రెండేళ్ళ క్రితమే పెళ్ళి అనుకున్నా! | Rasi khanna about her marriage | Sakshi
Sakshi News home page

రెండేళ్ళ క్రితమే పెళ్ళి అనుకున్నా!

Published Thu, Jan 19 2017 10:55 PM | Last Updated on Tue, Sep 5 2017 1:37 AM

రెండేళ్ళ క్రితమే పెళ్ళి అనుకున్నా!

రెండేళ్ళ క్రితమే పెళ్ళి అనుకున్నా!

‘మీ పెళ్లెప్పుడు?’ అని ఏ హీరోయిన్‌ని అడిగినా.. ‘అప్పుడేనా? ఇంకా బోల్డంత కెరీర్‌ ఉంది’ అంటారు. ప్రస్తుతం తెలుగు పరిశ్రమలో దూసుకెళుతోన్న తారల్లో ఒకరైన రాశీఖన్నా నుంచి కూడా ఇదే సమాధానం వస్తుంది. నిజానికి, ఈ పాతికేళ్ల సుందరి 23 ఏళ్లకే పెళ్లి చేసుకోవాలను కున్నారట.

ఆ విషయం గురించి రాశీఖన్నా మాట్లాడుతూ – ‘‘చిన్నప్పుడు పెళ్లి గురించి నాకు చాలా కలలు ఉండేవి. 22 ముగిసి 23వ ఏట అడుగుపెట్టగానే పెళ్లి చేసుకోవాలనుకునేదాన్ని. ఆ సంగతి ఇప్పుడు తలుచుకొంటే, నాకే నవ్వొస్తూ ఉంటుంది! మీకూ నవ్వొస్తోంది కదూ. అయితే, అందరం కలిసే నవ్వుకుం దామా’’ అని చిరునవ్వు చిందించారు. ఇప్పుడు మాత్రం రాశీకి కెరీరే తప్ప పెళ్లి ఊసే లేదు. సినిమాతోనే ఊసులాడుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement