
సత్యదేవునికి తయారు చేయించే వజ్రకిరీటం నమూనా
అన్నవరం(తూర్పుగోదావరి): అన్నవరంలోని శ్రీ సత్యదేవుడు త్వరలో వజ్రకిరీటంతో భక్తులకు దర్శనమివ్వనున్నాడు. పెద్దాపురంలోని శ్రీలలితా రైస్ ఇండస్ట్రీ డైరెక్టర్లలో ఒకరైన మట్టే సత్యప్రసాద్ రూ.1.5 కోట్లతో వజ్రకిరీటం చేయించి అందజేసేందుకు ముందుకువచ్చారు. దేవస్థానం చైర్మన్ రోహిత్, ఈవో త్రినాథరావు శనివారం ఈ విషయాన్ని తెలిపారు.
చదవండి: పథకమా.. పన్నాగమా.. అచ్చెన్నాయుడు మాస్టర్ ప్లాన్?
సత్యప్రసాద్ దంపతులు ఇప్పటికే రూ.5.5 కోట్లతో స్వామివారి ప్రసాద భవనాన్ని, రూ.35 లక్షలతో సహస్రదీపాలంకార సేవకు మండపాన్ని నిర్మించారు. స్వామివారి పంచహారతుల సేవకు వెండి దీపాలను అందజేశారు. స్వామివారి నిత్య కల్యాణమండపాన్ని ఏసీ చేయించడంతో బాటు స్వామివారికి నిత్యం నివేదనకు బియ్యాన్ని అందజేస్తున్నారని ఈవో తెలిపారు. వజ్రకిరీటం చేయించే అవకాశం కలగడం తమకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నామని సత్యప్రసాద్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment