Diamond crown
-
సత్యదేవుని దేవేరికి నేడు వజ్ర కిరీట సమర్పణ
అన్నవరం: కాకినాడ జిల్లా అన్నవరం శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివారి 134వ ఆవిర్భావ దినోత్సవాలు (జయంత్యుత్సవాలు) సోమవారం ఘనంగా ప్రారంభం కానున్నాయి. దీన్ని పురస్కరించుకుని సత్యదేవుని దేవేరి అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారికి పెద్దాపురానికి చెందిన శ్రీ లలితా రైస్ ఇండస్ట్రీ అధినేతల్లో ఒకరైన మట్టే సత్యప్రసాద్ దంపతులు వజ్ర కిరీటం సమర్పించనున్నారు. సోమవారం మ«ధ్యాహ్నం స్వామివారి ప్రధాన ఆలయంలో రూ.1.50 కోట్ల విలువైన ఈ వజ్రకిరీటాన్ని అందజేయనున్నట్లు సత్యప్రసాద్ తెలిపారు. ఈ కిరీటంతో పాటు స్వామి, అమ్మవార్లకు రూ.50 లక్షలతో చేయించిన వజ్ర కర్ణాభరణాలు కూడా అందజేయనున్నట్లు చెప్పారు. కాగా, ఇకపై ప్రతి రోజూ స్వామి, అమ్మవార్లు ఈ వజ్రకిరీటాలు, వజ్ర కర్ణాభరణాలు ధరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు. -
రూ.1.50 కోట్లతో సత్యదేవునికి వజ్రకిరీటం
అన్నవరం(తూర్పుగోదావరి): అన్నవరంలోని శ్రీ సత్యదేవుడు త్వరలో వజ్రకిరీటంతో భక్తులకు దర్శనమివ్వనున్నాడు. పెద్దాపురంలోని శ్రీలలితా రైస్ ఇండస్ట్రీ డైరెక్టర్లలో ఒకరైన మట్టే సత్యప్రసాద్ రూ.1.5 కోట్లతో వజ్రకిరీటం చేయించి అందజేసేందుకు ముందుకువచ్చారు. దేవస్థానం చైర్మన్ రోహిత్, ఈవో త్రినాథరావు శనివారం ఈ విషయాన్ని తెలిపారు. చదవండి: పథకమా.. పన్నాగమా.. అచ్చెన్నాయుడు మాస్టర్ ప్లాన్? సత్యప్రసాద్ దంపతులు ఇప్పటికే రూ.5.5 కోట్లతో స్వామివారి ప్రసాద భవనాన్ని, రూ.35 లక్షలతో సహస్రదీపాలంకార సేవకు మండపాన్ని నిర్మించారు. స్వామివారి పంచహారతుల సేవకు వెండి దీపాలను అందజేశారు. స్వామివారి నిత్య కల్యాణమండపాన్ని ఏసీ చేయించడంతో బాటు స్వామివారికి నిత్యం నివేదనకు బియ్యాన్ని అందజేస్తున్నారని ఈవో తెలిపారు. వజ్రకిరీటం చేయించే అవకాశం కలగడం తమకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నామని సత్యప్రసాద్ తెలిపారు. -
అడుగడుగునా ఆటంకాలే...
మళ్లీ వెనక్కి మళ్లిన తిరుపతమ్మ వజ్రకిరీటం నాణ్యతపై జెమాలజిస్టు అసంతృప్తి పదిరోజుల్లో సరిచేసి ఇస్తామన్న తయారీదారులు పెనుగంచిప్రోలు : స్థానిక తిరుపతమ్మ ఆలయంలోని అమ్మవారి ప్రతిమకు అలంకరించేందుకు తీసుకొచ్చిన వజ్రకిరీటం మళ్లీ వెనక్కు వెళ్లింది. కిరీటంలో పొదిగిన వజ్రాలు ఊడిపోవడం, అవి నాణ్యమైనవేనని నిర్ధారించకపోవడంతో జెమాలజిస్టు అభ్యంతరం వ్యక్తంచేశారు. దీంతో తయారీదారులు మార్పులు చేసేందుకు మరోసారి వెనక్కు తీసుకెళ్లారు. ఈ కిరీటాన్ని అమ్మవారికి అలంకరించేందుకు జరుగుతున్న జాప్యంపై భక్తులు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. కిరీటాన్ని తయారు చేసిన విజయవాడ చందన జ్యూలర్స్ ప్రతినిధులు దానిని మంగళవారం ఆలయానికి తీసుకొచ్చారు. గతంలోలానే ఈ సారి కూడా వజ్రాలు కొన్ని నాణ్యమైనవి కావని, వాటిని సరిగా పొదగలేదని కిరీటాన్ని పరిశీలించిన జెమాలజిస్ట్ అరవింద్ తెలిపారు. దీంతో కిరీటాన్ని తిరిగి తయారీదారులు తీసుకు వెళ్లిపోయారు. అనేక అవరోధాల మధ్య అమ్మవారి వజ్రకిరీటం తయారీకి గతంలో పని చేసిన ఆలయ ఈవో చంద్రశేఖర్ ఆజాద్, పాలకవర్గం నిర్ణయం తీసుకున్నారు. తయారీ పనులను విజయవాడ చందన జ్యూయలర్స్‌కు అప్పగించగా ఆ సంస్థ నిర్వాహకులు ముంబాయిలో కిరీటాన్ని తయారు చేయించారు. దీనికి సుమారు రూ.1.70 కోట్ల ఖర్చయింది. ఆజాద్ హయాంలోనే పూర్తికాని కిరీటాన్ని తీసుకొచ్చి, అమ్మవారికి అలంకరించిన అనంతరం చందన జ్యూయలర్స్ ప్రతినిధులు వెనక్కు తీసుకెళ్లిపోయారు. అనంతరం ఈవో విజయ్‌కుమార్ ఆ కిరీటాన్ని పూర్తి చేయించారు. అయితే గతంలో ఒకసారి జెమాలజిస్టు కొన్ని విషయాల్లో అసంతృప్తి వ్యక్తం చేయడంతో కిరీటం తయారీదారులు తీసుకెళ్లిపోయారు. దీనికి సంబంధించి దేవాదాయశాఖ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ప్రస్తుత ఆలయ ఈవో చందు హనుమంతరావు, దేవాదాయశాఖ ఏసీ దుర్గాప్రసాద్, జేవీవో ఎస్వి.ఎస్.ప్రసాద్ ఈ కమిటీలో ఉన్నారు. వీరి సమక్షంలో మంగళవారం రెండోసారి ఆలయానికి వచ్చిన కిరీటాన్ని జెమాలజిస్ట్‌లు పరిశీలించి, గతంలోలానే పొదిగిన చిన్న వజ్రాలు ఊడిపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గతంలో చెప్పిన మార్పులు పూర్తిగా చేపట్టలేదని, వజ్రాలు సహజసిద్ధమైనవని సర్టిఫికెట్లో ఎక్కడా పేర్కొనలేదని తెలిపారు. కిరీటంపై వజ్రాల ఫిటింగ్ విషయంలో గట్టి జిగురు పదార్థం వాడకపోవడంతో ఊడిపోతున్నాయని, ఈ సారి వాటి చుట్టూ బంగారంతో నింపాలని సూచించామని పేర్కొన్నారు. చందన జ్యూయలర్స్ ప్రతిని ధులు మాట్లాడుతూ జెమాలజిస్టు చెప్పిన మార్పులుచేసి పది రోజుల్లో కిరీటాన్ని అప్పగిస్తామన్నారు. ఈవో మాట్లాడుతూ ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారమే కిరీటాన్ని తయారు చేయాలని చందన జ్యూయలర్స్ కోరామని తెలిపారు. ఆలయ చైర్మన్ వాసిరెడ్డి బెనర్జీ, ఏఈవోలు సీహెచ్.ప్రసాద్, మేడా గోపాలరావు, ఈఈ వైకుంఠరావు, ఎస్ఐ నాగప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
వజ్ర కిరీటంపై సమగ్ర విచారణ
సాక్షి ప్రతినిధి, ఏలూరు : అవినీతి ఆరోపణలు రుజువైతే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని, విధుల నుంచి తొలగిస్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు హెచ్చరించారు. శుక్రవారం ఏలూరులో తనను కలిసిన విలేకరులతో మంత్రి మాట్లాడారు. నగరంలోని ఆర్ఆర్ పేట వేంకటేశ్వరస్వామి ఆలయంలో వజ్రాల కిరీటం వ్యవహారం, మేనేజర్‌గా పనిచేసిన తల్లాప్రగడ విశ్వేశ్వరరావుపై వెల్లువెత్తుతున్న ఆరోపణల నేపథ్యంలో ‘సాక్షి’లో ప్రచురితమైన వరుస కథనాలపై మంత్రి స్పందించారు. ఈవో వ్యవహార శైలిపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించినట్టు మంత్రి తెలిపారు. ఆరోపణలు వాస్తవాలేనని నిగ్గుతేలితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే ఆయన పనితీరుపై తనకు పలుమార్లు ఫిర్యాదులు అందాయని, అవినీతి ఆరోపణలతోపాటు వ్యక్తిగత వ్యవహార శైలిపైనా విమర్శలు రావడంతో వెంటనే బదిలీ చేశామని చెప్పారు. శాఖాపరమైన విచారణను ఈ రీజియన్ అధికారులు చేపడితే అతను కొంత ప్రభావం చూపించే అవకాశం ఉందన్నారు. ఈ దృష్ట్యా ఇతర జిల్లాల అధికారులతో ఓ కమిటీ ఏర్పాటు చేసి విచారణ జరిపిస్తామని చెప్పారు. -
వెంకన్నకు శఠగోపం
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఏలూరు నగరం ఆర్ఆర్ పేట ఆలయంలో కొలువైన శ్రీ వేంకటేశ్వరస్వామికి వజ్ర కిరీటం పేరిట ఓ అధికారి లక్షలాది రూపాయలు దండుకున్నా దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు ఏమీ తెలియనట్టే నిద్ర నటిస్తున్నారు. నిలువెత్తు స్వామికి వజ్రాలు పొదిగిన బంగారు కిరీటాన్ని బహూకరించి కనులారా వీక్షిద్దామన్న ఉద్దేశంతో భక్తులు కానుకల రూపంలో ఇచ్చిన సొమ్ములను దిగమింగేసిన సదరు అధికారిని బదిలీ చేసి చేతులు దులిపేసుకున్నారు. ఏడెనిమిదేళ్ల కిందట శ్రీ వేంకటేశ్వరస్వామి వారి విగ్రహాన్ని బంగారు కిరీటంతో అలంకరించాలని భక్తులు, నగర ప్రముఖులు భావించారు. అందుకు అప్పటి దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల నుంచి అనుమతి తీసుకున్నారు. ధర్మకర్తలు, భక్తులు, ప్రముఖులు విరాళాల రూపంలో నగదు సేకరించాలని నిర్ణయించారు. భక్తుల కొంగు బంగారంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలోని వెంకన్నకు విరాళాలు వెల్లువలా వచ్చాయి. అతి తక్కువ వ్యవధిలోనే దాదాపు రూ.30 లక్షల వరకు సొమ్ము రావడంతో విజయవాడ వెళ్లి మింట్ ద్వారా 1.200 కేజీల బంగారాన్ని బిస్కెట్ల రూపంలో కొనుగోలు చేశారు. ఈ బిస్కెట్లతోపాటు మిగిలిన లక్షలాది రూపాయల నగదును ఏలూరులో ఆంధ్రాబ్యాం కులో డిపాజిట్ చేశారు. ఆ తర్వాత కిరీటం పనులకు ఎన్నిసార్లు టెండర్లు పిలిచినా ఎవరూ ముందుకు రాలేదు. కిరీటాన్ని చేయించే బాధ్యత తీసుకోవాలంటూ తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కు ఇక్కడి అధికారులు పలుమార్లు లేఖలు రాసినా స్పందనా రాలేదు. ఇలా ఐదేళ్ల పుణ్యకాలం గడిచిపోయింది. బంగారంపై కన్ను ఈ నేపథ్యంలోనే దేవాలయ మేనేజర్‌గా వచ్చిన తల్లాప్రగడ విశ్వేశ్వరరావు కన్ను బ్యాంకులో మూలుగుతున్న నోట్ల కట్టలు, బంగారు బిస్కెట్లపై పడింది. ఇక్కడి నుంచే అసలు కథ మొదలైంది. వాస్తవానికి దేవాదాయ శాఖ రీజినల్ జారుుంట్ డెరైక్టర్, డెప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్, ఆభరణాల తనిఖీ అధికారి, నగర ప్రముఖులతో ఓ కమిటీ ఏర్పాటైంది. కిరీటం తయూరు చేరుుంచే పనులకు సంబంధిం చిన ప్రతిపాదనలు పంపాలని ఉన్నతాధికారులు మేనేజర్ విశ్వేశ్వరరావుకు సూచించారు. ఆయన ఇవేమీ పట్టించుకోకుండా, ఎవరి అనుమతులు తీసుకోకుండా నిబంధనలను పక్కనపెట్టి యుద్ధప్రాతిపదికన కిరీటం తయూరీ పనులు మొదలుపెట్టేశారు. భీమవరం మావుళ్లమ్మకు నగలు తయారు చేసే ఓ స్వర్ణకారుడికి ఈ కిరీటం తయారీ బాధ్యతను అప్పగించారు. బిస్కెట్లను కరిగించగా వచ్చిన దాంట్లో 200 గ్రాముల బంగారాన్ని తనకు ఇవ్వాల్సిందిగా సదరు అధికారి స్వర్ణకారుడిని కోరినట్టు తెలుస్తోంది. అరుుతే, ఆ స్వర్ణకారుడు ‘దయచేసి ఇలాంటి పనులు చేయమని అడగొద్దు. దేవుడి సొమ్ము ముట్టుకోవాలంటే మాకు భయం’ అని కుండబద్దలుకొట్టినట్టు చెప్పడంతో అక్కడికి సరిపెట్టేసిన అధికారి లెక్కాపత్రం లేని నగదుపై పడ్డాడు. కిరీటానికి అవసరమైన వజ్రాల కొనుగోలు పేరిట బ్యాంకులోని మొత్తం నగదును డ్రా చేసి ఇష్టారాజ్యంగా ఖర్చుచేశారన్న ఆరోపణలను మూటకట్టుకున్నాడు. వజ్రాల కొనుగోళ్లలో దాదాపు సగం డబ్బు చేతులు మారినట్టు తెలుస్తోంది. ఈ వజ్రాలు కూడా నాణ్యమైనవి కాదని సమాచారం. అమెరికన్ డైమండ్లను పొదిగేశారన్న ఆరోపణలు వచ్చాయి. ఆనోటా ఈనోటా కిరీటం పనులపై పలురకాల వ్యాఖ్యలు, శాస్త్ర విరుద్ధంగా కిరీటం డిజైన్ తయరవుతోందన్న వాదనలు రావడంతో అప్పటికప్పుడు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి కిరీటం పనులకు ఎలాగోలా అనుమతి తీసుకున్నాడు. ఈ అనుమతుల విషయంలోనే తనకు చాలా డబ్బులు ఖర్చయ్యాయని, పైనుంచి కిందిస్థాయి అధికారుల వరకు చాలామందికి ముట్టజెప్పాల్సి వచ్చిం దంటూ వారి పేరిట కూడా ఆలయ మేనేజర్ వసూళ్లకు పాల్పడినట్టు ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారం మరింత ముదరకుండా కొన్నాళ్ల కిందట బ్రహ్మోత్సవాల సమయంలో హడావుడిగా స్వామివారికి కిరీటం అలంకరింపజేసి చేతులు దులిపేసుకున్నాడు. బదిలీతో అవినీతి రూపుమాపుతారా? స్వామివారి కిరీటధారణ జరిగి నెలలు గడుస్తున్నా దాని తయారీ వెనుక చోటుచేసుకున్న అక్రమాల వ్యవహారం ఇంకా తేలలేదు. కిరీటం తయూరీకి సంబంధించిన వివరాలను ఇవ్వాల్సిందిగా సమాచార హక్కు చట్టం కింద ఇటీవల కొందరు దరఖాస్తు చేయగా, విశ్వేశ్వరరావు రూ.30 వేలు ఖర్చుపెట్టి కోర్టుకెళ్లి మరీ స్టే తెచ్చుకున్నాడు. ఈ అధికారి నిర్వాకంతో తమకు ఎక్కడ ఏ మరక అంటుకుంటుందోనని భయపడిన ఉన్నతాధికారులు విశ్వేశ్వరరావును ఇటీవలే బదిలీ చేశారు. కేవలం బదిలీతోనే అతని అవినీతి రూపుమాపుతుందా.. భక్తులు స్వామివారికి ఇచ్చిన లక్షలాది రూపాయల మాటేమిటి.. ఆ సొమ్ము దేవుడి ఖజానాకు తిరిగి ఎలా జమవుతాయన్న ప్రశ్నలు భక్తుల నుంచి వస్తున్నాయి. -
వజ్రకిరీటం వచ్చేదెన్నడు?
ఎదురు చూస్తున్న భక్తులు తుదిమెరుగులు దిద్దడంలో జాప్యం పెనుగంచిప్రోలు : గ్రామంలో కొలువైయున్న శ్రీతిరుపతమ్మవారి వజ్రకిరీటం తయారీ పూర్తయినా.. ఆలయానికి చేరడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. భక్తులు అమ్మవారికి సమర్పించిన కానుకలు, బంగారంతో రూ.1.60 కోట్లతో వజ్రాలు పొదిగిన కిరీటం తయారు చేయించారు. గతంలో పనిచేసిన ఆలయ ఈఓ చంద్రశేఖర్ ఆజాద్, పాలకవర్గం కిరీట తయారీ పనులను విజయవాడ చందన జ్యూయలర్స్ వారికి అప్పగించగా వారు ముంబయిలో తయారు చేశారు. గత ఏడాది అమ్మవారి కల్యాణ సమయంలో తయారీదారులు తుది మెరుగులు పూర్తి కాని వజ్రకిరీటాన్ని తీసుకువచ్చి అమ్మవారికి ధరింపచేసి, మిగతా పనులు పూర్తిచేసేందుకు తీసుకు వెళ్లారు. ఆజాద్ తరువాత వచ్చిన ఈవో విజయ్‌కుమార్ వజ్రకిరీటం తయారీని పూర్తి చేయించారు. గత ఏడాది జూలైలో వజ్రాలు పొదిగిన కిరీటాన్ని ఆలయానికి తీసుకు వచ్చారు. అయితే కిరీటాన్ని పరిశీలించిన అనంతరం జెమాలజిస్టు కొన్ని విషయాల్లో అసంతృప్తి వ్యక్తం చేసి, మార్పులు సూచించడంతో తిరిగి తయారీదారులు కిరీటాన్ని తీసుకువెళ్లారు. ఈ విషయంపై దేవాదాయ శాఖ ఓ కమిటీని ఏర్పాటు చేసింది. అయితే ఇప్పటికీ కిరీటం ఆలయానికి చేరలేదు. వజ్రకిరీటం అమ్మవారికి అలంకరిస్తే చూద్దామని భక్తులతో పాటు, కిరీటానికి విరాళాలు ఇచ్చిన దాతలు ఎదురు చూస్తున్నారు. ఫిబ్రవరి నెలలో బాధ్యతలు చేపట్టిన ఆలయ కొత్త పాలకవర్గమైనా వజ్రకిరీటాన్ని ఆలయానికి తీసుకు వచ్చేందుకు కృషి చేస్తారని ఆశిస్తున్నారు. కిరీటాన్ని భద్రపర్చడానికి ఆలయ ఆవరణలో లాకర్ గదిని కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికైనా అమ్మవారికి పూర్తి స్థాయిలో తయారైన వజ్రకిరీటం అలంకరించాలని భక్తులు కోరుతున్నారు.