Rasi khanna
-
హీరోయిన్ అవ్వాలంటే అవి తప్పవు.. అన్‌స్టాపబుల్ ప్రోమోలో బాలయ్య
నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా అన్‌స్టాపబుల్ రెండో సీజన్ టాలీవుడ్ సెలబ్రిటీలతో దూసుకెళ్తోంది. ఇప్పటికే ఈ సీజన్లో రెబల్ స్టార్ ప్రభాస్, గోపీచంద్ కూడా హాజరవుతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రోమో కూడా విడుదలైంది. తాజాగా ఈ సీజన్లో మరో ముగ్గురు హీరోయిన్లను తీసుకొచ్చారు. ఒకప్పటి స్టార్ హీరోయిన్స్ జయప్రద, జయసుధలతో పాటు మరో కథానాయిక రాశీ ఖన్నా పాల్గొననుంది. తాజాగా ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను ఆహా రిలీజ్ చేసింది. వీరితో కలిసి బాలయ్య సందడి చేయగా సోషల్ మీడియాలో వైరలవుతోంది. డిసెంబర్ 23న ఫుల్ ఎపిసోడ్ ప్రసారమవుతుంది. ఈ ఎపిసోడ్లో బాలయ్య ముగ్గురు భామలతో కలిసి డ్యాన్స్ చేస్తూ సందడి వేశారు. రాశి ఖన్నాని పొగుడుతూ అలరించాడు. రాశి ఖన్నా తాను నటించిన ఊహలు గుసగుసలాడే సినిమాలోని పాటతో అలరించింది. ఈ ప్రోమోలో జయప్రద, జయసుధపై ప్రశ్నల వర్షం కురిపించారు బాలయ్య. ప్రస్తుతం నేను, శృతి ఆంధ్రప్రదేశ్‌లో హాట్ పెయిర్ అంటూ క్రేజీ కామెంట్స్ చేశారు. వచ్చే ఏడాదికి సంక్రాంతికి వీరసింహ రెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా శృతిహాసన్ నటిస్తోంది. -
శ్రీవారి దర్శనానికి 6 గంటలు
తిరుమల: తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ సాధారణంగా కనిపించింది. మంగళవారం అర్ధరాత్రి వరకు 77,154 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 30,182 మంది తలనీలాలు సమర్పించారు. హుండీలో రూ.4.62 కోట్లు వేశారు. ఎటువంటి టోకెన్లు లేకపోయినా శ్రీవారి దర్శనాన్ని కల్పిస్తున్నారు. స్వామి వారి దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 12 కంపార్ట్మెంట్లు నిండి ఉన్నాయి. స్వామిని దర్శించుకున్న సినీ నటి రాశీ ఖన్నా తిరుమల శ్రీవారిని బుధవారం సినీ నటి రాశీ ఖన్నా దర్శించుకున్నారు. ఆమెకు ఆలయాధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనాలను, అధికారులు ప్రసాదాలను అందించారు. -
Top News; మిస్‌కాకండి!
రైతన్నకు దన్నుగా.. మేమంతా ఉండగా... అన్నదాతలకు మద్దతు దేశవ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. బీజేపీ మినహా దాదాపు అన్ని రాజకీయ పార్టీలు రైతులకు అండగా నిలబడటంతో బంద్ సంపూర్ణంగా జరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ బంద్ పాటిస్తున్నారు. పూర్తి వివరాలు.. ఏలూరుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో అంతుబట్టని వ్యాధికి కారణాలను అన్వేషించేందుకు అత్యున్నత స్థాయి వైద్య నిపుణుల బృందాలు నేడు రానున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులు, ఐఐసీటీ బృందం ఏలూరులో పర్యటించనున్నాయి. పూర్తి వివరాలు తెలంగాణ పత్తికి బ్రాండ్ ఇమేజ్ తెలంగాణలో పండే పత్తికి బ్రాండ్ ఇమేజ్ తీసుకురావాలని అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. తమ రాష్ట్రంలో పండే పత్తి దేశంలో కెల్లా అత్యంత నాణ్యమైనదిగా గుర్తింపు పొందిందని, ప్రపంచంలోకెల్లా అత్యంత నాణ్యమైన పత్తిని ఉత్పత్తి చేసే ప్రాంతాల్లో తెలంగాణ ఒకటని ఆయన తెలిపారు. పూర్తి వివరాలు సోషల్ మీడియాపై అణచివేతలొద్దు సోషల్ మీడియాను అణచివేయాలనుకోవడం సరైంది కాదని అటార్నీ జనరల్ కె.కె.వేణుగోపాల్ చెప్పారు. ఆరోగ్యవంతమైన ప్రజాస్వామ్యానికి అది ఎంతమాత్రం మంచిది కాదని పేర్కొన్నారు. పూర్తి వివరాలు పెరగనున్న టీవీల ధరలు టీవీ, వాషింగ్ మెషీన్, ఫ్రిజ్, ఏసీ, మైక్రోవేవ్ ఓవెన్ తదితర వైట్ గూడ్స్ ధరలు త్వరలోనే పెరగనున్నాయి. ఉత్పత్తి, రవాణా వ్యయాలు పెరుగుతుండటంతో ఈ వస్తువుల ధరలను కంపెనీలు పెంచక తప్పడం లేదు. పూర్తి వివరాలు ఆరోహణ రేఖ రేఖారావుది హైదరాబాద్, కూకట్పల్లి. ఆమె ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన తొలి భారతీయ మహిళ బచేంద్రిపాల్ దగ్గర పర్వతారోహణం నేర్చుకున్నారు. పెళ్లి చేసుకుని, ఒక బిడ్డకు తల్లయిన తర్వాత కూడా హిమాలయ పర్వతాల ఆరోహణ చేశారు! పూర్తి వివరాలు క్లీన్‌స్వీప్‌పై టీమిండియా గురి భారత్–ఆస్ట్రేలియా చివరి టి20 నేడు జరగనుంది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఆస్ట్రేలియాతో టి20 సిరీస్‌ను సొంతం చేసుకున్న భారత్ క్లీన్‌స్వీప్‌పై గురిపెట్టింది. పూర్తి వివరాలు మాట్రిమోనియల్ ఫ్రాడ్ విదేశీ వధువుగా రిజిస్టర్ చేసుకున్న ఓ మహిళ వల్లో పడిన హైదరాబాద్ నగర వాసి రూ.5 లక్షలు పోగొట్టుకున్నాడు. బాధితుడు సోమవారం సిటీ సైబర్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. పూర్తి వివరాలు వైరల్: భయపెట్టిన దెయ్యం ఓ వ్యక్తి తన గదిలో తన పని చేసుకుంటుంటే అకస్మాత్తుగా శబ్ధాలు వినిపించాయి. ఆ సమయంలో అతడు తప్ప అక్కడ మరెవరూ లేరు. దీంతో ఇది ప్రాంక్ కాదని అతడికి అర్థమైంది. పూర్తి వివరాలు అమెరికా హెల్త్ సెక్రటరీగా హావియర్ అమెరికా ఆరోగ్య శాఖ (సెక్రెటరీ ఆఫ్ హెల్త్), హ్యూమన్ సర్వీసెస్ మంత్రిగా హావియర్ బసెరా ఎంపికయ్యారు. అలాగే, భారతీయ అమెరికన్ డాక్టర్ వివేక్ మూర్తిని సర్జన్ జనరల్‌గా కాబోయే అధ్యక్షుడు జో బైడెన్ ఎంపిక చేసుకున్నారు. పూర్తి వివరాలు రాజకీయాల్లోకి వస్తాను: హీరోయిన్ ‘భవిష్యత్తులో పక్కాగా రాజకీయాల్లోకి వెళ్తాను. అంతకంటే ముందు ఓ ఎన్జీవో ప్రారంభిస్తాను. నాకు రాజకీయాలు ఎలా చేయాలో తెలియదు. కానీ సహాయం ఎలా చేయాలో తెలుసు’ అంటున్న రాశీ ఖన్నా. పూర్తి వివరాలు -
‘ప్రతిరోజూ పండుగే’ ప్రమోషన్లో గొడవ
సాక్షి, గుంటూరు ఈస్ట్: ‘ప్రతిరోజూ పండుగే’ చిత్ర యూనిట్ సినిమా ప్రమోషన్లో భాగంగా ఆదివారం గుంటూరులో నిర్వహించిన విలేకరుల సమావేశం రసాభాసగా మారింది. ఈ నెల 20న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ యాత్రలో భాగంగా గుంటూరు భాస్కర్ థియేటర్‌కు హీరో సాయిధరమ్ తేజ్, కథానాయకి రాశీఖన్నా వచ్చారు. వారి వెనుకే అభిమానులు పెద్ద సంఖ్యలో బౌన్సర్లను తోసుకొచ్చారు. సాయిధరమ్ తేజ్ మైకు తీసుకోగా ఆకతాయిలు అల్లరి చేయడం మొదలెట్టారు. దీంతో హీరో హీరోయిన్లు థియేటర్ పైఅంతస్తుకు వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో నిర్వాహకులు, అభిమానుల మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి సద్దుమణిగిన తర్వాత అంధ విద్యార్థులకు చెక్కుల పంపిణీ చేశారు. అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మించిన ‘ప్రతిరోజూ పండుగే’ సినిమాకు మారుతి దర్శకత్వం వహించారు. తమన్ సంగీతం అందించారు. సత్యరాజ్, రావు రమేశ్, విజయ్‌కుమార్, నరేశ్, ప్రభ ముఖ్యపాత్రల్లో నటించారు. -
పండగలా వచ్చారు
-
ఎండల్లో హాయ్... హాయ్...
ఏప్రిల్‌లో ఎండలు ఎలా ఉంటాయి? వడదెబ్బ తగిలేంత స్ట్రాంగ్‌గా ఉంటాయి. ఇండోర్‌లో పని చేసేవాళ్లకు సమస్య ఉండదు కానీ అవుట్‌డోర్‌లో వర్క్ అంటే కష్టమే. సినిమా షూటింగ్స్ అన్నీ దాదాపు అవుట్‌డోర్‌లోనే జరుగుతాయి. అయినా నో ప్రాబ్లమ్ ‘ఎండల్లో హాయ్ హాయ్’ అంటున్న యూనిట్స్‌లో ‘వెంకీమామ’ అండ్ టీమ్ ఒకటి. వెంకటేశ్, నాగచైతన్య హీరోలుగా కేఎస్ రవీంద్ర (బాబి) దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘వెంకీమామ’. ఇందులో వెంకటేశ్ సరసన పాయల్ రాజ్‌పుత్, నాగచైతన్యకు జోడీగా రాశీఖన్నా నటిస్తున్నారు. ఇటీవల రాజమండ్రిలో మొదలైన ఈ సినిమా తొలి షెడ్యూల్ ముగిసింది. నెక్ట్స్ షెడ్యూల్ ఏప్రిల్‌లో మొదటి వారంలో స్టార్ట్ కానుందని సమాచారం. అంటే ఈ పదిహేను రోజులు ‘వెంకీమామ’ టీమ్ విరామం తీసుకుని, మాంచి ఎండల్లో మరో షెడ్యూల్ మొదలుపెట్టనున్నారన్నమాట. ఇందులో వెంకటేశ్, నాగచైతన్య నిజజీవితంలో మాదిరిగానే మామాఅల్లుళ్లుగా నటిస్తారు. సురేశ్ ప్రొడక్షన్స్, కోన ఫిల్మ్ కార్పొరేషన్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. -
ఇప్పుడు శాడిజం మొదలైంది
‘‘రాజకీయానికి ఓటర్, సినిమాకు ప్రేక్షకుడు న్యాయ నిర్ణేతలు. వాళ్లకు నచ్చితే బ్రహ్మరథం పడతారు. మా చిత్రం ‘అంజలి సీబిఐ’ కలెక్షన్స్ మొదటి రోజు కంటే మూడో రోజు బాగా పెరిగాయి. సినిమాకు మౌత్ టాక్ పని చేస్తోంది. మంచి సినిమా చూశామనే సంతృప్తి కచ్చితంగా ఉంటుంది’’ అన్నారు నిర్మాత గోపీనాథ్ ఆచంట. నయనతార, రాశీఖన్నా, అధర్వ ముఖ్య పాత్రల్లో దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు తెరకెక్కించిన తమిళ చిత్రం ‘ఇమైక్క నొడిగళ్’. ఈ చిత్రాన్ని ‘అంజలి సీబిఐ’ పేరుతో నిర్మాత సిహెచ్ రాంబాబుతో కలసి అనువదించారు గోపీనాథ్ ఆచంట. గత శుక్రవారం రిలీజైన ఈ చిత్రం మంచి వసూళ్లతో ప్రదర్శితం అవుతోందని గోపీనాథ్ చెబుతూ – ‘‘గతంలో రాజేంద్రప్రసాద్‌తో ‘ఇద్దరు పెళ్లాల ముద్దుల పోలీస్’, నిర్మాతలు భగవాన్, దానయ్య పార్ట్నర్షిప్తో ‘జంబలకిడిపంబ’ చేశాం. ఆ తర్వాత ‘టాప్ హీరో, దేవుడు, నాలో ఉన్న ప్రేమ’ సినిమాలు నిర్మించా. ‘బాషా’ చిత్రాన్ని హిందీలో డబ్ చేశాం. 2006 నుంచి దాసరిగారితో కలసి పని చేశా. అనుకున్నన్ని సినిమాలు ఆయనతో చేయకపోయినా ఆయన దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను. ‘అంజలి సీబిఐ’ చిత్రం సిటీలో జరిగే క్రైమ్ థ్రిల్లర్. ఇందులోని ట్విస్ట్‌లు ఆకట్టుకుంటాయి అనే నమ్మకంతో డబ్ చేశాం. ఇంతకు ముందు ఇండస్ట్రీలో శాడిజం ఉండేది కాదు. కానీ ప్రస్తుతం అది బాగా కనబడుతోంది. వాడి సినిమా పోయిందా? వీడి సినిమా పోయిందా? అని తెలుసుకుని ఆనందం పొందేవాళ్లున్నారు. ఇది మంచిది కాదు. నెక్ట్స్ ప్రాజెక్ట్ రానాతో ‘గృహం’ ఫేమ్ మిలింద్ రావ్ డైరెక్షన్లో ఓ ఇంటర్నేషనల్ మూవీ ప్లాన్ చేశాం’’ అన్నారు. -
బిగ్ ‘సి’ షోరూమ్‌లో ‘ఎఫ్9 ప్రో’ ఆవిష్కరణ
హైదరాబాద్ చందానగర్‌లోని బిగ్ ‘సి’ షోరూమ్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో సంచలన మోడల్ ‘ఒప్పో ఎఫ్9 ప్రో’ మొబైల్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో బిగ్ ‘సి’ బ్రాండ్ అంబాసిడర్, సినీనటి రాశిఖన్నా సహా సంస్థ సీఎండీ బాలు చౌదరి, డైరెక్టర్లు వై. స్వప్నకుమార్, జీ. బాలాజీ రెడ్డి, ఒప్పో సంస్థ ప్రతినిధులు పీటర్ (స్టేట్ హెడ్) యాంగల్ (సేల్స్ హెడ్) పాల్గొన్నారు. మార్కెట్లో ఈ నెల 31 నుంచి ఒప్పో ఎఫ్9 ప్రో మొబైల్ లభ్యమవుతుంది. ధర రూ.23,990. బిగ్ ‘సి’ మొబైల్స్‌లో ‘ఒప్పో ఎఫ్9 ప్రో’ను ముందస్తుగా బుక్ చేసుకున్న వినియోగదారులకు ఏడాదిపాటు స్క్రీన్ మార్పిడి వారంటీ, ఉచిత 3.2 జీబీ జియో ఇంటర్నెట్ ప్యాక్ వంటి ప్రయోజనాలు లభిస్తాయి. -
కళ్యాణ శోభ
-
'టచ్ చేసి చూడు' టైటిల్ సాంగ్ లిరికల్ వీడియో
-
’టచ్ చేసి చూడు’ టీజర్ విడుదల
-
జై లవకుశ టీమ్‌తో చిట్ చాట్
-
రెండేళ్ల కష్టాన్నే మీరిప్పుడు చూస్తున్నారు!
‘‘గ్లామర్, పర్ఫార్మెన్స్... మీ ఓటు దేనికి? అనడిగితే... హీరోయిన్స్ ఎవరైనా రెండోదానికే ఓటేస్తారు. మంచి క్యారెక్టర్స్ చేయాలనుందని చెబుతారు. నేనూ అంతే. కానీ, తెలుగు సినిమాల్లో అలాంటి పాత్రలు దొరకడం కొంచెం కష్టం. నాకు దొరుకుతున్నాయి. ‘సుప్రీమ్’లో బెల్లం శ్రీదేవిగా నటనకు ఆస్కారమున్న పాత్రలోనూ, కొన్ని సిన్మాల్లో గ్లామరస్‌గా కనిపించా. గ్లామర్, పర్ఫార్మెన్స్... రెండిటినీ నేను ఎంజాయ్ చేస్తా’’ అన్నారు హీరోయిన్ రాశీ ఖన్నా. ఎన్టీఆర్ హీరోగా కె.ఎస్. రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో నందమూరి కల్యాణ్‌రామ్ నిర్మించిన ‘జై లవకుశ’లో ఓ హీరోయిన్గా నటించారీమె. వచ్చే గురువారం (ఈ నెల 21న) ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొస్తున్న సందర్భంగా రాశీ ఖన్నాతో చిట్‌చాట్... ► ట్రైలర్లో మీ ఫ్రెండ్‌తో నిశ్చితార్థానికి రెడీ అయ్యి, పీటల మీద కూర్చున్నాక ‘లవ’ మీకు ఐలవ్యూ చెబుతాడు... అతన్నెలా లవ్ చేశారు? (నవ్వుతూ...) సినిమా చూస్తే తెలుస్తుందది. ఇప్పుడు చెబితే... సినిమా చూస్తున్నప్పుడు కిక్ ఏముంటుంది? ► పోనీ, మీ పాత్రేంటో చెప్తారా? ప్రియ అనే అమ్మాయిగా నటించా. మ్యారేజ్ బ్యూరో నడుపుతుంటుంది. ప్రచార చిత్రాల్లో చూపించినట్టుగా ‘లవ’ ప్రేయసి. ► జై, లవ, కుశ... మూడు పాత్రల్లో మీకేది నచ్చింది? సెట్స్‌లో ఎన్టీఆర్ ఎలా ఉండేవారు? మూడింటిలో ఒకటి సెలక్ట్ చేయడం కష్టమే. కానీ, నాకు ‘జై’ అంటే ఇష్టం. ‘ఎన్టీఆర్ ఈజ్ ఎ బ్రిలియంట్ యాక్టర్’ అని అందరూ చెబుతుంటే విన్నా. సెట్స్‌లో లైవ్‌గా నేనే చూశాను. హి ఈజ్ వెరీ ఎనర్జిటిక్, డెడికేటెడ్, టాలెంటెడ్ అండ్ ప్యాషనేటెడ్! ఇప్పటికి ఇటువంటి మాటలు వందసార్లు వినుంటారు. కానీ, నేను లైవ్‌గా చూశా. ఒక్కో రోజు సెట్స్‌లో 70 డ్రస్సులు ఛేంజ్ చేసుకునేవారు. ఎంతో ఓపికగా ఉంటే తప్ప అలా చేయలేం. ఓ పక్క సినిమా... మరో పక్క బిగ్ బాస్... నిద్ర లేకున్నా ఎక్కడా ఎనర్జీ తగ్గకుండా షూటింగ్ చేసేవారు. ఎన్టీఆర్ డెడికేషన్, హార్డ్‌వర్క్‌కి హ్యాట్సాఫ్. ► స్టార్... యాక్టర్... డ్యాన్సర్... ఎన్టీఆర్‌లో మీరు ఇష్టపడేది? అతని వ్యక్తిత్వం ఇష్టం. వెరీ డౌన్ టు ఎర్త్! చాలా మంచి వ్యక్తి. గర్వం అనేది అసలు లేదు. ► ఎన్టీఆర్‌తో డ్యాన్స్ చేయడానికి కష్టపడ్డారా? ఆల్రెడీ సాయిధరమ్ తేజ్, రామ్‌లతో సిన్మాలు చేశా కదా. అందువల్ల, అంత కష్టంగా అనిపించలేదు. కానీ, కొంచెం కష్టమే. మేనేజ్ చేశా! ► మీరు, నివేథా థామస్, నందిత... ముగ్గురు హీరోయిన్లున్నారు. మీ పాత్రకు ఎంత ఇంపార్టెన్స్ ఉంది? నా పాత్రకు ప్రాముఖ్యత ఉంటుందా? లేదా? అనే భయం ముందు నాలోనూ ఉండేది. కానీ, బాబీ ప్రతి పాత్రను బాగా రాశారు. అతను కథ చెప్పినప్పుడు నా పాత్ర బాగా నచ్చింది. నాతో పాటు మిగతా పాత్రలకూ ఇంపార్టెన్స్ ఉంది! సినిమా చూస్తే... అరే, రాశీ పాత్ర పాసింగ్ క్లౌడ్‌లా ఉందని ఎవరూ అనుకోరు. ‘ప్రియ’ ఎవ్వరినీ డిజప్పాయింట్ చేయదు. నివేథా పాత్ర కూడా బాగుంటుంది. సెట్స్‌లో తనని కలవడానికి ముందే నేను ‘నిన్ను కోరి’ చూశా. నువ్వు చాలా దూరం వెళ్తావనీ, నటిగా మరింత పేరు తెచ్చుకుంటావనీ నివేథాతో చెప్పా! షి ఈజ్ ఫ్రెండ్లీ. ► తెలుగు బాగా మాట్లాడుతున్నారు. డబ్బింగ్ ఎప్పుడు చెబుతారు? నాకూ చెప్పాలనుంది. బాబీ కూడా డబ్బింగ్ చెప్పమన్నారు. కానీ, టైమ్ లేదు. తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తున్నా. బిజీగా ఉండడంతో చెప్పలేకపోయా! మోహన్‌లాల్‌గారితో మలయాళంలో ‘విలన్’ చేయడం మంచి ఎక్స్పీరియన్స్. ► దేవిశ్రీ స్టార్స్‌తో పాటలు పాడిస్తారు. మీరు సింగర్ కూడానూ! ఇందులో ఒక్క పాట కూడా పాడలేదెందుకు? తారక్‌తో, నాతో ‘ట్రింగ్... ట్రింగ్..’ పాటను దేవిశ్రీ పాడించాలనుకున్నారు. అప్పుడు తారక్ ‘బిగ్ బాస్’తో బిజీ. సో, కుదరలేదు. వరుణ్‌తేజ్‌తో నటిస్తున్న ‘తొలిప్రేమ’లో పాడుతున్నా. ‘ఊహలు గుసగుసలాడే’ తర్వాత నేను చేస్తున్న ప్రేమకథా చిత్రమది. ‘విలన్ ’లో టైటిల్ సాంగ్, నారా రోహిత్ ‘బాలకృష్ణుడు’లో రెండు పాటలు పాడా. ► ‘రాజా... ది గ్రేట్’లో స్పెషల్ అప్పియరెన్స్ ఇస్తున్నారు. కథేంటి? ఓ పాటలో చిన్న అతిథి పాత్ర చేశా. దర్శకుడు అనిల్ రావిపూడి అడిగితే నేను, సాయిధరమ్ తేజ్ చిన్న బిట్లో స్టెప్పులేశామంతే. దీనికి నేను చాలా రెమ్యునరేషన్ తీసుకున్నానని కొందరు రాశారు. ► రీసెంట్గా రెమ్యునరేషన్ పెంచారని టాక్? ‘జై లవ కుశ’ తర్వాత తప్పకుండా రెమ్యునరేషన్ పెరుగుతుంది! కానీ, ఎంతని మాత్రం అడగొద్దు! ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ► ఏంటి... ఈ మధ్య బాగా సన్నబడ్డారు? ఫిట్నెస్ కోసమే. నేనేమీ ఒక్క రోజులో సన్నబడలేదు. రెండేళ్ల నుంచి కష్టపడుతున్నా. రిజల్ట్ ఇప్పుడు కనబడుతోంది. -
రాశీ... రాకింగ్ స్టెప్స్!
రాశీ ఖన్నా ఫస్ట్ టైమ్ ఓ సాంగ్ షూట్‌కి రెడీ అయ్యారు. అదేంటీ! ఇప్పటికే ఆమె చాలా సాంగ్స్ చేశారు కదా.. ఫస్ట్ టైమ్ సాంగ్ చేయడమేంటి? అనుకుంటున్నారా? అవన్నీ హీరోయిన్గా చేశారు. ఇప్పుడు తాను హీరోయిన్ కాని ఓ సినిమాలో కాలు కదపడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రవితేజ, మెహరీన్ జంటగా రూపొందుతున్న చిత్రం ‘రాజా ది గ్రేట్ ’. ఈ చిత్రంలో రవితేజ, మెహరీన్ కాంబినేషన్లో వచ్చే ఓ పాటలో రాశీ ఖన్నా తళుక్కుమంటారు. ఆ పాటలో కాసేపు కనిపించి, అలరించనున్నారు. స్పెషల్ అప్పియరన్స్ అన్నమాట. రెండేళ్ల క్రితం ‘మనం’ సినిమాలో రాశీ గెస్ట్ రోల్ చేసిన సంగతి తెలిసిందే. కానీ, సాంగ్‌లో స్పెషల్ అప్పియరన్స్ ఇవ్వడం ఇదే తొలిసారి. ‘‘ మై లవ్లీ డైరెక్టర్ అనిల్ రావిపూడి కోసం ‘రాజా ది గ్రేట్’ చిత్రంలో షార్ట్ అండ్ స్పెషల్ అప్పియరన్స్లో కనిపించబోతున్నా’’ అని రాశీ ట్వీట్ చేశారు. వెంటనే ‘‘వెల్కమ్ టు అవర్ వరల్డ్’’ అని అనిల్ రావిపూడి ట్వీట్ చేశారు. ఈ సాంగ్‌లో రాకింగ్ స్టెప్స్‌లో రాశీ కనువిందు చేయనున్నారట. -
డైరెక్ట్‌గా మార్కెట్లోకి!
ఎన్టీఆర్, రాశీ ఖన్నా, నివేధా థామస్ హీరో, హీరోయిన్లుగా తెరకెక్కుతోన్న చిత్రం ‘జై లవకుశ’. కె.ఎస్. రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ సినిమా పాటల చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియోను సెప్టెంబర్ 3న డైరెక్ట్‌గా మార్కెట్లోకి విడుదల చేయనున్నారు. నిర్మాత కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ– ‘‘జై లవకుశ’ పాటలను గ్రాండ్‌గా రిలీజ్ చేయాలనుకున్నాం. భారీ వర్ష సూచనతో పాటు, పోలీస్ శాఖవారు వినాయక నిమజ్జనంలో నిమగ్నమై ఉండటంతో, అభిమానుల భద్రతకి ప్రాధాన్యం ఇస్తూ, పాటలను డైరెక్ట్‌గా మార్కెట్లోకి విడుదల చేస్తున్నాం. కానీ, సెప్టెంబర్ 10న హైదరాబాద్‌లో ట్రైలర్ రిలీజ్‌ను మాత్రం అభిమానుల సమక్షంలో గ్రాండ్‌గా చేస్తాం’’ అన్నారు. -
అంతా కుశలమే
అభిమానులకు వినాయక చవితి కానుకగా ఎన్టీఆర్ ఓ సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు. అదేంటంటే... ‘కుశ’ లుక్! ఎన్టీఆర్ హీరోగా కె.ఎస్. రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో నందమూరి కల్యాణ్‌రామ్ నిర్మిస్తున్న సినిమా ‘జై లవ కుశ’. ఇందులో ఎన్టీఆర్ మూడు పాత్రల్లో (జై, లవకుమార్, కుశ) నటిస్తున్న సంగతి తెలిసిందే. చవితి ముందు రోజున లవకుమార్ టీజర్ విడుదల చేసిన ఎన్టీఆర్, చవితి రోజున ‘కుశ’ లుక్ విడుదల చేశారు. ఇంకో సర్ప్రైజ్ ఏంటంటే... ఇందులో ప్రియా పాత్రలో నటిస్తున్న రాశీ ఖన్నా లుక్‌ను సైతం చవితి రోజునే విడుదల చేశారు. లవ టీజర్, కుశ లుక్, ప్రియా లుక్... ప్రేక్షకులకు ట్రిపుల్ ధమాకా అనే చెప్పాలి. ముఖ్యంగా టీజర్లో ‘మంచితనం... అది పుస్తకాల్లో ఉంటే పాఠం అవుతుంది. మనలో ఉంటే గుణపాఠం అవుతుంది. అదే నా జీవితాన్ని తల్లకిందులు చేసింది’ అని ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్‌కు అద్భుత స్పందన లభిస్తోంది. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్, ‘జై లవకుశ’ చిత్రబృందం అంతా కుశలమే. -
మళ్లీ ఎప్పుడు?
‘ఫిదా’ సక్సెస్‌తో జోష్‌గా ఉన్న వరుణ్ తేజ్ జోరుగా తన నెక్ట్స్ మూవీ షూటింగులో పాల్గొంటున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో బీవీయస్‌యన్ ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రంలో ఆయన హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ ముగిసింది. బహుశా ఈ షెడ్యూల్ మంచి అనుభూతిని మిగిల్చి ఉంటుందేమో... నెక్ట్స్ షెడ్యూల్ ఎప్పుడు వెంకీ? అని అడుగుతున్నారు వరుణ్ తేజ్. ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయిన సందర్భంగా వరుణ్, వెంకీ, చిత్రకథానాయిక రాశీ ఖన్నా ఓ సెల్ఫీ దిగారు. ఆ ఫొటోను పోస్ట్ చేసి, ట్విట్టర్ సాక్షిగా ‘నెక్ట్స్ షెడ్యూల్ ఎప్పుడు వెంకీ’ అనడిగారు వరుణ్. సెకండ్ షెడ్యూల్‌ను విదేశాల్లో ప్లాన్ చేశారట. -
లవ కుశలు కమింగ్ సూన్!
జై–లవ–కుశ... ముగ్గురూ అన్నదమ్ములా? స్నేహితులా? శత్రువులా? ఈ ప్రశ్నలకు సమాధానం దసరాకి దొరుకుతుంది. ఈ ముగ్గురూ ఎలా ఉంటారు? అనడిగితే.. ‘జై’ మాత్రం ఇలా ఉంటాడు అని టకీమని చెప్పేయొచ్చు. ఈ మధ్యే కదా జై జోరుగా ప్రేక్షకుల ముందుకొచ్చాడు. జై సై్టలిష్ లుక్కు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. మరి ‘లవ’, ‘కుశ’ లుక్స్ ఎలా ఉంటాయి? అనే చర్చ ఫిల్మ్‌నగర్‌లో జోరుగా సాగుతోంది. వాళ్లిద్దరూ కూడా ఆన్ ది వే. జస్ట్ పది, పదిహేను రోజుల్లో ఈ ఇద్దరి లుక్స్ తెలిసిపోతాయి. ‘జై’గా ఎన్టీఆర్ మాస్‌గా కనిపించి మార్కులు కొట్టేశారు. లవ్ అలియాస్ ఎన్. లవకుమార్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అట. ఆ గెటప్పూ బాగుంటుందని ఊహించవచ్చు. మరి.. కుశ ఏం చేస్తాడు? అనుకుంటున్నారా? ఫిల్మ్‌నగర్ టాక్ ప్రకారం కుశ డ్యాన్స్ మాస్టర్ అట. ఈ గెటప్పూ అదిరిపోయేలా ఉంటుందట. ఎన్టీఆర్ మూడు పాత్రల్లో ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నందమూరి కల్యాణ్‌రామ్ నిర్మిస్తున్న ‘జై లవ కుశ’ టీజర్ వచ్చే నెల మొదటి వారంలో విడుదల కానుంది. కేయస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రాశీ ఖన్నా, నివేదా థామస్ కథానాయికలు. హీరోయిన్ నందిత ఓ కీ రోల్ చేస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. ఈ ఏడాది దసరాకు సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారట. -
టచ్ చేస్తే... చుక్కలు చూపిస్తా!.
ఏరా అబ్బాయిలు... దమ్ముంటే నన్ను టచ్ చేసి చూడండి! టచ్ చేసిన తర్వాత కూడా మీరు స్టడీగా ఉంటే నన్ను కుమ్మేసుకోండి! అంటున్నారు మాస్ మహారాజ రవితేజ. ఈ బంపర్ ఆఫర్ ఓన్లీ విలన్లకు మాత్రమే! బలుపున్నోడు భలే ఆఫర్ ఇచ్చాడని వాళ్లెవరైనా టచ్ చేశారో... పట్టపగలే చుక్కలు కనిపించేలా కొడతాడట! రవితేజ హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘టచ్ చేసి చూడు’. ఇందులో టైటిల్‌కు తగ్గట్టు కాన్సెప్ట్ బేస్డ్ మాసీ అండ్ ఎంటర్టైనింగ్ ఫైట్ డిజైన్ చేశారని సమాచారం. ఫైట్ కాన్సెప్ట్ ఏంటంటే... హీరోను విలన్లలో ఎవరు టచ్ చేస్తే వాళ్లకి చుక్కలే. బహుశా... ఇది హీరో ఇంట్రడక్షన్ ఫైట్ కావొచ్చు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ నెల 24 వరకు రవితేజ, ఇతర నటీనటులపై కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. విక్రమ్ సిరి దర్శకుడిగా పరిచయమవుతోన్న ఈ సినిమాలో రాశీ ఖన్నా, సీరత్ కపూర్ హీరోయిన్లు. నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), వల్లభనేని వంశీ నిర్మిస్తున్నారు. ఆగస్టులో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. -
ఆనందం.. పరమానందం!
రాశీ ఖన్నా మాతృభాష తెలుగు కాదు.. హిందీ. అయినా తెలుగు చక్కగా మాట్లాడగలుగుతారు. మాట్లాడటం ఏంటి? పాట కూడా పాడేశారు. ‘జోరు’ సినిమా కోసం ఆమె టైటిల్ ట్రాక్ పాడిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు తన భాష కాని మరో భాషలో కూడా ఈ బ్యూటీ పాట పాడారు. అది మలయాళ సినిమా ‘విలన్’. ఈ చిత్రంలో రాశీ ఖన్నా లేడీ విలన్‌గా నటిస్తున్నారట. అదో ప్రత్యేకత అయితే ఈ సినిమా కోసం పాట పాడటం మరో ప్రత్యేకత. ‘విలన్’ టైటిల్ ట్రాక్‌ను రాశి పాడారు. యాక్చువల్‌గా చిన్నప్పటి నుంచి తనకు పెద్ద సింగర్ కావాలనే ఆశ ఉంది. ఆమెతో పాటు పాట పాడాలనే ఆకాంక్ష కూడా పెరుగుతూ వచ్చింది. స్కూల్లో సింగింగ్ పోటీల్లో టాలెంట్‌ని కూడా ప్రదర్శించుకున్నారు. ఒకవేళ హీరోయిన్ కాకపోయి ఉంటే సింగర్‌గా సెటిలయ్యేవారు. ఆ అవకాశం లేదు కాబట్టి, హీరోయిన్గా చేస్తూనే ఛాన్స్ వస్తే... పాటలు కూడా పాడాలనుకుంటున్నారు. అందుకే ‘జోరు’కి అవకాశం వచ్చినప్పుడు ఆనందపడిపోయారు. ఇప్పుడు రెండో పాటకు కూడా అవకాశం రావడంతో పరమానందపడిపోతున్నారు. -
వెయిట్ గురూ!
ఎన్టీఆర్ హీరోగా నటించనున్న 27వ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైంది. కానీ, ఎన్టీఆర్ ఇంకా సెట్లో అడుగుపెట్టలేదు. కారణం ఏంటో తెలుసుకోవా లని చాలామందికి ఉంది. ఈ నెల 15 నుంచి ఎన్టీఆర్ షూటింగ్లో పాల్గొంటారనే సమాధానం వినిపించింది తప్ప.. లేటుగా సెట్లోకి ఎందుకు ఎంట్రీ ఇస్తున్నారనే విషయం మాత్రం బయటకు రాలేదు. అసలు మేటర్ ఏంటంటే... ఈ సినిమా కోసం ఎన్టీఆర్ సుమారు 15 కిలోల బరువు తగ్గే ప్రయత్నంలో ఉన్నారట. ఇందులో ఎన్టీఆర్ మూడు పాత్రల్లో కనిపించనున్న సంగతి తెలిసిందే. మూడు పాత్రల మధ్య వ్యత్యాసం చూపిస్తూ, స్లిమ్ అండ్ స్టైలిష్ గా కనిపించాలనుకుంటున్నారట! దర్శకుడు కె.ఎస్. రవీంద్ర (బాబీ) అడగడంతో ఇప్పటికే ఎన్టీఆర్ 10 కిలోలు తగ్గినట్టు సమాచారం. వెయిట్ తగ్గిన తర్వాత ఎన్టీఆర్ లుక్ ఎలా ఉంటుందో తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే గురూ! ఈ నెల 15న హైదరాబాద్‌లో మొదలు కానున్న కొత్త షెడ్యూల్లో ఎన్టీఆర్ పాల్గొననున్నారు. నందమూరి కల్యాణ్‌రామ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రాశీ ఖన్నా ఓ హీరోయిన్. మరో ఇద్దర్ని ఎంపిక చేయాలి. -
ఐదుగురిలో...ఆ ముగ్గురూ ఎవరు?
ఎన్టీఆర్ కొత్త సినిమా సెట్లో అడుగుపెట్టే ముహూర్తం ఎంతో దూరంలో లేదు. కేయస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నందమూరి కల్యాణ్‌రామ్ నిర్మించనున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేయనున్నారని వినికిడి. జనరల్‌గా స్టార్ హీరోల సినిమాల్లో ఇద్దరు కథానాయికలు ఉండటం ఆనవాయితీ అయింది. ఇద్దరు నాయికలను సెలక్ట్ చేయడమే పెద్ద విషయం. ఇప్పుడు చిన్న ఎన్టీఆర్ చేయనున్న మూడు పాత్రల సరసన ముగ్గురు నాయికలను ఎంపిక చేయడం అంటే చిన్న విషయం కాదు. హీరోయిన్ల లిస్ట్‌లో మొత్తం ఐదుగురు నాయికల పేర్లు పరిశీలనలో ఉన్నాయట. తమన్నా, రాశీఖన్నా, కీర్తీ సురేశ్, అనుపమా పరమేశ్వరన్, నివేథా థామస్.. ప్రధానంగా వీళ్లను అనుకుంటున్నారని సమాచారం. మరి, ఈ ఐదుగురిలో ఆ ముగ్గురూ ఎవరు అనేది వారం రోజుల్లో తెలిసిపోతుందని ఊహించవచ్చు. ఒకవేళ లిస్ట్‌లో లేని పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే... ఎన్టీఆర్ పక్కన నటించడానికి పలువురు కథానాయికలు సిద్ధంగా ఉన్నారు. కానీ, దర్శక, నిర్మాతలు బల్క్ డేట్స్ అడుగుతున్నారట. ఇప్పటికే అంగీకరించిన చిత్రాలు చేతిలో ఉండటంతో కథానాయికలు డేట్స్ అడ్జస్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని సమాచారం. ఇందులో రాయ్‌లక్ష్మి ఐటమ్ సాంగ్ చేయనున్నారనేది మరో ఖబర్. వచ్చే నెల 10న పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 15న రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టనున్నారు. అప్పటికి ఐటమ్ భామపై కూడా ఓ స్పష్టత వచ్చే అవకాశముంది. -
రెండేళ్ళ క్రితమే పెళ్ళి అనుకున్నా!
‘మీ పెళ్లెప్పుడు?’ అని ఏ హీరోయిన్ని అడిగినా.. ‘అప్పుడేనా? ఇంకా బోల్డంత కెరీర్ ఉంది’ అంటారు. ప్రస్తుతం తెలుగు పరిశ్రమలో దూసుకెళుతోన్న తారల్లో ఒకరైన రాశీఖన్నా నుంచి కూడా ఇదే సమాధానం వస్తుంది. నిజానికి, ఈ పాతికేళ్ల సుందరి 23 ఏళ్లకే పెళ్లి చేసుకోవాలను కున్నారట. ఆ విషయం గురించి రాశీఖన్నా మాట్లాడుతూ – ‘‘చిన్నప్పుడు పెళ్లి గురించి నాకు చాలా కలలు ఉండేవి. 22 ముగిసి 23వ ఏట అడుగుపెట్టగానే పెళ్లి చేసుకోవాలనుకునేదాన్ని. ఆ సంగతి ఇప్పుడు తలుచుకొంటే, నాకే నవ్వొస్తూ ఉంటుంది! మీకూ నవ్వొస్తోంది కదూ. అయితే, అందరం కలిసే నవ్వుకుం దామా’’ అని చిరునవ్వు చిందించారు. ఇప్పుడు మాత్రం రాశీకి కెరీరే తప్ప పెళ్లి ఊసే లేదు. సినిమాతోనే ఊసులాడుకుంటున్నారు. -
రాశీ లెక్క తప్పింది..!
జనతా గ్యారేజి విజయంతో పాటు.. చైతూతో పెళ్లి కుదిరిన తర్వాత మంచి సంతోషంగా ఉన్న సమంతకు ఇప్పుడు మరో తీపి కబురు అందినట్లు తెలుస్తోంది. లెక్కల మాస్టారు సుకుమార్ తన 'నాన్నకు ప్రేమతో' విజయం తర్వాత రాంచరణ్‌తో తీస్తున్న సినిమాకు సమంతను ఎంపిక చేసినట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ధృవ సినిమా తర్వాత తాను సుకుమార్ దర్శకత్వంలో విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడిక్ లవ్ స్టోరీ చేస్తున్నట్టుగా చరణ్ ఇప్పటికే ప్రకటించాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. ప్రస్తుతం నటీనటులు సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోంది. (చరణ్ కోసం చెమటోడుస్తోంది) ఈ సినిమాలో రాశీఖన్నా చేస్తుందని తొలుత వార్తలు వచ్చాయి. ఈ సినిమాలో చేయడానికే కొంచెం సన్నబడాలని వర్కవుట్ల కోసం ఆమె చెమటోడ్చి కష్టపడుతున్న ఫొటోలు కూడా బయటకు వచ్చాయి. అంతలో ఏమైందో గానీ.. ఉన్నట్టుండి ఇప్పుడు సమంత పేరు బయటకు వచ్చింది. జనతా గ్యారేజి తర్వాత దాదాపు ఏడాదిపాటు గ్యాప్ తీసుకున్న సమంత.. ఇప్పుడు ఈ సినిమాలో చేస్తోందంటున్నారు. ఇక చాలాకాలంగా మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న రాంచరణ్.. తమిళంలో సూపర్ హిట్‌గా నిలిచిన 'తని ఒరువన్' సినిమా రీమేక్‌గా రూపొందిన ధృవ కోసం తన లుక్, స్టైల్ పూర్తిగా మార్చేసుకున్నాడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ధృవ డిసెంబర్ 9న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్‌కు రెడీ అవుతోంది. ధృవ రిలీజ్ తరువాత సుకుమార్, చరణ్‌ల కాంబినేషన్లో సినిమాపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. -
’హైపర్’ ఆడియో హైలైట్స్
-
కేబీఆర్ పార్క్‌లో రకుల్, రాశీ ఖన్నా ఏంచేశారు?
హైదరాబాద్: వెండితెరపైనే కాదు.. సామాజిక స్పృహ విషయంలో కూడా తామేం తక్కువ కాదని నిరూపించారు మన తెలుగు సినిమా ముద్దుగుమ్మలు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రెండో దఫా హరితహారంలో వారు భాగస్వామ్యం అయ్యారు. కేబీఆర్ పార్క్‌లో ఆదివారం ఉదయం మొక్కలు నాటే కార్యక్రమంలో ప్రముఖ తెలుగు నటీ మణులు రకూల్ ప్రీత్ సింగ్, రాశీఖన్నా పాల్గొన్నారు. తమవంతుగా మొక్కలు నాటి స్ఫూర్తిగా నిలిచారు. ఈ సందర్భంగా హైదరాబాద్ ను వారు ప్రశంసల్లో ముంచెత్తారు. హైదరాబాద్ ఇప్పటికే మంచి గ్రీన్ సిటీ అని, ఎకోనగరంగా మారేందుకు అందరం తోడ్పడాలని అన్నారు. ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలు ప్రోత్సహించడం శుభపరిణామం అని చెప్పారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ బొంతు రామ్మోహన్ కూడా ఉన్నారు. -
శ్రీవారి సేవలో ‘సుప్రీమ్’
తిరుమల: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని శనివారం 'సుప్రీం' చిత్ర బృందం దర్శించుకుంది. హీరో సాయిధరమ్‌తేజ, రాశిఖన్నాతో పాటు నిర్మాత దిల్‌రాజు, దర్శకుడు అనిల్ రవిపూడి తదితరులు ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామి సేవలో పాల్గొన్నారు. అలాగే, మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పుష్పా సత్యనారాయణ కూడా వెంకటేశ్వరుడిని దర్శించుకున్నారు. -
తేజు కోసం ఈ కథ రాయలేదు
‘పటాస్’ ఫేం అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన మలి చిత్రం ‘సుప్రీమ్’ నేడు తెరపైకి వస్తోంది. సాయిధరమ్ తేజ్, రాశీ ఖన్నా జంటగా ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అనిల్ చెప్పిన విశేషాలు... ‘పటాస్’ ఫస్ట్ కాపీ చూసి ‘దిల్’ రాజుగారు అభినందించారు. అప్పటి నుంచి ఎమోషనల్‌గా ఆయనకు కనెక్ట్ అయిపోయా. మా కాంబినేషన్లో సినిమా చేయాలనుకున్నప్పుడు తేజు (సాయిధరమ్ తేజ్)ని హీరోగా అనుకోలేదు. కథ రెడీ చేశాక, ఎవరైతే బాగుంటుందా అని ఆలోచించి తనను ఎంచుకున్నాం ఇందులో హీరో క్యాబ్ డ్రైవర్. ఆ క్యాబ్ పేరే ‘సుప్రీమ్’. ఈ కథలో హనుమంతుడి లాంటి ట్యాక్సీ డ్రైవర్ ఎవరి కోసం వాయు వేగంతో వెళ్లాడన్నది సప్పెన్స్ చిరంజీవిగారి ‘అందం హిందోళం...’ పాట ఈ చిత్రానికి హెల్ప్ అవుతుందని రీమిక్స్ చేయలేదు. నాకున్న ప్యాషన్‌తో చేశా. ‘పటాస్’లో కామెడీ టైమింగ్ బావుందని మెచ్చుకున్నారు. ఈ సినిమాలోనూ అలానే ఉంటుంది. దానికి కారణం రాజేంద్రప్రసాద్‌గారు, జంధ్యాలగార్ల చిత్రాలను ఇన్స్పిరేషన్గా తీసుకోవడమే బాలకృష్ణగారితో ‘రామారావు’ చిత్రం చేయాలనుకున్నా. ఏప్రిల్‌లోపు కథ పూర్తి చేసి, చెప్పమన్నారు. ‘సుప్రీమ్’తో బిజీగా ఉండటం వల్ల చేయలేకపోయా. భవిష్యత్తులో అవకాశమొస్తే ఆయనతో సినిమా చేస్తా. -
బ్యాక్ లెస్... బ్యూటీ మోర్!
‘‘ప్రేక్షకులు ఏం ఆశిస్తారో అదే చేయాలి. లేకపోతే హర్ట్ అయిపోతారు’’ అని కొంతమంది కథానాయికలు చెబుతుంటారు. ‘ఫలానా సినిమాలో గ్లామర్ పరంగా కొంచెం హద్దు దాటినట్లున్నారు?’ అనే ప్రశ్నకు కథానాయికలు సర్వసాధారణంగా చెప్పే జవాబు అది. ఒకప్పుడు నిండైన చీరకట్టులో కనిపించిన తారలు.. అప్పుడప్పుడు మాత్రం కురచ గౌనుల్లోనూ, ఉల్లిపొర లాంటి చీరల్లోనూ కనువిందు చేసేవారు. ఇప్పుడు మామూలుగానే ట్రెండ్ మారింది. దాంతో, బట్టల నిడివి తగ్గడం సాధారణమైంది. నడుము, నాభి చూపించడం సర్వసాధారణమైంది. నిన్న మొన్నటివరకూ ముందు వైపు అందాలనే ప్రదర్శించిన తారలు ఇప్పుడు బ్యాక్ పై దృష్టి పెడుతున్నారు. పాటల్లో కొన్ని సెకన్ల పాటు వీపు భాగం చూపిస్తున్న తారలు విడిగా అవార్డుల ఫంక్షన్లలో ఇంకా రెచ్చిపోతున్నారు. హాలీవుడ్ స్టయిల్లో పొడవాటి గౌనుల్లో దర్శనమిస్తున్నారు. వీపు అంతా కనిపించేలా వెనక భాగంలో దాదాపు నడుము నుంచి మాత్రమే బట్టలు ఉండేలా ఆ గౌన్లను డిజైన్ చేయించుకుంటున్నారు. అలా ఈ మధ్యకాలంలో వీపు అందాలను చూపించి, వార్తల్లో నిలిచినవాళ్లల్లో తాప్సీ, రకుల్ ప్రీత్‌సింగ్, రెజీనా, రాశీ ఖన్నా తదితరులు ఉన్నారు. వీళ్ల బ్యాక్ బ్యూటీ చూడకుండా, వెనకెనకే ఫాలో కాకుండా ఉండడం కుర్రకారుకు కష్టమే. ఆ సంగతి అలా ఉంచితే... ఇలా పొదుపైన బట్టలు వాడుతున్న తారలు పిసినారులని మాత్రం అనుకోకండి. ఒక్కో గౌను ఖరీదు మినిమమ్ 50 వేల రూపాయల నుంచి మొదలవుతుంది. కొన్నిటి ధర అయితే, లక్ష పైగానే ఉంటుందట -
టైగర్స్‌తో చిట్‌చాట్
-
రిలీజ్‌కు ముందే భారీ బిజినెస్
భారీ అంచనాల మధ్య విడుదలైన 'కిక్ 2' డిజాస్టర్ టాక్ తెచ్చుకోవటం, రవితేజ కెరీర్ మీద పెద్దగా ఎఫెక్ట్ చూపినట్టుగా లేదు. గతంలో బలుపు, పవర్ సినిమాలతో మంచి సక్సెస్‌లు సాధించిన మాస్ మహరాజ్, ఆ తరువాత కిక్ 2తో అలరించలేకపోయినా, ప్రస్తుతం చేస్తున్న బెంగాల్ టైగర్ సినిమాకు మంచి బిజినెస్ జరుగుతోంది. ముఖ్యంగా మినిమమ్ గ్యారెంటీ హీరోగా రవితేజకు ఉన్న ఇమేజ్ ఈ సినిమాకు చాలా ప్లస్ అవుతోంది. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న బెంగాళ్ టైగర్ సినిమాలో తమన్నా, రాశీఖన్నాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు సంపత్ నంది. కిక్ 2 రిజల్ట్‌తో బెంగాల్ టైగర్ బిజినెస్‌పై ఎన్నో అనుమానాలు వచ్చాయి. అయితే వాటన్నింటినీ పక్కకు నెట్టి రవితేజ సత్తా చాటుతున్నాడట. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో బిజినెస్ పూర్తయిన ఈ సినిమా, టేబుల్ ప్రాఫిట్ దిశగా సాగుతుందని టాక్. -
‘శివమ్’మూవీ వర్కింగ్ స్టిల్స్
-
దాన్ని లవ్వంటారా? ఏమో..!
ఇంటర్వ్యూ తానొకటి తలిస్తే.. దైవం ఒకటి తలచిందంటారు. అలా, రాశీఖన్నా కాపీ రైటర్ కావాలనుకుంటే దేవుడు ఆమెను హీరోయిన్ చేశాడు. ఒక్కసారి ట్రై చేస్తే ఏం పోతుంది? అనుకుని ‘మద్రాస్ కెఫే’తో కథానాయిక అయ్యారు రాశీఖన్నా. హిందీ నుంచి తెలుగుకి వచ్చి, ఇక్కడ ‘మోస్ట్‌వాంటెడ్ హీరోయిన్స్’లో ఒకరయ్యారు. ఇక, రాశీఖన్నాతో మాట్లాడదాం... ♦ మీ గురించి తెలుసుకోవాలని ఉంది? నేను పుట్టి, పెరిగింది, చదువుకున్నది ఢిల్లీలో. బాగా చదివేదాన్ని. స్కూల్లో నేనే టాపర్‌ని. ♦ టాపర్స్‌కే లేడీ శ్రీరామ్ కాలేజీలో అడ్మిషన్ వస్తుందట కదా? అవును. ఢిల్లీలో ఆ కాలేజ్ చాలా ఫేమస్. మంచి పర్సంటేజ్ వస్తేనే అడ్మిషన్ ఇస్తారు. నేను ఇంగ్లిష్ ఆనర్స్ చేశాను. అడ్వర్టయిజింగ్ ఫీల్డ్‌లో కాపీ రైటర్‌గా చేయాలన్నది నా కోరిక. ఓ మోడలింగ్ ఏజెన్సీవాళ్లు అడిగితే, మోడల్‌గా చేశాను. అట్నుంచి సినిమాల్లోకి వచ్చాను. హిందీ చిత్రం ‘ముంబయ్ కేఫ్’తో కథానాయికగా పరిచయమయ్యాను. ♦ మీ కాలేజీలో ఈవ్ టీజింగ్లాంటివేమైనా? అది గాళ్స్ కాలేజ్. అందుకని అలాంటివేవీ ఎదుర్కోలేదు. ♦ పోనీ.. సీనియర్స్ ఎవరైనా మిమ్మల్ని ర్యాగింగ్ చేశారా. ర్యాగింగ్‌పై మీ అభిప్రాయం? నన్నెవరూ అల్లరిపెట్టలేదు. ర్యాగింగ్ అనేది మహా ఘోరమైన విషయం. దాన్ని నిషేధించాలి. ♦ కాపీ రైటర్ కావాలని యాక్టర్ అయ్యారు. ఎలా అనిపిస్తోంది? రెండూ క్రియేటివ్ ఫీల్డ్సే. నేను హీరోయిన్ కావాలనుకోలేదు. కానీ, దేవుడు డిసైడ్ చేశాడు. ఇప్పుడు నటన అంటే నాకు చాలా ఇష్టం ఏర్పడిపోయింది. ♦ తెలుగు పరిశ్రమలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్‌లో ఒకరవుతారని ఊహించారా? కష్టపడి పని చేస్తే, చేసే పని మీద గౌరవం ఉంటే, నిజాయతీగా వ్యవహరిస్తే విజయం వరిస్తుందని నా నమ్మకం. ♦ మొదటి సినిమా ‘ఊహలు గుసగుసలాడే’ అప్పుడు కొంచెం బొద్దుగా ఉండేవారు. ఆ తర్వాత సన్నబడటానికి కారణం? నేను బొద్దుగా ఉన్నప్పుడూ, ఇప్పుడు సన్నబడ్డాక కూడా ఇష్టపడుతున్నారు. ‘జిల్’ సినిమాలో చేసిన సావిత్రి పాత్రకు కొంచెం సన్నబడితే బాగుంటుంది... అనిపించింది. అందుకే తగ్గాను. కొంతమంది తగ్గొద్దన్నారు. అయినా... తగ్గడం అంటే అంత సులువు కాదు. వెయిట్ ట్రైనింగ్, యోగా, వాకింగ్, డ్యాన్స్ ఇలా ఎన్నో చేసి తగ్గాను. ♦ ఓకే, ఓసారి సమాజం గురించి మాట్లాడుకుందాం... ఆడవాళ్లపై జరుగుతున్న అత్యాచారాల గురించి విన్నప్పుడు ఏమనిపిస్తుంది? గుండె పగిలినంత పనవుతుంది. ఆడ, మగ అనే విషయాన్ని పక్కనపెడితే సాటి మనిషిని ఇంతలా ఎలా గాయపరచ గలుగుతున్నారు? అని ఆవేశపడి పోతుంటాను. ♦ ముఖ్యంగా మీ హోమ్‌టౌన్‌లో జరిగిన నిర్భయ సంఘటన ప్రపంచం ఉలిక్కిపడేలా చేసింది. ఆ తర్వాత ఢిల్లీలో అత్యాచారాలు ఇంకా పెరిగిపోయాయ్? నిర్భయ సంఘటనకు నేను చాలా ఏడ్చాను. అసలు వాళ్లు మనుషులేనా? అనిపించింది. నా హోమ్ టౌన్ అనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఆడవాళ్లపై లైంగిక దాడులు జరుగు తున్నాయి. అయితే, కొన్ని బయటకు రావడం లేదంతే. ♦ మహిళలకు ఢిల్లీ సేఫ్ అనొచ్చా? సేఫ్ ప్లేస్ అనేది ఎక్కడా లేదు. ఆడవాళ్లపట్ల మగవాళ్లకి గౌరవం ఉన్నప్పుడు, ఆడవాళ్లను ఓ వస్తువుగా చూడటం మానేసినప్పుడు ఏ ప్లేస్ అయినా సేఫే. ♦ ఒకవేళ మీరు జడ్జ్ అయితే అత్యాచారం చేసే మగవాళ్లకు ఎలాంటి శిక్ష విధిస్తారు? ఏ సామర్థ్యంతో ఇలాంటి నేరాలు చేస్తున్నారో అది లేకుండా చేయాలని తీర్పు ఇస్తా. ♦ నేరాలు ఆగాలంటే ఏం చేయాలి? కఠినంగా శిక్షించడంతో పాటు నేరగాళ్ల ఆలోచనా ధోరణిని మార్చాలి (ఆవేశంగా). ♦ కొంచెం కూల్‌గా మాట్లాడుకుందాం. మీ తొలి ప్రేమ గురించి? ఎనిమిదేళ్ల వయసులో నా క్లాస్మేట్ని ఇష్టపడ్డాను. దాన్ని లవ్వంటారో ఏమో! నాకు తెలియదు. ఆ తర్వాత ఎవర్నీ ఇష్టపడలేదు. ♦ ప్రేమను విశ్లేషించగలుగుతారా? అది అనుభవించాలి తప్ప మాటల్లో చెప్పలేం. ♦ మీరు లవ్ మ్యారేజ్ చేసుకుంటారా? ఎరేంజ్డ్ మ్యారేజా? నచ్చిన అబ్బాయి దొరికితే ప్రేమించి, పెళ్లి చేసుకుంటా. లేకపోతే ఇంట్లోవాళ్లు చూసిన అబ్బాయిని పెళ్లాడతా. ♦ దేశ, విదేశాల్లో మీకు నచ్చిన ప్రదేశం? మన దేశంలో రిషికేష్, ఊటీ. విదేశాల్లో స్పెయిన్. ♦ ఫైనల్‌గా మీ జీవితాశయం ఏంటి? ప్రేమను పంచడం... - డి.జి. భవాని కవర్ ఫొటో: శివ మల్లాల -
‘జిల్’మూవీ పోస్టర్స్
-
‘జిల్’ మూవీ స్టిల్స్