satyanaraya swamy
-
తాళి కళ్లకద్దుకుని, అత్తామామల ఆశీర్వాదం తీసుకుని.. (ఫోటోలు)
-
రూ.1.50 కోట్లతో సత్యదేవునికి వజ్రకిరీటం
అన్నవరం(తూర్పుగోదావరి): అన్నవరంలోని శ్రీ సత్యదేవుడు త్వరలో వజ్రకిరీటంతో భక్తులకు దర్శనమివ్వనున్నాడు. పెద్దాపురంలోని శ్రీలలితా రైస్ ఇండస్ట్రీ డైరెక్టర్లలో ఒకరైన మట్టే సత్యప్రసాద్ రూ.1.5 కోట్లతో వజ్రకిరీటం చేయించి అందజేసేందుకు ముందుకువచ్చారు. దేవస్థానం చైర్మన్ రోహిత్, ఈవో త్రినాథరావు శనివారం ఈ విషయాన్ని తెలిపారు. చదవండి: పథకమా.. పన్నాగమా.. అచ్చెన్నాయుడు మాస్టర్ ప్లాన్? సత్యప్రసాద్ దంపతులు ఇప్పటికే రూ.5.5 కోట్లతో స్వామివారి ప్రసాద భవనాన్ని, రూ.35 లక్షలతో సహస్రదీపాలంకార సేవకు మండపాన్ని నిర్మించారు. స్వామివారి పంచహారతుల సేవకు వెండి దీపాలను అందజేశారు. స్వామివారి నిత్య కల్యాణమండపాన్ని ఏసీ చేయించడంతో బాటు స్వామివారికి నిత్యం నివేదనకు బియ్యాన్ని అందజేస్తున్నారని ఈవో తెలిపారు. వజ్రకిరీటం చేయించే అవకాశం కలగడం తమకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నామని సత్యప్రసాద్ తెలిపారు. -
కన్నుల పండువగా గురుపౌర్ణమి వేడుకలు
పోటెత్తిన భక్తజనం అభిషేకాలు, సత్యనారాయణ స్వామి వ్రతాలు, అన్నదానం సిద్దిపేట టౌన్: పట్టణంలోని షిరిడీ సాయి మందిరంలో శనివారం గురుపౌర్ణమి వేడుకలు కన్నుల పండువగా సాగాయి. వేకువజామున బాబాను ప్రత్యేకంగా అలంకరించారు. ఉదయం హారతి, క్షీరాభిషేకం నిర్వహించారు. అనంతరం వర్షాల కోసం జలాభిషేకం చేశారు. దంపతులు సత్యనారాయణ స్వామి వ్రతాలు ఆచరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం సందడిగా కనిపించింది. భక్తులకు బాబా ప్రసాదాన్ని అందజేశారు. గంటల తరబడి క్యూలో నిలుచొని స్వామిని దర్శించుకున్నారు. వేలాది మందికి అన్నదానం చేశారు. ఉదయం నుంచి రాత్రి వరకు మందిరం భక్తులతో కిటకిటలాడింది. భక్తిశ్రద్ధలతో శతకోటి సాయినామ మహాయజ్ఞం నిర్వహించారు.కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కొండ కృష్ణమూర్తి, అధ్యక్షుడు గందె శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు తిరుపతిరెడ్డి, కార్యదర్శి టీ నర్సయ్య, సహాయ కార్యదర్శి రాజమౌళి, కోశాధికారి నల్ల శివానందం తోపాటు పట్టణ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.