Telugu industry
-
తెలుగు సినిమాలపై ప్రేమలో పడుతున్న హీరోయిన్లు
దేశవ్యాప్తంగా తెలుగు సినిమాలకు ప్రేక్షకాదరణ దక్కుతోంది. టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలైతే ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్నాయి. ఆడియన్స్‌ను మెప్పిస్తున్నాయి. దీంతో టాలీవుడ్లో సినిమాలు చేయాలని చాలామంది హీరోయిన్స్ ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇలా ఇక్కడ అవకాశం దక్కించుకుని, ఈ ఏడాది తెలుగు ఇండస్ట్రీలో తొలి అడుగు వేస్తున్న హీరోయిన్స్‌పై కథనం.డబుల్ ధమాకాకన్నడ ‘కేజీఎఫ్’ మూవీలతో తెలుగు ప్రేక్షకులనూ మెప్పించారు హీరోయిన్ శ్రీనిధీ శెట్టి. ఈ బ్యూటీ ఈ ఏడాది తెలుగు తెరపై కనిపించనున్నారు. శ్రీనిధీ శెట్టి ప్రస్తుతం రెండు స్ట్రయిట్ తెలుగు మూవీస్ చేస్తున్నారు. ‘హిట్’ మూవీ ఫ్రాంచైజీలో రూపొందుతున్న తాజా చిత్రం ‘హిట్: ది థర్డ్ కేస్ 3 (హిట్ 3)’. ఇందులో పోలీసాఫీసర్ అర్జున్ సర్కార్‌గా నాని నటిస్తున్నారు. ఈ చిత్రంలో మృదులగా హీరోయిన్ పాత్రను శ్రీనిధీ శెట్టి చేస్తున్నారు. వాల్ పోస్టర్ సినిమా, యునానిమస్ ప్రోడక్షన్స్ పతాకాలపై డా. శైలేష్ కొలను దర్శకత్వంలో ప్రశాంతి త్రిపిర్నేని నిర్మిస్తున్న ఈ హిట్ 3 మూవీ మే 1న విడుదల కానుంది.ఇక శ్రీనిధి ఓ హీరోయిన్ గా చేస్తున్న మరో మూవీ ‘తెలుసు కదా’. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా చేస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీతో ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంలో శ్రీనిధీ శెట్టి, రాశీ ఖన్నా హీరోయిన్లుగా చేస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ మూవీ ఈ ఏడాదే రిలీజ్ కానుంది. ‘హిట్ 3, తెలుసు కదా’... ఇలా ఒకేసారి రెండు సినిమాలతో డబుల్æధమాకాగా శ్రీనిధీ శెట్టి టాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తున్నారు.పదేళ్ల తర్వాత...నటిగా కెరీర్‌ను స్టార్ట్ చేసిన పదేళ్ల తర్వాత టాలీవుడ్‌కు వస్తున్నారు హీరోయిన్ మాళవికా మోహనన్ . ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో ‘రాజా సాబ్’ అనే హారర్ కామెడీ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో మాళవికా మోహనన్ , నిధీ అగర్వాల్ హీరోయిన్స్‌గా చేస్తున్నారు. మాళవికాకు ఇదే తొలి తెలుగు సినిమా. ఈ సినిమాలో మాళవిక ఓ డిఫరెంట్ రోల్ చేస్తున్నారు. ఆమె పాత్రకు కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లు కూడా ఉంటాయని తెలిసింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 10న రిలీజ్ చేయనున్నట్లుగా ఇటీవల మేకర్స్ ప్రకటించారు. కానీ ‘రాజా సాబ్’ మూవీ ఏప్రిల్ 10న రిలీజ్ కావడం లేదని, కొత్త విడుదల తేదీని మేకర్స్ త్వరలోనే వెల్లడిస్తారని తెలిసింది. కాగా విజయ్ దేవరకొండ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్‌లో చేయాల్సిన ఓ స్పోర్ట్స్ డ్రామా ‘హీరో’ (అప్పట్లో ప్రచారంలోకి వచ్చిన టైటిల్)లో మాళవికా మోహనన్ హీరోయిన్ గా చేయాల్సింది. 2019 వేసవిలో ఈ మూవీ ఓపెనింగ్ కూడా జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల క్యాన్సిల్ అయ్యింది. ఇలా... టాలీవుడ్‌కి మాళవిక రాక ఆలస్యమైంది.రీమేక్‌తో ఎంట్రీప్రముఖ తమిళ దర్శక–నిర్మాత శంకర్ కుమార్తె అదితీ శంకర్ ఈ ఏడాది తెలుగు పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. బెల్లంకొండ సాయిశ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ హీరోలుగా నటిస్తున్న మూవీ ‘భైరవం’. ఈ మూవీలో అదితీ శంకర్, దివ్యా పిళ్లై, ఆనంది హీరోయిన్స్‌గా చేస్తున్నారు. కాగా అదితీ శంకర్‌కు ‘భైరవం’ తెలుగులో తొలి చిత్రం. డా. జయంతి లాల్ గడ సమర్పణలో విజయ్ కనకమేడల దర్శకత్వంలో కేకే రాధామోహన్ నిర్మిస్తున్న ఈ మూవీ త్వరలోనే రిలీజ్ కానుంది. గత ఏడాది మేలో రిలీజైన తమిళ హిట్ మూవీ ‘గరుడన్ ’కు తెలుగు రీమేక్‌గా ‘భైరవం’ మూవీ తెరకెక్కుతున్నట్లు టాక్.ఫౌజీకి జోడీగా...స్టార్ హీరో ప్రభాస్ కథానాయకుడిగా రూపొందుతున్న భారీ మూవీ ‘ఫౌజీ’ (ప్రచారంలో ఉన్న టైటిల్) తో హీరోయిన్ గా తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అవడం అనేది చిన్న విషయం కాదు. ఈ అవకాశం యంగ్ హీరోయిన్ ఇమాన్వీకి దక్కింది. ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి డైరెక్షన్ లో ఓ పీరియాడికల్ లవ్ అండ్ పేట్రియాట్రిక్ మూవీగా ‘ఫౌజి’ రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. మైత్రీమూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీలో ప్రభాస్ సరసన ఇమాన్వీ హీరోయిన్గా నటిస్తున్నారు.ఇమాన్వీకి ఫస్ట్ మూవీ ఇదే. హైదారాబాద్ శివార్లలో జరుగుతున్న ఈ మూవీ చిత్రీకరణలో ఇమాన్వీ పాల్గొంటున్నారు. ప్రభాస్, ఇమాన్వీలతో పాటు ప్రధాన తారాగణం పాల్గొంటున్న ఈ షెడ్యూల్లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు మేకర్స్. జయప్రద, మిథున్ చక్రవర్తి ఈ సినిమాలో కీలక పాత్రలు చేస్తున్నారు. ఇలా కెరీర్ స్టార్టింగ్‌లోనే ప్రభాస్, జయప్రద, మిథున్ చక్రవర్తి వంటి పెద్ద యాక్టర్స్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడం అనేది ఇమాన్వీకి కచ్చితంగా ప్లస్ పాయింటే. ఇక సోషల్ మీడియా మాధ్యమాల్లో ఇమాన్వీ యాక్టింగ్ అండ్ డ్యాన్సింగ్ స్కిల్స్ చూసి, దర్శకుడు హను రాఘవపూడి ఆమెకు ‘ఫౌజీ’ మూవీలో అవకాశం కల్పించారట.కాంతార అమ్మాయికన్నడ బ్లాక్‌బస్టర్ ‘కాంతార’ సినిమాలో హీరోయిన్ గా చేసిన సప్తమీ గౌడ తెలుగు ప్రేక్షకులకు గుర్తుండే ఉంటారు. ఈ బ్యూటీ ‘తమ్ముడు’ మూవీతో తెలుగు పరిశ్రమకు వస్తున్నారని తెలిసింది. నితిన్ హీరోగా వేణు శ్రీరామ్ డైరెక్షన్లో రూపొందుతున్న చిత్రం ‘తమ్ముడు’. ఈ సినిమాలో నితిన్ సరసన సప్తమీ గౌడ హీరోయిన్ నటిస్తున్నారు. లైలా మరో లీడ్ రోల్లో కనిపిస్తారు. వేణు శ్రీరామ్ డైరెక్షన్లో ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ మూవీని ఈ శివరాత్రికి థియేటర్స్‌లో రిలీజ్ చేయనున్నట్లుగా అప్పట్లో మేకర్స్ ప్రకటించారు. అయితే ‘తమ్ముడు’ సినిమా విడుదలపై మరోసారి స్పష్టత రావాల్సి ఉంది.మ్యూజికల్ మ్యాజిక్ప్రముఖ దర్శకుడు మణిరత్నం ‘΄పొన్నియిన్ సెల్వన్ ’ మూవీలో ఐశ్వర్యా రాయ్ యంగ్ రోల్ చేసిన నటి సారా అర్జున్ గుర్తుండే ఉంటారు. ఈ యంగ్ హీరోయిన్ స్ట్రయిట్‌గా తెలుగులో చేస్తున్న మూవీ ‘మ్యాజిక్’. ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తున్న ఈ మ్యూజికల్ డ్రామా మూవీలో సారా అర్జున్ ఓ లీడ్ రోల్ చేస్తున్నారు. సితార ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం రిలీజ్ కానుంది.కాలేజ్ ఫెస్టివల్ కోసం నలుగురు టీనేజర్లు ఓ ఒరిజనల్ సాంగ్‌ను కంపోజ్ చేయాలనుకునే ప్రయత్నంలో వారికి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయన్నది ఈ సినిమా కథాంశమని సమాచారం. ఈ మూవీలో ఎనిమిది పాటలు ఉంటాయట. ఇక ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్ స్వరాలు సమకూర్చు తుండటం విశేషం. ఈ మూవీ ఈ ఏడాదిలోనే రిలీజ్ కానుంది.అచ్చ తెలుగు అమ్మాయిప్రముఖ దర్శకుడు వైవీఎస్ చౌదరి డైరెక్షన్ లోని సినిమాలతో ఇలియానా వంటి హీరోయిన్ ్స తెలుగు తెరకు పరిచయం అయ్యారు. కాగా ఆయన డైరెక్షన్ లో రానున్న తాజా చిత్రంతో వీణా రావు అనే తెలుగు అమ్మాయి హీరోయిన్ గా తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నారు. ఈ లవ్‌స్టోరీ మూవీలో నందమూరి హరికృష్ణ మనవడు, జానకిరామ్ కుమారుడు నందమూరి తారక రామరావు హీరోగా పరిచయం అవుతున్నారు. న్యూ టాలెంట్ రోర్స్ పతాకంపై ఈ మూవీని గీత నిర్మిస్తున్నారు. ఈ మూవీ ఈ ఏడాదే రిలీజ్ కానుంది. అచ్చ తెలుగు అమ్మాయి అయిన వీణా రావుకు కూచిపూడి డ్యాన్స్‌లోనూ ్రపావీణ్యం ఉందని, మేకర్స్ ఇటీవల ఓ సందర్భంగా వెల్లడించారు.ఇటు టాలీవుడ్.. అటు బాలీవుడ్ విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ ‘లైలా’. రామ్ నారాయణ్ డైరెక్షన్ లో షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ ‘లైలా’ మూవీలో ఆకాంక్షా శర్మ హీరోయిన్ గా చేస్తున్నారు. ఈ కన్నడ బ్యూటీకి తెలుగులో ఇదే తొలి సినిమా. ఈ నెల 14న ‘లైలా’ మూవీ రిలీజ్ కానుంది. మరోవైపు ఈ ఏడాదే బాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇవ్వనున్నారు ఆకాంక్ష. ‘తేరా యార్ హూ మై, కేసరి వీర్’ చిత్రాలతో పాటు దర్శకుడు మిలిప్ జవేరి డైరెక్షన్ లోని మరో మూవీలో నటిస్తున్నారు ఆకాంక్ష. ఈ చిత్రాల్లో ఏది ముందు రిలీజ్ అవుతుందో చూడాలి. ఇలా ఇటు తెలుగు అటు బాలీవుడ్లో ఒకే టైమ్‌లో ఆకాంక్ష ఎంట్రీ ఖరారు కావడం విశేషమనే చెప్పుకోవాలి.ఇలా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్న హీరోయిన్స్ మరికొందరు ఉన్నారు. ఇంకొంత మంది హీరోయిన్స్ తెలుగుకు వచ్చేందుకు కథలు వింటున్నారు. – ముసిమి శివాంజనేయులు -
టాలీవుడ్ ప్రముఖుల ముందు ప్రభుత్వ ప్రతిపాదనలు
-
ఆ రూల్స్ లేకపోవడం వల్లే మనకు ఈ దౌర్భాగ్యం: కోట శ్రీనివాసరావు
-
శర్వానంద్ పెళ్లి ఆగిపోయిందా?
-
ముచ్చటగా మూడు
తెలుగు పరిశ్రమ లోకి ‘రెడ్డీస్ మల్టీప్లెక్స్ మూవీస్’ అనే నిర్మాణ సంస్థ ఎంట్రీ ఇచ్చింది. సోమవారం హైదరాబాద్‌లో మూడు సినిమాల్ని పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు సంస్థ అధినేత విజయ్ రెడ్డి. తొలి ప్రయత్నంగా ప్రసాద్‌ని దర్శకుడిగా పరిచయం చేస్తూ ‘సోషల్ వర్కర్స్’ సినిమా నిర్మిస్తున్నారు. ఇందులో ఎనిమిది మంది హీరోయిన్లు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. అలాగే మహేందర్ రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ మిత్ర ప్రధాన పాత్రలో మిత్ర మూవీస్ భాగస్వామ్యంతో ‘కోబలి’ని రెండో చిత్రంగా నిర్మిస్తున్నారు. మూడో మూవీగా ‘హ్యాపీ విమెన్స్ డే’ రూపొందనుంది. తొలి సీన్‌కి నటుడు బాబూ మోహన్ క్లాప్ కొట్టారు. విజయ్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘రెడ్డీస్ మల్టీప్లెక్స్ మూవీస్ ఆఫీసులను ముంబై, చెన్నై, హైదరాబాద్, విశాఖపట్నంలో ప్రారంభించాం. ఔత్సాహిక దర్శకులు, నూతన నటీనటులు మమ్మల్ని సంప్రదించవచ్చు’’ అన్నారు. -
చిరంజీవి కొత్త సినిమా థియేటర్ తో పాటు ఫైబర్ నెట్ లో రిలీజ్ అయితే
-
ఎంట్రీ అదుర్స్
-
కృష్ణంరాజుని రెబల్ స్టార్ అని ఎందుకంటారంటే...
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనదైన ఆహార్యంతో నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు రెబల్‌స్టార్ కృష్ణం రాజు. చిలకా గోరింకా’ చిత్రంతో వెండితెర అరంగ్రేటం చేసిన ఆయన ‘అవేకళ్లు’ చిత్రంలో ప్రతినాయకుడిగానూ నటించి తానేంటో నిరూపించుకున్నారు. ‘తాండ్ర పాపారాయుడు’ చిత్రానికి ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకున్నారు. 2006లో ఫిల్మ్‌ఫేర్ దక్షిణాది జీవిత సాఫల్య పురస్కారం పొందారు. ఎప్పటికప్పుడు తన నటనతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ‘బొబ్బిలి బ్రహ్మన్న’ లాంటి మాస్ చిత్రంలో నటించిన ఆయన భక్తిరస చిత్రం ‘భక్త కన్నప్ప’తో ప్రేక్షకులను తన నటనతో అలరించాడు. ప్రత్యేకంగా కృష్ణంరాజు తన నటనాశైలితో రెబల్‌స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు. ఆయన సినిమాలో పాత్రలే ఈ పేరుని సంపాదించిపెట్టాయి. తన ఐదున్నర దశాబ్దాల సినీ ప్రయాణంలో 183 పైగా చిత్రాలలో నటించారు. ఉత్తమ నటుడిగా ప్రారంభ నంది అవార్డును కూడా గెలుచుకున్నారు. ఆయన సినీ ప్రస్థానంలో ఐదు ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్, మూడు రాష్ట్ర నంది అవార్డులను గెలుచుకున్నారు. జీవన తరంగాలు (1973), కృష్ణవేణి (1974), భక్త కన్నప్ప (1976), అమర దీపం (1977), సతీ సావిత్రి (1978), కటకటాల రుద్రయ్య (1978), మన వూరి పాండవులు (1978) వంటి అనేక విజయవంతమైన చిత్రాలలో ఆయన నటించారు. రంగూన్ రౌడీ (1979), శ్రీ వినాయక విజయము (1979), సీతా రాములు (1980), టాక్సీ డ్రైవర్ (1981), త్రిశూలం (1982), ధర్మాత్ముడు (1983), బొబ్బిలి బ్రహ్మన్న (1984), తాండ్ర పాపరాయుడు (1986), మరణ శాసనం (1987), విశ్వనాథ నాయకుడు (1987), అంతిమ తీర్పు (1988), బావ బావమరిది (1993), పల్నాటి పౌరుషం (1994) సినిమాలు ఆయనకు మంచి పేరుని తెచ్చిపెట్టాయి. సాంఘిక చిత్రాలతో పాటు పౌరాణిక, జానపద కథల్లోనూ నటించి తన విశిష్టతను చాటుకున్నారు. కుటుంబ నేపథ్యం కృష్ణంరాజు అసలు పేరు ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు. 1940 జనవరి 20న పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో జన్మించారు. ఆయన భార్య శ్యామలాదేవి, కుమార్తెలు ప్రసీది, ప్రకీర్తి, ప్రదీప్తి ఉన్నారు. ప్రముఖ నటుడు ప్రభాస్ ఆయన సోదరుడు ఉప్పలపాటి సూర్యనారాయణరాజు కుమారుడు. ప్రభాస్ నట ప్రయాణం తన జీవితంలో అత్యంత సంతృప్తినిచ్చే విషయమని కృష్ణంరాజు ఎప్పుడూ చెప్తుండేవారు. చదవండి: Krishnam Raju: రాజకీయాల్లోనూ కీలక పాత్ర పోషించిన రెబల్‌స్టార్ -
డైరెక్షన్ టు టాలీవుడ్!
పొరుగింటి డైరెక్టర్ల డైరెక్షన్ మారింది. వాళ్ల డైరెక్షన్ టాలీవుడ్‌కి మారింది. ఎక్కడెక్కడి డైరెక్టర్లు ఇప్పుడు తెలుగులోకి వస్తున్నారు. తెలుగులో భారీ చిత్రాలకు దర్శకత్వం వహిస్తున్నారు. బాలీ, కోలీ, మాలీ, శాండల్... ఈ అన్ని వుడ్స్ డైరెక్టర్లు మన తెలుగులో సినిమాలు చేస్తున్నారు. ఆ దర్శకుల గురించి తెలుసుకుందాం. తెలుగు పరిశ్రమలో తెలుగు దర్శకులే ఉన్నారా? అంటే.. కాదు. పరభాషా దర్శకులు కూడా అప్పుడప్పుడు సినిమాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఎక్కువమంది రావడం విశేషం. ‘బాహుబలి’ అద్భుత విజయం తర్వాత భారతీయ చిత్రపరిశ్రమ చూపు తెలుగుపై పడిందనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. తెలుగులో ప్యాన్ ఇండియన్ సినిమాల నిర్మాణం పెరిగింది. అందుకే ఇతర ఇండస్ట్రీల దర్శకులు కూడా కథలు రాసుకుని తెలుగు హీరోలకు వినిపిస్తున్నారు. తమ డైరెక్షన్‌ను టాలీవుడ్ వైపు తిప్పుకుంటున్నారు. మలయాళ దర్శకుడు జీతూ జోసెఫ్ కెరీర్లో ‘దృశ్యం’, ‘దృశ్యం 2’ చిత్రాలది ప్రత్యేక స్థానం. ఈ రెండు చిత్రాలూ ఆయన్ను ఇతర భాషల్లోనూ పాపులర్ చేశాయి. ‘దృశ్యం’ సినిమా తమిళ రీమేక్ ‘పాపనాశం’ని తెరకెక్కించి, తమిళ ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయం అయ్యారు జీతు. ఇందులో కమల్ హాసన్ నటించారు. ఇప్పుడు ‘దృశ్యం 2’ తెలుగు రీమేక్‌కు దర్శకత్వం వహించి, తెలుగు చిత్రపరిశ్రమలోకి దర్శకుడిగా తొలి అడుగు వేశారు జీతు. తెలుగు ‘దృశ్యం’ (ఈ చిత్రానికి సుప్రియ దర్శకురాలు) పార్ట్ వన్‌లో హీరోగా నటించిన వెంకటేశ్.. రెండో పార్టులోనూ హీరోగా నటించారు. త్వరలో ఈ చిత్రం విడుదల కానుంది. ‘బాహుబలి’ బ్లాక్‌బస్టర్ ప్రభాస్‌ను ప్యాన్ ఇండియన్ స్టార్‌ని చేసింది. దీంతో పక్క ఇండస్ట్రీ దర్శకులు కూడా ప్రభాస్‌తో సినిమాలు చేయాలని ఉత్సాహం చూపిస్తున్నారు. ‘కేజీఎఫ్’ ఫేమ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా ప్రభాస్ కోసం ఓ కథ రాసి, వినిపించారు. ప్రభాస్‌కి కథ నచ్చడంతో ఈ కన్నడ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ ఇద్దరి కాంబినేషన్లో రూపొందుతున్న ‘సలార్’ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 14న విడుదల కానుంది. అలాగే బాలీవుడ్లో ‘తన్హాజీ’ చిత్రంతో టెక్నికల్‌గా మంచి గ్రిప్ ఉన్న దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ఓం రౌత్‌తో ‘ఆదిపురుష్’ అనే మైథాలజీ ఫిల్మ్ చేస్తున్నారు ప్రభాస్. ఇలా ఒకేసారి ఇద్దరు పక్క ఇండస్ట్రీ దర్శకులతో ప్రభాస్ సినిమాలు చేయడం విశేషం. అలాగే హిందీ సినిమా ‘వార్’ ఫేమ్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్‌తో ప్రభాస్ ఓ సినిమా చేయనున్నారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇక 2021లో జరిగిన ఓ విశేషం.. శంకర్ తెలుగు సినిమా చేయనుండటం. ‘ఇండియన్’ ‘జీన్స్’, ‘రోబో’, ‘అపరిచితుడు’, ‘శివాజీ’ ఇలా చెప్పుకుంటూ పోతే దర్శకుడు శంకర్ కెరీర్లో బ్లాక్ బస్టర్ సినిమాలు చాలా ఉన్నాయి. ఈ చిత్రాలు తెలుగులో అనువాదమై సూపర్‌హిట్స్‌గా నిలిచాయి. కానీ తన 28 ఏళ్ళ కెరీర్లో శంకర్ తెలుగులో స్ట్రయిట్ సినిమా చేయడం ఇదే మొదటిసారి. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా ఓ ప్యాన్ ఇండియన్ మూవీ త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ చిత్రం ఓ సోషల్ డ్రామాగా రూపొందనుందనే ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. ఇక తమిళంలో ఉన్న మంచి మాస్ దర్శకుల్లో లింగస్వామి ఒకరు. అందుకు ఓ నిదర్శనం విశాల్‌తో ఆయన తెరకెక్కించిన తమిళ చిత్రం ‘సండై కోళి’ (తెలుగులో ‘పందెంకోడి’). ఆ తర్వాత లింగుస్వామి తెలుగులో ఓ స్ట్రయిట్ ఫిల్మ్ తీయాలనుకున్నారు. ఓ సందర్భంలో అల్లు అర్జున్‌తో లింగు స్వామి సినిమా ఓకే అయిందనే టాక్ కూడా వినిపించింది. కానీ వీరి కాంబినేషన్లోని సినిమా సెట్స్‌పైకి వెళ్ళలేదు. ఇప్పుడు రామ్ హీరోగా లింగుస్వామి సినిమా చేసేందకు సిద్ధమయ్యారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. ‘అవళ్’ (తెలుగులో ‘గృహం’), ‘కాదల్ టు కల్యాణం’ వంటి సినిమాలను ప్రేక్షకులకు అందించిన మిళింద్ రావ్ డైరెక్షన్లో రానా హీరోగా ఓ సినిమా రానుంది. ఇందులో రానా పోలీసాఫీసర్ అనే ప్రచారం జరగుతోంది. ఇటీవల విడుదలైన రానా ‘అరణ్య’ చిత్రానికి దర్శకత్వం వహించింది కూడా తమిళ దర్శకుడు ప్రభు సాల్మాన్ కావడం విశేషం. వీళ్లు మాత్రమే కాదు.. మరికొందరు పరభాషా దర్శకులు తెలుగు సినిమాలు తెరకెక్కించే అవకాశం ఉంది. తెలుగులో పరభాషా కథానాయికలు, విలన్లు, సహాయ నటులు ఎక్కువమందే ఉన్నారు. ఇప్పుడు పొరుగింటి దర్శకుల జాబితా కూడా పెరుగుతోంది. మన తెలుగులో ప్రతిభావంతులు ఎక్కువే. అయితే ప్రతిభ ఎక్కడున్నా ప్రోత్సహించే మనసు ‘తెలుగు పరిశ్రమ’కు ఉంది కాబట్టే... ఇంతమంది పరభాషల వారు ఇక్కడ సినిమాలు చేయగలుగుతున్నారు. వీళ్లూ వస్తారా? తమిళ దర్శకులు అట్లీ, లోకేష్ కనగరాజ్ తాము తెలుగులో సినిమాలు చేయడానికి సిద్ధంగానే ఉన్నామని పలు సందర్భాల్లో పేర్కొన్నారు. ఒక దశలో అట్లీ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, లోకేష్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోలుగా నటిస్తారనే వార్తలు కూడా వచ్చిన సంగతి తెలిసిందే. ‘ఇరుంబుతిరై’ (తెలుగులో ‘అభిమన్యుడు’) ఫేమ్ పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో అఖిల్ హీరోగా ఓ సినిమా రూపొందనుందని ఎప్పట్నుంచో ప్రచారం సాగుతోంది. సో... వీళ్లూ తెలుగులోకి వచ్చే చాన్స్ ఉంది. -
పరిశ్రమ ఇకనైనా కళ్లు తెరవాలి!
‘తెలుగు సినిమాతల్లి బర్త్‌డే’ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. హెచ్.ఎం.రెడ్డి తీసిన మన తొలి పూర్తితెలుగు టాకీ ‘భక్త ప్రహ్లాద’ బొంబాయి కృష్ణా థియేటర్లో 1932 ఫిబ్రవరి 6న విడుదలైందని ప్రముఖ జర్నలిస్ట్ – పరిశోధకుడు రెంటాల జయదేవ నిరూపించారు. అప్పటి నుంచి ‘కళా మంజూష’ ఏటా ఫిబ్రవరి 6న ‘తెలుగు సినిమా తల్లి పుట్టినరోజు’ జరుపుతోంది. ఈసారి ‘తెలుగు సినిమా వేదిక’, ‘నేస్తం ఫౌండేషన్’ తోడయ్యాయి. ‘‘స్వచ్ఛంద సంస్థలు కాకుండా, సినీ పరిశ్రమకు ప్రాతినిధ్యం వహించే పెద్దలు, ఛాంబర్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, డైరెక్టర్స్ అసోసియేషన్, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లాంటివి ఇకనైనా కళ్ళు తెరిచి, ఇక ప్రతి ఏడాదీ తెలుగు సినిమా తల్లి పుట్టినరోజు జరపాలి’’ అని సభలో పలువురు ప్రముఖులు పేర్కొన్నారు. ‘‘అరుదైన పాత సినిమాల ప్రింట్లను డిజిటలైజ్ చేయించి, సినీచరిత్ర నూ, సమాచారాన్నీ భద్రపరిచే పనిని రాష్ట్ర ఆర్కైవ్స్, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ల ద్వారా ఇప్పటికైనా చేయించాలి’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రసాద్ ల్యాబ్స్ రమేశ్‌ప్రసాద్, పరుచూరి గోపాలకృష్ణ, దర్శకుడు ఎన్. శంకర్, నిర్మాతలు ఆదిశేషగిరిరావు, ఏ.ఎం.రత్నం, విజయ్‌కుమార్ వర్మ, నటి కవిత, కెమెరామ్యాన్ ఎం.వి. రఘు అతిథులుగా హాజరయ్యారు. దర్శకులు బాబ్జీ, రామ్ రావిపల్లి, నిర్మాతలు గురురాజ్, విజయ వర్మ, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, మోహన్ గౌడ్, ఫిల్మ్ స్కూల్ ఉదయ్ కిరణ్, జర్నలిస్ట్ రెంటాల జయదేవ మాట్లాడారు. దివంగత నిర్మాత వి.దొరస్వామిరాజు పేరిట సీనియర్ నిర్మాతలు ఎన్.ఆర్. అనురాధాదేవి, జాగర్లమూడి రాధాకృష్ణమూర్తి, గొట్టిముక్కల సత్యనారాయణరాజు, దర్శక – నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజలకు పురస్కారాలు అందించారు. జయదేవ, పరుచూరి, వెంకట్, కవిత, తుమ్మలపల్లి, తమ్మారెడ్డి, ఎన్. శంకర్, గురురాజ్, బాబ్జీ, రామ్ రావిపల్లి -
కైకాల సత్యనారాయణ బర్త్‌డే స్పెషల్ రేర్ ఫోటోలు
-
హీరో నాగచైతన్య ఫోటోలు
-
బ్యాక్‌గ్రౌండ్ అలా వర్కవుట్ అవుతుంది
నెపోటిజమ్ గురించి మాట్లాడాలంటే... ప్రతి ఇండస్ట్రీలోనూ వారసులు ఉన్నారు. కొత్తవారూ వస్తున్నారు. తెలుగు పరిశ్రమలో మూడు నాలుగు తరాలకు సంబంధించిన వారసులు ఉన్నారు. హిందీ పరిశ్రమలో కొందరు చెబుతున్నట్లుగా తెలుగు ఇండస్ట్రీలో ‘నెపోటిజమ్’ ఉందా? ఇదే విషయం గురించి సినిమా నేపథ్యంలేనివాళ్లను, ఉన్నవాళ్లను అడిగి తెలుసుకుందాం... ßæరో రాజశేఖర్, నటి జీవిత ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండానే వచ్చి, సక్సెస్ అయ్యారు. అయితే వారి ఇద్దరు కుమార్తెలు శివాని, శివాత్మిలకు ఈ ఇద్దరూ మంచి బ్యాక్‌గ్రౌండ్. ఈ తేడా గురించి జీవిత మాట్లాడుతూ– ‘‘బ్యాక్‌గ్రౌండ్ ఉందా? లేదా అనేది కాదు.. ఇక్కడ లక్ చాలా ముఖ్యం. ప్రతిభ చాలా చాలా ముఖ్యం. మా అప్పుడు మా అమ్మానాన్నల కష్టాలు తెలుసుకుంటూ పెరిగాం కాబట్టి కష్టాలను అధిగమించి, నిలదొక్కుకున్నాం. అయితే నాకిప్పటికీ ఏమనిపిస్తుందంటే.. బ్యాక్‌గ్రౌండ్ ఉండి ఉంటే రాజశేఖర్‌గారు ఇంకా మంచి స్థాయిలో ఉండి ఉండేవారని. అయితే బ్యాక్‌గ్రౌండ్ లేనంత మాత్రాన ఇక్కడ ఉండలేం అని కాదు. బ్యాక్‌గ్రౌండ్ ఎలా వర్కవుట్ అవుతుందంటే.. ఫస్ట్ సినిమా సక్సెస్ కాకపోయినా మూడు నాలుగు సినిమాలు చేసుకునే పరిస్థితి వాళ్లకి ఉంటుంది. డబ్బులు ఉంటాయి, సపోర్ట్ ఉంటుంది. కానీ బ్యాక్‌గ్రౌండ్ లేనివాళ్లకు ఆ చాన్స్ తక్కువ. టాలెంట్ ఉన్నా పైకి రానివ్వని పరిస్థితి ఇక్కడ లేదు. రానివ్వగలుగుతారు. ఒక్కోసారి బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా అవకాశాలు ఇవ్వరు. జీవితారాజశేఖర్ కూతుళ్లు అని అవకాశాలు ఇచ్చేయడం లేదు. తెలుగమ్మాయిలు లేరంటారు. ఉన్నవారికి ఇవ్వరు. ఏ గైడ్‌లైన్స్‌తో చాన్స్ ఇస్తారన్నది చెప్పలేను. కానీ బ్యాక్‌గ్రౌండ్‌లో మా సపోర్ట్ ఉం టుంది కాబట్టి వాళ్లకి ఏ ఇబ్బందీ ఉండదు’’ అన్నారు. – నటి, దర్శక–నిర్మాత జీవితా రాజశేఖర్ శివాని, జీవిత,శివాత్మిక నా గాయాలు చాలా లోతైనవి హీరోగా కొన్ని చిత్రాలు, విలన్‌గా బోలెడన్ని చిత్రాలు, దర్శక–నిర్మాతగా కొన్ని... ఇలా ప్రకాశ్ రాజ్ ఎప్పుడూ బిజీ. ఇటు సౌత్ అటు నార్త్‌కి కావాల్సిన నటుడు. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్వశక్తితో పైకొచ్చిన నటుడు. ‘‘నెపోటిజమ్ నాకు అనుభవమే. దీంతోనే నేను జీవితాన్ని కొనసాగించాను. నా గాయాలు నా రక్తమాంసాలకన్నా లోతైనవి. కానీ ఈ కుర్రాడు (సుశాంత్ సింగ్ రాజ్‌పుత్) నిలబడలేకపోయాడు. ‘మనం నేర్చుకుంటామా? కలలు కన్నవాళ్లు చనిపోకుండా వాళ్ల కోసం నిజంగా మనం నిలబడగలమా? జస్ట్ అడుగుతున్నాను’’ అని ట్వీట్ చేశారు ప్రకాశ్ రాజ్. – నటుడు, దర్శక–నిర్మాత ప్రకాశ్ రాజ్ మాకు రెడ్ కార్పెట్ ఉంటుంది కానీ... విలక్షణ నటుడు మంచు మోహన్‌బాబు కుమార్తెగా లక్ష్మీ మంచుది పెద్ద బ్యాక్‌గ్రౌండ్. మరి.. ఇది ఎంతవరకు ఉపయోగపడిందో లక్ష్మీని అడుగుదాం... అవును.. బ్యాక్‌గ్రౌండ్ ఉన్న మాకు రెడ్ కార్పెట్ ఉంటుంది. మాకు ఈజీగా అవకాశాలు వస్తాయి. వాళ్ల అభిమాన హీరో లేక హీరోయిన్ కూతురనో, కొడుకు అనో మమ్మల్ని ఆదరించడానికి ప్రేక్షకులు రెడీగా ఉంటారు. అయితే ఇవన్నీ ఉన్నా మమ్మల్ని మేం నిరూపించుకోవాలి. నెపోటిజమ్ ఉన్నప్పటికీ ఏ డైరెక్టర్ పిల్లలైనా, హీరోల పిల్లలైనా వారి సత్తా చూపించలేనప్పుడు కళామతల్లి ఆదరించదు. కళామతల్లికి అందరూ ఒకటే. బ్యాక్‌గ్రౌండ్ ఉన్న మాలాంటివాళ్లకు ఫస్ట్ చాన్స్ ఈజీగా వస్తుంది. ఆ తర్వాత మాత్రం మేం నిరూపించుకోవాలి. చెప్పాలంటే చాలా చాలా కష్టపడాలి. ఎందుకంటే అప్పటికే శిఖరాన్ని చేరుకున్న మా పెద్దలు ఉంటారు. మేం వారి స్థాయిని అందుకోవాలని ఎదురు చూస్తారు. ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చేవారి మీద అంచనాలు ఉండవు. సొంత పోరాటం చేసుకుంటూ ముందుకు వెళ్లిపోవచ్చు. మేం మా తల్లిదండ్రుల పోరాటాన్ని, మా పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాలి. బయటినుంచి వచ్చినవాళ్లకు, మాకు అదే తేడా. – నటి, నిర్మాత లక్ష్మీ మంచు బ్యాక్‌గ్రౌండ్ లేనివాళ్లూ సక్సెస్ అయ్యారు ‘అలా మొదలైంది’తో దర్శకురాలు కాకముందు నందినీ రెడ్డి సహాయ దర్శకురాలిగా చేశారు. సినిమా నేపథ్యం లేని మహిళ. స్వశక్తితో పైకి వచ్చిన నందనీ రెడ్డి ఏమంటున్నారో చూద్దాం. ఏ ఇండస్ట్రీలో అయినా బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవాళ్లూ ఉంటారు.. బయటినుంచి వచ్చినవాళ్లు కూడా ఉంటారు. అయితే అవుటర్స్ కూడా ఇక్కడ స్థిరపడే పరిస్థితులు ఉన్నాయి. నానీని తీసుకుందాం. తనకు బ్యాక్‌గ్రౌండ్ లేదు. కానీ మంచి కథలు ఎన్నుకుని, నటుడిగా వాటికి న్యాయం చేయడంలో సక్సెస్ అయ్యాడు. విజయ్ దేవరకొండ కూడా అంతే. ఇంకా నిఖిల్, నాగశౌర్య.. ఇలా బ్యాక్‌గ్రౌండ్ లేనివాళ్లు హ్యాపీగా సినిమాలు చేసుకోగలుగుతున్నారు. అయితే బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చినవారికి ఉండే లాభం ఏంటంటే.. వాళ్లకు ఈజీగా ఎంట్రీ దొరుకుతుంది. అయితే బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవాళ్లంతా సక్సెస్ అవుతున్నారా? అంటే లేదు. మన కళ్లముందే బ్యాక్‌గ్రౌండ్ ఉన్న చాలామంది ఫెయిల్యూర్లో ఉన్నారు. సో.. ఇక్కడ ప్రతిభ ముఖ్యం. – దర్శకురాలు నందినీ రెడ్డి – డి.జి.భవాని -
తెలుగు పాఠాలు
యాక్షన్ కింగ్‌గా పేరు తెచ్చుకున్న అర్జున్ ఇప్పుడు ఓ పెద్ద ప్లాన్‌లో ఉన్నారు. తన కుమార్తె ఐశ్వర్యా అర్జున్‌ని తెలుగుకి పరిచయం చేయాలన్నదే ఆ ప్లాన్. అర్జున్ కన్నడ అయినప్పటికీ తెలుగులోనూ మంచి మంచి సినిమాలు చేశారు. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానూ తెలుగు సినిమాలు చేస్తున్నారాయన. తెలుగు ఇండస్ట్రీ అంటే తనకు ప్రత్యేకమైన అభిమానం అంటున్న అర్జున్ తన కుమార్తె ఐశ్వర్యా అర్జున్‌ని తెలుగులోకి పరిచయం చేయాలనుకుంటున్నారు. ఐశ్వర్య హీరోయిన్గా అర్జున్ తెలుగులో ఓ సినిమా నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. ఓ అగ్ర తెలుగు నిర్మాతతో కలిసి ఆయన ఈ సినిమా రూపొందించనున్నారట. ఈ సినిమా కోసమే ఐశ్వర్య తెలుగు నేర్చుకుంటున్నారని తెలిసింది. ఇప్పటికే తమిళ, కన్నడ చిత్రాల్లో కథానాయికగా నటించి, మంచి నటి అనిపించుకున్న ఐశ్వర్య ఇప్పుడు టాలీవుడ్లో తనను ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారట. ప్రస్తుతం మలయాళ ‘ఇష్క్’ కన్నడ రీమేక్‌లో నటిస్తున్నారు ఐశ్వర్య. ఇక టాలీవుడ్ ఎంట్రీ గురించి త్వరలో అధికారికంగా ప్రకటించాలనుకుంటున్నారట. -
బ్యాలెన్స్ ఉంటే ఏ బ్యాలెన్సూ అక్కర్లేదు
ఎనభై ఏళ్ల వయసొచ్చాక శ్రుతీహాసన్ ఎలా ఉంటారు? ఎలా ఉన్నా.. తెలుగు సినిమాలో మాత్రం ఉంటారు! అంత అఫెక్షన్ శ్రుతీకి తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే. ‘కాటమరాయుడు’ తర్వాత.. మళ్లీ రెండేళ్లకు ఓ తెలుగు సినిమాకు సైన్ చేశారు శ్రుతీహాసన్. ఇప్పటికైతే ఆ వివరాలు సీక్రెట్. శ్రుతీని వెంటనే చూసేయాలని అనుకుంటే మాత్రం.. వచ్చే నెల అమెరికన్ టీవీ చానెల్లో మొదలౌతున్న ‘ట్రెడ్‌స్టోన్’ కోసం రిమోట్ పట్టుకుని కూర్చోవచ్చు. అందులో నీరా పటేల్‌గా శ్రుతి ఓ బ్యాలెన్స్డ్ పాత్రలో నటించారు. అంతకన్నా బ్యాలెన్సింగ్ విషయాలు ‘సాక్షి’కి శ్రుతీహాసన్ ఇచ్చిన ఈ ఇంటర్వ్యూలో చాలానే ఉన్నాయి. లండన్‌లో అమెరికన్ టీవీ సిరీస్ ‘ట్రెడ్ స్టోన్’ షూటింగ్‌తో బిజీ బిజీగా ఉన్నట్లున్నారు. ఈ సిరీస్ కోసం మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారట.? అవును.. నేర్చుకున్నాను. అమెరికన్ పాపులర్ యాక్షన్ మూవీ ‘ది బోర్న్’ సిరీస్ అధారంగా ఈ టీవీ సిరీస్ చేస్తున్నాం. ఇందులో నేను భారతదేశానికి చెందిన హంతకురాలు నీరా పటేల్ పాత్రలో కనిపిస్తాను. అక్టోబర్ 15 నుంచి అమెరికన్ టీవీ చానల్ యుఎస్ఎ నెట్‌వర్క్‌లో ఈ సిరీస్ ప్రసారం అవుతుంది. ఇందులో నా పాత్ర పెద్ద పెద్ద ఫైట్స్ చేస్తుంది. ఆ ఫైట్స్ కోసమే నాలుగు వారాలు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాను. సినిమా కోసం నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్ వ్యక్తిగతంగా కూడా పనికొచ్చేట్లు ఉన్నాయి. ఇప్పుడు ఎవరైనా నాతో తేడాగా ప్రవర్తిస్తే ఒక్క ‘కిక్’ ఇస్తాను (నవ్వుతూ). ఆడవాళ్లు సున్నితంగా ఉంటారు కాబట్టి మార్షల్ ఆర్ట్స్ చేయలేరని, నేర్చుకోవడం కష్టం అని అంటుంటారు స్త్రీ శరీరం వేరు. పురుషుడి శరీరం వేరు. మగవాళ్లు బలవంతులుగా ఉండటానికి కారణం ‘టెస్టోస్టెరోన్’ అనే హార్మోన్. ఆడవాళ్లకు ఈ హార్మోన్ లేకపోవడం వల్ల అంత బలంగా ఉండరు. అయితే ఫైట్ చేస్తున్నప్పుడు ఎదుటి వ్యక్తిని ఎక్కడ తొక్కాలి? ఎంత స్పీడ్‌గా కిక్ చేయాలి? వెనక నుంచి అతన్ని ఎలా పడగొట్టాలి? వంటి టెక్నిక్స్ ఉంటాయి. అవి నేర్చుకుంటే ఎంతటి బలవంతుడితోనైనా స్త్రీ పోరాడగలుగుతుంది. నేనెప్పుడూ చెబుతుంటాను.. అమ్మాయిలకు మార్షల్ ఆర్ట్స్ నేర్పించాలని. అలా మిమ్మల్ని మీరు రక్షించుకున్న సందర్భం ఏదైనా? ఒకే ఒకటి. నేను ముంబైలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి నా ఇంట్లోకి చొరబడ్డాడు. అప్పటికి నాకు మార్షల్ ఆర్ట్స్ తెలియదు. కానీ ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనేంత ధైర్యం ఉంది. నిజానికి ఇలాంటివి ఎదురైనప్పుడు కొందరు అమ్మాయిలు ముందు ‘బ్లాంక్’ అయిపోతారు. కానీ ఆ రోజు నేను అతన్ని వేగంగా తోసేసి, బయటకు పారిపోయేలా చేయగలిగాను. హిందీ మూవీ ‘లక్’తో హీరోయిన్గా పరిచయం అయ్యారు. ఈ ఏడాదికి పదేళ్లు పూర్తి చేసుకున్నారు. ఇప్పుడు కొత్తగా విదేశాల్లో కెరీర్ మొదలుపెట్టడం ఎలా ఉంది? చాలా వేగంగా గడిచిపోయింది. విశేషం ఏంటంటే... పదేళ్ల తర్వాత మళ్లీ న్యూ కమర్గా ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్‌తో కెరీర్ స్టార్ట్ అయింది. నేను దేవుడిని నమ్ముతాను. నా పట్ల చాలా దయగా ఉన్నాడనిపిస్తోంది. ఎందుకంటే తెలుగు, తమిళ్, హిందీ.. ఇలా ఇక్కడ నా కెరీర్‌ని బాగా తీసుకెళ్లగలిగాను. ఇప్పుడు ఇంకో రూట్ చూపించాడు. లైఫ్ చాలెంజింగ్‌గా ఉంది. 19 ఏళ్ల వయసులో అమెరికాలో మ్యూజిక్ స్కూల్లో చేరాను. ఆ రోజలు గుర్తొస్తున్నాయి. ‘కాటమరాయుడు’ తర్వాత తెలుగు సినిమా కమిట్ కాలేదు..? నా మ్యూజిక్ బ్యాండ్, ఇంటర్నేషనల్ సిరీస్‌తో బిజీగా ఉండటంవల్ల హీరోయిన్గా కొంచెం గ్యాప్ వచ్చింది. నేను విదేశాల్లో ఉన్నా నాలో ఉన్న సౌత్ గాళ్ అలానే ఉంది. అందుకే సౌత్‌లో రెండు సినిమాలు సైన్ చేశాను. వాటిలో ఒక తెలుగు సినిమా ఉంది. నేను తమిళ అమ్మాయిని అయినా హీరోయిన్గా నాకు స్టార్డమ్ తెచ్చింది ముందు తెలుగు సినిమానే. అందుకే తెలుగు పరిశ్రమకు, ప్రేక్షకులకు నా మనసులో స్పెషల్ ప్లేస్ ఉంటుంది. నాకు 80 ఏళ్లు వచ్చాక కూడా తెలుగు సినిమాకి అవకాశం వస్తే చేస్తాను. ఇంతకుముందు మాట్లాడుతూ దేవుడు నా పట్ల దయగా ఉన్నాడని అన్నారు. కానీ దేవుడు ఫేవర్ చేయని సమయాల్లో నిందిస్తారా? నెవ్వర్. ఆ పని మాత్రం చేయను. ఎందుకంటే దేవుడు కష్టాలు ఇచ్చాడంటే ముందు ముందు మంచి ఇవ్వడానికే అని నమ్ముతాను. కొంతమంది లైఫ్‌ని చూస్తే.. పేదవాళ్లు ఎప్పటికీ పేదవాళ్లలా మిగిలిపోరు. మంచి మార్పొస్తుంది. జీవితంలో నేను నేర్చుకున్న ముఖ్యమైన విషయం అది. ఏదో జరిగిందని దేవుడిని నిందించడం కాదు. వాటిని ఎదుర్కొని నిలబడే పవర్ మనకి ఇచ్చాడు. దాన్ని ఉపయోగించకుండా దేవుడిని నిందిస్తే ఏం లాభం? జీవితం ఇంకా మీకేం పాఠాలు నేర్పించింది? మొత్తం ప్రపంచాన్ని చూస్తే ఏదీ స్టేబుల్ కాదు. భూమి, సూర్యుడు, చంద్రుడు అన్నీ తిరుగుతూనే ఉంటాయి. బ్యాలెన్స్ అనేది లేదు. అందుకే మనం లైఫ్‌ని బ్యాలెన్స్ చేసుకోవాలి. చెబితే నవ్వుతారేమో కానీ ఈ మధ్య నేనో ప్రాక్టీస్ మొదలుపెట్టాను. ఒక సగం బంతి మీద ఒక కాలు పెట్టి, ఇంకో కాలితో గాల్లో నిలబడుతూ, పడిపోకుండా నన్ను నేను బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తున్నాను. మామూలుగా ఒక కాలు మీద నిలబడటమే కష్టం. అలాంటిది ఆ కాలు కింద బంతి పెట్టుకుని బ్యాలెన్స్ చేయడం అంటే ఇంకా కష్టం. కానీ నేను అచీవ్ చేయగలుగుతున్నాను. త్వరలో రెండు కాళ్లతో బంతి మీద నిలబడి, పడకుండా ప్రాక్టీస్ మొదలుపెడతాను. అంత ఏకాగ్రతతో బ్యాలెన్స్ చేయగలిగితే మనం లైఫ్‌లో అన్నింటినీ బ్యాలెన్స్ చేయగలుగుతాం అని నా నమ్మకం. అసలు మన జాబ్ ఏంటంటే ‘లైఫ్‌ని బ్యాలెన్స్’ చేయడమే. అయితే మనం చాలామంది లైఫ్‌లో బ్యాలెన్డ్స్‌గా ఉండాలంటే బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే సరిపోతుందనుకుంటాం. మీరూ అలా ఆలోచించిన సందర్భాలు ఉన్నాయా? యస్. బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే చాలని నేనూ అనుకున్న రోజులు ఉన్నాయి. నేను కూడా తప్పులు చేశాను. టూ మచ్‌గా ఖర్చు పెట్టేదాన్ని. డబ్బులు కోసమే పని చేశాను. కానీ ఆత్మసంతృప్తి దొరకలేదు. హ్యాపీగా ఉండటానికి బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే సరిపోదని అప్పుడు అర్థమైంది. అయితే నాతో పాటు ఉన్న హీరోయిన్లతో పోల్చితే డబ్బు సంపాదనలో నేను చాలా వీక్. నేను అంత స్మార్ట్ కాదు. మనీ మేకింగ్ క్వాలిటీ నాకు లేదు. యాక్చువల్‌గా మీ నాన్నగారు కూడా ఈ విషయంలో స్మార్ట్ కాదని అంటుంటారు.. నాన్నగారు సినిమాల్లో సంపాదించింది సినిమాల్లోనే పెడుతుంటారు. మామూలుగా ఎవరైనా అయితే ప్రాపర్టీస్ కొంటారు. కానీ నాన్నగారు రాజ్‌కమల్ ఇంటర్నేషనల్ బేనర్ పెట్టి, సినిమాలు నిర్మిస్తుంటారు. ఆయనకు సినిమాలంటే ప్రేమ. మరి.. మాకేమైనా మిగుల్చుతారా? ప్రాపర్టీలో మా షేర్ ఎంత? అని మీరు, మీ చెల్లెలు అడిగిన సందర్భాలేమైనా? (నవ్వేస్తూ). మా చైల్డ్‌హుల్డ్ చాలా కంఫర్టబుల్. నాన్నగారు మమ్మల్ని చెన్నైలో మంచి స్కూల్లో చదివించారు. ఆ తర్వాత అమెరికాలో బెస్ట్ కాలేజీలో చేర్చారు. మంచి ఫుడ్, మంచి బట్టలు, ఖరీదు గల కార్లు, మంచి ఇల్లు... ది బెస్ట్ ఇచ్చారు. 21 ఏళ్లకే నేను హీరోయిన్ అయి, సంపాదించడం మొదలుపెట్టాను. అప్పటినుంచి నాన్నగారి దగ్గర్నుంచి డబ్బులు తీసుకోవడం మానేశాను. ఇంతవరకూ నాన్నగారిని ప్రాపర్టీలో నా షేర్ ఏంటి? అని అడగలేదు. ఎందుకంటే నాకు కావాల్సిన ఆస్తులను నేనే సంపాదించుకుంటాను. రేపు నా పిల్లలకు కూడా అదే నేర్పిస్తాను. తల్లిదండ్రులు ఇచ్చేవి ఇస్తారు. కానీ మన ప్రయత్నం ఉండాలి. ఫైనల్లీ.. ఇన్ని విషయాలు ఫ్రాంక్‌గా చెప్పారు. మరి.. మైఖేల్ కోర్సలే నుంచి విడిపోయిన విషయం గురించి మాట్లాడతారా? లైఫ్‌లో ఓపెన్‌గా ఉండాలనే విషయం నా ఫస్ట్ రిలేషన్షిప్ ద్వారా తెలుసుకున్నాను. మొట్టమొదటిసారి నేను రిలేషన్లో ఉన్నప్పుడు ఆ విషయం బయటకు చెప్పడానికి భయపడ్డాను. ఎవరైనా ఏమైనా తప్పుగా అనుకుంటారేమో? అని భయం. ఆ రిలేషన్ వర్కవుట్ కాలేదు. ఆ తర్వాత కొన్నేళ్లకు మళ్లీ ఓ బంధం ఏర్పడింది. ఈసారి ఎందుకు బయటకు చెప్పకూడదు? అనిపించింది. అవును.. ఓ స్పెషల్ రిలేషన్ ఉన్నానని బయటకు చెప్పేశాను. నేనలా ఫ్రాంక్‌గా చెప్పడాన్ని చాలామంది మెచ్చుకున్నారు. జీవితాంతం కొనసాగించాలనే ఏ బంధాన్నయినా మొదలుపెడతాం. అది కుదరనప్పుడు ఏం చేయగలం? ఆ బంధం మొదలైనందుకు హ్యాపీ ఫీలయ్యాను. ముగిసిపోయనప్పుడూ ఆనందపడ్డాను. నా ఆలోచన చాలా ప్యూర్‌గా ఉంది. ఆ రిలేషన్‌కి నేను నా బెస్ట్ ఇచ్చాను. కానీ వర్కవుట్ కాలేదు. లైఫ్‌లో ఇలాంటివి చాలామందికి ఉంటాయి. విఫలమవుతున్న వివాహ బంధాలను కూడా చూస్తున్నాం కదా. ఏదీ మన చేతుల్లో ఉండదు. లైఫ్ ఎలా తీసుకెళితే అలా వెళ్లడమే. కానీ మన ఆలోచనలు, చేసే పనులు ‘ప్యూర్’గా ఉండాలి. – డి.జి. భవాని ఇటీవల మీ నాన్నగారు నటుడిగా 60 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఆ విషయం గురించి? నేను ఈ మధ్య హీరోయిన్గా 10 ఇయర్స్ కంప్లీట్ చేశాక ‘పదేళ్లు కంప్లీట్ చేశారు. నాట్ ఎ జోక్. చాలా సాధించారు’ అని లండన్‌లో అన్నారు. ఆ తర్వాత కొన్ని రోజులకు నాన్నగారు 60 ఏళ్లు పూర్తి చేశారని తెలిసి, ‘వావ్... 60 ఇయర్స్.. గ్రేట్’ అన్నారు. నిజమే.. 60 ఏళ్ల కెరీర్ ముందు 10 ఏళ్లు ఎంత? ఎంతో డెడికేషన్ ఉండబట్టే నాన్నగారు ఇన్నేళ్లు ఉండగలిగారు. నాకు లైఫ్‌లో ఇన్స్పైరింగ్ పర్సన్ అంటే నాన్నగారే. ఆయనకు భయం అనేది తెలియదు. సినిమాల్లో ప్రయోగాలు చేయడానికి ఎప్పుడూ ముందున్నారు. ఇప్పుడు పాలిటిక్స్‌లోకి వెళ్లారు. రాజకీయాలు అంత ఈజీ కాదు. అయినా వెళ్లారు. చిన్నప్పటినుంచీ నాన్న ధైర్యం చూస్తూ పెరిగాను కాబట్టి నాకు భయం తక్కువ. పదేళ్లు ఇక్కడ సినిమాలు చేసి, హఠాత్తుగా అమెరికాలో కెరీర్ స్టార్ట్ చేయడానికి ఇన్స్పిరేషన్ మా నాన్నగారు. ఏమవుతుందో ఏంటో అని భయపడితే ఇంతదాకా వచ్చేదాన్ని కాదు. అసలు నా ఫీలింగ్ ఏంటంటే.. లైఫ్‌లో చాలామంది ‘భయం’ వల్ల ఏదీ సాధించకుండా మిగిలిపోతుంటారు. ఇప్పుడు మన దేశీ స్టార్స్ చాలా మంది వెబ్ సిరీస్ కూడా చేస్తున్నారు. మీక్కూడా ఆ ఐడియా ఉందా? డెఫినెట్‌గా చేస్తాను. నా ఫోన్లో నెట్‌ఫ్లిక్స్, అమేజాన్, ఊట్.. ఇలా అన్ని యాప్స్ ఉన్నాయి. ట్రావెల్ చేస్తున్నప్పుడు దాదాపు అన్ని సిరీస్‌లను చూస్తాను. ఇండియన్ షోస్‌లో నాకు ‘సాక్రెడ్ గేమ్స్’ అంటే చాలా ఇష్టం. మంచి స్క్రిప్ట్, రోల్ దొరికితే తప్పకుండా వెబ్ సిరీస్ చేస్తాను. స్లిమ్ అయ్యారు? ఒక కారణం మార్షల్ ఆర్ట్స్. నిజానికి మార్షల్ ఆర్ట్స్ అంటే ఎవరినో కొట్టడానికి నేర్చుకునేది కాదు. మిమ్మల్ని మీరు స్ట్రాంగ్‌గా ఉంచుకోవడానికి మీతో మీరు ఫైట్ చేయడానికే మార్షల్ ఆర్ట్స్. ఈ ఆర్ట్స్ వల్ల నాకు లైఫ్‌లో చాలా ఫోకస్ వచ్చింది. మరి డైట్ సంగతి? దేవుడు మనకు ఒకే ఒక్క జీవితం ఇచ్చాడు. సలాడ్స్ తింటూ కూర్చుంటే ఏం బాగుంటుంది? లైఫ్ బోర్ కొట్టేస్తుంది. అందుకని అన్నీ బాగా తింటాను. బాగా వర్కవుట్స్ చేస్తాను. ఇండియాలో స్టార్ హీరోయిన్ అనిపించుకుని, విదేశాల్లో కొత్త ఆర్టిస్ట్ అనిపించుకోవడం ఎలా ఉంది? ఒక న్యూ కమర్ ఎలా కష్టపడతారో అలానే పడుతున్నాను. ఒక విషయంలో మాత్రం చాలా రిలీఫ్‌గా ఉంది. ఎందుకంటే ‘మీ నాన్నగారు కమల్‌హాసన్ కదా.. మీ అమ్మ సారిక కదా. వాళ్లు గొప్ప ఆర్టిస్టులు’ అంటూ పోలిక పెట్టేవాళ్లు ఇక్కడ లేరు. కానీ మన దగ్గర వేరే విధంగా ఉండేది. తల్లీతండ్రిలా మంచి పేరు తెచ్చుకుంటుందో? లేదో అనేవారు. నా మీద నాకు నమ్మకం ఉన్నప్పటికీ నాన్న లాంటి లెజెండ్రీ ఆర్టిస్ట్‌తో పోల్చినప్పుడు చాలా భయం అనిపించేది. బయటకు మాత్రం మామూలుగా ఉండేదాన్ని. కంపేరిజన్ అనేది మన దగ్గర ఎప్పుడూ ఉంటుందేమో? ఎందుకు అలా అంటున్నానంటే ‘శ్రీమంతుడు’ రిలీజయ్యాక ‘చాలా బాగా నటించారు’ అంటూనే ‘మీ నాన్నగారు ‘స్వాతిముత్యం’ సినిమాలో ఎంతో బాగా నటించారు’ అన్నారు ఒక వ్యక్తి. నాకు నవ్వాగలేదు. నాన్న ఎక్కడ? నేను ఎక్కడ? అయితే లండన్‌లో ‘శ్రుతి ఎలా యాక్ట్ చేస్తోంది? తను ఎంత టాలెంటెడ్’ అని మాత్రమే చూస్తున్నారు. దాంతో కొంచెం స్వేచ్ఛ దొరికినట్లుగా ఉంది. -
‘తెలుగు హీరోలకి తెలివి లేదు..'
సాక్షి, హైదరాబాద్ : తెలుగు సినిమా హీరోలపై ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. హీరోలకి తెలివి, ధైర్యం, శక్తి లేదని, వారంతా నిజ జీవితంలో కుక్కను చూస్తే కూడా పారిపోతారని వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన బాషీర్ బాగ్ ప్రెస్ క్లబ్లో మాట్లాడుతూ.. తెలుగు సినిమా హీరోల వద్ద వందల ఎకరాల భూములున్నాయని.. మర్యాదగా ఇస్తే ఏమీ కాదని లేదంటే గుడిసెలు వేయిస్తానని హెచ్చరించారు. సినీ ఇండస్ట్రీలో జరుగుతున్న ఆకృత్యాలపై ప్రభుత్వం కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. సినీ ఇండస్ట్రీలో కనిపించని వివక్ష దోపీడి కొనసాగుతుందని కృష్ణయ్య మండిపడ్డారు. హీరోలు, దర్శకులు, నిర్మాతలు తెరవెనుక చేస్తున్న అఘాయిత్యాలు ఇండస్ట్రీకి సిగ్గుచేటని ఆయన వ్యాఖ్యానించారు. స్టూడియోలలో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదని, పర్యవేక్షణ లేకుండా పోయిందన్నారు. ఇండస్ట్రీలో ఇంత జరుగుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. సినీ కళాకారుల సమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తానని కృష్ణయ్య పేర్కొన్నారు. సమాజాన్ని ప్రభావితం చేసే బలమైన సాధనం సినిమా అని కృష్ణయ్య అభిప్రాయపడ్డారు. కానీ హీరోలు, దర్శకులు, నిర్మాతలు, తెరవెనుక చేస్తున్న అఘాయిత్యాలు సినీ ఇండస్ట్రీకి సిగ్గుచేటని మండిపడ్డారు. పరిశ్రమలో జరుగుతున్న దారుణాలను పట్టించుకోవాల్సిన సినిమా మంత్రిత్వ శాఖకు అసలు పట్టింపులేదని కృష్ణయ్య విమర్శించారు. -
రెండేళ్ళ క్రితమే పెళ్ళి అనుకున్నా!
‘మీ పెళ్లెప్పుడు?’ అని ఏ హీరోయిన్ని అడిగినా.. ‘అప్పుడేనా? ఇంకా బోల్డంత కెరీర్ ఉంది’ అంటారు. ప్రస్తుతం తెలుగు పరిశ్రమలో దూసుకెళుతోన్న తారల్లో ఒకరైన రాశీఖన్నా నుంచి కూడా ఇదే సమాధానం వస్తుంది. నిజానికి, ఈ పాతికేళ్ల సుందరి 23 ఏళ్లకే పెళ్లి చేసుకోవాలను కున్నారట. ఆ విషయం గురించి రాశీఖన్నా మాట్లాడుతూ – ‘‘చిన్నప్పుడు పెళ్లి గురించి నాకు చాలా కలలు ఉండేవి. 22 ముగిసి 23వ ఏట అడుగుపెట్టగానే పెళ్లి చేసుకోవాలనుకునేదాన్ని. ఆ సంగతి ఇప్పుడు తలుచుకొంటే, నాకే నవ్వొస్తూ ఉంటుంది! మీకూ నవ్వొస్తోంది కదూ. అయితే, అందరం కలిసే నవ్వుకుం దామా’’ అని చిరునవ్వు చిందించారు. ఇప్పుడు మాత్రం రాశీకి కెరీరే తప్ప పెళ్లి ఊసే లేదు. సినిమాతోనే ఊసులాడుకుంటున్నారు. -
కొత్తవాళ్లను ప్రోత్సహించాలి
- కె.ఎల్. దామోదర్ ప్రసాద్ ‘‘తెలుగు ఇండస్ట్రీకి కొత్త నిర్మాతల అవసరం చాలా ఉంది. ప్రస్తుతం ఉన్న నిర్మాతలు వాళ్ల ఆలోచనా విధానాన్ని మార్చుకుని కొత్తవాళ్లని ప్రోత్సహించాలి’’ అని నిర్మాత కేఎల్ దామోదర్ ప్రసాద్ అన్నారు. వరుణ్ సందేశ్, ప్రియాంకా భరద్వాజ్ జంటగా ఎస్ఎస్ రవికుమార్ దర్శకత్వంలో హరికుమార్ రెడ్డి నిర్మించిన ‘మిస్టర్ 420’ చిత్రం లోగో ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘వరుణ్ సందేశ్ చేసిన గత చిత్రాలకు భిన్నంగా ఉండే చిత్రం ఇది’’ అని తెలిపారు. ‘‘ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే పాటలు, సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని నిర్మాత చెప్పారు. సంగీత దర్శకుడు ముస్తఫా, కథానాయిక ప్రియాంకా భరద్వాజ్ తదితరులు మాట్లాడారు. -
సరికొత్త ప్రేమికుడు
‘‘ఈ చిత్రం పాటలు, ట్రైలర్ సరికొత్తగా ఉన్నాయి. కొత్త వాళ్లందరూ కలిసి చేసిన ఈ చిత్రం విజయవంతం అయితే తెలుగు పరిశ్రమకి మరికొంత మంది కొత్త టెక్నీషియన్స్, యాక్టర్స్ వచ్చే అవకాశం ఉంది. మానస్ బాగున్నాడు, భవిష్యత్తులో మంచి స్టార్ అవుతాడు’’ అని దర్శకుడు వీవీ వినాయక్ పేర్కొన్నారు. మానస్ ఎన్, సనమ్ శెట్టి జంటగా డీజీ పోస్టర్ సమర్పణలో ఎస్ఎస్ సినిమా పతాకంపై కళా సందీప్ దర్శకత్వంలో లక్ష్మీ నారాయణరెడ్డి, కె.ఇసనాక సునీల్ రెడ్డి నిర్మించిన చిత్రం. ‘ప్రేమికుడు’. విజయ్ బాలాజీ స్వరపరిచిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. వీవీ వినాయక్ పాటల సీడీ విడుదల చేసి, దర్శకుడు ఏయస్ రవికుమార్ చౌదరికి అందించారు. హీరో, హీరోయిన్లు మానస్, సనమ్ శెట్టి, నిర్మాతలు బెక్కెం వేణుగోపాల్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, చిత్రబృందం తదితరులు పాల్గొన్నారు. -
వాటిని వేస్ట్ చేస్తే నాకు నచ్చదు!
తెలుగు పరిశ్రమలో ‘మోస్ట్ వాంటెడ్’ హీరోయిన్గా దూసుకెళుతున్నారు రకుల్ ప్రీత్‌సింగ్. ఇటీవల ఓ సందర్భంలో ఈ బ్యూటీ పొదుపు గురించి మాట్లాడారు. ముఖ్యంగా తన కళ్లెదుట ఆహారాన్నీ, నీటినీ వృథా చేసేవాళ్లను చూసినప్పుడు చాలా కోపం వస్తుందట. ఆ విషయం గురించి రకుల్ మాట్లాడుతూ - ‘‘ఆహారం, నీరు లేనిదే మనిషి మనుగడ కష్టమవుతుంది. అందుకే, ఈ రెండింటినీ అస్సలు వృథా చేయకూడదు. కొంతమంది ట్యాప్ ఫుల్‌గా తిప్పేసి, చేతులు కడుక్కుంటారు. పనైన తర్వాత వెంటనే కట్టేయరు. అలాంటి సంఘటనలను చూసినప్పుడు, ఇవన్నీ ఒకరు నేర్పించేవి కావు. ఎవరి విజ్ఞత వాళ్లకుండాలనిపిస్తుంది. అవసరం లేనప్పుడు నీటిని ఉపయోగించడం, ఆహారాన్ని నేలపాలు చేయడంలాంటివి చూస్తే ఒళ్లు మండిపోతుంది. విద్యుత్తుని కూడా ఆదా చేయాలి. కొంతమంది టీవీ ఆన్ చేసి ఉంచి, మొహానికి పేపర్ అడ్డం పెట్టుకుని చదువుతుంటారు. ఫ్యాన్, ఏసీ ఒకేసారి వేసుకునే ప్రబుద్ధులను కూడా చూశాను. మనకేంటిలే ఎంత బిల్లు వచ్చినా కట్టేస్తాం అనే ధీమాతోనే వాళ్లలా చేస్తారనుకుంటా. కానీ, విద్యుత్తు తయారీకి ఎంత కష్టపడాల్సి వస్తుందో తెలుసుకోవాలి. అలాగే, నీళ్లు కూడా. అందుకే ప్రతి ఒక్కరూ వీటిని పొదుపు చేసే విషయంలో బాధ్యతగా వ్యవహరించాలి’’ అని చెప్పారు. మంచి మాటలు ఎవరు చెప్పినా వినాలి. పైగా.. అందగత్తెలు చెబితే ఆచరణలో పెట్టాలనిపిస్తుంది కదూ! -
ఆ రోజు కోసం ఎదురుచూస్తున్నా
ఆ రోజు కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నానంటున్నారు నటి శ్రుతీహాసన్. ఇంతకీ ఈ బ్యూటీ ఆతృత ఏమిటో చూద్దాం. ప్రస్తుతం టాప్ హీరోయిన్లలో శ్రుతీహాసన్ ఒకరు. అయితే తమిళంలో కంటే తెలుగులోనే ఈ ముద్దుగుమ్మకు అధిక క్రేజ్. ఆ తరువాతే తమిళం అయినా, హిందీ అయినా అని చెప్పక తప్పదు. ఇంకా చెప్పాలంటే విజయ్‌తో జతకట్టిన పులి చిత్రం శ్రుతీహాసన్ దూకుడుకు అడ్డుకట్ట వేసిందని చెప్పవచ్చు. దీంతో ప్రస్తుతం తెలుగు, హిందీ చిత్రాలపైనే ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. త్వరలో తన తండ్రి విశ్వనటుడు కమలహాసన్‌తో కలిసి నటించడానికి సన్నద్ధం అవుతున్నారు. శ్రుతీహాసన్ ఇంత కాలంగా బహుభాషల్లో నటిస్తున్నా ఇంత వరకూ తన తండ్రితో కలిసి నటించలేదు. ఇన్నాళ్టికి అప్పా అమ్మా విళయాట్టు అనే చిత్రంలో ఆయనతో నటించడానికి సిద్ధం అవుతున్నారు. విశేషం ఏమిటంటే ఇందులో నిజ జీవిత పాత్రను అనగా తన తండ్రికి కూతురిగానే నటించనుండడం. మలయాళ దర్శకుడు టీకే.రాజీవ్‌కుమార్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో నటించనుండడం గురించి శ్రుతీ మాట్లాడుతూ నాన్నతో కలిసి నటించే సమయం ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నానన్నారు. ఇంతకు ముందు ఒకసారి అలాంటి అవకాశం వచ్చినా దాన్ని సద్వినియోగం చేసుకోలేక పోయాననీ వివరించారు. తాజాగా తన తండ్రితో కలిసి నటించే అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు. దీన్ని తాను గౌరవంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. అయితే నాన్నతో కలిసి నటించడం అంత సులభం కాదనీ, అయినా దాన్ని ఛాలెంజ్‌గా తీసుకుని తన పాత్రకు న్యాయం చేయడానికి శాయశక్తులా ప్రయత్నిస్తాననీ అన్నారు. ఇక ఇతర విషయాలు ఆ దేవుడి చేతిలోనే ఉంటుందనే అభిప్రాయాన్ని శ్రుతీహాసన్ వ్యక్తం చేశారు. -
మార్పు తెచ్చే సినిమా!
‘‘ఈ చిత్రాన్ని సామాన్య ప్రేక్షకుల వద్దకు తీసుకెళుతున్నాం. ‘నేనుప్రొడ్యూసర్.కామ్’ వెబ్సైట్ ద్వారా ఈ చిత్రానికి నిర్మాతలుగా మారే అవకాశం కల్పిస్తున్నాం. నరేశ్‌గారు స్థాపించిన ‘కళాకారుల ఐక్యవేదిక’ ద్వారా మాకు కళాకారుల్ని అందించారు. ఆయన సపోర్ట్ లేకుండా సినిమా త్వరగా పూర్తయ్యేది కాదు. హిందూపురం ప్రజలు ఎంతగానో సహకరించారు. ఈ చిత్రం తెలుగు ఇండస్ట్రీలో చిన్న మార్పు తీసుకొస్తుంది’’ అని దర్శకుడు ప్రవీణ్ సత్తారు తెలిపారు. సిద్ధు జొన్నలగడ్డ, రష్మి గౌతమ్, శ్రద్ధాదాస్ ప్రధాన పాత్రల్లో ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఎమ్. రాజ్‌కుమార్ నిర్మించిన చిత్రం ‘గుంటూర్ టాకీస్’. శ్రీ చరణ్ పాకాల అందించిన ఈ చిత్రం పాటలను సంగీత దర్శకుడు రఘు కుంచె, నిర్మాత ‘మధుర’ శ్రీధర్‌రెడ్డి విడుదల చేశారు. నిర్మాత రాజ్‌కుమార్ మాట్లాడుతూ - ‘‘టైటిల్ చూసి ఇది గుంటూరుకు చెందిన కథ అనుకోవద్దు. మార్చి 4న రిలీజ్ చేస్తున్నాం. మా చిత్రాన్ని విడుదల చేస్తున్న వారాహి సంస్థ అధినేత సాయి కొర్రపాటికి కృతజ్ఞతలు’’ అన్నారు. నిర్మాతలు యలమంచిలి సాయి బాబు, బెక్కెం వేణుగోపాల్, దర ్శకులు ఎ. కోదండరామిరెడ్డి, సముద్ర, రవికాంత్ పేరెపు, హీరో ‘అల్లరి నరేశ్’, నటి, నిర్మాత లక్ష్మీ మంచు, నాయికలు శ్రద్ధాదాస్, రష్మీ గౌతమ్, నటులు నరే శ్, రాజారవీంద్ర పాల్గొన్నారు. -
తెలుగు తీరంలో మలబార్ అందాలు!
‘పొరుగింటి పుల్లకూర రుచి’ అని పెద్దలు ఊరకే అనలేదు. మన ఇంట్లో ఉన్న కూర అంటే చిన్న చూపు... పొరుగింటి కూర అంటే వల్లమాలిన వలపు. సినిమా పరిశ్రమలో కథానాయికలకు ఇది బ్రహ్మాండంగా వర్తిస్తుంది. ముఖ్యంగా తెలుగులో తెలుగమ్మాయిల కన్నా పరభాషల తారల హవానే ఎక్కువ. పది, పదిహేనేళ్ల క్రితం ఉత్తరాది భామల సందడి ఎక్కువగా ఉంటే, ఇటీవలి కాలంలో మునుపెన్నడూ లేనంతగా మలయాళ తారల తాకిడి ఎక్కువైందనే చెప్పాలి. ఈ ఏడాది విడుదల కానున్న ముఖ్యమైన తెలుగు చిత్రాల్లో మొదటి నాయికగానో, రెండో నాయికగానో... ఏవరో ఒక మలయాళ తార ఉండడం విశేషం. ఆ కేరళ కుట్టీల గురించి తెలుసుకుందాం.. ఫామ్‌లో నయనతార, నిత్యామీనన్ ఇప్పటి వరకూ తెలుగు తెరపై తమ సత్తా చాటుకున్న మలయాళ భామలు చాలామందే ఉన్నారు. ‘అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి’తో అసిన్, ‘అమ్మాయి బాగుంది’తో మీరా జాస్మిన్, ‘శేషు’తో కల్యాణి, ‘నా ఆటోగ్రాఫ్... స్వీట్ మెమొరీస్’తో గోపిక... ఇలా పన్నెండేళ్ల క్రితం కథానాయికలుగా పరిచయమైన మలయాళ సుందరీమణులు ఇక్కడ బాగానే రాణించారు. వీళ్ల తర్వాత ‘యమదొంగ’తో మమతా మోహన్‌దాస్, ‘చంద్రముఖి’తో నయనతార తెలుగు తెరపైకి దూసుకొచ్చారు. ఓ ఆరేడేళ్లు మమత ఇక్కడ బిజీగానే సినిమాలు చేశారు. టాప్ స్టార్స్‌తోనూ, యువ హీరోలతోనూ నటిస్తూ, నయనతార ఇంకా మంచి ఫామ్‌లోనే ఉన్నారు. ఆ ఇద్దరి తర్వాత తెలుగు తెరను కనువిందు చేసిన మరో బ్యూటీ నిత్యామీనన్. ‘అలా మొదలైంది’తో కథానాయికగా తెలుగు కెరీర్ మొదలుపెట్టి, పాటలు పాడడం, తన పాత్రలకు తానే డబ్బింగ్ చెప్పుకోవడం ద్వారా ‘మల్టీ టాలెంటెడ్’ అని నిరూపించుకున్నారు. ప్రస్తుతం వెంకటేశ్ సరసన నయనతార ఓ చిత్రంలో (‘బాబు... బంగారం’) నటిస్తుండగా, ఎన్టీఆర్ హీరోగా రూపొందుతోన్న ‘జనతా గ్యారేజ్’లో నిత్యామీనన్ ఓ నాయికగా నటిస్తున్నారు. ఇక, గడచిన ఏడాది కాలంలో మలయాళం నుంచి మన తెలుగు తీరానికి వచ్చిన యువతారల గురించి చెప్పాలంటే... మాంచి జోరు మీద మాళవిక ఆల్చిప్పల్లాంటి కళ్లు, ఆకట్టుకునే హావభావాలతో అందరి దృష్టినీ తనవైపు తిప్పుకోగలుగుతారు మాళవికా నాయర్. మొదటి సినిమా ‘ఎవడే సుబ్రమణ్యం’తోనే అభినయ పరంగా కూడా భేష్ అనిపించుకున్నారు. టాలెంట్ ఉన్న తారలను పరిశ్రమ వదిలిపెట్టదన్నట్లుగా నిర్మాత కె.ఎల్. దామోదర్ ప్రసాద్, దర్శకురాలు నందినీరెడ్డి దృష్టి మాళవికపై పడింది. అంతే.. ‘కళ్యాణ వైభోగమే’లో కథానాయికగా తీసుకున్నారు. ఈ నెలాఖరులో ఈ చిత్రం విడుదల కానుంది. మలి సినిమాలో కూడా మాళవిక భేష్ అనిపించుకుంటే ఇక కొన్నాళ్లు ఆమె ఇక్కడే బిజీ అయిపోయే అవకాశం ఉంది. తొలి చిత్రంతోనే బోల్డంత కీర్తి తెలుగు తెరపై రాణిస్తున్న తారల్లో పాతికేళ్లు, ఆ పైన వయసున్నవారి సంఖ్య ఎక్కువే. ‘ఫ్రెష్ ఫేస్’లకు సెపరేట్ క్రేజ్ ఉంటుంది కాబట్టి, పాతికేళ్ల లోపు తారలకు క్రేజ్ ఎక్కువే. అందంతో పాటు మంచి అభినయం కూడా కనబరచగలిగితే ఇక తిరుగుండదు. ఏడాది మొదటి రోజున విడుదలైన ‘నేను... శైలజ’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన కీర్తీ సురేశ్ ఈ కోవకే వస్తారు. మన పక్కింటి అమ్మాయిలా ఉండే కీర్తికి తొలి చిత్రంతోనే బోల్డంత కీర్తి వచ్చేసింది. ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో ఈ బ్యూటీకి బాగానే అవకాశాలు వస్తున్నాయని టాక్. ఓ యువ స్టార్ హీరోతో జతకట్టనున్నారని భోగట్టా. అది కన్ఫర్మ్ అయితే తెలుగు పరిశ్రమ కీర్తికి రెడ్ కార్పెట్ పరిచినట్లే! అన్నట్లు... కీర్తి ఎవరో కాదు... సీనియర్ నటి మేనక కూతురు. అనుపమ... అదరహో! గత ఏడాది మలయాళంలో విడుదలైన ప్రేమకథా చిత్రాల్లో ‘ప్రేమమ్’ది ఓ ప్రత్యేకమైన స్థానం. ఆ చిత్రంలో కీలకమైన పాత్ర చేసిన అనుపమా పరమేశ్వరన్‌కు బోల్డంత పేరొచ్చింది. చక్కటి నటన కనబరిచిన ఈ అమ్మాయి దర్శకుడు త్రివిక్రమ్ రూపొందిస్తున్న ‘అ.. ఆ..’లో నితిన్ సరసన నటించే అవకాశం దక్కించుకున్నారు. అలాగే, మలయాళ ‘ప్రేమమ్’లో చేసిన పాత్రనే తెలుగు రీమేక్ (‘మజ్ను’)లో అనుపమ చేస్తున్నారు. నాగచైతన్య హీరోగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఒక్క సినిమా కూడా విడుదల కాకముందే రెండో సినిమాలోనూ నటించడం, ఆల్రెడీ మలయాళ ప్రేక్షకులతో భేష్ అనిపించుకున్న నటి కావడంతో అనుపమపై అంచనాలు చాలానే ఉన్నాయి. మంజిమా మోహన్ మాయ బాలనటిగా పలు మలయాళ చిత్రాల్లో నటించి, ‘ఒరు వడక్కన్ సెల్ఫీ’ అనే పాపులర్ మలయాళ చిత్రం ద్వారా కథానాయికగా మారారు మంజిమా మోహన్. రొట్టె విరిగి నేతిలో పడ్డట్లు ఫీల్ గుడ్ మూవీ చిత్రాల దర్శకుడు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో అవకాశం కొట్టేశారు మంజిమ. నాగచైతన్య హీరోగా గౌతమ్ మీనన్ రూపొందిస్తున్న ‘సాహసం శ్వాసగా సాగిపో’లో మంజిమా మోహన్ కథానాయికగా నటిస్తున్నారు. విశేషం ఏమిటంటే.. ఇదే చిత్రాన్ని తమిళంలో ‘అచ్చమ్ ఎన్బదు మడమయడా’ పేరుతో శింబు హీరోగా తమిళంలో తీస్తున్న చిత్రంలోనూ మంజిమనే కథానాయికగా తీసుకున్నారు గౌతమ్. ఆయన దర్శకత్వంలో రూపొందిన ‘ఏ మాయ చేశావె’ ద్వారా సమంత మాయ చేసినట్లుగానే ఇప్పుడు మంజిమా మోహన్ కూడా మాయ చేస్తారేమో చూడాలి. ఒక్క కథానాయికలు మాత్రమే కాదు.. క్యారెక్టర్ నటీనటులుగా కూడా మలయాళ నటీనటులు ఇక్కడ బాగానే రాణిస్తున్నారు. స్టైలిస్ట్ అమ్మ, అత్త అంటే నదియా బాగుంటారని ‘మిర్చి’, ‘అత్తారింటికి దారేది’ చిత్రాలు నిరూపించాయి. ప్రస్తుతం ‘అ...ఆ’లో నదియా నటిస్తున్నారు. ఇక, మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ ‘జనతా గ్యారేజ్’లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆయన ఏకంగా తెలుగు నేర్చేసుకుంటున్నారు. సీనియర్ నటుడు దేవన్ కూడా అప్పుడప్పుడూ తెలుగు చిత్రాల్లో తళుక్కుమంటూ ఉంటారు. మొత్తం మీద కళకు భాషతో సంబంధం లేదనట్లుగా.. మన తెలుగు పరిశ్రమ టాలెంట్‌ని బాగానే వాడుకుంటోందని చెప్పొచ్చు. అఫ్కోర్స్.. తెలుగమ్మాయిలు నాయికలుగా ఇక్కడ నిలదొక్కుకోవడం కష్టంగానే అనిపిస్తోంది. బిందు మాధవి, శ్రీదివ్య వంటి తెలుగమ్మాయిలు తమిళంలో మంచి జోరు మీద ఉన్నారు. వాళ్లకు పొరుగిల్లే బాగుంది. అందుకే ‘పొరుగింటి పిల్లే ముద్దు’ అనాలేమో! -
వాళ్లు నాతోనే ఉంటారు!
అభిమాన తారలతో కలిసి ఫొటోగ్రాఫ్ దిగాలని, ఆటోగ్రాఫ్ తీసుకోవాలని వీలైతే నాలుగు మాటలు.. కుదిరితే వాళ్లతో కలిసి లంచ్ చేయాలని అభిమానులు ఉవ్విళ్లూరుతుంటారు. ఫొటోగ్రాఫులూ, ఆటోగ్రాఫుల వరకూ ఓకే కానీ లంచ్‌లు, డిన్నర్లు అంటే కష్టమే. కానీ, సమంత అభిమానుల్లో ఓ పాతిక మందికి రెగ్యులర్‌గా ఆ అవకాశం దక్కుతోంది. ఆ విషయం గురించి సమంత చెబుతూ - ‘‘నాకు బాగా దగ్గరైన 25, 30 మంది అభిమానులు ఉన్నారు. వాళ్లు తెలుగు పరిశ్రమకు చెందినవాళ్లు. నా ఎదుగుదల, నా అపజయాల్లో నా వెన్నంటే ఉన్నారు. ‘ఇక చాలు.. సినిమాలు మానేద్దాం’ అనుకున్నప్పుడు కూడా వాళ్లు నాతోనే ఉన్నారు. ఎప్పటికీ నాతోనే ఉంటారు. నా ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా వాళ్లు నాకు దగ్గరయ్యారు. నా సినిమాలకు సంబంధించి వాళ్లిచ్చే ఫీడ్‌బ్యాక్ నాకు చాలా ముఖ్యం. వాళ్లు ఇచ్చే సపోర్ట్‌ని మాటల్లో చెప్పలేను. నాకు తెలిసి ఏ హీరోయిన్‌కీ ఇంత స్ట్రాంగ్‌గా సపోర్ట్ చేసే అభిమానులు ఉండరేమో. నేను రెగ్యులర్‌గా ఆ అభిమానులను కలుస్తుంటాను. కలిసి లంచ్ చేస్తాం. బర్త్‌డేలు సెలబ్రేట్ చేసుకుంటాం. ఇలాంటి అభిమానులు నాకు దక్కడం నా అదృష్టం’’ అన్నారు. -
అతను సో స్వీట్!
న్యూ టాలెంట్ తెలుగు పరిశ్రమలో ఉత్తరాది భామలదే హవా. ఒక్క చాన్స్, హిట్ వస్తే చాలు.. ఆ తర్వాత ఇక్కడ తిరుగులేని తారలుగా మారిపోతారు. ‘రన్ రాజా రన్’ వంటి సక్సెస్ఫుల్ మూవీతో కథానాయికగా పరిచయమైన సీరత్ కపూర్ కూడా సౌత్‌లో తన కెరీర్ బాగుంటుందనే నమ్మకంతో ఉన్నారు. ఆమె నటించిన ‘టైగర్’ రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా సీరత్‌తో చిట్ చాట్.. ♦ ముందు ఓ విషయం చెప్పండి.. హిందీ రంగంలో పెద్ద పేరున్న ‘కపూర్’ కుటుంబానికీ, మీకూ ఏమైనా బంధుత్వం ఉందా? ఇంటి పేరు ఒకటే కాబట్టి, అందరూ ఆ కపూర్ కుటుంబానికి బంధువునని అనుకుంటున్నారు. బాలీవుడ్లో కూడా చాలామంది విలేకరులు నన్నీ ప్రశ్న అడిగారు. కానీ, ఆ కుటుంబంతో నాకు బంధుత్వం లేదు. నేను ‘ఓన్ సీరత్ కపూర్’ని (నవ్వుతూ). ♦ పోనీ.. మీ కుటుంబంలో సినిమా రంగానికి చెందినవారెవరైనా ఉన్నారా? ముంబయ్‌లో రోషన్ తనేజా యాక్టింగ్ స్కూల్ ఉంది కదా.. రోషన్ తనేజా మా రెండో తాతగారు. ♦ రెండో తాతగారంటే? అంటే.. రోషన్ తనేజా కొడుకుని మా పిన్ని పెళ్లి చేసుకుంది. ఆయన యాక్టింగ్ స్కూల్లోనే నేను నటన నేర్చుకున్నా. ♦ ముందు డ్యాన్స్ మాస్టర్‌గా చేశారు కదా..? నేను క్లాసికల్ డ్యాన్సర్‌ని. క్లాసికల్ సింగర్‌ని కూడా. శిక్షణ తీసుకున్నాను. హిందీ సినిమాలకు నృత్యదర్శకురాలిగా చేసే అవకాశం వస్తే, ఒప్పుకున్నాను. ముందు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా, ఆ తర్వాత డ్యాన్స్ మాస్టర్‌గా చేశాను. ♦ రణబీర్ కపూర్ నటించిన ‘రాక్‌స్టార్’కి అసిస్టెంట్ డ్యాన్స్ డెరైక్టర్‌గా చేశారు కదా.. రణబీర్ గురించి నాలుగు మాటలు? రణబీర్‌కి పెద్ద స్టార్ అనే ఫీలింగే ఉండదు. అందరితో కలిసిపోతాడు. ఏదైనా స్టెప్ అర్థం కాకపోతే, ‘ఎలా చెయ్యాలి’ అని అడిగి, నేర్చుకుని చేసేవాడు. ‘రాక్‌స్టార్’ మ్యూజికల్ బేస్డ్ ఫిలిం కాబట్టి, డ్యాన్సులకు మంచి స్కోప్ ఉండేది. రణబీర్ చాలా బాగా చేశాడు. ♦ ఓకే.. తెలుగు చిత్రాల విషయానికొద్దాం... ‘రన్ రాజా రన్’లో కనిపించిన పదకొండు నెలలకు ‘టైగర్’తో వస్తున్నారు.. ఈ సినిమా అంగీకరించడానికి కారణం? ఈ చిత్రదర్శకుడు ఆనంద్ ముంబయ్‌కి ఫోన్ చేసి, నాకీ కథ వినిపించారు. చాలా బాగా నచ్చింది. కథతో పాటు నా పాత్ర కూడా బాగుంటుంది. ఇందులో నా పాత్ర పేరు ‘గంగ’. వారణాసిలో నివసించే సంప్రదాయబద్ధమైన కుటుంబానికి చెందిన అమ్మాయిని. ఒకవైపు ట్రెడిషనల్, మరోవైపు మోడర్న్.. రెండు రకాలుగా ఉంటుంది గంగ. నిజజీవితంలో నేను కూడా అంతే. సందీప్ కిషన్, రాహుల్ రవీంద్రన్‌లతో కలిసి సినిమా చేయడం మంచి అనుభూతినిచ్చింది. మేమంతా మనసు పెట్టి చేశాం. విజయం ఖాయం అని నమ్ముతున్నా. ♦ ‘రన్ రాజా రన్’ అప్పుడు మిమ్మల్ని ప్రభాస్ అభినందించారు కదా.. ఏమనిపించింది? ప్రభాస్ సో స్వీట్. ఆ సినిమా షూటింగ్ లొకేషన్‌కి వచ్చేవారాయన. బాగా యాక్ట్ చేస్తున్నావని అప్పుడే అభినందించారు. ఆ తర్వాత ఫంక్షన్లో అందరి ముందూ ప్రశంసించారు. అంత పెద్ద స్టార్ నన్ను అభినందించడం మర్చిపోలేని విషయం. ♦ క్లాసికల్ సింగర్‌ని అన్నారు.. సినిమాలకు పాడతారా? యాక్చువల్‌గా నేనా అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. ఇంకా చెప్పాలంటే నా పాత్రకు నేను డబ్బింగ్ చెప్పుకోవాలని కూడా ఉంది. కానీ, తెలుగు భాష తెలియదు కాబట్టి, వేరే దారి లేక డబ్బింగ్ చెప్పించుకోవాల్సి వస్తోంది. ♦ మరి.. తెలుగు నేర్చుకుంటున్నారా? తెలుగు పదాలు పలకడం ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నా. పట్టుదల ఉంటే ఏదీ సాధ్యం కాదు. మొత్తం నేర్చేసుకుని, భవిష్యత్తులో నా పాత్రలకు నేనే డబ్బింగ్ చెప్పుకుంటా. ♦ కొరియోగ్రఫీ, యాక్టింగ్.. దేనికి ప్రాధాన్యం ఇస్తారు? ప్రస్తుతానికి నటనపైనే. సినిమాల్లో ఎలాగూ డాన్స్ చేస్తాం కాబట్టి, దానికి దూరమయ్యే అవకాశం లేదు. భవిష్యత్తులో మాత్రం డెరైక్షన్ చేస్తా. ♦ తెలుగులో వేరే సినిమా ఏదైనా చేస్తున్నారా? సుమంత్ అశ్విన్ సరసన ‘కొలంబస్’లో నటిస్తున్నా. -
హిట్ అయితే హీరో ఫట్ అయితే మేమా?
ఇంటర్వ్యూ తెలుగు తెరపై తాప్సీ కనిపించి, రెండేళ్లయ్యింది. అనువాద చిత్రాల ద్వారా కనిపిస్తున్నారే కానీ, తెలుగులో స్ట్రయిట్ చిత్రాలు చేయడంలేదు. ఎందుకని? తెలుగు పరిశ్రమపై తాప్సీ అలిగారా? ఆమెనే అడిగి తెలుసుకుందాం... మీరు చాలా మారిపోయారండీ? అదేంటి అంత మాట అనేశారు! నేనెప్పటిలా ఫ్రెండ్లీగానే మాట్లాడుతున్నాను కదా! అలా అని కాదు. అప్పట్లో మీ మాటల్లో ఇంత దూకుడు కనిపించేది కాదు. ఇప్పుడు ఏమడిగినా టకీమని సమాధానాలొచ్చేస్తున్నాయ్? ఓహ్ అదా..? కాన్ఫిడెన్స్, ఎక్స్పీరియన్స్.. ఈ రెండూ ఉన్నవాళ్లు ఇలానే మాట్లాడతారు. ఒకప్పుడు నాకీ రెండూ నిల్. ఇప్పుడు ఫుల్. అందుకే ఇలా! ఫ్రెండ్లీగా ఉన్నా... తెలుగు పరిశ్రమపై కోపంగా ఉన్నారేమో అనిపిస్తోంది? వరుసగా తమిళ్, హిందీ సినిమాలు చేస్తున్నానని అలా అనుకుంటున్నారేమో? అలా ఏమీ లేదు. నన్ను కథానాయికను చేసిందే తెలుగు పరిశ్రమ. నేనెక్కువ సినిమాలు చేసింది కూడా ఇక్కడే. ఈ పరిశ్రమపై కోపం పెంచుకుంటే అంతకంటే అన్యాయం ఉండదు. కానీ, ఏదో విషయంలో మీరు ‘హర్ట్’ అయ్యారేమో అనిపిస్తోంది? నిజమే. రెండేళ్ల క్రితం వరకూ తెలుగు పరిశ్రమలో నా గురించి ఏమనేవారో తెలుసా? ‘తాప్సీ అన్‌లక్కీ. తను చేసే సినిమాలేవీ హిట్టవ్వవు’ అని. ఇప్పుడా ట్యాగ్ మారిందా? మారింది. ఏ వెబ్సైట్ అయితే ‘అన్‌లక్కీ’ అని నా మీద ముద్ర వేసిందో, అదే వెబ్సైట్ ‘తాప్సీ లక్కీ’ అని రాసింది. అంత సడెన్‌గా నేను ఎలా లక్కీ అయ్యానో నాకే అర్థం కాలేదు. హిందీలో ‘బేబీ’ హిట్ అయ్యింది. తమిళంలో నేనిప్పటివరకూ చేసినవన్నీ విజయవంతమైన సినిమాలే. అందుకే ‘లక్కీ’ అంటున్నట్టున్నారు. ‘అన్ లక్కీ’ అంటుంటే ఏమనిపించేది? ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం అయ్యేది కాదు. ఎందుకంటే తమిళ, హిందీ రంగాల్లో నాపై ఈ ముద్ర లేదు. అక్కడ లక్కీ అనిపించుకున్న నేను ఇక్కడ అన్‌లక్కీ ఎలా అవుతాను? ఆ మాట విన్నప్పుడల్లా అభద్రతాభావం ఆవరించేది. పైగా ఒక సినిమాలో నేను ఏ పది, పదిహేను సీన్సో చేసి ఉంటాను. అలాంటప్పుడు చిత్ర అపజయానికి నేనెలా కారణమవుతాను? కానీ, నన్నే టార్గెట్ చేశారు. అందుకే తెలుగుఫీల్డ్కి దూరమయ్యారా? నా మాతృభాష హిందీ తర్వాత నేను నేర్చుకున్న భాష తెలుగే. ఇక్కడ నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పుకుంటున్నాను. తెలుగంటే నాకెంత ప్రేమో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. నేనిక్కడి వాళ్లని ఒక్కటే కోరుకుంటున్నా. ‘నన్ను అభిమానించండి. గ్లామరస్ రోల్స్ చేయగలను. నటనకు అవకాశం ఉన్న పాత్రలూ చేయగలనని నిరూపించుకున్నాను. కాబట్టి ఇప్పటికైనా గుర్తించి మంచి అవకాశాలివ్వండి. మరి... హిందీ రంగం సంగతేంటి? అక్కడ మెయిన్ హీరోయినా? సెకండ్ హీరోయినా? అని చూడరు. పాత్రని మాత్రమే పట్టించుకుంటారు. ‘బేబీ’లో నా పాత్ర నిడివి 20 నిముషాలే. కానీ ఆ పాత్ర నాకు తెచ్చిపెట్టిన ప్రశంసలెన్నో. మీడియా నన్ను ఎంతగానో అభినందిస్తూ రాసింది. సినిమాల్లోకి వచ్చిన కొత్తలో కొంచెం బొద్దుగా ఉండేవారు. ఇప్పుడు భలే సన్నబడ్డారే? అప్పట్లో కెమెరా గురించి అవగాహన ఉండేది కాదు. బరువు గురించి పెద్దగా ఆలోచించలేదు. ఆ తర్వాత తెరపై చక్కగా కనిపించాలంటే ఎంత బరువు ఉండాలో తెలిసింది. దాంతో కొంచెం తగ్గాను. తెలుగు మీడియాలో అలా రాయలేదా? చాలా మటుకు రాయరు. రివ్యూ రాసేటప్పుడు హీరో, విలన్, కమెడియన్ గురించి విపులంగా రాస్తారు. హీరోయిన్లకు మాత్రం అలా రాయరు. ‘తాప్సీ గుడ్’ అని మొక్కుబడిగా ఓ ముక్క రాస్తారు. సో... తెలుగు మీడియాపై కోపం ఉందన్నమాట? కోపం కాదు బాధ. రాత్రికి రాత్రి నన్ను ‘స్టార్’ని చేసింది తెలుగు మీడియానే. కానీ తర్వాత వాళ్లే కింద పడేశారు. ఏదైపా మంచి పాత్ర చేసినప్పుడు రెండు మంచి మాటలు రాస్తే తృప్తిగా ఉంటుంది కదా! ‘బేబీ’ తర్వాత మీ దృష్టి ఉత్తరాది చిత్రాలపైనే ఉంటోందా? తెలుగు దర్శక, నిర్మాతలను మంచి ఆఫర్ ఇవ్వమనండి. ఇక్కడా ఉంటాను. తమిళంలో రెండు సినిమాలు చేస్తున్నాను. సౌత్‌ని వదిలి ఎక్కడికీ వెళ్లలేదు. ఇక్కడి చిత్రాలు వదులుకునే ప్రసక్తే లేదు. తెలుగు పరిశ్రమ, మీడియా సంగతి సరే. అభిమానుల సంగతి? వాళ్లు లేకపోతే నేను లేను. ఏదైనా షూటింగ్ కోసం, ఫంక్షన్ కోసం వచ్చినప్పుడు చక్కగా పలకరిస్తుంటారు. అభిమానం రుచి ఎలా ఉంటుందో నాకు తొలిసారి చూపించింది తెలుగు ప్రేక్షకులే. వాళ్లెప్పటికీ నాకు ప్రత్యేకం. - డి.జి.భవాని -
కొత్తదనంలేని తెలుగు సినిమాలు
-
మంచి ప్రయత్నమిది!
‘‘తెలుగు పరిశ్రమ ఇక్కడ అభివృద్ధి చెందడానికి అవసరమైన వనరులు అందించడానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌గారు సిద్ధంగా ఉన్నారు. మంచి చిత్రాలను అందించేవారికి రాయితీలు ఇవ్వాలనే ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉంది. ఒక మంచి ఆలోచనతో రాజ్‌కుమార్ తీసిన ఈ చిత్రం ఘనవిజయం సాధించాలి’’ అని తెలంగాణ రాష్ర్ట మంత్రి హరీష్ రావు అన్నారు. వంశీకృష్ణ, అనుశ్రీ జంటగా సిలివేరి రమేష్‌బాబు సమర్పణలో స్వీయదర్శకత్వంలో రాజ్‌కుమార్ రూపొందించిన చిత్రం ‘నువ్వేనా అది నీవేనా’. శ్రీ వెంకట్ స్వరపరచిన ఈ చిత్రం ఆడియో ప్లాటినమ్ డిస్క్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. రాజ్‌కుమార్ చేసిన ఈ మంచి ప్రయత్నం విజయం సాధించాలని రాష్ట్ర మంత్రులు కొప్పుల ఈశ్వర్, జూపల్లి కృష్ణారావు అన్నారు. ఈ చిత్రానికి సహనిర్మాత: బొల్లంపల్లి సాయిరమణ. -
మా దృష్టికి అలాంటిదేం రాలేదు!
‘‘వేతనాల పెంపు విషయంలో గత కొన్ని నెలలుగా కార్మికుల సమాఖ్యకూ, చలన చిత్ర వాణిజ్య మండలికీ చర్చలు జరిగిన విషయం తెలిసిందే. కార్మిక సమాఖ్య కోరుకున్నట్లుగానే వేతనాలు పెంచాం. ఆ విషయం నిర్మాతలందరికీ తెలియాలనే ఆకాంక్షతో పత్రికా ప్రకటనలు ఇచ్చాం’’ అని ఏ.పి.చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు ఎన్వీ ప్రసాద్ చెప్పారు. బుధ వారం మధ్యాహ్నం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ఎన్వీ ప్రసాద్ మాట్లాడుతూ -‘‘భారతదేశంలో తెలుగు పరిశ్రమ పెంచినంత వేతనాలు వేరే చోటెక్కడా పెంచలేదు. దక్షిణాది పరిశ్రమ మొత్తం ఒకేసారి పెంచుదామన్నా.. మేం అంగీకరించలేదు. ఇక్కడి కార్మికులకు న్యాయం చేసే దిశలో పెంచాం. అయితే, చిన్న చిత్రాల నిర్మాతలకు కష్టమవుతుంది కాబట్టి, వారికి కొంచెం వెసులుబాటు ఇవ్వాలని కార్మికుల సమాఖ్యను కోరాం. అక్టోబర్ 21న నుంచి మారిన వేతనం వర్తిస్తుంది’’ అని చెప్పారు. చిన్న సినిమాల అని ఏ ప్రాతిపదికన గుర్తిస్తారు? అనే ప్రశ్నకు జవాబిస్తూ -‘‘అది చలన చిత్ర వాణిజ్య మండలి నిర్ణయిస్తుంది’’ అన్నారు. గురువారం నుంచి కార్మికులు స్ట్రయిక్ చేయనున్నారనే సంగతి ప్రస్తావిస్తే, నిర్మాతల మండలి అధ్యక్షుడు బూరుగుపల్లి శివరామకృష్ణ స్పందిస్తూ -‘‘మా దృష్టికి అలాంటిదేం రాలేదు. వేతనాల విషయంలో వారు సంతృప్తికరంగానే ఉన్నారు. అయితే, ఫెడరేషన్‌కు సంబంధించినవాళ్లనే తీసుకోవాలనే వారి ప్రతిపాదనను మేం అంగీకరించలేం. ఎందుకంటే, ఏ నిర్మాతకైనా ఎవరితో పని చేయించుకోవాలో నిర్ణయించుకునే హక్కు ఉంటుంది. అలాగే, చిన్న చిత్రాలపరంగా వేతనాల విషయంలో కొంచెం వెసులుబాటు ఇవ్వాలనే మా ప్రతిపాదనను వారు అంగీకరించలేదు. ఈ రెండు విషయాలు మినహా మా మధ్య వేరే విభేదాలు లేవు. ఈ రెండింటినీ కారణంగా చూపించి, స్ట్రయిక్ చేస్తే మేం చేయగలిగిందేమీ లేదు’’ అని చెప్పారు. ఈ సమావేశంలో నిర్మాతలు కొడాలి వెంకటేశ్వరరావు, ఎంఎల్ కుమార్ చౌదరి, కె. సురేశ్‌బాబు పాల్గొన్నారు. -
సైఫ్ అలీఖాన్ ఫోన్లో టచ్‌లో ఉండేవారు!
అసిన్, కాజల్ అగర్వాల్, తమన్నా, చార్మి తదితరుల జాబితాలో ఇప్పుడు దీక్షా సేథ్ పేరు కూడా చేరింది. వీళ్లంతా తెలుగులో పేరు తెచ్చుకుని, హిందీ తెరపై మెరిశారు. వేదం, మిరపకాయ్, వాంటెడ్, రెబల్ తదితర చిత్రాల్లో నటించిన దీక్షాసేథ్ ‘లేకర్ హమ్ దీవానా దిల్’ చిత్రం ద్వారా హిందీ రంగానికి పరిచయం కానున్నారు. వచ్చే నెల 4న విడుదల కానున్న ఈ చిత్రం ప్రచార నిమిత్తం హైదరాబాద్ వచ్చిన దీక్షా సేథ్తో జరిపిన చిట్ చాట్. హాయ్ దీక్షా.. ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నానండి. తెలుగు పరిశ్రమ మీద అలిగారా ఏంటి... ఇక్కడ సినిమాలు చేయడంలేదు? అయ్యో అలాంటిదేమీ లేదండి. నన్ను కథానాయికను చేసింది తెలుగు పరిశ్రమే. అలాంటప్పుడు ఈ పరిశ్రమపై అలక ఎందుకు? మరి.. ‘రెబల్’ విడుదలై రెండేళ్లయినా తెలుగులో సినిమా కమిట్ కాలేదేంటి? ‘రెబల్’ సినిమా విడుదలైన సమయంలో నేనో పని మీద ముంబయ్ వెళ్లాను. అప్పుడు ‘లేకర్ హమ్ దీవానా దిల్’కి ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలిసి, వెళ్లాను. వెంటనే నన్ను ఓకే చేశారు. ఇందులో నేను దక్షిణాది అమ్మాయిగా నటించాను. నా పాత్ర పేరు కరిష్మా శెట్టి. ఎలాగూ సౌత్ గాళ్‌గా చేశాను కాబట్టి, సౌత్‌ని మిస్సయిన ఫీలింగ్ లేదు. మరి.. ఈ సినిమా చేస్తూనే తెలుగు సినిమాలు అంగీకరించవచ్చు కదా? ఈ సినిమా చేస్తున్నప్పుడు వేరే సినిమా చేయకూడదని నిర్మాతలు నిబంధన పెట్టారు. హిందీ రంగంలో నాకిది మంచి పరిచయ చిత్రం అవుతుందనిపించి, ఆ ఒప్పందాన్ని అంగీకరించాను. ఈ చిత్రనిర్మాతల్లో సైఫ్ అలీఖాన్ ఒకరు కదా... ఆయన నిర్మాణంలో సినిమా చేయడం ఎలా అనిపించింది? సైఫ్ పెద్ద స్టార్ అయినా చాలా స్నేహంగా ఉంటారు. ఒకవైపు ఈ సినిమా నిర్మిస్తూ, మరోవైపు వేరే చిత్రంలో నటించేవారు. అందుకని, మా లొకేషన్‌కి పెద్దగా వచ్చేవారు కాదు. కాకపోతే, ఫోన్లో టచ్‌లో ఉండేవారు.‘అంతా సౌకర్యవంతంగానే ఉంది కదా.. ఏమీ సమస్యలు లేవుగా’ అని అడిగేవారు.అది సరే.. కాజల్, తమన్నా, చార్మి తదితరులు బాలీవుడ్‌పై దృష్టి పెట్టారు కదా.. వారిని ఆదర్శంగా తీసుకున్నారా ఏంటి? ప్రాంక్‌గా చెప్పాలంటే.. వాళ్ల కెరీర్ ఎలా ఆరంభమైందో నాకు తెలియదు. సౌత్‌లో ఎప్పుడు స్టార్ అయ్యారో, నార్త్‌కి ఎప్పుడు రావాలనుకున్నారో కూడా తెలియదు. అలాంటప్పుడు వాళ్లని ఎలా ఫాలో అవుతాను. హిందీ రంగంలోకి వెళ్లడానికి కొంతమందిలా నేను తెలివిగా అడుగులేయలేదు. పెద్ద పెద్ద ప్రణాళికలేవీ వేసుకోలేదు. ఆ మాటకొస్తే నేను హీరోయిన్ అవుతాననే అనుకోలేదు. అనుకోకుండానే ‘వేదం’లో అవకాశం వచ్చింది. ఇప్పుడు హిందీలో కూడా అంతే. ఏదోపని మీద ముంబయ్ వెళితే.. ఈ సినిమా కుదిరింది. ఈ చిత్ర కథానాయకుడు అర్మాన్ జైన్, గ్రేట్ రాజ్‌కపూర్ మనవడు కాబట్టి, ప్రేక్షకుల దృష్టంతా తన మీదే ఉంటుందేమో? ఒకవేళ కథానాయిక పాత్ర బాగుండకపోతే అదే జరిగి ఉండేది. కానీ, ఈ చిత్రంలో హీరోకి దీటైన పాత్ర నాది. నటనకు అవకాశం ఉంది. కాబట్టి, అర్మాన్పైనే కాదు.. ప్రేక్షకుల దృష్టి నా పైనా ఉంటుంది. ఇక హిందీలోనే కొనసాగుతారా? తెలుగు చిత్రాలు చేస్తారా? నా మాతృభాష హిందీ అయినంత మాత్రాన అక్కడే కంటిన్యూ అవుతాననుకుంటున్నారా? నాకు భాష ముఖ్యం కాదు. ఎక్కడ మంచి పాత్ర వస్తే, అక్కడ సినిమాలు చేస్తా. -
మూడేళ్ల ప్రాయంలోనే నటించా
కడియం : మూడేళ్ల వయస్సున్నప్పుడే కెమెరా ముందు నటించినట్టు హీరో కౌశిక్‌బాబు తెలిపారు. బాల నటుడిగా టీవీ, సినిమా రంగాల్లో తెలుగు, తమిళ, మళయాళ భాషల్లో నటించినట్టు ఆయన వెల్లడించారు. కౌశిక్ హీరోగా నటిస్తున్న ‘తొలి సంధ్యవేళలో’ సినిమా షూటింగ్ స్థానిక పల్ల వెంకన్న నర్సరీలో ఆదివారం జరిగింది. ఆ సందర్భంగా ఆయన తన నటనాప్రయాణంలో ఆసక్తికరమైన అంశాలను విలేకరులకు తెలియజేశారు. సీరియల్స్‌తో తొలి అడుగు మా నాన్నగారైన విజయబాబు (సమాచార హక్కు చట్టం కమిషనర్)కు స్నేహితుడు, డెరైక్టర్ అయిన సునీల్‌వర్మ మా ఇంటికి వచ్చినప్పుడు నన్ను చూసి ‘కళంకిత’ సీరియల్లో అవకాశం ఇచ్చారు. అలా మొదలైన నటనా ప్రస్థానంలో బాలనటుడిగా 50కి పైగా సీరియళ్లు, 20 వరకు సినిమాల్లో నటించాను. పలు విజయవంతమైన చిత్రాల్లో ప్రముఖ హీరోల చిన్ననాటి పాత్రలను పోషించాను. ‘టక్కరిదొంగ’ చిత్రంలో మహేష్‌బాబు చిన్ననాటి పాత్రకు నంది అవార్డు దక్కింది. కేరళలో ‘కుట్టి ఎన్టీఆర్’ మహానటుడు ఎన్టీ రామారావుకు తెలుగుసినీరంగంలో రాముడు, కృష్ణుడు వంటి పాత్రల ద్వారా ఎంత పేరొచ్చిందో కేరళలో నాకు అలాంటి గుర్తింపు వచ్చింది. ‘స్వామి అయ్యప్ప’ సినిమాలో అయ్యప్ప పాత్రకు ఆ రాష్ట్ర ప్రభుత్వం మోస్ట్‌పాపులర్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డునిచ్చింది. మళయాళ మనోరమ వారి ఫీచర్ఫిలిమ్ రామాయణంలో రాముడిగాను, గురవాయప్పన్ సీరియల్లో కృష్ణుడిగా విశేషంగా ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో అక్కడి వారందరూ నన్ను కుట్టి ఎన్టీఆర్ (చిన్న ఎన్టీఆర్) అని పిలుస్తారు. ఆదిశంకరాచార్యుడిగా.. యువహీరోలందరూ యాక్షన్చిత్రాలపై దృష్టిపెడుతుంటే ఆదిశంరాచార్య సినిమా తీసుకున్నారేంటని చాలా మంది తొలుత నన్ను అడిగేవారు. సాహిత్య అభిమాని, కళలను ప్రేమించే మా నాన్నగారు నా చిన్నప్పటి నుంచీ భక్తిభావం నూరిపోసారు. అందుకనే ఆ సినిమాకు అంగీకరించాను. అయితే ఆ సినిమా విజయవంతం కావడంతో పెదవి విరిచినవారే అభినందించారు. ఆ సినిమా ద్వారా నాకు మంచి గుర్తింపు లభించింది. మాస్ పాత్రలవైపు నేను బాల నటుడిగా ఉన్నప్పటి నుంచీ మాస్ ప్రేక్షకులను ఆకర్షించే డాన్స్, యాక్షన్స్ నేర్చుకున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్న ‘తొలిసంధ్యవేళ’లో చిత్రం నాకు హీరోగా మంచి గుర్తింపు వస్తుంది. గతంలో ‘పవిత్ర’ సినిమాలో కూడా కీలకపాత్ర పోషించాను. ఎంబీఏ సెకండియర్‌లో ఉన్నా.. ప్రస్తుతం ఎంబీఏ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాను. షూటింగ్లవల్ల చదువుకు ఆటంకం కలగకుండా చిన్నప్పట్నుంచీ తగు జాగ్రత్తలు తీసుకున్నాను. కుటుంబ సభ్యుల సహకారంతో ఓపక్క చదువుకుంటూ మరో పక్క నటనలో కొనసాగగలిగాను. ఈ జిల్లా నచ్చింది తొలిసారిగా షూటింగ్ కోసం ఇక్కడకు వచ్చాను. ఇక్కడి ప్రకృతి అందాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. మన రాష్ట్రంతోపాటు తమిళనాడు, కేరళలోని పలు ప్రాంతాల్లో ఇంతవరకు పర్యటించాను. అయితే ఈ జిల్లా ప్రకృతి అందాలు, ప్రజల ఆదరాభిమానాలు ఎప్పటికీ ప్రత్యేకమైనవే. -
అక్కినేని మహోన్నత నటుడు
బెంగళూరు, న్యూస్‌లైన్ : దివంగత అక్కినేని నాగేశ్వరరావు మహోన్నత నటుడని, ఆయన ఆదర్శాలను ప్రతి ఒక్కరూ పాటించడమే నిజమైన నివాళి అని మాజీ స్పీకర్, శ్రీనివాసపురం ఎమ్మెల్యే రమేష్‌కుమార్ పేర్కొన్నారు. నగరంలోని తెలుగు విజ్ఞాన సమితి అధ్వర్యంలో శ్రీకృష్ణ దేవారాయ కళా మందిరంలో మంగళవారం డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావుకు సంస్మరణ సభ నిర్వహించి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. ముఖ్య అతిథిగా హాజరైన రమేష్‌కుమార్ మాట్లాడుతూ నాగేశ్వరరావు చూపిన బాటలో అందరూ నడవాలన్నారు. తెలుగు విజ్ఞాన సమితి అధ్యక్షుడు డాక్టర్ ఏ.రాధకృష్ణరాజు మాట్లాడుతూ అక్కినేనితో తనకు 43 సంవత్సరాల అనుబంధం ఉందన్నారు. నగరంలో ప్రవాసాంధ్రులు నిర్వహించే కార్యక్రమాలకు ఆహ్వానం అందితే తప్పకుండా హాజరయ్యేవారన్నారు. మూడు తరాల ప్రెక్షకులను రంజీంప చేసిన మహా నటుడు డాక్టర్ అక్కినేని ఒక్కరే అని అన్నారు. నటి వీ.సరోజిని దేవి మాట్లాడుతూ అక్కినేని నాగేశ్వర రావు మరణంతో తెలుగు పరిశ్రమ పెద్దదిక్కును కోల్పోయిందన్నారు. కన్నడ నటి తార మాట్లాడుతూ మాహ నటుడు అక్కినేని మన ముందు లేక పోయినా ఆయన నటించిన సినిమాల ద్వారా ఎప్పటికీ సజీవంగా ఉంటారన్నారు. కార్యక్రమంలో తెలుగు విజ్ఞాన సమితి ప్రధాన కార్యదర్శి జయచంద్రారెడ్డి, కోశాధికారి సి.వి.శ్రీనివాసయ్య, మాజీ అధ్యక్షుడు జెఎస్. రెడ్డి, మాజీ కార్యదర్శి కే.గంగరాజు, బహుభాష నటి హేమాచౌదరి, ఏఆర్.రాజు, కర్ణాటక సినిపరిశ్రమ వాణిజ్య మండలి అధ్యక్షుడు గంగరాజు, బాబునాయుడు, రంగస్వామినాయడు పాల్గొన్నారు. -
నవ్వినోళ్లే శభాష్ అన్నారు : బాబూమోహన్
హనుమాన్‌జంక్షన్ : ‘‘నటనపై మోజుతో రెవెన్యూ శాఖలో చేస్తున్న ఉద్యోగం మానేసి సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టా.. నా ఫేస్ చూసి అంతా నవ్వారు. నువ్వు నటిస్తావా.. అసలు నీ ముఖం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా.. అంటూ ఎగతాళి చేశారు.. కానీ ఆ తర్వాత సీన్ రివర్సయింది. వెండితెరపై నేను కనిపించినప్పుడల్లా ప్రేక్షకులు హాయిగా నవ్వుకున్నారు... థియేటర్లలో చప్పట్లు.. ఈలలు.. హోల్ ఆంధ్రాకే సోల్ అండగాడినంటూ కితాబిచ్చారు... ఇదీ నా సినీప్రస్థానం’’ అంటూ హాస్యనటుడు బాబూమోహన్ చెప్పారు. వెన్నెల ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై పుట్టగుంట సతీష్‌కుమార్ హీరోగా ఎన్.కె.రావు స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ‘ఎమ్మెల్యే భరత్’ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను మూడు రోజులుగా హనుమాన్‌జంక్షన్ పరిసర ప్రాంతాల్లో బాబూమోహన్‌పై చిత్రీకరిస్తున్నారు. ఆదివారం ఆయన్ను కలిసిన ‘న్యూస్‌లైన్’తో ప్రత్యేకంగా మాట్లాడారు. న్యూస్‌లైన్: మీ కుటుంబ నేపథ్యం? బా.మో : ఖమ్మం జిల్లాలోని బీరవోలు మా స్వగ్రామం. తల్లిదండ్రులిద్దరూ ఉపాధ్యాయులు. న్యూస్‌లైన్ : సినిమాల్లో మీకు ఫస్ట్ చాన్స్ ఎలా వచ్చింది? బా.మో : హైదరాబాదు రవీంద్రభారతిలో నేను ప్రదర్శించిన నాటకాన్ని చూసిన ప్రతాప్ ఆర్ట్స్ అధినేత రాఘవగారు ‘ఈ ప్రశ్నకు బదులేది’ చిత్రంలో అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత కోడి రామకృష్ణ దర్శకత్వంలో ఆహుతి, ఆంకుశం చిత్రాల్లో నటించడంతో మంచి గుర్తింపు లభించింది. న్యూస్‌లైన్ : ఇప్పటివరకు ఎన్ని చిత్రాల్లో నటించారు? బా.మో : తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో సుమారు 965 చిత్రాల్లో నటించా. న్యూస్‌లైన్ : మీకు బాగా గుర్తింపునిచ్చిన సినిమాలు? బా.మో : మామగారు సినిమాల్లో వేసిన యాచకుడి పాత్ర హాస్యనటుడిగా మంచి పేరు తెచ్చిపెట్టింది. అంకుశం, వన్‌బై టూ, మాయలోడు, రాజేంద్రుడు- గజేంద్రుడు, పెదరాయుడు, జంబలకడిపంబ, అమ్మోరు చిత్రాలు ప్రేక్షకులకు మరింత దగ్గర చేశాయి. న్యూస్‌లైన్ : ఒకప్పుడు అగ్రశ్రేణి హాస్యనటుడిగా ఎదిగిన మీకు ఇప్పుడు అవకాశాలు సన్నగిల్లడానికి కారణం? బా.మో : సినిమాలు, రాజకీయాలు.. రెండింటికీ సమతూకంలో సమయం కేటాయిద్దామనుకున్నా. కానీ ప్రజాజీవితంలో అది కుదరదని తేలిపోయింది. డేట్స్ ఇచ్చిన నిర్మాతలకు ఇబ్బందులు కలగకూడదనే సినిమాలు తగ్గించేశాను. న్యూస్‌లైన్ : మీ సహనటులకు వచ్చిన పద్మశ్రీ పురస్కారం మీకెందుకు రాలేదు? బా.మో : నేను సినిమాల్లోకి వచ్చిన రెండు, మూడేళ్లలోనే బాగా బిజీ అయ్యాను. రోజుకు ఐదారు షూటింగులు ఉండేవి. దీంతో నేను నటించిన చిత్రాల జాబితా రాయడం కుదర్లేదు. అది ఉంటే నేనూ బ్రహ్మానందంతోపాటే పద్మశ్రీకి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉండేది. న్యూస్‌లైన్ : రాజకీయాలు మీకు తృప్తినిచ్చాయా? బా.మో : ఒకే అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టిన ఏకైన నటుడిని నేనొక్కడినే. ఎన్టీఆర్‌కి కూడా ఈ రికార్డు లేదు. ప్రజలు నాపై ఉంచిన నమ్మకంతో బాధ్యతగా పనిచేశాననే తృప్తి ఉంది. 2014 ఎన్నికల్లో ఆంధోల్ నుంచి పోటీకి సిద్ధమవుతున్నా. -
మళ్లీ వస్తా.. కాజా తింటా
మీడియాతో కాజల్ చిట్‌చాట్ కాకినాడ, న్యూస్‌లైన్ : ‘పచ్చని పొలాలు... ఆహ్లాదం గొలిపే పర్యాటక ప్రాంతాలున్న తూర్పుగోదావరి జిల్లాకు రావడం ఇదే మొదటిసారి. కాకినాడ రావడం ఆనందంగా ఉంది. ఇక్కడి అభిమానులు నాపై చూపుతున్న ఆప్యాయత మరువలేను.’ అని ప్రముఖ సినీనటి కాజల్‌అగర్వాల్ అన్నారు. మెయిన్‌రోడ్డులో మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటైన ‘శ్రీనికేతన్ ఉమెన్స్ షాపింగ్ వరల్డ్’ను ప్రారంభించేందుకు వచ్చిన కాజల్ మీడియాతో కొద్దిసేపు ముచ్చటించారు. ప్ర: తూర్పుగోదావరి జిల్లా ఎలా ఉంది? జః చాలా బాగుంది. మళ్లీ రావాలనిపిస్తోంది ప్ర: కాకినాడ కాజా రుచి చూశారా? జః రుచి చూడలేదు. త్వరలోనే మళ్లీ వస్తా. ఈసారి తప్పకుండా కాజా తింటా. ప్రః తెలుగు ఇండస్ట్రీకి దూరమైనట్టున్నారు? జ: అబ్బే అదేం లేదు. తెలుగులో నటిస్తూనే ఉంటా. తెలుగు పరిశ్రమకు దూరమయ్యే ప్రసక్తే లేదు. ప్ర: బాలీవుడ్లో అవకాశాలు ఎలా ఉన్నాయి? జ : మంచి ఛాన్సులు వస్తున్నాయి. ఉత్తరాది ప్రేక్షకులు కూడా మంచి ఆదరణ చూపుతున్నారు. ప్రః ప్రస్తుతం ఏ సినిమాల్లోచేస్తున్నారు? జః ‘జో’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. సంక్రాంతికి ఇది విడుదలవుతుంది. తెలుగు, తమిళ భాషల్లో మరో రెండు ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయి. ప్ర : నటిగా మీకు బ్రేక్ ఇచ్చిన సినిమా ఏది ? జ : ముందు చందమామ.. ఆ తర్వాత మగధీర.. తర్వాత చాలా సినిమాలు ఉన్నాయి. ప్రః తెలుగులో మళ్లీ ఎప్పుడు కనిపిస్తారు? జః తెలుగులో కూడా మంచి ప్రాజెక్టులు ఉంటాయి. తెలుగు ప్రజల ఆదరాభిమానాల వల్లనే ఇవాళ నేను ఈ స్థాయికి చేరుకోగలిగాను. వారిని మరువలేను. కాకినాడలో కాజల్ సందడి శ్రీ నికేతన్ మహిళా షోరూం ప్రారంభం కాకినాడ, న్యూస్‌లైన్ : ప్రముఖ సినీ నటి కాజల్ అగర్వాల్ శుక్రవారం కాకినాడలో సందడి చేశారు. ఆమెను చూసేందుకు వచ్చిన అభిమానులతో మెయిన్ రోడ్ జనసంద్రంగా మారింది. హాయ్ ... అంటూ చేతులూపుతూ ఆమె అభిమానులను పలకరించారు. మెయిన్‌రోడ్డులో మహిళలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శ్రీనికేతన్ ఉమెన్స్ షాపింగ్ వరల్డ్‌ను ఆమె ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలన చేసిన కాజల్ వివిధ విభాగాలను సందర్శించారు. కళానికేతన్ టెక్స్టైల్స్ జ్యూవెలర్స్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ వి.లీలాకుమార్, ప్రముఖ వ్యాపారవేత్త సత్తి సత్య నారాయణరెడ్డి (దొరబాబు) ఆమెకు స్వాగతం పలికారు. వారు మాట్లాడుతూ కంచి పట్టు, బెనారస్, కలకత్తా, సూరత్ చీరలతో పాటు వెస్ట్రన్, కిడ్స్ వేర్, సంప్రదాయ లంగాఓణీదుస్తులతో సహా పలు మోడల్స్ ఉంటాయన్నారు. కలెక్టర్ నీతూప్రసాద్, కాకినాడ సిటీ తాజామాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ భార్య మహాలక్ష్మి, రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు భార్య శ్రీవిద్య, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి శేషారెడ్డి భార్య లక్ష్మీరాజ్యంతో పాటు సత్తి మాధవి, బద్దం సుధ, సత్తి లక్ష్మీనాగసుధ ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొన్నారు. -
సిమ్రాన్ మళ్లీ వస్తోంది!
ఒకప్పుడు సిమ్రాన్ తెలుగు తెరపై క్రేజీ హీరోయిన్. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, మహేష్‌బాబు లాంటి అగ్రహీరోలందరితోనూ నటించింరామె. పెళ్లి తర్వాత దాదాపుగా సినిమాలకు దూరమయ్యారు. అయితే ఈమధ్య తమిళంలో కొన్ని సినిమాల్లో కనిపిస్తున్నారు. త్వరలో తెలుగుతెరపై కూడా ఆమె తళుక్కుమనబోతున్నారు. నాని హీరోగా యశ్‌రాజ్ సంస్థ నిర్మిస్తున్న ‘ఆహా కల్యాణం’లో ఆమె ఓ ముఖ్యపాత్ర పోషించారు. అంటే ఈ సినిమా తర్వాత సిమ్రాన్ తెలుగులో విరివిగా నటించినా ఆశ్చర్యపోనవసరం లేదు. -
నటి సౌందర్య ఆస్తుల కేసులో కుదిరిన రాజీ
బెంగళూరు, న్యూస్‌లైన్: బహుభాషా నటి, తెలుగు, కన్నడ చిత్రాల్లో ఓ వెలుగు వెలిగిన అందాల తార సౌందర్య అర్ధాంతరంగా విమాన ప్రమాదంలో తనువు చాలించిన విషయం తెల్సిందే. సౌందర్య మరణాంతరం ఆమె ఆస్తుల కోసం కుటుంబ సభ్యులు అప్పట్లో కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం కుటుంబ సభ్యులు రాజీకి వచ్చి ఎటువంటి వివాదం లేకుండా ఆస్తుల పంపకానికి పరస్పర అంగీకారానికి వచ్చారు. కోర్టులో ఉన్న వ్యాజ్యాన్ని ఉపసంహరించుకున్నారు. 2004 ఏప్రిల్ 17న బెంగళూరు నుంచి కరీంనగర్‌కు చార్టర్డ్ విమానంలో సౌందర్య, ఆమె సోదరుడు అమరనాథ్ మరికొంత మందితో బయలుదేరుతుండగా ఒక్కసారిగా విమానం కుప్పకూలి మంటలు అంటుకోవడంతో సౌందర్య, ఆమె సోదరుడితో పాటు అందరూ మృత్యువాత పడ్డారు. సౌందర్యకు తల్లి మంజుల, భర్త జీఎస్. రఘు, సోదరుడు అమరనాథ్, అతని భార్య బి. నిర్మల, వీరి కుమారుడు సాత్విక్ ఉన్నారు. సౌందర్య మృతి చెందిన తరువాత ఆస్తుల పంపకాల విషయమై కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరిగాయి. ఆ సమయంలో సౌంద ర్య 2003 ఫిబ్రవరి 15న వీలు రాశారని, ఆమె వీలునామా ప్రకారం ఆస్తులు పంపిణీ చెయ్యాలని అమరనాథ్ భార్య నిర్మల 2009లో ఇక్క డి మెజిస్టేట్ కోర్టును ఆశ్రయించారు. సౌందర్య ఎలాంటి వీలునామా రాయలేదని, నిర్మల సోదరుడు న్యాయవాది కావడంతో తప్పుడు వీలునామా సృష్టించారని సౌందర్య తల్లి మంజుల, రఘు కోర్టును ఆశ్రయించారు. అప్పటి నుంచి కోర్టులో వివాదం నడుస్తోంది. తన అత్త మంజుల, వరుసకు సోదరుడు అయిన రఘు తనపై కక్షసాధిస్తూ దౌర్జన్యం చేస్తున్నారని నిర్మల కోర్టులో కేసు దాఖలు చేసింది. సౌందర్య రాసిన వీలునామా నకిలీ అని ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ నిర్మల న్యాయవాది ధనరాజ్, సౌందర్య భర్త రఘు, ఆమె తల్లి మంజులపై పరువు నష్టం కేసు వేశారు. ఈ వివాదాలతో ఇంత కాలం వీరు కోర్టు చుట్టు తిరిగారు. చివరికి రాజీకి వచ్చి ఆస్తులు పంచుకోవాలని ఒక నిర్ణయానికి వచ్చారు. ఆస్తుల పంపకాలు ఇలా సౌందర్య ఆస్తులకు మంజుల, రఘు, నిర్మల, సాత్విక్ వారసులు. తాము రాజీకి వ చ్చామని, ఎలాంటి సమస్య లేదని వారు కోర్టుకు లిఖితపూర్వకంగా విజ్ఞప్తి చేశారు. వివాదపు అర్జీని కూడా ఉపసంహరించుకున్నారు. సౌందర్య పేరుతో ఉన్న రూ. 25 లక్షల బ్యాంకు డిపాజిట్, హనుమంత నగరలోని ఐదు ఇళ్లు మేనల్లుడు సాత్విక్‌కు చెందుతాయి. అదే విధంగా నిర్మలకు రూ. 1.25 కోట్ల నగదు చెందుతుంది. సౌందర్య సోదరుడు అమరనాథ్ పేరుతో వ్యవసాయ భూమి ఉంది. ఆ భూమి విక్రయించి వచ్చిన నగదులో మంజుల, నిర్మల, సాత్విక్ పంచుకోవ డానికి అంగీకరించారు. జాయింట్ ప్రాపర్టీ విషయంలో నిర్మల జోక్యం చేసుకోకుండ సౌందర్య తల్లి మంజులకు అప్పగించాలి. మల్లేశ్వరం, హెచ్ఆర్బీఆర్ రెండవ సెక్టార్‌లోని ఇంటి స్థలాలు, హైదరాబాద్‌లోని కార్యాలయం, హెచ్ఆర్బీఆర్ లేఔట్‌లోని ఇంటి స్థలాలు సౌందర్య భర్త రఘుకు అప్పగించాల్సి ఉంది. ఈ విషయంపై అందరు అంగీకరించడంతో కేసుకు పుల్‌స్టాప్ పడింది. అయితే సౌందర్య నిజంగా వీలునామా రాసిందా లేదా అనే విషయం మాత్రం మిస్టరీగా మారింది. సినీ ‘సౌందర్యం 1992లో కన్నడ సినీరంగం నుంచి గంధర్వ సినిమాతో వెండి తెరకు పరిచయమైన సౌందర్య తెలుగు, కన్నడ, తమిళ్, మళయాళం, హిందీ సినిమాలలో నటించి పలు అవార్డులు సొంతం చేసుకుంది. వంద సినిమాలకు పైగా ఆమె హీరోయిన్గా న టించింది. 2003 ఏప్రిల్ 27న వరుసకు బావ అయిన సాఫ్ట్వేర్ ఇంజనీరు రఘును వివాహం చేసుకుంది. 2004లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బీజేపీకి ప్రచారం చేసింది. అదే ఏడాది ఏప్రిల్ 17న ఇక్కడి జక్కూరు ఏయిర్పోర్టు నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని కరీంనగర్లో అక్కడి పార్లమెంట్ అభ్యర్థి (బీజేపీ) విద్యాసాగర్‌రావు తరపున ప్రచారం చెయ్యడానికి చార్టెర్డ్ విమానంలో బయలుదేరారు. ఆ విమానంలో సౌందర్య, ఆమె సోదరుడు అమరానాథ్ ఉన్నారు. దురదృష్టవశాత్తు విమానం గాలిలోకి ఎగిరి కొన్ని క్షణాలకే పక్కనే ఉన్న గాంధీ విశ్వవిద్యాలయం (జీకేవీకే) ఆవరణంలో కుప్పకూలిపోవడంతో సజీవ దహనమయ్యారు.