వెంకీ, లాస్య జంటగా 'తొలి పరిచయం'
పియుకే ప్రొడక్షన్స్ పతాకంపై వెంకీ, లాస్య జంటగా ఎల్.రాధాకృష్ణను దర్శకుడుగా పరిచయం చేస్తూ దీపక్ కృష్ణ నిర్మిస్తున్న చిత్రం తొలి పరిచయం. సీనియర్ నటులు మురళీమోహన్, సుమన్, రాజీవ్ కనకాల, రఘుబాబు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల కార్యక్రమం బుధవారం హైదరాబాద్‌లో జరిగింది.
నిర్మాత మల్కాపురం శివకుమార్ తొలి పరిచయం ఫస్ట్ లుక్‌ను లాంచ్ చేసి చిత్రయూనిట్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. పెళ్లి అంటే ఇష్టం లేని ఒక అమ్మాయి, ఒక అబ్బాయి నాలుగు రోజులపాటు ఒకే ఇంట్లో ఉండాల్సి వస్తుంది. ఆ తరుణంలో ఏం జరిగిందన్న కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాను పోలవరం పరిసర ప్రాంతాల్లో షూట్ చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ఆడియో త్వరలోనే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.