ఇటీవల కాలంలో సైబర్ నేరాలు మరింత పెరిగిపోతున్నాయి. కొత్త కొత్త తరహాలో మోసాలలకు పాల్పడుతున్నారు సైబర్ నేరగాళ్లు. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా ఈ సైబర్ మోసగాళ్ల ఉచ్చులో చిక్కుకుంటున్నారు. తాజాగా సినియర్ హీరోయిన్ నగ్మా కేటుగాళ్ల వలలో చిక్కి పెద్ద మొత్తంలో మోసపోయారు. తన మొబైల్‌కు వచ్చిన మెసేజ్‌ని క్లిక్ చేసి రూ. లక్ష పోగొట్టుకున్నారు.
ఫిబ్రవరి 28న నగ్మా మొబైల్‌కు బ్యాంకు వాళ్లు పంపినట్లు ఓ మెసేజ్ వచ్చిందట. అందులో ఉన్న ఓ లింక్‌ని ఓపెన్ చేయగానే వెంటనే ఆమెకు ఓ ఫోన్ కాల్ వచ్చిందట. బ్యాంక్ ఎంప్లాయ్‌గా తనను తాను పరిచయం చేసుకున్న కేటుగాడు.. కేవైసీ అప్‌డేట్ చేయమని చెప్పారు. ఆమె తన బ్యాంకు వివరాలు తెలియజేయనప్పటికీ.. తన్ ఆన్‌లైన్ బ్యాంకులోకి లాగిన్ అయి.. బెనిఫిషియరీ అకౌంట్ క్రియేట్ చేసుకుని దాదాపు లక్ష రూపాయలు ట్రాన్స్ఫర్ చేసుకున్నాడట.
నేరగాడు లాగిన్ అయ్యే క్రమంలో తన మొబైల్‌కి దాదాపు 20 సార్లు ఓటీపీలు వచ్చాయని నగ్మా వెల్లడించారు. పెద్ద అమౌంట్ కాకుండా కేవలం లక్ష రూపాయలతో ఈ ఫ్రాడ్ నుండి బయటపడినందుకు నగ్మా బాధలో సంతోషం వ్యక్తం చేశారు. నగ్మా మాదిరే సదరు బ్యాంకులో ఖాతాలు ఉన్న మరో 80 మంది కూడా ఇదే తరహాలో మోసపోవడం గమనార్హం. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ముంబై సైబర్ పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment