satyadeva temple
-
రూ.1.50 కోట్లతో సత్యదేవునికి వజ్రకిరీటం
అన్నవరం(తూర్పుగోదావరి): అన్నవరంలోని శ్రీ సత్యదేవుడు త్వరలో వజ్రకిరీటంతో భక్తులకు దర్శనమివ్వనున్నాడు. పెద్దాపురంలోని శ్రీలలితా రైస్ ఇండస్ట్రీ డైరెక్టర్లలో ఒకరైన మట్టే సత్యప్రసాద్ రూ.1.5 కోట్లతో వజ్రకిరీటం చేయించి అందజేసేందుకు ముందుకువచ్చారు. దేవస్థానం చైర్మన్ రోహిత్, ఈవో త్రినాథరావు శనివారం ఈ విషయాన్ని తెలిపారు. చదవండి: పథకమా.. పన్నాగమా.. అచ్చెన్నాయుడు మాస్టర్ ప్లాన్? సత్యప్రసాద్ దంపతులు ఇప్పటికే రూ.5.5 కోట్లతో స్వామివారి ప్రసాద భవనాన్ని, రూ.35 లక్షలతో సహస్రదీపాలంకార సేవకు మండపాన్ని నిర్మించారు. స్వామివారి పంచహారతుల సేవకు వెండి దీపాలను అందజేశారు. స్వామివారి నిత్య కల్యాణమండపాన్ని ఏసీ చేయించడంతో బాటు స్వామివారికి నిత్యం నివేదనకు బియ్యాన్ని అందజేస్తున్నారని ఈవో తెలిపారు. వజ్రకిరీటం చేయించే అవకాశం కలగడం తమకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నామని సత్యప్రసాద్ తెలిపారు. -
సత్యదేవుని ఆవిర్భావ వేడుకలకు అంకురార్పణ
సాక్షి, అన్నవరం (తూర్పుగోదావరి) : రత్నగిరివాసుడు శ్రీ సత్యదేవుని 129వ ఆవిర్భావ దినోత్సవాన్ని గురువారం వైభవంగా ప్రారంభించారు. ఉదయం 9.15 గంటలకు గణపతి పూజ, పుణ్యాహవచనం, పారాయణ తదితర కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. 125 మంది రుత్విక్కులు, ఆలయ వైదిక సిబ్బందికి దీక్షావస్త్రాలను దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ ఎం.సురేష్ బాబు, ఏసీ డీఎల్వీ రమేష్‌బాబు అందజేశారు. సాయంత్రం దర్భారు మంటపంలో కలశ స్థాపన, మంటపారాధన చేశారు. అనంతరం స్వామి, అమ్మవార్లకు నీరాజన మంత్ర పుష్పాలతో సేవ చేశారు. దేవస్థానం వేద పండితులు కపిలవాయి రామశాస్త్రి, ముష్టి కామశాస్త్రి, గొల్లపల్లి ఘనపాఠీ, ప్రధానార్చకుడు కొండవీటి సత్యనారాయణ, స్పెషల్ గ్రేడ్ వ్రత పురోహితులు నాగాభట్ల కామేశ్వర శర్మ, ముత్య సత్యనారాయణ, ఛామర్తి కన్నబాబు, రవిశర్మ, అంగర సతీష్, పాలంకి పట్టాభి తదితరులు పూజాదికాలు నిర్వహించారు. దేవస్థానం ఏసీ రమేష్‌బాబు, ఏఈఓ ఎంకేటీఎన్వీ ప్రసాద్ ఏర్పాట్లను పర్యవేక్షించారు, నేడు ఆవిర్భావ వేడుక సత్యదేవుని ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా శుక్రవారం తెల్లవారుజామున నాలుగు గంటలకు స్వామి, అమ్మవార్ల మూలవిరాట్లకు మహాన్యాసపూర్వక అభిషేకం, పట్టువస్తాలు, స్వర్ణాభరణాలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేస్తారు. ఎనిమిది గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. అనంతరం స్వామివారి విశేష పూజలు, హోమం నిర్వహిస్తారు. ఫల పుష్పసేవకు ఏర్పాట్లు రాత్రి 7.30 గంటలకు శ్రీ స్వామివారి నిత్యకల్యాణ మంటపంలో సత్యదేవుడు, అమ్మవార్లకు ఫల పుష్పసేవకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. 20 రకాల ఫలాలు, 30 రకాల పుష్పాలతో మంటపాన్ని ముస్తాబు చేస్తున్నారు. తాపేశ్వరంలోని సురుచి ఫుడ్స్ అధినేత పోలిశెట్టి మల్లిబాబు అందజేసే మహాలడ్డూను స్వామివారికి నివేదన చేస్తారు. తాపేశ్వరం లడ్డూ నేడు అన్నవరం తరలింపు తాపేశ్వరం (మండపేట): అన్నవరం సత్యదేవుని జన్మ దినోత్సవాల సందర్భంగా స్వామివారికి తాపేశ్వరంలోని మడత కాజా మాతృ సంస్థ సురుచి ఫుడ్స్ 500 కిలోల లడ్డూ తయారీ ప్రారంభమైంది. ప్రత్యేక పూజలు అనంతరం గురువారం సంస్థ అధినేత పోలిశెట్టి మల్లిబాబు లడ్డూ తయారీని ప్రారంభించారు. అర టన్ను బరువుతో ఈ లడ్డూ తయారీకి 220 కిలోల పంచదార, 130 కేజీల శనగపిండి, 110 కేజీల ఆవు నెయ్యి, 23 కేజీల జీడిపప్పు, ఆరు కేజీల బాదం పప్పు, రెండు కేజీల యాలికలు, అర కేజీ పచ్చకర్పూరం వినియోగి స్తున్నట్టు ఆయన తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం ప్రత్యేక వాహనంలో ఈ లడ్డూను అన్నవరం సత్యదేవుని సన్నిధికి తరలిస్తామని తెలిపారు. -
కోవెలలకు ఎల్ఈడీ కాంతులు
తక్కువ ఖర్చుతో అమరుస్తున్న ‘ఫార్చ్యూ¯ŒS’ l ఇప్పటికే తిరుమల సహా పలు ఆలయాల్లో ఏర్పాటు త్వరలోనే అన్నవరంలో.. అన్నవరం : ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ హిందూ దేవాలయాలకు రంగు రంగుల ఎల్ఈడీ విద్యుత్ దీపాలను తక్కువ ఖర్చుతో అమర్చుతూ శోభాయమానంగా తీర్చి దిద్దుతోంది హైదరాబాద్‌కు చెందిన ‘ఫార్చ్యూ¯ŒS ఆర్ట్ ఎల్ఈడీ లైటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ’ సంస్థ. ఇప్పటికే తిరుమల తిరుపతి సహా పలు ప్రముఖ దేవస్థానాలలో ఎల్ఈడీ దీపాలను ఏర్పాటు చేసి ఆలయ ప్రముఖులు భక్తుల ప్రశంసలు పొందిన ఫార్చ్యూ¯ŒS త్వరలోనే అన్నవరం దేవస్థానంలో కూడా ఏర్పాటు చేసి రత్నగిరి, సత్యగిరిలకు కొత్త వన్నెలద్దేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ‘ఫార్చ్యూ¯ŒS’ సీఎండీ అరవింద్ శ్రీమల్ శనివారం ‘సాక్షి’తో మాట్లాడుతూ 35 ఏళ్లు లైటింగ్ వ్యాపారంలో ఉన్న తాము దేశంలోనే తొలిసారిగా ఎల్ఈడీ లైట్లను తయారుచేసే ప్లాంట్ హైదరాబాద్‌లో ఏర్పాటు చేశామని, అక్కడ తయారయ్యే దీపాలను లాభం ఆశించకుండా తయారీ ఖర్చుతోనే దేవాలయాలలో ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. విజయనగరంలోని శ్రీ రామనారాయణ ఆలయానికి చేసిన ఎల్ఈడీ విద్యుత్ అలంకరణ తమకు మంచి పేరు తెచ్చిందన్నారు. రాత్రి వేళల్లో ఆ ఆలయం భూలోకస్వర్గంలా దర్శనమిచ్చేలా రంగు రంగుల విద్యుల్లతలు, ఫౌంటె¯ŒSలకు, వివిధ దేవతా విగ్రహాలకు చేసిన అలంకరణ ప్రముఖుల ప్రశంసలు తెచ్చిపెట్టిందన్నారు. విజయనగరంలోని శ్రీ అష్టలక్ష్మీ, శ్రీ వాసవి కన్యకాపర మేశ్వరి ఆలయాలకు శ్రీ చినజీయర్ స్వామి ఆశ్రమానికి చేసిన విద్యుత్ అలంకరణ కూడా పేరు తెచ్చిందని చెప్పారు. హైదరాబాద్‌లో శ్రీ చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో రూ.500 కోట్ల వ్యయంతో రూపుదిద్దుకుంటున్న శ్రీరామానుజ సహస్రాబ్ది ప్రాజెక్ట్‌కు కూడా ఎల్ఈడీ విద్యుత్ అలంకరణ చేసే అవకాశం తమకే దక్కిందన్నారు. అన్నవరం దేవస్థానాన్ని కూడా ఎల్ఈడీ దీపాలతో శోభాయమానంగా తీర్చిదిద్దుతామని వివరించారు. రాత్రి వేళల్లో హైవేపై, రైళ్లలో ప్రయాణించే వారికి,భక్తులకు ఈ అలంకరణ కన్నుల పండువ గావిస్తుందని తెలిపా రు. ఇప్పటికే రూ. 30 లక్షలతో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశామన్నారు. -
సత్యదేవుని ఆలయం.. భక్తజనసంద్రం..
అన్నవరం : మరో రెండు రోజుల్లో కార్తిక మాసం ముగియనుండడంతో.. రత్నగిరిపై సత్యదేవుని సన్నిధికి ఆదివారం భక్తులు పోటెత్తారు. సెలవు దినం కావడంతో ఉదయం నుంచీ స్వామివారిని దర్శించడానికి క్యూ కట్టారు. తెల్లవారుజాము నుంచే ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. దీంతో అధికారులు తెల్లవారుజామున మూడు గంటల నుంచే స్వామివారి వ్రతాలను, దర్శనాలను ప్రారంభించారు. అప్పటి నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ రద్దీ కొనసాగుతూనే ఉంది. స్వామివారి సాధారణ దర్శనానికి గంటన్నర, ప్రత్యేక దర్శనానికి గంట సమయం పట్టింది. సుమారు 5 వేల వాహనాల్లో దాదాపు 70 వేలమంది భక్తులు తరలివచ్చారు. పార్కింగ్ ప్రదేశాలు చాలకపోవడంతో ఘాట్‌రోడ్ పక్కన వాహనాలను నిలిపివేశారు. దీంతో పలుమార్లు వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. ఉదయం పది గంటల తరువాత వచ్చిన వాహనాలను సత్యగిరి మీదకు పంపించారు. ఈఓ కె.నాగేశ్వరరావు ద్విచక్రవాహనంపై స్వయంగా తిరుగుతూ ట్రాఫిక్‌ను చక్కదిద్దారు. ఆదివారం ఒక్కరోజే 6,998 వ్రతాలు జరిగాయి. కల్యాణాలు 49 నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.65 లక్షల ఆదాయం సమకూరింది. భక్తుల రద్దీ కారణంగా వ్రత మండపాలు సరిపోలేదు. దీంతో స్వామివారి నిత్యకల్యాణ మండపంలో రూ.300 వ్రతాలను ఉదయం పది గంటల వరకూ నిర్వహించారు. అనంతరం స్వామివారి నిత్య కల్యాణం జరిపారు. ఆదివారంతో కలిపి కార్తిక మాసంలో మొత్తం 1,10,379 వ్రతాలు జరిగినట్లు అధికారులు తెలిపారు. సోమ, మంగళవారాల్లో మరో 10 వేల వ్రతాలు జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. గత ఏడాది కార్తికంలో మొత్తం జరిగిన వ్రతాలు 1,10,248 మాత్రమే. దీంతో పోలిస్తే ఈ ఏడాది ఇప్పటికే మరో 131 వ్రతాలు అధికంగా జరిగాయి.