lasya
-
గోవాలో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తోన్న యాంకర్ లాస్య మంజునాథ్ (ఫోటోలు)
-
Lasya Chittella: సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గృహప్రవేశం (ఫోటోలు)
-
పెళ్లి రోజు కాలినడకన తిరుమలకు టాలీవుడ్ యాంకర్ లాస్య (ఫోటోలు)
-
బుజ్జి.. ఇక పోట్లాడుకుంది చాలు.. ఇప్పటికైనా..! (ఫోటోలు)
-
తాళి కళ్లకద్దుకుని, అత్తామామల ఆశీర్వాదం తీసుకుని.. (ఫోటోలు)
-
కర్వా చౌత్ సెలబ్రేషన్స్ : ఈ సందడి అస్సలు మిస్ కావద్దు!
-
Anchor Lasya: యాంకర్ లాస్య బర్త్ డే.. సందడి చేసిన బుల్లితెర తారలు (ఫోటోలు)
-
తల్లి దారుణహత్య! పాపం చిన్నారి..
నిజామాబాద్: ఆర్మూర్‌లో పట్టపగలు వివాహిత దారుణ హత్యకు గురైంది. పట్టణంలోని సంతోష్‌నగర్ కాలనీలో శనివారం మధ్యాహ్నం రాసురి లాస్య (22)ను దుండగులు గొంతుకోసి హతమార్చారు. వివరాలిలా ఉన్నాయి. వేల్పూర్ మండలం వెంకటాపూర్‌కు చెందిన లాస్యకు రెండేళ్ల క్రితం ఆర్మూరుకు చెందిన రాసూరి రాకేశ్‌తో వివాహమైంది. వీరి కి ఏడు నెలల పాప శ్రీలక్ష్యణ ఉంది. రాకేశ్ మూడు నెలల క్రితం ఉపాధి కోసం దుబాయి వెళ్లాడు. లాస్య అత్త చిన్నుబాయితో కలిసి ఉంటోంది. శనివారం ఉదయం చిన్నుబాయి కోరుట్లలో గల తన కూతురు వద్దకు వెళ్లింది. లాస్య మధ్యాహ్నం ఒంటి గంట వరకు తన ఇంటి సమీపంలో ఓ ఇంట్లో బీడీలు చేసి వచ్చింది. మధ్యాహ్నం మూడు గంటల సయయంలో పాప ఏడుస్తుండడంతో పక్క ఇంట్లో ఉంటున్న చిట్టి అనే మహిళ వెళ్లి చూడగా లాస్య రక్తపుమడుగులో కనిపించింది. దీంతో ఆమె స్థానికులకు చెప్పడంతో వారు అంబులెన్స్, పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్‌హెచ్‌వో రవికుమార్ ఘటన స్థలాన్ని పరిశీలించారు. క్లూస్‌టీం, డాగ్‌స్క్వాడ్‌తో ఆధారాలు సేకరించారు. లాస్యను హత్య చేసిన వారు ఆమె మెడలోని బంగారు నగలు, చెవి దుద్దులు ఎత్తుకెళ్లారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొన్నట్లు పోలీసులు తెలిపారు. పాపం చిన్నారి.. రక్తం మడుగులో పడి ఉన్న తల్లి వద్ద చిన్నారి ఏడుస్తుండటం కలచి వేసింది. తండ్రి దగ్గర లేకపోవడం తల్లి చనిపోవడంతో ఆ పాప గుక్కపెట్టి ఏడవగా స్థానికులు అక్కున చేర్చుకొని ఓదార్చారు. కాగా తెలిసినవారే లాస్యను హత్య చేసి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇవి చదవండి: ఎలుగుబంటి దాడిలో ఇద్దరు జీడి రైతులు మృతి -
యాంకర్ లాస్య రెండో కుమారుడి బర్త్‌డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
ల్యాబ్‌కు ఆకాశ్ రక్త నమూనాలు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: బీఆర్ఎస్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కేసులో శాస్త్రీయ ఆధారాల సేకరణ కోసం పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా కారు నడిపిన ఆమె పీఏ ఆకాశ్‌కు ఇప్పటికే బ్రీత్ ఎనలైజర్ పరీక్ష నిర్వహించి ఆయన మద్యం సేవించలేదని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చిన పోలీసులు... తాజాగా ఆకాశ్ రక్త నమూనాలను పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్‌తోపాటు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్‌కు పంపినట్లు తెలిసింది. అలాగే ఆకాశ్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకొని కాల్ డేటాను పరిశీలిస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఆకాశ్ స్టేట్మెంట్ను మేజి్రస్టేట్ సమక్షంలో రికార్డు చేసినట్లు సమాచారం. ప్రమాదం జరిగినప్పుడు కళ్లు బైర్లు కమ్ముకున్నాయని.. ఏం జరిగిందో తెలిసేలోపే ప్రమాదం జరిగిందని ఆకాశ్ చెప్పినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. ప్రమాదానికి ముందు రాత్రి ఆయనకు సరిగ్గా నిద్ర లేకపోవడంతోనే కారు డ్రైవ్ చేస్తున్నప్పుడు నిద్ర మత్తు ఆవహించిందా? లేదా ఇంకేదైనా కారణం ఉందా? అనే దానిపై ల్యాబ్ రిపోర్టులు వస్తేనే సైంటిఫిక్ ఎవిడెన్స్ లభిస్తుందని పోలీసులు భావిస్తున్నారు. వాహన తయారీ లోపాలేమైనా ఉన్నాయా? ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాద కేసుకు సంబంధించిన వివరాల సేకరణలో అధికారులు నిమగ్నమయ్యారు. ఎమ్మెల్యే ప్రయాణించిన వాహనంలో తయారీ లోపాలేమైనా ఉన్నాయా? అని పరిశీలిస్తున్నారు. ప్రమాదానికి గురైనప్పుడు వాహనం గంటకు 100 కి.మీ. వేగంతో ప్రయాణించినట్లు ప్రాథమికంగా నిర్ధారించిన అధికారులు.. ప్రమాద తీవ్రతకు కారు విడిభాగాలు సుమారు 100 మీటర్ల దూరం వరకు పడిపోవడాన్ని బట్టి చూస్తే అంతకంటే ఎక్కువ వేగంతో వాహనం ప్రయాణిస్తోందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పటాన్చెరు పోలీసులు ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదం జరిగిన చోట ఏమైనా సీసీ కెమెరాలు ఉన్నాయా అని పరిశీలించారు. -
రోడ్డు ప్రమాదంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యకు గాయాలు
హైదరాబాద్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ లాస్య నందితకు త్రుటిలో ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురి కావడంతో స్పల్ప గాయాలతో బయటపడ్డారు. మంగళవారం నల్లగొండలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభకు హాజరై సాయంత్రం నగరానికి తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో నల్లగొండ పట్టణానికి సమీపంలోని చర్లపల్లి వద్ద ఎమ్మెల్యే లాస్య ప్రయాణిస్తున్న కారును ఆటో ఢీకొట్టింది. దీంతో కారు ముందు సీటులో ఉన్న ఆమె ఒక్కసారిగా ముందుకు పడిపోవడంతో తలకు స్వల్ప గాయాలయ్యాయి. సమీపంలోని ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం నగరానికి బయలుదేరారు. ప్రమాద సమయంలో కారులో ఎమ్మె ల్యే లాస్యతో పాటు ఆమె సోదరి నివేదిత, డ్రైవరు, ఇద్దరు గన్మెన్లు ఉన్నారు. -
భార్యాబిడ్డలను హత్యచేసి.. ఆత్మహత్య
కడప అర్బన్: వైఎస్సార్ జిల్లా కడపలో హెడ్ కానిస్టేబుల్ భార్యాపిల్లల్ని హత్యచేసి, ఆత్మహత్య చేసుకున్నాడు. టూటౌన్ పోలీస్ స్టేషన్లో రైటర్‌గా పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ టి.వెంకటేశ్వర్ (51) (హెచ్‌సీ 1895) ఈ దురాగతానికి పాల్పడ్డాడు. బుధవారం రాత్రి 11 గంటల నుంచి గురువారం తెల్లవారుజామున మూడుగంటలలోపు 9ఎంఎం పిస్టల్‌తో భార్య, ఇద్దరు పిల్లలను కాల్చి చంపేశాడు. తర్వాత అదే పిస్టల్‌తో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు. పోలీసుల కథనం మేరకు.. పులివెందులకు చెందిన వెంకటేశ్వర్ 1993లో కానిస్టేబుల్‌గా చేరాడు. అతడి భార్య మాధవి (47). వీరికి ఇద్దరు కుమార్తెలు లాస్య (21), అభిజ్ఞ (16). లాస్య డిగ్రీ, అభిజ్ఞ టెన్త్ చదువుతున్నారు. ఈ నేపథ్యంలో వెంకటేశ్వర్‌కు యారాసు రమాదేవి అనే మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. భర్త చనిపోయిన ఆమెకు నాగలోకేశ్వర్రెడ్డి అనే కుమారుడున్నాడు. ఈ క్రమంలో కుటుంబంలో కలతలు రేగాయి. ఈ నేపథ్యంలో వెంకటేశ్వర్ బుధవారం రాత్రి విధులు ముగించుకుని 10.30 గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చాడు. తన కస్టడీలోనే ఉండే పోలీసు అధికారులకు సంబంధించిన ఓ పిస్టల్‌ను ఎవరికి తెలియకుండా వెంట తెచ్చుకున్నాడు. రాత్రి భోజనం తర్వాత భార్య, ఇద్దరు కుమార్తెలు బెడ్రూంలో పడుకుని ఉండగా కాల్చి చంపేశాడు. తర్వాత అదే పిస్టల్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం ఉదయం ఈ ఘటన వెలుగులోకి రావడంతో పోలీసులు వచ్చారు. ఘటనాస్థలంలో సూసైడ్ నోట్ కం అగ్రిమెంట్‌తో పాటు మరో డాక్యుమెంట్‌ను స్వాదీనం చేసుకున్నారు. సూసైడ్‌నోట్‌లో తన భార్య, ఇద్దరు పిల్లలు చనిపోయారు కాబట్టి, తన మరణానంతరం ప్రభుత్వం నుంచి రావాల్సిన డెత్ బెనిఫిట్స్ మొత్తం తన రెండో భార్య యారాసు రమాదేవికి, ఆమె కుమారుడు యారాసు నాగలోకేశ్వర్‌రెడ్డికి చెందాలని రాశాడు. మరో డాక్యుమెంట్లో రమాదేవి నుంచి తాను అవసరాల నిమిత్తం రూ.20 లక్షలు అప్పు తీసుకున్నానని, ప్రతిఫలంగా తనకు పులివెందుల మండలం ఉలిమెల వద్ద అనువంశికంగా వచ్చిన స్థిరాస్తిని రాసి ఇస్తున్నట్లు ఉంది. భార్యాపిల్లలను చంపకముందు వారు పూర్తిగా నిద్రలోకి జారుకునేందుకు మత్తుమందు కలిపి ఇచ్చినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్, కడప డీఎస్పీ ఎండీ షరీఫ్, సీఐలు ఎన్.వి.నాగరాజు, రామచంద్ర, సయ్యద్ హాసం, ఎస్బీ సీఐలు అశోక్‌రెడ్డి, యు.వెంకటకుమార్, సిబ్బంది అక్కడికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీం వారు ఆధారాలను సేకరించారు. మృతదేహాలను డిప్యూటీ సీఎం ఎస్.బి.అంజాద్‌బాషా, కడప మేయర్ కె.సురేష్‌బాబు, వైఎస్సార్సీపీ నాయకుడు అప్జల్‌ఖాన్, పులి సునీల్‌కుమార్, సిబ్బంది పరిశీలించారు. డీఎస్పీని అడిగి వివరాలను తెలుసుకున్నారు. మృతదేహాలను కడప రిమ్స్ మార్చురీకి తరలించారు. మార్చురీలో మృతదేహాలను ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆరి్థక సమస్యలు, వివాహేతర సంబంధం కారణంగా ఈ ఘటన జరిగిందని ప్రాథమిక విచారణలో తేలిందని చెప్పారు. సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నామన్నారు. కర్నూలు డీఐజీ సెంథిల్‌కుమార్ కడప వచ్చి స్టేషన్లో పోలీసు అధికారులను, సిబ్బందిని విచారించారు. -
థియేటర్లో యాంకర్ రచ్చ రచ్చ.. భర్తతో కలిసి!
ప్రముఖ యాంకర్, బిగ్‌బాస్ ఫేం లాస్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పట్లో యాంకర్ రవితో జతకట్టి బుల్లితెరపై అలరించిన భామ.. ఆ తర్వాత మంజునాథ్‌ను ప్రేమ పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత లాస్య యాంకరింగ్ గుడ్‌బై చెప్పిన లాస్య.. గృహిణిగా ఇంటి బాధ్యతలు చూసుకుంటుంది. ఇటీవలే రెండో బిడ్డకు జన్మనివ్వగా.. ఈ జంటకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అలాగే యూట్యూబ్ చానల్‌ను రన్ చేస్తుంది. ఇటీవల రెండో బిడ్డకు జన్మనిచ్చిన లాస్య సోషల్ మీడియాలో ఎప్పుడు చురుక్కుగ్గానే ఉంటోంది. ఎప్పటికప్పుడు ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అలరిస్తోంది. (ఇది చదవండి: నీ భార్యగా గర్వపడుతున్నా.. భర్తపై యాంకర్ లాస్య ఎమోషనల్ పోస్ట్) తాజాగా లాస్య తన ఇన్‌స్టాలో షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. తన భర్తతో కలిసి థియేటర్లో హంగామా చేసింది. ఈ జంట మరింత రొమాంటిక్‌గా అందరి ముందే రెచ్చిపోయారు. ఆమె భర్త మంజునాథ్ థియేటర్లోనే లాస్యకు మరోసారి ప్రపోజ్ చేస్తూ రచ్చ చేశారు. ఇదంతా సూర్య హీరోగా నటించిన సూర్య సన్ఆఫ్ కృష్ణన్ రీ-రిలీజ్ థియేటర్లో జరిగింది. ఆ చిత్రంలోని సీన్‌ను అనుకరిస్తూ లాస్య చేసిన హంగామా చూసిన ఫ్యాన్స్ సైతం క్రేజీ కామెంట్స్ చేశారు. (ఇది చదవండి: 'ఆ గొంతు ఎప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది'.. మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్ ) View this post on Instagram A post shared by Lasya Manjunath (@lasyamanjunath) -
Anchor Lasya: కడప దర్గాను దర్శించుకున్న యాంకర్ లాస్య (ఫొటోలు)
-
ఎంత కష్టం వచ్చిందమ్మా!
పెనుబల్లి/గచ్చిబౌలి/మల్లాపూర్/ఎడపల్లి (బోధన్)/ఖలీల్‌వాడి (నిజామాబాద్ అర్బన్): భర్తల వేధింపులు.. ఆర్థిక ఇబ్బందులు.. కారణం ఏదైతేనేం.. క్షణికావేశంలో రాష్ట్రవ్యాప్తంగా నలుగురు మహిళలు ఆత్మహత్యకు యత్నించారు. వారిలో ఇద్దరు తల్లులు, ఓ కుమార్తె కన్నుమూయగా పిల్లలతో కలసి చెరువులో దూకిన మరో ఇద్దరు తల్లులను స్థానికులు కాపాడటంతో ప్రాణాలతో బయటపడ్డారు. అయితే ఈ ఘటనలో ఓ బాలుడి ఆచూకీ గల్లంతైంది. మరో ఘటనలో అనారోగ్యం కారణంగా కుమార్తెతో కలసి భార్య, భర్త ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్థిక సమస్యలు, కుటుంబ కలహాలతో... ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలతో తల్లీకూతురు ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మణికొండలోని ఆంధ్రా బ్యాంకు సమీపంలో నివసించే బుడ్డోలు సదానందానికి భువనగిరి జిల్లా కాటేపల్లికి చెందిన అలివేలుతో 15 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి కూతురు లాస్య (14), కుమారుడు మణికంఠ (11) ఉన్నారు. సదానందం ఖాళీగా ఉంటుండగా కోవిడ్ లాక్‌డౌన్‌కు ముందు వచ్చే ఇంటి అద్దెలు కాస్తా బందువులతో ఏర్పడిన వివాదాలతో నిలిచిపోయాయి. దీంతో కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంది. డబ్బులేక పిల్లలను చదువు కూడా మాన్పి0చారు. ఈ పరిణామాలతో తీవ్ర మనస్తాపానికి గురైన అలివేలు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. సమస్యల నుంచి బయటపడేయాల్సిందిగా దేవుడిని ప్రార్థించి రావాలంటూ భర్తను యాదగిరిగుట్టకు పంపింది. అనంతరం అర్ధరాత్రి వేళ ఓ బెడ్రూంలో తొలుత కుమార్తెకు ఉరేసి, ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్నాక వంటింట్లో చీరతో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తెల్లవారుజామున లేచిన కుమారుడు తల్లి, అక్కను విగతజీవులుగా చూసి వెంటనే చుట్టుపక్కల వారికి విషయం తెలిపాడు. చేతిపై గోరింటాకు..! ఆత్మహత్మకు ముందు అలివేలు, లాస్య గోరింటాకు పెట్టుకున్నారు. లాస్య చేతిపై గోరింటాకు కోన్‌తో ‘డూ సమ్‌థింగ్ దట్ మేక్ యూ హ్యాపీ’అని రాసుకుంది. అదేవిదంగా తల్లీ, కూతురు ఇద్దరూ ‘ది గేమ్ ఈజ్ స్టార్టెడ్’అని గోరింటాకుతో రాసిన వ్యాఖ్యలు ఉండటంతో పోలీసులు ఇవి ఎందుకు రాసుకున్నారో...? అనే అంశంపై కూడా విచారణ చేస్తున్నారు. కాగా, అలివేలు, లాస్య ఆత్మహత్య చేసుకున్న ఇంట్లో మరో ఉరితాడు వేలాడుతూ కనిపించడం కలకలం రేపుతోంది. కుమారుడికి కూడా ఉరివేయాలని తల్లి భావించి ఉంటుందని పోలీసులు బావిస్తున్నారు.కానీ కుమారుడు బెడ్రూమ్లో నిద్ర పోతుండడంతో ఈ ప్రయత్నాన్ని విరమించుకొని ఉంటుందని వారు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు అలివేలు ఆత్మహత్యకు ముందు తన సెల్‌ఫోన్, బట్టలను ఇంట్లోనే తగలబెట్టింది. తల్లీకుమార్తెల మానసిక స్థితి సరిగ్గా లేదని.. కరోనా కాలం నుంచి అందరికీ దూరంగా ఉంటున్నారని రాయదుర్గం ఇన్స్పెక్టర్ మహేష్ తెలిపారు. లైవ్‌లో ఆత్మహత్య... భర్త వేధింపులు తట్టుకోలేక.. ఫేస్బుక్ లైవ్ వీడియో పెట్టి భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన నాచారం పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నాచారానికి చెందిన సనా (29) రాజస్తాన్‌కు చెందిన హేమంత్ పటియాల (డిజె మ్యూజిక్ అపరేటర్) 5 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లయిన రెండేళ్ల వరకు వారి వైవాహిక జీవితం బాగానే కొనసాగింది. బాబు పుట్టాక వారి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. సనాను భర్త హేమంత్‌తోపాటు వారి అత్తమామలు వేధించసాగారు. దీంతో గతంలో పలుమార్లు పోలీసులకు హేమంత్పై సనా ఫిర్యాదు చేశారు. సైప్రస్ దేశానికి వెళ్లిన హేమంత్ గత 5 నెలలుగా సనాను ఫోన్లో వేధిస్తూనే ఉన్నాడు. దీంతో మంగళవారం నాచారంలోని ఇంట్లో సనా ఫేస్బుక్ లైవ్ పెట్టి ఫ్యాన్‌కు ఊరివేసుకొని ఆత్మహత్మ చేసుకుంది. సనాకు 3 ఏళ్ల బాబు ఉన్నాడు. పిల్లలతో సహా చెరువులో దూకిన అక్కాచెల్లెళ్లు ముగ్గురు పిల్లలతో సహా అక్కాచెల్లెళ్లు చెరువులో దూకి ఆత్మహత్యకు యత్నించగా అందులో బాలుడు గల్లంతయ్యాడు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని అశోక్ సాగర్ (జానకంపేట చెరువు) వద్ద శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని దుబ్బ ప్రాంతానికి చెందిన లక్షి్మ, మోహన్ దంపతులకు ముగ్గురు కూతుళ్లు. మోహన్‌కు కొత్త కలెక్టరేట్ సమీపంలో 2 వేల గజాల స్థలం ఉంది. ఆ స్థలంలో కొంత భాగాన్ని పెద్ద కూతురుకు అమ్మి రెండో కూతురు అక్షయ, మూడో కూతురు నిఖితలకు వివాహం చేశాడు. అక్షయ వివాహం హైదరాబాద్‌కు చెందిన హేమంత్‌తో, నిఖిత వివాహం మెదక్‌కు చెందిన మహేశ్‌తో జరిగింది. వివాహ సమయంలో చెరో 200 గజాల స్థలాన్ని వారికి కానుకగా ఇచ్చారు. కొంతకాలంగా హేమంత్, మహే‹Ùలు ఇంటి స్థలం అమ్మి డబ్బులు తీసుకురావాలని భార్యలను వేధిస్తున్నారు. అయితే ఈ ప్లాట్లకు రోడ్డు సౌకర్యం లేకపోవడంతో దానిని కొనేందుకు ఎవరూ ముందుకు రావట్లేదని తెలిసింది. అక్షయ, నిఖితలపై వేధింపులు ఎక్కువ కావడంతో వారిద్దరూ మూడు రోజుల క్రితం పిల్లలతో కలసి పుట్టింటికి వచ్చారు. ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకొని గురువారం ఉదయం నిఖిత తన పిల్లలైన భవశ్రీ, శ్రీమాన్, అక్షయ తన కుమారుడైన చిన్నా (3) అలియాస్ భువనేశ్వర్‌ను తీసుకొని ఎడపల్లి మండలంలోని అశోక్‌సాగర్ వద్దకు చేరుకున్నారు. ముందుగా పిల్లలను నీటిలోకి తోసి తర్వాత నిఖిత, అక్షయ కూడా దూకారు. ఆ సమయంలో రోడ్డుపై అటుగా వెళ్తున్న షేక్ హైదర్ అనే వ్యక్తి చెరువులోకి దూకి నిఖిత, అక్షయలతోపాటు భవశ్రీ, శ్రీమాన్లను రక్షించాడు. మూడేళ్ల చిన్నా ఆచూకీ లభించలేదు. కేన్సర్ నుంచి భార్య కోలుకోదేమోనని.. భార్యకు కేన్సర్ ఉందని నిర్ధారణ కావడంతో భర్త తల్లడిల్లాడు. భార్యకు ఏమైనా అయితే తాను తట్టుకోలేనని.. తామిద్దరం లేకపోతే కూతురు భవిష్యత్తు ఏమిటనే భయంతో కుమార్తె సహా ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కొత్తకారాయిగూడెంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పోట్రు వెంకట కృష్ణారావు (40)కు భార్య సుహాసిని (35), కుమార్తె అమృత (16)తోపాటు కుమారుడు కార్తీక్ ఉన్నారు. కార్తీక్‌కు బీటెక్ సెకండియర్ పూర్తికాగానే బెంగళూరులోని హెచ్‌సీఎల్‌లో ట్రెయినీగా ఉద్యోగం రాగా అమృత ఇంటర్ పూర్తిచేసి ఇంజనీరింగ్ చదివేందుకు సిద్ధమవుతోంది. నెలన్నర క్రితం ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా తిరువూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో సుహాసినికి శస్త్రచికిత్స చేసిన వైద్యులు గర్భసంచిలోని కణతిని తొలగించారు. ఈ క్రమంలో శాంపిల్స్ హైదరాబాద్‌కు పంపగా అది కేన్సర్‌గా తేలింది. దీంతో ఆస్పత్రి వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌లో మెరుగైన చికిత్స కోసం వెళ్తామని కుమారుడు, బంధువులకు చెప్పారు. దీంతో కుమారుడు బెంగళూరు నుంచి గురువారం ఉదయం ఇంటికి రాగా, గుంటూరులో ఉంటున్న వెంకటకృష్ణారావు తమ్ముడు కూడా కొత్తకారాయిగూడెం వచ్చాడు. అనంతరం గురువారం సాయంత్రం వెంకటకృష్ణారావు, సుహాసిని దంపతులు కుమార్తె అమృతతో కలసి ద్విచక్రవాహనంపై ఆస్పత్రికి వెళ్తున్నట్లు చెబుతూ తిరువూరు బయలుదేరారు. కానీ మధ్యలోనే మూడు ప్లాస్టిక్ స్టూళ్లు, నైలాన్ తాడు, కూల్ డ్రింక్, వాటర్ బాటిల్ కొనుక్కొని స్వగ్రామంలో పొలం పక్కనే ఉన్న మామిడి తోటకు రాత్రి చేరుకున్నారు. ఆ సమయంలో వారిని గమనించిన గ్రామ స్తులు ఆరా తీయగా గేదెలను వెతకడానికి వెళ్తున్నట్లు చెప్పారు. అనంతరం బంధువులకు ఫోన్ చేసి మాట్లాడి ఆత్మహత్య చేసుకున్నారు. -
పాపను కాపాడబోయి.. జిల్లా హాకీ కార్యదర్శి గిరి మృతి
సాక్షి, మదనపల్లె సిటీ: నీటి కుంటలో మునిగిపోతున్న పాపను కాపాడబోయి జిల్లా హాకీ అసోసియేషన్ కార్యదర్శి, బీటీ కాలేజీ పూర్వపు ఫిజికల్ డైరెక్టర్ లెక్కల గోవర్థన గిరిరావు(53) గురువారం మృతి చెందాడు. దీంతో క్రీడాకారుల్లో విషాదం నెలకొంది. మదనపల్లె పట్టణం కృష్ణానగర్‌కు చెందిన గోవర్థన గిరిరావు జిల్లా హాకీ అసోసియేషన్ కార్యదర్శిగా ఉన్నారు. భార్య జలజ తంబళ్లపల్లె మండలం కన్నెమడుగు జెడ్పీ ఉన్నత పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు. సెలవులు కావడంతో తనతో పాటు పాఠశాలలో పని చేసే హిందీ టీచర్ దీప, ఫిజికల్ సైన్సు టీచర్ ఇంద్రాణి కుటుంబసభ్యులతో కలిసి ప్రముఖ పుణ్యక్షేత్రమైన బోయకొండకు వెళ్లారు. దైవదర్శనం చేసుకుని తిరుగు ప్రయాణంలో మదనపల్లె– చౌడేపల్లె మార్గంలోని ఓ ఫామ్‌హౌస్ వద్ద వంటలు చేసుకునేందుకు వెళ్లారు. వీరితో పాటు వెళ్లిన పిల్లలు సరదాగా ఫామ్ హౌస్‌లో ఆడుకుంటుండగా హిందీ టీచర్ కుమార్తె లాస్య ప్రమాదవశాత్తు నీటికుంటలో పడటంతో కేకలు వేసింది. గమనించిన గిరిరావు వెంటనే లాస్యను కాపాడేందుకు నీటికుంటలో దూకాడు. నీటి కుంట బురదమయమై ఉండటంతో ఇరుక్కుపోయాడు. ఆందోళనతో గుండెపోటుకు గురై మృతి చెందాడు. నీటి కుంటలో గిరిరావు ఇరుక్కపోవడాన్ని గమనించిన పిల్లలు కేకలు వేయడంతో, పరిసర ప్రాంతాలవారు అక్కడికి చేరుకుని ఆయన్ను వెలికితీశారు. స్థానికులు 108కు సమాచారం ఇచ్చి, ప్రాథమిక చికిత్స చేసినప్పటికి గిరిరావు మృతి చెందాడు. కుటుంబసభ్యులు, భార్య జలజ, కుమారుడు జస్వంత్‌లు ఆయన మృతిని తట్టుకోలేక బోరున విలపించారు. శుక్రవారం కురబలకోట మండలం కంటేవారిపల్లె వద్ద వ్యవసాయక్షేత్రంలో అంత్యక్రియలు జరగనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఎమ్మెల్యే పరామర్శ గిరిరావు మృతి చెందిన విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే నవాజ్‌బాషా గిరిరావు ఇంటికి చేరుకుని కుటుంబసభ్యులను ఓదార్చారు. మాజీ ఎమ్మెల్యే దేశాయ్ తిప్పారెడ్డి ,బీటీ కాలేజీ కరస్పాండెంట్ వై.ఎస్.మునిరత్నం, దివ్యభారతి ప్రసాద్‌రెడ్డి, జ్ఞానాంబిక డిగ్రీ కాలేజీ కరస్పాడెంట్ రాటకొండ గురుప్రసాద్, సాయిశేఖర్‌రెడ్డి, పీడీలు భౌతికకాయాన్ని సందర్శించి విచారం వ్యక్తం చేశారు. -
105 రోజుల వినోద క్వారంటైన్
కరోనా వచ్చినా, వస్తుందనే సందేహం వచ్చినా క్వారంటైన్‌కి వెళ్లాలి. ఆ క్వారంటైన్ పద్నాలుగు రోజులే. కాని పదహారు మంది కంటెస్టెంట్లు 105 రోజుల క్వారెంటైన్‌కి వెళ్లే సీజన్ వచ్చింది. బిగ్‌బాస్ 4 సీజన్. ఇక వీరి ఆటలు, పాటలు, తగువులు, తీర్పులు, ఎంట్రీలు, ఎగ్జిట్లు అన్నీ ప్రేక్షకులవి కూడా కాబోతున్నాయి. కరోనా చికాకును కాస్తయినా దూరం చేసే భారీ డైలీ డ్రామా బిగ్‌బాస్ 4. కెమెరా కళ్లున్న ఇల్లు. అనుక్షణం నిఘా. ప్రతి కదలికను వెంటాడే చూపు. ప్రవర్తనపై తీర్పు. అంతలోనే స్నేహం. అంతలోనే వైరం. ఇంట్లోకి అడుగు పెడుతుంటే స్వాగతం. వీడ్కోలు తీసుకుంటూ ఉంటే దుఃఖం. స్టార్ మాలో ప్రసారం కానున్న బిగ్‌బాస్ షోలో లేని డ్రామా లేదు. అంత వరకూ ముక్కూముఖం అంతా తెలియని వారు, పాత స్నేహం ఉన్నవారు పూర్తిగా కొత్తగా మారి కొత్త జీవితం జీవించడమే ఈ షో విశేషం. అందరి లక్ష్యం ఒక్కటే. అంతిమ విజేతగా నిలవడం. కాని ఆ ప్రయాణం అంత సులువు కాదు. మనుషులను ఓడించి, జయించి, బాధించి, సంతోషపరిచి ఆ స్థానానికి వెళ్లాలి. ప్రతి సందర్భంలోనూ ఒకటే సవాల్. లోపల ఉన్న మంచిని బయటకు తేవాలా.. చెడును బయటకు తేవాలా. ఆ ప్రవర్తనకే ఓట్లు పడతాయి. ఆ వ్యక్తిత్వాన్నే ప్రేక్షకులు గెలిపిస్తారు. ఇదంతా ప్రతి రోజూ గుక్క తిప్పుకోనివ్వకుండా కొనసాగుతుంది. ఈసారి హోస్ట్ ఎవరు? బిగ్‌బాస్ షో నిర్వహణ ఎంత ముఖ్యమో హోస్ట్‌ను నియమించడం కూడా అంతే ముఖ్యం. ఎన్.టి.ఆర్ హోస్ట్‌గా పెద్ద బ్యాంగ్‌తో మొదలైన ఈ షో ఆ తర్వాత నాని, నాగార్జునలతో అదే మీటర్‌ను కొనసాగించింది. బిగ్‌బాస్ 4కు మళ్లీ ఎన్.టి.ఆర్ హోస్ట్ కావచ్చన్న వార్తలొచ్చాయి. ఒక దశలో మహేశ్‌బాబు పేరు వినిపించింది. కాని బిగ్‌బాస్‌కు హోస్ట్ చేసే చాన్స్ మళ్లీ నాగార్జునకే దక్కింది. కరోనా వల్ల సినిమా షూటింగ్‌లు నిలిచిపోయిన నేపథ్యంలో నాగార్జున కూడా మరోసారి ఈ షోను హోస్ట్ చేయడం ఒక ఆసక్తికర వృత్తిగత కార్యకలాపంగా భావించి ఉంటారు. నాగార్జున నిర్వహించిన బిగ్‌బాస్ 3 విజేతగా గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ నిలిచాడు. ఈసారి ఎవరు నిలుస్తారో చూడాలి. కంటెస్టెంట్లు ఎవరు? పాల్గొనే వరకు కంటెస్టెంట్లు ఎవరు అనే విషయమై సస్పెన్స్ ఉంచడం బిగ్‌బాస్ షో ఆనవాయితీ. అయితే ఇంతకు ముందు పద్ధతి వేరు. ఇప్పుడు పద్ధతి వేరు. గతంలో కంటెస్టెంట్లను షోకు రెండు మూడు రోజుల ముందు తమ అధీనంలోకి తీసుకునేవారు. కాని ఇప్పుడు కరోనా వల్ల రెండు వారాల ముందు నుంచే వారిని తమ అధీనంలోకి తీసుకోవడం, పరీక్షలు నిర్వహించడం తతిమా జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చింది. అందుకే ఆగస్టు నెలాఖరుకు టెలికాస్ట్ కావాల్సిన షో సెప్టెంబర్ 6కు వాయిదా పడింది. ఈ నేపథ్యంలో కంటెస్టెంట్ల పేర్లు కొన్ని బయటకు తెలియసాగాయి. నటుడు తరుణ్, నటి శ్రద్ధా దాస్, గాయని సునీతల పేర్లు మొదట వినిపించినా వారు తమ పార్టిసిపేషన్‌ను కొట్టి పారేశారు. ప్రస్తుతానికైతే వార్తల్లో ఉన్న పేర్లు ఇవి– 1. లాస్య మంజునాథ్ (టీవీ నటి), 2. మహాతల్లి జాహ్నవి (యూట్యూబర్), 3. గంగవ్వ (యూట్యూబర్– విలేజ్ స్టార్), 4.సుజాత (టివి యాంకర్), 5.అవినాష్ (స్టాండప్ కమెడియన్), 6. సత్య (న్యూస్ రీడర్), 7.సుహైల్ రెయాన్ 8. సూర్యకిరణ్ (డైరెక్టర్), 9. అభిజిత్ (హీరో), 10. అమ్మ రాజశేఖర్ (దర్శకుడు). 11. దివి వైద్య (నటి). మిగిలిన ఐదుగురిలో ఇద్దరు హీరోయిన్లు, ఒక మ్యూజిక్ చానెల్ యాంకర్ ఉంటారని తెలుస్తోంది. ఈ 16 మంది కాకుండా అడిషిషనల్ కంటెస్టెంట్లను కూడా సిద్ధంగా ఉంచుకున్నారు. కరోనా ఆటంకాల వల్ల, ఇతరత్రా ఇబ్బందుల వల్ల వీరిలో ఎవరు పాల్గొంటారో కొత్తగా ఎవరు జతవుతారో ఇవాళ సాయంత్రం తెలిసిపోతుంది. కత్తి మీద సాము ఏమైనా ఈసారి బిగ్‌బాస్ షో నిర్వహణ కత్తి మీద సాము. గెస్ట్‌లు హౌస్‌లోకి రావాలన్నా, వైల్డ్ కార్డ్ ఎంట్రీలు హౌస్‌లోకి రావాలన్నా అప్పటికప్పుడు అయ్యే పని కాదు. కరోనా ప్రొటోకాల్‌ను పాటించి చేయాలి. అదీగాక బిగ్‌బాస్ షో నిర్వహణ లో కనీసం వంద మంది శ్రమించాల్సి ఉంటుంది. వీరంతా కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. లేకుంటే హౌస్‌లో ఉన్నవారికి కూడా కరోనా రావచ్చు. ఎన్ని అడ్డంకులు ఉన్నా ప్రేక్షకులు ఉత్కంఠగా ఉన్నారన్నది వాస్తవం. ఇల్లు అంతగా కదల్లేని ఈ రోజుల్లో, థియేటర్ల మూసివేత కొనసాగుతున్న ఈ రోజుల్లో ఇంట్లోకి రానున్న వినోదం వారిని ఉల్లాసపరుస్తుందనే ఆశిద్దాం. – సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
టైటిల్ పోరుకు లాస్య, నైనా
సాక్షి, హైదరాబాద్: ఆనంద్‌నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ స్పోర్ట్స్ అకాడమీ ఆధ్వర్యలో జరుగుతోన్న స్టేట్ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్లో లాస్య (ఏడబ్ల్యూఏ), నైనా (ఎల్బీ స్టేడియం) ఫైనల్‌కు చేరుకున్నారు. ఖైరతాబాద్‌లో సోమవారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీస్ మ్యాచ్‌ల్లో లాస్య 7–11, 7–11, 11–6, 11–9, 7–11, 11–4, 11–6తో జి. ప్రణీత (హెచ్‌వీఎస్)పై గెలుపొందగా, నైనా 9–11, 11–1, 6–11, 11–7, 11–9, 11–5తో ఎం. మౌనిక (జీఎస్ఎం)ను ఓడించింది. పురుషుల విభాగంలో మొహమ్మద్ అలీ (ఎల్బీ స్టేడియం), అమన్ రహమాన్ (ఏవీఎస్‌సీ) తుదిపోరుకు చేరుకున్నారు. సెమీస్ మ్యాచ్‌ల్లో మొహమ్మద్ అలీ 11–8, 11–4, 12–10, 8–11, 11–8తో అలీ మొహమ్మద్‌పై, అమన్ 11–8, 13–11, 11–8, 11–13, 11–13, 12–10తో వి. చంద్రచూడ్ (ఎంఎల్ఆర్)పై గెలుపొందారు. ఇతర కేటగిరీ సెమీఫైనల్ మ్యాచ్‌ల ఫలితాలు క్యాడెట్ బాలికలు: నిఖిత (వీపీజీ) 11–6, 11–5, 11–5, 11–3తో ధ్రితి (జీఎస్ఎం)పై, కావ్య (ఏడబ్ల్యూఏ) 6–11, 12–10, 11–7, 11–5, 11–7తో ప్రగ్యాన్ష (వీపీజీ)పై నెగ్గారు. బాలురు: జతిన్‌దేవ్ (ఎస్పీహెచ్ఎస్) 11–6, 11–7, 11–6, 11–4తో కార్తీక్ (నల్లగొండ)పై, శౌర్యరాజ్ సక్సేనా (ఎంఎల్ఆర్) 11–2, 11–7, 5–11, 11–4, 8–11, 11–4, 11–3తో పార్థ్ భాటియా (ఏడబ్ల్యూఏ)పై గెలిచారు. సబ్‌జూనియర్ బాలికలు: ఎన్. భవిత (జీఎస్ఎం) 11–7, 11–7, 11–9, 11–8తో ఇక్షిత (ఏడబ్ల్యూఏ)పై, విధి జైన్ (జీఎస్ఎం) 11–5, 11–7, 11–9, 11–9తో ప్రియాన్షి (జీఎస్ఎం)పై విజయం సాధించారు. బాలురు: కేశవన్ కన్నన్ (ఎంఎల్ఆర్)11–7, 9–11, 12–10, 11–8, 11–6తో అథర్వ (ఏడబ్ల్యూఏ)పై, ఎస్ఎస్కే కార్తీక్ (ఏడబ్ల్యూఏ) 11–8, 11–6, 11–8, 11–6తో ప్రణవ్ నల్లారి (ఏడబ్ల్యూఏ)పై ఆధిక్యం సాధించారు. జూనియర్ బాలికలు: ఐశ్వర్య డాగా (ఏడబ్ల్యూఏ) 11–9, 9–11, 2–11, 11–6, 11–4, 11–7తో అంజలి (జీఎస్ఎం)పై, సస్య (ఏడబ్ల్యూఏ) 9–11, 11–7, 11–9, 11–5, 11–7తో భవిత (జీఎస్ఎం)పై గెలుపొందారు. బాలురు: అద్వైత్ (ఏడబ్ల్యూఏ) 11–5, 11–7, 11–2, 11–7తో సాయినాథ్ రెడ్డి (ఎంఎల్ఆర్)పై, బి. వరుణ్ శంకర్ (జీటీటీఏ) 11–6, 4–11, 7–11, 11–8, 11–7, 11–7తో అమన్ రహమాన్ (ఏవీఎస్‌సీ)పై నెగ్గారు. యూత్ బాలికలు: జి. ప్రణీత (హెచ్‌వీఎస్) 12–10, 11–5, 7–11, 11–7, 11–9తో నైనా (ఎల్బీఎస్)పై, రచన (జీఎస్ఎం) 11–5, 8–11, 12–10, 5–11, 11–3, 1–11, 14–12తో లాస్య (ఏడబ్ల్యూఏ)పై గెలుపొంది ఫైనల్‌కు చేరుకున్నారు. -
మలుపుతిప్పిన ‘జానపదం’
ఆదిలాబాద్: బుల్లితెర(టీవీ)పై నటించే అవకాశం వస్తే ఎవరు మాత్రం కాదనగలరు. ఇలాంటి అవకాశాన్ని పట్టణానికి చెందిన చిన్నారి ఆర్టిస్టులు అందుకోనున్నారు. ఇచ్చోడ మండలం అడెగామ–కె గ్రామానికి చెందిన న్యాయవాది సంగెం సుధీర్‌కుమార్, అమృతవాణి దంపతుల కూతుర్లు సుధాలహరి, సుధామాధురి ప్రస్తుతం ఆదిలాబాద్ పట్టణంలోని శాంతినగర్ కాలనీలో ఉంటున్నారు. ‘జానపదం..దుమ్మురేపు’ తో.. అక్కాచెల్లెలు సుధాలహరి, సుధామాధురి గతేడాది ఓ న్యూస్ చానల్లో నిర్వహించిన జానపదం–దుమ్మురేపు అనే కార్యక్రమానికి చైల్డ్ ఆర్టిస్టులుగా ఎంపికయ్యారు. త్వరలో ఈ కార్యక్రమం ప్రారంభం కానుండగా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్నారు. సుధాలహరి నాలుగోతరగతి చదువుతుండగా, మాధురి 3వ తరగతి చదువుతోంది. డాన్సులు, పాటలు అంటే ఎంతో ఇష్టపడే వీరికి అనుకోకుండా ఒక అవకాశం రావడంతో టీవీ కార్యక్రమాలకు ఎంపికయ్యారు. మొదటి అవకాశంతో.. న్యూస్ చానల్లో జానపదం–దుమ్మురేపు అనే కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు సమాచారం రావడంతో చిన్నారుల తండ్రి సుధీర్‌కుమార్ వారి పిల్లల ఫొటోలు, వివరాలు ప్రోగ్రాం కోడైరెక్టర్ వంశీకి పంపించారు. దీంతో అక్కడి నుంచి పిలుపు రావడంతో 2017 జనవరిలో ప్రిలిమినరీ సెలక్షన్స్ కోసం హైదరాబాద్‌లోని అమీర్‌పేట్‌లోని సారథి స్టూడియోకు వెళ్లారు. ప్రోగ్రాంలో ఇద్దరు చిన్నారులు జానపదగేయంపై డ్యాన్సులు చేసి ఆకట్టుకోవడంతో టీవీషోకు ఎంపికయ్యారు. న్యాయనిర్ణేతలుగా వ్యవహరించిన ఆర్పీ పట్నాయక్, వందేమాతరం శ్రీనివాస్, గోరటి వెంకన్న చిన్నారులను చైల్డ్ ఆర్టిస్టులుగా ఎంపిక చేశారు. తర్వాత జూన్ నుంచి నవంబర్ వరకు ఈ షోకు సంబంధించిన షుటింగ్‌లో నటించారు. డాన్సులతో పాటు ఇద్దరు చిన్నారులు జానపద పాటలు ఆలపించనున్నారు. ఈ కార్యక్రమం షుటింగ్ జరుగుతున్న సమయంలో ప్రముఖ టీవీ చానల్లో ఓ సీరియల్లో నటించేందుకు వీరిద్దరికి అవకాశం వచ్చింది. త్వరలో ఈ సీరియల్ ప్రారంభం కానుంది. ఎంపికపై చిన్నారుల తల్లిదండ్రులు సుధీర్‌అమృతవాణి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
పరిచయం తర్వాత ఏమైంది?
వెంకీ, లాస్య జంటగా రాధాకృష్ణ దర్శకత్వంలో దీపక్ కృష్ణన్ నిర్మించిన సినిమా ‘తొలి పరిచయం’. మురళీ మోహన్, సుమన్ కీలక పాత్రధారులు. ఇంద్రగంటి స్వరపరిచిన ఈ సినిమా పాటలను విడుదల చేసిన రాజమండ్రి ఎంపీ, నటుడు మురళీ మోహన్ మూడు పాటలు బాగున్నాయని మెచ్చుకున్నారు. దర్శకుడు మాట్లాడుతూ – ‘‘ఈతరం యువత మనోభావాలను ప్రతిబింబించే చిత్రమిది. ఓ అమ్మాయి, అబ్బాయి పరిచయం తర్వాత ఏమైందనేది చిత్రకథ. వినోదం, కుటుంబ విలువలకు ప్రాముఖ్యత ఇచ్చాం’’ అన్నారు. ‘‘దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ వరసకు నాకు బ్రదర్ అవుతారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం పాట, పవన్‌కల్యాణ్ ‘జనసేన’ పాట నేనే స్వరపరిచా. ఈ సినిమాలో స్వరకర్తగా, గాయకుడిగా, పాటల రచయితగా మూడు పాత్రలు పోషించా’’ అన్నారు ఇంద్రగంటి. ‘మా’ అధ్యక్షులు శివాజీ రాజా, చిత్ర సహ నిర్మాత సురేశ్‌కుమార్ పాల్గొన్నారు. -
త్వరలో చెబుతా!
‘‘నేను జర్నలిస్ట్‌గా పని చేశా. నాన్నగారు (యలమంచిలి సాయిబాబు) ‘శ్రీరామరాజ్యం’ సినిమా నిర్మించారు. నేను హీరోగా నటించిన ‘ఇంటింటా అన్నమయ్య’ విడుదల ఆలస్యం కావడంతో కాస్త నిరాశ పడ్డా’’ అన్నారు నటుడు రేవంత్. లాస్య, శోభిత, రేవంత్, నోయల్, హేమంత్ ముఖ్య పాత్రల్లో కృష్ణ కిషోర్ దర్శకత్వంలో రాజ్‌కుమార్.ఎం నిర్మించిన ‘రాజా మీరు కేక’ ఈ నెల 16న విడుదల కానుంది. ఈ సందర్భంగా రేవంత్ పాత్రికేయులతో మాట్లాడారు.‘‘ఈ చిత్రంలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే మధ్య తరగతి యువకుడిగా కనిపిస్తా. నేను, నా స్నేహితులు కుటుంబానికి విలువ ఇస్తుంటాం. మన వ్యవస్థలోని ఓ సమస్యను మేం ఎలా పరిష్కరించామన్నదే కథ. సినిమాకు సంబంధించిన అన్ని విభాగాల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి నాలో ఉంది. కథ నచ్చడంతో ఈ చిత్రంలో నటించా. దర్శకునికి కథపై ఉన్న పట్టు, స్క్రీన్‌ప్లే నచ్చింది. నిర్మాతగారు అందరికీ స్వేచ్ఛ ఇవ్వడంతో సినిమా అవుట్‌పుట్ బాగా వచ్చింది. నా తర్వాతి చిత్రం గురించి త్వరలోనే చెబుతా’’ అన్నారు. -
ప్రపంచస్థాయిలో రాణించిన ‘లాస్య’
⇔ వ్యక్తిత్వ వికాస పోటీల్లో ప్రథమ బహుమతి ⇔ ఆమె అమలాపురంవాసి మనవరాలు అమలాపురం టౌన్ : ఏటా అమెరికాలో జరిగే ప్రపంచస్థాయి వ్యక్తిత్వ వికాస పోటీల్లో తెలుగు అమ్మాయి మంథా లాస్య విజేతగా నిలిచింది. అమెరికాలో 9వ తరగతి చదువుతున్న లాస్య అమలాపురం వాసి మనవరాలే. ఇంతటి ప్రతిష్టాత్మకమైన బహుమతిని సాధించిన మనవరాలి గురించి అమలాపురం ఎస్కేబీఆర్ కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్ మంథా సాంబశివశాస్త్రి విలేకర్లకు ఆదివారం చెప్పారు. అమెరికాలోని డిస్ట్రిబ్యూటెడ్ ఎడ్యుకేషనల్ క్లబ్ ఆఫ్ అమెరికా(డీఈసీఏ) ఏటా ప్రపంచవ్యాప్తంగా తొమ్మిదో తరగతి నుంచి పన్నెండో తరగతి చదువుతున్న విద్యార్థులకు మేనేజ్మెంట్ విభాగంలో వ్యక్తిత్వ వికాసంపై పోటీ నిర్వహిస్తుంది. ఈ సంవత్సరం కాలిఫోర్నియాలోని అనాహిమ్‌లో నిర్వహించిన ఇంటర్నేషనల్ కెరీర్ కాన్ఫరెన్సులో లాస్య ప్రథమ స్థానంలో నిలిచి ట్రోఫీతో పాటు మూడు పతకాలు కైవసం చేసుకుంది. లాస్య అమెరికాలోని మిషిగాన్ రాష్ట్రంలో డెట్రాయిట్ దగ్గరలో గల శార్త్ విల్ హైస్కూలులో తొమ్మిదో తరగతి చదువుతోంది. ప్రపంచవ్యాప్తంగా 18 వేల విద్యార్థులు పోటీ పడ్డ ఈ పరీక్షలో లాస్య విజేతగా నిలిచినందుకు ఆమె తల్లిదండ్రులు గీతా, వేణుమాధవ్‌లను డీఈసీఏ అభినందించింది. ఆ స్కూలు చరిత్రలో 9వ గ్రేడ్ విద్యార్థి అయిన లాస్య బిజినెస్ మేనేజ్మెంట్ ఆర్థిక సలహా సర్వీసెస్‌లో ఇలాంటి ప్రతిష్టాత్మక బహుమతి ఇప్పటి వరకూ ఎవరూ పొందలేదని శార్త్ విల్ స్కూలు యాజమాన్యం ప్రకటించింది. లాస్య గతంలో 5, 8 తరగతుల్లో చూపిన ప్రతిభకు అప్పటి అమెరికా అధ్యక్షుడు ఒబామా నుంచి ప్రశంసా పత్రాలు అందుకుంది. పలు సైన్స్ ఒలింపియాడ్లలో బంగారు పతకాలు సాధించింది. ప్రస్తుతం వైనీ ఓక్‌ల్యాండ్ సైన్స్ ఒలింపియాడ్ బోర్డులో మెంబరుగా, లివోనియా యూత్ సింఫనీ ఆర్కెస్ట్రాలో వయోలిన్ కళాకారిణిగా పనిచేస్తోంది. డ్రాయింగ్, స్విమ్మింగ్‌లలో అభిరుచి గల లాస్య తేట తెలుగులో చక్కగా మాట్లాడగలదు, రాయగలదు. ప్రతి ఆదివారం అమెరికాలో జరిగే సత్యసాయి ఎడ్యుకేషనల్ క్లాస్‌లకు హాజరవుతూ వ్యక్తిత్వ వికాసం, సామాజిక చైతన్యంపై పరిణితి పొందుతోందని సాంబశివశాస్త్రి చెప్పా రు. లాస్య తల్లిదండ్రులు మిషిగాన్‌లోని ఓ యూనివర్సిటీలో ఉద్యోగులుగా 20 ఏళ్లుగా అక్కడే స్థిరపడ్డారు. -
కన్న కూతురిని.. కత్తితో..
చిత్తూరుః మానవత్వం మంట కలిసిపోయింది. కన్నకూతుర్ని కత్తితో పొడిచి చంపింది ఓ కసాయి తల్లి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని కుర్చివేడు గ్రామంలో నివాసముంటున్న యోగ మూర్తి ఆర్మీలో పని చేస్తున్నాడు. ఏడేళ్ల కిందట కుమారి అనే మహిళతో ఆయనకు వివాహమైంది. వీరికి లాస్య(6) కుమార్తె ఉంది. చిత్తూరులోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఒకటో తరగతి చదువుతోంది. ఇటీవల జమ్ము-కశ్మీర్ నుంచి యోగా మూర్తి 50 రోజుల సెలవుపై ఇంటికి వచ్చాడు. మంగళవారం తమిళనాడులోని ఓ ఆలయానికి దేవుని దర్శనం కోసం వెళ్లాడు. అయితే, 11 గంటల ప్రాంతంలో లాస్యకు ఆరోగ్యం సరిగాలేదని కుమారి మూర్తికి ఫోన్ చేసింది. వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లాలని తాను బయలుదేరుతున్నారని బదులిచ్చాడు భర్త. మరో రెండు గంటల అనంతరం తిరిగి భర్తకు ఫోన్ చేసిన కుమారి.. లాస్య చనిపోయిందని చెప్పింది. దీంతో హుటాహుటిన గ్రామానికి చేరుకున్నాడు. ఈ లోగా మూర్తికి ఫోన్ చేసిన గ్రామస్తులు లాస్య మరణం అనుమానాస్పదంగా ఉందని చెప్పారు. ఇంటికి చేరుకున్న మూర్తి బిడ్డను కత్తితో పొడిచి చంపేశారని నిర్ధారించుకున్నాడు. ఇంత కిరాతకమైన పని ఎవరు చేశారని భార్యను ప్రశ్నించాడు. కుమారి మిన్నకుండటంతో చుట్టుపక్కల వాళ్లు కూడా ఆమెను ప్రశ్నించారు. ఈ లోగా పోలీసులు సంఘటనా స్ధలానికి చేరుకోవడంతో కుమారి పోలీసులకు లొంగిపోయింది. ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు స్టేషన్‌కు తరలించారు. అయితే, లాస్యను చంపడానికి వెనుక ఉన్న కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు ఈ కోణంలోనే నిందితురాలిని ప్రశ్నిస్తున్నారు. లాస్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
రేడియో సిటీలో 'తొలి పరిచయం' సాంగ్ లాంచ్
పియుకే ప్రొడక్షన్స్ పతాకంపై వెంకీ, లాస్య జంటగా తెరకెక్కుతున్న సినిమా తొలి పరిచయం. ఎల్.రాధాకృష్ణను దర్శకుడిగా పరిచయం చేస్తూ దీపక్ కృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ సాంగ్ లాంచ్ సోమవారం హైదరాబాద్‌లో రేడియో సిటీలో జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ పాల్గొన్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్, ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. పెళ్లి అంటే ఇష్టం లేని ఒక అమ్మాయి, అబ్బాయి ఒకే ఇంట్లో గడపాల్సి వస్తే... ఆ తర్వాత ఏమి జరిగింది అన్నది చిత్ర కథాంశం. పోలవరం ప్రాంతంలో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. త్వరలోనే ఆడియో రిలీజ్, సినిమా రిలీజ్ డేట్లను ఎనౌన్స్ చేయనున్నారు చిత్రయూనిట్. -
ఏం జరిగింది?
‘‘పెళ్లి అంటే ఇష్టంలేని ఓ అమ్మాయి, ఓ అబ్బాయి.. కొన్ని పరిస్థితుల వల్ల నాలుగు రోజులు ఒకే ఇంట్లో ఉండాల్సి వస్తుంది. అప్పుడు ఏం జరిగింది అన్నది ఆసక్తికరం’’ అని దర్శకుడు ఎల్.రాధాకృష్ణ తెలిపారు. వెంకీ, లాస్య జంటగా ఎల్.రాధాకృష్ణను దర్శకునిగా పరిచయం చేస్తూ దీపక్ కృష్ణ నిర్మించిన చిత్రం ‘తొలి పరిచయం’. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను నిర్మాత మల్కాపురం శివకుమార్ విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ– ‘‘యూత్, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రమిది. పోలవరం పరిసరాల్లో షూటింగ్ జరిపాం. చిన్న చిత్రమైనా క్వాలిటీ విషయంలో నిర్మాత రాజీ పడలేదు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి’’ అన్నారు. ‘‘ఫస్ట్ లుక్‌లాగే సినిమా కూడా ఫ్రెష్‌గా ఉంటుంది. త్వరలో పాటలు విడుదల చేస్తాం’’ అని వెంకీ చెప్పారు. సంగీత దర్శకుడు ఇంద్రగంటి పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: శరవణ కుమార్ సి. -
వెంకీ, లాస్య జంటగా 'తొలి పరిచయం'
పియుకే ప్రొడక్షన్స్ పతాకంపై వెంకీ, లాస్య జంటగా ఎల్.రాధాకృష్ణను దర్శకుడుగా పరిచయం చేస్తూ దీపక్ కృష్ణ నిర్మిస్తున్న చిత్రం తొలి పరిచయం. సీనియర్ నటులు మురళీమోహన్, సుమన్, రాజీవ్ కనకాల, రఘుబాబు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల కార్యక్రమం బుధవారం హైదరాబాద్‌లో జరిగింది. నిర్మాత మల్కాపురం శివకుమార్ తొలి పరిచయం ఫస్ట్ లుక్‌ను లాంచ్ చేసి చిత్రయూనిట్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. పెళ్లి అంటే ఇష్టం లేని ఒక అమ్మాయి, ఒక అబ్బాయి నాలుగు రోజులపాటు ఒకే ఇంట్లో ఉండాల్సి వస్తుంది. ఆ తరుణంలో ఏం జరిగిందన్న కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాను పోలవరం పరిసర ప్రాంతాల్లో షూట్ చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ఆడియో త్వరలోనే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
రాజా మీరు... హిట్టవ్వాలి
– డి. సురేశ్‌బాబు తారకరత్న, రేవంత్, నోయెల్, హేమంత్, లాస్య, శోభిత ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘రాజా మీరు కేక’. కృష్ణ కిశోర్‌ను దర్శకునిగా పరిచయం చేస్తూ, ఆర్.కె. స్టూడియోస్ పతాకంపై రాజ్‌కుమార్ నిర్మించారు. ఈ చిత్రం ట్రైలర్‌ను నిర్మాత డి.సురేశ్ బాబు విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ– ‘‘మా సంస్థలో పలు విజయవంతమై చిత్రాలకు కృష్ణ కిశోర్ కో–డైరెక్టర్‌గా పనిచేశాడు. ఇప్పుడు దర్శకునిగా ‘రాజా మీరు కేక’ సినిమా తెరకెక్కించారు. ఈ చిత్రం హిట్ అయి తనకు, యూనిట్‌కు మంచి పేరు రావాలి’’ అన్నారు. ‘‘మా బ్యానర్లో నిర్మించిన మొదటి చిత్రం ‘గుంటూరు టాకీస్’ హిట్ అయింది. మలి ప్రయత్నంగా నిర్మించిన ‘రాజా మీరు కేక’ సినిమా కూడా మా సంస్థకు మరో హిట్‌ను అందిస్తుందనే నమ్మకం ఉంది. నటీనటులందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు. యువతరంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే అంశాలు ఉంటాయి’’ అని చిత్రనిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: రామ్ ప్రసాద్ రెడ్డి, సంగీతం: శ్రీ చరణ్. -
యాంకర్ లాస్య ఎంగేజ్మెంట్
-
లాస్యకు కాబోయే వరుడు ఇతడే..
-
లాస్యకు కాబోయే వరుడు ఇతడే..
ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఎంగేజ్మెంట్ వార్తను ఒక్కసారిగా చెప్పి అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది యాంకర్ లాస్య. అంతే కాకుండా భారీ సస్పెన్స్ మూవీని తలపించేలా తనకు కాబోయే జీవిత భాగస్వామి వివరాలను వెల్లడించింది. తన ఎంగేజ్మెంట్కు సంబంధించి పోస్ట్ పెట్టిన కొద్ది వ్యవధిలోనే కాబోయే భర్తకు సంబంధించి చిన్న క్లూను ఓ ఫోటో ద్వారా ఇచ్చింది లాస్య. ఒకరి చేతి పై మరొకరి ముద్దు పేరుతో పచ్చబొట్టు వేసి ఉన్న ఫోటోను లాస్య తన ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేసింది. చిన్ని, మంజూ అని రాసున్న ఆ రెండు చేతుల పక్కనే రెండు ఎంగేజ్ మెంట్ రింగులు కూడా ఉన్నాయి. దీన్నే లాస్య తన వాల్ పోస్ట్‌గా కూడా పెట్టింది. ఈ ఫోటోను ఫేస్ బుక్ పేజీలో పెట్టిన కొద్ది సేపటికే పెద్ద ఎత్తున లైకులు వచ్చాయి. ఎంగేజ్ మెంట్ ఎవరితో అయింది..ఈ మంజూ ఎవరు అంటూ.. అభిమానులు భారీగా కామెంట్లు చేశారు. దీనికి స్పందిచిన లాస్య విషెస్ తెలిపిన వారందరికి కృతజ్ఞతలు తెలిపింది. తనకు కాబోయే జీవిత భాగస్వామికి సంబంధించి ఫోటోను సరిగ్గా ఐదు గంటలకు ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేస్తానని లాస్య పేర్కొంది. తాను చెప్పినట్టుగానే సరిగ్గా సోమవారం సాయంత్రం ఐదుగంటలకు ఎంగేజ్ మెంట్ ఫోటోలను విడుదల చేసింది. అయితే ఆదివారం రోజే ఈ ఎంగేజ్మెంట్ కార్యక్రమం జరిగిందని పేర్కొంది. మంజూనాథ్ మరాఠీ అబ్బాయని తెలిపింది. -
యాంకర్ లాస్య ఎంగేజ్మెంట్
హైదరాబాద్ : బుల్లితెరపై తన సత్తా చాటి, వెండి తెరపైకి ఇటీవలే షిఫ్ట్ అయిన ప్రముఖ యాంకర్ లాస్య. 'రాజా మీరు కేక' అనే సినిమాలో లాస్య నటించబోతున్న విషయం తెలిసిందే. కెరీర్ బిజీగా సాగుతున్న దశలోనే ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా లాస్య తన ఎంగేజ్మెంట్ ప్రకటన చేసింది. 'జీవితంలో వివాహానికి ముందు జరిగే ఎంగేజ్మెంట్ ఎంతో ప్రత్యేకమైంది. నా సోల్మెట్తో ఎంగేజ్మెంట్ జరిగినందుకు చాలా ఆనందంగా ఉన్నా. ప్రేమ విలువైంది. పెళ్లికి ముందు జరిగే ఎంగేజ్మెంట్ ఎంతో ఆసక్తితో కూడుకున్నది.' అంటూ డిజైనర్ ఈశ్వరీ తయారు చేసిన ఎంగేజ్మెంట్ డ్రెస్‌లో ఉన్న ఫోటోను లాస్య తన ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేసింది. -
రాయలసీమ బిడ్డను అయినప్పటికి ...
మురళీనగర్ : టీవీ యాంకర్ లాస్య మురళీనగర్ సమీపంలోని పట్టాభిరెడ్డితోటలోని వానప్రస్థాశ్రమంలో సందడి చేశారు. జే-చారిటీస్ సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన పెద్దవారికి ‘పలకరింపు’ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఆశ్రయం పొందుతున్న సుమారు 40మంది వృద్ధులతో ఆమె మాట్లాడారు. హాయ్...నాన్నమ్మలూ....తాతయ్యలూ అంటూ పలకరించగానే బామ్మలు కూడా హాయ్...అంటూ మురిసిపోయారు. ఈసందర్భంగా లాస్య మాట్లాడుతూ తను రాయలసీమ బిడ్డను అయినప్పటికి తెలంగాణా ప్రజల ఆదరణ పొందగలుతున్నానని, ఇది తెలుగు ప్రజల అభిమానానికి సూచిక అని అన్నారు. తల్లిదండ్రులను వదిలేయడం సినిమాల్లో చూశానని... అటువంటి వారు పడుతున్న ఆవేదన స్వయంగా ఇక్కడ చూస్తున్నానని లాస్య పేర్కొన్నారు. నాన్నమ్మ, తాతయ్యల దగ్గర గడిపే అదృష్టం ఈరకంగా నాకు లభించిందని ఆమె ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం వృద్ధులకు చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా పరిషత్ చైర్పర్సన్ లాలం భవాని మాట్లాడుతూ న్యూక్లియర్ ఫ్యామిలీలు ఎక్కువైపోవడం వల్ల స్వార్థం పెరిగిపోతోందని, దీంతో ఇంట్లో పెద్దకు ఆదరణ కరవవుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా వృద్ధులకు చీరలు, పంచెలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో లాలం భాస్కరరావు, జే-చారిటీస్ సీఈఓ డి.రామారావు, యువ దర్శకుడు డి.జగదీష్, వానప్రస్థాశ్రమం నిర్వాహకుడు ఆర్.శ్రీనివాసు, బీజేపీ నాయకులు చిరికి శ్రీనివాసరావు, బి. శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
గూగుల్‌లో ఉద్యోగం వదిలివచ్చేశా..
భీమవరం : ‘గుంటూరు టాకీస్’ సినిమా నిర్మాత కిషోర్, సురేష్ ప్రొడక్షన్స్‌తో కలిసి నిర్మిస్తున్న ఒక సినిమాలో నటిస్తున్నట్టు టీవీ యాంకర్, సినీ నటి లాస్య చెప్పారు. శుక్రవారం భీమవరంలో నిర్వహించిన స్నేహ కిట్టి కార్యక్రమంలో వ్యాఖ్యాతగా వ్యవహరించేందుకు వచ్చిన ఆమె విలేకరులతో ముచ్చటించారు. గూగుల్‌లో ఉద్యోగం చేస్తుండగా బుల్లితెరలో అవకాశం రావడంతో ఉద్యోగానికి గుడ్‌బై చెప్పి నటిగా, యాంకర్‌గా స్థిరపడినట్టు తెలిపారు. తాను నటించిన అంకితం, డి జూనియర్స్, మొండి మొగుడు పెంకి పెళ్లాం, సమ్‌థింగ్ స్పెషల్ వంటి కార్యక్రమాలు తనకెంతో గుర్తింపునిచ్చాయని ఆనందం వ్యక్తం చేశారు. యాంకర్స్‌లో ఉదయభాను అంటే తనకు ఇష్టమని లాస్య చెప్పారు. -
పిల్లల్ని చంపి ఆత్మహత్యకు పాల్పడ్డ తల్లి
బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడలో బుధవారం విషాదం చోటుచేసుకుంది. ఓ తల్లి తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. జొన్నవాడ గ్రామానికి ప్రవల్లిక(27) తన ఇద్దరు పిల్లలపై కిరోసిన్ పోసి తానూ నిప్పంటించుకుంది.ఈ ఘటనలో లాస్య(5), రేష్మ(2) అనే చిన్నారులతో పాటు తల్లి కూడా ప్రాణాలు కోల్పోయింది. కుటుంబకలహాల నేపథ్యంలోనే ఈ ఘటన జరిగినట్లు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పక్కింటోళ్లే లాస్యను చంపేశారు
తండ్రిపై కక్షతోనే దారుణం గొంతు నులిమి, ఆపై కత్తితో గొంతు కోసిన దుండగులు ముగ్గురు నిందితుల అరెస్టు పెద్దల కక్షలు పసిబిడ్డను బలిగొన్నాయి... చిన్నారి లాస్యను అందరూ అనుమానించినట్టే పక్కింటివారే గొంతునులిమి చంపి.. ఆపై కర్కశంగా కత్తితో గొంతు కోసినట్టు పోలీసుల విచారణలో తేలింది. మంగళవారం సనత్‌నగర్ ఇన్స్పెక్టర్ సుదర్శన్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... ఫతేనగర్ దీన్దయాళ్నగర్కు చెందిన నవీన్, మయూరి దంపతులకు లాస్య అలియాస్ పండు (4) సంతానం. నవీన్ ఇంటికి ఒక పక్క లక్ష్మయ్య, యాదమ్మ దంపతులు.. కుమార్తె పద్మ (35), కుమారుడు నర్సింహులుతో కలిసి ఉంటున్నారు. నవీన్ ఇంటికి మరోపక్క గిరి (40) ఇల్లు ఉంది. లక్ష్మయ్య కూతురు పద్మతో గిరికి వివాహేతర సంబంధం ఉంది. ఇదిలా ఉండగా.. ఇల్లు నిర్మిస్తున్న సమయంలో ప్రహరీ విషయంలో లక్ష్మయ్య కుటుంబానికి, నవీన్‌కు మధ్య వివాదం తలెత్తింది. ఇదే నేపథ్యంలో లక్ష్మయ్య ఇంట్లోని చెత్తను నవీన్ ఇంట్లోకి వేయడం, నవీన్ ఇంటి ముందు వేసిన ముగ్గులు చెరిపేయడం, మురుగునీరు నవీన్ ఇంట్లోకి వదలడం వంటివి చేస్తుండటంతో రెండు కుటుంబాల మధ్య వివాదం మరింత ముదిరి తరచూ గొడవపడేవారు. నవీన్ ఇదే సమయంలో గిరి, పద్మల వివాహేతర సంబంధాన్ని లేవనెత్తి దెప్పేవాడు. నవీన్ ద్వారా స్థానికులందరికీ వివాహేతర సంబంధం విషయం తెలిసిందని, నవీన్ కుటుంబంపై లక్ష్మయ్య కుటుంబం కక్షగట్టి పగ తీర్చుకొనేందుకు వేచి చూస్తోంది. అతి క్రూరంగా... ఈనెల 14న రాత్రి 8 గంటలకు మున్సిపల్ సిబ్బంది వీరుండే వీధిలో దోమల మందు కొట్టారు. ఆ సమయంలో లాస్య రోడ్డుపై ఆడుకుంటోంది. ఫాగింగ్ మిషన్ ద్వారా విడుదలైన దట్టమైన పొగ రోడ్డుపై వ్యాపించిన సమయంలో లక్ష్మయ్య, యాదమ్మ, నర్సింహులు, గిరి, పద్మ కలిసి లాస్యను తమ ఇంట్లోకి లాక్కెళ్లారు. అరవకుండా పాప ముఖాన్ని దిండుతో అదిమిపెట్టి.. గొంతు నులిమి చంపేశారు. అంతటితో ఆగకుండా కత్తితో గొంతు కోశారు. మృతదేహాన్ని ఒక సంచిలో మూటగట్టి సజ్జపై పడేశారు. పాపను ముక్క ముక్కలు చేసి అవయవాలను ఒక్కొక్కటిగా బయటకు తీసుకెళ్లి పడేయాలని నిర్ణయించుకున్నారు. అయితే అప్పటికే తమ పాప కనిపించకుండాపోవడంతో నవీన్ దంపతులు లక్ష్మయ్య కుటుంబాన్ని ఓ కంట కనిపెడుతున్నారు. దీనికి తోడు రోడ్డుపై జనం తిరుగుతూ ఉండటంతో పాప మృతదేహాన్ని బయటకు తీసుకెళ్లడానికి వారికి వీలుకాలేదు. మూడు రోజుల పాటు ఇంట్లోనే మృతదేహం ఉండటంతో కుళ్లిపోయి దుర్వాసన రావడం మొదలైంది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చే లోగానే విషయం ఆ నోటా ఈ నోటా పొక్కడంతో పెద్ద ఎత్తున జనం అక్కడికి చేరుకుని ఇంట్లో ఉన్న లక్ష్మయ్య, యాదమ్మలను చితకబాదారు. పద్మ, గిరి, నర్సింహ్మలు పరారీలో ఉన్నారు. కేసు విచారణ చేపట్టిన పోలీసులు నిందితులు పద్మ, గిరి, నర్సింహ్మలను మంగళవారం అరెస్టు చేసి, విచారణ అనంతరం రిమాండ్‌కు తరలించారు. స్థానికుల దాడిలో గాయాలకు గురైన లక్ష్మయ్య, యాదమ్మలు గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. -
దేవుడా .. ఎందుకింత శోకం
తిరుపతిలో విద్యుత్ షార్ట్‌సర్క్యూట్‌తో ఆరేళ్ల చిన్నారి మృతి శ్రీకాళహస్తిలో నీటి తొట్టెలో పడి బాలుడి దుర్మరణం కన్నీరుమున్నీరవుతున్న తల్లిదండ్రులు, బంధువులు ఆ చిన్నారి ఊహించి ఉండదు .. రోజూ వెలుతురు ఇచ్చే కరెంటు తన జీవితంలో చీకట్లు నింపుతుందని. షార్ట్ సర్కూట్‌తో వచ్చిన పొగకు ఊపరాడక ఎంత విలవిల్లాడిందో.. గంటసేపు కాపాడే వారి కోసం అరచిన ప్రాణం అలసి ఆవిరైపోరుుంది. శ్రీకాళహస్తిలో.. రోజూ అమ్మ పోసే లాల రెండేళ్ల బాబు పాలిట యమపాశమైంది. ఆట కదరా శివ అంటే ఏమిటో అనుకున్నాం. దేవుడా.. ఎందుకింత నిర్దయ. ఆ తల్లిదండ్రులకు ఎందుకింత అంతులేని శోకం. తిరుపతి క్రైం :‘‘అత్తా.. ఊపిరి ఆడడం లేదు. పొగ.. మంటలు... ఎక్కడున్నావ్ అత్తా.. ప్లీజ్ కాపాడత్తా.. పాణం పోయేట్టుంది.. ప్లీజ్ తలుపు తీ అత్తా’’ అంటూ ఆ చిన్నారి చేసిన రోదనలు, ఆర్తనాదాలు ఎవరికీ వినపడలేదు. సంక్రాంతి పండుగ సెలవులు ఇవ్వడంతో ఇంట్లో కూర్చుని టీవీలో వచ్చే పోగో బొమ్మలు చూస్తూ కేరింతలు కొడుతున్న ఆరేళ్ల పసిపాపను షార్ట్ సర్క్యూట్ రూపంలో మృత్యువు కబళించింది. ఒల్లంతా కాలిపోయి ఊపిరి ఆడని స్థితిలో గంటపాటు మృత్యువుతో పోరాడిన ఆ చిట్టి తల్లి చివరకు కన్నుమూసింది. ‘‘నిన్ను బాగా చదివించి డాక్టర్‌ను చేస్తానని మీ అమ్మకు మాట ఇచ్చి ఇక్కడికి తీసుకొచ్చాను.. మీ అమ్మకు ఏం సమాధానం చెప్పేది.. లేమ్మా లాస్యా.. అత్తను వచ్చాను.. ఒక్కసారి చూడు తల్లీ..’’ అంటూ లాస్య మృతదేహంపై పడి అత్త బోరున విలపించడం అందరినీ కంట తడి పెట్టించింది. అసలు ఏమి జరిగిందంటే... వైఎస్ఆర్ జిల్లా రాజంపేట మునక్కాయలపల్లెకు చెందిన సుబ్బరాయుడు, వరలక్ష్మమ్మలకు లాస్య(6) ఒక్కతే కుమార్తె. అక్కడ మంచి పాఠశాలలు లేకపోవడంతో తిరుపతిలోని మేనత్త సుజాత దగ్గరకు ఏడాది క్రితం చిన్నారిని పంపించారు. బాగా చదివించాలని కోరారు. సుజాత లాస్యను స్థానికంగా ఓ ప్రైవేటు పాఠశాలలో చేర్పించింది. అల్లారుముద్దుగా చూసుకుంటోంది. శుక్రవారం నుంచి స్కూల్‌కు సంక్రాంతి సెలవులు ఇచ్చారు. దీంతో లాస్య ఇంట్లోనే ఉంది. ప్రసూతి ఆసుపత్రిలో ఉన్న బంధువులను పరామర్శించేందుకు సుజాత బయలుదేరింది. తనతోపాటు లాస్యను కూడా రమ్మని చెప్పింది. తాను టీవీ చూస్తానని చెప్పడంతో టీవీ ఆన్‌చేసి, లాస్యను లోపల పెట్టి బయట తాళం వేసుకుని సుజాత ప్రసూతి ఆసుపత్రికి వెళ్లింది. ఇంతలో ఇంట్లో షార్టు సర్క్యూట్ కావడంతో లాస్య ఉన్న గదిలో పెద్ద ఎత్తున పొగలు కమ్ముకున్నాయి. మంటలు వ్యాపించాయి. దీంతో పాప దాదాపు గంటపాటు పొగ, మంటలకు ఉక్కిరిబిక్కిరై అరుపులు కేకలతో అల్లాడింది. చిన్నగది కావడం, తలుపులు వేసి ఉండటంతో లాస్య ఆర్తనాదాలు బయటికి వినిపించలేదు. సిలెండర్ లీకేజీ అనుకుని.. సుజాత ఇంటిలో నుంచి పొగలు, మంటలు రావడాన్ని గమనించిన స్థానికులు దగ్గరకు వెళ్లలేదు. ఇంట్లో సిలిండర్ లీకేజీతో మంటలు వ్యాపిస్తున్నాయని దగ్గరకు వెళితే ప్రమాదమని వారు భయపడ్డారు. పాప ఇంట్లో ఉన్న సంగతి వారికి తెలీదు. దాదాపు గంట తర్వాత పక్కనే ఉన్న బారులో నుంచి కొందరు వచ్చి ఇంటి తలుపులు పగుల కొట్టారు. అప్పటికే ఊపిరాడక స్పృహతప్పి పడిపోయిన లాస్యను వారు గమనించలేదు. ఇంట్లో కాలిపోయిన వస్తువులను మాత్రమే చూశారు. స్థానికులు ఈ విషయాన్ని సుజాతకు ఫోన్ ద్వారా తెలిపారు. ఆమె హుటాహుటిన ఇంటికి వచ్చింది. అప్పటికే తలుపులు తెరిచి ఉండటంతో బిడ్డ బ్రతికే ఉంటుందనుకుంది. ఇంటి వెలుపల పాప కనిపించకపోవడంతో లాస్య లోపల ఉందంటూ ఆర్తనాదాలు చేసింది. స్థానికులు లోపల పరిశీలించి స్పృహతప్పి పడివున్న లాస్యను బయటకు తీసుకువచ్చారు. కొన ఊపిరితో ఉన్న చిన్నారిని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తుండగానే తుది శ్వాస విడిచింది. అయినా మమకారం తీరని ఆమె అత్త ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే లాస్య చనిపోయిందని డాక్టర్లు చెప్పారు. బడి ఉన్నా... 5 నిమిషాలు ముందు గుర్తించినా... శుక్రవారం నుంచి సంక్రాంతి సెలవులు ఇవ్వడం వల్ల లాస్యను ఒక్కదాన్నే ఇంట్లో ఉంచాల్సి వచ్చిందని, బడి ఉన్నట్టయితే బిడ్డ బతికేదని సుజాత కన్నీరుమున్నీరుగా విలపించింది. తలుపులు పగులకొట్టిన వెంటనే బిడ్డను గుర్తించినా... ఐదు నిమిషాల ముందు తెలిసినా పాప ప్రాణం నిలిచేదని స్థానికులు, వైద్యులు తెలిపారు. దీనిపై వెస్టు సీఐ అంజుయాదవ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం మెడికల్ కళాశాలకు తరలించారు. -
ఇది పూర్తిగా వీళ్ల షో!
రవి, లాస్య... వీళ్లిద్దరిలో ఒకరి పేరు చెప్పగానే రెండో పేరు దానంతటదే నోటి నుంచి వచ్చేస్తుంది. అంతగా పాపులర్ అయిపోయారు ఈ జంట యాంకర్లు. అందుకే వీరిద్దరి ఇమేజ్‌నీ కలిపి వాడేసుకుంటున్నారు జీ తెలుగువారు. ‘మొండి మొగుడు - పెంకి పెళ్లాం’ అనే ఫ్యామిలీ షోకి రవి, లాస్యలు యాంకర్లు. ఈ కార్యక్రమానికి నిజంగా వీళ్లే పెద్ద ప్లస్. రవి అందమైన మాటలు, లాస్య అల్లరి చేష్టలు షోని రక్తి కట్టిస్తున్నాయి. దానికితోడు ప్రోగ్రామ్ కూడా బాగుంది. కొందరు దంపతుల మధ్య జరిగే గేమ్ షో ఇది. ఆడుతూ పాడుతూనే... తమ సంసారంలో దొర్లుతోన్న అపశృతులను చర్చించుకోవడం, తన మనసులో ఎప్పటి నుంచో దాచుకున్న విషయాలు ఈ వేదిక ద్వారా తమ భాగస్వామికి చెప్పుకోవడం వల్ల షోకి అందం రావడమే కాదు, వారి వ్యక్తిగత జీవితాల్లోని లోటుపాట్లను సరిదిద్దుకునే అవకాశమూ కలుగుతోంది! -
స్వీట్ ఫైట్.. ఇద్దరూ ఇద్దరే..
మీ .. రవి-లాస్య ఇద్దరూ ఇద్దరే.. టామ్ అండ్ జెర్రీ యాంకరింగ్ చేస్తే ఎలా ఉంటుందో తెలియాలంటే.. వీళ్ల ప్రోగ్రాం చూస్తే సరిపోతుంది. సెటైర్లతో షో రేటింగ్ పెంచేస్తారు. టైమింగ్‌తో వాళ ్లకు పనిలేదు. షో బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు పంచ్‌లు పేలుతూనే ఉంటాయి. సందు దొరికితే చాలు ఒకరికొకరు బిస్కెట్ వేస్తారు. బుల్లితెరపై పేలే ఈ మాటల ఫైట్.. వార్ రూమ్‌ను మన ముందుంచుతుంది. ఢీ అంటే ఢీ అంటూ.. సెపరేట్ కెమిస్ట్రీ ఫిక్స్ చేసిన యాంకర్లు రవి-లాస్య. వీళ్ల డిష్యుం ఢిష్యుం ఎలా మొదలైంది. ఎక్కడిదాకా వెళ్లిందో.. వాళ్ల మాటల్లోనే.. ఛీ నీతో షో చెయ్యను అని ఒకరు.. నీ ముఖం చూడాల్సి వస్తుందని ఇంకొకరు ఇలా తిట్టుకుంటూనే మా ఇద్దరి యాంకరింగ్ మొదలైంది. ఆ ఆగడాలు, జగడాలు.. షోలో కొత్తదనం నింపాయి. అలా ఇద్దరం ఫిక్సయ్యాం. ‘నేను పుట్టింది ముంబై. నాకు నాలుగేళ్లున ్నప్పుడు హైదరాబాద్ వచ్చాం. నర్సరీ టు బీటెక్ ఇక్కడే. నేను కొరియోగ్రాఫర్‌ని. ఒక పార్టీలో డ్యాన్స్ నేర్పిస్తుండగా.. ఒకావిడకు నా డ్యాన్స్ నచ్చి హీరో నాగార్జునకు పరిచయం చేసింది. సినిమాల్లోకి రావాలనుందని చెబితే, అందుకాయన ముందు ఇండస్ట్రీ గురించి తెలుసుకోమన్నారు. వీజేగా కూడా చెయ్యగలనని చెప్పాను. అలా మా టీవిలో ‘స్టార్ ఆన్ డిమాండ్’ షోతో యాంకర్‌గా మారాను..’ అని రవి తన ఎంట్రీ గురించి చెప్పాడు. ‘మాది కడప. స్కూలింగ్, కాలేజ్ అంతా తిరుపతిలోనే. ఎన్సీసీలో చురుకుగా ఉండేదాన్ని. ఫైరింగ్‌లో గోల్డ్ మెడల్ కూడా కొట్టాను. దానివల్లే హైదరాబాద్ సీబీఐటీలో బీటెక్ సీట్ వచ్చింది. మొదట్లో ఇబ్బందిపడ్డా.. ఫెయిల్ ట్రాక్ లేకుండా బీటెక్ పూర్తి చేశాను. నా ఫ్రెండ్ జెమిని టీవీ ఆడిషన్స్‌కు వెళ్తూ నన్ను తోడు తీసుకెళ్లింది. అక్కడ నన్ను కూడా ఆడిషన్స్ ఇమ్మన్నారు. ఏదో ఇచ్చేసి వచ్చేశాను. 10 రోజుల తర్వాత జెమిని నుంచి సెలెక్టయ్యానని కాల్ వచ్చింది. జెమినిలో శేఖర్‌తో కలసి ఫస్ట్ షో ‘అంకితం’ చేశాను..’ అని లాస్య తన యాంకరింగ్ కెరీర్ ఎలా మొదలైందో చెప్పుకొచ్చింది. అలా మొదలైంది.. ‘మా టీవీలో సమ్‌థింగ్ స్పెషల్ కు వీజేగా చేస్తూ హ్యాపీగా ఉంటున్న టైంలో ఈ పిల్ల పెద్ద ట్విస్ట్ ఇచ్చింది. అప్పుడు ఓంకార్ జీనియస్ మూవీ స్టార్టయింది. దాని కోసం ఓ నెల రోజులు లీవ్ పెట్టాను. ఆ టైంలో లాస్య వచ్చి షో లీడ్ చేసింది. ఏకై వచ్చి మేకవ్వడమంటే ఇదేనేమో. నెల రోజులు దాటినా నన్ను పిలవరే.. ఓ రోజు నేనే వెళ్లి.. టాలెంట్ వున్నా అబ్బాయిలను పట్టించుకోరా.. ఇలాగైతే నాగార్జున గారికి చెప్తానని గోల చేసే సరికి.. లాస్యకు నాకు ఆల్టర్నేటివ్ డేస్‌లో షో ఇచ్చారు.. శని,ఆదివారాల్లో ఇద్దరం కలసి యాంకరింగ్ చేసేవాళ్లం..’ అని సమ్‌థింగ్ స్పెషల్ గురించి చెప్పుకొచ్చాడు రవి. ‘వీకెండ్ షోస్ చేస్తున్నప్పుడు ఫస్ట్‌లో బాగా తిట్టుకునేవాళ్లం. వారంలో ఐదు రోజుల టీఆర్పీ ఒక ఎత్తు.. చివరి రెండు రోజల టీఆర్పీ ఇంకో ఎత్తు. ఇంకేముంది రోజూ ఇద్దరు కలసి చేయమని చెప్పారు. ఇద్దరం కలసి 550కి పైగా షోస్ చేశాం. మొదట్లో మా ఇద్దరి మధ్య సీరియస్ వార్ జరిగినా.. తర్వాత ఫ్రెండ్స్ అయిపోయాం. అయినా తిట్టుకోవడం మానలేదు. స్క్రీన్ మీదే కాదు, బయట కూడా మా మాటల యుద్ధం ఆగదు’ అని వార్ జోన్ విశేషాలు మనకందించింది లాస్య. నో ఇగో ప్రాబ్లమ్స్ ‘మా ఇద్దరి మధ్య ఈగో ప్రాబ్లమ్స్ లేవు. కాస్త ఎక్కువగానే డామినేట్ చేస్తుంటాడు. కానీ, నేను మాట్లాడలేనప్పుడు తను లీడ్ తీసుకుంటాడు. ఓవర్ అయితే.. బ్యాలెన్స్ చేద్దామని కాంప్రమైజ్ చేస్తాడు. తను డామినేట్ చేస్తున్నాడు అని కూర్చుంటే ఆగిపోతాం. అయినా వాడిచ్చే పంచ్‌లకు ఆన్సర్ ఇవ్వడం కన్నా.. సెలైంట్‌గా ఉండటమే బెటర్’ అని ఇద్దరి సక్సెస్ సీక్రెట్ రిలీవ్ చేసింది లాస్య. మేమేంటో నిరూపించుకోవాలి.. రవి బాగా తిట్టినా మంచి కేరింగ్ పర్సన్ అని లాస్య కితాబిస్తే.. మేం బెస్ట్ ఎనిమీస్ అని పంచ్ ఇస్తాడు రవి. లాస్యకు అసలు యాంకరింగే రాదంటూ గేలి చేస్తాడు. ‘లాస్య లేకపోతే రవి చేయలేడు.. రవి లేకపోతే లాస్యకు నోరు పెగలదు అని కూడా అంటుంటారు. ఆ ఒపీనియన్ బ్రేక్ చేయాలి. లాస్య లేకున్నా రవి.., రవి లేకపోయినా.. లాస్య అదరగొడతారని నిరూపించుకోవాలి. అందుకో సోలో షో చేయాలని ఉంద’ని ఇద్దరూ అభిప్రాయపడుతున్నారు. వెండితెర వైపు.. బుల్లితెర మీద తామేంటో నిరూపించుకున్న ఈ ఇద్దరూ.. సినిమాల్లోనూ కనిపించాలని కోరుకుంటున్నారు. ‘సింపుల్ లవ్‌స్టోరీ, చిన్న సినిమా అయినా చెయ్యాలని ఉంది. లేదా పవన్, మహేష్ సినిమాల్లో చిన్న క్యారెక్టర్అయినా చేస్తాను’ అని లాస్య తన ఇష్టాన్ని బయటపెడితే.. ‘ సినిమాల్లో హీరోగా చేయడమే తన లక్ష్యమ’ని ఫినిషింగ్ ఇచ్చాడు రవి. - ఓ మధు ఫొటోలు: రాజేష్ రెడ్డి -
రెండో రౌండ్లో లాస్య
ఏపీ స్టేట్ ర్యాంకింగ్ టెన్నిస్ సాక్షి, హైదరాబాద్: రామా టెన్నిస్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆస్టర్ మైండ్స్ ఏపీ స్టేట్ ర్యాంకింగ్ టోర్నీ బాలికల అండర్-14లో లాస్య, సంజన రెండో రౌండ్లోకి దూసుకెళ్లారు. ఆదివారం జరిగిన తొలి రౌండ్ పోటీల్లో లాస్య 6-1తో అవంతికా రెడ్డిపై, సంజన 6-3తో ఇష్కపై గెలిచారు. అండర్-12లో సంకీర్తి 6-1తో సుమనను ఓడించింది. బాలుర అండర్-12 తొలి రౌండ్లో అన్నె ఆకాష్ 6-4తో సాయిరాజ్‌పై నెగ్గాడు. బాలికల అండర్-14 ఫలితాలు: సాయి హర్షిత 6-0తో ఇష్కా అగర్వాల్‌పై; సృజన 6-3తో సావేరి రెడ్డిపై; తనూజ 6-0తో సుమనపై; సంకీర్తి 6-1తో గ్రీష్మసాయిపై గెలిచారు. బాలికల అండర్-12: భుమి శేఖర్ 6-5, 7-4తో యశ్వానిపై; సాయి హర్షిత 6-4తో అవంతికా రెడ్డిపై; స్టీషా బుడ్డల 6-5, 7-5తో ఇష్కా అగర్వాల్‌పై; సంజన 6-1తో వింధ్యపై; ప్రాంచీ పండా 6-3తో సృజనపై; వేద వర్షిత 6-2తో నేహాపై నెగ్గారు. బాలికల అండర్-10: భుమి శేఖర్ 6-1తో వర్ధిని రెడ్డిపై; అభయ 6-1తో మహిమపై; స్టీషా 6-3తో ప్రాంజలపై గెలుపొందారు. బాలుర అండర్-14: భాస్కర్ మోహన్ రాయ్ 6-5, 7-5తో అర్చిత్‌పై; శశి ప్రీతమ్ 6-0తో జయవంత్పై; శశాంక్ 6-1తో హరి హస్వంతపై గెలిచారు.