ప్రభుదేవా హిట్‌ సినిమా 'ప్రేమికుడు' రీ-రిలీజ్‌ | Prabhudeva Premikudu Movie Release | Sakshi

ప్రభుదేవా హిట్‌ సినిమా 'ప్రేమికుడు' రీ-రిలీజ్‌

Published Sun, Apr 28 2024 9:11 AM | Last Updated on Sun, Apr 28 2024 9:18 AM

Prabhudeva Premikudu Movie Release

ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా సూపర్‌ హిట్‌ సినిమా ప్రేమికుడు రీ-రిలీజ్‌ కానుంది. మెగా ప్రొడ్యూసర్ కే. టి. కుంజుమోన్ నిర్మాతగా, సెన్సేషనల్ డైరెక్టర్ ఎస్. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ. ఆర్. రెహమాన్ మ్యూజిక్ అందించారు. అందాల నటి నగ్మ ఇందులో హీరోయిన్‌గా నటించారు. ప్రస్తుతం ఈ సినిమాను నిర్మాతలు రమణ, మురళీధర్ రిలీజ్ చేస్తున్నారు. ఎస్పీ బాలసుబ్రమణ్యం, వడివేలు, రఘువరన్, గిరీష్ కర్నాడ్ ముఖ్యపాత్రలో నటించారు. ఈ రీ- రిలీజ్ కి సంబంధించిన వేడుక తాజాగా చాలా ఘనంగా జరిగింది. ఈ వేడుకలో నిర్మాతలు మురళీధర్ రెడ్డి, రమణ, ప్రముఖ నిర్మాత లగడపాటి శ్రీనివాస్, శోభారాణి పాల్గొన్నారు.ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా సూపర్‌ హిట్‌ సినిమా ప్రేమికుడు రీ-రిలీజ్‌ కానుంది. మెగా ప్రొడ్యూసర్ కే. టి. కుంజుమోన్ నిర్మాతగా, సెన్సేషనల్ డైరెక్టర్ ఎస్. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ. ఆర్. రెహమాన్ మ్యూజిక్ అందించారు. అందాల నటి నగ్మ ఇందులో హీరోయిన్‌గా నటించారు. ప్రస్తుతం ఈ సినిమాను నిర్మాతలు రమణ, మురళీధర్ రిలీజ్ చేస్తున్నారు. ఎస్పీ బాలసుబ్రమణ్యం, వడివేలు, రఘువరన్, గిరీష్ కర్నాడ్ ముఖ్యపాత్రలో నటించారు. ఈ రీ- రిలీజ్ కి సంబంధించిన వేడుక తాజాగా చాలా ఘనంగా జరిగింది. ఈ వేడుకలో నిర్మాతలు మురళీధర్ రెడ్డి, రమణ, ప్రముఖ నిర్మాత లగడపాటి శ్రీనివాస్, శోభారాణి పాల్గొన్నారు.

30 సంవత్సరాల క్రితం వచ్చిన ప్రేమికుడు సినిమా మళ్లీ మే 1న 300కు పైగా థియేటర్లలో ఘనంగా రీ- రిలీజ్ అవుతోంది. బుకింగ్స్ ఓపెన్ అయి ప్రజల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఎస్. శంకర్ దర్శకత్వంలో ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా, నగ్మా జంటగా 30 సంవత్సరాల క్రితం వచ్చి యువతను ఆకట్టుకున్న సినిమా. ఇప్పటికి కూడా ఆ సినిమాలోని పాటలు యువతనే కాకుండా అందరినీ ఆకట్టుకుంటూనే ఉన్నాయి.

ఈ సినిమాలో ప్రభుదేవా తండ్రిగా ఎస్. పి. బాలసుబ్రమణ్యం గారు నటించడం సినిమాకే పెద్ద ప్లస్ అయింది. అందమైన ప్రేమ రాణి చెయ్యి తగిలితే పాటలో ప్రభుదేవాతో సమానంగా ఎస్. పి. బాలు గారు డాన్స్ చేయడం విశేషం. టేకిట్ ఈజీ పాలసీ, ఓ చెలియా నా ప్రియ సఖియా పాటలు ఇప్పటికీ ఎప్పటికీ నిలిచిపోయేలా సాంగ్స్ ఉన్నాయి. ఒక మంచి యూత్ ఫుల్ లవ్ స్టోరీ గా వచ్చిన ఈ సినిమా అప్పటి రోజుల్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్.

 

నిర్మాత మురళీధర్ రెడ్డి గారు మాట్లాడుతూ : ప్రేమికుడు సినిమాని 30 సంవత్సరాల తర్వాత మళ్లీ సీ ఎం ఆర్ సంస్థ పైన మే 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నాము. బుకింగ్స్ ఓపెన్ చేసిన వెంటనే ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. డిస్ట్రిబ్యూటర్లు కూడా మాకు ఎంత సపోర్ట్ చేస్తున్నారు వారికి మా ధన్యవాదాలు. అదేవిధంగా ఈ సినిమా రిలీజ్‌కు  అంగీకరించి మాకు సహకరిస్తున్న మా మెగా ప్రొడ్యూసర్ కొంచెం మోహన్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము అని అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
 
Advertisement