Premikudu
-
పాప్ సింగర్ ఎడ్ షీరన్తో హిట్ సాంగ్ రీమిక్స్ చేసిన ఏఆర్ రెహమాన్
లండ్‌నుకు చెందిన పాప్ సింగర్ ఎడ్వర్డ్ క్రిస్టోఫర్ షీరాన్ చెన్నైలో తన పాటలతో మెప్పించారు. చెన్నై నందనం YMCA మైదానంలో జరిగిన ఈ కార్యక్రమంలో తన పాటలతో అభిమానులను మెప్పించారు. సంగీత దర్శకులు ఏఆర్ రెహమాన్‌తో 'ఊర్వశి.. ఊర్వశి.. టేక్ ఇట్ ఈజీ ఊర్వశి..' అనే పాటతో ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని నింపారు. పదకొండేళ్ల వయసు నుంచే పాటలు రాయడంతో పాటు పాడటం కూడా ఆయన ప్రారంభించాడు. యూట్యూబ్‌లో మిలియన్ల కొద్దీ వ్యూస్‌తో ఆయన సాంగ్స్‌కు దక్కుతుంటాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా భారీ సంఖ్యలో ఆయన అభిమానులు ఉన్నారు.చెన్నైలో అంతర్జాతీయ స్థాయిలో జరిగిన ఈ కార్యక్రమంలో భారీగా అభిమానులు పాల్గొన్నారు. ఈ సంగీత కచేరిలో ఎడ్ షీరాన్ కు సంబంధించిన టాప్ సాంగ్స్ ఆలపించారు. తనకు ప్రపంచ ప్రసిద్ధ గ్రామీ అవార్డు తెచ్చిపెట్టిన 'షేప్ ఆఫ్ యు' పాటను పాడుతూ ఉండగ సడెన్‌గా వేదికపైకి ఏఆర్ రెహమాన్ ఎంట్రీ ఇచ్చారు. ఆ సమయంలో అభిమానుల్లో మరింత ఉత్సాహం కనిపించింది. 1994లో విడుదలైన ప్రేమికుడు చిత్రం నుంచి 'ఊర్వశి.. ఊర్వశి.. టేక్ ఇట్ ఈజీ ఊర్వశి..' అనే పాట పాడుతూ వేదికపైకి రెహమాన్ చేరుకున్నారు. అభిమానుల కేరింతల మధ్య ఆ సమయంలో ఎడ్ షీరాన్ కూడా ఆ పాటకు తన గొంతు కలిపారు. దీన్ని ఊహించని అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వీరిద్దరూ కొత్త తరహా రీమిక్స్ సంగీతాన్ని ప్రజలకు అందించారు. ఈ రీమిక్స్ సంగీతాన్ని నెటిజన్లు మరికొన్ని రోజులు ఉపయోగించనున్నారు. Thank you, @edsheeran! Hope to see you perform more in Chennai—our city needs more international concerts and collaborations like yours! 🎶🔥 #ChennaiLovesEd https://t.co/uPuUHef7xE— A.R.Rahman (@arrahman) February 6, 2025 -
తెలుగు తెరపై మరో బోల్డ్ ‘ప్రేమికుడు’
అర్జున్ రెడ్డి సినిమా తర్వాత టాలీవుడ్లో బోల్డ్ ప్రేమ కథలు ఎక్కువగా వస్తున్నాయి. హీరో పాత్రను బోల్డ్‌గా చూపిస్తూనే ఓ మంచి ప్రేమ కథను ప్రేక్షకులకు చూపిస్తున్నారు. ఆడియన్స్ కూడా అలాంటి కథలనే ఆదరిస్తున్నారు. అందుకే ఈ మధ్యకాలంలో రా అండ్ బోల్డ్ రొమాంటిక్ స్టోరీస్ ఎక్కువగా వస్తున్నాయి. యువతను టార్గెట్ చేసుకొని.. నేటి తరానికి, ట్రెండ్ కి తగ్గట్టుగా సినిమాలను తెరకెక్కిస్తున్నారు. (చదవండి: తగ్గేదేలే అంటోన్న పుష్పరాజ్.. ఆ భాషలో బాక్సాఫీస్ షేక్!)తాజాగా మరో బోల్డ్ లవ్‌స్టోరీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అదే ‘ప్రేమికుడు’(Premikudu). రామ్ వెలుగు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పండు చిరుమామిళ్ల ప్రధాన పాత్రలో నటించారు. గురుదేవ్ స్టోరీ టెల్లర్స్ బ్యానర్‌పై రామ్ యాదవ్ గొట్టె, చెరుకూరి సాయి కుమార్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్, ఫస్ట్-లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో పండు చిరుమామిళ్ల(Pandu Chirumamilla) బోల్డ్ అండ్ ఇంటెన్స్ పాత్రను పోషించినట్టుగా ఫస్ట్‌లుక్ చూస్తే అర్థమవుతుంది. "అన్ఫిల్టర్డ్" అనే ట్యాగ్‌లైన్ తో ఈ సినిమా ఎలా ఉండబోతోందో అర్థం చేసుకోవచ్చు. పోస్టర్లో హీరో నేలపై నగ్నంగా పడుకుని ఉండటం, ఆ సిగరెట్, చేతికి సంకెళ్ళు, శరీరంపై రక్తపు మరకలు చూస్తోంటే అందరినీ మెస్మరైజ్ చేసేట్టుగా ఉన్నాయి.ఈ మూవీకి ఆదిత్య లొల్ల సినిమాటోగ్రాఫర్ కాగా, చీదెళ్ల నాగార్జున రచయితగా పని చేస్తున్నారు. ఇతర వివరాలను మేకర్స్ త్వరలోనే ప్రకటించనున్నారు. -
ప్రభుదేవా హిట్ సినిమా 'ప్రేమికుడు' రీ-రిలీజ్
ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా సూపర్ హిట్ సినిమా ప్రేమికుడు రీ-రిలీజ్ కానుంది. మెగా ప్రొడ్యూసర్ కే. టి. కుంజుమోన్ నిర్మాతగా, సెన్సేషనల్ డైరెక్టర్ ఎస్. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ. ఆర్. రెహమాన్ మ్యూజిక్ అందించారు. అందాల నటి నగ్మ ఇందులో హీరోయిన్గా నటించారు. ప్రస్తుతం ఈ సినిమాను నిర్మాతలు రమణ, మురళీధర్ రిలీజ్ చేస్తున్నారు. ఎస్పీ బాలసుబ్రమణ్యం, వడివేలు, రఘువరన్, గిరీష్ కర్నాడ్ ముఖ్యపాత్రలో నటించారు. ఈ రీ- రిలీజ్ కి సంబంధించిన వేడుక తాజాగా చాలా ఘనంగా జరిగింది. ఈ వేడుకలో నిర్మాతలు మురళీధర్ రెడ్డి, రమణ, ప్రముఖ నిర్మాత లగడపాటి శ్రీనివాస్, శోభారాణి పాల్గొన్నారు.ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా సూపర్ హిట్ సినిమా ప్రేమికుడు రీ-రిలీజ్ కానుంది. మెగా ప్రొడ్యూసర్ కే. టి. కుంజుమోన్ నిర్మాతగా, సెన్సేషనల్ డైరెక్టర్ ఎస్. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ. ఆర్. రెహమాన్ మ్యూజిక్ అందించారు. అందాల నటి నగ్మ ఇందులో హీరోయిన్గా నటించారు. ప్రస్తుతం ఈ సినిమాను నిర్మాతలు రమణ, మురళీధర్ రిలీజ్ చేస్తున్నారు. ఎస్పీ బాలసుబ్రమణ్యం, వడివేలు, రఘువరన్, గిరీష్ కర్నాడ్ ముఖ్యపాత్రలో నటించారు. ఈ రీ- రిలీజ్ కి సంబంధించిన వేడుక తాజాగా చాలా ఘనంగా జరిగింది. ఈ వేడుకలో నిర్మాతలు మురళీధర్ రెడ్డి, రమణ, ప్రముఖ నిర్మాత లగడపాటి శ్రీనివాస్, శోభారాణి పాల్గొన్నారు.30 సంవత్సరాల క్రితం వచ్చిన ప్రేమికుడు సినిమా మళ్లీ మే 1న 300కు పైగా థియేటర్లలో ఘనంగా రీ- రిలీజ్ అవుతోంది. బుకింగ్స్ ఓపెన్ అయి ప్రజల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఎస్. శంకర్ దర్శకత్వంలో ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా, నగ్మా జంటగా 30 సంవత్సరాల క్రితం వచ్చి యువతను ఆకట్టుకున్న సినిమా. ఇప్పటికి కూడా ఆ సినిమాలోని పాటలు యువతనే కాకుండా అందరినీ ఆకట్టుకుంటూనే ఉన్నాయి.ఈ సినిమాలో ప్రభుదేవా తండ్రిగా ఎస్. పి. బాలసుబ్రమణ్యం గారు నటించడం సినిమాకే పెద్ద ప్లస్ అయింది. అందమైన ప్రేమ రాణి చెయ్యి తగిలితే పాటలో ప్రభుదేవాతో సమానంగా ఎస్. పి. బాలు గారు డాన్స్ చేయడం విశేషం. టేకిట్ ఈజీ పాలసీ, ఓ చెలియా నా ప్రియ సఖియా పాటలు ఇప్పటికీ ఎప్పటికీ నిలిచిపోయేలా సాంగ్స్ ఉన్నాయి. ఒక మంచి యూత్ ఫుల్ లవ్ స్టోరీ గా వచ్చిన ఈ సినిమా అప్పటి రోజుల్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. నిర్మాత మురళీధర్ రెడ్డి గారు మాట్లాడుతూ : ప్రేమికుడు సినిమాని 30 సంవత్సరాల తర్వాత మళ్లీ సీ ఎం ఆర్ సంస్థ పైన మే 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నాము. బుకింగ్స్ ఓపెన్ చేసిన వెంటనే ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. డిస్ట్రిబ్యూటర్లు కూడా మాకు ఎంత సపోర్ట్ చేస్తున్నారు వారికి మా ధన్యవాదాలు. అదేవిధంగా ఈ సినిమా రిలీజ్‌కు అంగీకరించి మాకు సహకరిస్తున్న మా మెగా ప్రొడ్యూసర్ కొంచెం మోహన్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము అని అన్నారు. -
స్టార్ హీరోయిన్ బ్లాక్ బస్టర్ మూవీ.. దాదాపు 30 ఏళ్ల తర్వాత!
ప్రభుదేవా, నగ్మా జంటగా నటించిన ప్రేమికుడు చిత్రం రీ రిలీజ్‌కు సిద్ధమైంది. ప్రస్తుతం ఈ సినిమా రిలీజ్‌కు నిర్మాతలుగా రమణ, మురళీధర్ వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ సినిమా రీ రిలీజ్‌కు సంబంధించి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథులుగా తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్నకుమార్, దర్శకులు ముప్పలనేని శివ, శివనాగు, శోభారాణి పాల్గొన్నారు. ఈ చిత్రంలో ఎస్పీ బాలసుబ్రమణ్యం, వడివేలు, రఘువరన్, గిరీష్ కర్నాడ్ ముఖ్యపాత్రల్లో నటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ముప్పలనేని శివ మాట్లాడుతూ.. '30 ఏళ్ల క్రితం వచ్చిన ప్రేమికుడు ఇప్పుడు రీ రిలీజ్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. అప్పట్లో ప్రభుదేవని చూసి స్ప్రింగ్‌లు ఏమన్నా మింగాడా అనుకునేవాళ్లం. ఒక మంచి ప్రేమ కథగా సెన్సేషన్ సృష్టించిన సినిమా ఇప్పుడు మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అందరితోపాటు ఈ సినిమా కోసం నేను కూడా ఎదురు చూస్తున్నా' అని అన్నారు. తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్నకుమార్ మాట్లాడుతూ..' ఈ సినిమా రీ రిలీజ్ కూడా మంచి విజయం అందుకుంటుంది. గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం నటన అద్భుతంగా ఉంటుంది. ప్రభుదేవ నటన, డాన్సులు నగ్మ అందాలు ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ. మా సోదరి సుధారాణికి ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా' అని అన్నారు. దర్శకుడు శివనాగుమాట్లాడుతూ.. 'ప్రేమికుడు ఈ తరంలో వచ్చుంటే కచ్చితంగా రూ.100 కోట్ల వసూళ్లు సాధించేంది. అప్పుడున్న బడ్జెట్‌కి రూ.3 కోట్లతో చేసిన సినిమా ఇప్పుడు కూడా రూ.30 కోట్లు సాధిస్తుందని ఆశిస్తున్నా. ఎస్పీ బాలసుబ్రమణ్యం నటన అద్భుతంగా ఉంటుంది. ప్రభుదేవా డాన్సులు ఈ సినిమాకి హైలెట్. రీ రిలీజ్ కూడా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా' అని అన్నారు. కాగా.. ఈ చిత్రానికి శంకర్ దర్శకత్వం వహించగా.. కేటి కుంజుమన్ నిర్మించారు. ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతమందించారు. -
రీరిలీజ్‌కు రెడీ అవుతోన్న సూపర్ హిట్ లవ్ స్టోరీ
ప్రేక్షక్షుల ముందుకు మరోసారి వచ్చేందుకు ప్రేమికుడు సిద్ధం అవుతున్నాడు. ప్రభుదేవా హీరోగా, నగ్మా హీరోయిన్గా రూపొందిన చిత్రం ‘ప్రేమికుడు’(తమిళంలో ‘కాదలన్’). శంకర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ 1994లో విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ మూవీలోని ‘ముక్కాలా ముక్కాబులా’, ‘ఊర్వశి ఊర్వశి’, ‘ఓ చెలియా నా ప్రియ సఖియా’, ‘అందమైన ప్రేమరాణి’.. వంటి పాటలన్నీ యువతను ఉర్రూతలూగించాయి. క్లాసిక్ హిట్‌గా రూపొందిన ‘ప్రేమికుడు’ తెలుగులో రీ రిలీజ్‌కి సిద్ధమవుతోంది. తెలుగు రీ రిలీజ్ హక్కులను నిర్మాతలు మురళీధర్ రెడ్డి, రమణ దక్కించుకున్నారు. సీఎల్ఎన్ మీడియా ద్వారా త్వరలో సినిమా రిలీజ్‌కు సన్నాహాలు చేస్తున్నారు. అతి త్వరలో రిలీజ్ డేట్ ప్రకటిస్తామని నిర్మాతలు పేర్కొన్నారు. -
అందమైన ప్రేమరాణి చెయ్యి తగిలితే.. లిరికల్ సాంగ్
అందమైన ప్రేమరాణి చెయ్యి తగిలితే.. సత్తురేకు కూడా స్వర్ణమేలే.. అందమైన ప్రేమరాణి లేత బుగ్గపై.. చిన్న మొటిమ కూడా ముత్యమేలే చెమట నీరే మంచి గంధం ఓర చూపే మోక్ష మార్గం వయసుల సంగీతమే.. ఊహూ..భూమికే భూపాలమే ‘‘2‘‘ సానిసా సారిగారి సానిసానిసాని సానిసా సాగమామపమాగారీస సానిసా సారిగారినీ సానిపానిసానిసా సాగమమమ మాప మాగరీస అందమైన ప్రేమ రాణి ఉత్తరాలలో పిచ్చిరాతలైన కవితలవునులే ప్రేమకెపుడు మనసులోన భేదముండదే ఎంగిలైన అమృతమ్ములే బొండుమల్లి ఒక్క రూపాయి నీ కొప్పులోన చేరితే కోటి రూపాయలు పీచు మిఠాయ్ అర్ధరూపాయి నువ్వు కొరికి ఇస్తే దాని విలువ లక్షరూపాయలు ‘‘అందమైన‘‘ ప్రేమ ఎపుడు ముహుర్తాలు చూసుకోదులే రాహుకాలం కూడా కలిసి వచ్చులే ప్రేమ కొరకు హంస రాయబారమేలనే కాకి చేత కూడా కబురు చాలులే ప్రేమ జ్యోతి ఆరిపోదే ప్రేమబంధం ఎన్నడూ వీడిపోదే ఇది నమ్మరానిది కానెకాదే ఈ సత్యం ఊరికీ తెలియలేదే ఆకశం భూమి మారినా మారులే కానీ ప్రేమ నిత్యమే ఆది జంట పాడిన పాటలే.. ఇంకా వినిపించులే ప్రేమ తప్పు మాటని... ఎవ్వరైన చెప్పినా నువ్వు బదులు చెప్పు మనసుతో.. ప్రేమ ముళ్ళ బాట కాదు వెళ్ళవచ్చు అందులో నువ్వు వెళ్ళు నిర్భయంగా.. చిత్రం : ప్రేమికుడు రచన : రాజశ్రీ గానం : యస్పీ బాలు, ఉదిత్ నారాయణ్, యస్పీ పల్లవి సంగీతం : ఏఆర్ రెహమాన్ -
టేక్ ఇట్ ఈజీ
‘ప్రేమికుడు’ చిత్రంలోని ‘ఊర్వశి ఊర్వశి టేక్ ఇట్ ఈజీ ఊర్వశి’ పాట ఎంత పాపులరో తెలిసిందే. ప్రభుదేవా, నగ్మా జంటగా శంకర్ దర్శకత్వంలో 1994లో వచ్చిన ఈ చిత్రంలోని ఆ పాట కుర్రకారును ఓ ఊపు ఊపేసింది. ఆ పాటలో ప్రభుదేవా వేసిన నృత్యాలను అంత సులభంగా మరచిపోలేరు ప్రేక్షకులు. ఎంతో క్రేజ్ ఉన్న ఈ పాటను తాజాగా హిందీలో షాహిద్ కపూర్, కియారా అద్వానీలపై రీమిక్స్ చేశారు. డైరెక్టర్ గిఫ్టీ ఈ పాటకు దర్శకత్వం వహించగా, నిర్మాత భూషణ్ కుమార్ నిర్మించారు. ప్రముఖ గాయకుడు యోయో హనీ సింగ్ ఈ పాటను కంపోజ్ చేసి, పాడటం విశేషం. అయితే పాటలోని లిరిక్స్‌ని మార్చి కేవలం ‘ఊర్వశి ఊర్వశి టేక్ ఇట్ ఈజీ ఊర్వశి’ని మాత్రమే తీసుకున్నారు. నైట్ క్లబ్లో చిత్రీకరించిన ఈ పాటలో షాహిద్ కపూర్ తన నృత్యాలతో ఆకట్టుకున్నారు. ‘భరత్ అనే నేను’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను అలరించిన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ఈ పాటలో మరింత అందంగా కనిపించారు. ప్రస్తుతం షాహిద్, కియారా తెలుగులో ఘన విజయం సాధించిన ‘అర్జున్‌రెడ్డి’ సినిమా హిందీ రీమేక్‌లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ పాటను ఆ సినిమా కోసం రీమిక్స్ చేయలేదట. ఓ ప్రైవేట్ ఆల్బమ్ కోసమట. -
సరికొత్త ప్రేమికుడు
‘‘ఈ చిత్రం పాటలు, ట్రైలర్ సరికొత్తగా ఉన్నాయి. కొత్త వాళ్లందరూ కలిసి చేసిన ఈ చిత్రం విజయవంతం అయితే తెలుగు పరిశ్రమకి మరికొంత మంది కొత్త టెక్నీషియన్స్, యాక్టర్స్ వచ్చే అవకాశం ఉంది. మానస్ బాగున్నాడు, భవిష్యత్తులో మంచి స్టార్ అవుతాడు’’ అని దర్శకుడు వీవీ వినాయక్ పేర్కొన్నారు. మానస్ ఎన్, సనమ్ శెట్టి జంటగా డీజీ పోస్టర్ సమర్పణలో ఎస్ఎస్ సినిమా పతాకంపై కళా సందీప్ దర్శకత్వంలో లక్ష్మీ నారాయణరెడ్డి, కె.ఇసనాక సునీల్ రెడ్డి నిర్మించిన చిత్రం. ‘ప్రేమికుడు’. విజయ్ బాలాజీ స్వరపరిచిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. వీవీ వినాయక్ పాటల సీడీ విడుదల చేసి, దర్శకుడు ఏయస్ రవికుమార్ చౌదరికి అందించారు. హీరో, హీరోయిన్లు మానస్, సనమ్ శెట్టి, నిర్మాతలు బెక్కెం వేణుగోపాల్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, చిత్రబృందం తదితరులు పాల్గొన్నారు. -
ప్రేయసి కోసం!
మనసుకు నచ్చిన అమ్మాయి కోసం సప్త సముద్రాలు ఈదడానికి కూడా రెడీ అంటారు చాలా మంది కుర్రాళ్లు. ఓ యువకుడు ప్రేమ కోసం అలాంటి రిస్కే చేశాడు. చివరకు ఆ అమ్మాయి ప్రేమను ఎలా గెలుచుకున్నాడు? అనే కథాంశంతో రూపొందుతున్న చిత్రం ‘ప్రేమికుడు’. మానస్, సనమ్ శెట్టి జంటగా కళా సందీప్ దర్శకత్వంలో లక్ష్మి ఎన్. రెడ్డి ఈ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం లోగో ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. నిర్మాత మాట్లాడుతూ- ‘‘మనసుకు హత్తుకునే అందమైన ప్రేమకథ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. త్వరలో ఈ సినిమా పాటలను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని తెలిపారు. ‘‘ఇదొక స్క్రీన్‌ప్లే బేస్డ్ మూవీ. ఈ తరం మనోభావాలకు అద్దంపట్టే సినిమా’’ అని దర్శకుడు చెప్పారు. ఈ వేదికపై హీరో మానస్ పుట్టినరోజు వేడుక కూడా జరిగింది. ఈ వేడుకలో నిర్మాతలు దామోదర ప్రసాద్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
పుంగనూరు ప్రేమికుడు