మళ్లీ ఎప్పుడు? | Varun Tej's Nooks Movie Second Schedule has been planned abroad. | Sakshi
Sakshi News home page

మళ్లీ ఎప్పుడు?

Published Tue, Aug 8 2017 1:15 AM | Last Updated on Sun, Sep 17 2017 5:16 PM

మళ్లీ ఎప్పుడు?

మళ్లీ ఎప్పుడు?

‘ఫిదా’ సక్సెస్‌తో జోష్‌గా ఉన్న వరుణ్‌ తేజ్‌ జోరుగా తన నెక్ట్స్‌ మూవీ షూటింగులో పాల్గొంటున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో బీవీయస్‌యన్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్న చిత్రంలో ఆయన హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ఫస్ట్‌ షెడ్యూల్‌ ముగిసింది.

బహుశా ఈ షెడ్యూల్‌ మంచి అనుభూతిని మిగిల్చి ఉంటుందేమో... నెక్ట్స్‌ షెడ్యూల్‌ ఎప్పుడు వెంకీ? అని అడుగుతున్నారు వరుణ్‌ తేజ్‌. ఫస్ట్‌ షెడ్యూల్‌ కంప్లీట్‌ అయిన సందర్భంగా వరుణ్, వెంకీ, చిత్రకథానాయిక రాశీ ఖన్నా ఓ సెల్ఫీ దిగారు. ఆ ఫొటోను పోస్ట్‌ చేసి, ట్విట్టర్‌ సాక్షిగా ‘నెక్ట్స్‌ షెడ్యూల్‌ ఎప్పుడు వెంకీ’ అనడిగారు వరుణ్‌. సెకండ్‌ షెడ్యూల్‌ను విదేశాల్లో ప్లాన్‌ చేశారట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement