- తక్కువ ఖర్చుతో అమరుస్తున్న ‘ఫార్చ్యూ¯ŒS’ l
- ఇప్పటికే తిరుమల సహా పలు ఆలయాల్లో ఏర్పాటు
- త్వరలోనే అన్నవరంలో..
కోవెలలకు ఎల్‌ఈడీ కాంతులు
Published Sun, Apr 2 2017 12:07 AM | Last Updated on Tue, Sep 5 2017 7:41 AM
అన్నవరం :
ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ హిందూ దేవాలయాలకు రంగు రంగుల ఎల్‌ఈడీ విద్యుత్ దీపాలను తక్కువ ఖర్చుతో అమర్చుతూ శోభాయమానంగా తీర్చి దిద్దుతోంది హైదరాబాద్‌కు చెందిన ‘ఫార్చ్యూ¯ŒS ఆర్ట్ ఎల్‌ఈడీ లైటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ’ సంస్థ. ఇప్పటికే తిరుమల తిరుపతి సహా పలు ప్రముఖ దేవస్థానాలలో ఎల్‌ఈడీ దీపాలను ఏర్పాటు చేసి ఆలయ ప్రముఖులు భక్తుల ప్రశంసలు పొందిన ఫార్చ్యూ¯ŒS త్వరలోనే అన్నవరం దేవస్థానంలో కూడా ఏర్పాటు చేసి రత్నగిరి, సత్యగిరిలకు కొత్త వన్నెలద్దేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది.
ఈ నేపథ్యంలో ‘ఫార్చ్యూ¯ŒS’ సీఎండీ అరవింద్ శ్రీమల్ శనివారం ‘సాక్షి’తో మాట్లాడుతూ 35 ఏళ్లు లైటింగ్ వ్యాపారంలో ఉన్న తాము దేశంలోనే తొలిసారిగా ఎల్‌ఈడీ లైట్లను తయారుచేసే ప్లాంట్ హైదరాబాద్‌లో ఏర్పాటు చేశామని, అక్కడ తయారయ్యే దీపాలను లాభం ఆశించకుండా తయారీ ఖర్చుతోనే దేవాలయాలలో ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. విజయనగరంలోని శ్రీ రామనారాయణ ఆలయానికి చేసిన ఎల్‌ఈడీ విద్యుత్ అలంకరణ తమకు మంచి పేరు తెచ్చిందన్నారు. రాత్రి వేళల్లో ఆ ఆలయం భూలోకస్వర్గంలా దర్శనమిచ్చేలా రంగు రంగుల విద్యుల్లతలు, ఫౌంటె¯ŒSలకు, వివిధ దేవతా విగ్రహాలకు చేసిన అలంకరణ ప్రముఖుల ప్రశంసలు తెచ్చిపెట్టిందన్నారు. విజయనగరంలోని శ్రీ అష్టలక్ష్మీ, శ్రీ వాసవి కన్యకాపర మేశ్వరి ఆలయాలకు శ్రీ చినజీయర్ స్వామి ఆశ్రమానికి చేసిన విద్యుత్ అలంకరణ కూడా పేరు తెచ్చిందని చెప్పారు. హైదరాబాద్‌లో శ్రీ చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో రూ.500 కోట్ల వ్యయంతో రూపుదిద్దుకుంటున్న శ్రీరామానుజ సహస్రాబ్ది ప్రాజెక్ట్‌కు కూడా ఎల్‌ఈడీ విద్యుత్ అలంకరణ చేసే అవకాశం తమకే దక్కిందన్నారు. అన్నవరం దేవస్థానాన్ని కూడా ఎల్‌ఈడీ దీపాలతో శోభాయమానంగా తీర్చిదిద్దుతామని వివరించారు. రాత్రి వేళల్లో హైవేపై, రైళ్లలో ప్రయాణించే వారికి,భక్తులకు ఈ అలంకరణ కన్నుల పండువ గావిస్తుందని తెలిపా రు. ఇప్పటికే రూ. 30 లక్షలతో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశామన్నారు.
Advertisement