సరికొత్త ప్రేమికుడు | Latest Lover Movie! | Sakshi
Sakshi News home page

సరికొత్త ప్రేమికుడు

Published Mon, Mar 14 2016 11:39 PM | Last Updated on Sun, Sep 3 2017 7:44 PM

సరికొత్త ప్రేమికుడు

సరికొత్త ప్రేమికుడు

‘‘ఈ చిత్రం పాటలు, ట్రైలర్ సరికొత్తగా ఉన్నాయి. కొత్త వాళ్లందరూ కలిసి చేసిన ఈ చిత్రం విజయవంతం అయితే తెలుగు పరిశ్రమకి మరికొంత మంది కొత్త టెక్నీషియన్స్, యాక్టర్స్ వచ్చే అవకాశం ఉంది. మానస్ బాగున్నాడు, భవిష్యత్తులో మంచి స్టార్ అవుతాడు’’ అని దర్శకుడు వీవీ వినాయక్ పేర్కొన్నారు. మానస్ ఎన్, సనమ్ శెట్టి జంటగా డీజీ పోస్టర్ సమర్పణలో ఎస్‌ఎస్ సినిమా పతాకంపై కళా సందీప్ దర్శకత్వంలో లక్ష్మీ నారాయణరెడ్డి, కె.ఇసనాక సునీల్ రెడ్డి నిర్మించిన చిత్రం. ‘ప్రేమికుడు’. విజయ్ బాలాజీ స్వరపరిచిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు.

వీవీ వినాయక్ పాటల సీడీ విడుదల చేసి, దర్శకుడు ఏయస్ రవికుమార్ చౌదరికి అందించారు. హీరో, హీరోయిన్లు మానస్, సనమ్ శెట్టి, నిర్మాతలు బెక్కెం వేణుగోపాల్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, చిత్రబృందం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement