నగ్మాకు ఆహ్వానం | tamil nadu congress leaders invited to nagma | Sakshi
Sakshi News home page

నగ్మాకు ఆహ్వానం

Published Tue, Oct 20 2015 10:18 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

నగ్మాకు ఆహ్వానం - Sakshi

నగ్మాకు ఆహ్వానం

కాంగ్రెస్ నాయకురాలు నగ్మాను ఈ నెల 22వ తేదీన చెన్నై సత్యమూర్తి భవన్‌ కు ఆహ్వానించేందుకు తమిళనాడు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు నిర్ణయించారు.

టీనగర్: కాంగ్రెస్ నాయకురాలు నగ్మాను ఈ నెల 22వ తేదీన చెన్నై సత్యమూర్తి భవన్‌ కు ఆహ్వానించేందుకు తమిళనాడు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు నిర్ణయించారు. అఖిల భారత మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నియమించబడిన నగ్మా గత 16వ తేదీన చెన్నై చేరుకున్నారు. ఆ రోజున ఆమె సత్యమూర్తి భవన్‌లో విలేకరులను కలుసుకోనున్నట్టు ప్రకటించారు. అయితే ఆఖరి క్షణంలో ఆమె సత్యమూర్తి భవన్ కార్యక్రమాన్ని రద్దు అయింది.

విమానాశ్రయంలోను, నగ్మా ఆహ్వాన కార్యక్రమంలో కలకలం చెలరేగింది. మహిళా కాంగ్రెస్ ఆధ్యక్షురాలు, ఎమ్మెల్యే విజయధరణి తరపున ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ నిర్వాహకులు పాల్గొన్నారు. మరుసటి రోజు తూత్తుకుడిలో జరిగిన కాంగ్రెస్ మండల మహానాడులో నగ్మా పాల్గొనేందుకు ఆసక్తితో ఉండగా చివరి సమయంలో ఆ కార్యక్రమం కూడా రద్దయింది.


22 న ఆహ్వానం
ఈ నెల 22వ తేదీన నగ్మాను సత్యమూర్తి భవన్‌కు ఆహ్వానించేందుకు నిర్వాహకులు నిర్ణయించారు. దీని పై రాష్ట్ర మహిళా కాంగ్రెసు అధ్యక్షురాలు విజయతారణి మాట్లాడుతూ గత 4 వ తేదీ నుంచి పర్యటిస్తున్నానని, నగ్మా వచ్చిన రోజున చెన్నైలో లేనందున ఆహ్వానించడానికి వీలు కాలేదన్నారు. దీంతో నిర్వాహకులను పంపినట్లు తెలిపారు. 22 వ తేదీ విజయదశమి రోజున సత్యమూర్తి భవన్‌లో మహిళా కాంగ్రెస్ భవనం ప్రారంభోత్సవం జరగనుందని, ఈ కార్యక్రమానికి నగ్మా, కుష్బూలను ఆహ్వానించామన్నారు. కార్యక్రమంలో నెహ్రూ 125 వ పుట్టిన రోజును పురస్కరించుకుని ఆయన సంస్మరణ లేఖ విడుదల కార్యక్రమం జరుగనుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement