

బిగ్‌బాస్ బ్యూటీ గతేడాదికి ఘనంగా వీడ్కోలు పలికింది. 2024 డిసెంబర్‌లో ప్రియుడు యష్‌వీరగోనిని పెళ్లాడింది.

అప్పటినుంచి తన హల్దీ, మెహందీ, పెళ్లి, రిసెప్షన్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూనే ఉంది.

తాజాగా తను తొలిసారి చేస్తున్న సత్యనారాయణ వ్రతానికి సంబంధించిన వీడియో తన యూట్యూబ్ ఛానల్‌లో రిలీజ్ చేసింది.

ఇందులో వ్రతానికి ముందు నల్లపూసలు గుచ్చే కార్యక్రమాన్ని చూపించింది. తన తాళిబొట్టులో అష్టలక్ష్ములు ఉన్నారని చూపించింది.

యష్ పూసలు గుచ్చడం అయిపోగానే ఆమె మెడలో మరోసారి తాళి కట్టాడు.

తాళిని కళ్లకద్దుకున్న సోనియా తన అత్తామామల కాళ్లు మొక్కి వారి ఆశీర్వాదాలు తీసుకుంది.
















