో వైపు కొంతమంది ప్రముఖులు ఆయన వ్యాఖ్యలపై స్పందించారు. తన సినిమా ‘సుల్తాన్’ నిర్మాణం పూర్తయిన తర్వాత తమ పరిస్థితి రేప్ కు గురైన మహిళలా ఉందంటూ సల్మాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలను సినీనటి, కాంగ్రెస్ మహిళా నేత నగ్మా ఖండించారు. సంప్రదాయబద్దమైన కుటుంబం నుంచి వచ్చిన సల్మాన్ ఖాన్ మహిళలపై చిన్నచూపు చూడటంపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అయితే సల్మాన్ ఖాన్ చేసిన పని తప్పే అయినా ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని అతని క్యారెక్టర్ ను శకించడం తగదని అన్నారు. బహుశా రేప్ బాధిత మహిళల జీవితం గురించి చెప్తూ ఇలా అని ఉండొచ్చని వ్యాఖ్యానించారు. ఇక రేప్ అనేది చిన్న విషయం అనే భావనను సల్మాన్ ప్రజల్లోకి పంపారని దీనిపై ఆయన క్షమాపణలు చెప్పినా ఉపయోగం ఉండదని ప్రముఖ కాలమిస్ట్ అన్నా ఎమ్. వెట్టికడ్ పేర్కొన్నారు. సల్మాన్ పై తనకు ఎలాంటి దురాభిప్రాయం లేదని కానీ, ఇలాంటి సంఘటనల్లో పురుషులకు వెన్నుదన్నుగా నిలబడటం ములాయం లాంటి వాళ్లకు సాయం చేసినట్లేనని, వాళ్లు అబ్బాయిలు వాళ్లు తప్పులు చేస్తూనే ఉంటారని అన్నావెట్టికాడ్ అన్నారు. మహిళలపై సల్మాన్ వ్యాఖ్యలు అతని మైండ్ సెట్ ను తెలియజేస్తున్నాయని జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ లలిత కుమారమంగళం అన్నారు. సల్మాన్ లాంటి సెలబ్రిటీలు పబ్లిక్ లో మాట్లాడే ముందు ఒకటికి రెండు మార్లు ఆలోచించుకోవాలని హితబోధ చేశారు. రేప్ అనే విషయాన్ని సల్మాన్ చిన్నవిషయంగా భావించలేదని, అయితే ఈ విషయంపై దేశమంతా ఇప్పుడు ఎక్కువగా స్పందించాల్సిన అవసరం లేదని పూజా బేడీ వ్యాఖ్యానించారు. -
నగ్మా అసంతృప్తి
టీనగర్ : విజయధరణికి అఖిల భారత మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పదవి లభించడంతో నటి నగ్మా అసంతృప్తికి గురయ్యారు. రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా విజయధరణి పనిచేసిన సమయంలో అఖిల భారత కాంగ్రెస్ నిర్వాహకురాలిగా నటి కుష్బూ నియమితులయ్యారు. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు ఇలంగోవన్‌కు మద్దతుగా కుష్బూ పనిచేయడంతో ఆమెకు, విజయధరణికి మధ్య తగాదాలు ఏర్పడ్డాయి. ఇది ఇలావుండగా నటి నగ్మాకు అఖిల భారత మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పదవిలో నియమించారు. దీంతో రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌లో నగ్మాకు ప్రత్యేకంగా ఒక వర్గం ఏర్పడింది. ఇటీవల రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి విజయధరణి తొలగించిన విషయం తెలిసిందే. ఆమె స్థానంలో దిండుగల్‌కు చెందిన ఝాన్సీరాణి నియమితులయ్యారు. దీంతో తనకు మళ్లీ మహిళా కాంగ్రెస్ పదవిలో నియమించాలంటూ విజయధరని ఢిల్లీ అధిష్టానం నేతలను కలసి వారిపై ఒత్తిడి తెచ్చారు. ఈ నేపథ్యంలో విజయధరణికి మహిళా కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవికి ఎంపిక చేశారు. నగ్మాకు సాటిగా విజయధరణికి అఖిల భారత మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పదవి అందజేయడంతో నగ్మా అసంతృప్తికి గురైనట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. -
అసెంబ్లీకి పోటీ చేస్తా: నగ్మా
టీనగర్: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అనుమతిస్తే అసెం బ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని అఖిల భారత మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, నటి నగ్మా తెలిపారు. ఆమె పుదుచ్చేరిలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కొందరు విలేకరులు ఆమెతో అసెంబ్లీ ఎన్నికల్లో పో టీ చే స్తారా? అని ప్రశ్నించారు. అందుకు నగ్మా బదులిస్తూ పార్టీ అధిష్ఠానం ( సోనియా) అనుమతిస్తే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని తెలిపారు. -
నాదంటే నాదంటున్న నగ్మా, కుష్బు
కాంగ్రెస్‌లో కుమ్ములాట ముగిసిన దరఖాస్తుల పర్వం చెన్నై: డీఎంకేతో కూటమి ఖరారైందే అదనుగా ఒకే స్థానం కోసం కాంగ్రెస్ పార్టీలో అప్పుడే కుమ్ములాట మొదలైంది. చెన్నై నగరం మైలాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నాకంటే నాకంటూ మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి నగ్మా, కాంగ్రెస్ అధికార ప్రతినిధి కుష్బు కుమ్ములాటకు సిద్ధమైనట్లు విశ్వసనీయ సమాచారం. ఈ ఇద్దరూ వెండితెర వేలుపులే కావడం విచిత్రం. చెన్నై మైలాపూర్ నియోజకవర్గాన్ని కూటమి పార్టీల కేటాయించడం డీఎంకేలో అనాదిగా వస్తున్న ఆనవాయితీ. 2001 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే-బీజేపీ కూటమిగా ఏర్పడగా బీజేపీ అభ్యర్థి కేఎన్ లక్ష్మణన్ మైలాపూర్ స్థానం నుంచి గెలుపొందారు. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే, కాంగ్రెస్, పీఎంకే పొత్తులో మైలాపూర్‌ను కాంగ్రెస్‌కే కేటాయించారు. అయితే ఈ స్థానం నుంచి పోటీచేసిన కాంగ్రెస్ అగ్రనేత తంగబాలు పరాజయం పాలయ్యారు. తాజాగా కాంగ్రెస్, డీఎంకేల మధ్య పొత్తును ఇటీవలే గులాంనబీ ఆజాద్ ఖరారు చేయడంతో రెండు పార్టీల నేతలు సీట్ల వెతుకులాటలో పడ్డారు. డీఎంకే సిద్ధాంతం ప్రకారం మైలాపూర్ స్థానం కాంగ్రెస్‌కేనని తేలిపోవడంతో ఇద్దరు నటీమణులు కన్నేశారు. నటి కుష్బు ఇల్లు ఇదే నియోజకవర్గ పరిధిలోని శాంతోమ్‌లో ఉంది. తాను నివాసం ఉంటున్న ప్రాం తం, ఇటీవల చెన్నైని వరదలు ముంచెత్తినపుడు సొంత ఖర్చుతో బాధితులకు సాయం చేయడం వంటి అనుకూలమైన అంశాలు ఉన్నందున కుష్బు కోరుతున్నారు. మైలాపూర్ నుండి కుష్బు పోటీచే సినట్లయితే గెలుపు ఖాయమని ఆమె అనుచరులు సైతం ఆశిస్తున్నారు. అంతేగాక మయిలై అశోక్ అనే కుష్బు అభిమాని ఆమె పేరున కాంగ్రెస్‌కు దరఖాస్తు కూడా దాఖలు చేసి ఉన్నా రు. అలాగే నటి నగ్మా సైతం తన లెక్కలు తాను చెబుతున్నారు. నగ్మా సోదరి జ్యోతిక మైలాపూర్ నియోజవర్గం పరిధిలోని బీసెంట్ నగర్లో కాపురం ఉంటున్నారు. చెన్నైకి వచ్చినపుడల్లా సోదరి ఇంటిలోనే ఆమె ఉంటారు. ఈ కారణాన్ని చూపి మైలాపూర్ కోసం నగ్మా కూడా పట్టుదలతో ఉన్నారు. మైలాపూర్ నుంచి పోటీకి అనుమతివ్వాల్సిందిగా జాతీయ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు షోబా ఓజాను నగ్మా కోరారు. అయితే ఆమె ఇందుకు తిరస్కరించినట్లు సమాచారం. ఈ విషయాన్ని సోనియా, రాహూల్ వద్దకు తీసుకెళ్లి ఒప్పించాలని నగ్మా ప్రయత్నాల్లో ఉన్నారు. మైలాపూర్ స్థానం కోసం పార్టీ పదవికి రాజీనామా చేసేందుకు సైతం నగ్మా సిద్ధమయ్యారు. పార్టీ పరంగా చూసుకుంటే కుష్బు కంటే నగ్మా సీనియర్ నేత. ఒకే స్థానానికి ఇద్దరు మహిళా నేతలు, పైగా ఇద్దరూ వెండితెరను ఏలి ప్రజాబాహుళ్యంలో ప్రచారం ఉన్నవారు కావడంతో రాష్ట్ర కాంగ్రెస్ తలనొప్పిగా మారింది. సత్యమూర్తి భవన్లో సందడి: మైలాపూర్ స్థానానికి పోటీపడుతున్న నగ్మా, కుష్బులు బుధవారం సత్యమూర్తి భవన్లో తమ తమ వర్గంతో సందడి చేశారు. వీరిద్దరితోపాటు టీఎన్‌సీసీ అధ్యక్షులు ఈవీకేఎస్ ఇళంగోవన్ కూడా ఉండి కార్యకర్తల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. కాంగ్రెస్ టిక్కెట్‌పై అసెంబ్లీకి పోటీచేయగోరు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించే కార్యక్రమం ఈనెల 10వ తేదీ నుంచి సత్యమూర్తి భవన్లో సాగుతోంది. డీఎంకే, కాంగ్రెస్‌ల మధ్య పొత్తు కుదరగానే దరఖాస్తు చేసేవారి సంఖ్య పెరిగింది. దీంతో ఈనెల 15వ తేదీతో ముగిసిన గడువును బుధవారం (17వ తేదీ)వరకు పొడిగించారు. ఈ లెక్కన బుధవారం చివరి రోజు కావడంతో పెద్ద సంఖ్య లో కాంగ్రెస్ కార్యకర్తలు సత్యమూర్తి భవన్‌కు చేరుకుని తమ దరఖాస్తులను అందజేశారు. దీంతో దరఖాస్తుల పర్వం ముగిసింది. డీఎంకే అభ్యర్థుల గెలుపుకోసం ప్రచారం చేస్తానని ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో నగ్మా ప్రకటించారు. రెండు అవినీతి పార్టీలు ఏకమయ్యాయంటూ డీఎంకే, కాంగ్రెస్ కూటమిపై డీఎండీకే అధినేత విజయకాంత్ సతీమణి ప్రేమలత విమర్శలు గుప్పించారు. అయితే డీఎండీకే తమ కూటిమిలో చేరుతుందని ఇళంగోవన్ విశ్వాసం వెలిబుచ్చారు. ప్రేమలత వ్యాఖ్యలు పరిగణలోకి తీసుకోం, ఎందుకంటే పార్టీ అధినేత విజయకాంత్ మాత్రమే, ఆయన మాతో వస్తారని నమ్మకం ఉందన్నారు. -
రంగంలోకి దిగిన నగ్మా..
♦ అంతా ఒక్కటే గ్రూపులకు నోచాన్స్ ♦ రాహుల్ ఆదేశాలకు కట్టుబడాల్సిందే ♦ మహిళా నేతలకు నగ్మా హెచ్చరిక ♦ వివాదాలు చక్కదిద్దేందుకు రంగంలోకి సాక్షి, చెన్నై: మహిళా కాంగ్రెస్‌లో గ్రూపులకు ఆస్కారం లేదు...అంతా ఒక్కటే...రాహుల్ ఆదేశాలకు కట్టుబడాల్సిందే.. అని మహిళా నేతలకు ఆ విభాగం జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ నగ్మా హెచ్చరికలు జారీ చేశారు. మహిళా కాంగ్రెస్‌లో నెలకొన్న వివాదాల్ని చక్కదిద్దేందుకు ఆమె రంగంలోకి దిగారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలోవలే, మహిళా విభాగంలోనూ గ్రూపు రాజకీయాలు బయలు దేరిన విషయం తెలిసిందే. విజయధరణి అధ్యక్ష పగ్గాలు చేపట్టినానంతరం ఈ రాజకీయం మరింతగా వేడెక్కాయి. ఇక, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు విజయధరణి ఏకంగా టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ను ఢీకొట్టడంతో వివాదం మరింతగా ముదిరింది. ఈ వ్యవహారాలు ఢిల్లీకి చేరి ఉండడంతో పరిస్థితుల్ని చక్కదిద్దేందుకు మహిళా విభాగం రాష్ర్ట ఇన్చార్జ్ , జాతీయ ప్రధాన కార్యదర్శి నగ్మా రంగంలోకి దిగారు. మహిళా నాయకుల్ని ఒకే వేదిక మీదకు తీసుకొచ్చి, తామంతా ఒక్కటే అని చాటేందుకు తీవ్ర కుస్తీల్లో పడ్డారు. ఇందులో భాగంగా మంగళవారం ఢిల్లీ నుంచి చెన్నైకు వచ్చిన నగ్మా మహిళా నేతలతో సమాలోచనలో పడ్డారు. మహిళా విభాగంలో సాగుతున్న గ్రూపుల్ని కట్టడి చేయడంతో పాటుగా, టీఎన్‌సీసీ వర్గాలతో ఏర్పడిన వివాదాన్ని చక్కబెట్టేందుకు కసరత్తుల్లో పడ్డారు. ఇక, మహిళా కాంగ్రెస్ నేతృత్వంలో పేదలకు సంక్రాంతి కానుకల పంపిణీ కార్యక్రమానికి హాజరైన నగ్మా విలేకరులతో మాట్లాడుతూ, గ్రూపులకు ఆస్కారం లేదని, అంతా ఒక్కటే...ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ ఆదేశాలకు కట్టుబడాల్సిందేనని మహిళా నేతలకు హెచ్చరికలు జారీ చేశారు. అంతా ఒక్కటే : మహిళా కాంగ్రెస్‌లో గ్రూపులకు చోటు లేదని, అందరూ ఒకే వేదికగా పని చేయాల్సిందేని హెచ్చరించారు. రాహుల్ ఆదేశాలతో విజయధరణి నియమితులయ్యారన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తెరగాలని హితవు పలికారు. ఎవరికి వారు ఇష్టారాజ్యంగా వ్యవహరించినా, మహిళా విభాగంలో గందరగోళాన్ని సృష్టించే ప్రయత్నం చేసినా రాహుల్ దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. చిన్న చిన్న సమస్యలు, వివాదాలు సహజం అని, అయితే, దానిని మరింత పెద్దది చేసుకోకుండా, సామరస్య పూర్వకంగా పరిష్కరించుకుని, అందరూ కలసి కట్టుగా ముందుకు నడవాలని పిలుపునిచ్చారు. టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్‌తో విజయధరణి వివాదం గురించి మీడియా ప్రశ్నించగా అందుకే తాను వచ్చానని, అన్ని సర్దుకుంటాయని వ్యాఖ్యానించారు. టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్‌కు తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని, ఆయనతో కలసి మహిళా నాయకులు ముందుకు సాగుతారని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. రాష్ర్టంలో శాంతి భద్రతలు క్షీణించాయని, వరద బాధితుల్ని ఆదుకోవడంలో అన్నాడీఎంకే సర్కారు పూర్తిగా విఫలం చెందిందంటూ మరో ప్రశ్నకు మండి పడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయ లోపంతో వరదల బారిన ప్రజలు పడ్డారని, అయితే, వారిని ఆదుకోవడంలోనూ నిర్లక్ష్యం, ఏక పక్షం కొట్టొచ్చినట్టు కన్పిస్తున్నదని ధ్వజమెత్తారు. రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్యే విజయధరణి, జాతీయ కార్యదర్శి హసీనా సయ్యద్ పాల్గొన్నారు. -
సల్మాన్ పెళ్లికి ఆ విషయానికి సంబంధం లేదు
పాట్నా: ప్రముఖ నటి, కాంగ్రెస్ నాయకురాలు నగ్మ సల్మాన్ ఖాన్ పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బిహార్‌లో పంచాయితీ ఎన్నికల్లో మహిళా సాధికారతకు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లిన ఆమెను ఓ పాత్రికేయుడు 50 ఏళ్ల సల్మాన్ పెళ్లి గురించి ప్రశ్నించాడు. దీంతో కొంత అసహనానికి గురైన ఆమె 'మహిళా సాధికారతకు సల్మాన్ ఖాన్ పెళ్లికి ఎలాంటి సంబంధం లేదు. అది ఆయన వ్యక్తిగతమైన విషయం, ఆయన ఇష్ట ప్రకారం పెళ్లి నిర్ణయం తీసుకుంటారు' అని తెలిపారు. ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్(ఏఐఎంసీ) జనరల్ సెక్రటరీగా ఉన్న నగ్మ.. బిహార్‌లో ఇటీవలి కాలంలో శాంతి భద్రతలు క్షీణించాయన్న వార్తలను కొంతమంది వ్యక్తుల అభిప్రాయంగా కొట్టిపారేశారు. 'నేను ఇక్కడ మూడు రోజులుగా మహిళలతో సమావేశమౌతున్నాను కానీ శాంతి భద్రతలు సరిగా లేవని ఎవరూ పేర్కొనలేదు' అని నితీశ్ కుమార్ పాలనను నగ్మ వెనుకేసుకొచ్చింది. -
నగ్మాకు ఆహ్వానం
టీనగర్: కాంగ్రెస్ నాయకురాలు నగ్మాను ఈ నెల 22వ తేదీన చెన్నై సత్యమూర్తి భవన్ కు ఆహ్వానించేందుకు తమిళనాడు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు నిర్ణయించారు. అఖిల భారత మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నియమించబడిన నగ్మా గత 16వ తేదీన చెన్నై చేరుకున్నారు. ఆ రోజున ఆమె సత్యమూర్తి భవన్లో విలేకరులను కలుసుకోనున్నట్టు ప్రకటించారు. అయితే ఆఖరి క్షణంలో ఆమె సత్యమూర్తి భవన్ కార్యక్రమాన్ని రద్దు అయింది. విమానాశ్రయంలోను, నగ్మా ఆహ్వాన కార్యక్రమంలో కలకలం చెలరేగింది. మహిళా కాంగ్రెస్ ఆధ్యక్షురాలు, ఎమ్మెల్యే విజయధరణి తరపున ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ నిర్వాహకులు పాల్గొన్నారు. మరుసటి రోజు తూత్తుకుడిలో జరిగిన కాంగ్రెస్ మండల మహానాడులో నగ్మా పాల్గొనేందుకు ఆసక్తితో ఉండగా చివరి సమయంలో ఆ కార్యక్రమం కూడా రద్దయింది. 22 న ఆహ్వానం ఈ నెల 22వ తేదీన నగ్మాను సత్యమూర్తి భవన్‌కు ఆహ్వానించేందుకు నిర్వాహకులు నిర్ణయించారు. దీని పై రాష్ట్ర మహిళా కాంగ్రెసు అధ్యక్షురాలు విజయతారణి మాట్లాడుతూ గత 4 వ తేదీ నుంచి పర్యటిస్తున్నానని, నగ్మా వచ్చిన రోజున చెన్నైలో లేనందున ఆహ్వానించడానికి వీలు కాలేదన్నారు. దీంతో నిర్వాహకులను పంపినట్లు తెలిపారు. 22 వ తేదీ విజయదశమి రోజున సత్యమూర్తి భవన్లో మహిళా కాంగ్రెస్ భవనం ప్రారంభోత్సవం జరగనుందని, ఈ కార్యక్రమానికి నగ్మా, కుష్బూలను ఆహ్వానించామన్నారు. కార్యక్రమంలో నెహ్రూ 125 వ పుట్టిన రోజును పురస్కరించుకుని ఆయన సంస్మరణ లేఖ విడుదల కార్యక్రమం జరుగనుందన్నారు. -
‘నగ్మా’ రచ్చ!
చెన్నై : రాష్ట్ర కాంగ్రెస్‌లో గ్రూపులకు కొదవ లేదు. ఇదే రాజకీయం మహిళా విభాగంలోనూ సాగుతూ వస్తోంది. రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్ష పగ్గాల్ని చేజిక్కించుకునేందుకు పలువురు సీనియర్ మహిళా నేతలు తీవ్రంగానే కుస్తీలు పట్టారు. చివరకు ఆ పదవి ఎమ్మెల్యే విజయధరణిని వరించింది. ఈ నియామకంతో గ్రూపులు మరింతగా పెరిగాయి. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్‌లో నటీమణుల తాకిడి పెరగడం, వారికి పెద్ద పదవులే కట్టబెట్టడం జరుగుతోంది. ఆ కోవలో నటి కుష్బు, నగ్మాలు కూడా తీసుకోవచ్చు. అయితే, ఆదిలోనే హంసపాదు అన్నట్టుగా నగ్మాకు గ్రూపు సెగ పెద్దగానే తగిలినట్టు సమాచారం. అదే సమయంలో గ్రూపులకు కళ్లెం పెట్టే రీతిలో వ్యవహరించే క్రమంలో చివరకు నగ్మా రచ్చకెక్కారు. నగ్మా గురువారం విమానాశ్రయంలో వ్యవహరించిన తీరు వివాదాస్పదం కావడంతో మహిళా నేతలు అగ్గిమీద గుగ్గిలంలా మండి పడుతున్నారు. మహిళా కాంగ్రెస్ ఇన్చార్జ్ నగ్మా చెన్నైకు వస్తున్న సమాచారం ఢిల్లీ నుంచి రావడంతో ఆహ్వాన ఏర్పాట్లకు ఓ కమిటీని రాష్ర్ట అధ్యక్షురాలు విజయధరణి నియమించారు. ఈ క్రమంలో గురువారం రాత్రి చెన్నైకు చేరుకున్న నగ్మాను ఆహ్వానించేందుకు వెళ్లిన మహిళా కాంగ్రెస్ వర్గాలకు పెద్ద షాక్ తగిలినట్టు సమాచారం. దీంతో ఆహ్వానం పలికేందుకు వెళ్లిన వారు ఆగమేఘాలపై విజయధరణికి ఫిర్యాదు చేసినట్టు, తక్షణం స్పందించిన ఆమె నగ్మాను ఫోన్లో సంప్రదించినట్టు తెలిసింది. దీంతో వ్యవహారం ముదిరినట్టైంది. శుక్రవారం సత్యమూర్తి భవన్లో జరగాల్సిన కార్యక్రమాన్ని సైతం నగ్మా రద్దు చేసుకోవడం గమనార్హం. మరోవైపు మహిళా కాంగ్రెస్‌లోని గ్రూపు సెగ కారణంగానే ఆహ్వానాన్ని తిరస్కరించి, శుక్రవారం సత్యమూర్తి భవన్‌కు దూరంగా ఉండాల్సిన పరిస్థితి నగ్మాకు ఏర్పడ్డట్టు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. రాష్ట్ర మహిళా కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్గా నగ్మా నియామకాన్ని కుష్బుతో పాటుగా పలువురు గ్రూపు మహిళా నాయకులు వ్యతిరేకిస్తున్నట్టుగా ఇప్పటికే ప్రచారం ఉంది. మహిళా ఇన్చార్జ్ వస్తున్న వేళ నాయకులెవ్వరూ కానరాక పోవడం, కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించే యత్నం చేయడంతోనే నగ్మా వారి ఆహ్వానాన్ని తిరస్కరించినట్టు చెబుతున్నారు. అయితే, మహిళా కాంగ్రెస్ వర్గాల వాదన మరోలా ఉంది. నగ్మా చర్యల్ని ఖండిస్తున్నామని, ఆమెపై అధిష్టానానికి ఫిర్యాదు చేయనున్నామని మండి పడుతున్నారు. అయితే, ఇంతకీ నగ్మా ఆహ్వానం తిరస్కరించడానికి కారణాన్నిమహిళా కాంగ్రెస్ వర్గాలు స్పష్టం చేయడం లేదు. అయితే, టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ సమక్షంలో రాష్ట్ర వ్యవహారాల బాధ్యతలు స్వీకరిస్తారనుకున్నకార్యకర్తలకు భంగపాటు తప్పలేదు. దీంతో ఆమె తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీఎన్‌సీసీ అధ్యక్షుడు ద్వారా అధిష్టానానికి ఫిర్యాదు చేయడానికి సమాయత్తం అవుతున్నారు. వచ్చీరాగానే, రాష్ట్ర కాంగ్రెస్‌లో హాట్ టాపిక్‌గా నగ్మా రచ్చకెక్కింది. -
పాపం
ఆడ బిడ్డకు జన్మనిచ్చిందని ఆలిని వేధిస్తున్నాడో భర్త.. మొదటి సంతానంగా మగబిడ్డను కని.. రెండో కాన్పులో ఆడ బిడ్డను ప్రసవించిందని భార్య ముఖం చూడనన్నాడు మరో మగాడు ఆడ బిడ్డల్ని కనడమే ఆ తల్లులు చేసిన ‘పాప’మైంది. దిక్కు తోచని స్థితిలో చంటిబిడ్డలతో ఆ తల్లులు మంగళవారం మదనపల్లె పోలీసులను ఆశ్రయించారు. ఆ దంపతులది అనోన్య కాపురం.. పెద్దల కుదిర్చిన పెళ్లితో సుఖంగా జీవనం సాగించారు. వారి మధ్య ఏ గొడవలూ లేకుండా దాంపత్య జీవితం సాగిస్తున్న వేళ ఆడబిడ్డల సంతానం చిచ్చురేపింది. ఆడబిడ్డలను కనడమే వారు చేసిన పాపం. రెండు వేర్వేరు చోట్ల వనితలకు అవమానం జరిగింది. వారి భర్తలే వేదింపులకు గురి చేశారు. తట్టుకో లేక మంగళవారం ఇద్దరు చంటి బిడ్డల తల్లులు మదనపల్లె షీటీం పోలీసులను ఆశ్రయించారు. - ఆడబిడ్డల్ని కనడమే నేరమా.. - వేర్వేరు చోట్ల భార్యలను వేధించిన భర్తలు - షీటీం పోలీసుల్ని ఆశ్రయించిన చంటిబిడ్డల తల్లులు మదనపల్లె రూరల్: బి.కొత్తకోటకు చెందిన ఆర్టీసీ విరామ ఉద్యోగి ఎస్.అస్మత్ కుమారుడు జాఫర్‌కు, వాల్మీకిపురానికి చెందిన నగ్మా(20)కు రెండేళ్ల క్రితం పెళ్లి అయింది. ఏడాది పాటు సజావుగా సాగిన వీరి కాపురంలో ఆడబిడ్డ పుట్టడం సమస్యగా మారింది. ‘ఆ బిడ్డను తీసుకుని వెళ్లిపో.. నాకు కనపడవద్దు’ అంటే ఏడాదిగా భర్త ఆమెను వేధిస్తుండడంతో వారం రోజులక్రితం పుట్టింటికి చేరింది. అతనితో కాపురం చేయలేనమ్మా అంటూ తల్లిదండ్రుల ఎదుట కన్నీటి పర్యంతమైంది. కూతురు కంట తడిపెట్టడం చూడలేక ఆమె తల్లిదండ్రులు నగ్మాను తీసుకుని మంగళవారం మదనపల్లె టుటౌన్‌లోని షీటీం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరో వివాహితదీ అదే పరిస్థితి. మదనపల్లె పట్టణంలోని చీకలగుట్టకు చెందిన ఆటోడ్రైవర్ రెడ్డిశేఖర్‌కు, నగిరిమడుగుకు చెందిన శైలజ(20)కు నాలుగేళ్ల క్రితం పెళ్లి అయింది. ఈ క్రమంలో వారికి ఇద్దరు పిల్లలు. మొదటి సంతానం మగబిడ్డకాగా రెండో సంతానంగా ఆడబిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డ పుట్టినప్పటి నుంచి ఇంట్లో ఒకటే గొడవ. చివరకు భర్త ఇంటికి రాకపోవడం, పిల్లల బాగోగులు చూడకపోవడంతో పస్తులుండలేక నెల క్రితం శైలజ పుట్టింటికి వెళ్లింది. మదనపల్లె షీ టీం పోలీసులకు ఫిర్యాదు చేస్తే మీ కాపురం నిలబడుతుందని స్థానికులు చెప్పడంతో శైలజ మంగళవారం షీటీం పోలీసులను ఆశ్రయించింది. కో ఆర్డినేటర్ రామాదేవి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
హాలీవుడ్లో ఊర్వశీ... ఊర్వశీ...
‘ఊర్వశీ.. ఊర్వశీ... టేకీటీజీ పాలసీ...’ అనే పాట వినగానే, ఓ ఇరవయ్యేళ్లు వెనక్కి వెళ్లిపోతాం. ప్రభుదేవా, నగ్మా నటించిన ‘ప్రేమికుడు’లోని ఈ పాటను ఎ.ఆర్. రహమాన్ స్వరపరచిన విషయం తెలిసిందే. అప్పట్లో ఎక్కడ విన్నా ఈ పాటే. ఇప్పటికీ ఈ పాటకున్న క్రేజ్ తగ్గలేదు. అందుకు ఓ ఉదాహరణ చెప్పాలంటే.. ప్రపంచ సంగీతప్రియులకు సుపరిచితుడైన రాపర్ విల్.ఎ.యామ్ ‘ఊర్వశి...’ పాటను ఆదర్శంగా తీసుకుని, ‘బర్త్‌డే..’ అనే పాట తయారు చేశారు. దీని గురించి రహమాన్ మాట్లా డుతూ -‘‘విల్.ఐ.యామ్‌తో కలిసి ‘ఊర్వశి...’ పాట ట్యూన్‌ని పునసృష్టించడం ఆనందంగా ఉంది. కొత్త ఫ్లేవర్‌లో ఈ ట్యూన్ సాగుతుంది’’ అన్నారు. స్వతహాగా రచయిత అయిన విల్.ఎ.యామ్‌తో కలిసి ఈ ‘బర్త్‌డే’ పాటను రహమాన్ రాశారు. ఈ పాట ఆవిష్కరణ ఇటీవలే జరిగింది. జూలై 6 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. -
తారలు హిట్!.. ఫట్!!
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల సమరంలో వివిధ పార్టీల తరఫున ఎంపీ స్థానాల్లో పోటీకి దిగిన సినీతారల్లో కొందరిని విజయం వరించగా, మరి కొందరు అపజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. విజయం వరించిన తారలు: హేమమాలిని, శతృఘ్నసిన్హా, పరేశ్ రావల్, వినోద్ ఖన్నా, కిరణ్‌ఖేర్, మనోజ్ తివారీ(బీజేపీ), మూన్‌మూన్‌సేన్ (తృణమూల్), ఇన్నోసెంట్ (స్వతంత్ర). ఓడినతారలు: నగ్మా, కునాల్‌సింగ్, రాజ్ బబ్బర్(కాంగ్రెస్), స్మృతి ఇరానీ(బీజేపీ), జయప్రద(ఆర్ఎల్డీ), రాఖీసావంత్ (రాష్ట్రీయ ఆమ్ పార్టీ), -
చిక్కుల్లో నగ్మా
సినిమాల్లో డైరెక్టర్ చెప్పినట్టు నటించి, డైలాగ్ రైటర్ రాసిన డైలాగులు చెప్పడం అలవాటైన నటి నగ్మాకి సభల్లో ఎలాంటి ప్రాంప్టింగూ లేకుండా మాట్లాడటం మహా ఇబ్బందికరంగా మారింది. ఆమె అవగాహన లేని మాటలు మాట్లాడుతూ రాజకీయాల్లో అనుభవ రాహిత్యాన్ని చాటుకుంటున్నారు. ఇటీవల మోడీకి ఓటేయనివారు పాకిస్తాన్ వెళ్ళిపోవాల్సిందేనంటూ బిజెపి నాయకుడు గిరిరాజ్‌సింగ్ చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించాలనుకున్నారు నగ్మా. ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించే క్రమంలో..''భారతరత్న''ను కాశ్మీర్ వేర్పాటు వాద ఉద్యమనాయకుడు సయ్యద్ ఆలీషా గిలానీకి ఇచ్చేశారు నగ్మా. మోడీకి ఓటేయకుంటే..భారతరత్న గిలానీజీ కూడా పాకిస్తాన్ వెళ్ళిపోవాల్సిందేనా అంటూ తప్పులో కాలేశారు. భారతీయులంతా గౌరవించే విఖ్యాత షెహనాయ్ విద్వాంసుడు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ పేరు చెప్పబోయి నగ్మా గిలానీ పేరుచెప్పివుంటారని ఆమె ఎంపీగా పోటీ చేస్తున్న మీరట్ కాంగ్రెస్ నేతలు ఆమెను సమర్ధించే ప్రయత్నం చేశారు. ఏది ఏమైనా నగ్మా సభలకు మాత్రం జనం పెద్ద సంఖ్యలో జనం వస్తున్నారు. అయితే నగ్మా ప్రచారానికి వెళ్ళిన ప్రతిచోటా ఏదో ఒకటి జరుగుతోంది. ముఖ్యంగా కార్యకర్తలు ఆమెచుట్టూ మూగేస్తున్నారు. అభిమానులు ఆమెను దగ్గరనుంచి చూసే ప్రయత్నంలో తోపులాటలు సర్వసాధారణమైపోతున్నాయి. పనిలోపనిగా ఆకతాయిలు ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. నామినేషన్ వేసిన మర్నాడే.. ఓ ఎమ్మెల్యే ఆమెను పబ్లిగ్గా ముద్దుపెట్టుకున్నాడు. మరోచోట అతిచొరవ చూపిన ఓ కాంగ్రెస్ కార్యకర్త చెంప పగులగొట్టారు నగ్మా. ఇలా.. నామినేషన్ దాఖలు చేసినప్పటి నుంచి సొంతపార్టీ నాయకులు, కార్యకర్తల నుంచే వేధింపులు ఎదుర్కొంటున్నారు. అయితే.. వీటిని లైట్ తీసుకుంటున్న నగ్మా ఎవరిపైనా కంప్లయింట్ ఇవ్వలేదు. మామూలు సమయంలో అయితే ఏం చేసేవారో గానీ, ఎన్నికల వేళ..సొంతపార్టీ నేతలు, కార్యకర్తలపై పోలీస్ కంప్లైంట్ ఇచ్చి రిస్కు తీసుకోవడం ఎందుకన్నదే ఆమె ఆలోచన కావచ్చు. ఈ ఎన్నికల్లో రాజకీయ అరంగేట్రం చేసిన నగ్మా.. ఆఖరికి సినిమాలో లాగా అంతా సుఖాంతం చేసుకుంటారా లేక ఎన్నికల తరువాత షూటింగ్ అయిపోయింది, ఇక రంగు తుడిచేసుకుందాం అనుకుంటుందా అన్నది త్వరలో తేలిపోతుంది. -
పాంచ్ పటాకా:స్టార్ అభ్యర్థుల ప్రచార పాట్లు
ఎన్టీఆర్, ఎంజీఆర్ ల పుణ్యమా అని రాజకీయాల్లోకి సినీ స్టార్లు రావడం ఇప్పుడు మామూలైపోయింది. హీరోయిన్లు కూడా ఒకరొకరుగా రంగంలోకి దిగుతున్నారు. ఈ సారీ అయిదుగురు ప్రముఖ స్టార్లు రంగంలోకి దిగారు. వీరంతా ఫేడౌట్ అయిన స్టార్లే. కానీ స్టార్ స్టేటస్ కి మాత్రం ఏ మాత్రం కొరత లేదు. అయిదుగురు సినీ స్టార్ల ప్రచారం ఎలా ఉందో ఓ సారి చూద్దాం. మూన్ మూన్ సేన్ - సిరివెన్నెల హీరోయిన్ మూన్ మూన్ సేన్ తృణమూల్ కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తోంది. తల్లి సుచిత్రా సేన్ పేరును, కూతుళ్లు రీమా, రైమా సేన్ పేర్లను చెప్పుకుని ప్రచారం చేసుకుంటోంది ఈ తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి. అంత వరకూ బాగానే ఉంది. కానీ ఈమె రోడ్ షో చేయాలంటే ముందు మొత్తం రోడ్డు రోడ్డంతా నీళ్లతో కళ్లాపి చల్లాలట. లేకపోతే ఆమె బండి కదలదు. చేయి ఊపదు. ఎందుకంటే దుమ్ము ధూళి నుంచి గ్లామర్ ను కాపాడుకోవడమే ఈ నడివయస్సు నటికి చాలా ముఖ్యం. హేమా మాలిని - ఈ షోలే బసంతి గొడుగు లేకపోతే ప్రచారమే చేయదు. ఎండ, ఉక్కపోత అంటే ఈమెకు మహా ఎలర్జీ. అందుకే ఎయిర్ కండీషన్ కార్ నుంచి బయటకు రాను అంటూ మంకుపట్టు పడుతోందట. పాపం బిజెపి కార్యకర్తలు ఆమెను బ్రతిమలాడి, బామాలి కారు నుంచి బయటకు తెప్పించారు కానీ గొడుగు వదిలేలా చేయలేకపోతున్నారు. 'మన గుర్తు కమలం కాదు. గొడుగు అని ప్రజలు పొరబడతారేమో' అని బిజెపి కార్యకర్తలు భయపడుతున్నారట. జయప్రద - రాజమండ్రి నుంచి బిజ్నోర్ కి చాలా దూరం. కానీ జయప్రదకు యూపీ రాజకీయాలు, యూపీ భాష బాగానే పట్టుబడ్డాయి. రెండు సార్లు ఎంపీ అయిన ఆమెకు అనుభవంలో కొరతేమీ లేదు. లేనిదన్నా ఒక్క సమయపాలనే. రాష్ట్రీయ లోకదళ్ తరఫున స్టార్ కాంపెయినర్ అయిన జయప్రద ఏడు గంటలకు ఒక సభకు రావాలంటే, ఆమె వచ్చే సరికి పది దాటిపోతుంది. ప్రచార సమయం అయిపోయింది కాబట్టి నమస్కారాలతో సరిపెట్టేస్తున్నారు. నగ్మా - కాంగ్రెస్ తరఫున యూపీ నుంచే బరిలో ఉన్నారు. ఈమె రూటే వేరు. కార్యకర్తలు ఈమెను ముద్దు పెట్టుకుంటున్నారు. ఈమె వారిని లాగి లెంపకాయ కొడుతున్నారు. గురువారం ఈమె రోడ్ షో చేయాల్సి ఉంటే ఆమె వచ్చారు. కానీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆబ్సెంట్ అయిపోయారు. దాంతో ఆమెకు సినిమాల్లో వచ్చినట్టే కోపం వచ్చింది. రుసరుసలాడుతూ విసవిసా వెళ్లిపోయింది. స్మృతి ఇరానీ - నటి నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వారిలో చాలా తక్కువ మంది స్మృతి ఇరానీలాగా తమను తాము మార్చుకోగలరు. ఆమె నిత్యం అధ్యయనం చేస్తారు. ఆమె బ్రహ్మాండమైన డిబేటర్. వాదనలో కానీ, ప్రసంగంలో కానీ ఆమెను తట్టుకోవడం ప్రత్యర్థులకు చాలా కష్టం. స్టార్ నకరాలు కనిపించకుండా జాగ్రత్త పడతారు స్మృతి. అయితే ఆమె పోటీ పడుతున్నది రాహుల్ గాంధీతో. ఆమె అన్నిటికీ సిద్ధమై రంగంలోకి దిగారు మరి. -
అందాల భామలకు అదనపు రక్షణ...
ఎన్నికల బరిలోకి దిగిన బాలీవుడ్ అందాల భామలు హేమమాలిని, నగ్మాలకు అదనపు రక్షణ కల్పించాల్సిందిగా ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. వీరిద్దరూ ఉత్తరప్రదేశ్ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మీరట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నగ్మా ఇటీవల మూడు సందర్భాల్లో ఆకతాయిల వేధింపులను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఇక నిన్నటితరం ‘డ్రీమ్‌గర్ల్’ హేమమాలిని మథుర నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు. ప్రచారానికి ఎక్కడకు వెళ్లినా జనం ఎగబడుతుండటంతో ఆమెకూ ఇబ్బందులు తప్పడం లేదు. -
ముద్దుగుమ్మలకు ఎన్నికల తిప్పలు
గ్లామర్ ప్రపంచంలో వారికి చుట్టూ బౌన్సర్లు ఉంటారు, దర్శకుల దగ్గర్నుంచి లైట్ బోయ్ వరకు ప్రతి ఒక్కరూ మేడమ్, మేడమ్ అంటూ అడుగులకు మడుగులొత్తుతారు. ఆ గ్లామర్‌ను ఉపయోగించుకుని రాజకీయాల్లోకి వద్దామనుకునేసరికల్లా వాళ్లకు ఎక్కడలేని తిప్పలు వచ్చిపడుతున్నాయి. ఒకప్పుడు హీరోయిన్ పాత్రలు, నిన్న మొన్నటివరకు అత్త పాత్రలలో నటించి.. ఈమధ్యకాలంలో భోజ్‌పురి సినిమాల్లో పాత్రలు వెతుక్కుంటున్న నటి నగ్మా. ఆమె ఇప్పుడు మీరట్ స్థానం నుంచి లోక్‌సభకు పోటీ చేస్తున్నారు. ఇప్పటికే మూడు నాలుగు సార్లు ఆమె మీద కొంతమంది తమ 'వీరాభిమానం' ప్రదర్శించారు. గజరాజ్ సింగ్ అనే ఎమ్మెల్యే అయితే ఏకంగా ఆమెను ముద్దుపెట్టుకున్నారు కూడా. నగ్మాను బహిరంగంగా పొదివి పట్టుకుని మరీ బుగ్గమీద ముద్దుపెట్టుకున్నా కూడా సదరు గజరాజుపై కాంగ్రెస్ పార్టీ ఎలాంటి చర్యలు తీసుకోడానికి సాహసించలేకపోయింది. ఎందుకంటే, నగ్మాపోటీ చేస్తున్న నియోజకవర్గంలో ఉన్న ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆయనే. అందుకే ఆయన్ని ముట్టుకునే సాహసం పార్టీ చేయడం లేదు. పోనీలే అని నగ్మా కూడా చూసీ చూడనట్లు వదిలేసింది. అంతలోనే రెండు రోజుల్లోపే మరో సంఘటన జరిగింది. ఈసారి ఏకంగా ఓ వ్యక్తి మీరట్ సభలో ఆమె మీద చెయ్యేశాడు. దాంతో పట్టలేని కోపం వచ్చిన నగ్మా.. అతగాడి చెంప చెళ్లుమనిపించింది. నగ్మా సంగతి ఇలా ఉంటే, అలనాటి కలల సుందరి (డ్రీమ్ గాళ్) హేమమాలిని పరిస్థితి కూడా ఏమంత భిన్నంగా లేదు. ఉత్తరప్రదేశ్‌లోని మథుర స్థానం నుంచి పోటీచేస్తున్న హేమ కూడా ప్రచారంలో చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. సభలకు వస్తున్న ప్రజలు ఆమెకు వీలైనంత దగ్గరగా వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో వీరిద్దరికీ అదనపు భద్రత కల్పించాలని ఎన్నికల కమిషన్ కూడా యూపీ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. వీళ్లిద్దరితో పాటు మొరాదాబాద్ నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి బేగమ్ నూర్ బానోకు కూడా అదనంగా భద్రత కల్పించాలని ఆదేశించింది. -
వివాదాల నగ్మాకు విజయం దక్కుతుందా?
తెలుగు, తమిళ, భోజ్ పూరి, హిందీ చిత్రాల్లో తనదైన ముద్ర వేసుకున్న సినీనటి నగ్మా ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా మారింది. ఉత్తర ప్రదేశ్ లోని మీరట్ లోకసభ స్థానం నుంచి పోటి చేస్తున్న నగ్మా పలు అవమానాలు, వివాదస్పద సంఘటనల మధ్య ప్రచారంలో ముందుకు దూసుకెళ్తోంది. బీజేపీ, బీఎస్పీ, ఎస్పీ, ఆమ్ ఆద్మీపార్టీ లాంటి పార్టీల ప్రభావం ఉన్న మీరట్ లో బహుముఖ పోటి నెలకొని ఉంది. అయితే అసలే కాంగ్రెస్ దేశవ్యాప్తంగా ఎదురుగాలి వీస్తోంది.. ఆపై బహుముఖ పోటి కష్టంగా మారిన నేపథ్యంలో ఆపార్టీకి చెందిన నేతలే నగ్మాను కష్టాల్లోకి నెడుతున్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఓ ర్యాలీ సందర్భంగా నగ్మాను పబ్లిక్ గా ముద్దు పెట్టుకోవడం వివాదస్పదంగా మారింది. అంతేకాకుండా కొందరు కార్యకర్తలు దురుసుగా ప్రవర్తించడంతో నగ్మా చేయి చేసుకున్నట్టు వార్తలు వచ్చాయి. ఇలాంటి నేపథ్యంలో ముందుకు సాగుతున్న నగ్మా జీవితంలో ఎన్నో ఒడిదుకులు, ఆటుపోట్లు, విజయాలు, అపజయాలు ఉన్నాయి. హిందు తండ్రి, ముస్లీం తల్లికి క్రిస్మస్ రోజున పుట్టిన నగ్మా అసలు పేరు నందితా మురార్జీ. తొలి చిత్రంలోనే సల్మాన్ సరసన అవకాశం చేజిక్కించుకుని భాగీ అనే చిత్రంలో నటించింది. ఆతర్వాత దక్షిణాది సీని పరిశ్రమలో స్టార్ వెలుగొందింది. తమిళ నటుడు శరత్ కుమార్ తో ప్రేమ వ్యవహారానికి బ్రేక్ పడటంతో అక్కడి నుంచి తప్పుకుని భోజ్ పూరి చిత్రాల్లో నటించింది. భోజ్ పూరి సూపర్ స్టార్ రవి కిషన్ తో 13 చిత్రాల్లో నటించింది. నగ్మా, రవి కిషన్ ల మధ్య ఆఫైర్ భోజ్ పూరి చిత్ర పరిశ్రమలో సంచలనం రేపింది. రవికిషన్ తో మరోసారి ప్రేమ వ్యవహారం బెడిసికొట్టడంతో మానసికంగా కుంగిన నగ్మా మత సంబంధమైన జీవితానికి అలవాటు పడింది. ఆతర్వాత ఏ చిత్ర పరిశ్రమలోనూ అవకాశాలు లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీకి చేరువైంది. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేసిన ఆమె ఏఐసీసీ సభ్యురాలిగా నియమితులయ్యారు. క్రికెట్ బెట్టింగ్ ను చట్టబద్దం చేయాలని భోపాల్ లో వ్యాఖ్యలు చేసిన నగ్మాకు ఒకప్పటి భారత క్రికెట్ కెప్టెన్ సౌరభ్ గంగూలీతో సన్నిహిత సంబంధాలు పతాక శీర్షికలకెక్కిన సంగతి తెలిసిందే. అలానే దావూద్ అనుచరుడు జమీరుద్దీన్ అన్సారీ అలియాస్ జంబోతో సన్నిహిత సంబంధాలున్న నగ్మా మెడకు గుట్కా కేసు చుట్టుకుంది. అయితే గుట్కా కేసు తనకు సంబంధం లేదని మరోనటి నగ్మా తబుస్సమ్ ఖాన్ అనే నటిపైకి నెట్టింది. ఈ కేసుతో తనకు సంబంధం లేదని తబుస్సమ్ ఖాన్ ఖండించడంతో మళ్లీ నగ్మా వివాదం చిక్కుకున్నారు. అయితే కాంగ్రెస్ పెద్దలు జోక్యం చేసుకోవడంతో గుట్కా కేసు వివాదం సద్దుమణిగింది. ఇలాంటి వివాదాలు, ఒడిదుడుకులతో జీవితాన్ని గడిపిన నగ్మా ప్రజా జీవితంలోకి ప్రవేశించింది. అయితే రాజకీయ జీవితం అనుకున్నంత ఈజీగా సాగడం లేదు. స్వంత పార్టీ నేతలే నగ్మాకు ఆటంకంగా మారారు. ఇలాంటి అడ్డంకులను ఎదుర్కోని మీరట్ లో విజయాన్ని ఎలా సొంతం చేసుకుంటుందో వేచి చూడాల్సిందే. -
నగ్మాకు మరో చేదు అనుభవం
చేయి వేసిన యువకుడి చెంప చెళ్లుమనిపించిన తార ఇలాగైతే మళ్లీ మీరట్ మొహం చూడనని ప్రకటన మీరట్: రాజకీయాల్లోకి అడుగుపెట్టిన అందాల సినీతార నగ్మాకు ఎన్నికల ప్రచారం చేదు అనుభవాలను మిగుల్చుతోంది. కాంగ్రెస్ అభ్యర్థిగా తాను పోటీ చేస్తున్న ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ లోక్‌సభ నియోజకవర్గంలో సొంత పార్టీ ఎమ్మెల్యే గజరాజ్ సింగ్ ఆమెను పబ్లిక్‌గా ముద్దు పెట్టుకున్న ఘటన మరవకముందే ఇంచుమించు అలాంటిదే మరో అనుభవం శుక్రవారం ఎదురైంది. మీరట్‌లో చేపట్టిన ర్యాలీ సందర్భంగా సభాస్థలి వద్దకు వెళ్తున్న ఆమెను జనం ఒక్కసారిగా చుట్టుముట్టారు. దీంతో గందరగోళానికి గురైన నగ్మాపై ఒక యువకుడు చేయి వేశాడు. దీంతో అగ్గి మీద గుగ్గిలమైన నగ్మా... అతని చెంప పగులగొట్టారు. ఈ ఘటనతో మనస్తాపానికి గురైన నగ్మా తీవ్రంగా స్పందించారు. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే మళ్లీ మీరట్‌లో అడుగుపెట్టబోనని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే గజరాజ్పై చర్యల్లేవ్...: బహిరంగంగా నగ్మాపై అసభ్యంగా ప్రవర్తించిన ఎమ్మెల్యే గజరాజ్ సింగ్‌పై కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదు. అంతేకాదు ఆ దృశ్యాల వీడియోను టీవీ చానళ్లు పదేపదే ప్రసారం చేయడంతో పలు విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. సొంత పార్టీ ఎమ్మెల్యేపై చర్యలకు ఆదేశిస్తే వచ్చే ఎన్నికలలో విజయావకాశాలు ఎక్కడ దెబ్బతింటాయోననే అధిష్టానం భావిస్తోంది. అయితే ఈ ఘటనను మరో కాంగ్రెస్ నేత ప్రమోద్ కాత్యాయన్ ఖండించారు. ‘గజరాజ్ చాలా సీనియర్ నేత. ఆయన ప్రవర్తన ఎమ్మెల్యే హోదాకు తగినట్లుగా లేద’’ని వ్యాఖ్యానించారు. ఇందుకుగాను కాత్యాయన్ను పార్టీ నుంచి సోమవారం బహిష్కరించడం కొసమెరుపు. -
కాంగ్రెస్ ను ఇరకాటంలో పెట్టిన గజరాజు
ఎన్నికల వేళ ఎవరికీ కోపం రాకుండా చూసుకోవడం పార్టీలకు ముఖ్యం. అందునా యూపీ లాంటి రాష్ట్రంలో, కాంగ్రెస్ లాంటి పార్టీకి ఛోటా నేతతోనైనా జాగ్రత్తగా ఉండాల్సిందే. అవసరమైతే వారి తప్పుల్ని చూసీ చూడనట్టు ఊరుకోవాల్సిందే. ఇందుకు నేత గా మారిన నటి నగ్మాను ముద్దాడిన గజరాజ్ సింగ్ నిలువెత్తు సాక్షి. సదరు గజరాజ్ సింగ్ నగ్మాలు పొదివి పట్టుకుని ముద్దాడిన దృశ్యాలు ప్రపంచమంతటా ప్రసారమయ్యాయి. పాపం నగ్మాకి పట్టలేని కోపం వచ్చింది. అయితే ఇన్నాళ్లయినా గజరాజ్ సింగ్ పై చిన్న పాటి చర్య తీసుకునేందుకు కూడా కాంగ్రెస్ సాహసించడం లేదు. ఎందుకంటే నగ్మాపోటీ చేస్తున్న నియోజకవర్గంలో ఉన్న ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆయనే. అందుకే ఆయన్ని ముట్టుకునే సాహసం పార్టీ చేయడం లేదు. ఆయన ముద్దుపెట్టుకుంటే ముచ్చట పడాలే తప్ప మూతి కొరక కూడదు. కనీసం మూతి విరుపు కూడా చేయకూడదు. ఎమ్మెల్యే గారి వ్యవహారాన్ని ప్రమోద్ కాత్యాన్ అనే మరో నాయకుడు గట్టిగా విమర్శించాడు. పార్టీ గజరాజ్ సింగ్ ను వదిలేసి కాత్యాన్ ను పార్టీ నుంచి బహిష్కరించింది. అవును మరి... అరిటాకు ముల్లుపై పడినా, ముల్లు అరిటాకుపై పడినా నష్టం అరిటాకుకే మరి. -
చెంప చెళ్లుమనిపించిన నగ్మా
హీరోయిన్లు బయట అడుగు పెడితే....... అభిమానుల తాకిడి ఎక్కువగానే ఉంటుంది. ఇక ఆ హీరోయిన్లే రాజకీయాల్లోకి వచ్చి ప్రచార రంగంలోకి దూకితే జనాభిమానికి హద్దే ఉండదు. అయితే ఒక్కోసారి ఈ అభిమానం వెర్రితలలు వేస్తూ ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ప్రముఖ సినీ నటి నగ్మా విషయంలో అదే జరిగింది. ఇటీవలి కాంగ్రెస్‌లో చేరి ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ నుంచి లోక్‌సభకు పోటీ చేస్తున్న నగ్మాకు వరుసగా చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. నామినేషన్ సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అనుచిత ప్రవర్తనను మరిచిపోకముందే నగ్మాకు మరో చేదు అనుభవం ఎదురైంది. మీరట్‌లో ప్రచారానికి వచ్చిన నగ్మా పట్ల కొందరు వ్యక్తులు అసభ్యకరంగా ప్రవర్తించారు. నగ్మా చుట్టూ చేరిన అల్లరిమూక ఆమెను అడ్డుకుంది. ముందుకు వెళ్లకుండా అడ్డుకుంటూ విపరీత చేష్టలకు పాల్పడింది. ఈ చర్యలతో నివ్వెరపోయిన నగ్మా... అల్లరి మూకపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ ఆకతాయి యువకుడు అసభ్యకరంగా ప్రవర్తించబోగా ఒక్కసారిగా ఆగ్రహానికి గురైన ఆమె తన చేతికి పనిచెప్పింది. అందరి ముందే నగ్మా అతగాడి చెంప చెళ్లుమనిపించింది. ఈ సంఘటనతో అందరూ ఒక్కసారిగా నివ్వెరబోయారు. స్థానిక పెద్దల జోక్యంతో అక్కడి నుంచి బయటపడిన నగ్మా... అనంతరం ప్రచారం సాగించింది. -
మీరట్‌లో నగ్మాను అడ్డుకున్న అల్లరిమూక
-
పబ్లిక్‌గా నగ్మాకు ముద్దు
* కాంగ్రెస్ ఎమ్మెల్యే వికృత చేష్ట మీరట్: మహిళల భద్రత కోసం చట్టాలు చేశామంటూ జబ్బలు చరుచుకుంటున్న కాంగ్రెస్ గొంతులో పచ్చివెలక్కాయపడింది! మీరట్ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన నటి నగ్మా పట్ల ఆ పార్టీ నేత ఒకరు అసభ్యంగా ప్రవర్తించారు. శనివారం యూపీలోని హాపూర్‌లో పట్టపగలు అందరిముందూ బహిరంగ సభలో స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే గజ్రాజ్ శర్మ.. నగ్మాను పట్టుకుని బలవంతంగా ముద్దుపెట్టుకున్నారు. దీంతో ఆమె దిగ్భ్రాంతికి గురై అతని చేతిని విసురుగా తోసేసి, వెనక్కి నెట్టేసింది. సభలో మాట్లాడకుండానే వెళ్లిపోయింది. దీనిపై స్థానిక మునిసిపాలిటీ చైర్మన్ మాలతీ భారతీ స్పందిస్తూ.. శర్మ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి, స్థానిక గురుద్వారాలో ప్రార్థన చేసేందుకు నగ్మా హాపూర్‌కు వెళ్లారు. -
నగ్మాను పబ్లిక్ గా ముద్దు పెట్టుకున్న ఎమ్మెల్యే !
ఉత్తరప్రదేశ్ లోని మీరట్ నియోజకవర్గంలో నామినేషన్ కార్యక్రమంలో సినీతార నగ్మాతో స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే గిరిరాజ్ శర్మ అనుచితంగా ప్రవర్తించారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థని తెలిసి కూడా పబ్లిక్ గా నగ్మాను గిరిరాజ్ శర్మ ముద్దు పెట్టుకోవడం వివాదస్పదంగా మారింది. ఎమ్మెల్యే శర్మ తీరుతో నగ్మాతోపాటు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు షాక్ గురయ్యారు. ఎమ్మెల్యే గిరిరాజ్ శర్మపై స్థానికులు, కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా ప్రతినిధి అనే హోదాను మరిచి సాటి నేతతో అనుచితం ప్రవర్తించిన శర్మకు ఈ ఎన్నికల్లో గట్టిగానే బుద్ది చెబుతారని కార్యకర్తలు అంటున్నారు. మీరట్ లో నగ్మా నామినేషన్ కార్యక్రమానికి భారీ ఎత్తున్న అభిమానుల, కార్యకర్తలు హాజరయ్యారు. నగ్మాను చూసేందుకు అభిమానులు పోటీ పడ్డారు. కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలిరావడంతో అదుపు చేయలేక పోలీసులు నానా కష్టాలు పడాల్సి వచ్చింది. -
లోక్‌సభ బరిలో నటి నగ్మా
ఆమెకు యూపీలోని మీరట్ కాంగ్రెస్ అభ్యర్థిగా టికెట్ మాజీ క్రికెటర్ అజహర్ సీటు మరొకరికి మాజీ మంత్రి బన్సల్‌కు మళ్లీ టికెట్ 71 మందితో కాంగ్రెస్ రెండో జాబితా విడుదల సాక్షి, న్యూఢిల్లీ: దక్షిణాది సినిమాల్లో హీరోయిన్గా గతంలో ఓ వెలుగు వెలిగిన నటి నగ్మాకు ఈ సారి కాంగ్రెస్ లోక్‌సభ టికెట్ దక్కింది. ఆమె ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ స్థానం నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. లోక్‌సభ ఎన్నికలకు 71 మందితో కాంగ్రెస్ తన రెండో జాబితాను గురువారం ఢిల్లీలో విడుదల చేసింది. తొలి జాబితాలోంచి నలుగురి పేర్లను మారుస్తూ రెండో జాబితాలో కొత్త పేర్లు ప్రకటించింది. ముందుగా మీరట్ స్థానానికి దయానంద్ గుప్తా పేరును ప్రకటించినా ఇప్పుడాస్థానంలో నగ్మాకు చోటు కల్పించారు. అలాగే రాయ్‌గఢ్ స్థానాన్ని మేనకాసింగ్కు బదులుగా ఆర్తీసింగ్కు, రాయ్‌పూర్ సీటును ఛాయా వర్మకు బదు లు సత్యనారాయణ్ శర్మకు, మేఘాలయలోని తురా స్థానాన్ని డి.జెన్నిత్ ఎం.సంగ్మాకు బదులు డారిల్ విలియం చైకు కేటాయించారు. రెండో జాబితాలో మొత్తం 11 మంది మహిళలకు చోటు కల్పించారు. మరోవైపు మాజీ క్రికెటర్, మొరాదాబాద్ ఎంపీ అజారుద్దీన్‌కు రెండో జాబితాలో టికెట్ దక్కలేదు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న యూపీలోని మొరాదాబాద్ స్థానాన్ని పార్టీ సీనియర్ నాయకురాలు బేగం నూర్ బానోకు కాంగ్రెస్ కేటాయించింది. నిన్నటితరం బాలీ వుడ్ నటుడు రాజ్ బబ్బర్‌కు ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ స్థానం లభించింది. రైల్వేశాఖలో వెలుగుచూసిన ‘ముడుపులకు ఉద్యోగం’ కుంభకోణంలో ప్రమేయం ఆరోపణల తో ఆ శాఖ మంత్రి పదవికి రాజీనామా చేసిన పవన్‌కుమార్ బన్సల్‌కు ఈ జాబితాలో చోటు దక్కింది. ఆయన్ను తిరిగి చండీగఢ్ అభ్యర్థిగా కాంగ్రెస్ బరిలోకి దింపింది. రెండో జాబితాలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అభ్యర్థులెవరూ లేరు. కాగా, ఈసారి తిరిగి టికెట్ దక్కించుకున్న కేంద్ర మంత్రుల్లో వీరప్ప మొయిలీ (చిక్‌బళ్లాపూర్), శశిథరూర్ (తిరువనంతపురం), నారాయణ సామి (పుదుచ్చేరి) ఉన్నారు. కామన్వెల్త్ క్రీడల స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సురేశ్ కల్మాడీ ప్రాతినిధ్యం వహిస్తున్న పుణే స్థానంతోపాటు ఆదర్శ్ హౌసింగ్ స్కాంలో ఆరోపణలతో సీఎం పదవికి రాజీనామా చేసిన అశోక్ చవాన్ ప్రాతినిధ్యం వహిస్తున్న నాందేడ్‌కు అభ్యర్థిని ప్రకటించడంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. -
కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్ధుల రెండో జాబితా విడుదల
-
కాంగ్రెస్ పార్టీ రెండవ జాబితా : మీరట్ నుంచి నగ్మా
ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ అభ్యర్ధుల రెండవ జాబితాను ఈ రోజు విడుదల చేసింది. సినిమా నటి నగ్మాకు కూడా టిక్కె కేటాయించారు. ఈ జాబితాలో 71 మంది పేర్లు ఉన్నాయి. ముఖ్యమైన అభ్యర్థులకు కేటాయించిన ఆయా లోక్‌సభ స్థానాలు: సినీనటి నగ్మా - మీరట్ బన్సల్ - ఛండీగడ్ నారాయణ స్వామి - పుదుచ్చెరి వీరప్ప మొయిలీ - చిక్‌బళ్లాపూర్ సుబోధ్కాన్ సహాయ్ - రాంచి