పోటెత్తిన భక్తజనం
అభిషేకాలు, సత్యనారాయణ స్వామి వ్రతాలు, అన్నదానం
సిద్దిపేట టౌన్: పట్టణంలోని షిరిడీ సాయి మందిరంలో శనివారం గురుపౌర్ణమి వేడుకలు కన్నుల పండువగా సాగాయి. వేకువజామున బాబాను ప్రత్యేకంగా అలంకరించారు. ఉదయం హారతి, క్షీరాభిషేకం నిర్వహించారు. అనంతరం వర్షాల కోసం జలాభిషేకం చేశారు. దంపతులు సత్యనారాయణ స్వామి వ్రతాలు ఆచరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం సందడిగా కనిపించింది. భక్తులకు బాబా ప్రసాదాన్ని అందజేశారు. గంటల తరబడి క్యూలో నిలుచొని స్వామిని దర్శించుకున్నారు.
వేలాది మందికి అన్నదానం చేశారు. ఉదయం నుంచి రాత్రి వరకు మందిరం భక్తులతో కిటకిటలాడింది. భక్తిశ్రద్ధలతో శతకోటి సాయినామ మహాయజ్ఞం నిర్వహించారు.కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కొండ కృష్ణమూర్తి, అధ్యక్షుడు గందె శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు తిరుపతిరెడ్డి, కార్యదర్శి టీ నర్సయ్య, సహాయ కార్యదర్శి రాజమౌళి, కోశాధికారి నల్ల శివానందం తోపాటు పట్టణ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
కన్నుల పండువగా గురుపౌర్ణమి వేడుకలు
Published Sun, Jul 13 2014 12:16 AM | Last Updated on Sat, Sep 2 2017 10:12 AM
Advertisement