Venky
-
ఊహించని అద్భుతాలు జరిగాయి: శ్రీను వైట్ల
‘‘డైరెక్టర్ కావాలని నా చిన్నప్పటి నుంచే కోరుకున్నాను. ఇందు కోసం చిన్న వయసులోనే చెన్నై వెళ్లాను. ఇండస్ట్రీలో నిలబడాలనే తపన, సినిమా క్రాఫ్ట్స్‌పై ఆసక్తి ఉండేవి. కానీ, ఓ దర్శకుడిగా ఇండస్ట్రీలో పాతిక సంవత్సరాలు ఉంటానని నిజంగా ఆ రోజు ఊహించలేదు. నా కెరీర్లో ఇలా ఊహించని ఎన్నో అద్భుతాలు జరిగాయి. నా ప్రయాణం పట్ల చాలా సంతోషంగా ఉన్నాను. ఈ ప్రయాణంలో భాగమైన హీరోలు, నిర్మాతలు, టెక్నీషియన్స్, నా కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు’’ అని దర్శకుడు శ్రీనువైట్ల అన్నారు. రవితేజ, మహేశ్వరి జంటగా శ్రీనువైట్ల దర్శకత్వం వహించిన చిత్రం ‘నీ కోసం (1999)’. గంటా శ్రీనివాస్ నిర్మించిన ఈ చిత్రంతో శ్రీనువైట్ల దర్శకుడిగా పరిచయమయ్యారు.ఈ సినిమా విడుదలై నేటితో 25 ఏళ్లు పూర్తవుతాయి. అలాగే ఇండస్ట్రీలో పాతిక సంవత్సరాల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు శ్రీనువైట్ల. ఈ సందర్భంగా సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ–‘‘నీ కోసం’ కి ముందు మరో సినిమా చేయాల్సింది. కానీ, ఆ సినిమా ఆగిపోవడంతో నిరుత్సాహంగా అనిపించింది. ఆ తర్వాత తక్కువ బడ్జెట్లో ఓ సినిమా చేయాలనుకుని ‘నీ కోసం’ కథ రాసుకుని, సినిమా స్టార్ట్ చేశాం. కానీ, ఈ సినిమా కూడా మధ్యలోనే ఆగిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే రవితేజగారి సహాయంతో పూర్తి చేశాం. ఫస్ట్ కాపీ చూసి నాగార్జునగారు నన్ను మెచ్చుకుని, డైరెక్షన్ చాన్స్ ఇవ్వడం ఎప్పటికీ మర్చిపోలేను.అలాగే ‘నీ కోసం’ రిలీజ్‌కు రామోజీరావుగారు అండగా నిలబడ్డారు. అలాగే ఆయన బ్యానర్లోనే ‘ఆనందం’ సినిమా అవకాశం ఇచ్చారు. ‘నీ కోసం’ సినిమాకి ఏడు నంది అవార్డు వచ్చాయి. ఇక ‘ఆనందం, వెంకీ, రెడీ, దూకుడు, ఢీ’ సినిమాలు నా కెరీర్‌లోని టాఫ్ ఫైవ్ మూవీస్‌గా చెప్పుకుంటాను. ‘దూకుడు’ సినిమాను తమిళంలో అజిత్‌గారితో రీమేక్ చేసే అవకాశం వచ్చింది. కానీ, అప్పటికే నేను ‘బాద్షా’కు కమిటై ఉండటంతో కుదర్లేదు. ‘బాద్షా’ హిట్ అయింది.సో.. అజిత్‌గారితో నేను ఆ సినిమా చేయలేదనే బాధ లేదు. మహేశ్‌బాబుగారితో నేను చేసిన ‘ఆగడు’ సినిమా ఎన్నో అంచనాల మధ్య విడుదలై, ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఆ విషయంలో కాస్త బాధగా అనిపించింది. అయితే ఆ సినిమా తర్వాత మహేశ్‌గారు నాకు మంచి మోరల్ సపోర్ట్ ఇచ్చారు.. ఆ విషయాన్ని మర్చిపోలేను. ‘వెంకీ’ సినిమాకు సీక్వెల్ తీయాలనే ఆలోచన ఉంది. ఇటీవల నా దర్శకత్వంలో వచ్చిన ‘విశ్వం’ సినిమా హిట్‌గా నిలిచినందుకు సంతోషంగా ఉంది. నా తర్వాతి సినిమాని త్వరలోనే చెబుతాను’’ అని చెప్పారు. -
సైనికుడిపైనా టీడీపీ అరాచకం
నెల్లిమర్ల రూరల్/విజయనగరం అర్బన్: అధికార దర్పంతో చెలరేగిపోతున్న టీడీపీ మూకలు చివరకు దేశ సైనికుడినీ వదిలిపెట్టలేదు. టీడీపీకి ఓటేయలేదనే అనుమానంతో అతనిపై దౌర్జన్యానికి దిగాయి. టీడీపీ గ్రీవెన్స్ సెల్లో ఫిర్యాదు చేసి.. అధికార బలంతో అతని ఇంటిపైకి జేసీబీని దూకించాయి. 24 ఏళ్ల పాటు దేశానికి రక్షణగా నిలిచిన మాజీ జవాన్ ఇంటి ప్రహరీని నిర్దాక్షిణ్యంగా కూల్చివేయించాయి. తనకు ఏ రాజకీయ పారీ్టతోనూ సంబంధం లేదని అతను కన్నీటిపర్యంతమైనా టీడీపీ మూకలు, అధికారులు కనికరించలేదు. ఈ ఘటన శనివారం విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం దన్నానపేటలో జరిగింది. బాధితులు తెలిపిన వివరాలు.. దన్నానపేటకు చెందిన పతివాడ వెంకినాయుడు 24 ఏళ్ల పాటు సైనికుడిగా దేశానికి సేవ చేశాడు. ఆ కష్టార్జితంతో ఇల్లు నిరి్మంచుకున్నాడు. అయితే ఆ ఇంటి ప్రహరీ ఆక్రమణలో ఉందని ఇటీవల గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు గేదెల రాజారావు అమరావతికి వెళ్లి ఆ పార్టీ నాయకులను కలిసి.. టీడీపీ గ్రీవెన్స్ సెల్లో ఫిర్యాదు చేశాడు. అక్కడి నుంచి అందిన ఆదేశాల మేరకు ఆర్డీవో సూర్యకళ గురువారం గ్రామంలో పర్యటించారు. వెంకినాయుడు ఇంటి ప్రహరీ ఆక్రమణ భూమిలో ఉందని.. దానిని తొలగించాలని తహసీల్దార్ ధర్మరాజుకు ఆదేశాలు జారీ చేశారు. గ్రామంలో టీడీపీ నాయకుల ఆక్రమణలు కోకొల్లలుగా ఉన్నాయని, వాటిని తొలగించకుండా.. సైనికుడి ఇంటి మీదకు రావడమేంటని గ్రామస్తులు మండిపడ్డారు. కానీ, రెవెన్యూ అధికారులు శనివారం సుమారు 50 మందికి పైగా పోలీస్ సిబ్బందితో వచ్చి గ్రామస్తులను భయబ్రాంతులకు గురి చేశారు. ఆ వెంటనే జేసీబీతో వెంకినాయుడు, అతని సోదరుడు లక్ష్మణరావుకు చెందిన ఇంటి ప్రహరీని కూల్చివేశారు. వెంకినాయుడు దంపతులు కన్నీటిపర్యంతమై ప్రాధేయపడినా అధికారులు కనికరించలేదు. దీంతో అధికారులు, టీడీపీ నేతల తీరుపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నాయకుల ఆక్రమణలను వెంటనే తొలగించాలని ఆందోళనకు దిగారు. దీంతో తహసీల్దార్ ధర్మరాజు.. టీడీపీ నేతల ఆక్రమణలు కూడా తొలగిస్తామంటూ పేపర్‌పై సంతకం పెట్టి బాధితులకు అందజేశారు. జవాన్‌ను వేధించడమే మీ రాజకీయమా?: బొత్స దేశ రక్షణ కోసం సేవలందించిన జవాన్ ఇంటి ప్రహరీని అన్యాయంగా కూల్చేయడమే మీ మంచి సంప్రదాయమా? సైనికుడిని వేధించడమే మీ రాజకీయమా? అని నెల్లిమర్ల టీడీపీ ఎమ్మెల్యేపై, ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఉగ్రవాది ఇంటికి వెళ్లినట్లుగా.. ఆర్మీ ఉద్యోగి ఇంటిపైకి 50 మంది పోలీసులతో వెళ్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన విజయనగరంలో మీడియాతో మాట్లాడారు. ‘మాజీ సైనికుడు వెంకినాయుడు ఇంటి ప్రహరీ కూల్చితే మీకొచ్చే లాభమేంటి? అదో మారుమూల గ్రామం. అయినా ఎందుకు కూల్చారు? కలెక్టర్, ఎస్పీ ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలి. రాజకీయాలకు కొత్తగా వచి్చన ఎమ్మెల్యే జిల్లాలోకి ఇలాంటి సంస్కృతిని తీసుకురావడం దారుణం’ అని మండిపడ్డారు. ఎమ్మెల్సీ సురే‹Ùబాబు, మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య పాల్గొన్నారు. దేశానికి సేవ చేస్తే.. ఇదా బహుమతి! మాజీ సైనికుడు వెంకినాయుడు మీడియాతో మాట్లాడుతూ... ‘నేను 24 ఏళ్ల పాటు దేశ రక్షణ కోసం పని చేశా. అలాంటి నాకు ఇదా ఈ ప్రభుత్వమిచ్చే బహుమతి. గతంలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ఓటు వేయలేదనే కక్షతో గ్రామ టీడీపీ నేత గేదెల రాజారావు అమరావతి వరకు వెళ్లి మరీ నాపై ఫిర్యాదు చేశాడు. న్యాయం, ధర్మం అంటూ మాట్లాడే పవన్‌కళ్యాణ్, చంద్రబాబుకు ఈ మాజీ సైనికుడికి జరుగుతున్న అన్యాయం కనిపించడంలేదా? రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేని నాపై వేధింపులకు పాల్పడడం సరికాదు. గ్రామంలోని టీడీపీ నేతల ఆక్రమణలు తొలగించే వరకు నా పోరాటం ఆగదు. టీడీపీ వాళ్ల దౌర్జన్యాలను అడ్డుకొని రాష్ట్రపతి నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నా’ అని ఆవేదన వ్యక్తం చేశారు. -
బ్లాక్‌బస్టర్ వెంకీ సినిమా మిస్ చేసుకున్న హీరోయిన్ ఎవరంటే?
మాస్ మహారాజ.. రవితేజకు ఇప్పుడంటే సరైన హిట్లు రావట్లేదు కానీ ఒకప్పుడు బ్లాక్‌బస్టర్ హిట్లతో చించేశాడు. చంటి, అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, ఖడ్గం, వెంకీ.. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు చాలానే ఉంది. ముఖ్యంగా వెంకీ సినిమాలో ట్రైన్ సీన్ అయితే ఎవర్గ్రీన్.. సినిమా అంతా ఒక ఎత్తయితే ఆ రైల్లో నడిచే కామెడీ సన్నివేశం మరో ఎత్తు. ఇప్పటికీ మీమ్స్‌లో దీన్ని వాడుతుంటారు. వెంకీ సినిమాతోనే మొదలు ఈ సినిమా రిలీజై రేపటికి (మార్చి 26 నాటికి) 20 ఏళ్లు కావస్తోంది. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీనువైట్ల తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను బయటపెట్టాడు. 'నేను ప్రతి సినిమాకు నాగార్జునసాగర్ వెళ్లి అక్కడే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకుంటూ ఉంటాను. అది వెంకీ సినిమాతోనే మొదలైంది. అయితే ఈ చిత్రానికి మొదట అసిన్‌ను హీరోయిన్గా అనుకున్నాను. కానీ కుదరకపోవడంతో స్నేహను సెలక్ట్ చేశాం. రైలు కామెడీ సీన్లో ఎమ్మెస్ నారాయణ కూడా ఉండాలి.. కానీ మిస్సయ్యారు. అదే బెస్ట్ కాంప్లిమెంట్ చాలామంది ఈ రైలు సీన్ వర్కవుట్ అవుతుందా? అని కూడా అన్నారు. రిలీజయ్యాక మాత్రం మేము ఊహించినదానికంటే రెట్టింపు రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా నచ్చిందని చిరంజీవి ఫోన్ చేసి చెప్పడటమే నాకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్' అని గుర్తు చేసుకున్నాడు. వెంకీ సినిమాకు శ్రీనువైట్లతో పాటు కోన వెంకట్, గోపిమోహన్ రచయితలుగా పని చేశారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించగా అట్లూరి పూర్ణచంద్ర రావు నిర్మించారు. చదవండి: మొన్నేమో పెళ్లిచప్పుడే లేదంది.. ఇప్పుడేకంగా రహస్య వివాహం! -
IPL 2023:షారుక్ రైట్ హ్యాండ్, కేకేఆర్ సీఈవో గురించి ఇంట్రస్టింగ్ విషయాలు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో పాపులర్ జట్లలో ఒకటి కోల్‌కతా నైట్ రైడర్స్ .రెండుసార్లు( 2012 , 2014లో) ఐపీఎల్ టైటిల్‌ను దక్కించుకుని క్రికెట్ ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించింది. తాజాగా ఐపీఎల్ 2023 పోరు నడుస్తున్న సందర్భంగా, షారుక్ ఖాన్ కుడిభుజం లాంటివాడు, కేకేఆర్ సీఈవో వెంకీ మైసూర్ నెట్‌వర్త్ తదితర విషయాలపై ఆసక్తి నెలకొంది. ఐపీఎల్ క్రికెట్ ఫ్రాంచైజీ కేకేఆర్ యజమాని, బాలీవుడ్ స్టార్హీరో షారుక్ ఖాన్ దేశంలోని ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ఓనరు కూడా. అలాగే కేకేఆర్ సీఈవోఅయిన వెంకీ రెడ్ చిల్లీస్ సీఈవో కూడా కావడం గమనార్హం. ఈ ఏడాది ఫిబ్రవరిలో రెడ్ చిల్లీస్‌కు సీఈవోగా బాధ్యతలను స్వీకరించారు వెంకీ . అనుభవజ్ఞుడైన వ్యాపార నిపుణుడు రెడ్ చిల్లీస్‌కు సీఈవోగా ఉండడం చాలా ఆనందంగా ఉందని,కేకేర్లో అద్భుతంగా పనిచేసిన వెంకీ రెడ్ చిల్లీస్‌ను మరింత ఉన్నత స్థాయికి తీసుకెడతానే నమ్మకం ఉందని షారుక్ ఖాన్ ప్రకటించారు. అనేక గ్లోబల్ మార్కెట్లలో ఫైనాన్షియల్ సర్వీసెస్ పరిశ్రమలో 25 సంవత్సరాలు, అమెరికా, కెనడా, ఆసియాలో అనేక సీనియర్ నాయకత్వ స్థానాల్లో పనిచేసిన అనుభవం వెంకీ సొంతం.క్రికెటర్ అవ్వవాలనుకున్న వెంకీ క్రికెట్ జట్టు సీఈవోగా అవతరించాడం విశేషం. ప్రస్తుతం కేకేఆర్, రెడ్ చిల్లీస్ బాధ్యతలను చూస్తున్న వెంకీ మైసూర్ నికర విలువ మీడియా కథనాల ప్రకారం దాదాపు రూ.14 కోట్లు. (సర్కార్ కొలువుకు గుడ్‌బై..9 లక్షల కోట్ల కంపెనీకి జై: ఎవరీ ప్రసూన్ సింగ్?) కర్ణాటకలోని మైసూర్లో పుట్టారు వెంకీ. క్రికెటర్‌గా రంజీ ట్రోఫీకి చేరాలని కలలుకన్న వెంకీ తండ్రి కోరికనుమన్నించి క్రికెట్ నుండి తప్పుకుని మద్రాస్ విశ్వవి ద్యాలయంలో మార్కెటింగ్ అండ్ ఫైనాన్స్‌లో ఎంబీఏ పూర్తి చేశారు. (గుడ్ ఫ్రైడే ఆఫర్: రూ.1500కే నథింగ్ ఫోన్ (1)) కేకేఆర్‌లో చేరడానికి ముందు వెంకీ మైసూర్‌కు బీమా పరిశ్రమలో పెద్ద పేరే ఉంది. 2010లో, వెంకీ మైసూర్ మెట్‌లైఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న సమయంలో, అన్నింటినీ విడిచిపెట్టి, షారుక్ ఖాన్ కేకేఆర్ ఫ్రాంచైజీలో చేరారు. అసలు కరీబియన్ ప్రీమియర్ లీగ్ జట్టు ట్రిన్‌బాగో నైట్ రైడర్స్‌ను కొనుగోలు ప్లాన్ వెనుక వెంకీ ఉన్నట్టు క్రీడా వర్గాలు నమ్ముతారు. బెంగుళూరులోని అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ డైరెక్టర్‌గా కూడా ఉన్నారు. వెంకీ భార్య పేరు వీణ, ముగ్గురు పిల్లలున్నారు. కాగా ఐపీఎల్ 2022లో పేలవ ప్రదర్శనపై వెంకీపై విమర్శలొచ్చాయి. అలాగే టీం సెలక్షన్లో జోక్యం చేసుకుంటు న్నాడంటూ కేకేఆర్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఆరోపణలు వీటికి మరింత ఆజ్యం పోసాయి. అయితే ఇది అంతర్జాతీయ క్రికెట్ లాంటిది కాదు. ఓనర్లుప్రత్యక్షంగా పాల్గొనక పోయిన సమయంలో తమ అభిప్రాయాలను సీఈవో ద్వారా లేదా ప్రధాన కోచ్‌తో నేరుగా మాట్లాడతారని ఫ్రాంచైజీ తిప్పికొట్టింది. కేకేఆర్ విజయపథంలో నడిపిండం ద్వారా అనేక లాభాలను తెచ్చిపెట్టారు వెంకీ. ఫోర్బ్స్ ప్రకారంకేకేఆర్ నికర విలువ 1.1 బిలియన్లు డాలర్లు, ఆదాయం 41.2 మిలియన్ డాలర్లు. 2004లో స్థాపించిన డ్రీమ్జ్ అన్లిమిటెడ్ సంస్థను కొనుగోలు చేసిన ఎస్ఆర్కే, గౌరీ ఖాన్ రెడ్ చిల్లీస్గా మార్చారు. రెడ్ చిల్లీస్ పది చిత్రాలకు నిర్మాతగా, ఐదు చిత్రాలకు సహనిర్మాతగా ఉంది. -
1940 బ్యాక్‌డ్రాప్‌తో రానా సంచలన చిత్రం
70 ఏళ్లు వెనక్కి వెళ్లనున్నారు రానా. వైవిధ్యమైన పాత్రలను చేయడానికి ఇష్టపడే ఈ హీరో 1940 బ్యాక్‌డ్రాప్ స్టోరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఇంతకీ ఈ కథ ఎవరు చెప్పారంటే వెంకీ. ప్రముఖ దర్శకుడు సుకుమార్ శిష్యుడు వెంకీ. 1940 నాటి నేపథ్యంలో వెంకీ ఓ కథ సిద్ధం చేశారట. ఈ స్టోరీని ఇటీవల రానాకు వినిపించారని సమాచారం. రానాకు నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్. 14 రీల్స్ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుందని, త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుందని టాక్. ఇదిలా ఉంటే... ప్రస్తుతం మలయాళ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ తెలుగు రీమేక్‌లో నటిస్తున్నారు రానా. వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా నటించిన ‘విరాట పర్వం’ ఈ నెల 30న విడుదల కానుంది. -
మళ్లీ ఎప్పుడు?
‘ఫిదా’ సక్సెస్‌తో జోష్‌గా ఉన్న వరుణ్ తేజ్ జోరుగా తన నెక్ట్స్ మూవీ షూటింగులో పాల్గొంటున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో బీవీయస్‌యన్ ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రంలో ఆయన హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ ముగిసింది. బహుశా ఈ షెడ్యూల్ మంచి అనుభూతిని మిగిల్చి ఉంటుందేమో... నెక్ట్స్ షెడ్యూల్ ఎప్పుడు వెంకీ? అని అడుగుతున్నారు వరుణ్ తేజ్. ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయిన సందర్భంగా వరుణ్, వెంకీ, చిత్రకథానాయిక రాశీ ఖన్నా ఓ సెల్ఫీ దిగారు. ఆ ఫొటోను పోస్ట్ చేసి, ట్విట్టర్ సాక్షిగా ‘నెక్ట్స్ షెడ్యూల్ ఎప్పుడు వెంకీ’ అనడిగారు వరుణ్. సెకండ్ షెడ్యూల్‌ను విదేశాల్లో ప్లాన్ చేశారట. -
పరిచయం తర్వాత ఏమైంది?
వెంకీ, లాస్య జంటగా రాధాకృష్ణ దర్శకత్వంలో దీపక్ కృష్ణన్ నిర్మించిన సినిమా ‘తొలి పరిచయం’. మురళీ మోహన్, సుమన్ కీలక పాత్రధారులు. ఇంద్రగంటి స్వరపరిచిన ఈ సినిమా పాటలను విడుదల చేసిన రాజమండ్రి ఎంపీ, నటుడు మురళీ మోహన్ మూడు పాటలు బాగున్నాయని మెచ్చుకున్నారు. దర్శకుడు మాట్లాడుతూ – ‘‘ఈతరం యువత మనోభావాలను ప్రతిబింబించే చిత్రమిది. ఓ అమ్మాయి, అబ్బాయి పరిచయం తర్వాత ఏమైందనేది చిత్రకథ. వినోదం, కుటుంబ విలువలకు ప్రాముఖ్యత ఇచ్చాం’’ అన్నారు. ‘‘దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ వరసకు నాకు బ్రదర్ అవుతారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం పాట, పవన్‌కల్యాణ్ ‘జనసేన’ పాట నేనే స్వరపరిచా. ఈ సినిమాలో స్వరకర్తగా, గాయకుడిగా, పాటల రచయితగా మూడు పాత్రలు పోషించా’’ అన్నారు ఇంద్రగంటి. ‘మా’ అధ్యక్షులు శివాజీ రాజా, చిత్ర సహ నిర్మాత సురేశ్‌కుమార్ పాల్గొన్నారు. -
రేడియో సిటీలో 'తొలి పరిచయం' సాంగ్ లాంచ్
పియుకే ప్రొడక్షన్స్ పతాకంపై వెంకీ, లాస్య జంటగా తెరకెక్కుతున్న సినిమా తొలి పరిచయం. ఎల్.రాధాకృష్ణను దర్శకుడిగా పరిచయం చేస్తూ దీపక్ కృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ సాంగ్ లాంచ్ సోమవారం హైదరాబాద్‌లో రేడియో సిటీలో జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ పాల్గొన్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్, ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. పెళ్లి అంటే ఇష్టం లేని ఒక అమ్మాయి, అబ్బాయి ఒకే ఇంట్లో గడపాల్సి వస్తే... ఆ తర్వాత ఏమి జరిగింది అన్నది చిత్ర కథాంశం. పోలవరం ప్రాంతంలో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. త్వరలోనే ఆడియో రిలీజ్, సినిమా రిలీజ్ డేట్లను ఎనౌన్స్ చేయనున్నారు చిత్రయూనిట్. -
ఏం జరిగింది?
‘‘పెళ్లి అంటే ఇష్టంలేని ఓ అమ్మాయి, ఓ అబ్బాయి.. కొన్ని పరిస్థితుల వల్ల నాలుగు రోజులు ఒకే ఇంట్లో ఉండాల్సి వస్తుంది. అప్పుడు ఏం జరిగింది అన్నది ఆసక్తికరం’’ అని దర్శకుడు ఎల్.రాధాకృష్ణ తెలిపారు. వెంకీ, లాస్య జంటగా ఎల్.రాధాకృష్ణను దర్శకునిగా పరిచయం చేస్తూ దీపక్ కృష్ణ నిర్మించిన చిత్రం ‘తొలి పరిచయం’. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను నిర్మాత మల్కాపురం శివకుమార్ విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ– ‘‘యూత్, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రమిది. పోలవరం పరిసరాల్లో షూటింగ్ జరిపాం. చిన్న చిత్రమైనా క్వాలిటీ విషయంలో నిర్మాత రాజీ పడలేదు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి’’ అన్నారు. ‘‘ఫస్ట్ లుక్‌లాగే సినిమా కూడా ఫ్రెష్‌గా ఉంటుంది. త్వరలో పాటలు విడుదల చేస్తాం’’ అని వెంకీ చెప్పారు. సంగీత దర్శకుడు ఇంద్రగంటి పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: శరవణ కుమార్ సి. -
వెంకీ, లాస్య జంటగా 'తొలి పరిచయం'
పియుకే ప్రొడక్షన్స్ పతాకంపై వెంకీ, లాస్య జంటగా ఎల్.రాధాకృష్ణను దర్శకుడుగా పరిచయం చేస్తూ దీపక్ కృష్ణ నిర్మిస్తున్న చిత్రం తొలి పరిచయం. సీనియర్ నటులు మురళీమోహన్, సుమన్, రాజీవ్ కనకాల, రఘుబాబు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల కార్యక్రమం బుధవారం హైదరాబాద్‌లో జరిగింది. నిర్మాత మల్కాపురం శివకుమార్ తొలి పరిచయం ఫస్ట్ లుక్‌ను లాంచ్ చేసి చిత్రయూనిట్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. పెళ్లి అంటే ఇష్టం లేని ఒక అమ్మాయి, ఒక అబ్బాయి నాలుగు రోజులపాటు ఒకే ఇంట్లో ఉండాల్సి వస్తుంది. ఆ తరుణంలో ఏం జరిగిందన్న కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాను పోలవరం పరిసర ప్రాంతాల్లో షూట్ చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ఆడియో త్వరలోనే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
వ్యాను ఢీకొని వ్యక్తి మృతి
వేగంగా దూసుకొచ్చిన వ్యాను నడిచి వెళుతున్న వ్యక్తిని ఢీకొన్న ఘటన బుధవారం విజయనగరం జిల్లా పార్వతీపురంలో జరిగింది. వివరాలు.. గరుగుబిల్లి మండలం రావుపల్లి గ్రామానికి చెందిన వి.వెంకీ అనే యువకుడు పార్వతీపురంలోని ఓ హోటల్లో పనిచేస్తున్నాడు. పని ముగించుకుని బుధవారం సాయంత్రం స్వగ్రామానికి బయలుదేరాడు. ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని సిగ్నల్స్ వద్ద... కూరగాయలతో వెళుతున్న వ్యాన్ అతన్ని ఢీకొంది. తీవ్ర గాయాలతో వెంకి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. -
వెంకటేష్‌తో మరోసారి జోడీ కట్టబోతున్న నయన్
-
పీకూ వైపు వెంకీ చూపు???
-
సిక్స్ టు సిక్స్ ఏం జరిగింది?
వెంకీ, లక్ష్మి జంటగా చల్లా జనార్దనరావు దర్శకత్వం వహించిన చిత్రం ‘వాట్ హ్యాపెన్ 6 టు 6’. వచ్చే నెల 5న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా లక్ష్మి మాట్లాడుతూ - ‘‘ఈ చిత్రంలో హీరోయిన్గా నటించడంతో పాటు కథ నచ్చడంతో నేనే నిర్మించాను. నటనకు అవకాశం ఉన్న పాత్ర చేశాను. ఇది లవ్, సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. కథానుసారం అండమాన్ దీవుల్లో చిత్రీకరించాం. ఎలెందర్ స్వరపరచిన ఈ చిత్రం పాటలకు మంచి స్పందన లభిస్తోంది. ఈ చిత్రం కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది’’ అని చెప్పారు. -
వాట్ హ్యాపెన్ 6 టు 6 మూవీ స్టిల్స్