
విమానాశ్రయం(గన్నవరం): విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం(గన్నవరం) నుంచి ప్రముఖ పుణ్యక్షేత్రమైన షిర్డీకి ఇండిగో సంస్థ ఆదివారం నుంచి విమాన సర్వీసులను ప్రారంభించింది. మధ్యాహ్నం 12.25 గంటలకు సుమారు 70 మంది ప్రయాణికులతో విమానం షిర్డీకి బయల్దేరి వెళ్లింది.
అక్కడి నుంచి 66 మంది ప్రయాణికులతో విమానం తిరిగి సాయంత్రం 4.35 గంటలకు గన్నవరం చేరుకుంది. రోజూ అందుబాటులో ఉండే ఈ విమాన సర్వీసులను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఇండిగో ప్రతినిధులు కోరారు.