Shirdi
-
షిర్డీలో రాష్ట్రేతర తెలుగు సమాఖ్య తొమ్మిదో సర్వసభ్య సమావేశాలు
సాక్షి, ముంబై: రాష్ట్రేతర తెలుగు సమాఖ్య తొమ్మిదో సర్వసభ్య సమావేశాలు ఈసారి షిర్డీలో జరగనున్నాయి. షిర్డీలోని శాంతికమల్ హోటల్లో ఈ నెల 30, డిసెంబర్ 1వ తేదీల్లో రెండు రోజులపాటు జరగనున్న ఈ కార్యక్రమాల్లో సర్వసభ్య సమావేశాలతోపాటు వివిధ సాంస్కతిక, సాహిత్య కార్యక్రమాలు, మహారాష్ట్రతోపాటు ఇరత రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న తెలుగు శిక్షణా కార్యక్రమాల గురించి చర్చించనున్నారు. ఈ కార్యక్రమాలకు ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య మంత్రి సత్యయాదవ్, తెలంగాణ సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్యఅతిథులుగా, మండలి బుద్ద ప్రసాద్, తెలంగాణ సాంస్కృతిక విభాగం సంచాలకులు మామిడి హరికృష్ణ, సినీ నటుడు సాయికుమార్ గౌరవఅతిథులుగా హాజరుకానున్నట్లు నిర్వాహకులు తెలిపారు. దేశంలోని 12 రాష్ట్రాల నుంచి 350 మంది సభ్యులు, 100 మంది కళాకారులు, రచయితలతోపాటు మహారాష్ట్ర తెలుగు సాహిత్య అకాడమి సభ్యులు కూడా పాల్గొననున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలకు స్థానిక తెలుగు సంఘాలతోపాటు షిర్డీ తెలుగు సంఘం అధ్యక్షుడు మాండవరాజా ఎంతగానో సహకరిస్తున్నారని వెల్లడించారు. ఊరేగింపుతో ప్రారంభం... రాష్ట్రేతర తెలుగు సమాఖ్య కార్యక్రమాలను రెండు కిలోమీటర్ల ఊరేగింపుతో ప్రారంభించనున్నారు. నవంబరు 30వ తేదీ శనివారం ఉదయం 9 గంటలకు శ్రీ సాయినివాస్ హోటల్ మెగా రెసిడెన్సీ నుంచి సభా ప్రాంగణం వరకు సుమారు రెండు కిలోమీటర్ల మేర తెలుగు ఫ్లకార్డులతో ఊరేగింపు జరగనుంది. వివిధ సాహిత్య, సామాజిక కార్యక్రమాల నిర్వహణ రాష్ట్రేతర తెలుగు సమాఖ్య 2015లో ఏర్పాటైంది. ఈ సమాఖ్య వివిధ రాష్ట్రాలలో అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటి వరకూ 18 జాతీయ సదస్సులు, వివిధ నగరాలలో స్థానిక సంస్థల సహకారంతో ప్రతి ఏటా అనేక సాహిత్య, సాంస్కృతిక, సామాజిక సేవా కార్యక్రమాలు, విద్యా సంబంధిత కార్యక్రమాలను చేపడుతోంది. అలాగే ఆంగ్ల భాషా ప్రభావంతో మాతృభాషకు దూరమవుతున్న పిల్లలకు తెలుగు భాష నేర్పేందుకు కూడా కృషిచేస్తోంది. అదేవిధంగా వివిధ రాష్ట్రాల్లో స్థిరపడ్డ తెలుగు కవులు, కళాకారులు, సామాజిక కార్యకర్తలకు ఆయా రాష్ట్రాలతోపాటు వారి స్వరాష్ట్రాలలో గుర్తింపు తీసుకువచ్చే ప్రయత్నం చేయడం, తెలుగు రాష్ట్రాల్లో అందించే పురస్కారాలు వీరికి కూడా అందించేందుకు కృషి చేయడం, రాష్ట్రేతర ప్రాంతాలలో మాతృభాష పరిరక్షణ, తెలుగేతర రాష్ట్రాలలో ప్రభుత్వాలు తెలుగువారికోసం స్థలాలు కేటాయించేలా కృషిచేయడం వంటి ఆశయాలతో ముందుకు వెళుతోంది. ఈ నేపథ్యంలో షిర్డీతోపాటు మహారాష్ట్రలోని తెలుగు సంఘాల ప్రతినిధులందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్రేతర తెలుగు సమాఖ్య అధ్యక్షుడు ఆర్ సందుర్ రావు, ప్రధాన కార్యదర్శి పివిపిసి ప్రసాద్‌లు ఓ ప్రకటనలో తెలిపారు. -
షిర్డీ-కాకినాడ రైల్లో అర్ధరాత్రి అసలేం జరిగింది? బాధితులు ఏం చెప్పారంటే..
సాక్షి, ఖమ్మం జిల్లా: దొంగల బీభత్సం సృష్టించిన షిర్డీ సాయి నగర్ టూ కాకినాడ రైలు ఖమ్మం రైల్వే స్టేషన్ చేరుకుంది. సుమారు అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో దోపిడీ జరిగినట్లు బాధితులు చెబుతున్నాయి. 30 మందికి పైగా బాధితుల లగేజీ బ్యాగ్‌లు, మని పర్సులు.. మొబైల్ ఫోన్లు దొంగలు ఎత్తుకెళ్లారు. సుమారు 30 లక్షల విలువ చోరీ అయినట్టు సమాచారం.బి3,బి4,బి5 ఏసీ కోచ్‌లలో ప్రయాణికులు నిద్రలో ఉండగా దోపిడీ జరిగింది. పర్భని దగ్గర జరిగినట్లుగా ప్రయాణికులు చెబుతున్నారు. బాధితులు పర్ని బైదనాడ్ స్టేషన్ వద్ద ప్రయాణికులు తమ వస్తువులు చోరీకి గురైనట్లు గుర్తించారు. ఒకటి తర్వాత ఒకరు తమ వస్తువులు పోయాయంటూ కోచ్‌లో ఆందోళన దిగారు..రైల్వే పోలీసులకు సమాచారం అందించగా సికింద్రాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. రైలు సికింద్రాబాద్ స్టేషన్‌కు చేరుకోగానే రైల్వే పోలీసులకు పలువురు ఫిర్యాదు చేశారు. మరికొందరు ఖమ్మం జీఆర్పీఎఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
షిర్డీ టూ కాకినాడ రైలులో భారీ చోరీ.. ప్రయాణీకుల ఆందోళన
సాక్షి, బీదర్: షిర్డీ టూ కాకినాడ పోర్టు ఎక్స్‌ప్రెస్ రైలులో దొంగలు రెచ్చిపోయారు. రైలులో ప్రయాణీకులు నిద్రిస్తున్న సమయాన్ని ఆసరాగా చేసుకుని మూడు బోగీల్లో బంగారం, నగదు, లగేజీని దొంగలించారు. దీంతో, బీదర్ వద్ద రైలును నిలిపివేసి ప్రయాణీకులు ఆందోళనకు దిగారు.వివరాల ప్రకారం.. సాయినగర్ షిర్డీ టూ కాకినాడ పోర్టు ఎక్స్‌ప్రెస్ రైలులో భారీ దోపిడీ జరిగింది. మహారాష్ట్రలోని వర్లీ సమీపంలో రైలులో ఎక్కిన దొంగలు దోపిడీకి పాల్పడ్డారు. ప్రయాణీకులు నిద్రిస్తున్న సమయంలో వారి వద్ద నుంచి బంగారం, నగదు, లగేజీని దొంగలించారు. ఈ క్రమంలో దోపిడీని గుర్తించిన ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు.అయితే, దోపిడీ అనంతరం దొంగలు బీదర్‌కు ముందున్న పర్లీ స్టేష్లన్‌లో దిగిపోయినట్టు ప్రయాణికులు గుర్తించారు. దీంతో, తమకు న్యాయం జరగాలని ప్రయాణికులు ఆందోళనలు చేస్తున్నారు. బీదర్‌లో రైలును నిలిపివేసి ఆందోళనకు దిగారు. -
కూతురుతో కలిసి షిర్డీ ఆలయంలో షారుక్ ఖాన్ పూజలు (ఫోటోలు)
-
షిర్డీ ఆలయంలో షారుక్ ఖాన్ పూజలు
-
'షిర్డి ఆలయం నుంచి నాణేలను తీసుకోం'..! అంటున్న బ్యాంకులు
మహారాష్ట్రలో ప్రఖ్యాతి గాంచి షిర్డీ సాయిబాబా ఆలయం నాణేల సమస్యలను ఎదుర్కొంటోంది. ఈ ఆలయానికి ప్రతి నెల నాణేల రూపంలో సుమారు రూ. 28 లక్షల వరకు విలువైన నగదు వస్తుంది. దీన్ని బ్యాంకులో జమ చేస్తారు. ఈ సంస్థ ట్రస్ట్‌కి ప్రభుత్వ సంబంధ బ్యాంకులకు సంబంధించి మొత్తం 13 శాఖల్లో ఖాతాలు ఉన్నాయి. వీటిలో ఎక్కువ బ్యాంకులు షిర్డీలో ఉండగా, ఒకటి నాసిక్‌లో ఉంది. ట్రస్ట్ ఖాతా ఉన్న ప్రతి బ్యాంకు ఆలయం నుంచి విరాళాలను, డిపాజిట్లను సేకరించడానికి ప్రతి నెల తమ సిబ్బందిని పంపుతాయి. ఐతే నాణేల రూపంలో ఇప్పటికే సుమారు రూ. 11 కోట్లు షిర్డీ సంస్థాన్‌కి సంబంధించిన బ్యాంకులో డిపాజిట్ అయ్యింది. ఇక నాణేలను దాచేందుకు అక్కడ బ్యాంకుల వద్ద స్థలంలో లేదు. దీంతో నాలుగు బ్యాంకుల అధికారులు ప్రతిరోజు లభించే నాణేలను ఉంచడానికి తమ వద్ద స్థలం లేదన్నారు. దీంతో షిర్డీ ట్రస్ట్ నాణేలను ఉంచడం ఒక సమస్యగా మారింది. దీంతో ఈ విషయంలో ఆర్బీఐని జోక్యం చేయయమంటూ..ట్రస్ట్ నేరుగా లేఖ రాయాలని యోచిస్తోంది. ఈ నాలుగు బ్యాంకుల తోపాటు ఇతర బ్యాంకులు కూడా ఇదే మాదిరి నాణేలను దాచేందుకు స్థలం సమస్యను ఎదుర్కొంటున్నట్లు సమాచారం. ఈ మేరకు ట్రస్ట్ సీఈవో మాట్లాడుతూ..కోవిడ్ మహమ్మారి తర్వాత నుంచి మళ్లీ నాణేల సమ్యస్య తెరపైకి వచ్చింది. ఆలయంలో సగటున రోజువారిగా 50 వేలకు పైగా నాణేలు పేరుకుపోయాయి. నాణేల సేకరణను నాలుగు బ్యాంకులు నిలిపేశాయి. దీంతోపాఏటు మిగిలిన బ్యాంకులు ఇదే సమస్యను ఎదుర్కొటున్నాయి. ఈ సమస్యను పరిష్కరించమని షిర్డీ సంస్థాన్ అధికారులు తనని సంప్రదించినట్లు తెలిపారు. ఈ విషయమై అహ్మదాబాద్‌లో మిగతా బ్యాంకులను సంప్రదించి..అక్కడ ఖాతాలనుతెరిచే యోచన కూడా చేస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా, బ్యాంకుల మాత్రం తమ వద్ద నాణేలు చాలా పెద్ద మొత్తంలో పేరుకుపోయాయని చెబుతున్నాయి. అప్పట్లో ట్రస్ట్ నాణేలను నిల్వ చేయడానికి ఆలయ ప్రాంగణంలో బ్యాంకుల గదులను ఇచ్చింది. కాని కానీ నిబంధనల ప్రకారం అందుకు అనుమతి లేనందున తిరస్కరించినట్లు చెప్పారు. (చదవండి: మోదీ పర్యటన వేళ ఆత్మాహుతి దాడి బెదిరింపు లేఖ..అప్రమత్తమైన అధికారులు) -
విజయవాడ–షిర్డీ విమాన సర్వీసులు ప్రారంభం
విమానాశ్రయం(గన్నవరం): విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం(గన్నవరం) నుంచి ప్రముఖ పుణ్యక్షేత్రమైన షిర్డీకి ఇండిగో సంస్థ ఆదివారం నుంచి విమాన సర్వీసులను ప్రారంభించింది. మధ్యాహ్నం 12.25 గంటలకు సుమారు 70 మంది ప్రయాణికులతో విమానం షిర్డీకి బయల్దేరి వెళ్లింది. అక్కడి నుంచి 66 మంది ప్రయాణికులతో విమానం తిరిగి సాయంత్రం 4.35 గంటలకు గన్నవరం చేరుకుంది. రోజూ అందుబాటులో ఉండే ఈ విమాన సర్వీసులను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఇండిగో ప్రతినిధులు కోరారు. -
మార్చి 26 నుంచి విజయవాడ–షిర్డీ విమాన సర్వీసులు
విమానాశ్రయం (గన్నవరం): విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి షిర్డీకి మార్చి 26 నుంచి విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఈ సర్వీసులను నడిపేందుకు ఇండిగో ఎయిర్‌లైన్స్ సంస్థ ముందుకురా వడంతోపాటు ప్రయాణ షెడ్యూల్‌ను కూడా ప్రకటించింది. 72 మంది ప్రయాణికుల సామర్థ్యం గల ఏటీఆర్ 72–600 విమానం రోజూ మధ్యాహ్నం 12.25 గంటలకు గన్నవరంలో బయలుదేరి మూడు గంటలకు షిర్డీ చేరుకుంటుంది. అలాగే షిర్డీ నుంచి మరో విమానం మధ్యాహ్నం 2.20 గంటలకు బయలుదేరి సాయంత్రం 4.35 గంటలకు గన్నవరం చేరుతుందని ఇండిగో ఎయిర్‌లైన్స్ వర్గాలు తెలిపాయి. విజయవాడ నుంచి షిర్డీకి ప్రారంభ టిక్కెట్ ధర రూ.4,246గా, షిర్డీ నుంచి ఇక్కడికి రూ.4,639గా నిర్ణయించారు. ఇప్పటివరకు షిర్డీ వెళ్లేందుకు రైలు, రోడ్డు మార్గాల ద్వారా గంటల తరబడి ప్రయాణించే వారికి ఈ సర్వీస్ ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. విజయవాడ నుంచి షిర్డీకి సుమారు 2.50 గంటల్లోనే చేరుకోవచ్చని విమానాశ్రయ అధికారులు పేర్కొంటున్నారు. -
పట్టాలెక్కిన తొలి ప్రైవేటు రైలు
-
సాయిబాబాకు శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా ప్రార్థనలు
Shilpa Shetty Raj Kundra Visits Shirdi Temple Offers Prayers: గతేడాది పలువురు తారలకు కొంచెం కలిసి రాలేదనే చెప్పాలి. అందులో ముఖ్యంగా బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, వ్యాపారవేత్త రాజ్‌కుంద్రా దంపతులు అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం సమస్యలు కొంచెం సద్దుమణిగాయి. ఆ ఆరోపణల నుంచి ఉపశమనం పొందుతున్నారు. అందుకే ఇద్దరూ కలిసి ఆలయాలు సందర్శించడం, టూర్లకు వెళ్లడం, కొంత సమయం గడపడం వంటివి చేస్తున్నారు. ఈ క్రమంలోనే షిరిడీ పర్యటనలో ఉన్నారు శిల్పా, రాజ్ కుంద్రా. ఈసారి వీరితో పాటు శిల్పా శెట్టి సోదరుడు రాఖీ కూడా ఉన్నట్లు సమాచారం. వారు తీర్థయాత్రలో ఉన్నట్లు తన ఇన్‌స్టా గ్రామ్ వేదికగా తెలిపుతూ ఓ వీడియోను షేర్ చేసింది శిల్పా. ఇదీ చదవండి: నాకు చాలా బాధను కలిగించింది.. చీటింగ్ కేసుపై నోరు విప్పిన శిల్పా శెట్టి ఈ వీడియో క్లిప్‌కు 'సబ్ కా మాలిక్ ఏక్ (దేవుడు ఒక్కడే). శ్రద్ధ, పట్టుదల. ఓం సాయి రామ్' అనే క్యాప్షన్ రాసుకొచ్చింది. ఈ వీడియోలో ఇద్దరూ చేతులు జోడించి సాయిబాబాకు ప్రార్థనలు చేస్తున్నారు. శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా హిందూ సాంప్రదాయమైన వస్త్రాలను ధరించారు. అలాగే కొవిడ్ నిబంధనలు పాటిస్తూ మాస్క్ పెట్టుకున్నారు. అశ్లీల చిత్రాల కేసులో విడుదలైన తర్వాత రాజ్ కుంద్రా తన సోషల్ మీడియా ఖాతాలన్ని తొలగించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే హిందీ బిగ్‌బాస్ సీజన్ 15లో తన సోదరి షమితా శెట్టి గెలవాలని కోరుకుంటున్నట్లు శిల్పా శెట్టి ఇటీవల తెలిపింది. ప్రస్తుతం శిల్పా ఇండియాస్ గాట్ టాలెంట్ అనే రియాలిటీ షోకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తుంది. ఈ షో జనవరి 15 నుంచి ప్రారంభం కానుంది. View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) ఇదీ చదవండి: మొహాన్ని దాచుకున్న రాజ్ కుంద్రా.. నెటిజన్స్ ట్రోలింగ్ -
స్కూళ్ల మూసివేత.. తరగతులు రద్దు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉధృతి మళ్లీ పెరుగుతుండడంతో ముందు జాగ్రత్తగా పాఠశాలలను మూసివేస్తూ/ తరగతులను రద్దు చేస్తూ కొన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు నిర్ణయం తీసుకున్నాయి. స్కూళ్లను నిరవధికంగా మూసివేస్తున్నట్లు గుజరాత్, తమిళనాడు, ఢిల్లీ తదితర రాష్ట్రాలు ప్రకటించాయి. ఇక తరగతులను రద్దు చేస్తున్నట్లు ఉత్తరప్రదేశ్, రాజస్తాన్, బిహార్, పంజాబ్ ప్రభుత్వాలు వెల్లడించాయి. ఆన్లైన్ ద్వారా విద్యార్థులకు పాఠాలు బోధించాలని పాఠశాలల యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేశాయి. తదుపరి ఉత్తర్వులు విడుదల చేసే వరకూ విద్యార్థులెవరూ పాఠశాలలకు రావొద్దని ఢిల్లీ సర్కారు స్పష్టం చేసింది. 9వ తరగతి వరకూ పాఠశాలలను ఏప్రిల్ 5 నుంచి రెండు వారాల పాటు మూసివేస్తున్నట్లు జమ్మూకశ్మీర్ అధికార యంత్రాంగం తెలియజేసింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 8వ తరగతి వరకు స్కూళ్ల మూసివేత గడువును ఏప్రిల్ 11 దాకా పొడిగించింది. మహారాష్ట్రలో 10, 12వ తరగతుల విద్యార్థులు, పబ్లిక్ సర్వీస్ పరీక్షలకు సన్నద్ధమయ్యేవారు మాత్రమే క్లాసులకు హాజరు కావొచ్చని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏప్రిల్ 10 దాకా స్కూళ్లను మూసివేస్తున్నట్లు పంజాబ్ ప్రభుత్వం పేర్కొంది. గుజరాత్, రాజస్తాన్‌లోనూ స్కూళ్లు మూతపడ్డాయి. బిహార్, కర్ణాటక, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్, పుదుచ్చేరిలో కరోనా కారణంగా స్కూళ్లకు తాళాలేయడంతో చదువులకు ఆటంకం కలుగుతోంది. మహమ్మారి ఇప్పట్లో అదుపులోకి వచ్చే పరిస్థితి కనిపించకపోవడంతో మూసివేత గడువును ప్రభుత్వాలు ఇంకా పొడిగిస్తున్నాయి. షిర్డీ ఆలయం మూసివేత కేసులు శరవేగంగా పెరుగుతున్న నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం షిర్డీ సాయి ఆలయాన్ని మూసేస్తున్నట్లు ప్రకటించింది. సోమవారం రాత్రి నుంచి తిరిగి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు మూసే ఉంటుందని స్పష్టం చేసింది. కోవిడ్‌ను కట్టడి చేసేందుకు షిర్డీ ఆలయంతో పాటు ఇతర దేవాల యాలన్నింటిని మూసేస్తున్నట్లు చెప్పింది. షిర్డీ ఆలయం మూసినప్పటికీ, అర్చకుల ఆధ్వర్యంలో నిత్య పూజలు కొనసాగుతూనే ఉంటాయని శ్రీ షిర్డీ సాయిబాబా ట్రస్టు ముఖ్య కార్యనిర్వహణాధికారి రవీంధ్ర ఠాక్రే చెప్పారు. -
లాక్డౌన్ ఎఫెక్ట్ షిర్డీ ఆలయం మూసివేత
ముంబై: మహమ్మారి కరోనా వైరస్ మహారాష్ట్రలో కల్లోలం రేపుతోంది. కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉండడంతో మహారాష్ట్రలో పాక్షిక లాక్డౌన్ అమలు చేస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే అందులో భాగంగా దేశంలోనే అత్యంత సంపద గల షిర్డీ సాయిబాబా ఆలయం మూతపడింది. సోమవారం రాత్రి 8 గంటలకు ఆలయం మూతపడింది. ఈ ఆలయం మళ్లీ ఉత్తర్వులు వచ్చే వరకు మూసి ఉంటుందని ఆలయ అధికారులు ప్రకటించారు. కరోనా వ్యాప్తి కట్టడిలో భాగంగా సామూహిక ప్రార్థన స్థలాలు, మందిరాలు మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ఈ మేరకు షిర్డీ ట్రస్టీ ఈ నిర్ణయం తీసుకుంది. దేశంలోనే అత్యధికంగా కరోనా కేసులు మహారాష్ట్రలో నమోదవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు మహారాష్ట్రలో 30,10,597 కేసులు నమోదవగా 55,878 మంది మృతి చెందారు. నిన్న ఒక్కరోజే 50 వేలకు పైగా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఆ రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న కేసులు 4,30,503. -
షిర్డీ వెళ్లొస్తుండగా తెలుగువారిపై దారి దోపిడీ
ముంబై: దైవ దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణమైన తెలుగు వారిపై మహారాష్ట్రలో దోపిడీ దొంగలు దాడికి పాల్పడి దొరికిన సొమ్మును దోచుకెళ్లారు. ఈ సంఘటన మహారాష్ట్రలోని వాసీలో చోటుచేసుకుంది. బాధితులు తెలంగాణలోని వికారాబాద్ జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. అయితే దోపిడీ దొంగల దాడిలో గాయపడిన తెలుగువారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వికారాబాద్ జిల్లా బండవెల్కిచర్ల గ్రామానికి చెందిన కె.రాములు పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు. కుల్కచర్ల తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజర్ రమేశ్. వీరిద్దరూ తమ కుటుంబంతో కలిసి మహారాష్ట్రలోని షిర్డీకి కారులో వెళ్లారు. షిర్డీ యాత్ర ముగించుకుని శుక్రవారం తిరుగు ప్రయాణమయ్యారు. కర్నాటకలోని వాసీ పోలీస్‌స్టేషన్ పరిధిలోకి రాగానే దొంగలు వీరి కారును అడ్డగించారు. రోడ్డుపై మేకులు వేసి కారు పంక్చరయ్యేలా చేశారు. అయితే దొంగలను చూసి తప్పించుకునేందుకు ప్రయత్నించగా కారు అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో దొంగలు రెచ్చిపోయారు. ఆ కుటుంబసభ్యులపై దాడికి పాల్పడ్డారు. విచక్షణా రహితంగా కొడుతూ.. కత్తులతో బెదిరిస్తూ డబ్బులు, ఆభరణాలు వసూల్ చేశారు. దీంతో ప్రాణభయంతో వారంతా తమ వద్ద ఉన్న ఆభరణాలు, నగదు ఇచ్చేశారు. ప్రస్తుతం కర్నాటకలోని హుమ్నాబాద్‌లో ఉన్న ఓ ఆస్పత్రిలో బాధితులు చికిత్స పొందుతున్నారు. చిన్నపిల్లలు, మహిళలు అని కూడా చూడకుండా కత్తులు, రాళ్లతో విచక్షణ రహితంగా దాడి చేశారని తెలుస్తోంది. వీరి దాడిలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరి వద్ద నుంచి 8 తులాల బంగారు నగలను దొంగలు అపహరించుకుపోయారు. ఈ ఘటన వాసీ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు మరిన్ని రావాల్సి ఉంది. -
షిర్డీ.. ఆమెకు అనుమతి లేదు
ముంబై: సామాజిక కార్యకర్త తృప్తి దేశాయ్‌పై షిర్డీ అధికారులు అంక్షలు విధించారు. డిసెంబర్ 8 నుంచి 11 అర్ధరాత్రి వరకు తృప్తి దేశాయ్‌కు షిర్డీ ఆలయ ప్రవేశాన్ని నిషేధిస్తూ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ గోవింద్ షిండే నోటీసులు జారీ చేశారు. తృప్తి దేశాయ్ ఆలయంలోకి ప్రవేశిస్తే శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని ఆ నోటిసుల్లో పేర్కొన్నారు. షిర్డీతో పాటు దాని పక్కనే ఉన్న అహ్మద్‌నగర్ జిల్లాలో కూడా ఆమె ప్రవేశంపై నిషేధం విధిస్తున్నట్టు తెలిపారు. ఒకవేళ ఆమె తమ ఆదేశాలను ఉల్లంఘించి ఆలయంలోకి ప్రవేశించడానికి చూస్తే ఐపీసీ సెక్షన్ 188 ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇక, షిర్డీ ఆలయంలోకి వచ్చే భక్తుల సంప్రదాయ వస్త్రాలు మాత్రమే ధరించాలని ఆలయ అధికారులు పోస్టర్లు ఏర్పాటు చేశారు. వీటిపై తృప్తి దేశాయ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. తక్షణమే అధికారులు ఆ పోస్టర్లను తొలగించాలని.. లేకపోతే తానే ఇతర కార్యకర్తలతో డిసెంబర్ 10న ఆలయం వద్దకు చేరుకుని వాటిని తొలగిస్తానని తృప్తి దేశాయ్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే అధికారులు ఆమెకు నోటీసులు జారీచేశారు. (ప్లీజ్.. సంప్రదాయ దుస్తుల్లో రండి: షిర్డి) అయితే తమ భక్తులపై ఎలాంటి డ్రెస్ కోడ్ విధించలేదని షిర్డీ ట్రస్ట్‌కు చెందిన ఓ సీనియర్ అధికారి తెలిపారు. షిర్డీకి వచ్చే కొందరి వస్త్రాధారణపై భక్తుల నుంచి ఫిర్యాదులు వచ్చాయని అన్నారు. ఈ నేపథ్యంలో కేవలం షిర్డీ వచ్చేవారికి అభ్యర్థన చేసే విధంగా ఆలయ పరిసరాల్లో పోస్టర్లు అంటించినట్టు చెప్పారు. ఇక, ఈ పోస్టర్లకు సంబంధించి ట్రస్ట్‌పై చర్యలు తీసుకోవాల్సిందిగా తాను మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేకు లేఖ రాసినట్లు తృప్తి దేశాయ్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..‘దేవాలయం పవిత్రతను ఎలా కాపాడాలో భక్తులకు బాగా తెలుసు. ఈ పోస్టర్లును తొలగించకపోతే.. మేం ఇక్కడికి వచ్చి వాటిని తొలగిస్తాం. డిసెంబర్ 10 మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతానికి మేం ఇక్కడకు చేరుకుంటాం’అని హెచ్చరించారు. -
ప్లీజ్.. సంప్రదాయ దుస్తుల్లో రండి: షిర్డి
ముంబై: బాబా దర్శనానికి వచ్చే వారు భారతీయ సంప్రదాయ దుస్తులు ధరించి రావాల్సిందిగా షిర్డి సాయిబాబా ఆలయ ట్రస్టు నిర్వహకులు భక్తులను అభ్యర్థించారు. ఇది కేవలం అభ్యర్థన మాత్రమే అని.. భక్తులపై ఎలాంటి డ్రెస్ కోడ్ విధించలేదని తెలిపారు. ఈ సందర్భంగా శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కన్హురాజ్ బాగటే మాట్లాడుతూ.. ‘బాబాను దర్శించుకోవడానికి వచ్చే భక్తులు భారతీయ సంప్రదాయ దుస్తులు ధరించి రావాల్సిందిగా అభ్యర్థిస్తున్నాం. ఎందుకంటే గతంలో కొందరి వస్త్రధారణ పట్ల పలవురు భక్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అభ్యంతరకర దుస్తులు ధరించి ఆలయంలోకి వచ్చారని కొందరు ఫిర్యాదు చేశారు. అందుకే ఈ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది పవిత్రమైన పుణ్యక్షేత్రం. కనుక మోడర్న్ దుసుల్లో వచ్చే వారికి మా విజ్ఞప్తి ఇదే.. దయచేసి భారతీయ సంప్రదాయ దుస్తులు ధరించి రండి. ఇది కేవలం విన్నపం మాత్రమే. భక్తుల మీద ఎలాంటి డ్రెస్ కోడ్ విధంచలేదు’ అని తెలిపారు. (చదవండి: సమసిన షిర్డీ వివాదం) -
ఒక్కరోజులో 8,000 మంది డిశ్చార్జ్
సాక్షి ముంబై/షిర్డీ: మహారాష్ట్రలో ఒక వైపు కరోనా మహమ్మారి విజృంభిస్తుండగా కోలుకుంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా శనివారం వరకు 62,228 మంది కరోనా బారిన పడగా 26,997 మంది కోలుకున్నారు. శుక్రవారం ఒక్కరోజులోనే 8,381 మంది బాధితులు ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. వీరిలో ముంబై నుంచే 7,358 మంది ఉన్నారు. ముంబైలో ఇప్పటి వరకు 16,008 మంది కోవిడ్ బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 33,133 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. అదేవిధంగా, మహారాష్ట్రలో గడిచిన 24 గంటల్లో 114 మంది పోలీసులు కరోనా బారిన పడ్డారు. దీంతో కరోనా బారిన పడిన పోలీసుల సంఖ్య 2,325కు చేరగా ఇప్పటి వరకు 26 మంది మృతి చెందారు. షిర్డీలో తొలి కరోనా కేసు షిర్డీకి చెందిన ఓ మహిళకు కరోనా సోకడంతో పట్టణాన్ని కంటోన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. వచ్చే 14 రోజులపాటు అత్యవసర సేవలే అందుబాటులో ఉంటాయి. పట్టణ ప్రజలందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నారు. -
మన కోసం మరో షిరిడీ
షిరిడీలో కొలువై ఉన్న సాయిబాబాను భక్తులు ప్రత్యక్ష దైవంగా కొలుస్తుంటారు. దేశం నలుమూల నుంచి లక్షలాది మంది భక్తులు మహారాష్ట్రలోని షిరిడీ వెళ్లి బాబాను దర్శించుకుంటారు. దక్షిణాది రాష్ట్రాల భక్తుల కోసం భారీ స్థాయిలో మరో షిరిడీ సాయిబాబా ఆలయాన్ని నిర్మించినట్లు నామక్కల్ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్ అధినేత, ‘దక్షిణాది షిరిడీ సాయిబాబా ఆలయ’ బోర్డు చైర్మన్ కే చంద్రమోహన్ తెలిపారు. ఈనెల 8న వెయ్యిశంఖాలతో మండలపూజ నిర్వహించనున్న సందర్భంగా ఆలయ నిర్మాణానికి దారితీసిన అనుభవాలు, అనుభూతులను మీడియాకు వివరించారు. సాక్షి ప్రతినిధి, చెన్నై: ‘అందరు దేవుళ్లను సాధారణంగా కొలవడమేగానీ షిరిడీ బాబా పట్ల ప్రత్యేకమైన భక్తిప్రపత్తులు ఉన్నవాడిని కాదు. ఒకరోజు స్నేహితునితో కలిసి 2008లో షిరిడీ వెళ్లి బాబా దర్శనం చేసుకుని వచ్చాను. కొద్ది రోజుల్లోనే నాకు ఒక అద్భుతమైన కల వచ్చింది. కలలో ఒక పాప నన్ను ఉద్దేశించి బాబా ఆలయాన్ని నిర్మించాలని కోరింది. ఆలయ నిర్మాణానికి అనువైన స్థలం మీ ఊరికి సమీపంలోనే ఉందంటూ ఒక వేపచెట్టు, పక్కనే బండరాయి, సమీపంలో తాటిమాను ఉన్న ప్రాంతాన్ని చూపింది. ఉలిక్కిపాటుతో మేల్కొన్న నేను కలలో చూసిన ప్రాంతం కోసం ఎంతగానో అన్వేషించగా తిరుచ్చిరాపల్లి జిల్లా అక్కరపట్టి, సమయపురం, టోల్గేట్ సమీపంలో సరిగ్గా అదేస్థలం కనపడింది. ఆ స్థల యజమానైన ఒక రైతు ఆలయ నిర్మాణానికి స్థలం ఇచ్చేందుకు నిరాకరించాడు. బాబా ఆదేశాల ప్రకారం అక్కడే నిర్మించడం ఎలాగని ఆలోచనలో పడగా సరిగ్గా వారం రోజుల తరువాత అదే రైతు నన్ను వెతుక్కుంటూ వచ్చి అర ఎకరా స్థలాన్ని ఇవ్వడం విశేషం. వెంటనే 2009లో చిన్నపాటి షిరిడీ సాయిబాబా ఆలయాన్ని నిర్మించాను. పెద్ద సంఖ్యలో భక్తుల రాక పెరగడంతో అన్నదాన కార్యక్రమాలను చేపట్టాను. షిరిడీ పద్ధతుల్లో రోజుకు మూడు సార్లు అదే భాషలో హారతులు ప్రవేశపెట్టి పెద్ద ఆలయాన్ని నిర్మించాలని 2016లో నిర్ణయించుకున్నాను. జర్మనీ నుంచి అత్యంత ఖరీదైన అలంకరణ రాళ్లను తెప్పించి రూ.300 కోట్ల వ్యయంతో నిర్మించిన భారీ ఆలయ నిర్మాణం పూర్తికాగా జనవరిలో కుంభాభిõÙకం చేసి బాబాకు అంకింతం చేశాం. కుంభాభిõÙక మహోత్సవానికి తమిళనాడుతోపాటు వివిధ రాష్ట్రాల నుంచి సుమారు 80 వేల మంది భక్తులు హాజరైనారు. ఆలయానికి అనుబంధంగా శాశ్వత ప్రాతిపదికన ఉచిత వైద్యం, వృద్ధాశ్రమం నిర్మాణం చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నాన’ని ఆయన తెలిపారు. ఆలయంలో భక్తులు మహిమాన్వితుడైన బాబా ఆలయ నిర్మాణం తలపెట్టినప్పటి నుంచి బాబా ఆశీస్సులతోపాటు ఎన్నో మహిమలు చోటుచేసుకున్నాయని చంద్రమోహన్ తెలిపారు. మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం వల్ల బాబా జన్మస్థలంపై వివాదం తలెత్తగా షిరిడీలోని బాబా ఆలయాన్ని మూడు రోజులపాటు మూసివేశారు. అనుకోకుండా అవే మూడు రోజుల్లో ఇక్కడి కొత్త ఆలయంలో బాబాకు కుంభాభిషేకం జరగడం అనూహ్యమైన పరిణామం. తిరుపతి నుంచి చెన్నైకి కారులో వస్తూ పూందమల్లికి 10 కి.మీ దూరంలో రోడ్డుపక్కన ఉన్న ఒక పెద్ద బోర్డును చూసి ఆలయ ప్రచారానికి ఎంత ఖరీదైనా చెల్లించి వాడుకోవాలని ఆశించగా వారు నిరాకరించారు. ప్రయాణం సాగుతుండగానే కొద్దిసేపట్లో వారే ఫోన్ చేసి ఉచితంగా ఇస్తామన్నారు. మరికొద్ది దూరంలో మరో బోర్డును దాని యజమాని కూడా ఉచితంగా ఇచ్చేందుకు ముందుకు వచ్చాడు. 8న మండల పూజ కుంభాభిషేకం ముగిసిన సందర్భంగా ఈనెల 8వ తేదీన వెయ్యి శంఖాలతో మండల పూజను చేపడుతున్నట్లు దక్షిణాది షిరిడీ సాయిబాబా ఆలయ బోర్డు సభ్యులు, ఆలయ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఇన్చార్జ్ టి సురేష్ తెలిపారు. అనతికాలంలోనే ఆలయ విశిష్టత నలు చెరగులా ప్రచారం కావడంతో తమిళనాడు టూరిజం శాఖలో చేర్చారు. అంతేగాక భక్తుల సౌకర్యార్థం తిరుచ్చిరాపల్లి నగరం నుంచి ఆలయం వద్దకు టూరిజంశాఖ ఉచిత బస్సులను నడుపుతోంది. ఆలయ సందర్శనార్థం వచ్చే తెలుగువారు 9600005060 సెల్‌ఫోన్ నంబరులో సంప్రదిస్తే అవసరమైన సహాయ సహకారాలు అందజేయగలనని సురేష్ తెలిపారు. -
సమసిన షిర్డీ వివాదం
సాక్షి, ముంబై: పాథ్రీ గ్రామాన్ని సాయిబాబా జన్మస్థలంగా కాక, ఒక పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే చేసిన ప్రకటనతో బాబా జన్మస్థలంపై తలెత్తిన వివాదం సమసినట్లయింది. సాయిబాబా జన్మస్థలమైన పాథ్రీ గ్రామాన్ని రూ.100 కోట్లతో అభివృద్ధి చేస్తామని ఇటీవల ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే చేసిన ప్రకటనతో షిర్డీ వాసులు నిరవధిక బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. షిర్డీలోని దుకాణాలను మూసివేయడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. పరిస్థితి తీవ్రతను గమనించిన సీఎం ఉద్ధవ్ సోమవారం షిర్డీ, పాథ్రీ గ్రామాల ప్రముఖులు, షిర్డీ ఆలయ ప్రతినిధులతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఈ సందర్భంగా సీఎం ఉద్ధవ్ పాథ్రీ గ్రామాన్ని సాయిబాబా జన్మస్థలంగా కాకుండా ఒక పుణ్య క్షేత్రంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. అంతేకాకుండా, పాథ్రీ సాయిబాబా జన్మస్ధలమంటూ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. ఇందుకు పాథ్రీ, షిర్డీ వాసులు సమ్మతించారు. ‘బాబా జన్మస్థలం పాథ్రీ అవునో కాదో నాకు తెలియదు. నేనేమీ పరిశోధకుణ్ని కాదు. అందరూ అన్నట్టుగానే నేనూ అన్నా’అని తెలిపారు. -
ముగిసిన షిర్డీ బంద్
సాక్షి, ముంబై/షిర్డీ: షిర్డీ సాయిబాబా జన్మస్థలంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే చేసిన వ్యాఖ్యలకు నిరసనగా షిర్డీ్డలో జరుగుతున్న బంద్ ముగిసింది. ఆదివారం అర్ధరాత్రి నుంచి బంద్‌ను నిలిపివేస్తున్నట్లు శివసేనకు చెందిన స్థానిక ఎంపీ సదాశివ లోఖండే ప్రకటించారు. ఈ అంశంపై సంబంధిత వర్గాలతో సోమవారం సీఎం ఠాక్రే సమావేశం నిర్వహిస్తున్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఆదివారం సాయంత్రం ఆయన షిర్డీ్డలోని స్థానికులతో చర్చించారు. అంతకుముందు, బంద్‌కు ఎంపీ సదాశివ లోఖండే మద్దతు ప్రకటించారు. ఠాక్రే వ్యాఖ్యలపై నిరసనగా ఆదివారం షిర్డీ్డలో బంద్ పాటించారు. శనివారం అర్ధరాత్రి నుంచి షిర్డీతో పాటు చుట్టుపక్కల ఉన్న 25 గ్రామాల్లోనూ బంద్ జరిగింది. అయితే, షిర్డీ సాయి ఆలయం తెరిచే ఉంది. భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండానే సాయినాథుని దర్శించుకున్నారు. షిర్డీ్డలోని షాపులు, రెస్టారెంట్లు, ప్రైవేటు వాహనాల వారు బంద్ పాటించారు. ముందే బుక్ చేసుకున్నవారికి మాత్రం హోటళ్లలో వసతి కల్పించారు. సాయిబాబా దర్శనం కోసం వచ్చిన భక్తులకు స్థానికులు ఆహారం, తాగునీరు తదితర సౌకర్యాలు కల్పించారు. భక్తులకు ఉపాహారం అందించే ప్రసాదాలయ, లడ్డూ కౌంటర్ల వద్ద భారీ క్యూలు కనిపించాయి. స్థానికులు, భక్తులు ఆదివారం ఉదయం ద్వారకామాయి ఆలయం నుంచి ప్రారంభించి సాయి ఆలయం చుట్టూరా భారీ ర్యాలీ నిర్వహించారు. పర్భని జిల్లాలోని పాథ్రీలో ఉన్న ‘సాయి జన్మస్థాన్’ అభివృద్ధి కోసం రూ. 100 కోట్లు కేటాయిస్తున్నట్లు సీఎం ఉద్ధవ్ ఠాక్రే ప్రకటించడంతో వివాదం ప్రారంభమైంది. పత్రిని అభివృద్ధి చేయడం పట్ల తమకు అభ్యంతరం లేదని శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్(ఎస్ఎస్ఎస్టీ) మాజీ సభ్యుడు సచిన్ థాంబె తెలిపారు. సాయిబాబా జన్మస్థలంగా పత్రిని పేర్కొనడంపైనే తమ అభ్యంతరమని స్పష్టం చేశారు. ‘పత్రి తన జన్మస్థలమని సాయిబాబా ఎన్నడూ చెప్పలేదు’ అని వివరించారు. బంద్ కారణంగా షిర్డీకి వచ్చే భక్తుల సంఖ్య భారీగా తగ్గిందని రాష్ట్ర మంత్రి చగన్ భుజ్‌బల్ పేర్కొన్నారు. సాధారణం కన్నా 10 వేల మంది తగ్గారన్నారు. ఇరు గ్రామాల వారితో భేటీ ఈ అంశంపై నేడు(సోమవారం) సీఎం ఉద్ధవ్ ఠాక్రే అధ్యక్షతన కీలక భేటీ జరగనుంది. ఈ సమావేశానికి షిర్డీ, çపత్రి గ్రామాల వాస్తవ్యులు, షిర్డీ ఎమ్మెల్యే విఖే పాటిల్, ఎంపీ లోఖండే హజరవుతారని ఎస్ఎస్ఎస్టీ సీఈఓ దీపక్ ముగ్లీకర్ తెలిపారు. పత్రిలో సాయిబాబా జన్మించాడని 2017లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పేర్కొనడంతో.. సాయిబాబా జన్మస్థలానికి సంబంధించిన వివాదం ప్రారంభమైంది. ‘2017లో రాష్ట్రపతి షిర్డీకి వచ్చినప్పుడు షిర్డీ సాయిబాబా కర్మభూమి.. పత్రి ఆయన జన్మభూమి అని వ్యాఖ్యానించారు. ఈ విషయమై రాష్ట్రపతిని నేను ఆ తరువాత కలిసి వివరణ ఇచ్చాను. అధికారులు చెప్పిన విషయాన్నే తాను ప్రస్తావించానని అప్పుడు రాష్ట్రపతి అన్నారు’ అని లోఖండే వివరించారు. పత్రినే సాయి జన్మభూమి అని ఆ గ్రామస్తులు వాదిస్తున్నారు. సాయి జీవిత చరిత్ర ‘శ్రీ సాయిసశ్చరిత’లో కూడా çపత్రినే సాయి జన్మస్థలంగా పేర్కొన్నారని గుర్తు చేస్తున్నారు. ‘పాథ్రీనే సాయిబాబా జన్మస్థలమని ఆయన శిష్యుడు దాసు గణు మహారాజ్ తన జీవిత చరిత్రలో పేర్కొన్నారు. షిర్డీ సంస్థాన్ కూడా çపత్రినే సాయిబాబా జన్మస్థలమని నిర్ధారిస్తూ కొన్ని పత్రాలు ప్రచురించింది’ అని పత్రిలోని ‘శ్రీ సాయి జన్మస్థాన్ టెంపుల్ ట్రస్ట్’ సభ్యుడు సంజయ్ భూసారి వెల్లడించారు. -
నేటి నుంచి షిర్డీ బంద్
అహ్మద్‌నగర్/షిర్డీ: శ్రీ సాయి జన్మస్థలంపై తలెత్తిన వివాదం ముదిరింది. పత్రి గ్రామ అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ ఆదివారం పట్టణ బంద్ పాటించాలని షిర్డీ వాసులు పిలుపునిచ్చారు. అయితే, ఆదివారం ఆలయం తెరిచే ఉంటుందని, పూజా కార్యక్రమాలు కొనసాగుతాయని శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ పేర్కొంది. సంస్థాన్‌కు చెందిన ఆస్పత్రులు, ప్రసాద విక్రయ కేంద్రాలు, భక్తి నివాసాలు తదితరాలన్నింటిలో కార్యకలాపాలు కొనసాగుతాయని ప్రకటించింది. ఇలా ఉండగా, ఈ వివాదం పరిష్కారానికి సంబంధిత వర్గాలతో సెక్రటేరియట్లో ఆదివారం సీఎం ఉద్ధవ్ ఠాక్రే సమావేశం నిర్వహించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. షిర్డీ వాసుల్లో ఆగ్రహం బాబా జన్మస్థలంగా భక్తులు భావించే పత్రి అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయిస్తున్నట్లు సీఎం ప్రకటించడం వివాదమైంది. ఈ అంశంపై వివిధ రాజకీయ పార్టీల నేతలు, షిర్డీ వాసులు శనివారం సమావేశమయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ప్రకటనకు నిరసనగా ఆదివారం నుంచి బంద్‌కు పిలుపునిచ్చినట్లు తెలిపారు. బంద్‌లో దాదాపు 20 గ్రామాల ప్రజలు పాల్గొంటారన్నారు. గతంలోనూ ఇలా బాబా జన్మస్థలంపై వివాదాలు సృష్టించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. దేశవ్యాప్తంగా ఉన్న బాబా ఆలయాల్లో పత్రిలోనిది ఒకటనీ, బాబా జన్మస్థానం పత్రి అంటూ ముఖ్యమంత్రి చేసిన ప్రకటనతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని తెలిపారు. హోటళ్లలో బుకింగ్ చేసుకున్న భక్తులకు, విమానాల్లో వచ్చే భక్తులకు బంద్‌తో ఎలాంటి అసౌకర్యం ఉండదని, దుకాణాలు మాత్రమే మూతబడి ఉంటాయన్నారు. ఆధారాలున్నాయి: ఎన్సీపీ నేత దుర్రానీ పత్రిలోనే బాబా జన్మించారనేందుకు చారిత్రక ఆధారాలున్నాయని ఎన్సీపీ నేత దుర్రానీ అబ్దుల్లా చెప్పారు. పత్రి జన్మభూమి కాగా, షిర్డీ సాయి కర్మభూమి అని, రెండు ప్రాంతాలూ భక్తులకు ముఖ్యమైనవేనన్నారు. పత్రి ప్రాధాన్యం పెరిగితే షిర్డీకి భక్తుల రాక తగ్గిపోతుందేమోనని షిర్డీ ప్రజల్లో ఆందోళన ఉందన్నారు. సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రి అశోక్ చవాన్ మాట్లాడుతూ..బాబా జన్మస్థలంపై వివాదం కారణంగా పత్రిలో భక్తులకు సౌకర్యాల కల్పనను అడ్డుకోవడం సరికాదన్నారు. -
‘రేపటి నుంచి సాయిబాబా ఆలయం బంద్’
ఔరంగాబాద్ : షిర్డీ సాయిబాబా జన్మస్థలంపై ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే చేసిన వ్యాఖ్యలపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. సాయిబాబా జన్మ స్థలమని కొందరు భక్తులు నమ్మే పర్భనీ జిల్లాలోని పత్రి పట్టణ అభివృద్ధి కోసం రూ.100 కోట్లు కేటాయిస్తున్నట్టు సీఎం శుక్రవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై షిర్డీ వ్యాప్తంగా ప్రజలు ఆందోళన చేపట్టారు. షిర్డీ సాయి జన్మస్థలం విషయమై రాజకీయ జోక్యం తగదని స్పష్టం చేశారు. ఇక పత్రీని సాయిబాబా స్వస్థలంగా అభివృద్ధి చేస్తామన్న సీఎం ఉద్ధవ్ ఠాక్రే ప్రకటనకు నిరసనగా షీర్డీ సంస్థాన్ ట్రస్టు, గ్రామస్తులు నిరవధిక బంద్‌కు పిలుపునిచ్చారు. అయితే, షిర్డీని సందర్శించే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని సాయి సంస్థాన్ ట్రస్టు సభ్యుడు బి.వాక్చౌర్ వెల్లడించారు. ‘షిర్డీ సాయి జన్మస్థలంపై వస్తున్న పుకార్లకు నిరసనగా.. ఆదివారం (జనవరి 19) నుంచి ఆలయాన్ని మూసివేసేందుకు నిర్ణయించాం’అన్నారు. ఇక ఇదే అంశంపై షిర్డీ ప్రజలతో శనివారం సాయంత్రం సమావేశమవుతామని పేర్కొన్నారు. -
సాయిబాబా జన్మస్థలంపై వివాదం
ఔరంగాబాద్: షిర్డీ సాయి జన్మ స్థలమని కొందరు భక్తులు నమ్మే పర్భనీ జిల్లాలోని పత్రి పట్టణ అభివృద్ధి కోసం రూ.100 కోట్లు కేటాయిస్తున్నట్లు సీఎం ఉద్ధవ్ ఠాక్రే చేసిన ప్రకటన వివాదాస్పదంగా మారింది. దీనిపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. శివసేన–ఎన్సీపీ– కాంగ్రెస్ ప్రభుత్వం సాయి బాబా జన్మస్థలాన్ని వివాదాల్లోకి లాగుతోందని ఆరోపించింది. షిర్డీ సాయి జన్మ స్థలం విషయమై రాజకీయ జోక్యం ఇలాగే కొనసాగితే షిర్డీ ప్రజలు న్యాయపోరాటానికి దిగుతారని అహ్మద్‌నగర్ ఎంపీ సుజయ్ విఖే పాటిల్ హెచ్చరించారు. ఇక పత్రీని సాయిబాబా స్వస్థలంగా అభివృద్ధి చేస్తామన్ని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ప్రకటనకు నిరసనగా షీర్డీ గ్రామస్తులు బంద్‌కు పిలుపునిచ్చారు. అయితే, ప్రభుత్వ ప్రకటనకు నిరసనగా షిర్డీ ఆలయం మూసివేస్తున్నారన్న వార్తలు అవాస్తవమని ఆలయ ట్రస్ట్ స్పష్టం చేసింది. గ్రామస్తులు ప్రకటించిన బంద్‌తో ట్రస్ట్‌కు సంబంధం లేదని తెలిపింది. భక్తులు ఆందోళనకు గురికావద్దని షిర్డీ ఆలయం, భక్తి నివాస్‌లో సేవలు యథావిధిగా కొనసాగుతాయని సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ పీఆర్వో మోహన్ యాదవ్ చెప్పారు. సాయంత్రం షిర్డీ గ్రామస్తులతో సమావేశమవుతామని తెలిపారు. -
షిరిడీకి విమానాలు రద్దు
శంషాబాద్: షిరిడీలో ప్రతికూల వాతావరణం నేపథ్యంలో శంషాబాద్ విమానాశ్రయం నుంచి అక్కడికి రాకపోకలు సాగించే పలు విమానాలు రద్దయ్యాయి. స్పైస్‌జెట్ 1096, 3578 విమానాలతోపాటు ఇండిగో, ఎయిర్ ఇండియాకు సంబంధించిన విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో మంగళవారం వెళ్లాల్సిన ఆయా విమానాలను బుధవారానికి రీ షెడ్యూల్ చేసినట్లు ఎయిర్‌లైన్స్ వర్గాలు వెల్లడించాయి. ప్రయాణాలు రద్దవడంతో ప్రయాణికులకు ఆయా సంస్థలు విమాన చార్జీలు తిరిగి చెల్లిస్తున్నాయి. -
రెండు పైసలు దక్షిణ అడిగారు నా గురువు
రాధాబాయ్ దేశ్‌ముఖ్ అనే భక్తురాలు బాబా వద్ద మంత్రోపదేశం పొందాలనే ఆత్రుతతో షిరిడీ వచ్చింది. బాబాకు తన మనసులోని మాట చెప్పి తన చెవిలో మంత్రం ఊదాల్సిందేనని మొండిపట్టు పట్టింది. మంత్రం చెప్పకపోతే ఉపవాసాలుండి చచ్చిపోతానంది. బాబా ఆమెతో ఇలా అన్నారు. ‘‘అమ్మా! నాకు తల్లివంటి దానివి. నేను చెప్పేది శ్రద్ధగా విను. నా గురువు మిక్కిలి దయార్ద్ర హృదయులు. చాలాకాలం ఆయనకు సేవ చేశాను. వారి వద్ద ఉపదేశం పొందాలనేది నా ఆశ. అలా పన్నెండేళ్లు గురుసేవలో తరించాను. కానీ వారు నా చెవిలో ఏ మంత్రమూ ఊదలేదు. వారి సాంగత్యంలో నాకు అన్న వస్త్రాలకు లోటు లేదు. వారు నన్ను అడిగినది రెండే రెండు పైసల దక్షిణ. అందులో ఒక పైసా నిష్ఠతో కూడిన భక్తి. దీనినే శ్రద్ధ అంటారు. రెండోపైసా సబూరి. అంటే సంతోష స్థైర్యాలతో కూడిన సహనం. ఈ ప్రపంచమనే సాగరాన్ని ఓర్పు అనే ఓడ సురక్షితంగా దాటిస్తుంది. సబూరి అత్యంత ఉత్తమ లక్షణం. అది పాపాల్ని తొలగిస్తుంది. కష్టాలను ఎడబాపుతుంది. సబూరి అనేది సుగుణాలకు గని. మంచి ఆలోచనలకు పెన్నిధి. శ్రద్ధ, సబూరి అక్కచెల్లెళ్ల వంటివి. నా గురువు నా నుంచి ఏమీ ఆశించలేదు. సర్వకాల సర్వావస్థల్లోనూ కేవలం దృష్టి చేతనే నన్ను అనుగ్రహించేవారు. తల్లి తాబేలు ఒక ఒడ్డున, పిల్ల తాబేళ్లు మరో ఒడ్డునా ఉంటాయి. తల్లి పిల్లలకు పాలివ్వడం, ఆహారం పెట్టడం చేయదు. కేవలం తల్లి ప్రేమాస్పద దృష్టి సోకి పిల్లలు పెద్దవుతాయి. నా గురువు నాపై అదే ప్రేమ చూపేవారు. తల్లీ! నా గురువు నాకే మంత్రమూ ఉపదేశించలేదు. అలాంటప్పుడు నేను నీకెట్లు మంత్రం ఊదగలను? గురువు మయమైన తాబేలు చూపే మనకు సంతోషాన్నిస్తుందని గుర్తుంచుకో. మంత్రం కాని, ఉపదేశం కాని ఎవరి నుంచీ పొందాలని ప్రయత్నించకు. నా వైపు సంపూర్ణ హృదయంతో చూడు. నీ వైపు నేనట్లే చూస్తాను. నీవు తప్పక పరమార్థం పొందుతావు. ఈ మసీదులో కూర్చుని నేనెప్పుడూ అబద్ధం చెప్పను. నిజం కానిది మాట్లాడను. ఆరు శాస్త్రాల్లో ప్రావీణ్యం, అష్టాంగ యోగాల్లో సాధన అవసరం లేదు. గురువుపై సంపూర్ణ ప్రేమ, విశ్వాసాలను ఉంచు. సర్వమూ చేయువాడు గురువే. అతనే కర్త అని నమ్ము. ఎవరైతే గురువును త్రిమూర్తి స్వరూపంగా భావిస్తారో వారు ధన్యులు’’అని బాబా తన ఉపదేశాన్నిచ్చారు. రాధాబాయి బాబా మాటలను శ్రద్ధగా వింది. అర్థమైందన్నట్లుగా భక్తితో చేతులు జోడించింది. – డా. కుమార్ అన్నవరపు -
నింబవృక్షం పాదుకా ప్రతిష్ఠావిశేషాలు
వట వృక్షానికి గొప్పదనం కృష్ణుడు దాన్ని ఆశ్రయించినందు వల్ల. బోధి వృక్షానికి గొప్పదనం బుద్ధుడు తపస్సుని దాన్ని ఆశ్రయించి చేసినందువల్ల. మద్ది (పాల) చెట్లకి గొప్పదనం రామచంద్రుడు ఆ జాతికి చెందిన 7 చెట్లని వధించి తన శక్తిని నిరూపించుకుని సుగ్రీవునితో సఖ్యాన్నిపొంది రావణవధకి అవకాశాన్ని ఏర్పరచుకున్నందువల్ల. శింశుపావృక్షానికి గొప్పదనం సీతమ్మ ఆ వృక్షాన్ని ఆశ్రయించి దాదాపు సంవత్సర కాలం ఉన్నందు వల్ల. నైమిశారణ్యానికున్న గొప్పదనం ఇలాంటి అనేక వృక్షాలతో కూడిన ఆ అరణ్యాన్ని ఆశ్రయించుకుని సూతమహర్షి ఉంటూ శౌనకుడూ మొదలైన మహర్షులకి అనేక పురాణేతిహాసాలని బోధించి నందువల్ల. పూవులు చిన్నవి అవుతూనూ, ఆకర్షణ ఏ మాత్రమూ లేకపోతూనూ, వాసన ఏ మాత్రమూ లేకుండానూ, కాండమంతా జిగురు కలిగిన కారణంగా ఏ ఒక్కరికీ ఆశ్రయాన్ని ఈయలేకపోతూనూ, తన ముళ్లు నేల మీద పడుతూ ఉండే కారణంగా ఎవరినీ తన దగ్గరికి రానీయకుండా చేసుకుంటూనూ, ఎలాగో వచ్చినా తన మీద నిరంతరం సంచరిస్తూ ఉండే నల్ల చీమల కారణంగా ఎవరికీ ఆశ్రయాన్నీయలేకపోతూనూ కనిపించే తుమ్మచెట్టుక్కూడా ఉన్న గొప్పదనం – ఎవరికీ ఇష్టం ఉండని భూత ప్రేత పిశాచ సంతతిని తన మీద ఉంచుకుంటూన్నందువల్ల. ఇలా ప్రతి వృక్షానికీ ఓ గొప్పదనం ఉంటూ ఉంటే అలా ఆ వృక్షాన్ని కేవలం ఆశ్రయించి ఉండటమే కాక, దాన్ని తీపిదనం కలదాన్నిగానూ, కోరికల్ని తీర్చే శక్తీ ఉన్నదిగానూ మార్చివేయడం ఎంత ఆశ్చర్యకరం! ఆనందదాయకం!! సాయి ఆ చెట్టుకింద దక్షిణ భాగంలో కూచుండే వాడు. ఆ కారణంగా దక్షిణపు వైపు ఆకులన్నీ తీపిదనంతో ఉంటూ ఉండేవి. ప్రతి వస్తువుకీ సహజలక్షణమంటూ ఒకటుంటుంది. సముద్రానికి కెరటాలతో ఉండటం, నిప్పుకి మండేతనం ఉండటం, వర్షానికి తడిసేలా చేసే గుణం, చలికి వణుకు పుట్టించేతనం ఉండటం ఎలాగో అలా, వేపకి చేదుతనమనేది సహ+జం(తనతో పుట్టిన గుణం) దాన్ని సాయి తాను కూర్చున్న కారణంగా మార్చేసాడనే విషయం లోకానికర్థం కావాలనుకుంటూ ఉపాసనీ మహారాజ్ శ్లోకాన్ని ఇంతర్థం వచ్చేలా రాశాడు. కేవలం ఆ చెట్టుని మార్చేసాడనేది దాని భావం కాదు. లోకంలో ఎందరో వేపచెట్లలా ఏ విధమైన ప్రయోజనమూ లేనివాళ్లుగా జీవిస్తూ ఉంటే, ఆ అందరినీ తనని ఆశ్రయిస్తే చాలు ప్రయోజనం కలిగిన వాళ్లుగా చేశాడనేది మరో లో అర్థం. అంతేకాదు. ఎందరో ఎందరో నిరుత్సాహంతో అణగారిన ఆశలతో ప్రాణాన్ని తీసుకోవాలనే ఆలోచనతో వచ్చి సాయిని ఆశ్రయించుకున్నారు కూడా కదా! అలా మార్చేసిన లక్షణం కలవాడు సాయి –అనే అర్థం లోకానికి తెలియాలనే ఉపాసనీ మహారాజ్ శ్లోకాన్ని ఇలా రాశాడు. లోగడ మనం చదువుకున్న ఘట్టాల్లో అనేక విధాలుగా రక్షింపబడ్డవాళ్లూ, ఆత్మహత్యలని విరమించుకున్నవాళ్లూ, తమ ప్రవర్తనలోని దోషాలని గమనించుకున్నవాళ్లూ.. ఇలా ఎందరెందరు రాలేదు! అదుగో ఆ ఉదాహరణలన్నీ కళ్లకి కట్టినట్టుగా వివరించగల శ్లోకం ఇది! కాబట్టి పాదుకల్ని చూస్తూ చేతిలో స్పృశిస్తూ ఆ పాదుకల మీద అరచేతులతో బలంగా రుద్దేస్తూ కనిపిస్తారు ఎందరో భక్తులు. ఇంక కొద్ది భక్తులైతే ముద్దులు పెట్టడం వంటి కొన్ని చేష్టల్ని కూడా చేస్తూ కనిపిస్తారు. అది సరికాదు. పాదుకల్ని స్పృశిస్తూ ఆ పాదుకలు తమ శిరసు మీద సాయినాథుడు ఉంచినట్లు భావిస్తూ పైన అనుకున్న శ్లోకాన్నే ధ్యానించుకుంటూ ఆ సాయినాథుని కారణంగా ఆ వేపచెట్టు ఎంత గొప్పది కాగలిగిందో ఆ చరిత్రని తెలుసుకుంటూ ఆ గొప్పదనమే తనకీ కలిగేలా చేయవలసిందని హృదయపూర్వకంగా ప్రార్థించాలి. అది మాత్రమే పాదుకాదర్శన కాలంలో చేయవలసిన పని. ఇంతటి గొప్పదనం తమలో దాగి ఉన్న ఆ పాదుకల ప్రతిష్ఠ ఎలా అయిందో, పాదుకలకి మాత్రమే ఆ గొప్పదనం ఎందుకుంటుందో ఇక తెలుసుకుందాం!ఎన్నెన్నో దైవక్షేత్రాలున్నాయి లోకంలో. అయితే అయోధ్య, మధుర, మాయాపురి, కాశీ, కంచి, అవంతి, ద్వారక అనే ఏడింటికే మోక్షాన్నిచ్చే క్షేత్రాలున్న పురాలుగా గుర్తింపు వచ్చింది. ధర్మస్వరూపుడనే పేరు (రామో విగ్రహవాన్ ధర్మః) ఆ రామచంద్రునికి మాత్రమే సొంతమయింది. ఎందరెందరో అవతారమూర్తులున్నారు భక్తి సామ్రాజ్యంలో. అయితే భగవానుడనే మాట (కృష్ణ స్తు భగవాన్ స్వచుమ్) కేవలం కృష్ణునికే వచ్చింది. అదే తీరుగా పర్వతాలెన్ని ఉన్నా హిమాలయానికీ, నదులెన్ని ఉన్నా గంగకీ.. ఇలా కొన్నింటికి మాత్రమే గుర్తింపు, ప్రాధాన్యత రావడానికి కారణమేమిటని ఆలోచిస్తే ఆశ్చర్యకరమైన విశేషాలు గోచరిస్తాయి.లౌకికం – అలౌకికంఏ విధంగానూ లోలోతు పరీక్షలని చేయకుండా కేవలం భౌతిక దృష్టితో చూడటమనేది ఏదైతే ఉందో దాన్ని లౌకికదర్శనం అంటారు. ఓ చెట్టుని చూస్తే అది ఎంత ఎత్తుంది? ఎంత లావైన కాండాన్ని కలిగి ఉంది? ఎన్నాళ్ల వయసుదానికి?... ఈ తీరు వివరాల సేకరణ లౌకికం. అదే మరి ఆ చెట్టు కింద ఏ యోగి కూర్చుంటూ ఉండేవాడు? పెద్ద గాలివాన వచ్చి అన్ని చెట్లు పడిపోయినా కూడా.. ఆ చెట్టే ఎందుకు పడిపోకుండా నిలవగలిగింది? చెట్టు మొదట్లో ఉన్న పాముపుట్టని ఎందరు దర్శించి పూజిస్తూ ఉండేవాళ్లు! ఆ తీరు అర్చనలు ఎన్నేళ్ల నుండి సాగుతూ వస్తున్నాయంటూ ఆలోచించడం, తెలుసుకోవడం ఏదైతే ఉందో అది అలౌకిక దర్శనం. భారత దేశానికి అప్రాచ్యుడు (పశ్చిమ దేశాల వాడు) వచ్చాక మనందరికీ వాడు నేర్పింది కేవలం లౌకిక దర్శనాన్ని మాత్రమే. దాంతో అలౌకిక దర్శన దృష్టితో ఎవరు మాట్లాడినా దాన్నంతటనీ – ‘చాదస్తం, మూఢవిశ్వాసం, పిచ్చితనం’ – వంటి మాటలతో మనం కొట్టిపడేసే తీరు అలవాటైపోయింది మనకి. అయితే ఒక్కసారి తలని మరో వైపుకి తిప్పి దృష్టిని మరో తీరుకి మళ్లించి చూస్తే చాలు – అలౌకికదర్శనం మనకి అబ్బి తీరుతుంది. ఇదంతా ఎందుకంటే ఆ తీరు అలౌకిక దృష్టితో చూడలేని పక్షంలో ద్వారకామాయి అనేది ఒక మసీదులాగా, సాయి కేవలం ఒక మహమ్మదీయునిగా, షిర్డీ అనేది ఒక ప్రసిద్ధ ఆలయమున్న ప్రదేశంలాగా, ఆయన్ని సేవించినవారంతా కేవలం భక్తులనే జాతికి చెందిన మనుషులుగా మాత్రమే కనిపిస్తారు. అలా కాక అలౌకిక దృష్టితో పరిశీలించినప్పుడు మాత్రమే ఈ పాదుకలూ – వాటి గొప్పదనమూ మనకి అర్థమవుతుంది. కానీ పక్షంలోనూ అప్రాచ్యదృష్టితోనూ చూస్తే పాదుకలు కేవలం ‘చెప్పులు’గానే కనిపిస్తాయి. కాబట్టి ఆ తీరు అలౌకిక దర్శనానికి కదులుదాం! అక్కల్కోట నుండి షిర్డీకా? అమృతాన్నైనా సరే చిల్లు ఉన్న పాత్రలో పోస్తే.. ఎలా చుక్క చుక్క చొప్పున తరిగిపోతూ కొంతసేపటికి మొత్తం శూన్యమైపోతుందో.. అలాగే తపశ్శక్తిని సాత్త్వికంగా గానీ, రాజసంగా గానీ సంపాదించినా మళ్లీ అసూయ, పగ, ద్వేషం అనే వీటిని ప్రదర్శిస్తే తపశ్శక్తి కాస్తా ఒకనాటికి క్షీణించిపోతుంది. మళ్లీ ఆ శక్తి రావాలంటే... పోయిందాన్ని పూరించాలంటే మళ్లీ తపస్సుని చేసి ఆ లోటుని పూరించాల్సిందే.ఇదంతా ఎందుకంటే, సాయిది ఏనాడూ పగ, ద్వేషం, అసూయ అనేవి ఏ కోశానా లేకుండా సాధించిన తపస్సుతో కూడిన శక్తి మాత్రమే అని చెప్పడం కోసమే.అక్కల్కోటలో మహారాజ్ గారు ఉన్నంతవరకూ ఆ తపశ్శక్తి అనేదాన్ని శూన్యం కాకుండానూ, లేదా తగ్గిపోతూ ఉండకుండానూ ఆయన తపస్సు చేసి నింపుతూ ఉండేవారు. వారి పిమ్మట ఆ శక్తిని నింపగల శక్తి, సమర్థత కలవారు దాదాపుగా లేకపోయారు. ఆ విషయాన్ని గమనించిన అక్కల్కోట(కర్) మహారాజ్ కృష్ణజీ అనే ఆయనకి న్రిత్యం అక్కల్కోటకి అతి భక్తి శ్రద్ధలతో నిర్వా్యజంగా (ఈ పని అయితే ఇక్కడికొస్తాననే తీరు బుద్ధితో కాకుండా) వచ్చి దర్శించే వ్యక్తి కలలో కనపడి – నువ్వు షిర్డీకి వెళ్లు! నేను అక్కడున్నాను’ అని చెప్పాడు. అంటే ఇక్కడ ఉన్నంత పవిత్రతా తపశ్శక్తి స్థితీ ప్రస్తుతం షిర్డీలో కనిపిస్తున్నాయని పరోక్షంగా చెప్పడమనే దానర్థం. దాంతో కృష్ణజీ షిర్డీకే వచ్చాడు. ఇంతకాలమూ తాను దర్శిస్తూ ఉన్న అక్కల్కోట శక్తి ఇక్కడ షిర్డీలో ఉన్నదీ లే నిదీ గమనిస్తూ.. ప్రతినిత్యం అంతటి శక్తి అనుభవాన్ని పొందుతూ.. ఆనందంగా జీవిస్తూ.. ఒకటి కాదు రెండు కాదు 6 నెలల పాటు షిర్డీలోనే ఉండిపోయాడు. అందుకే అక్కల్కోట నుండి తన రాకపోకలు షిర్డీకే సాగించదలిచాడు ఈ భక్తుడు.మొదట్లో అక్కల్కోట మహారాజ్లోనే స్థిరంగా ఉన్న ఆ తపశ్శక్తీ ఆకర్షణా క్రమంగా వారి పిమ్మట వారి చిత్రపటంలోకీ ఆ పిమ్మట అక్కడున్న మహారాజ్గారి పాదుకలలోకీ ప్రవేశించాయి. ఆ మీదట అక్కడి పాదుకలలోనికి ఆ శక్తిని ఆ స్థాయిలో పూరించగలవారు లేకపోయిన కారణంగా, ఆ స్థాయి శక్తి ఉన్న క్షేత్రంగా అక్కల్కోట మహారాజ్ గారే షిర్డీని నిర్ణయించిన కారణంగా మొత్తం తపశ్శక్తి అంతా షిర్డీకి చేరిపోయిందన్నమాట. ఇది అలౌకిక దృష్టితో ఆలోచించడమంటే. పాదుకలు ఈ స్థితిలో కృష్ణజీ ఆలోచించాడు ఈ షిర్డీ ఇంతటి పవిత్రత కలిగినది కాబట్టీ, ఆ విషయాన్ని అక్కల్కోట మహారాజ్ గారే నిర్ణయించి చెప్పారు కాబట్టీ, ఆ శక్తిని చిరకాలం స్థాపించి ఉంచడం కోసం– పాదుకలని అక్కడ అక్కల్కోటలో స్థాపించిన తీరుగా ప్రతిష్ఠించాలని. ఇదే విషయాన్ని తనతో పాటు సమానస్థాయి కల భక్తి విశ్వాసాలున్న మిత్రులతో సంప్రదించాడు. వాళ్లూ అంగీకరించారు మొదటి మాటతోనే– మొదటి మాటలోనే. ‘ఏకైకస్యాపి నిర్ణయాభ్యుపగమో దోషాయ భవతి’ అని సంస్కృతంలో ఓ మాట. ‘ఎంతగా తానాలోంచినా, ఎంతగా దాన్ని పరిశీలించి తప్పుకాదని అనుకున్నా కూడా, ఏ విషయాన్నీ ఒక్కనిగా ఉంటూ ఓ నిర్ణయాన్ని చేస్తే తప్పక అందులో దోషం ఉండి తీరుతుందని దాని భావం. ఆ కారణంగా కృష్ణజీతో పాటు మిగిలిన అందరూ కలిసి మంత్రోపాసన నిరంతరం చేస్తూ ఉండేవారూ – లౌకిక దృష్టి ఏ మాత్రమూ లేనివారూ అయిన ఉపాసనీ మహారాజ్ (పేరులోనే ఉంది ఆయన మంత్రోపాసనలో ఎంత ప్రసిద్ధిని పొందినవాడో) గారికి ఈ పాదుకా ప్రతిష్ఠ ప్రతి పాదనని తెలియజేస్తూ తమ బుద్ధికి తోచిన విధంగా పాదుకల నమూనాని వారి ముందుంచారు. అంతే! ఆ ఉపాసనీ మహారాజ్ గారు ఆ పాదుకల్లో ఉండబోయే తపశ్శక్తినీ, పాదుకలనీ, రాబోయే ఖ్యాతినీ మానసికంగా తమ బుద్ధితో గ్రహించి– వీటిని ప్రతిష్ఠించడం ఎంతో గొప్పవిషయం, అంతే కాక తగిన విధంగా గౌరవించడమే అని భావించి వెంటనే ఆ పాదుకల్లో శంఖం, చక్రం, గద, పద్మం అనే నాల్గింటినీ కూడా చేర్చారు. శంఖమనేది ధ్వనిని పుట్టించేది కాబట్టి ధ్వనిని పుట్టించగల శక్తి ఆకాశానిది కాబట్టీ (శబ్ధగుణక మాకాశమ్) ఆకాశశక్తి ఈ పాదుకలలో ఉంచదలిచారన్నమాట. దాంతో ఆకాశంలో ఉండే సర్వగ్రహాలూ ఈ శంఖం గుర్తులో ఉన్నాయని పరోక్షంగా తెలియజేయడమన్నమాట. ఆ కారణంగానే పాదుకలని భక్తి విశ్వాసాలతో నమస్కరిస్తే చాలు గ్రహబాధలు తొలుగుతాయి, తొలుగుతున్నాయి.ఇక చక్రమనేది కాల చక్రానికి (నడుస్తున్న కాలగతి జీవితం) సంకేతం. అందుకే ఈ చక్రం వాటిలో ఉన్న పాదుకలకి నమస్కరిస్తే చాలు జీవితగమనంలో వచ్చే ఒడిదుడుకులు సర్దుకుంటాయి – సమస్యలకి పరిష్కారాలు లభిస్తాయి – లభిస్తున్నాయి.ఇక గద అనేది శత్రుసంహారానికి సంకేతం. ఈ చిహ్నం వాటిలో ఉన్న పాదుకలకి నమస్కరిస్తే మనని శారీరకంగా మానసికంగా బాధపెడుతూ ఉండే ఆ శత్రువులు దూరంగా వెళ్లిపోతారు.నిరంతరం మానసికక్షోభ తొలిగిపోతుంది. తొలిగిపోతుంది కూడా.ఆ మీదట పద్మమనేది ప్రశాంతతకీ బుద్ధి వికాసానికీ సంకేతం. గ్రహబాధలు శంఖం ద్వారా, శత్రుబాధలు గద ద్వారా తొలిగిపోయాక ఇక వ్యక్తికి ఉండేదీ కలిగేదీ మనశ్శాంతే కదా! ఆ మనశ్శాంతికి సంకేతం పద్మం. అలాగే ఇన్ని అనుభవాలు కలిగాక వ్యక్తి ఏవిధంగా జీవించాలో చెప్పగల బుద్ధి వికాసమనేది కూడా పద్మం ద్వారానే కలుగుతుందని చెప్పడం దీని లోభావం(అంతరార్థం).ఇంతటి అర్థవంతమైనవి పాదుకలనే దృష్టితో ఆలోచనతో ఉపాసనీ మహారాజ్ వారు పాదుకలకి ఈ చిహ్నాలని జతచేశారు. ఇంతటి తపశ్శక్తీ ఇన్ని తీరుల ఇబ్బందుల నివారణలూ కలిగేలా పాదుకలని ఏర్పాటు చేసినా కూడా ఆ ఉపాసనీ మహారాజ్ గారికి సంతృప్తి కలగలేదు. ఏదో ఓ లోటు అనిపించనే అనిపించింది. దాంతో సాయికి ఏ అమోఘమైన తపశ్శక్తి అనేది లభించడానికి వేపచెట్టు సాక్షిగా ఉందో, ఆ వేపచెట్టు ఏ ద్వారకామాయికి దక్షిణ ప్రదేశంలో ఉందో, అంతేకాక సాయి నిరంతరం (12 ఏండ్ల పాటు) తపస్సులో గడిపిన గురుస్థానం సమీపంలో ఉందో ఆ విశేషం లోకానికి భక్తజనానికి) తెలియాలనీ తెలియజేయాలనీ భావించిన ఉపాసనీ మహారాజ్ ఆ వేపచెట్టు శక్తినీ, దానికి సాయి కలిగించిన అసాధ్యశక్తినీ (తియ్యదనం కోరికలు తీర్చేతనం..) బహిరంగపరుస్తూ ఓ శ్లోకాన్ని చెక్కించి ఆ ఫలకాన్ని కూడా ఆ పాదుకలవద్దే ఉంచాలని నిర్ణయించారు. నిజానికి ఆ పాదుకలూ వాటిలో ఈ చిహ్నాలు, ఆ శ్లోకమూ గనుక ఉండని పక్షంలో ఇన్ని విశేషాలు లోకానికి తెలిసుండేవా? మహాత్ములది ఎప్పుడూ లోకాన్ని అనుగ్రహించాలనే దృష్టి– దాంతో పాటు ఆ అనుగ్రహం లోకాన్ని అనుగ్రహించాలనే దృష్టి – దాంతో పాటు ఆ అనుగ్రహం ఎలా లభిస్తుందో ఆ ఉపాయాన్ని అందరికీ వివరించి చెప్పాలనే దృష్టీను. ఆ కారణంగా పాదుకలని ఇంతటి లోభావం కల దృష్టితో మనం దర్శించాలన్నమాట. చాలా మంది భక్తులు పాదుకల మీద అరచేతుల్ని పెట్టి అరగదీస్తూ, తలని వాటికి మోదుకుంటూ, ఇంకకొందరైతే చుంబిస్తూ... ఏమేమో చేసేస్తుంటారు. పాదుకా దర్శనం అనుగ్రహాన్ని పొందడమనేది పై తీరు భావనతో కళ్లతో దర్శిస్తే చాలు లభిస్తుంది నిజానికి.వ్యాధితో బాధపడుతున్న రోగికి పైకి కనిపించే రోగం మాత్రమే కాక ఇంకా ఏమైనా కూడా లోపల దాగున్నాయేమోనని గ్రహించి ఆ అన్ని రోగాలూ తొలగిపోయేలానూ, వచ్చి ప్రధానంగా కనిపిస్తున్న ప్రధాన రోగానికి సంబంధించిన మూలకణాల నిర్మూలనానికి ఎలా వైద్యుడు ఆయా ఔషధాలని కలిపి ఓ ఔషధాన్ని సిద్ధం చేస్తాడో అలా ఉపాసనీ మహారాజ్ గారు ఈ పాదుకలని అంతటి శ్రద్ధతోనూ చేసి ఉంచడమే కాక, ఏ ఔషధాన్ని ఎంత చలి లేదా వేడి ప్రదేశంలో ఉంచాలో ఆయనకాయనే మనకి చెప్పినట్టుగా ఈ పాదుకలు ఆ వేప చెట్టు కిందనే ఉండాలని ఓ నిర్ణయాన్ని కూడా చేశారు. దాంతో భక్తులందరికీ పాదుకాప్రతిష్ఠ అనేది ఓ ఆనందదాయకమైన ఉత్సవంగా అనిపించింది. -
పంచభూతాధికారి
ఇదేమిటి? సాయినాథునికున్న పంచవాయువుల ఆధిపత్యాన్ని గురించి వివరించుకుంటూ అపానమనే వాయువు మీద ఆధిపత్యం వరకూ ఉదాహరణపూర్వకంగా తెలియజేసుకున్నాం. ఆ వెంటనే వచ్చేది వ్యానవాయువు కదా! మరి ఉదానవాయువు గురించి చెప్పుకోవడమేమిటి? అనిపిస్తుంది మనకి. నిజమే! వ్యానవాయువు (సర్వ శరీరగః) శరీరం నిండుగా ప్రవహిస్తూ ఎక్కడ ఏ వాయువు తనకుండాల్సిన పరిమాణం కంటే తక్కువగా ఉంటుందో అక్కడ ఆ లోటుని పూరించే వాయువు కాబట్టి దాని ప్రయాణదూరం పరిమాణం మరింత కాబట్టి దాన్ని చివర్లో వివరించుకోవడం కోసం ఈ ఉదానవాయువుని గురించి చెప్పుకుంటున్నామన్నమాట! సాయి నాకు నచ్చడు! ఉదానః కంఠదేశస్థం అని శాస్త్రం. కంఠంలో నిలిచి ఉంటూ నిరంతరం వ్యక్తి మాట్లాడదలిచిన ప్రతి అక్షరానికీ శక్తిని సమకూర్చేది ఉదానవాయువని అనుకున్నాం. అదుగో ఆ ఉదానవాయువుని అదుపు చేయగల శక్తి సాయినాథునికి స్పష్టంగా ఉంది కాబట్టే ఏది అంటే అది జరిగిపోవడం, ఏది వద్దంటే అది జరక్కపోవడం, వద్దని తాను చెప్పిన పనిని మొండిగా చేయదలిస్తే అది విఘ్నాలపాలై పూర్తికాకపోవడం... వంటివన్నీ జరిగాయంటే సాయినాథుని శక్తి ఉదానవాయువు మీద ఆధిపత్య యుక్తీ సామాన్యం కాదని అనుకోవలసిందేగా. ఉదాహరణలని చూద్దాం! ఎంతగా ప్రకాశాన్నిచ్చే దీపమైనప్పటికీ దాని కింద మాత్రం నీడ ఉండక తప్పదు. అలాగే సాయినాథుడు ఎందరికో ఎంతో గొప్పవాడూ దైవాంశసంభూతుడూ మళ్లీ మాట్లాడితే దైవసమానుడూ అయినప్పటికీ కొందరి దృష్టిలో మాత్రం మరో తీరుగానే అనిపించేవాడు.ఇలాంటి సందర్భాల్లో ఆయన గురించి మరోలా అనుకున్నా, ఎవరో అనుకున్నవి విన్నా కళ్లు పోతాయనుకుంటూ లెంపలు వేసుకుని మౌనంగా ఉండిపోకూడదు. ఏమనుకున్నారో తెలుసుకోవాలి. దానికి ప్రతిస్పందనగా ఏం జరిగిందో తెలుసుకోవాలి. అప్పుడే ఒక స్థిరత్వం ఒక విషయాన్ని గూర్చీ ఒక మహనీయుని గూర్చీ తెలిసి వస్తుంది. షిర్డీకి సమీపంలోనే కొందరుండేవాళ్లు. వాళ్లందరూ ఒక వ్యక్తి చెప్పిన మాటలకే లోబడి ఉండేవాళ్లు. దానికి కారణం ఆ వ్యక్తి ఎంతో గొప్పవాడనే వాళ్లకున్న ఒక విశ్వాసం మాత్రమే. ఓ రోజున ఈ అందరూ ఒకచోట కూర్చుని ఓ చోట చర్చ ప్రారంభించారు. ‘మేం నిర్గుణోపాసకులం. అంటే దైవానికి ఓ రూపం ఉంటుందని అసలు భావించని వాళ్లం. దైవం అంటే ఒక అతీతశక్తి మాత్రమే. అంతేకాదు. ఫలానివాడు దైవం అనుకుంటూ అతడ్ని పూజించేవాళ్లని కూడా మేం గౌరవించం. దానికి కారణం భగవంతుడే చెప్పుకున్నాడుగా.. తనకి తానుగా ‘రూపం లేనివాడిని’ అని. ఆయనంతట ఆయనే తనకి రూపం లేదని స్పష్టంగా చెప్పేస్తే ఏ రూపమూ లేని ఆయన్ని రూపం ఉన్నవాడుగా భావిస్తూ, ఆ రూపానికి ప్రతిబింబం ‘ఫలానివాడు’ అనుకుంటూ ఒకాయన్ని (సాయి) దైవంగా కొలవడమంటే ఎంత అవివేకం! అని ఒకడన్నాడు.షిర్డీ గురించి ఎందరో ఎన్నెన్నో కథలని చెప్పేస్తూ వింత వింత ఆనుభవాలని వివరిస్తూ సాయినాథుడ్ని గురించిన ప్రచారాన్ని విశేషంగా చేసేస్తున్నారు. నిజనిర్థారణ కోసం మేం సాయినాథుని వద్దకెళ్లగానే ఆయన భక్తుల్ని దక్షిణ అడుగుతూ కనిపించాడు ఓ మారు. వెంటనే వచ్చేసాం. సాధువూ, సన్యాసీ, సర్వసంగపరిత్యాగీ అయిన వ్యక్తికి మనమేదైనా ఇయ్యాలి తప్ప... ఆయనకాయనే అడగడమేమిటి? మేం ఇయ్యలేదు. సాధువై ధనాన్ని అడిగి తీసుకోవడం ఎంతహేయం? నిజాన్ని నిజంగా మాట్లాడుకుంటే అసలు సాధువనేవాడు– (యధేచ్ఛాలాభ సంతృష్టః) ఏం లభిస్తే దానితో సంతృప్తి చెందాల్సినవాడు కావాలి.ఏదీ దొరకనివాడు దైవం తనని ఆ రోజున ఏదీ తినద్దన్నాడనే సంపూర్ణ విశ్వాసంతో జీవించాలి గానీ, తానే దక్షిణనీయవలసిందనడం ఎంతహేయం? అని మరొకడన్నాడు. అయినా ‘కామఠవిధానం’ అని లోకంలో ఒక మాట ఉంది. కమఠం అంటే తాబేలు. తాబేలు సముద్రపు ఒడ్డుకొచ్చి కెరటాల్లో కొట్టుకుపోడానికి వీల్లేని ప్రదేశంలోనూ, ఏ మాత్రమూ కూడా పక్షులకారణంగా ఏ ప్రమాదం జరిగే వీల్లేకుండానూ తన పిల్లల్ని అంటే గ్రుడ్లని ఒడ్డున ఇసుకని తవ్వి ఆ గోతిలో మెల్లగా మెల్లగా విడుస్తూ చిన్నపాటి దెబ్బకైనా పగిలిపోయే తీరుగా ఉన్న గుడ్లని ఒకటి పిమ్మట మరొకటి చొప్పున పైనుంచి జారవిడుస్తూ (కంటూ) మొత్తం అండాలని ఒకే గోతిలో పడేలా విడిచి మళ్లీ సముద్రంలోనికి వెళ్లిపోతుంది. అంత విశాలమైన సముద్రంలోకి వెళ్లిపోయిన కారణంగానూ పైగా ఈదుకుంటూ పోయే కారణంగానూ, సముద్రతరంగాలు తనని మరింత దూరంగానూ, ఎటువైపుకో తీసుకుపోయే కారణంగానూ, ఎక్కడ ఏ వైపున ఏ ఒడ్డున తన గుడ్లని ఇసుకతో కప్పెట్టేసిన కారణంగానూ గుడ్లని గుర్తించలేదు.అప్పుడది తన గుడ్లని ఒక్కసారిగా మనసులో తలుచుకుంటుంది. అంతే ఆ గుడ్లన్నీ కూడా పొదగబడినట్లుగా ఎప్పుడూ తన తల్లి తలుచుకుంటున్నప్పుడల్లా ఉంటే అప్పుడల్లా క్రమంగా ఎదుగుతూ ఒక్కసారిగా తమ పైనున్న ఇసుకని తొలిగించుకుంటూ పిల్లలుగా మారిపోయి అంతలోనే సముద్రంలోనికి వెళ్లిపోతాయి. దాన్నే ‘కామఠం’ అంటారు. అంటే తాబేలు తన గుడ్లని పిల్లలుగా చేసుకునే విధానమని దీని భావమన్నమాట. ఈ మాటనే సరిగా పలకడం రాకనో కాలక్రమంగా మరోలా మారిపోవడం వల్లనో ఆవిడకి కామఠం మరీ ఎక్కువ– అనే తీరుగా ‘కామఠం’గా మారిపోయింది. సరే! అలాంటి కామఠ పుత్రులం కాబట్టి మమ్మల్ని ఆ దైవమే నిరాకారరూపంగా ఉంటూ తలుచుకోవాలి గానీ.. మేమేమిటి? ఆ సాయిని దర్శించడమేమిటి? మీరు మాత్రం వేదాంతతత్వం తెలిస్తే వెళ్లనే వెళ్లరు అంటూ ఆ వ్యక్తులంతా గోష్ఠి చేసుకుంటూ ఉండేవాళ్లు. వ్యక్తి పూజ సరికాదంటూ తీవ్రంగా వాదాలు చేస్తూండే ఈ అందరికీ ఓ నాయకుడు లాంటి వ్యక్తి ఉండేవాడని అనుకున్నాం కదా! ఇలా ఉన్న కాలంలో ఓసారి సాయిభక్తులంతా షిర్డీకి వెళ్తూ ‘నువ్వు కూడా రాకూడదూ! స్నేహితుడివి కదా!?’ అన్నారు.దానికి ఆ వ్యక్తి బదులు పలుకుతూ ‘నాకు సాయి నచ్చడని ముందే చెప్పానుగా! అయినా స్నేహధర్మాన్ని ఇష్టపడతాను కాబట్టి వస్తాను. ఆయన్ని చూసినా నమస్కరించను. పాదాల మీద పడను. దక్షిణగా నా వద్ద సొమ్మున్నా ఇయ్యను. అడిగితే మరోలా చూస్తాను. మరి మీ మనోభావాలు దెబ్బతింటాయేమో ఆలోచించుకుని నన్ను రమ్మనండి’ అన్నాడు. వాళ్లంతా ఆ విషయాలన్నీ మాకనవసరం. మా భక్తి విశ్వాసాలు నువ్వెంతగా వారించినా, తీర్మానించినా చెడవు. వెడదాం అన్నారు. సరేనంటూ ఆ వ్యక్తి కూడా బయలుదేరాడు షిర్డీకి వాళ్లతో. షిర్డీ చేరారో లేదో ఈ భక్తులందరికీ సాయిని దర్శించాలనే ఆత్రుత మరింత పెరిగి నేరుగా మసీదుకెళ్లారు. ఆ మెట్లని ఎక్కుతూ ఉండగానే ఈ వ్యక్తితో సహా వచ్చిన భక్తులందర్నీ కొద్ది దూరం నుండి చూస్తూనే బాబా ‘అరెరే! వచ్చేశారే మీరు! మంచిది! రండి.. రండి!!’ అన్నాడు ఎదురుచూపుతో ఉన్న బంధువు వద్దకి ఆప్తబంధువు రాగానే పలికిన తీరులో.అందరు సాయి భక్తులూ ఒకరి పిమ్మట ఒకరు సాయి పాదాల మీద పడి నమస్కరించి పైకి లేచి ఆయన ముఖంలోనికి ఆర్థ్రంగా చూస్తూ వెళ్తూంటే, నమస్కరించను– దక్షిణని అడిగినా ఇయ్యనంటూ పూర్తి వ్యతిరేకభావంతో వచ్చిన ఆ వ్యక్తి మరింత భక్తితో సాయి పాదాల మీద తలని పెట్టాడు. శరీరం నిండుగా కంపనం వస్తూ ఉండగా సజలనయనాలతో ఆయన ముఖంలోనికి ముఖాన్ని పెట్టి చూస్తూ లేవనే లేదు. సాయి స్వయంగా అతని భుజాలని పట్టి పైకి లేపితే లేచి మరోమారు నమస్కరిస్తూ పాదాలమీద పడిపోయాడు. అతనితో వచ్చిన మిగిలిన అందరు దర్శనం ముగించుకుని వస్తూంటే మిత్రులు అడిగారు – ‘ఏమయింది నీకు?’ అని.సజలనయనాలతో హృదయపూర్వకమైన కంఠస్వరంతో ఆ వ్యక్తి చెప్పాడు. బాబా మాట్లాడిన ఆ గొంతు అచ్చం మా నాన్నదే. మా నాన్నంటే నాకు ఈ ప్రపంచంలో చెప్పలేనంత గౌరవం, భక్తీ, విశ్వాసం. ఆయన్ని పోగొట్టుకున్న దగ్గర్నుండి ప్రపంచమంతా శూన్యంగానే అనిపించసాగింది. ఏదో జీవిస్తున్నాను గానీ ఎప్పుడూ ఆ స్మృతిలోనే ఉంటూ ఉన్నాను. ఆ భావమేనేమో నాకు దైవం దైవవిశ్వాసం ఉన్న జనం ఇలా ఇందరి మీద ఓ విరక్తిని కలిగించడానికి కారణం. ఈ రోజున మీ అందరితో కలిసి వచ్చాక– అరెరే! వచ్చేసారే మీరు! రండి... రండి!!’ అనే ఆ మాటలు మా తండ్రే ఆయనలో చేరి నన్నూ, నాతో ఉన్న మిత్రులైన మిమ్మల్ని కలిపి ఉద్దేశించి పలికిన మాటల్లా అనిపించాయి. బాబా పలికిన ఆ వాక్యాన్ని మీరు ఒక్కమారు మాత్రమే విని ఉంటారేమో గానీ నేను మాత్రం ఆ వాక్యాలని, మా తండ్రి బాబాలో దాగి పలికిన వాక్యాలని, ఎన్నోమార్లు తిరిగి తిరిగి అనిపించుకుని విన్నానో నాకే తెలియదంటూ ఆనందబాష్పాలని పెట్టుకున్నాడు. గుర్తుంచుకోవాలి. ఉదానమనే వాయువు కంఠంలో ఉంటుందని అనుకున్నాం. ‘వాయో రగ్నీః’ వాయువు ఎప్పుడూ తనలో అగ్నిని కలిగి ఉంటుంది. ఆ అగ్ని తనలో దాగి ఉన్న కారణంగానే మాట్లాడదలిచిన వ్యక్తి కంఠం నుండి ధ్వని (నాదం) బయటికి వచ్చి మాటగా అవుతుంది. ఆ వచ్చే ధ్వనినే ఎంత గాలిని పూరించి ఏ అక్షరాన్ని పలకాలో, ఏ అక్షరానికి ఎంత గాలిని తగ్గించి తేల్చి పలకాలో... ఇలా నియమించుకుని పలికినప్పుడు మాటలో స్పష్టత వచ్చి ఎదుటివ్యక్తి మన మాటకి ఆకర్షితుడవుతాడు. అలా ఆకర్షించే తీరులో మాట్లాడగలిగేలా చేయగలిగినవి హనువులు(దౌడలు) అలాంటి హనువులున్నవాడు కాబట్టే ఆంజనేయుడ్ని ‘హనుమాన్’ (ప్రశస్తే హనూ యస్య సః) అన్నారు. ఆయనకిష్టమైన పేర్లు కల స్తోత్రంలో (హనుమానంజనాసూనుః... దశగ్రీవస్య దర్పహా) మొదట పేరు హనుమాన్ అనీ ఆ మీదట అంజనీ పుత్రుడనీ అర్థం గల నామాలు కనిపిస్తాయి. వాయువు నుండి అగ్ని వచ్చినప్పుడే ధ్వని బయటికొస్తుంది. ఆ అగ్ని లేనప్పుడు కంఠం నుండి కేవలం వాయువే రావడం మనకి అనుభవంలో ఉన్న విషయాలే. ‘గొంతుపోయింది’ అనే మాటని కూడా కేవలం వాయువునే కంఠం నుంచి విడుస్తూ చెప్తాం. ఈ వాయువునే మరింత నాదబద్ధంగా చేయడం వల్లనే అది సంగీతంగా రూపొందింది. సరే! ఇంతకీ సాయినాథుడేం చేసాడట? ఏ ఉదానవాయువనేది తన కంఠంలో ఉందో ఆ కంఠంలోని ధ్వని ఈ వచ్చిన వ్యక్తికి సంబంధించిన తండ్రి కంఠధ్వనిలా వినిపించేలానూ, ఆయనే తనలో అంతర్లీనుడై ఉన్నట్టుగానూ అనిపించేశాడు. ఇదేదో మాయ గారడీ వంచన తనని నమ్మింపజేసుకోవడానికి చేసిన చేష్టా అనుకోకూడదు. ఏ వ్యక్తికి ఎప్పుడు సంస్కారం ఫలిస్తుందో ఆ విషయాన్ని ఎవరూ గుర్తించలేరు.పరమనాస్తికధోరణితో ఉన్న వివేకానందుడు రామకృష్ణ పరమహంసని చూస్తూనే ఈ వెర్రిబాగులవాడూ ముక్కు నుంచి ద్రవం(చీమిడి) కార్చుకుంటున్నవాడూ మాట్లాడితే ఒకే అక్షరాన్ని రెండుమూడుమార్లు పలుకుతూ నత్తితో ఉన్న నోటివాడూ నాకు దైవాన్ని చూపిస్తానంటున్నాడా? పైగా నువ్వెప్పుడైనా దైవాన్ని చూశావా? అని అడిగితే నిన్ను చూస్తూన్నంత స్పష్టంగా చూసానని కూడా అంటున్నాడా? పోనీ ఆ ముఖంలో ఏ విధమైన వంచన అసత్యధోరణీ లేకుండా స్పష్టతతో పాటు సత్యశీలత కనిపిస్తోందా? అనుకుంటూ అర్థవిశ్వాసంతో (సగం నమ్మకం) ఆయన్ని చూస్తూ అక్కడే ఉండిపోయాడు మరి కొంతసేపు.ఆయన తన దగ్గరకి రమ్మని వివేకానందుడు రాగానే తన పాదాన్ని వివేకానందుని శిరసు మీద పెట్టాడో అప్పుడు వివేకానందునికి ప్రపంచమంతా గిర్రున తిరిగిపోయి క్షణకాలం అనంతరం రామకృష్ణుని గొప్పదనం అర్థమైంది. అంతే! ఇక ఆ పిమ్మట వివేకానందునికి మరో దైవమే కనపడలేదు. అంత ఆనందాన్ని అనుభవించిన వివేకానందునితో రామకృష్ణపరమహంస అన్నమాటలు ‘సంస్కారం ఫలించే రోజు రావాలి వివేకా!’ అని. సరిగ్గా అలాగే జరిగింది ఈ నాస్తికధోరణి కల వ్యక్తికి. మిగిలిన మిత్రులందరి కంటే నిజంగా గొప్పవాడెవరంటే ఈ వ్యక్తే. సాయిదర్శనం అయిపోయింది కదా! అని అందరూ వెళ్లిపోయారు కానీ ఈ వ్యక్తి అలాగే ఓ క్షణం నిలబడిన సందర్భంలో ‘కాకా మహాజని’ వచ్చాడు. ఆయనతో కలిసి బాబా వద్దకి వెళ్లగానే ‘కాకా! నాకు ఓ 17 రూపాయల దక్షిణనియ్యి’ అని అడిగాడు. ఈ వ్యక్తి తనని కూడా అడుగుతాడేమో ఇద్దామనే దృష్టితో ఉన్నాడు కానీ సాయి అడగనే లేదు. తీరా తనంత తానే దక్షిణగా అంతని గానీ అంతకు మించిన ద్రవ్యాన్ని గానీ ఇస్తేనో? అనే ఆలోచన వచ్చింది. ఒకవేళ సాయి వద్దని తిరస్కరిస్తేనో? ఈ కలిగిన ఆనందానుభూతి మొత్తం పల్చబడిపోవచ్చుననుకుంటూ మెట్లుదిగి కాకా మహాజనితో బసకి వచ్చేశాడు ఆ వ్యక్తి. మళ్లీ మధ్యాహ్నపువేళ– షిర్డీకి వచ్చిన భక్తులందరికీ ఉండే నియమం– బాబా అనుజ్ఞని కోరి తిరిగి ప్రయాణం కావడమనే దాని ప్రకారం మళ్లీ కాకామహాజనితో కలిసి సాయి వద్దకెళ్లాడు ఆనందంతో ఈ వ్యక్తి. ఆయన ఈ వ్యక్తిని చూస్తూ వెంటనే తన దృష్టిని కాకామహాజనిపైకి ప్రసరింపజేసి – కాకా! మరికొంత దక్షిణనివ్వు! అని అడిగాడు. దాన్ని ఓ మహా ప్రసాదంగా భావించిన కాకా మహాజని మళ్లీ దక్షిణ నిచ్చాడు సాయికి. వెంటనే ఈ వ్యక్తి కాకా మహాజనికి మరింత దగ్గరగా జరిగి అతనికి మాత్రమే వినిపించేలా! స్వామీ! ఇంతకు ముందూ ఇప్పుడూ కూడా అంటే 2 సార్లు సాయి నిన్ను మాత్రమే దక్షిణ నడిగాడు కదా! నేనిస్తే అది ఆయనకి అంగీకారం కాదా? నేనియ్యకూడదా? మరి నా మనసు ఇయ్యాలని అనుకుంటూ ఉవ్విళ్లూరుతోంది’ అన్నాడు రహస్యంగా. అంతలో సాయే కలిపించుకుంటూ ‘కాకా! ఏమిటి అంటున్నాడు అతను? ఏమిటి చెబుతున్నాడు?’ అన్నాడు. మళ్లీ ఆ కంఠస్వరాన్ని వింటూనే చలించిపోయాడు ఈ వ్యక్తి. కాకా చెప్పాడు సాయితో... ‘నీకు దక్షిణనీయాలనుకుంటూ తపించిపోతున్నాడు ఈ వ్యక్తి’ అని. సాయి చిరునవ్వు నవ్వుతూ ఈ వ్యక్తి ముఖంలోనికే చూస్తూ... నీకసలు సాయి దర్శనమే ఇష్టంలేదు. సాధువులూ సన్యాసులూ ఎవరేమిస్తామన్నా తీసుకోకూడని దృక్పథంలో మాత్రమే ఉండాలనుకునే మనస్తత్వం వాడివి కూడా. పైగా నేను నిన్ను అడిగి తీసుకోవడం కూడానా? అందుకే నిన్నడగలేదు’ అంటూ ముఖాన్ని కాకా మీదికి తిప్పబోతూ మళ్లీ ఆగి ఈ వ్యక్తి వైపుకే తలని తిప్పి’ అంతగా నీకియ్యాలని గనుక అనిపిస్తే ఇవ్వు’ అన్నాడు. సాధు సన్యాసులు దక్షిణని తీసుకుంటే తప్పుగానూ, అడిగి తీసుకున్న పక్షంలో మరింత తప్పుగానూ భావించే ఈ వ్యక్తి సాయిని అడిగించుకుని ప్రాధేయపడి మరీ దక్షిణని ఇస్తున్నాడా? అనుకుంటూ కాకా మహాజని మరింత ఆశ్చర్యంలో మునిగిపోయాడు. ఈ వ్యక్తి సాయి అడిగాడో లేదో ఆ జేబు ఈ జేబు వెదుకుతూ సొమ్ముని తీయబోతుంటే సాయి ‘అంత తొందరెందుకయ్యా? కొంపలేం మునిగిపోవడం లేదు. నువ్వియ్యదలిచావు. నేను తీసుకోదలిచాను కదా! ప్రశాంతంగా కూర్చో! ఆ మీదటనే ఇయ్యి!’ అన్నాడు. సాయి పలుకుతున్న ప్రతి పలుకూ తనని బంధించేస్తోంది. తప్పు చేశానని తనని హెచ్చరిస్తోంది. ఈ దశలో సాయి – ‘నీలో ఉన్న తైలవర్తకుడ్ని తొలగించు!’ అన్నాడు. పాపపు ఆలోచనలున్న వ్యక్తిని ‘తైలవర్తకుడు’ అనే పేరుతో పిలిచేవాడు సాయి. ఆ లోఅర్థం అర్థమైన ఈ వ్యక్తి సాయిముఖంలోనికే చూస్తుంటే సాయి స్వ–పరభేదదృష్టీ దానివ్లల కోల్పోయే మనశ్శాంతి ఆ కారణంగా కలిగే మానసిక అశాంతీ గురించి వివరిస్తూ చక్కని బోధ చేశాడు ఆ వ్యక్తికి. సాయి ఏది మాట్లాడుతున్నా అది ఓ పాయసం లాగా ద్రవంలాగా నేరుగా లోనికి వెళ్లిపోతూ ఉంటే తప్ప ఎక్కడా అర్థం కాని మాటా విషయం లేనే లేదనిపించింది ఆ వ్యక్తికి.ఉపదేశం ముగిసాక ఈ వ్యక్తి షిర్డీ విడిచి వెళ్లడానికి అనుజ్ఞని కోరకముందే ‘వెళ్లు వెళ్లు తొందరగా వెళ్లు’ అన్నాడు. అప్పటికే ఉరుములు ప్రారంభమయ్యాయి ప్రకృతిలో. మెరుపులు మెరుస్తున్నాయి. అందుకే వర్షం వచ్చేలోగా వెళ్లవలసిందిగా సాయి సూచిస్తున్నాడనుకుంటూ ఈ వ్యక్తి నావప్రయాణాన్ని భయం భయంగా చేశాడు. ఆశ్చర్యకరమైన అంశమేమంటే నావప్రయాణం ముగిసి రైలెక్కాడో లేదో కుంభవృష్టి కురిసింది. తన ప్రదేశమైన బాంబాయిలోని ఇంట్లోకి వెళ్లాడో లేదో ఒక పక్షి వేగంగా తలుపు తెరవగానే ఎగిరిపోయింది. మరో రెండు పక్షులు మరణించి కనిపించాయి. ఎంత తప్పు చేశాను! పక్షులున్నాయనే మాటని మరిచి తలుపులు మూసి బయలుదేరాను. కనీసం ఓ కిటికీని తెరిచినా ఈ నేరానికి పాత్రుడ్ని అయ్యుండేవాడ్ని కానే కాకపోయుండేవాడ్ని. తప్పు జరుగుతుందేమో, తప్పు చేస్తున్నానేమో అనే ధ్యాసతోనే ఉండాలనే బుద్ధిని సాయి తనకిచ్చాడనుకుంటూ ఇంటిలోనికి వెళ్లాడు. ఆ మూడో పక్షి కూడా మరణించకుండా రక్షించడానికే వర్షంలో తడవకుండా పోడానికీ సాయి తనని ‘వెంటనే వెళ్లు’ అన్నాడని అర్థం చేసుకున్నాడు.తన తండ్రి సాయి రూపంలో ఉన్నాడనీ, ఆయన మాటలో తండ్రి జీవించే ఉన్నాడనీ ఈ వ్యక్తి తన జీవితమంతా భావిస్తూ ప్రశాంతంగా ఉండిపోయాడు. సాయి ఉదానవాయు శక్తిని మరో ఉదాహరణం ద్వారా కూడా తెలుసుకుందాం! – సశేషం ∙డా. మైలవరపు శ్రీనివాసరావు -
షిర్డీ–హైదరాబాద్ మధ్య స్పైస్‌జెట్ విమానం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విమానయాన సంస్థ స్పైస్‌జెట్ నవంబర్ 3 నుంచి షిర్డీ–హైదరాబాద్ మధ్య ప్రతిరోజూ డైరెక్ట్ సర్వీసు నడుపనుంది. ఉదయం 9.35కు హైదరాబాద్‌లో బయల్దేరే విమానం షిర్డీలో 11 గంటలకు దిగుతుంది. తిరుగు ప్రయాణంలో 11.20కి ప్రారంభమై 12.40కి హైదరాబాద్ చేరుకుంటుంది. ఇందుకోసం బాంబార్డియర్ క్యూ400 రకం విమానాన్ని కేటాయించామని స్పైస్‌జెట్ చీఫ్ సేల్స్, రెవెన్యూ ఆఫీసర్ శిల్పా భాటియా తెలిపారు. టికెట్ ధర షిర్డీకి రూ.3,999, తిరుగు ప్రయాణానికి రూ.3,900లు ఉంది. ప్రస్తుతం ఢిల్లీ నుంచి షిర్డీకి డైరెక్ట్ ఫ్లయిట్‌ను సంస్థ నడుపుతోంది. -
ఏం కావాలోయి? ఉందిగా ద్వారకామాయి!!
ఎంతో వేగంగా ప్రవహించి ప్రవహించి బలంగానూ, ముందూ వెనుకలకి కదులుతూనూ ఉన్న నీరంతా ఒక్కసారి ఆనకట్ట దగ్గర ఆగిపోయిందంటే, దాన్ని అలా ఆపగలిగిన ఆనకట్ట గట్టిదనాన్ని, అలా ఆపగలిగేలా కట్టిన ఆ మహానుభావుల గొప్పదనాన్నీ తెలుసుకోవలసిందే వాళ్లని స్మరిస్తూ ఉండాల్సిందే! అదే తీరుగా ఓ పండితుడు తగిన ప్రమాణాలని చూపుతూ మాత్రమే పదిమందిలో గుర్తింపు పొందగలిగాడంటే... ఆయనకి చదువు చెప్పిన ఆ గురువుల్నీ, ఆ గురువుల నేతృత్వంలో ఈయన చదువుని ఒంటబట్టించుకున్న తీరునీ ప్రశంసించవలసిందే. ఈ నేపథ్యంలో ఎవరైనా సరే.. ఫలాని కష్టం వచ్చిపడిందని అనుకుంటూ ద్వారకామాయిని దర్శిస్తే సాయి నామస్మరణని అక్కడే కూచుని చేస్తే ఆ ఇబ్బంది నుండి బయటపడగలుగుతున్నారంటే.. ఆ ద్వారకామాయికున్న గొప్పదనాన్ని, ఆ ద్వారకామాయి నిర్మాణంలో దాగిన విశేషాలనీ తెలుసుకుని తీరాల్సిందే! ఓ పాత్రలో ఉన్న రుచికరమైన పానీయాన్ని ఒకరివెంట ఒకరుగా తాగుతూ వెళుతూ ఉంటే.. ఎలా పాత్ర ఖాళీ అయిపోతుందో, అలా కాకుండా ఎందరు ఎందరెందరు ఈ కాలం ఆ కాలం అనకుండా సర్వకాలం ద్వారకామాయిని సేవిస్తూ ఉన్నా ఆ కష్టాలని దాటింపజేసే శక్తి ఆ స్థలానికి ఉంటూనే ఉంటోందంటే నిజంగా మనం ఆ గొప్పదనాన్ని అర్థం చేసుకోవలసిందే! సాయి విడిది! తన గుర్రాన్ని సొంత కుటుంబసభ్యునిలా చూసుకుంటున్న ‘చాంద్‌పాటిల్’ ఓ మంచి వేసవివేళ దిక్కు తోచక తిరుగుతుంటే సాయి అతడ్ని పిలిచి, కారణమడిగి, సరిగా వెతకలేదని అతనికి చెప్పి.. ‘ఫలాని చోట ఉంది తెచ్చుకో!’ అనడమూ ‘చాంద్‌పాటిల్’కి గుర్రం సరిగ్గా అక్కడే దొరికి ఉండటం..’ అనే ఆ చరిత్రని లోగడ అనుకున్నాం. సాయిని చాంద్‌పాటిల్ తనతో తన ఇంట్లోనే ఉంచుకుని, తన కుటుంబం మొత్తం షిర్డీకి ఓ పెళ్లికి వెళ్తూ ఉంటే.. తనతో సాయిని తీసుకెళ్లి ఉండటం కూడా మనకి గుర్తుంది కదా! ఆ షిర్డీకి పెళ్లివారితో సహా సాయి రాగానే పెళ్లివాళ్లంతా రెండెడ్లబళ్లు దిగగానే సాయిని చూస్తూనే ఆహ్వానించిన వ్యక్తి ‘ఖండోబా’ అనే గ్రామదేవతా ఆలయంలో అర్చకుడైన ‘మహల్సాపతి’ మాత్రమే! ఇంతవరకూ మనకి తెలుసు!సాయి వేషాన్ని చూశారు షిర్డీలోని అక్కడి వారంతా. పెద్ద బురఖా (కుఫ్ని)ని ధరించి, తలకి ఓ టోపీలాంటి గుడ్డని చుట్టి, గడ్డంతో కన్పిస్తూ ఎవ్వరు అలా చూసినా స్పష్టంగా మహమ్మదీయుడే అనేలా తనని గురించి చెప్పక చెప్తూన్న సాయిని ఏ ఒక్కరూ కూడా ఖండోబా దేవాలయంలోనికి అడుగు పెట్టనీయకూడదని అనుకున్నారు. ఎందరో ఆ అభిప్రాయాన్ని తమలో తాము అనుకుంటున్నట్లుగా, కొద్దిగా బిగ్గరగా అనుకున్నారు కానీ ఒకరిద్దరు ఆ మాటని పైకి అననే అన్నారు కూడా. ‘లా సాయీ!’ (దయచేసి ఓ అతిపవిత్రుడా! లోనికి రా!) అని ఖండోబా దేవాలయ అర్చకుడు మహల్సాపతి ఆ సాయి రూపాన్నీ ఆయన లో–దాగిన గొప్పదనాన్ని గుర్తించి పైకి అలా ఆహ్వానించగలిగాడు. గానీ, తానొక అర్చకరూపంలో ఉద్యోగిగా ఉన్న కారణంగా అక్కడ సాయికి నివాసాన్ని ఇప్పించగల శక్తి లేనివాడయ్యాడు. మనసుంటే మార్గముంటుందన్నట్లు మహల్సాపతే స్వయంగా అక్కడి పెద్దలతో మాట్లాడి అక్కడికి పెద్ద దూరం కాని ఓ మసీదులో సాయిని ఉంచే ఏర్పాటుని మాత్రం చేయగలిగాడు. సాయిని తానే తీసుకువెళ్లాడు ఆ మసీదుకి. ఆ మసీదులో సాయిని దిగబెట్టి ‘సాయీ! ఇదే నీ విడిది!’ అని నమస్కరించి వెనుదిరిగాడు. ఎలా ఉంది ఆ మసీదు? మసీదుకి ముందు ఏ ఆవరణా(ఓ కప్పు ఉన్న ప్రదేశం) లేదు. గోడలన్నీ బాగా పాతబడిపోయి ఉండడమే కాక ఆ మసీదుకున్న ఓ పిట్టగోడ (ప్రహరీగా ఉన్న ఎత్తు తక్కువ గోడల్లో ఒకటి) దాదాపు కూలిపోయిన స్థితిలో ఉంది. మసీదు నిండుగా బూజులు వేలాడుతూ కన్పిస్తున్నాయి. ఏదైనా ఓ అవసరం వచ్చి పిలిస్తే పలికేందుకు ఏ ఒక్కరూ అక్కడ లేరు. అస్తమానం మసీదులోనే కూర్చుని కూర్చుని విసుగొచ్చి ఓ క్షణం ఎక్కడైనా కూచుందామంటే ఒకే ఒక్క దిక్కు ఆ మసీదుకు ఎదురుగా ఉన్న వేపచెట్టు మాత్రమే. సాయికి ఆనందమే అన్పించింది. ఒంటరిగా ఉన్న వేపచెట్టుకి తానొక జంటగా ఉండేందుకు వచ్చాను గదా! అని. ఇంతకాలం ఎవరింట తాను అతిప్రీతిపాత్రంగా గౌరవింపబడ్డాడో ఆ చాంద్‌పాటిల్ కనపడలేదు. తనతో రాలేదు. అలాగని తనని వదిలించుకుందామనేది అతని అభిప్రాయం కాదు. పెళ్లి పనుల్లో ఉన్నాడతను. అదీ కాక తాను అతనికి చెప్పి ఇక్కడికి రాలేదు కూడా. ఇక కొంతకాలం తాను షిర్డీలో ఉన్నప్పటికీ మరో చోటికి వెతుక్కుందామనే దృష్టీ తనకి లేదు.మసీదంతా తిరిగి చూస్తే ఓ చిన్నకుండ కన్పించింది. ‘హమ్మయ్య! నీటి అవసరాన్ని తీర్చడానికి చాలు’ అనుకున్నాడు సాయి. పాతకాలపు పెద్ద తిరుగలి ఆ ఆవరణలోనే కన్పించింది. ‘అబ్బో! గోధుమల్ని విసురుకుని తినడానికి, రొట్టె చేసుకునేందుకు ఇది కూడా ఉందిలే’ అనుకున్నాడు. ఇక పొయ్యిని ఏర్పాటు చేసుకోవడం, ఎండిన కట్టెలూ, పడుకునే చోటూ.. అనే వాటినన్నింటినీ ప్రకృతే ఇస్తుంది తనకి.మంచి వసతి, నీరు, భోజనం అనేవి దొరికాక తనకి లోటేముంది? అనుకున్నాడు. మరో ఆనందకరమైన అంశమేమంటే తనని ఎవరూ కూడా వచ్చి పలకరించేందుకు వీలు లేకుండా మసీదు ఆవరణలో కాలు పెట్టే సౌకర్యంగానీ, స్థలంగానీ ఏ మాత్రపు వీలుగానూ లేకపోవడమే. గోతులతో ఎగుడు దిగుడులతో – సన్నతోవతో – ఇరుకు సందుతో – మసీదు వరకూ రావలసిన తీరుకి ఎవ్వరూ కూడా రారు. ఏదైనా పొరపాటున వచ్చిన వీళ్లే చాలు మరొకరు రాకుండా ఉండేలా చేయడానికి ఇలా ఉన్న ఆ వసతిలో సాయి చక్కని అంగరంగవైభవంగా ఉన్న భవనంలోనికి ప్రవేశించినట్లుగా భావిస్తూ, ఏ మాత్రపు అసంతృప్తీ లేకుండా ఆ మసీదులోనే ఉండదలిచాడు. భగవద్గీతలో కృష్ణుడన్నాడు. యదృచ్ఛా లాభ సంతుష్టః– ‘ఏది తన అదృష్టానికి దొరికినా దాంతోనే పరమసంతోషపడేవాడే నిజమైన గొప్పవాడని.’ సరిగ్గా అలాంటి లక్షణమే సాయిది! చేసిన మార్పులు ఏదైనా ఓ ప్రదేశానికి మనం వెళ్లాక, అక్కడే మనం ఉండాల్సి వస్తే కొన్ని మనకున్నంత పరిధిలో యధాశక్తి చేసుకుంటాం కదా! అలాగే సాయి ఆ మసీదులోకి ప్రవేశించాక చేసిన మొదటి పని చక్కని తులసి మొక్కని నాటడం. ‘ఇదేమిటి? మహమ్మదీయుడేమిటి? తులసి మొక్కని నాటడమేమిటి?’ అనుకున్నారు ఆ మసీదుపక్కగా పలచపలచగా వెళ్తూండే జనం. కొన్ని రోజులయ్యాక ఆ తులసి మొక్క దగ్గర వెలుగుతున్న దైవారాధనకి చిహ్నమైన దీపాన్ని ప్రతిరోజూ ఉండటాన్ని గమనించారు.మరి కొన్ని రోజులయ్యాక అక్కడికి కొద్ది పక్కగా రాత్రీపగలూ అనే భేదం లేకుండా అలా వెలుగుతూ– ఏనాడూ ఆరిపోవడమనేదే లేని అగ్నిహోత్రాన్ని గమనించసాగారు. దీంతో వచ్చేపోయే వాళ్లకి ఓ వింతగానూ ఆశ్చర్యపరిచేది గానూ అయింది ఆ మసీదూ, మసీదులోని సాయీను.లోనికి వెళ్లి పలకరించడమూ ఆయన చేస్తున్న ఈ విధానమూ గురించి అడిగి లో–రహస్యాన్ని తెలుసుకుందామనుకున్నా ఆ గోతుల్లో అడుగేస్తూ ఎగుడుదిగుడు నేలలో నడుస్తూ ఆ సన్నని తోవలో ఇరుకుగా ఉన్న రెండు పాడుబడ్డ గోడల మధ్యలో నుండి నడుస్తూ సాయిని చేరుకోవడానికి ఎవరూ సాహసించలేకపోయారు. ఆసక్తి ఉంది గానీ ఆ శక్తి లేదు. ఉత్సాహముందిగానీ ఆ ప్రోత్సాహం లేదు. ఒంటరిగానైనా వెళ్దామనే ఊహ ఉంది గానీ ఆ ధైర్యం చాలడం లేదు. ఇలా రోజులు గడుస్తుంటే సాయి మెల్లగా మసీదులో కొంతసేపు ఆ ఎదురుగా ఉన్న వేపచెట్టు కింద ఎక్కువసేపూ ఉండటాన్ని గమనించి ఆనందపడ్డారు ఆ వస్తూ పోతూ ఉండే జనం.ఎవరు ఎలా ఉన్నా ఖండోబా దేవాలయ అర్చకుడైన మహల్సాపతి మాత్రం సాయి ఆ మసీదులో ఉన్నకాలంలో కూడా నిత్యం రావడం, సాయికి అర్ఘ్యపాద్యాదులనిచ్చి నమస్కరించి వెళ్తూండటం మాత్రం చేస్తూనే ఉండేవాడు. ఈ విషయం జనంలోకి మరింతగా వెళ్లడంతో క్రమంగా సాయికి భక్తులు రావడం ప్రారంభించారు.మసీదేమిటి? తులసి మొక్కేమిటి? నిత్య దీపారాధన ఏమిటి? హిందువులంతా లక్ష్మీదేవిగా భావించే వేపచెట్టు మొదట్లో కూర్చుని కనిపిస్తూ ఉండటమేమిటి? పైగా హిందూధర్మాన్ని అనుసరిస్తూ ఉండే నిష్ఠాగరిష్ఠులు ప్రతి నిత్యం చేసే అగ్నిహోత్రంలా అక్కడ అగ్నిని వెలిగించి ఉంచడమేమిటి? మహమ్మదీయులే కాకుండా హిందువులూ పైగా జాతి, మత, వర్గ, కుల, స్త్రీ–పురుష, బాల, వితంతు భేదం లేకుండా క్రమక్రమంగా అందరూ రావడం ప్రారంభించాడు. దీని పేరేమిటి? ఇలా జరుగుతుంటే ఓసారి అడిగారు భక్తజనం. చూడ్డానికి మసీదే.. మసీదులా ఉండటం కాదు. కనిపిస్తున్నది పవిత్ర దైవదీపారాధనమే... దీపంలా ప్రకాశంకోసం పెట్టబడింది కాదు. లోపల ఉన్నది తులసి మొక్కే. అదేదో యధాలాపంగా మొలిచింది కానే కాదు. కావాలని నాటబడిందే..! వస్తున్నది గ్రామ దేవాలయ అర్చకుడు మహల్సాపతే. ఏదో మారు వేషంలో వస్తుండటం కాదు. ఇందరొస్తూ ఉన్న ఒక్క చిల్లుకానిని(రూపాయిలో 64వ వంతు) అడిగిన జాడ లేనే లేదు. ఇదంతా ఏమిటి? ఈ ప్రదేశం పేరేమిటి? ఈ విధానం పేరేమిటి?’ అని. సాయి చిరునవ్వు నవ్వుతూ ‘ఈ స్థలం పేరు ద్వారకామాయి. ఆ వెలుగుతున్న అగ్నిపేరు ‘ధుని’ అన్నాడు. పూర్తిగా అర్థంకాని అందరూ మరికొద్ది వివరణనీయవలసిందిగా అడిగితే సాయి చెప్పాడు.‘చతుర్ణా మపి వర్ణానాం యత్ర ద్వారాణి సర్వతఃఅతో ద్వారవతీత్యుక్తా విద్వద్భి స్తత్వవేదిభిః’అనే శ్లోకానికి అర్థాన్ని.లోకంలో నాల్గువిధాల వృత్తుల్ని చేస్తూ అలాంటి ప్రవర్తనతో ఉండే ‘బ్రహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర’ అనే వారున్నారు గదా! ఆ అందరికీ కూడా ‘ధర్మం అర్థం కామం మోక్షం’ అనే నాలుగూ పొందగలిగేలా చేసే శక్తి ఉన్న క్షేత్రం పేరు ‘ద్వారవతి’ దాన్నే ‘ద్వారక’ అంటారు హిందూసంప్రదాయంలో. అదుగో అలాంటి ద్వారకే ఇది. ఆ ద్వారకకి ప్రతిబింబం లాంటి ఈ ప్రదేశానికి నేను ‘ద్వారకామాయి’ అని పేరు పెట్టుకున్నానన్నాడు. ఎంత లోతైన అర్థమున్నపేరు! అది నీ పని కాదు! సహజంగా ఇలాంటి పరిస్థితిలో ఎవరైనా ఉంటే.. ఎవరు దేన్ని విరాళంగా ఇచ్చినా ఆ స్థలానికో లేక తనకో అలాంటి వాడు కానేకాదని భక్తులకి నిత్యానుభవంలో అర్థమైంది. ఇలా వస్తూండే రాకపోకల భక్తుల్లో మరింత విశ్వాసం పెరిగిన గోపాలరావు గుండ్’ అనే అతను ఈ మసీదు స్థితిని గమనించి దీన్ని బాగుచేయదలిచి బాగుజేతకి కావలసిన రాతినీ సున్నాన్నీ ఇతర వస్తువుల్నీ పరికరాలనీ సమకూర్చి పనిని ప్రారంభించబోతే సాయి అతడ్ని పిలిచి ‘ఇది నీ వంతు కాదు. మానెయ్’ అన్నాడు. నానా (నానా సాహెబ్ ఛందోర్కర్)చేస్తాడులే! కంగారు పడకు అన్నాడు. నిజానికి నానా అప్పటికింకా ఆ పనికి సంబంధించిన ఆలోచనకి రానే లేదు.అలాగే ‘చెప్పలేనంత దుమ్ము ధూళి బూజులు బల్లులూ, ఎలుకలు ఇతర క్రిమికీటకాలు, పాములు తిరుగాడే ఆ ప్రదేశాన్ని బాగు చేసి ఎల్తైన గోడల్నీ లోపల ఎవరైనా వస్తే కూర్చుండే విధంగా సౌకర్యవంతమైన అరుగుల్ని కట్టించదలిచా’ అని అనగానే అది నీ పని కాదు. కాకా(కాకా సాహెబ్ దీక్షిత్) ఆ బాధ్యతని తీసుకోబోతున్నాడన్నాడు సాయి.తీవ్రమైన నిరుత్సాహం ఒక పక్కా, ఏదో చేసి సాయికి చక్కని సౌకర్యాలని కల్పించాలనే తపన ఒక పక్కా ఎవరెవరికో వచ్చిన ఆ అవకాశం తనకెలా వస్తుందా? అనే ఆత్రుత ఒక పక్కా ఉన్న సమయంలో మహల్సాపతి అక్కడి కొచ్చి పరిస్థితిని గమనించి ‘సాయిదేవా! అనుగ్రహించు!! ఆ భక్తుని కోరికని ఆదరించు’ అన్నాడు భక్తిగా ప్రణామం చేస్తూ. సాయి వెంటనే ‘ఈ ఆడంబరం దేనికి నాకు? నేను ఏదైనా అసౌకర్యం ఉందని అన్నానా? ఎప్పటి నుండోలేని ఈ సౌకర్యాలు ఇప్పుడెందుకు?’ అన్నాడు. అయినా పట్టుబట్టి మహల్సాపతి ప్రాధేయపడి ఒప్పించాడు సాయిని.అంతే! మసీదు మొత్తం దులపబడింది. నేల ఎత్తు చేయబడింది. గోడలన్నీ పటిష్ఠంగా నిర్మించబడ్డాయి. నేల గోతులు, ఎగుడుదిగుడులూ సరిచేయబడ్డాయి. ఎల్తైన ప్రదేశం మీద ధుని ఏర్పాటయింది. ఒక అంగవస్త్రం (తుండు/తువ్వాలు/పై వస్త్రం) వేసుకుని దానిమీద కూచునే సాయి చోటులో చక్కని ఎల్తైన వేదిక వచ్చింది. ఇక ఆ ఎదురుగా ఆవరణా సభామండపంలా అనిపించే తీరులో ఇనుప స్తంభాలు వాటి మీద ఓ కప్పు దాదాపుగా అయిపోతున్న దశలో ‘చావడి’ నుంచి ద్వారకామాయి కి వచ్చాడు సాయి. కోపంతో ఊగిపోతూ స్తంభాలన్నింటినీ దూరదూరంగా వెళ్లిపోయేలా తన్నేసాడు.కప్పుకోసం తెచ్చిన వస్తువుల్ని విసిరేసాడు. ఎవరికీ ఏమీ అర్థం కాలేదు.కాసేపు మౌనధ్యానంలో ఉండిపోయాడు. మరికొంత సేపు ఏదో నామజపాన్ని చేసుకున్నాడు. పెద్ద వర్షం వచ్చి ఆగిపోయాక ఉండే పరిస్థితిలా ప్రశాంతంగా కళ్లు తెరిచి ఇనుపస్తంభాలని పాతబోయిన గుంటల్లో రూపాయి నాణాలని వేశాడు. మట్టి తానే వేసాడు స్వయంగా. ఈ ద్వారకామాయి రూపురేఖలని మార్చిన ఇద్దరు భక్తులకీ (కాకా తాత్యా) నూతన వస్త్రాన్ని తెప్పించి తలపాగలని తానే కట్టాడు.ఇలా ఆగ్రహించడానికి కారణం – ఏది సరైన ముహూర్తమో అడగకుండా తెలుసుకోకుండా ఉత్సాహం కారణంగా కట్టదలిచి పనిని ప్రారంభించేయడమే! మరి తులసి మొక్క దీపారాధనం వేపచెట్టు నీడ విశ్రమించడం ద్వారకామాయి అని పేరు పెట్టడం.. వంటి పనుల్ని చేసిన సాయి హిందువు కాడా? హిందూ ధర్మాన్ని పాటించాలని ఉపదేశించిన వాడు కాడా?అంతా అయ్యాక కొత్త ద్వారకామాయిలో అడుగిడిన సాయి అన్నాడు– ‘ఇక్కడ కోరితే కానిపని ఉండదు. ఇబ్బంది అనేది తొలగిపోతుంది’ అని. దానికి కారణం సాయి చేసే మంత్రజపశక్తి మాత్రమే! బాబా చిత్రప్రవర్తనలూ – అంతరార్థాలూ చూద్దాం! – సశేషం - డా. మైలవరపు శ్రీనివాసరావు -
యద్భావం తద్భవతి
భగవద్గీతలో ఓ శ్లోకం ఉంది.‘‘యే యథా మాం ప్రపద్యంతే తాం స్తధైవ భజామ్యహమ్!మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ! సర్వశః’’ అని.ఎవరు తననెలా అనుకుంటే తాను వాళ్లకి అలాగే కనిపిస్తాననీ, ఎవరు ఏం అనుకున్నప్పటికీ తాను అనుకున్నది మాత్రమే జరిగేలా చేస్తాననీ, చేసుకుంటాననీ కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడనేది పై శ్లోక సారాంశం.అందుకే తనని దైవంగా భావించిన దేవకీ వసుదేవులకి అలాగే కన్పించాడు. తనని వివాహమాడే పతిగా భావించిన రుక్మిణిని అదే విధంగా అనుగ్రహించాడు. తమ జన్మని ధన్యం చేయవచ్చినవానిగా భావించిన భీష్మ–విదురులకి అలాగే మోక్షాన్ని ఇచ్చాడు. తనని చంపవచ్చినవాడని భావించిన కంసునికీ, శిశుపాలునికీ అలాగే చావునిచ్చాడు.వాస్తవాన్ని పరిశీలించి చూస్తే సాయి కూడా అదే తీరులో కనిపించాడు ఎందరికో. కనిపించలేదని ఎవరూ అనుకోకుండా ఉండేలా తనని నిజమైన భక్తితో సేవిస్తే ఏ రూపంతో దర్శించదలిస్తే అలానే కనిపిస్తానంటాడు సాయి. అలా కనిపించిన తీరు తెన్నుల్ని ఎందరో చెప్పారు కూడా.ఈ క్రమంలో జరిగిన ఓ చరిత్రని తెలుసుకుని తీరాల్సిందే! నాసికాత్య్రంబకమనే పుణ్యక్షేత్రం ఒకటుంది షిర్డీకి కొంత దూరంలో. దాన్నే నాసిక్ అని పిలుస్తూ ఉంటారు. గోదావరి పుట్టిన కొండలకి దిగువ ఉంటుంది ఈ క్షేత్రం. ఆలయం లోపల శివలింగం చిన్న పరిమాణంలో ఉంటుంది. ఆ లింగానికి కింద మూడు వైపుల నుంచి చిన్న తూముల వంటి మార్గాలు కనిపిస్తూ ఉంటాయి. ఆ మూడింటి నుంచీ నిరంతరం జలం ప్రవహిస్తూ ఈ శివలింగాన్ని తాకుతూ ఉంటాయి. ఒకటి పవిత్ర గంగాజలం, రెండవది ఆ కొండల మీద నుంచి వచ్చే గోదావరి జలం, ఇక మూడవది ఎక్కడి నుండి వస్తోందో తెలియని పర్వత జలమునూ. ఈ మూడు జలాలనీ స్వయంగా సేకరించుకుని ఏ రోజుకారోజు శివలింగానికి మహాద్భుతంగా అభిషేకాన్ని చేస్తే గానీ, ఆ మీదట అగ్నిహోత్రాన్ని వేదమంత్రపూర్వకంగా నిర్వహిస్తే గానీ ఏనాడూ పచ్చిగంగని కూడా ముట్టనంత నిష్టాగరిష్ఠుడైన ములేశాస్త్రీ(మూళే శాస్త్రీ–శాస్త్రీ–మూలే–పండితుడు) అనే బ్రాహ్మణుడు ఉంటూండేవాడు నాసిక్‌లో. తన వద్దకొచ్చిన ఆధ్యాత్మికపరులైన వాళ్ల చేతుల్ని చూసి హస్తసాముద్రిక విశేషాలనీ, జాతకచక్రాలనీ చూసి భూతభవిష్యత్ వర్తమానాలనీ, అంతే కాక ఇళ్లకి సంబంధించిన వాస్తు బాగోగులనీ కూడా ఆయన చూస్తూ ఉండేవాడు. దాంతో ఆయన ఇల్లు సందర్శకులతో నిత్యం కిటకిటలాడుతూ ఉంటూండేది. ఎందరు వచ్చినా ఆయన అనుష్టానం పూర్తయ్యాక మాత్రమే మాట్లాడటం తప్ప ఏనాడూ ఆ నియమాన్ని తప్పనివాడాయన.ఆయన చెప్పిన అన్ని కూడా స్పష్టంగా జరుగుతుండే కారణంగా అందరికీ ఆయన మీద పూజ్యభావం ఉంటూ ఉండేది. ఆయన్ని ఎవరైనా ‘ఎంతగొప్పవాడో’ అంటూ ప్రశంసిస్తే ‘అదంతా మా గురువు ఘోలవ్ స్వామి గారి చలవ’ అంటూ తన అహంకారం లేని తనాన్ని తెలియజేస్తుండేవాడు.ఆయన తన గురువైన ఘోలవ్ స్వామివారి వద్ద నాలుగు వేదాలనీ ఆ వేదానికి అంగాలుగా ఉండే 6 శాస్త్రాలనీ కూడా గట్టిగానే అభ్యసించి ఉండటంతో ఇటు జ్యోతిషం, అటు వాస్తు మరోౖవైపు సాముద్రిక శాస్త్ర పండితులూ ఇంకోవైపు వ్యాకరణం మొదలైన శాస్త్రాల్లో పండితులు కూడా ఏమేమో సందేహాలని తీర్చుకోవడానికి స్వయంగా విచ్చేస్తూ ఉండటంతో ఆయనకి తీరుబడి అనేది దాదాపుగా ఉండేదే కాదు.ఇలాంటి ఈయనకి – సాయికి అత్యంత ప్రేమాస్పదభక్తుడైన బూటి (బాబు సాహెబ్ బూటీ)తో మంచి సంబంధం ఈ తీరు రాకపోకలతో ఏర్పడింది. నాగపూర్ వాస్తవ్యుడూ కోటి కోటీశ్వరుడూ అయిన బూటీ సాయి ఆజ్ఞ ప్రకారం ఆయనకి ఓ సుందర విశాలమందిరాన్ని శోభాయమానంగా నిర్మించి ఇచ్చాడు కూడా. అంతటి బూటితో ఓ సారి ములేశాస్త్రి పండితునికి పనిపడింది. బూటీ ఎప్పుడూ షిర్డీలోని ద్వారకామయి (సాయి ఉండే మసీదు)లోనే ఉంటాడు కాబట్టి ములేశాస్త్రి అక్కడికే వెళ్లాడు.వేదాలని చదివినవాడూ, శాస్త్రాల్లో దిట్టా, నిత్యం అగ్నిహోత్రాన్ని చేసేవాడూ, అందరితో గౌరవాభిమాన పరిచయాలున్నవాడూ, సంప్రదాయపరుడూ అయిన ఆయనకి షిర్డీ వెళ్లినప్పటికీ కూడా ఒక సాయేబు (ఆయన దృష్టిలో సాయి)ని.. అందునా ఆయన మసీదులో.. అది కూడా 4 రోజులపాటైనా స్నానం కూడా (అప్పుడప్పుడు వీలు కుదరక) చేయని పండితుడు కానీ వ్యక్తి (శాస్త్రి దృష్టిలో)ని స్వయంగా వెళ్లి దర్శించడమా? అనే అభిప్రాయంతో తానున్న ఓ ప్రదేశంలోనే మూడురోజుల పాటు ఉండిపోయాడు. అంతా నిర్విరామంగా ఉండే తనకి ఇలా రోజులు గడిచిపోతున్నాయనే ఆలోచనతో... ఎలాగో అక్కడికి వెళ్లి బూటీని ఎలాగో ఒకలా ఆ మసీదు ఇవతలనుండే కలిసి, మాట్లాడి వచ్చేద్దామనే నిర్ణయానికొచ్చాడు నాల్గవ రోజున. సరిగ్గా అదే రోజున బూటీ బాబా దర్శనానికి రావలసిందనగానే అయిష్టంగా సాయి దర్శనానికి వెళ్లాడు. తనకొచ్చిన భక్తుల దక్షిణలతో పళ్లని కొని, తనని చూడవచ్చిన భక్తులకి ఇస్తూ ఉండటం సాయికి అలవాటు. ముఖ్యంగా మామిడిపళ్లనైతే రెండు అరచేతుల మధ్య పెట్టి ముందుకి వెనక్కి నలిపి పిసికి నోట్లో పెట్టుకోగానే రసమంతా వచ్చేలా మామిడిపండుని చేసి భక్తులకియ్యడం, అలాగే అరటిపండునైతే తొక్కని తొలగించి గుజ్జునిస్తూ తొక్కల్ని తన వద్ద ఉంచడం... వంటివి ఆయన నిత్యకృత్యాలు. శాస్త్రి వెళ్లేసరికి ఇలాగే జరుగుతోంది. ఆ పళ్లని తాను తీసుకోవడం ఏ మాత్రం ఇష్టమనిపించలేదు శాస్త్రికి.తన వంతు రాగానే శాస్త్రి తన చేతిని చాచి సాయిని తమ చేతిని చూపించినట్లయితే సాముద్రికవిశేషాలని చెప్తాననే అభిప్రాయంతో చూశాడు. శాస్త్రి అభిప్రాయాన్ని గమనించి కూడా సాయి తన చేతిని చూపించనే లేదు, ఎందరో తన వద్దకి చేయి చూపించుకోవడానికి వచ్చి తమ వంతు కోసం ఎదురుచూస్తూ ఉంటూంటే, సాయివద్దకి తాను వెళ్తే చేతిని చూపించడేమిటి సాయి? అనుకుని అలాగే ఉండిపోయాడు. అందరికీ ఇచ్చినట్లే శాస్త్రికి కూడా నాలుగు అరటిపళ్లని చేతిలో పెట్టాడు సాయి. అయితే సాయి పాదాలని గమనించి, పాదాల్లోని రేఖలని గమనించి, సాయిలోకోత్తర పురుషుడేనని మాత్రం లోపల అనుకున్నప్పటికీ, ఈ మహమ్మదీయునికి ఇంత గొప్పదనమా? అనే ఊహ శాస్త్రిని బాధించసాగింది. గొప్పదనాన్ని ఒప్పుకోనీయలేదు. అనంతరం శాస్త్రి బూటీతో సహా మరో ప్రదేశానికి వెళ్లిపోయారు.సాయి లెండీతోట (తాను స్వయంగా పచ్చికుండలతో నీళ్లని తెచ్చి పోసి పెంచే తోట)కి బయలుదేరి వెళ్తూ ‘ఈ రోజు కాషాయవస్త్రాలని నాకు తెప్పించండి. ధరిస్తా’ అన్నాడు భక్తులతో. ఎవరికీ అంతరార్థం బోధపడలేదు. బూటీ శాస్త్రి వద్దకి మళ్లీ వచ్చి మధ్యాహ్నహారతి సమయమైంది. ‘వస్తారా సాయి దర్శనానికీ – హారతికీ?’ అని అడిగాడు. శాస్త్రి అయిష్టంగా ‘సాయి దర్శనానికి సాయంత్రం వస్తాను. ఇప్పుడింకా దేవతా అనుష్టానం కాలే’ అన్నాడు. ఈ సమాధానంలో రెండున్నాయి. మొదటిది – ‘ఉదయం తనని అందరితో సమానంగా, అందరిలో ఒకడుగా సాయి లెక్కించాడనీ, చేయి చాపి సాముద్రికాన్ని చెప్తానని నోరు తెరిచి అడక్కపోయినా మౌనంగా తన అభిప్రాయాన్ని వ్యక్తీకరించినా తిరస్కరించాడనీ’. ఇక రెండవది – ‘తాను స్నానానికి అత్యంత శుచిగా చేసి, పట్టుబట్ట కట్టుకుని, వెంటతెచ్చుకున్న గంగాజలాన్ని కలిపిన జలంతో శివాభిషేకాన్ని చేసుకుని, ఓ మసీదులోనికి వెళ్లి ఆయన ఈయబోయే ప్రసాదాన్ని తీసుకుని రావడమా?’ అనేదీనూ. ఈ రెండాలోచనలతోనూ సాయంత్రం వస్తానని ముక్తసరిగా చెప్పాడు శాస్త్రి.మధ్యాహ్నహారతి ప్రారంభం కాగానే బూటీని పిలిచి సాయి.. ‘బూటీ! నాసిక్ నుండి వచ్చిన ఆ బ్రాహ్మణపండితుడి వద్దకెళ్లి దక్షిణని సాయి అడిగాడంటూ పట్రా!’ అన్నాడు. అది దైవాజ్ఞతో సమానం బూటీకి. వెంటనే శాస్త్రి వద్దకొచ్చి చెప్పి దక్షిణని యాచించాడు కోటి కోట్లకి అధిపతి అయిన బూటీ.శాస్త్రి ఈ మాటని వింటూనే.. ‘ఆ సాయి ఎంత తనదైన మహిమల్లో గొప్పవాడో నేనూ అంతే నాదైన శాస్త్రంలో గొప్పవాడిని. సరే! ఆ మాటని అలా ఉంచితే నేనేమిటి? ఆయనకి దక్షిణ ఇయ్యడమేమిటి? అయినా ఎవరికైనా ఎవరైనా గొప్పవారని తోస్తే దక్షిణనిస్తారేమో గానీ, ఈ దక్షిణకోసం దబాయింపు ఏమి?’ అని ఆలోచిస్తూ.. అడిగింది బూటీ కాబట్టి ‘సరే!’ అంటూ దర్శనానికి బయలుదేరాడు శాస్త్రి అర్ధాంగీకారంతో.అనుష్టానం దాదాపు ముగియవచ్చిన సందర్భంలో తాను మసీదులోనికి పోవడం సుతరామూ ఇష్టం లేని శాస్త్రి, మసీదు బయటి నుండే సాయిని దర్శించాడు. ఆ పక్కనే బుట్టలో ఉన్న పుష్పాలని దోసిలి నిండుగా తీసుకుని మసీదు గుమ్మం బయటి నుండే సాయి మీద పడేలా భక్తితోనే విసిరాడు. అంతే! క్షణంలో సింహాసనం లాంటి ఆసనంలో కూర్చున్న సాయి రూపం మొత్తం అదృశ్యమైపోయింది. పరీక్షగా చూశాడు శాస్త్రి. నిజమే. అది కలకానే కాదు. నిజమే. వాస్తవమే. సాయి కనపడటం లేదు. ‘ఇదేమిటి?’ అనుకునేంతలోనే తనకి సంపూర్ణంగా వేదాలనీ, శాస్త్రాలనీ బోధించిన తన గురువు ఘోలవ్ స్వామి ఆ ఆసనంలో కూచుని చిరునవ్వు నవ్వుతూ కన్పిస్తున్నాడు శాస్త్రికి.గురువుగారు శివైక్యం చెంది ఎన్నో సంవత్సరాలు గడిచిపోతే ఆయన ఇక్కడెలా ఉన్నాడు? అదీ సజీవంగా చిరునవ్వు నవ్వుతూ కన్పిస్తుండటమా? అది కూడా ఎవరికో కాకుండా శిష్యుడైన తనకే కూడనా? మళ్లీ ఓ సారి పరీక్షగా చూసి ఆశ్చర్యపడ్డాడు – నివ్వెరపోయాడు శాస్త్రి.తనకి తెలియకుండానే.. అందరు భక్తులూ తనని చూస్తుండగానే.. ముందుకి నడిచాడు. సాయి కూచున్న ఆసనం ఉన్న వేదికకున్న మెట్లని ఎక్కి వెళ్లాడు. మనసు నిండుగా కనిపిస్తున్న భక్తితో, బుద్ధి నిండుగా ఉన్న శ్రద్ధతో, శరీరం నిండుగా ఉన్న విశ్వాసంతో సాయి పాదాల మీద పశ్చాత్తాపబుద్ధితో తలని పెట్టి, వెంటనే సాష్టాంగపడి నమస్కరించాడు అప్రయత్నంగా.అందరూ గొంతెత్తి హారతి పాటని పాడుతుంటే శాస్త్రి మాత్రం తన గురువు ఘోలవ్ స్వామి నామాన్ని పెద్దగా ఉచ్చరిస్తూ ఎదురుగా సాయి పాదాలని పట్టి నమస్కరిస్తూనే ఉన్నాడు. ‘తన పట్టుబట్ట – అగ్నిహోత్రం – అపవిత్రతాభావం – అది ఓ మసీదు’ అనే ఆలోచన పూర్తిగా స్ఫురణలోనే లేకపోయాయి. భక్తి పారవశ్యంతో కళ్లు మూసుకుని ఆ నాటి గురువు ఈనాడు సజీవంగా దర్శనమిచ్చాడనుకుని కళ్లు తెరిచి చూశాడు.అంతే! మళ్లీ వెనుకటి సాయి కాషాయరంగు వస్త్రాల్లో కన్పించాడు. ఘోలవ్ స్వామి ఏమయ్యాడో తెలియదు. ‘ఈ వింత మరెవరికైనా కూడా కనిపించిందా?’ అనుకుంటూ శాస్త్రి భక్తజనం అందరినీ చూస్తుంటే.. అందరూ ఎవరి ధ్యాసలో వాళ్లున్నారు తప్ప తనవైపు చూస్తున్నట్లే కనిపించలేదు. అప్పటికర్థమైంది. బూటీ ఎందుకిలా సాయికి అంకితమైపోయాడో.. సాయికి తన జీవితాన్ని సర్వసమర్పణాన్ని చేసేసాడో!ఈ విశేషాన్ని పూసగుచ్చినట్లు భక్తులందరికీ శాస్త్రి చెప్పడమే కాక అప్పటి నుంచి సాయికి పరమసన్నిహిత భక్తుడయ్యాడు. మరో సంఘటనషిర్డీలో ఓ రెవెన్యూ ఉద్యోగి ఉంటూ ఉండేవాడు. ఆయన పరమభక్తుడు సాయికి. అయితే తన భక్తి ధోరణి ఏదో తనదే తప్ప మరెవరినీ సాయిదర్శనానికి రావలసిందని గానీ, వచ్చి దర్శిస్తే ఈ తీరూ ఆ తీరూ అద్భుతాలు జరుగుతాయని గానీ చెప్పి ప్రచారాన్ని చేసే సాయి భక్తుడు కాడు. సహజంగా ఒక సంప్రదాయాన్ని ఎన్నుకుని ఆ మార్గంలో వెళ్తూ ఉండే భక్తులు మూడు తీరులుగా కన్పిస్తూ ఉంటారు. మొదటి జాతివాళ్లు కేవలం తన భక్తీ తన పూజా ఏదో దాన్ని మాత్రమే చేసేసుకుంటూ నిరంతర భక్తి భావంతో వెళ్లిపోతూ ఉంటారు. వాళ్లకి తమకంటూ జరిగిన అద్భుతాలని చెప్పుకోవాలనే ధ్యాసే ఉండదు.రెండవజాతివాళ్లు తమకి జరిగిన అనుభవాలని వివరిస్తూ ప్రోత్సహించి ఆ దైవదర్శనానికో లేక తాము నమ్మి ఆనందాన్ని పొందిన ఆ మహనీయుని దర్శనానికో ఒకరినో ఇద్దరినో నిస్వార్థంగా తీసుకువెళ్లి తాముపొందిన ఆ ఆనందాన్ని వాళ్లకి కూడా కలిగించేవాళ్లు. కేవలం దైవసేవాభావం ఇతరులకి ఆనందాన్ని పంచాలనే ధ్యేయమే వీళ్లది.ఇక మూడవజాతి వాళ్లుంటారు. దైవం మీద వ్యతిరేకతా నాస్తికభావాలూ అంటూ ఏవైనా ఏ కొందరికైనా అబ్బుతున్నాయంటే దానికి వీరే కారణం. దైవం గురించో లేక సాయి వంటి మహనీయుని గురించో ఎదుటివారిలో తీవ్రమైన నమ్మకాన్ని కుదిర్చి దాన్ని దృఢం చేయాలనే అభిప్రాయంతో ఉన్నదానికి మరికొంతని కలిపి తీవ్రంగా దాన్ని ప్రచారంలోకి తెచ్చేయడం వీరి లక్షణం. వాళ్లు చెప్తున్నదాన్ని ఏ మాత్రపు బుర్ర పెట్టి విన్నా అదంతా అబద్ధమే అని స్పష్టంగా అర్థమైపోతూ ఉంటుంది. అలా ఎదుటివాళ్లు అనుకుంటారనే ధ్యాస కూడా లేకుండా చెప్పుకుంటూ వెళ్లిపోతుంటారు ఉన్నవీ లేనివీ కలగలిపి.ఇదే పద్ధతిలో పైన అనుకున్న రెవెన్యూ ఉద్యోగి ఒక డాక్టరుతో ‘షిర్డీ వెళ్దాం. వస్తావా?’ అని అడిగాడు. ఈ రెవెన్యూ ఉద్యోగి కేవలం తనకి సహాయంగా ఈ డాక్టరుని రావలసిందిగా పిలిచాడు తప్ప ఆయన్ని సాయిభక్తునిగా చేయాలనే తపనతో మాత్రం కాదు. దానికి డాక్టర్ సమాధానమిస్తూ.. ‘నేను షిర్డీకి సరదాగా వస్తా! అక్కడికొచ్చి సాయి దర్శనానికి రావలసిందని గానీ, ఇంతదూరం వచ్చాక ఓసారి దర్శిస్తే పోలేదా? అయినా దర్శిస్తే వచ్చే నష్టమేముంది? అని గానీ నన్ను బలవంతపెట్టనంటే వస్తా!’ అని కరాఖండీగా చెప్పాడు. అసలు ఆ ఉద్దేశమే లేని రెవెన్యూ ఉద్యోగి ‘అక్కడికొచ్చాక అది నీ ఇష్టం! బలవంతపెట్టడం నేనుగానీ నాకెరుగున్న మరెవరి ద్వారానైనా గానీ ఉండనే ఉండదు’ అని సహృదయతతో చెప్పాడు. దాంతో ఆ ఇద్దరూ షిర్డీకి వెళ్లారు.రెవెన్యూ ఉద్యోగి బాబా దర్శనానికి వెళ్తుంటే డాక్టర్ అతనితో ‘నువ్వేమీ అనుకోకు! నేను రామభక్తుడ్ని. ఏ రోజూ రామునికి సంబంధించిన వృత్తాంతాన్ని చదవడమో ఆయన శ్లోకాలని పఠించడమో లేక ఆంజనేయుని ధ్యాన శ్లోకాలని మనసులో అనుకోవడమో చేస్తూనే ఉంటాను. రామాయణం చెప్పిన అన్నింటి మీద సద్భావంతో ఉంటాను. ఏదో ఒక సంప్రదాయ రహస్యాలని తెలుసుకుని ఆచరించదలచడం పొరపాటున ఇది నచ్చకపోతే మరో వైపు అడుగులు వేయడం.. అనే ఇదంతా నాకు నచ్చని పని’ అంటూ చెప్పి ‘నువ్వొక్కడివే ఆ సాయి దర్శనానికి వెళ్లిరా!’ అన్నాడు.ముందునుంచి డాక్టర్ అదేమాటల్ని చెప్తుండటం బట్టి రెవెన్యూ ఉద్యోగి మారు మాట్లాడకుండా సాయి దర్శనానికి వెళ్లాడు. మార్గమధ్యంలో ఓ చిన్నపని చూసుకుని దర్శనానికి వెళ్లాడు. అక్కడి దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపడ్డాడు.తాను వెళ్లేసరికి ఇన్ని మాటల్ని మాట్లాడిన డాక్టర్ ఆ సాయిపాదాలని గట్టిగా పట్టుకుని ఆయన ముఖంలోనికే తన దృష్టిని నిలిపి ఆర్ద్రంగా చూస్తూ ఆనందబాష్పాలని విడుస్తూ కనిపించాడు. సాయి సేవ పూర్తయ్యాక రెవెన్యూ ఉద్యోగి ‘దానికి కారణం ఏమిటి?’ అని అడగకుండానే డాక్టర్ చెప్పడం ప్రారంభించాడు.‘ఓసారి సాయిని సందర్శించే భక్తుల్ని చూస్తూ సాయి తన దర్శనాన్నిచ్చే చోటుని చూశాను. ప్రశాంతంగా కూర్చున్న సాయి నాకు ప్రత్యక్షంగా రామచంద్రునిలానే కనిపించాడు. తరచి తరచి పరిశీలించి చూసినా రాముడే ఉన్నాడు ఆ ఆసనంలో. అందుకే ఆనందంతో సాష్టాంగపడ్డాను. నన్ను ఈ దర్శనానికి వచ్చేలా చేసినందుకు జీవితాంతం ఋణగ్రస్తుడ్ని’ అన్నాడు డాక్టర్. అదీ సాయి గొప్పదనం. ‘ద్వారకామయి అన్ని కోరికలనీ తీరుస్తుంది’ అని సాయే చెప్పాడు. ఎప్పుడు? ఎందుకు? ఎలా? గమనిద్దాం! (సశేషం) - డా. మైలవరపు శ్రీనివాసరావు -
మేకని చంపి తీరాల్సిందే! అన్నాడా సాయి? ఇదేమిటి?
సాయి చేసే ప్రతి చేష్టా, సాయి మాట్లాడే ప్రతి మాటా, సాయి నడిచే ప్రతి ప్రదేశం, సాయి చరిత్రలో కన్పించే ప్రతి సంఘటనా ఓ కొత్త విషయాన్ని జీవితాంతం మనకి గుర్తుండేలా, గుర్తుంచుకునేలా చేస్తూనే ఉంటుంది. ఓ చిరుచీకటి ఉన్న గదిలోనికి ప్రవేశించకుండానూ, కనీసం ప్రవేశించి చూద్దామనే ఊహకూడా లేకుండానూ అదో చీకటి శూన్యపు గది అనడం ఏ మాత్రమూ సరికాదు. చక్కని దీపపు వెలుగుతో దానిలోనికి ప్రవేశించి, చూస్తే ఏదైనా ఉందో లేదో? ఉంటే ఏముందో?... అలా వివరాలన్నింటినీ తెలుసుకోగలుగుతాం! అదిగో ఆ పనినే చేద్దాం! చేస్తున్నాం కూడా!ఆ మేకని చంపెయ్! ఎవరో ఓ వ్యక్తి ఓ మేకని తెచ్చి సాయికి ఇచ్చాడు. ఆ మేకని సాయి దగ్గరే ఓ చిన్న స్తంభానికి కట్టివేశాడు. భక్తులంతా చూస్తున్నారు ఆ మేకని. అది పాపం అందరూ జాలిపడేలా దీనాతి దీనంగా చూస్తోంది. ఆ సందర్భంలో సాయి ‘బడేబాబా’ అనే అతన్ని పిలిచాడు ‘రావలసింది’ అని.బడేబాబా సాయికి ఎంతో.. మళ్లీ మాట్లాడితే.. మరెంతో సన్నిహితుడు. రోజూ సాయి అతనికి 50 రూపాయలని దక్షిణగా ఇచ్చేవాడు.అలా సొమ్మిచ్చినందుకు సన్నిహితుడని దీని అర్థం కాదు. బడేబాబాని కొంతదూరం సాగనంపి వస్తుండేవాడు సాయి.ఏ రోజూ భక్తులంతా భోజనం వేళకి సభామండపానికి ఆనందంగానూ సాయితో కలిసి కూర్చుని భోజనాన్ని చేయాలనీనూ ఆత్రుతతో వస్తూండేవారు. భక్తులంతా ఎదురు బదురుగా రెండు వరుసల్లో ఓ క్రమశిక్షణ పద్ధతిలో తాడు పట్టుకుని చూస్తే సరిపోయేంత సరళరేఖలా చక్కగా కూర్చుంటూండేవారు. ఈ రెండు వరుసలూ ఎంతో పొడుగ్గా ఉండేవి. ఆ రెండు వరుసలకీ మధ్యలో ఆ వరుసలు ప్రారంభమయ్యే చోటున ఇద్దరు కూర్చోవడానికి రెండు చోట్లు ఖాళీగా ఉండేవి. ఆ కుడివైపున సాయి కూర్చునేవాడు. ఆయనకి ఎడమ పక్కన బడేబాబా కూర్చునేవాడు. మొత్తం అందరి విస్తళ్లలోనూ వడ్డన అయిపోయినా భోజనం చేసే సంప్రదాయం సాయికి బాగా తెలుసు కాబట్టి, ఆ సాయి భక్తులకీ మరింతగా తెలుసు కాబట్టి, ఎవరి మటుకు వారు విస్తళ్లలో వేయబడ్డ పదార్థాలని వేసిన వెంటనే తినేస్తుండేవారు కానే కాదు. ఇలాంటి సందర్భాలని పరిశీలిస్తే ‘బ్రాహ్మణసమారాధన, బ్రాహ్మణ గృహాల్లో జరుగుతూండే భోజన సంప్రదాయ పద్ధతి’ సాయిలో కన్పిస్తూ ఆశ్చర్యం వేస్తుంది. ఇంత వడ్డన జరిగినా.. ఇందరూ వచ్చి కూర్చున్నా.. సాయి మాత్రం తన ఎడమపక్కన బడేబాబా వచ్చి కూర్చోనిదే విస్తరిని ముట్టేవాడు కాడు. అలాగని బడేబాబా కావాలని ఆలస్యం చేయడమో లేక ఏదో పని మీద ఉండి ఆలస్యంగా వస్తూ ఇందరిని ఎదురుచూసేలా చేయడమో చేసేవాడు కాదు! అదే సభామండపంలో కొంత ముందుగానే వచ్చి, భక్తి శ్రద్ధలతో ఓ మూల కూర్చుని, సాయి పిలుపు కోసం ఎదురు చూస్తూ ఉండేవాడు. అంతా కూర్చున్నాక, అన్ని పదార్థాలు వడ్డింపబడ్డాక ఇక భోజనాన్ని చేయవచ్చు అన్నాక.. ఆవో బడేబాబా (బడేబాబా! రా! ) అని ఆప్యాయంగా పిలిచేవాడు సాయి. ఆవుదూడ కట్టుని విప్పేస్తే ఎలా ఆ దూడ తల్లిగోవు పొదుగులో తలని దూర్చేస్తుందో అలా, అంత ఇష్టంతో బడేబాబా వచ్చి సాయి ఎడమపక్కన కూర్చునేవాడు. ఆ మీదట భోజనాలు ముగిసేవి. ఇది ఓ నిత్యక్రతువులా సాగిపోతూ ఉండేది షిర్డీలో. అయితే ఈ రోజున మాత్రం అందరూ భోజనాన్ని ప్రారంభించే ముందు, అందరూ వింటూ ఉండగా.. ‘బడేబాబా! ఈ మేకని కత్తితో ఒకే వేటుకి తల నరికి చంపెయ్!’ అని బిగ్గరగా ఆజ్ఞ చేసాడు సాయి. అది దీపావళి రోజు కావడంతో రోజూ కంటే ఎక్కువ పదార్థాలతో పాటు మిఠాయిల్నీ, ఇంకా తీపిపదార్థాలనీ కూడా వడ్డించారు విస్తళ్లలో. రోజూ ఉండే పద్ధతి ప్రకారం బడేబాబాని సాయి పిలవటం ఆయన వచ్చి కూర్చోగానే భోజనాలు ప్రారంభం కావటం జరగాల్సి ఉంది. అయితే కథ తారుమారై.. ‘మేకను చంపడం’ అనే కొత్త కథ ప్రారంభమైంది. భక్తులంతా వింతగా చూస్తున్నారు ఏం జరుగుతుందోనని.బడేబాబా సాయి చేసిన ఈ ఆజ్ఞని విని బాధతో సాయి పక్కకి వచ్చి కూర్చోవలసిన వాడు కాస్తా.. ఎటో వెళ్లిపోయాడు. అది సాయి ఆజ్ఞ కదా! ఎవరో భక్తులు మొత్తానికి బడేబాబాని వెదికి తీసుకొచ్చారు. బడేబాబా కూర్చోనిదే సాయి భోజనాన్ని ముట్టడు కదా! సాయి ప్రారంభించనిదే భక్తులు కూడా ప్రారంభించరు గదా! అదీ అప్పటి స్థితి. ఎవరికీ ఏం తోచడం లేదు.బడేబాబాని ఇలా మర్యాదపూర్వకంగా ఆప్యాయతతో భోజనానికి పిలవడం, ఆయన వచ్చి తన సరసన కూర్చుని ఆయన భోజనాన్ని ముట్టుకున్నాక తాను భోజనాన్ని ప్రారంభించడమనే ఈ పద్ధతిని అందరు భక్తుల సమక్షంలోనూ సాయి చేస్తూ ఉండటం ఎందుకంటే... అతిథి అనేవాడు లేకుండా తానొక్కడే తినకూడదని, ఆ అతిథిని కూడా గౌరవపూర్వకంగా ఆహ్వానించవలసిందే తప్ప చేతి సంజ్ఞని చేస్తూ చోటుని చూపించడం సరికాదనీ, అతిథి తన భోజనాన్ని ముగించాక యథాశక్తి దక్షిణని ఇచ్చి, కనీసం నూరు అడుగులైనా ఆయనతో వెళ్తూ ఆయన్ని సాగనంపి రావాలనీ, దాన్నే అతిథి సత్కారమంటారనీ అందరికీ తెలియజెప్పడానికే సాయి ఇలా చేస్తూ ఉండేవాడు రోజూ. అలాంటిది, అంత గొప్పగా తాను భావించే అతిథిని, అది కూడా ఎవరో అతిథి కాకుండా బడేబాబాని ‘మేకని చంపవలసిందే’ అని ఆజ్ఞాపించడమా? అది కూడా ఈ సమయంలోనా? అని అంతా ఆశ్చర్యపోతూ ఉంటే బడేబాబా ‘నిష్కారణంగా ఈ మూగజీవిని నేనెందుకు చంపాలి?’ అని సాయిని ప్రశ్నించాడు.సాయి వెంటనే అక్కడే ఉన్న ‘శ్యామా’ అనే మరింత సన్నిహిత భక్తుడ్ని చూస్తూ ‘పోనీ! నువ్వైనా సరే కత్తి తెచ్చి ఒకే ఒక్క వేటుతో దీని తల నరికెయ్యి! పో! కత్తి తెచ్చుకో! వెళ్లు వెంటనే!’ అన్నాడు. నిజానికి శ్యామాకి కూడా మనసు నిండుగా చెప్పలేనంత బాధ వస్తోంది ఆ జాలి గొలుపుతున్న మేకని చూస్తుంటే. బడేబాబాలాగానే తనకీ అనిపిస్తోంది ‘నిష్కారణంగా ఆ మూగజీవాన్ని తాను చంపడమా?’ అని. ‘అసలు అలాంటి మూగజీవిని చంపబోతున్నా చూడలేమే! మరి దాన్ని నేను నా చేతులతో చంపడమా?’ అని లోలోపల కుమిలిపోతూ అది సాయి ఆజ్ఞ అనుకుంటూ చక్కని వంటలని భక్తితో శ్రద్ధతో సకాలంలో వండి పంపించే రాధాకృష్ణమాయి దగ్గరికెళ్లి కత్తి తెచ్చి ఆ కత్తిని సాయి ముందు పెట్టాడు శ్యామా.ఇంతలో భక్తుల ద్వారా రాధాకృష్ణమాయికి కత్తి విషయం తెలిసి దాన్ని ఓ మూగజీవిని బలిని ఇచ్చేందుకు ఉపయోగించవలసివస్తే వద్దు! కత్తిని తిరిగి తెచ్చేయవలసిందని రాధాకృష్ణమాయి కబురు చేసింది సభామండపానికి. సాయి ఈ విషయాన్ని తెలుసుకుని.. కొద్ది దూరంలో ఉన్న శ్యామానే మళ్లీ పిలుస్తూ ‘సరే! మరోచోటి నుంచి కత్తిని తెచ్చి ఒకే ఒక్క వేటుకి దాని తలని నరికెయ్యి!’ అని ఆజ్ఞ చేశాడు. భక్తులందరికీ ఈ మేక తలని నరకడంలో సాయి చూపిస్తున్న పట్టుదలకి ఆశ్చర్యం అనిపిస్తోంది. మేక ప్రాణాలు ఎలా పోతాయోనని బాధగా ఉంది! ఆ సంఘటనకి సాక్షిగానూ, ఏ దోషం చేసిందో ఎవరికీ తెలియని ఓ ముద్దాయిలా నిలబడి, అమాయకంగా మరణశిక్ష పడుతుందని కూడా తెలియని తీరులో నిలబడి ఉంది మేక.‘కర్ర విరగకుండా.. పాము చావకుండా..’ అనే సామెతకి ఉదాహరణగా శ్యామా కత్తిని తేవడానికి వెళ్లినట్లుగా వెళ్లి ఎంతసేపటికీ రాకుండా ‘ఓడ’లో కూర్చుండిపోయాడు. మేక ఎవరి చేతిలోనూ చంపబడకూడదని, తన చేతితో తాను నరకనే నరకకూడదని శ్యామా దృఢసంకల్పం. అందుకే సాయి ఆజ్ఞకి కట్టుబడినట్లే ఉంటూ అక్కడే ఉండిపోయాడు.ఎంతసేపటికీ శ్యామా రాకపోయేసరికి సాయి మరో సన్నిహిత భక్తుడైన ‘కాకా’ని పిలిచి.. ‘కాకా! తొందరగా నువ్వైనా ఈ పనిని ముగించెయ్యి’ అన్నాడు.కాకాలో అంతర్మధనం ప్రారంభమైంది. మేలిమి బంగారంతో సమానమైనవాడివని తనని సాయి అనేక పర్యాయాలు అన్నాడు. చెప్పిన ఆజ్ఞని పాటించేవాడివని కూడా అంటుంటాడు. అలాంటి తనని ఈ అకృత్యాన్ని చేయవలసిందేనని సాయి ఆజ్ఞాపిస్తున్నాడంటే ఏదో అంతరార్థం ఉండే ఉంటుంది. ఇప్పటికే తన ముందు ముగ్గురు ఆ పనిని చేయడానికి ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ విముఖతని చూపిస్తే.. ఆ పనిని సాయి తనకి పురమాయిస్తున్నాడంటే.. ఏదో ఉండే ఉంటుంది దానిలో ఓ రహస్యం. వజ్రం ఎంతో గొప్పది. ఎంత కొట్టినా పగులనితనంతో దృఢంగా ఉంటుంది. అలాంటి వజ్రాన్ని కూడా చక్కనైన నగలో అమర్చాలంటే దానికీ కోత తప్పదు. నగిషీకోసమని సాన మీద అరగదీయడం తప్పదు. ఒక సన్నని తీగని చుట్టి ఆ వజ్రాన్ని మంచి వేడితో మండిపోయే కొలిమిలో కాల్చడం తప్పదు. అది ప్రకాశించాలంటే, దాని గొప్పదనం తెలియాలంటే, లోకానికి తెలియజేసేలా చేయాలంటే.. ఈ చిత్రహింసలు, మనం అనుకునే ఈ తీరు పరీక్షలు దానికి తప్పవు. మరి ఈ కఠిన పరీక్షలన్నీ వజ్రానికే ఉంటాయి గానీ, మామూలు రాతికి ఉండనే ఉండదు కదా!... అని ఈ తీరులో ఆలోచించుకుంటుంటే.. ఇంకా ఆలస్యం చేస్తున్నావేమి? అన్నట్లు చూశాడు సాయి.దాంతో తాను గురువు ఆజ్ఞని ధిక్కరిస్తూన్న భావం మనసులో మెదిలింది. ‘నేను చేసే దానిలో, చేస్తున్న దానిలో ఏదైనా తప్పుగానీ ఉంటే అది సాయి–నామజపం వల్ల పూర్తిగా తొలిగిపోయి తీరుతుంది’ అని దృఢభావంతో కత్తి కోసం బయలుదేరాడు. తనకి ఏ హానినీ చేయని ఆ మూగజీవిని చంపడమనే పాపం కంటే గురువు ఆజ్ఞని ధిక్కరిస్తూ ఇందరు భక్తుల మధ్య గురువుని తృణీకరించినవాడు’ అని అన్పించుకోవడం మహా పాపం అనుకున్నాడు. అయినా సాయినామజపమనే ఔషధం తనదగ్గరే ఉన్నప్పుడు ఈ మనోవ్యాధి తననేం చేస్తుంది? అనే దృఢధైర్యంతో పదును చూసుకుని మరీ కత్తిని తెచ్చుకోవాలనుకున్నాడు. దానికి కారణం సాయి ఆజ్ఞ ప్రకారం దాని మెడ ఒక్కవేటులోనే తెగిపోవాల్సి ఉంది కాబట్టి.గురువు ఆజ్ఞని పాటిస్తున్న తనకి పుణ్యం లభిస్తుందనే నమ్మకం తప్ప కాకాకి మరో ఆలోచనే రావడం లేదు, రాలేదు. భక్తులందరూ కాకా కూడా శ్యామాలాగానే ఎక్కడకో వెళ్లి రాకుండా ఉండిపోతాడని అనుకున్నారు. అయితే కాకా మాత్రం ‘సాఠేవాడా’ అనే ప్రదేశానికి వెళ్లి, కత్తినీ దాని పదునునీ నిశితంగా పరిశీలించుకుని, తన వెంట తెచ్చుకుని సాయి సమక్షానికొచ్చాడు. భక్తులందరికీ భయం, ఉద్వేగం, ఆశ్చర్యం, మూగజీవి పట్ల జాలి.. అయ్యో! అనే భావాలు కలుగుతున్నాయి. కాకా తన ధోవతిని ఎగగట్టాడు. చొక్కా చేతుల్ని పైకి మడుచుకున్నాడు. మేక వద్దకి వెళ్లాడు. లోపల ఆలోచన ప్రారంభమైంది. తాను పుట్టుకతో బ్రాహ్మణ కులానికి చెందినవాడు. సహజంగానే కోమల స్వభావం, చెప్పలేని కరుణా, అంతేకాక తన వంశంలో మాంసాహారం కాదు గదా కోడిగుడ్డుని కూడా వాడని వాడైన కారణంగా హింసాభావమే ఉండదు. ఆ కారణంగా ఈ మూగజీవిని చంపడమా? అనే ఆలోచన మళ్లీ ప్రారంభమైంది మనసులో. ఆ మేక మాత్రం వెర్రి చూపులు చూస్తోంది.‘గురుకార్యం కర్తవ్యం’ అనే దిటవుతో రెండు చేతులతో కత్తిని గట్టిగా పట్టుకుని ఆ మేకని నరకడం కోసం సిద్ధమై ‘సాయీ.. తలని నరుకుతున్నా..!’అంటూ మేక మెడని చూస్తున్నాడు నిశితంగా. హఠాత్తుగా అతని మదిలో జాలి ప్రారంభమైంది. కత్తి పట్టిన చేతులు వణుకుతున్నాయి. అడుగులు వెనక్కి పడుతూ ముందుకి రాలేక మేకమెడకి సూటి తప్పుతూ ఉంటే.. సాయి ఆ పరిస్థితిని గమనించి.. ‘చూస్తావేం? నరుకు!’ అన్నాడు బిగ్గరగా. మేకకి అదే చివరి శ్వాస అనుకుంటూ కాకా ఓ మారు సాయినామాన్ని జపించి, తలని తెగగొట్టడం కోసం కత్తిని దృఢంగా పట్టుకుని, బలంగా ఎత్తి వేటు వేసెయ్యబోతుంటే సాయి బిగ్గరగా అరుస్తూ... ‘ఆగాగు! దాన్ని చంపుతావేమిటయ్యా? ఏం అపకారం చేసింది నీకు? మూగజీవి కదా! పైగా మరణాసన్న (చావుకి సమీపించిన) స్థితిలో ఉంది కదా! అంతేకాక నువ్వు బ్రాహ్మణుడివి! చంపవచ్చునా?’ అనగానే కాకా కత్తిని కిందపడేశాడు. ఎవ్వరికీ ఏం అంతుబట్టడం లేదు. ఎందుకు చంపమన్నాడో...? ఎవరికి వాళ్లు తప్పించుకుంటూంటే పట్టుబట్టి చంపడానికి సిద్ధపడేంతవరకూ ఎందుకు ప్రోత్సహించాడో...? చివరికి గుండెధైర్యంతో మనసుని చంపుకుని, చంపబోయేసరికి వద్దని ఎందుకు నివారిస్తున్నాడో..? ఎవరికీ అర్థం కాలేదు.సాయి అన్నాడు. ‘కాకా..! ఇలారా!! ఇది నిజంగా చావుకి సమీపంగా ఉన్న మేక. చూడు ఎంత దుర్బలంగా ఉందో! దీన్ని తెచ్చి ఇచ్చాడు ఆ వ్యక్తి ఎవరో, దీన్ని సంప్రదాయబద్ధమైన పద్ధతిలో ‘‘హలాల్’’ చేస్తాను. నీటి పాత్రని పట్టుకో!’ అన్నాడు. ‘‘హలాల్’’ అంటే చావబోతున్న మేక చెవిలో ఖురాన్ మంత్రాలని కొన్నింటిని చదవడం అని అర్థం. అలా చదివి, దాని కట్టు నుంచి తొలిగించారు. అంతే! అది కొద్ది దూరం అడుగులు వేసి, తనంత తానే చనిపోయింది అందరూ చూస్తుండగానే.నేర్చుకోవలసిందేమిటి?ఈ మేకకి మాత్రమే చావు లేదు. మనందరం కూడా అలాంటి మేకల్లాంటి వాళ్లమే. అక్కడెవరో ఓ వ్యక్తి సాయికి ఆ మేకని బహూకరించినట్లు, మనల్ని కూడా మన తల్లిదండ్రులు ఓ శరీరాన్ని ఇచ్చి, ఈ లోకంలో ఓ ప్రాణిగా అందించారు. ఈ శరీరానికి ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎలాగైనా మరణమనేది తప్పదు. ఆ విషయం మనకెందుకు గుర్తుండదు. మన ముందే ఎందరో చనిపోతున్నా, వాళ్ల అంత్యక్రియలకి వెళ్లి అక్కడి కార్యక్రమాలని చూసి వస్తున్నా, ఆ నిరాశ, వైరాగ్యమనేవి ఏ ఒక్కటో రెండు రోజులు మాత్రమే ఉంటూ ఆ మీదట మర్చిపోతూ ఉంటాం. కాలం అనేది మేకని చంపడానికి ఉపయోగించబడే కత్తి లాంటిది. ఆ కాలమనేది ఎవరి కారణంగా, ఏ స్థలంలో, ఏ తీరుగా, ఎందుకు మూడుతుందో తెలియదు. అందుకే చంపాలన్న ఆజ్ఞని వింటూనే ‘ఎందుకు?’ అన్నాడు బడేబాబా. కత్తి కోసం వెళ్లి అక్కడే ఉండిపోయాడు శ్యామా. ఏ మాత్రమూ ఇష్టంలేక ప్రయత్నించి విఫలుడయ్యాడు కాకా.భగవంతుడనే వాడు కూడా మన మరణాన్ని అనేక పర్యాయాలు ఇలాగే ఏవో కారణాలతో వాయిదా వేయిస్తూ ఉంటాడు. దాని కోసమే మనం నామజపాన్ని చేయవలసి ఉంటుంది. మేకని చంపదలిచి ఇన్ని ప్రయత్నాలు జరుగుతున్నా మేక అమాయకంగా చూస్తోందే తప్ప కట్టు విడిపించుకుని పారిపోయే ప్రయత్నాన్నే చేయడం లేదు. అందరు భక్తులున్నా ఎవరూ ఆ సాయి ఆజ్ఞకి వ్యతిరేకాన్ని చెప్పడం లేదు. భగవంతుని ఆజ్ఞ దాట వీలులేనిది. ఎదురు తిరిగే శక్తిని ఎవరికీ ఇయ్యనిది. ఏదో మనం చేసుకున్న పుణ్యాల కారణంగానే మనకి చావు సమీపించి ఉన్న ఏవేవో కారణాల ప్రకారం ఆ విరోధించే వ్యక్తులు వెనుకడుగు వేస్తూ ఉంటారు. ఆ ఇబ్బంది తప్పినప్పుడల్లా అది మన సామర్థ్యం, మేధావితనం, నేర్పరితనం అని మనమనుకుంటాం తప్ప అదంతా దైవకృప అని అనుకోం.ఇలాంటి మరణాసన్నస్థితిలో ఉండి కూడా కావాలని ఎవరికో హానిని తలపెట్టడం, బాకీలని తీర్చకపోవడం, దౌర్జన్యాలు చేయడం, తల్లిదండ్రులకి మనస్తాపాన్ని కల్పించే పనుల్ని చేయడం.. వంటి ఎన్నింటినో బాగా తెలిసి కొన్నింటినీ, తెలియక కొన్నింటినీ చేస్తూనే ఉంటాం.ఆ మేకకి సాయి ‘హలాల్’ చేసినట్టుగా మనకి కూడా సాయిలాంటి యదార్థ గురువు మంత్రోపదేశాన్ని చేసినట్లయితే అప్పుడు లభించే మరణం స్వచ్ఛందమరణం లాంటిదే. అదే ఆత్మకి శాంతినిస్తుంది. ఇంతటినిగూఢార్థాన్ని అర్థం చేయించేందుకే సాయి ఈ ఘాతుక సంఘటనని మన ముందుంచాడు తప్ప సాయి మాత్రం పరమ దయార్ద్రహృదయుడే!యదార్థ భాగవద్భక్తుడైన మహమ్మదీయుని వద్దకి వెళ్లడం, ఆయన్ని గురువుగా భావించడం వల్ల అపవిత్రత వస్తుందా? అనే అంశాన్ని చూద్దాం! –సశేషం -
షిర్డీలో గోడపై సాయిబాబా ఆకృతి
సాక్షి, ముంబై: షిర్డీలోని ద్వారకా మాయిలోని ఓ గోడపై బుధవారం అర్ధరాత్రి సాయిబాబా ఆకృతి (చిత్రం) కన్పించదని ఓ భక్తుడు తెలపడంతో షిర్టీ పరిసరాల్లో ఒక్కసారిగా రద్దీ పెరిగింది. సుమారు మూడు గంటలపాటు సాయిబాబా చిత్రం కన్పించిందని స్థానికులు చెబుతున్నారు. సాయిబాబా దర్శనమిచ్చిన ద్వారకామాయిలోని గోడను తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున షిర్డీకి చేరుకున్నారు. అయితే ఇలాంటిదేమి ఉండదని కొందరు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా మరోవైపు షిర్డీ సాయిబాబా సంస్థాన్ మాత్రం ఈ విషయంపై అధికారికంగా ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. -
అసామాన్య సామాన్యుడు
‘హేమాడ్ పంత్!’ అని తనని సాయి సంబోధించడమేమిటి? ఇంతకీ ఆయనెవరు? అని ఒక్కక్షణం అన్నా సాహెబు ఆలోచించాడు. ‘యదు’ అనే పేరుగల వంశం ఒకటుంది. ఆ వంశంలో పుట్టిన అందర్నీ ‘యాదవులు’ అని పిలుస్తారు. అలాంటి యాదవ వంశాల్లో ఎవరు ఏ ప్రాంతానికి చెందిన వారైతే వాళ్లని ఆ ప్రాంతానికి చెందిన యాదవులు సుమా! అని గుర్తించేందుకు వీలుగా ఆ ప్రాంతపు పేరుని ఈ యాదవ వంశానికి ముందు తగిలించేవారు. అలా ఏర్పడినదే దేవగిరి ప్రాంతానికి చెందిన యాదవుల వంశం – దేవగిరి యాదవ వంశం. ఆ రాజులు తమకు చక్కని ఆలోచననీయగల కొందరు మేధావుల్ని మంత్రులుగా నియమించుకున్నారు. అలా నియమించుకున్న మంత్రులందరికీ పైవాణ్ని ముఖ్యమంత్రి అని వ్యవహరిస్తుండేవారు. అలా దేవగిరి యాదవ వంశీయులకి రాజుగా ఉండేవానికి ముఖ్యమంత్రి హోదాలో నియమింపబడ్డ మహనీయుడు హేమాడ్ పంత్. ఈ మాటకి సరైన మాట – హేమాద్రి పంతు. పంతు అనే పదం బ్రాహ్మణుల పేర్లకి చివర ఉండటంగాని, లేదా ఆయన పేరు ఏదైనప్పటికీ ‘పూజ్యుడైన బ్రాహ్మణుడా!’ అనే అర్థంతో సంబోధిస్తూ పంత్జీ అనేవారు. ఈయన బ్రాహ్మణ జాతికి చెందినవాడు కాబట్టి ఏదో కులగౌరవం కోసం పంతు అని పిలవబడ్డ పిలుపు కాదిది. నిజంగా బ్రాహ్మణ ధర్మాన్ని చక్కగా ఆచరించిన వాడూ, గొప్ప పండితుడు హేమాద్రి పంత్. పైగా ఆయన తన పాండిత్యానికి గుర్తుగానూ, ఎవరికీ ఏవిధంగానూ తన పాండిత్యం అర్థం కాకపోయినా ఫరవాలేదు గాని, ఉత్తమ గ్రంథాన్ని లోకానికందించాలనే ఉత్తమ స్ఫూర్తితోనూ ‘చతుర్వర్గ చింతామణి రాజ ప్రశస్తి’ అనే గ్రంథాన్ని రచించి జాతికి సమర్పించాడు కూడా. ‘ఇంతటి గొప్పవాడూ, ఇంకా ఇప్పటికీ తెలియని ఎన్నెన్నో గొప్పదనాలు కలవాడూ అయిన హేమాద్రి పంతుతో తనని సమానం చేస్తూ సాయి తనని హేమాద్రి పంతు అని పిలవడమేమిటి?’.. అని ఆలోచించిన అన్నా సాహెబు ఓ దృఢ నిర్ణయానికొచ్చాడు. సహజంగా ఎవరైనా ఓ చేయరాని పని చేసినా, మాట్లాడరాని తీరులో మాట్లాడినా అలాంటివారిని ఎగతాళి చేస్తూ ‘అతనికేం! అతను అపర కాళిదాసు’ అంటూంటారు. అయితే తనని అలా ఎగతాళి చేస్తూ ‘హేమాద్రి పంతు’ అనలేదు సాయి. దానిక్కారణం సాయి స్వభావం. ఎదుటివారిని తక్కువ చేస్తూ, వేళాకోళం చేస్తూ మాట్లాడే తీరు కాదు. పోనీ! తనని ప్రశంసిస్తూ ‘హేమాద్రి పంతు’ అని సంబోధించాడనుకుందామా? అంటే అంత గొప్పదనాన్ని సాయిని దర్శించినంత ఇంత తక్కువ కాలంలో తానేమీ చూపించలేదు. పైగా తోటి మిత్రులెవరూ కూడా తన పనుల్లో ఏదో గొప్పదనమున్నట్లుగా ఏనాడూ తనతో అన్నదీ లేదు. తనని ‘హేమాద్రి పంతు!’ అని సంబోధించిన కారణంగా తాను ఆ హేమాద్రి పంతు ఎవరా? అని భావించి, ఆయన గురించిన మొత్తం సమాచారాన్ని తీసుకుంటాడు గదా అన్నా సాహెబు అనే ఆలోచనతో సాయి తనని అలా సంబోధించి ఉండవచ్చు. నిజాన్ని నిజంగా ఆలోచించినా హేమాద్రి పంతుని ఇంతకుముందు తెలుసుకోవాలనుకున్నదీ లేదు – తెలిసి ఉన్నదీ లేదు. ఇప్పుడు ఆయన వ్యక్తిత్వం, గొప్పదనం, గాంభీర్యం – అన్నింటికీ మించి – సాయి అంతటివాని చేత ప్రశంసించబడిన హేమాద్రి పంతు కావడం వల్ల.. అన్నా సాహెబుకి గట్టి ఆలోచన వచ్చింది – తాను హేమాద్రి పంత్‌ను గనుక మార్గదర్శకునిగా తీసుకుంటే సాయికి మరింత దగ్గర కాగలడని. అన్నా సాహెబు తన ప్రవర్తన ఎలా ఉండి ఉందో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకున్నాడు. షిరిడీకి బయలుదేరేముందు మిత్రుని పుత్రుడు మరణిస్తే – ప్రాణాన్ని రక్షించలేని గురువు ఓ గురువా? – అనుకుని ప్రయాణాన్ని మానేసుకున్నాడు. ఆ సందర్భంలో మళ్లీ మరో మిత్రుడు తనకి చివాట్లు పెట్టి సాయి గొప్పదనాన్ని చెప్పి మళ్లీ బయలుదేరదీశాడు. ఏదో జరిగిన సంఘటనని గురువుకి ముడిపెట్టి దాని ఆధారంగా గురువుని తక్కువ చేయడం లేదా విశ్వసించకపోవడం, తన ఆలోచనే గొప్పదనుకోవడం సరికాదన్నమాట. ఈ విషయాన్ని గ్రహించుకున్నాడు. అంటే ఏమన్నమాట? షిరిడీకి వెళ్లడం మానుకున్న తనని మళ్లీ మిత్రుని రూపంలో చివాట్లు పెట్టి బయలు దేరదీసింది సాయేనన్న మాట! దీన్ని అర్థం చేసుకున్నాడు. తాను బయలుదేరి ఎక్కడ రైలు ఆగదో ఆ బండిలోకి ఎక్కి కూచున్నవేళ అజ్ఞాతవ్యక్తిలా వచ్చి వివరాలడిగి షిరిడీకి వెళ్లే మార్గాన్ని చెప్పి సహకరించినవాడూ ఆ సాయేనన్నమాట. దీన్ని తెలుసుకున్నాడు. తనని ప్రతిక్షణంలోనూ ప్రతి కదలికలోనూ ప్రతి మాటలోనూ సాయి పరిశీలిస్తూ ఉన్నాడని. పెరుగుని నీటితో కలిపి చిలికితే ఎలా వెన్న పైకి వస్తుందో అలా ఈ గత అనుభవాలను పరిశీలించుకుంటే అర్థమైంది తనకి – తనని సాయి దగ్గరికి తీసుకుంటున్నాడని. అందుకే ‘హేమాద్రి పంతులా ఉండవలసింది సుమా!’ అని సూచిస్తూ, అలా ఉన్న పక్షంలో మరింత సాయికి చేరువ కాగలనని తెలుపుతూ ఉన్నట్లు అవగతమైంది. అందుకే సాయి చరిత్రను రాసి లోకానికి అందించాలనే భావన, తపన తనకి దృఢమయింది. ఏ విషయాన్నైనా మొక్కుబడిలా రాసేయడానికీ, రాసిన ప్రతి అక్షరంలోనూ తన భక్తి శ్రద్ధలని నింపి రాయడంలోనూ తేడా లేదా? ఒక పాటని ఏదోలా పాడేస్తే అక్షరాలన్నీ నోటినుండి బయటికొచ్చేస్తాయి తప్ప వాటిలో మాధుర్యం ఆర్ద్రతా ఉంటుందా? అలానే సాయి స్వయంగా తనని దగ్గరికి తీసుకుంటున్న ఈ దశలో తాను సాయి చరిత్రను రాస్తే ఆ చరిత్రలోని ప్రతి అక్షరంలోనూ – ఆ చరిత్రను చదివే ప్రతి భక్తునికీ సాయి దర్శనమవుతుందని అర్థం చేసుకోగలిగాడు అన్నా సాహెబు. ఈ స్థితి వ్యక్తికి కలగాలంటే కావలసినవి ‘శ్రద్ధ – సబూరి’ – చలించని నమ్మకం, చెప్పలేనంత ఓపిక. ఇప్పుడీ చరిత్రని చదువుతున్న వారికైనా, సాయి తమకి దగ్గర కావాలంటే షిరిడీకి వెళ్లి సాయిని దగ్గరగా చూడటం వల్ల దగ్గరితనం రాదు. పైననుకున్న శ్రద్ధ సబూరి అనే రెండూ గాని కలిసి ఉన్నట్లైతే దగ్గరతనం దానంటతదే సిద్ధించేస్తుంది. అందుకే ఒకసారి షిరిడీకి వెళ్లినవారికి అదే చివరి ప్రయాణం కాదు. కాబోదు. సాయి అలా కానివ్వడు కూడా! మారాకనే మహాత్ములయ్యారు! ఒక్కసారి ప్రాచీన మహాత్ముల చరిత్రలను పరిశీలిస్తే ఒకప్పుడు మరో తీరు ప్రవర్తనలో ఉన్నవాళ్లే, ఏదో ఒక సంఘటన కారణంగా అకస్మాత్తుగా మారి మహాత్ములయ్యారు. కేవలం దారిదోపిడీలు చేస్తూ మార్గంలో ప్రయాణించేవారిని భయపెట్టి వస్తువుల్నీ, ధనాన్నీ దోచుకుంటూండే ఋక్షుడనే వ్యక్తిని నారదుడు సప్తమహర్షులతో కలిసి చెట్టుకి కట్టేశాడు. నారదుడు అడిగాడు – ‘మా ధనాన్నీ, వస్తువుల్నీ దోచుకుంటూ జీవితాన్ని వెళ్లదీసుకుంటున్నావు కదా! ఇది పాపమని నీకూ తెలుసుకదా! దీనిలో నీ భార్యాపుత్రులకి భాగస్వామ్యం ఉందా? కనుక్కురా!’. ఎక్కడైనా దొంగని ప్రశ్నిస్తే.. పైగా ఇలాంటి ప్రశ్న వేస్తే కనుక్కొస్తాడా? జీవితంలో మార్పు రాబోతోంది. వెళ్లి కనుక్కున్నాడు. భార్య చెప్పింది – భర్త పుణ్యంలో సగం తనది తప్ప పాపంలో ఏమాత్రం భాగస్వామ్యం ఉండదని. అంతే! నారదుని దగ్గర మంత్రోపదేశం పొందడం, తపస్సుకి కూర్చోవడం, ఒంటినిండుగా వల్మీకం (పుట్ట) పెరిగేంత కాలం తపస్సు చేయడం, నారదుడే ‘వాల్మీకి’ అని పిలుచుకోవడం, ఆ బిరుదు పేరుతోనే శాశ్వతుడు అయిపోవడం జరిగింది కదా! ఇక్కడ కూడా అన్నా సాహెబుకి జీవితంలో మార్పు కలిగి ‘హేమాద్రి పంతు’ అనే బిరుదు పేరే ఏర్పడింది. మరాఠీ భాషలో హేమాడ్ పంత్. ఇదే తీరుగా భారతంలో పరాశరుడనే మహర్షి ఉన్నాడు. ఆయన గంగానదిని నావమీద దాటుతూ ఆ నావని నడుపుతూన్న సత్యవతి అనే ఆమెను అడిగాడు – నీ నుండి ఉత్తమ పుత్రుణ్ని పొందదలిచాను తప్పశ్శక్తితో – అని. ఆమె అంగీకరించింది. దానిక్కారణం తపశ్శక్తితో సద్యోగర్భాన్ని (చూస్తుండగా గర్భం రావడం, తొమ్మిది నెలలు మోయడం.. వంటివేమీ లేకుండా సంతానాన్ని కనడం,) ఇస్తున్నప్పుడూ, కన్యత్వం చెడనప్పుడూ సంతానాన్ని – అందునా మహర్షి నుండి పొందడం మంచిదీ, గౌరవకారణమూ కదా! అని. జాలరి అయిన తనకు మహర్షి అనుగ్రహం ఆయనంతట ఆయన ద్వారా కలగడం ఎంత గొప్ప! అని భావించి అంగీకరించింది. గంగకి అవతలి ఒడ్డుకి చేరాక ద్వీపంలో కనడం కారణంగానూ, ప్రపంచాన్ని చీకటి చేసి (కృష్ణం) పుత్రుణ్ని పొందిన కారణంగానూ ఆ సంతానం ‘కృష్ణ ద్వైపాయనుడు’ అని పిలువబడ్డాడు. ఇది ఆయన అసలు పేరు. ఇందాక శ్రీమద్రామాయణ కథలో బిరుదు పేరైన వాల్మీకికి ముందు పేరు ఋక్షుడు అయినట్లుగా, ఇక్కడ కూడా ఈ కృష్ణ ద్వైపాయనుడు – వేదాలను విభజించిన కారణంగా వేద వ్యాసుడు అనే బిరుదు పేరుని పొందాడు. పరిశీలిస్తే చరిత్రలన్నీ ఒకలానే ఉంటాయి. ఋక్షుడు – వాల్మీకి, కృష్ణ ద్వైపాయనుడు – వ్యాసుడు లాగానే అన్నా సాహెబు – హేమాడ్ పంత్‌గా అయ్యాయి. బాబాని ఎందుకు నమ్మాలి? కోట్ల మంది భక్తులకి బాబా ఆరాధ్య దైవం. బాబా సమాధి కాకముందు చూసినవారెవరూ వారు సమాధి అయ్యేంతవరకూ ఒక్కసారి మాత్రమే చూసి మరల రాకుండా ఉన్నవారు లేరు. అదేదో వింత ఆకర్షణ ఆయనలో ఉండటమే కారణం. జీవితంలో పెద్ద దీర్ఘ సమస్య వచ్చిన సందర్భంలో ఆయన సమాధి దగ్గరకు పోయి నిశ్శబ్దంగా మనసులోనే రోదిస్తూ నిలబడితే, మౌనంగా ఆ సమాధి నుండి సమస్యకి సమాధానం వినిపిస్తుంది. ఆ సమాధానం పట్ల ఎదురుచూపు ప్రారంభమవుతుంది. మొత్తానికి అలాగే ఆ సమస్యా పరిష్కారం జరగడమనేది ఎందరికో అనుభవంతో కనిపించే యథార్థం. తనకున్న ఖ్యాతి, కీర్తి, భక్త జన సంరక్షకుడనే జనుల నమ్మకం కారణంగా బంగారపు మేడలలో నివసించవచ్చు. చిటికె వేస్తే చాలు ఖరీదైన భవనాల పరంపర తన వద్దకి వచ్చి చేరతాయి. అయితే ఆయన ఓ మసీదు గోడకి మాత్రమే ఒరిగి కూర్చుంటారు. ఎవరో ఆయన గురించి బాధపడి ఒక దిండుని అందిస్తే దాన్ని పెట్టుకుని కనిపిస్తారు రేయింబవళ్లూ. ఎందరెందరి జీవితాలకో వడ్డించిన విస్తళ్లని ఏర్పాటు చేయగల శక్తి ఉన్నా, ఆయన మాత్రం నేలమీద ఓ ముతక గోనె సంచిని పరిచి దానిమీద తిరుగలిని ఉంచి, పక్కన చేటలో ఉన్న గోధుమల్ని అప్పుడప్పుడు కొంత కొంత చొప్పున పోస్తూ, తిరుగలిని తిప్పుతూ పిండిని విసురుతూ అప్పుడప్పుడు కనిపిస్తారు. ఒంటరివాడైన బాబాకి ఆ చేటెడు గోధుమలు కావాలా? పైగా పిండిని తానే విసురుకోవాలా? ఎవరిని ఆర్ద్ర దృష్టితో చూసినా ఎన్ని కాలిన రొట్టెలని తెచ్చి సమర్పించుకోరు గనుక! ఓ ఎండ అని లేదు – వాన అనేది లేదు – చలి అనేదాన్ని పట్టించుకునే ధోరణే లేదు. ఏదో ప్రకృతికి అతీతునిగా అక్కడే ఆ వేపచెట్టు మూలంలో కూర్చోవడం ఆశ్చర్యం కాదూ? పరమ రామ భక్తులయినవారు దర్శిస్తే వారికి రామచంద్రమూర్తిగాను, అత్యంత శివభక్తిపరులు దర్శిస్తే సాక్షాత్తూ పరమశివునిలానూ కనిపించి ఉన్న కారణంగానూ, కృష్ణ పరమాత్ముని లాగా అనేక లీలలని చూపి ఉన్న కారణంగా ఆయన్నే కృష్ణుడిగా అందరూ దర్శించారు. అందుకే ఆయన నివసించే మసీదుకి ద్వారక అనే పేరుని పెట్టారు. లోకంలో ద్వారకలు మూడు కాగా, ఒకటి సముద్రంలో మునిగిపోయింది కదా! రెండవది ద్వారకాపురి. ఇక మూడోది సప్త ద్వారక అదే షిరిడీ అని భక్తజనుల దృఢ విశ్వాసం. లక్షలకొలది భక్తులకు ఆహారాన్ని పెట్టగలిగి కూడా భిక్షాటన చేయడం, బంగారపు మందిరాల్లో ఉండగలిగిన శక్తి ఉండి కూడా మసీదు గోడకే ఆనుకుని కూర్చోవడం, భూత భవిష్యత్ వర్తమానాలని తెలియగలిగిన శక్తి ఉండి కూడా ఏమీ తెలియని పిచ్చివానివలె ఉండటం, ఖరీదైన వస్త్రాలను కోకొల్లలుగా రప్పించుకోగలిగి కూడా చిరిగిన వస్త్రాలనే ధరిస్తూ, చిరిగిన చోట సూదీ దారాలతో కుట్టుకున్న వస్త్రాలని వేసుకోవడం, తనకి నిజమైన భక్తుడని అనిపించిన వ్యక్తికి మాత్రమే ఊదీ (విభూతి) ప్రసాదాన్నిస్తూ ఉండటం, అత్యంత భక్తుడైన వానికి మాత్రమే అర్థమయ్యేలా నర్మగర్భంగా మాట్లాడటం... వంటివన్నీ నిజమైన ఫకీరు లక్షణాలు. అన్నీ ఉండి కూడా ఏమీ లేనివానిలా ఉండటం, అన్నీ తెలిసి కూడా తెలియని వానిలా ఉండటం, అనేక సిద్ధ శక్తులున్నప్పటికీ (నీళ్లతో దీపాలను వెలిగించడం వంటివి) అతి సామాన్యునిలా వ్యవహరించడం, అంతటి గొప్పవాడైనప్పటికీ పిల్లలతో ఆటలాడుకుంటూ ఉండటం.. వంటివన్నీ ఆయన్ను లోకానికి అతీత పురుషునిగా తెలియజేస్తూ ఇహలోక భోగాలను అనుభవించగల శక్తి ఉండీ, వాటిని ఇష్టపడని తీరులో ఉన్న కారణంగా ఆయన్ని తప్పక నమ్మితీరాలని చెప్తాయి ఈ ఉదాహరణలన్నీ. ఇక రోహిల్లా కథకి వెళదాం. (సశేషం..) ∙డా. మైలవరపు శ్రీనివాసరావు -
అనుమానాలన్నీ పటాపంచలు
ఓ పనిని కార్యరూపం దాల్చేలా చేయాలంటే స్థిరమైన నమ్మకం, చెక్కు చెదరని ఓపికా ఉండాలి కదా! ఆ రెంటితోనే అన్నా సాహెబు స్వయంగా సాయి దర్శనం కోసం, గ్రంథ రచనకి ఆమోదం పొందడం కోసం షిరిడీకి బయల్దేరాడు. షిరిడీలో సాయి దర్శనానికి వెళ్లాలనే గట్టి కోరికని అన్నా సాహెబుకి కలిగించిన వాళ్లు నానా సాహెబు, కాకా సాహెబు అనే ఇద్దరు మిత్రులు. అన్నా సాహెబు షిరిడీకి బయల్దేరగానే స్నేహితుని పుత్రుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడనే వార్త వినిపించింది. అంతే! షిరిడీ ప్రయాణం మాని స్నేహితుని ఇంటికి వెళ్లాడు అన్నా సాహెబు. ఔషధాలు వాడారు. ఎందరెందరో మంత్రాలు పఠించారు. సాక్షాత్తూ ఆ కుటుంబమంతా గురువుగా భావించే ఓ మహనీయుణ్ని రప్పించి వ్యాధిగ్రస్తుని పక్కనే ఉంచారు – ఆయన తన మహిమలతో కాపాడగలడని. ఇన్ని చేసినా ఆ స్నేహితుని పుత్రుడు మరణించనే మరణించాడు. అంతే! నా స్నేహితుని పుత్రుణ్నే కాపాడలేని ఈ గురు సంప్రదాయం మీద నాకు విశ్వాసమెందుకు? అనుకుంటూ అన్నా సాహెబు తన షిరిడీ ప్రయాణాన్ని మానేయడానికి నిశ్చయించుకున్నాడు. భగవంతుడు భక్తుణ్ని పరీక్షించే విధానం ఇదే. తనవద్దకి బయల్దేరిన భక్తుణ్ని కాస్తా – ప్రయాణం మానేద్దామనే ఆలోచనకి గురిచేయడం ఎందుకంటే – మరింత భక్తి విశ్వాసాలు అతనిలో కలిగించాలనే సంకల్పమే కారణం కాబట్టి. అన్నా సాహెబు తిరిగి వెళ్లిపోబోతుంటే మిత్రుడొకడు వచ్చి – ‘షిరిడీకి పో!’ అని కోపంతో పలికి షిరిడీ ప్రయాణానికి సంకల్పం కలిగేలా చేశాడు. లోకంలో భక్తులకు కూడా ఇలాంటి అనుభవాలే కలుగుతాయి. ప్రస్తుతమున్న పరిస్థితిలో ఎలా వెళ్లగలం? అనుకుంటూంటే అంతలోనే ఎవరో వచ్చి ‘వెళ్లు! మానతావేం!’ అని మళ్లీ ప్రయాణానికి సన్నద్ధుల్ని చేస్తారు. షిరిడీ వెళ్లొచ్చాక పొరపాటున షిరిడీ ప్రయాణాన్ని మాని ఉంటే ఎంత నష్టపోయి ఉండేవాళ్లం? అనే అనుభూతి కలుగుతుంది. అన్నా సాహెబు మళ్లీ ప్రయాణానికి సిద్ధపడి రైల్లో కూచోగానే ఒక సాయెబు వచ్చి – ఎక్కడికి వెళుతున్నావని అడిగాడు. ‘షిరిడీకి’ అనగానే – నవ్వి – నువ్వు ఫలానా స్టేషన్లో దిగు! నువ్వు వెళ్లాల్సిన స్టేషన్లో ఈ బండి ఆగదు సుమా! – అని చెప్పి వెళ్లిపోయాడు. దైవ విచిత్రాలన్నీ ముందు తెలియవు. ఆ తర్వాత అర్థమవుతాయి. అన్నా సాహెబెవరో? ఎక్కడికి వెళుతున్నాడో? ఆ ప్రశ్ననే ఎందుకు వేశాడో? వేసి అలా ఎందుకు సూచించాడో? – అదంతా అన్నా సాహెబుకి తర్వాతగానీ అర్థం కాలేదు. దీన్ని ఓ మహత్తుగానూ గొప్ప సంఘటనగానూ అప్పటికి మనసులో భావించని అన్నా సాహెబు, అలాగే ఆ సాయెబు చెప్పిన స్టేషన్లోనే దిగాడు. ఆ సాయెబే గనుక అలా వచ్చి చెప్పి ఉండని పక్షంలో తాను తాననుకున్న స్టేషన్లో దిగి నానా యాతనలకీ గురయి షిరిడీకి చేరలేకపోయేవాడు. అదీకాక స్నేహితుల పుత్రుణ్ని రక్షించలేని గురువు ఒక గురువా? అనే అభిప్రాయంతో ఉన్న తాను పూర్తిగా షిరిడీ ప్రయాణాన్ని మానివేసే వాడేమో కూడా! బాబా గురించిన చరిత్రని వ్రాయదలిచిన అన్నా సాహెబు తనకు తానుగా వెళ్లి సాయిని దర్శించి తన మనోభిప్రాయాన్ని తెలిపే కంటే, సాయికి సన్నిహితులైన వారి ద్వారా తన ఆలోచనని సాయి సమక్షంలో ఉంచడం మంచిదని భావించాడు. సాయి తన భక్తులందరికీ దర్శనమిచ్చే ప్రదేశం సాఠేవాడా. అన్నా సాహెబుకి షిరిడీలో దిగగానే అన్నింటికంటే ముందుగా సాయిని దర్శించాలనే ఆత్రుత తీవ్రమయింది. స్నానం చేయకుండా రాత్రంతా ప్రయాణించిన ఆ వస్త్రాలతో అలాగే దర్శించవచ్చునా? అనే అనుమానం కూడా లోపల కలిగింది. చిత్రమేమిటంటే అన్నా సాహెబుకి సాయి నుండి తిరిగి వస్తున్న మాల్కరు అనే భక్తుడు కనబడి ‘ఇప్పుడే వస్తున్నా సాయి దర్శనాన్ని చేసి. ఆయన అదుగో సాఠేవాడా దర్శన స్థలంలోనే ఉన్నారు. వెంటనే ధూళిదర్శనం (ఎలా ఊరి నుండి వస్తే అలా చేసే దర్శనం) చేసి రా!’ అన్నాడు. బాబా లీలలు ఇవే! వెంటనే చూడాలనేది ఓ తపన అవుతూంటే, ఇలా అశుభ్ర వస్త్రాలతో స్నానం చేయని శరీరంతో దర్శించవచ్చునా? అనేది మరో అనుమానమవుతూంటే, భక్తుడైన మాల్కరు ద్వారా సాయి ఆ రెండు ప్రశ్నలకీ సమాధానాన్ని ఇప్పించాడు – ధూళి దర్శనం చేసి రా అనీ – అలా చేయవచ్చుననీ. అంతేకాదు, మరో ప్రశ్నకి అవకాశం లేకుండా – ఎలాగూ దర్శనం ముగించాను కదా అని మానేయకుండా ‘స్నానానంతరం మళ్లీ దర్శనానికి రా!’ అని కూడా చెప్పించాడు బాబా అనిపించింది అన్నా సాహెబుకి. మనం అడిగితే దానికి ఏదో సమాధానాన్ని చెప్పేవాళ్లు కొందరుంటారు. మనకి రాబోయే సంశయాన్ని తమకి తామే ప్రశ్నగా వేసుకుని మనకి ఇక అనుమానమే లేకుండా, రాకుండా ఉండే సమాధానాన్ని చెప్పేసేవాళ్లు కొద్ది సంఖ్యలో ఉంటారు. వీటన్నిటికంటే మన మనోభిప్రాయాన్ని గమనించి వారి ఆలోచనకి అనుగుణంగా మనని నడిపించేవారు ఏ ఒక్కరో ఇద్దరో ఉంటారు. అలాంటివాడు సాయి అని గ్రహించగలిగాడు అన్నా సాహెబు. ఆ ఆలోచన నిజం కాబట్టే షిరిడీకి ప్రయాణం – ఆపుదల – రైలుబండిలో సాయెబు సూచన – షిరిడీకి రాక – ధూళిదర్శనం... ఇవన్నీ జరిగాయని భావించాడు. సాయిచరిత్ర ఒక కథ కాదు. నిత్యజీవన చరిత్ర. అందరు భక్తులకీ ఇవే తీరు అనుభవాలు జరుగుతూ ఉంటాయనేది నిజం. భక్తుడైన మాల్కరు అలా సూచించగానే సాయిబాబా వద్దకి వెళ్లి సాష్టాంగ పడ్డాడు అన్నా సాహెబు. నేలమీది ప్రతినీటి బిందువునీ ఆకాశం వరకూ తన కిరణాలతో వాయురూపంగా మార్చి మేఘాన్ని సృష్టిస్తే ఆ మేఘం ఒక్కసారిగా వర్షిస్తే ఎంత చిన్న నీటి బిందువు ఎంత పెద్ద వర్షంగామారిందో, అలా తనకున్న సామాన్య ఉత్సాహం, ఆత్రుత కాస్తా సాయి పాదాలని స్వయంగా పట్టేంత అనుగ్రహానికి అవకాశాన్నిచ్చాయని అనుకున్నాడు అన్నా సాహెబు. సాయి అంటాడు ఒకచోట – పిచ్చుక కాలికి దారాన్ని కట్టి అది ఎక్కడికి ఎంత దూరంగా, ఎంత ఎత్తులో ఎగురుతున్నా ఆ తాడునిపట్టి కిందికి లాగి తన వద్దకి రప్పించుకుంటా అని. నిజమే కదా! సాష్టాంగాన్ని చేసి సాయి పాదాలని స్పృశించిన వేళ అన్నా సాహెబు తన శరీరాన్ని తాను మరచిపోయాడు. పాలకోసం దూడని తల్లి వద్దకి పంపాక, తిరిగి వెనక్కి లాగాక, పాలు పితకడం జరుగుతున్నప్పుడు దూడ ఎలా తన వంతు ఎప్పుడొస్తుందా? అని ఎదురుచూస్తూ తహతహలాడిపోతుంటుందో అలా తపన పడ్డాడు అన్నా సాహెబు, సాయి దర్శనం కోసం. దర్శనం మాత్రమే కాదు, స్పర్శనం కూడా అయింది. భక్తిలో సంతృప్తి కలగడమంటే ఏమిటో అర్థమయింది. సాయిచరిత్రని రాసి తీరాల్సిందే! అనే అభిప్రాయం దృఢమయింది. తొమ్మిది నెలలపాటు గర్భంలో మోసి, అతికష్టంతో ప్రసవ వేదనని అనుభవించి ప్రసవించిన మరుక్షణంలో ఆ తల్లితనాన్ని పొందిన గృహిణి తన బిడ్డని చూసి ఎంతెంత ఆనందాన్ని అనుభవిస్తుందో, అప్పటివరకూ పది నెలలపాటు అనుభవించిన అంత బాధనీ అలా గాలికి ఎగిరిపోయేలా చేస్తుందో అంత ఆనందమైంది అన్నా సాహెబుకి సాయి దర్శనం – పాద స్పర్శనం. ఓ యధార్థాన్ని గుర్తించాలి ఇక్కడ. ఓ సముద్రాన్ని ఎందరో దర్శిస్తారు. చిన్న పిల్లలకి ఆ ఒడ్డున ఇసుకతో పిచ్చుక గూళ్లు కట్టుకునే ప్రదేశంలా అనిపిస్తుంది సముద్రం. జీవితంలో బాధలని ఒకదాని మీదట ఒకటి అనుభవిస్తున్న వానికి కెరటాలు బాధల రూపంలో కనిపిస్తూ – అన్ని బాధలూ తన వద్దకి మాత్రమే వస్తున్నట్లనిపిస్తుంది. ఒక శాస్త్రవేత్తకి భూమి పైకీ కిందకీ కదులుతూంటే కలిగే నీటి కెరటాల సమూహమనిపిస్తుంది. ఒక ఆధ్యాత్మికవేత్తకి కాలకూటం, కల్పవృక్షం, చంద్రుడూ, లక్ష్మీదేవీ, ధన్వంతరీ, చివరికి అమృతం లభించిన జలనిధిలా అనిపిస్తుంది. ఒక వేదాంతికి ఈ నాలుగు యుగాలలో కూడా ముంచెత్తే ప్రళయానికి కావలసిన ముడి వస్తువైన జల సమూహంలా కనిపిస్తుంది. అదే తీరుగా సాయిదర్శనం కూడా కొందరికి ఓ మహనీయుని దర్శనం లాగా, కొందరికి తమ కోరిక తీరిన పక్షంలో నమ్ముదామనుకునే మహా పురుషునిలాగా, మరి కొందరికి ఎందరో భక్తులని సమీకరించుకోగల సిద్ధుని దర్శనమనిపిస్తే, అన్నా సాహెబుకి మాత్రం ఆ దర్శనం తన పూర్వజన్మ దుష్కర్మలని పూర్తిగా తొలగించగలిగిన భగవంతునిలానూ, ప్రపంచమంతా ఆవరించగల విశ్వరూపిగానూ అనిపించింది. అంతటి మానసికానందంతో ఉన్న అన్నా సాహెబు బాబాకి అతి సన్నిహితులూ, పరమభక్తులూ అయిన శ్యామాని ప్రార్థించాడు – సాయిచరిత్రని రాయడానికి అనుమతిని ఇప్పించవలసిందని. శ్యామా నేరుగా సాయితో – ‘‘బాబా! దేవా!! ఈ అన్నా సాహెబు మీ జీవిత చరిత్రని బాగా తెలుసుకుని ఉన్నాడు. ఆ ఆనందంతో దాన్ని ఒక గ్రంథంగా చేయాలని ఉబలాటపడుతున్నాడు. ఏదో బిచ్చమెత్తుకుంటూ ఫకీరుగా జీవించే వీడి చరిత్ర లోకానికి అవసరం లేదంటూ పలకకుండా, మీరు అంగీకారాన్ని తెలియజేస్తే ఆయన రాయడానికి సిద్ధంగా ఉన్నారు. తనకి తానే వ్రాయచ్చుగా! అంటారేమో.. తమ దయ, ఆశీర్వాదం లేనిదే అది సాధ్యం కాదనీ, జయప్రదం కాబోదనీ ఆయన అభిప్రాయం. అందుకే అనుమతి కోసం వేచి ఉన్నారు’’ అని స్పష్టంగా చెప్పాడు. దీన్నే శాస్త్ర పరిభాషలో ‘శరణాగతి’ అంటారు. తనకెంత శక్తి ఉన్నా భగవంతుణ్ని శరణు వేడటం కోసం వెళ్లడమే శరణాగతి. ‘నాకు పాండిత్యముంది. ఒక విషయాన్ని రాయగల శక్తి ఉంది. వివరించి చెప్పగల యుక్తి ఉంది. అన్నింటికీ మించి శీఘ్రంగా ముగించగలిగినంత సమయం కూడా ఉంది’ అనే ధోరణితో కనిపిస్తారు ఎందరో. ఇక్కడ సాయిచరిత్రాన్ని రాయడానికి సాయిచరిత్రలోని సంఘటనలూ, శైలీ.. వంటివి ముఖ్యం కాదు. సాయి అనుగ్రహం ముఖ్యం. దీన్నే దైవానుకూల్యం అంటారు. కేవలం రామునివల్ల కార్యం జరగదు. కేవలం లక్ష్మణుని వల్ల పని పూర్తి కాదు. అలాగే కేవలం కృష్ణుడు కౌరవసంహారం చేయలేడు. పాండవులు మాత్రమే కౌరవవధని నెరవేర్చలేరు. ఇటు పాండవులూ, లక్ష్మణుడూ అనేవాళ్లు మానవ ప్రయత్నానికి సంకేతాలౌతూంటే, అటు రాముడూ, కృష్ణుడూ అనేవాళ్లు దైవ అనుకూల్యానికి సంకేతాలు. కాబట్టి మానవ ప్రయత్నం దైవ సహాయం అనే రెండూ ఉన్నప్పుడే – రెండు రెక్కలతో మాత్రమే పక్షి ఎగరగలిగినట్లు – కార్యం నిర్విఘ్నంగా పూర్తవుతుందన్నమాట. ఈ య«థార్థాన్ని గమనించినవాడు అన్నా సాహెబు అయినందువల్లనూ, ఆ స్థితికి తాను ఎదుగగలిగినందువల్లనూ, తాను సాయిచరిత్రాన్ని రాయడానికి కావాల్సిన సమాచారాన్ని తన వద్ద కలవాడే అయినా, సాయి అనుగ్రహం గాని లేకపోతే రాయలేనే లేడని తెలిసి సాయి సచ్చరిత్ర గ్రంథ రచనకి పూనుకున్నాడన్నమాట. ఈ తీరు మౌలిక సత్యాన్ని తెలిసినవాడు అన్నా సాహెబు అని గ్రహించిన సాయి, శ్యామా ద్వారా అన్నా సాహెబు గురించి తెలుసుకుంటున్న వానివలె వింటూ, శ్యామా చెప్పిందంతా విన్నాక అన్నా సాహెబుకి అర్థమయ్యేలా ఇలా చెప్పబోతూ ఊదీ (విభూతి) ప్రసాదాన్నిచ్చాడు స్వయంగా – అనుగ్రహ ఆమోద సూచకంగా. ‘శ్యామా! అన్నా సాహెబుని నా చరిత్రనీ అనుభవాలనీ బాగా సంగ్రహించవలసిందని చెప్పు. కొన్ని కొన్ని సందర్భాల్లో కంటికి కనబడే విషయాలని నేనే వివరిస్తాను. తాను రాయబోయే గ్రంథం ఏదో సామాన్యంగా రాసేసే లౌకిక గ్రంథాల వంటిది కాదు. కొన్ని కోట్లమంది భక్తుల కష్టాలని కడతేర్చగల దివ్యౌషధం వంటిదది. వ్యాధిగ్రస్తుల వ్యాధినీ వ్యాధులనీ తీర్చాలంటే వైద్యుడు ఎంత శ్రద్ధ, భక్తి, ఏకాగ్రతలతో మాత్రమే ఔషధాన్ని సమకూర్చాలో (తయారు చేయాలో) అలాంటి దివ్యౌషధ సమానమైన సాయిచరిత్రాన్ని రాయదలచిన ఈ భక్తుడు తన అహంకారాన్ని పూర్తిగా నా పాదాల దగ్గర ఉంచెయ్యాలి. వాడు నా హృదయ భక్తుడు. అందుకే నేను వాడి మనసులో ప్రవేశించి నా కథలనీ బోధలనీచెప్పుకుంటాను. ఒక్కమాటలో చెప్పాలంటే నా కథని నేనే రాసుకుంటాను. లోక దృష్టిలో రాయించుకుంటాను. లోకంలో కనిపించే భక్తుల ఆలోచనలని పరిగణనలోనికి తీసుకుని వాడికి తోచిందాన్ని నిర్ధారణ చేయవద్దని చెప్పు. ఇతరుల అభిప్రా యాల్లో ఏవి సరైనవో అవి నాకు తెలుసు. వాటిని తిరస్కరించడం గాని, తేలిక చేయడం గాని వద్దే వద్దు అని వానికి చెప్పవలసింది’ అన్నాడు సాయి.చివరగా ఒక్క మాట అంటూ – ‘ఏ విషయం మీదనైనా ఇది మంచీ ఇది చెడూ ఇది యదార్థం ఇది అసత్యం – అని నిర్ధారించే విధానం గాని, వివాదం గాని వానిని చేయవద్దని చెప్పవలసింది’ అని ముగించాడు సాయి. ఈ మాటలన్నింటినీ బాబా ఉపదేశంగా భావించి దాన్నే మహా ప్రసాదమనుకుంటూ అన్నా సాహెబు సాయిచరితాన్ని రాయడానికి తిరుగులేని నిర్ణయాన్ని తీసుకున్నాడు. బాబాకి సంపూర్ణ భక్తుడైపోయాడు కూడా. అంతటి మహనీయుణ్ని దైవంగానే భావించుకుని ఆయన చరిత్రాన్ని అందించగల మహదవకాశం తనకి దక్కడం – తనకి మాత్రమే దక్కడం – పూర్వజన్మ సుకృత ఫలంగా భావించాడు. ఈ సందర్భంలో సాయి స్వయంగా అన్నా సాహెబుని చూస్తూ – హేమాడ్ పంత్ – అని పిలిచాడు. హేమాడ్ పంతా? ఆయనెవరు? ఇంతకీ ఆ పేరుతో తనని సాయి పిలవడంలో అంతరార్థమేమిటి? అదీ కాక ‘రోహిల్లా జోలికి పోవద్దు’ అని కూడా హెచ్చరించాడు. రోహిల్లానా? అదెవరు? వాని జోలికి పోదలచడమేమిటి? పోకూడనిదెందుకు? (సశేషం...) - డా. మైలవరపు శ్రీనివాసరావు -
సాయి చెంతకు కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు షిర్డీ యాత్రకు వెళ్లనున్నారు. బేగంపేట విమానశ్రయం నుంచి కేసీఆర్ ప్రత్యేక విమానంలో షిర్డీకి వెళ్తారు. శుక్రవార తెల్లవారుజామున సాయి బాబాని దర్శించుకుంటారు. ఫెడరల్ ఫ్రంట్ నేపథ్యంలో కేసీఆర్ షిర్డీ యాత్ర ప్రాధాన్యత సంతరించుకుంది. -
ప్రయాణికులను మధ్యలోనే దింపేసిన ట్రావెల్స్
మహారాష్ట్ర: బస్సు మరమ్మతుకు గురైందంటూ ప్రయాణికులను మార్గం మధ్యలోనే దింపేశారు ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు సిబ్బంది. ధనుంజయ ట్రావెల్స్‌కు చెందిన ఏపీ 02పీఏ 2259 నెంబరు గల బస్సు హైదరాబాద్ నుంచి శుక్రవారం రాత్రి షిర్డీకి బయల్దేరింది. షోలాపూర్ చేరగానే బ్రేక్ డౌన్ అయిందని చెప్పి అందులోని ప్రయాణికులను సిబ్బంది దింపేశారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో 40మంది ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. కాగా, రాత్రే 2 గంటలు ఆలస్యంగా బయల్దేరిందని, బస్సు ఆగిపోయిన తర్వాత ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా ట్రావెల్స్ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. -
షిర్డీలో విమానాశ్రయం ప్రారంభం
షిర్డీ: మహారాష్ట్రలోని సుప్రసిద్ధ ఆధ్యాత్మిక కేంద్రం షిర్డీలో కొత్తగా నిర్మించిన విమానాశ్రయాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆదివారం ప్రారంభించి జాతికి అంకితం చేశారు. అనంతరం ముంబైకి బయల్దేరిన అలియన్స్ ఎయిర్ విమానానికి జెండా ఊపి వాణిజ్య కార్యకలాపాలను లాంఛనంగా ప్రారంభించారు. యాత్రికులు, పర్యాటకులకు సేవలందించడంతో పాటు ఈ ప్రాంతంలో ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకోవడానికి, కొత్త ఉద్యోగాల సృష్టికి ఈ విమానాశ్రయం దోహదపడుతుందని కోవింద్ పేర్కొన్నారు. కార్యక్రమంలో మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు, విమానయాన మంత్రి అశోక్ గజపతి రాజు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఎయిరిండియా సీఎండీ రాజీవ్ బన్సల్ పాల్గొన్నారు. దేశంలో ఒక రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన తొలి విమానాశ్రయం ఇదేనని ఫడ్నవీస్ అన్నారు. ఈ విమానాశ్రయ నిర్మాణానికి అయిన రూ.350 కోట్ల వ్యయంలో రూ. 50 కోట్లను షిర్డీ బాబా సంస్థాన్ ట్రస్టువిరాళంగా ఇచ్చింది. దేశంలోనే ప్రముఖ పర్యాటక కేంద్రంగా గుర్తింపు పొందిన షిర్డీకి రోజుకు 60 వేల మంది పర్యాటకులు వస్తుంటారు. వీరిలో 10–12 శాతం పర్యాటకులకైనా విమాన సేవలందించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ముంబై నుంచి 238 కి.మీ. దూరమున్న షిర్డీకి రోడ్డు మార్గం గుండా 5 గంటలు పడుతుంది. విమానంలో అయితే కేవలం 40 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. ఈ విమానాశ్రయంలో 2,500 మీటర్ల రన్‌వేను ఏర్పాటు చేశారు. 300 మంది ప్రయాణికులు ఒకేసారి విమానాశ్రయంలోకి రావడానికి, పోవడానికి వీలుగా 2,750 చ.మీ. టర్మినల్ భవనాన్ని నిర్మించారు. హైదరాబాద్ నుంచి.. హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్–షిర్డీ మధ్య నేటి నుంచి విమాన సర్వీసులు మొదలు కానున్నాయి. ఎయిర్ ఇండియా అనుబంధ సంస్థ అయిన అలియన్స్ ఎయిర్ ఈ సేవలను ప్రారంభిస్తోంది. టికెట్ ధర ఒక వైపునకు రూ.2,844గా నిర్ణయించినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. గురువారం మినహా రోజూ మధ్యాహ్నం 2.10గంటలకు హైదరాబాద్‌లో విమానం బయలుదేరి 4 గంటలకు షిర్డీకి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో విమానం 4.30కి బయల్దేరి 6.15కు హైదరాబాద్‌లో అడుగుపెడుతుంది. త్వరలో ట్రూజెట్ కూడా హైదరాబాద్, విజయవాడ నగరాల నుంచి షిర్డీకి సర్వీసులు ప్రారంభించనుంది. -
అక్టోబరు నుంచే షిర్డీకి విమాన ప్రయాణం..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎట్టకేలకు షిర్డీకి విమాన ప్రయాణం అందుబాటులోకి వస్తోంది. నూతనంగా ఏర్పాటైన షిర్డీ విమానాశ్రయాన్ని అక్టోబరు 1న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రారంభిస్తారు. అనంతరం హైదరాబాద్ నుంచి అక్టోబరు రెండో వారంలో సర్వీసులు ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రాంతీయ విమానయాన సంస్థ ట్రూజెట్ హైదరాబాద్–షిర్డీ మధ్య ఈ సర్వీసులు అందించనుంది. తొలుత రోజుకు ఒక ఫ్లైట్ నడుపుతుంది. ప్రయాణికుల సంఖ్యను బట్టి సర్వీసుల సంఖ్య పెంచాలని ట్రూజెట్ భావిస్తోంది. విజయవాడ నుంచి సైతం విమాన సేవలు ప్రారంభించేందుకు ఈ సంస్థ సన్నాహాలు చేస్తోంది. ఈ రెండు నగరాల నుంచి టికెట్ ధర రూ.3,000–6,500 మధ్య ఉండొచ్చు. ఇక ముంబై నుంచి అలయన్స్ ఎయిర్ షిర్డీకి విమాన సర్వీసులు నడపనుంది. అక్టోబరు 1న సర్వీసు ప్రారంభం అయినప్పటికీ, అక్టోబరు 2 నుంచే వాణిజ్యపరంగా సేవలు మొదలవుతాయి. ఇండిగో సైతం కొత్త విమానాశ్రయంలో అడుగు పెట్టనుంది. మహారాష్ట్ర ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కంపెనీ (ఎంఏడీసీ) ఈ ఎయిర్‌పోర్ట్‌ను అభివృద్ధి చేసింది. మొత్తం రూ.350 కోట్ల వ్యయం కాగా, సాయి బాబా సంస్థాన్ రూ.50 కోట్లు సమకూర్చింది. -
ఇలాచేస్తే.. షిర్డీలో ఏడాదిపాటు వీఐపీ దర్శనం
ముంబయి: ప్రసిద్ధ షిర్డీ ఆలయంలో సాయిబాబా దర్శనం కోసం క్యూలో నిల్చొని విసిగి పోయారా.. మీరు కూడా వీఐపీ దర్శనం కోరుకుంటున్నారా అయితే, మీకు ఇక ఆ చింతన అక్కర్లేదు. ఏం చక్కా ప్రతి ఒక్కరూ వీఐపీలాగే షిర్డీ సాయినాధున్ని దర్శించుకునే అవకాశాన్ని షిర్డీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ కల్పిస్తోంది. అయితే, మీరు చేయాల్సిందల్లా కూడా ఒక్కటే.. అదే రక్తదానం. అవును.. షిర్డీ సాయినాధుని దర్శనానికి వెళ్లిన వారు రక్తదానం చేయడం ద్వారా ఒక ఏడాదిపాటు ఆలయంలో వీఐపీ హోదాలో దర్శనం ఉండటంతోపాటు సత్రాల్లో బస విషయంలో కూడా వీఐపీ తరహాలోనే ఏర్పాటుచేస్తారు. సర్వ మానవ శ్రేయస్సు కోసం ఈ కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ట్రస్టు చైర్మన్ సురేశ్ హారే మీడియాకు తెలిపారు. షిర్డీని బ్లడ్ బ్యాంక్ హబ్‌గా మార్చడం తమ ఉద్దేశమని చెప్పారు. ‘తిరుమల తిరుపతిలో తలనీలాలు సమర్పించినట్లే. షిర్డీకి వచ్చినవారు రక్తదానం చేయడం ఆనవాయితీగా మారుస్తాం’ అని ఆయన చెప్పారు. రక్తదానం ఎంత గొప్పదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భక్తులు ఈ చర్యతో మానవతా దృక్పథాన్ని చాటుకోవడంతోపాటు ఒక మంచి పనిచేశామని సంతృప్తి కూడా దక్కనుంది. -
షిర్డీ ఎయిర్పోర్ట్ రెడీ
ముంబై: వివిధ రాష్ట్రాలు, దేశాల నుంచి షిర్డీకి వచ్చే భక్తులకు శుభవార్త. షిర్డీ విమానాశ్రయం నిర్మాణం పనులు ఇటీవలే పూర్తయ్యాయి. దీంతో వచ్చే నెల(జులై) మొదటి వారం నుంచి విమానాల రాకపోకలు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు మహారాష్ట్ర ఎయిర్‌పోర్టు డెవలప్మెంట్ కంపెనీ (ఎంఏడీసీ) ఉపాధ్యక్షుడు, కార్యనిర్వాహక సంచాలకులు సురేశ్ కాకనీ అధికారికంగా ప్రకటన చేశారు. ప్రారంభంలో ఎయిరిండియా చొరవ తీసుకుని ఇక్కడి నుంచి విమాన సర్వీసులు నడుపుతుందని, ఆ తరువాత జెట్ ఎయిర్ వేజ్ కూడా రంగంలోకి దిగుతుందని సరేశ్ కాకనీ చెప్పారు. అయితే షిర్డీ విమానాశ్రయం నుంచి విమానాల రాకపోకలు సాగించేందుకు ఎంఏడీసీకి సంబంధిత విభాగం నుంచి ఇంకా అనుమతి లభించలేదు. వచ్చే రెండు వారాల్లో అనుమతి లభించే అవకాశాలున్నాయి. దీంతో ప్రారంభోత్సవానికి ఆహ్వానించే ప్రముఖుల అపాయింట్మెంట్ లభించగానే ముహూర్తం తేదీ ఖరారు చేస్తామని కాకనీ తెలిపారు. -
షిర్డీకి ట్రూజెట్ విమాన సర్వీసులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విమాన సర్వీసుల రంగంలో ఉన్న ట్రూజెట్ షిర్డీలో అడుగు పెట్టబోతోంది. విమానాలను నడిపేందుకు కావాల్సిన అనుమతిని ఈ నెల చివరికల్లా షిర్డీ విమానాశ్రయం దక్కించుకోనుంది. ఇదే జరిగితే జూన్ నుంచి సర్వీసులు మొదలు పెట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ట్రూజెట్‌ను ప్రమోట్ చేస్తున్న టర్బో మేఘా ఎయిర్వేస్ ఎండీ వంకాయలపాటి ఉమేష్ సాక్షి బిజినెస్ బ్యూరోకు బుధవారం తెలిపారు. ఆధ్యాత్మిక కేంద్రమైన షిర్డీకి విమానంలో వెళ్లేందుకు అత్యధికులు మొగ్గుచూపుతారని ఆయన చెప్పారు. బిజీ రూట్లలో ఇది ఒకటిగా నిలుస్తుందన్నారు. తొలుత హైదరాబాద్–షిర్డీ మధ్య ప్రతి రోజు రెండు సర్వీసులు, రాజమండ్రి–షిర్డీకి ఒక సర్వీసు నడిపిస్తామని వెల్లడించారు. మెట్రోల నుంచి చిన్న నగరాలకు.. టర్బో మేఘా ఎయిర్వేస్కు పౌర విమానయాన శాఖ నుంచి షెడ్యూల్డ్ కమ్యూటర్ ఆపరేటర్ కింద ఎయిర్ ఆపరేటర్ సర్టిఫికేట్ లభించింది. తద్వారా మెట్రో నగరాల నుంచి దేశవ్యాప్తంగా చిన్న నగరాలకు విమానాలను నడిపేందుకు కంపెనీకి మార్గం సుగమం అయింది. ప్రస్తుతం ట్రూజెట్ 11 కేంద్రాలకు విమానాలను నడిపిస్తోంది. ముంబై–నాందేడ్ మార్గంలో మే నుంచే సర్వీసులు మొదలు పెడతామని ఉమేష్ తెలిపారు. డిసెంబరులోగా నాలుగు కొత్త నగరాలను జోడిస్తామని పేర్కొన్నారు. సంస్థ వద్ద ఏటీఆర్–72 రకం నాలుగు విమానాలున్నాయి. ఈ ఏడాది మరో రెండు ఎయిర్క్రాఫ్టస్ జతకూడనున్నాయి. -
మిస్త్రీకి ఇక దేవుడే దిక్కేమో!
అహ్మదాబాద్ : టాటా గ్రూప్ చైర్మన్ పదవి నుంచి అర్థాంతరంగా ఉద్వాసనకు గురవ్వడం... తదుపరి జరిగిన పరిణామాలతో గ్రూప్‌లోని మిగతా కంపెనీలు టాటా వపర్, టాటా కెమెకిల్స్, టాటా స్టీల్లూ సైరస్ మిస్త్రీని చైర్మన్‌గా తొలగించడం ఆయన్ను తీవ్ర మనస్తాపానికి గురిచేసిందేమో. ప్రశాంతత కోసం ఇక ఆయన ఆలయాల బాట పట్టారు. నిన్న జరిగిన టాటాస్టీల్ బోర్డు సమావేశంలో పాల్గొన్న ఆయన, ఆ కంపెనీ చైర్మన్‌గా ఉద్వాసనకు గురయ్యారు. ఆ సమావేశం అనంతరం వెంటనే మిస్త్రీ షిర్టీలోని సాయిబాబా టెంపుల్, శని శింగనాపూర్ దేవస్థానాలను దర్శించుకునేందుకు వెళ్లారు. టాటాస్టీల్ బోర్డు సమావేశంలో పాల్గొన్న అనంతరం మొదట షిర్డీలోని సాయిబాబా టెంపుల్‌ను దర్శించుకున్నారు. భార్యతో కలిసి ఆయన ఈ ఆలయానికి వెళ్లారు. వారు సాయిబాబా సమాధిని, విగ్రహాన్ని దర్శించుకుని, టెంపుల్ ప్రసాదాన్ని స్వీకరించినట్టు ఆలయ అధికారప్రతినిధి మోహన్ యాదవ్ తెలిపారు. అనంతరం షిర్డీ సాయిబాబా టెంపుల్‌కు 30 నిమిషాల వ్యవధి దూరంలో ఉన్న శని శింగనాపూర్ దేవస్థానానికి వెళ్లారు. ఆలయంలో వారు పూజలు చేయించుకుని, శని దేవుడికి అభిషేకం నిర్వహించినట్టు అక్కడి అధికార ప్రతినిధి పేర్కొన్నారు. -
మంటల్లో ‘కావేరి’ బస్సు
•నాలుగేళ్ల హైదరాబాద్ బాలుడి సజీవ దహనం •షిర్డీ నుంచి హైదరాబాద్ వస్తుండగా దుర్ఘటన •ఐదుగురికి గాయాలు కర్ణాటక సరిహద్దులో ఘటన •డ్రైవర్ అప్రమత్తతో తప్పిన పెను ప్రమాదం సాక్షి, జహీరాబాద్ టౌన్ /తణుకు : సాయినాథుని దర్శనం చేసుకున్న 36 మంది తెలుగు భక్తులు కావేరీ ట్రావెల్స్‌కు చెందిన బస్సులో గురువారం సాయంత్రం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు.. శుక్రవారం ఉదయం ఆరుగంటలవుతోంది. అందరూ ఆదమరిచి నిద్రిస్తున్నారు. బస్సు తెలంగాణ-కర్ణాటక సరిహద్దుల్లోని ఉమ్నాబాద్ పట్టణం దాటి 2 కిలోమీటర్లు వచ్చింది. మరో మూడు గంటల్లో హైదరాబాద్ చేరుకోవాలి. అంతలోనే ఉపద్రవం..! బస్సు ఇంజన్‌లోనుంచి ఒక్కసారిగా పొగలు కమ్ముకొచ్చాయి. అప్రమత్తమైన డ్రైవర్ బస్సును వెంటనే ఆపి.. పక్కనే ఉన్న ధాబా, పెట్రోల్ బంకులో పనిచేసే వాళ్లను పిలిచి మంటలు ఆర్పేందుకు యత్నించాడు. మంటలు అంతకంతకు విస్తరించాయి. ప్రయాణికులు నిద్రలో ఉండగానే బస్సంతా పొగ నిండింది. బయట ఉన్నవారు ప్రయాణికులను అప్రమత్తం చేసి అద్దాలు పగలగొట్టారు.అరుపులు కేకలకు మేల్కొన్న వారు వీలున్న చోటినుంచి బయటకు దూకేశారు. కిటీకీలు బద్దలుకొట్టి బయటపడ్డారు. నాలుగేళ్లకే నూరేళ్లు.. బస్సులో వెనకసీట్లో నిద్రపోతున్న అచ్చుత రామ ప్రసాద్, వెంకటేశ్వరి దంపతులూ ప్రాణాలతో బయటపడేందుకు పరిగెత్తారు. వీరికి ఇద్దరు పిల్లలు.. పెద్ద కుమారుడు విహాల్ (4), మరో రెండేళ్ల బాబు. నిద్రమత్తో, మరేమోగాని ఆందోళనలో రెండేళ్ల బాబును తీసుకుని ప్రసాద్ కిందికి దిగగా.. భార్య వెంకటేశ్వరి కూడా కిందకు దిగారు. భార్య పెద్ద కుమారుడిని తీసుకొస్తుందని ప్రసాద్ అనుకున్నారు. చూస్తుండగానే బస్సు మొత్తం కాలిపోతోంది. అంతలోనే విహాన్ కనిపించటం లేదని కంగారు పడ్డ భార్యాభర్తలకు.. పక్కసీట్లో పడుకున్న విహాల్‌ను తీసుకురాలేదని అర్థమైంది. దీంతో విహాల్‌ను తీసుకొచ్చేందుకు ఇద్దరూ దగ్ధమవుతున్న బస్సులోకి ఎక్కారు. వెంటనే పక్కనున్న వారు వీళ్లను కిందకు లాక్కొచ్చారు. ఎగసిపడుతున్న అగ్నికీలలతో వీరికీ గాయాలయ్యాయి. వెనకసీట్లో నిద్రిస్తున్న విహాల్ మంటల్లో కాలి బూడిదయ్యాడు. వీరితోపాటు రాణి (50), వరుణ్ కుమార్(35), నాగలక్ష్మి(22) గాయపడ్డారు. ఉమ్నాబాద్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి మంటలను ఆర్పేశారు. ప్రభాకర్‌రెడ్డి అనే ప్రయాణికుడికి చెందిన రూ.45 వేలు, మరో ప్రయాణికుడి ల్యాప్‌టాప్ కాలిపోయాయి. అతివేగం వల్లే.. ‘డ్రైవర్ మితిమీరిన వేగంతో నడిపాడు. మెల్లగా వెళ్లాలని చెప్పినా వినలేదు. డ్రైవర్ దగ్గర్నుంచే మంటలొచ్చాయి’ అని ప్రభాకర్ రెడ్డి అనే ప్రయాణికుడొకరు చెప్పారు. క్షతగాత్రులను ప్రథమ చికిత్స తర్వాత హైదరాబాద్ తరలించారు. తణుకులో విషాదం.. విహాన్ (4) తల్లిదండ్రులది పశ్చిమగోదావరి జిల్లా తణుకు. రామప్రసాద్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. బుధవారం సాయంత్రం భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి షిర్డీ దర్శనానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో దుర్ఘటన జరిగింది. విహాన్ మృతితో తణుకులో, గచ్చిబౌలిలో వీరుంటున్న కాలనీలోనూ విషాదం నెలకొంది. జూలైలో నాలుగో పుట్టినరోజు జరుపుకున్న విహాన్.. ఈ ఏడాది నుంచే ప్లే స్కూలుకెళ్తున్నాడు. -
తిరుమల బాటలో షిరిడి
షిరిడి: పుణ్యక్షేత్రం తిరుమల మాదిరిగా క్యూలు తగ్గించేందుకు షిరిడిలోని సాయి బాబా సంస్థాన్ ట్రస్టు దర్శనం కోరే భక్తుల పేర్ల నమోదును ప్రారంభించనుంది. ‘ప్లాన్ దర్శన్’గా పిలిచే ఈ కార్యక్రమం 3 నెలల్లో ప్రారంభమవుతుందని ట్రస్టు తెలిపింది. డిజిటల్ మీడియా, ఇతర బహిరంగ బుకింగ్ వేదికల ద్వారా భక్తులు తమ పేర్లు నమోదు చేసుకోవచ్చని పేర్కొంది. వారి సందర్శన సమయాన్ని ట్రస్టు నిర్ణయిస్తుంది. -
సికింద్రాబాద్ నుంచి మూడు త్రీ స్టార్ లగ్జరీ ట్రైన్స్
త్రీ స్టార్ లగ్జరీ ట్రైన్ లో తిరుపతికి, షిరిడీకి, గోవాకు వెళ్లాలని ఉందా.. అయితే ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(ఐఆర్ సీటీసీ) ప్రయాణికుల కోసం ఓ వినూత్నమైన ఆఫర్ ను తీసుకొచ్చేసింది. సాధారణ బస్సు రేట్లతో సమానంగా సికింద్రాబాద్ నుంచి షిరిడీకి, తిరుపతికి, గోవాకు త్రీ స్టార్ లగ్జరీ ట్రైన్లను ఐఆర్ సీటీసీ ఆపరేట్ చేయనుంది. తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పేర్వారం రాములు స్పెషల్ రిక్వెస్ట్ తో ఐఆర్ సీటీసీ ఈ త్రీ స్టార్ లగ్జరీ ట్రైన్లు నడపడానికి సమ్మతించింది. ఐఆర్ సీటీసీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఏ.కే మనోచా, గ్రూప్ జనరల్ మేనేజర్ స్మితా రావత్ తో పేర్వారం రాములు భేటీ అనంతరం ఈ నిర్ణయం ప్రకటించారు. అదేవిదంగా తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు బాసర, వరంగల్, భద్రాచలం ప్రాంతాల్లో కూడా త్రీ స్టార్ లగ్జరీ రైళ్లను ఐఆర్ సీటీసీ నడిపేందుకు అంగీకరించింది. లైఫ్ లో ఎప్పటికైనా ఓ సారి ఎక్కాల్సిన రైలుగా ప్రసిద్ధి చెందిన సెవన్ స్టార్ సూపర్ లగ్జరీ మహారాజా ఎక్స్ ప్రెస్ ట్రైన్ ను కొంకణ్ నుంచి కర్నాటక, కేరళ, తమిళనాడుకు తెలంగాణలోని సికింద్రాబాద్, కాజిపేట స్టేషన్ల మార్గాన ప్రయాణించేలా చర్చలు జరుగనున్నాయి. ఈ ప్రతిపాదనపై చర్చించేందుకే ఐఆర్ సీటీసీ సీఎండీ ఎ.కె మనోచా టీఎస్ టీడీసీ సందర్శించినట్టు తెలుస్తోంది. మహారాజ ఎక్స్ ప్రెస్ విలాసవంతమైన ట్రావెల్ ప్యాకెజ్ ను ప్రయాణికులకు ఆఫర్ చేస్తోంది. ఫుడ్, వైన్, టూరిస్ట్ ప్రాంతాల సందర్శన ఈ ట్రావెల్ ప్యాకెజ్ లో ఉన్నాయి. నోరూరించే చైనీస్, థాయ్, మొగలాయి, ఇండియన్ వంటకాలను ఈ ట్రైన్ మెనూలో ఆఫర్ చేస్తోంది. విలాసవంతమైన గదులను ఆఫర్ చేసినందుకు గాను కపుల్ కు రూ.66,760 లను చార్జ్ చేస్తున్నారు. -
షిరిడీకి విమాన ప్రయాణం
ఎంతో కాలంగా సాయి భక్తులు ఎదురు చూస్తున్న షిర్డీకి విమాన ప్రయాణం కల త్వరలో సాకారం అవుతోంది. షిర్డీకి సమీపంలో మహారాష్ట్ర ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కంపెనీ (ఎంఏడీసీ) విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయనుంది. రన్‌వే, ట్యాక్సీ వే, టెర్మినల్ నిర్మాణం పూర్తి అయింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తోపాటు నీరు, విద్యుత్ సరఫరా ఏర్పాట్లు చేయాల్సి ఉంది. 2,500 మీటర్ల పొడవు, 45 మీటర్ల వెడల్పుతో రన్‌వే ఏర్పాటైంది. విమానాశ్రయంలో ఈ ఏడాది ఆగస్టు నుంచి ప్రై వేటు విమానాలకు అనుమతి ఇవ్వనున్నారు. జనవరి నుంచి వాణిజ్య అవసరాలకు ఎయిర్పోర్ట్ అందుబాటులోకి రానుందని ఎంఐడీసీ అధికారులు సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ప్రస్తుతం షిర్డీకి రైలు సౌకర్యం కూడా ఉంది. విమానాశ్రయం ప్రారంభమైతే వేలాది మంది భక్తులకు పెద్ద ఊరట లభించనుంది. -
'షిర్డీ' వీఐపీ పాస్‌ల ధర పెంపు
ముంబై (మహరాష్ట్ర) : ప్రముఖ పుణ్యక్షేత్రం షిర్డీలో వీఐపీ దర్శనం పాస్‌ల ధర పెంచుతూ సాయబాబా సంస్థాన్ ట్రస్టు (ఎస్ఎస్ఎస్టీ) నిర్ణయం తీసుకుంది. సంస్థాన్ కార్యనిర్వాహక అధికారి బాజీరావ్ షిండే ఈ మేరకు శుక్రవారం వివరాలు వెల్లడించారు. వీఐపీ పాస్ ధరను రూ.100 నుంచి రూ.200కు, ఉదయం హారతి (కాకడ్) వీఐపీ పాస్ ధరను రూ.500 నుంచి రూ.600కు పెంచినట్లు చెప్పారు. మధ్యాహ్నం హారతి ధర కూడా రూ.300 నుంచి రూ.400కు పెంచామని, పెంచిన ధరలు మార్చి ఒకటి నుంచి అమలులోకి వస్తాయని తెలిపారు. సాధారణ భక్తులకు ప్రసాదం (స్వీట్మీట్) ఉచితంగా అందించనున్నట్లు చెప్పారు. భక్త నివాస్‌లో మార్చి ఒకటి నుంచి పాస్ విక్రయ కౌంటర్ ప్రారంభించనున్నట్లు ఎస్ఎస్ఎస్టీ వెల్లడించింది. -
అధిక వడ్డీలు ఆశ చూపి...
* రూ.8కోట్ల సొమ్ముతో ఉడాయించిన పెద్ద మనిషి * లబోదిబోమంటున్న పేదలు, చిరు వ్యాపారులు * షిర్డీకి వెళ్తున్నామని ఉడాయింపు విజయనగరం కంటోన్మెంట్ : అత్యవసర పని ఉంది.. అధికంగా వడ్డీలు ఇస్తామని చెప్పి సుమారు రూ. 8 కోట్లకు కుచ్చు టోపీ వేశారు ఆ దంపతులు. పాఠశాల యజమానిగా పరిచయం చేసుకొని దొరికిన కాడికి దోచుకుపోయారు. షిర్డీ వెళ్తున్నామని చెప్పి పక్కా ప్రణాళిక ప్రకారం పిల్లల టీసీలు తీసుకొని మరీ ఉడాయించారు. మోసపోయామని గ్రహించిన బాధితులు సోమవారం కలెక్టరేట్‌కు వచ్చి గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఒబ్బిలిశెట్టి రాజశేఖర్, గాయత్రి దంపతులు విజయనగరంలోని వక్కలంకవారి వీధిలో అద్దె ఇంట్లో ఉండేవారు. పదేళ్ల క్రితం సాయిరాం పబ్లిక్ స్కూల్‌ను స్థాపించారు. మరో పక్క లార్వెన్స్ స్కూల్లో ఓ డెరైక్టర్‌గా పరిచయం చేసుకున్నారు. పెద్ద మనుషులుగా చలామణి అయ్యారు. చుట్టుపక్కల అందరితో వరుసలు కలిపారు. లార్వెన్స్, పెన్ స్కూళ్లలో భాగస్వామ్యం ఉందన్నారు. రోటరీ క్లబ్లో కూడా సభ్యులయ్యారు. పాఠశాలకు వచ్చే పేద, మధ్యతరగతి ప్రజలతో కలుపుగోరుగా ఉండేవారు. కల్లబొళ్లి కబుర్లు చెప్పి ఎక్కువ వడ్డీలిస్తామని ఆశచూపి దొరికిన వారి వద్ద వేలు, లక్షల్లో అప్పులు చేశారు. సమాజంలో స్థితిమంతులైన వారి దగ్గరి నుంచి ఇళ్లల్లో పాచిపనులు చేసుకునే వారిని, పాల ప్యాకెట్లు అమ్ముకునే వారిని బుట్టలో వేసుకున్నారు. ఫంక్షన్లకు వెళ్తామని చెప్పి మహిళల వద్ద నగలు కాజేశారు. పథకం ప్రకారం... దాదాపు రూ.8 కోట్ల సొమ్ము, విలువైన నగలతో ముందుగా వేసుకున్న పథకం ప్రకారం షిర్డీ వెళ్తున్నామని చెప్పి ఉడాయించేశారు. షిర్డీ వెళ్లిన వీరు ఇంకా రాలే దేంటని బాధితులు సాయిరాం పబ్లిక్ స్కూల్‌కు వెళ్లి ఆరా తీశారు. మరొకరికి పాఠశాల నిర్వహణ బాధ్యతలు అప్పగించి ఉడాయించేశారన్న విషయం తెలుసుకొని లబోదిబోమంటున్నారు. భారీ ఎత్తున డబ్బులు ఇచ్చిన వారు కూడా ఇన్‌కంటాక్స్ ఇబ్బందులు ఉన్నాయని బయటకు రాలేదని బాధితులు చెబుతున్నారు. ఈ ఘరానా మోసంపై టూ టౌన్‌పోలీస్ స్టేషన్లో గతంలో ఫిర్యాదు చేసిన వీరు సోమవారం కలెక్టరేట్‌కు వచ్చి గ్రీవెన్స్‌లోను ఫిర్యాదు చేశారు. నగలు తీసుకుపోయారు ఎన్నాళ్లో కూడబెట్టిన డబ్బులతో సంక్రాంతి పండగ ముందు నల్లపూసలు, నగలు చేయించుకున్నాను. 8 తులాల నగలు దాదాపు రెండున్నర లక్షల విలువైనవి. మెచ్యూర్ ఫంక్షన్‌కు వేసుకెళ్తామని చెప్పి తీసుకుపోయారు. ఇలా ఊరొదిలి వెళతారనుకోలేదు. - సీహెచ్ సూర్యకళ, విజయనగరం పారిపోతామా? అన్నారు. పాఠశాల అభివృద్ధి చేసుకుంటానంటే నా వద్ద ఉన్న డబ్బులతో పాటు వస్తువులు పెట్టి పలుమార్లు రూ.7.50లక్షలు అప్పిచ్చాను. వడ్డీ కూడా ఇస్తామన్నారు. ఇటీవల నా కుమార్తె అల్లుడు కలసి వచ్చారు. అల్లుడు వెళ్లి గట్టిగా అడిగాడు. మార్చిలో స్కూల్ ఫీజులొస్తాయి. అప్పుడిస్తానన్నాడు. గాయత్రి వచ్చి ఇప్పుడు అంత డబ్బులు మీకేం అవసరం వదినా? మేమేం పారిపోతామా అని అడిగింది. ఇస్తారు కదా అనుకుంటే పారిపోయారు. - గూడిపూడి నాగమణి, వక్కలంక వీధి రూ.7.50 లక్షలు ఇచ్చాను టిఫిన్ దుకాణం నడుపుతున్నాను. చీటీలు ఎత్తేవారు నాకు డబ్బులిచ్చి వెళ్తుంటారు. అలా ఇచ్చిన డబ్బులను వారికిచ్చాను. దాదాపు రూ.7.50లక్షలు ఇచ్చాను. దీంతో పాటు మరో రూ.60 వేల చీటీ డబ్బులు ఇచ్చాను. దేనికీ కాగితాలు రాసివ్వలేదు. ఇప్పుడేం చేయాలో అర్థం కావడం లేదు. - పి అప్పలకొండ, చిన్నిపిల్లి వీధి నాకు తెలియకుండా నా భార్య ఇచ్చేసింది రాజశేఖర్ భార్య గాయత్రి వచ్చి మాయ చేసి అడిగితే నాకు తెలియకుండా నా భార్య పద్మజ రూ.7 లక్షలు ఇచ్చేసింది. భూమి అమ్మితే వచ్చిన డబ్బు ఇంట్లో ఉందని తెలుసుకుని వచ్చి మాయ చేశారు. పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాం. కలెక్టర్ దృష్టిలో పెట్టాలని అందరం వచ్చాం. - ఎం జగదీశ్వరరావు, బాధితుడు నా డబ్బులెలా వస్తాయో.. నేను నాలుగైదు వీధుల్లో పాల ప్యాకెట్లు విక్రయిస్తాను. అలాగే సాయిరాం ఆలయం ముందు కొబ్బరి కాయలు విక్రయిస్తాను. నేను పైసా పైసా కూడబెట్టి రూ.30 వేలు పోగేశాను. ఆ డబ్బులు ఉన్నాయని తెలిసి వచ్చారు. మళ్లీ వడ్డీతో సహా ఇస్తామని చెబితే ఇచ్చాను. నా డబ్బులెలా వస్తాయో..! - చిన్నిపిల్లి రమణమ్మ, పన్నీరువారి వీధి రూ. 3లక్షల చీటీ, రెండు లక్షల అప్పు ఇచ్చాం నా భర్త ప్రైవేటు ఇన్‌కంటాక్స్ ఫైళ్లు రాస్తుంటారు. మేం చీటి వేసిన రూ. 3లక్షలకు నేనే ష్యూరిటీ ఉంటానని తీసుకెళ్లిపోయాడు. అలాగే మరో రెండు లక్షలకు మధ్య ఉన్నాం. మొత్తం ఐదు లక్షలు కాజేశారు. ఇలా అర్ధాంతరంగా స్కూల్ మూసేసి వెళ్లిపోతారనుకోలేదు. - కె.సూర్యకళ, విజయనగరం -
షిరిడి వెళ్లొచ్చే సరికి ఊడ్చుకెళ్లారు
ఇంటికి తాళం వేసి తీర్థ యాత్రలకు వెళ్లిన వ్యక్తి ఇంట్లో దొంగలు పడి ఉన్నదంతా ఊడ్చుకెళ్లారు. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలం కె.పెంటపాడు గ్రామంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న శేఖర్ తన కుటుంబ సభ్యులతో కలిసి షిరిడీ వెళ్లారు. బుధవారం రాత్రి ఆయన ఇంట్లో దొంగలు పడి 20 తులాల బంగారు ఆభరణాలు, కిలోన్నర వెండి వస్తువులతో పాటు రూ. 25 వేల నగదును ఎత్తుకెళ్లారు. సమాచారం అందకున్న పోలీసులు క్లూస్ టీంతో రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తున్నారు. -
మోదీ స్కీమ్‌కు 200 కిలోల షిరిడీ బంగారం!
ముంబై: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గోల్డ్ డిపాజిట్ స్కీమ్‌కు దేవాలయాల నుండి మంచి స్పందన వస్తుంది. ఇటీవలే సిద్ధి వినాయక దేవాలయం 40 కేజీల బంగారాన్ని ఈ పథకం కింద డిపాజిట్ చేయాలని నిర్ణయం తీసుకోగా తాజాగా షిరిడీ సాయి బాబా ఆలయం నిర్వాహకులు ఇదే బాటలో పయనించాలని భావిస్తున్నారు. అయితే షిరిడీ సాయి దేవాలయ నిర్వాహకులు ఎక్కువ మొత్తంలో.. 200 కేజీల బంగారాన్ని ఈ స్కీమ్ కింద డిపాజిట్ చేయాలని భావిస్తున్నారు. అయితే ఈ నిర్ణయానికి గతంలో బాంబే హైకోర్టు వెలువరించిన తీర్పు అడ్డంకిగా ఉంది. భక్తులు సమర్పించుకున్న బంగారాన్ని కరగదీయొద్దని గతంలో కోర్టు తీర్పు ఇచ్చింది. కాగా బంగారాన్ని డిపాజిట్ చేసే విధంగా కోర్టు నుండి అనుమతులు పొందడానికి పిల్ దాఖలు చేయనున్నట్లు ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు. బంగారంపై వచ్చిన వడ్డీని సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తామని, కోర్టు నుండి అనుమతి లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే షిరిడీ ఆలయంలోని బాబా విగ్రహంపై ఉన్నటువంటి 180 కేజీల బంగారాన్ని మాత్రం అలాగే ఉంచుతామని నిర్వాహకులు తెలిపారు. అది కాకుండానే 200 కిలోల బంగారం షిరిడీ ఆలయానికి ఉంది. బంగారానికి భద్రత ఏర్పాట్లు చేయడం ఆలయ నిర్వాహకులకు తలకు మించిన భారంగా మారిన నేపథ్యంలో గోల్డ్ డిపాజిట్ స్కీమ్ లో పొదుపు చేయాలని నిర్ణయించారు. -
ఇంటికి చేరిన నాసిక్ ప్రమాద బాదితులు
మహారాష్ర్టలోని నాసిక్‌లో ప్రమాదానికి గురైన తెలుగు మహిళల బృందం తిరిగి సొంతగూటికి చేరుకుంది. తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం మల్లేపల్లి గ్రామానికి చెందిన 18 మహిళల బృందం గత శుక్రవారం షిరిడీ సాయి నాధుని దర్శనం కోసం వెళ్లారు. దర్శనం అనంతరం సోమవారం ఉదయం అక్కడి నుంచి నాసిక్ వెళ్తుండగా.. వీళ్లు ప్రయాణిస్తున్న వాహనాన్ని మరో వాహనం ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడ్డారు. అప్పటి నుంచి అక్కడే చికిత్స పొందుతుండగా.. తాజాగా ఈ రోజు అందుంలో నుంచి 13 మంది మహిళలు తిరిగి రాజమండ్రికి చేరుకున్నారు. మిగతా ఐదుగురు పరిస్థితి ఇంకా విషమంగానే ఉండటంతో.. నాసిక్‌లోనే చికిత్స పొందుతున్నారు. -
‘గాడి’లో పడేనా..?
హన్మకొండ : షిర్డీ, ముంబై వెళ్లే ప్రయాణికుల కోసం ఉద్దేశించిన కాజీపేట-ముంబై వీక్లీ రైలు ప్రారంభించడంపై రైల్వేశాఖ దాగుడుమూతలు ఆడుతోంది. 2014-15 రైల్వే బడ్జెట్లో ఈ ట్రైన్‌ను ప్రవేశపెట్టిన రైల్వేశాఖ గత ఎనిమిది నెలలుగా ఈ విషయంపై నోరెత్తలేదు. తాజాగా కాజీపేట-ముంబై మార్గంలో ప్రత్యేక రైలు నడిపిస్తామంటూ ప్రకటన జారీ చేసింది. దీంతో కాజీపేట-ముంబై రైలు రెగ్యులర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌గా నడిపిస్తారా లేక మాటమాత్రంగా కొన్ని ట్రిప్పులు స్పెషల్ పేరుతో నడిపి ఆ తర్వాత మమ అనిపిస్తారా అనే అనుమనాలు వ్యక్తమవుతున్నాయి. భక్తులకు మేలు.. వరంగల్ జిల్లా మీదుగా ముంబైకి ప్రస్తుతం రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లు(కోణార్క్, విశాఖపట్నం-ముంబై- లోకమాన్య తిలక్ టెర్నినల్) నడుస్తున్నాయి. నిత్యం రద్దీగా ఉండే ఈ రైళ్లలో బెర్త్ రిజర్వేషన్ చేరుుంచుకోవడం కష్టంగా మారింది. దశాబ్ధ కాలంగా జిల్లా నుంచి షిర్డీకి వెళ్లే భక్తుల సంఖ్య పెరిగింది. అరుుతే ఇక్కడి నుంచి సీటు రిజర్వ్ చేసుకోవడం కష్టంగా మారడంతో ఎక్కువ మంది భక్తులు సికింద్రాబాద్ నుంచి రిజర్వేషన్ చేయించుకుంటున్నారు. అరుుతే ముంబై, షిర్డీ వెళ్లే ప్రయాణికుల అవస్థలు తీర్చేందుకు గత బడ్జెట్లో రైల్వేశాఖ కాజీపేట - ముంబై (ఎల్టీటీ) రైలును ప్రవేశపెట్టింది. పైగా ఈ రైలు కాజీపేట-బల్లార్షా సెక్షన్లో ప్రయూణిస్తుండడంతో ఆ మార్గంలో వెళ్లేవారికి మరో రైలు అందుబాబులోకి వచ్చినట్టైంది. కొత్త రూటు.. ఎన్నో ప్రయోజనాలు.. గత బడ్జెట్లో రైల్వేశాఖ ప్రకటించిన కాజీపేట-ముంబై (ఎల్టీటీ) రైలు పూర్తిగా కొత్త మార్గంలో ప్రయాణించనుంది. ఇందులో ఒక ఏసీ టూ టైర్, రెండు ఏసీ త్రీటైర్, ఏడు స్లీపర్ క్లాసులు, ఆరు జనరల్ కలిపి మొత్తం 18 బోగీలు ఉంటాయి. ఈ రైలు ప్రతి శుక్రవారం ఉదయం 11:30కు ముంబై (ఎల్టీటీ)లో బయల్దేరి మరుసటి రోజు శనివారం మధాహ్నం 3 గంటలకు కాజీపేట చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ప్రతి శనివారం సాయంత్రం 5:45కు కాజీపేట నుంచి బయల్దేరి మరుసటి రోజు ఆదివారం ఉదయం 11:15కు ముంబై (ఎల్టీటీ) చేరుకుంటుంది. జమ్మికుంట, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్కాగజ్నగర్, బల్లార్షా, మజ్రీకదన్, వాని, పింపల్కుట్, ఆదిలాబాద్, కిన్వత్, హిమాయత్నగర్డెక్కన్, భోకార్, ముద్కేడ్, నాందేడ్, పూర్ణ, పర్భని, జాల్నా, ఔరంగాబాద్, నాగర్సోల్, మన్మాడ్, నాసిక్, కళ్యాణ్ స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది. కాజీపేట-బల్లార్షా మార్గంలో కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు కొత్త రైలు అందుబాటులోకి రానుంది. వారాంత ంలో ముంబై, షిర్డీ వెళ్లే ప్రయాణికులకు ఈ రైలు ఉపయుక్తంగా ఉంటుంది. అంతేకాకుండా ఇప్పటి వరకు ప్యాసింజరు రైళ్ల రాకపోకలకు టెర్మినల్‌గా ఉన్న కాజీపేట స్టేషన్ హోదా ఎక్స్‌ప్రెస్ టెర్మినల్‌గా అప్‌గ్రేడ్ అయ్యేందుకు ఆస్కారం ఏర్పడనుంది. తాజాగా ప్రత్యేక పాట.. 2015 సెప్టెంబర్‌లో రైల్వేశాఖ ప్రకటించిన టైం టేబుల్లో కాజీపేట-ముంబై (ఎల్టీటీ) రైలుకు సంబంధించిన రాకపోకల వివరాలు ప్రకటించా రు. దీంతో రేపోమాపో రైలు ప్రారంభమవతుం దని ఆశిస్తున్న తరుణంలో రైల్వేశాఖ ప్రత్యేక రైలు గా పేర్కొంటూ బుధవారం ప్రకటన విడుదల చేసింది. దీని ప్రకారం ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా కాజీపేట -ముంబై (ఎల్టీటీ)ల మధ్య డిసెంబర్ 11, 12, 18, 19, 26, 27 తేదీల్లో మూడు ట్రిప్పులు నడిపిస్తామని పేర్కొంది. ఈ రైలు టికెట్ల బుకింగ్ నేటి(డిసెంబర్ 3) నుంచి మొదలవుతాయని తెలిపింది. రైల్వే బడ్జెట్లో రెగ్యులర్‌గా పేర్కొన్న రైలును ఇప్పుడు ప్రత్యేక రైలుగా చూపిం చడం పట్ల సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ రైలు ముంబై కేంద్రంగా ఉన్న సెంట్రల్ రైల్వే జోన్ ఆధ్వర్యంలో ప్రారంభం కావాల్సి ఉంది. అరుుతే దీనిపై మన ప్రజాప్రతినిధులు రైల్వేశాఖపై ఒత్తిడి తీసుకురావడంలో విఫలమయ్యూరని, అందుకే తూతూమంత్రంగా ఈ రైలును ప్రత్యేకంగా నడిపిస్తున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ప్రత్యేకం పేరుతో కొన్ని ట్రిప్పులు నడిపించి ఆ తర్వాత ఆదరణ కరువైందంటూ మొత్తానికే ఎత్తివేస్తారేమోననే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
షిర్డి హారతి వేళలు యథాతథం
షిర్డి: స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తంకావడంతో హారతి సేవల సమయాన్ని మార్చాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు శ్రీ షిర్డి సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్(ఎస్ఎస్ఎస్టీ) శనివారం ప్రకటించింది. నాసిక్-త్రయంబకేశ్వర్ కుంభమేళా నేపథ్యంలో ఆలయానికి లక్షలాదిగా భక్తులు రాక పెరగడంతో హారతి వేళలను మార్చాలని నిర్ణయించారు. మామూలుగా ఆలయంలో ఉదయం గం.4.30కి కాకడ్ హారతి, రాత్రి గం.10.30కి శేజరతి హారతి కార్యక్రమాలు ఉంటాయి. వీటిని ఉదయం గం.3.00లకు, రాత్రి గం.11.30కి నిర్వహించాలని ఎస్ఎస్ఎస్టీ కార్యనిర్వహక అధికారి రాజేంద్ర జాదవ్ శనివారం ఉదయం ప్రకటించారు. విషయం తెలిసిన భక్తులు, స్థానికులు కార్యాలయం ఎదుట నిరాహార దీక్ష చేపట్టి తమ నిరసన వ్యక్తంచేశారు. సంప్రదాయాలకు విరుద్ధంగా ఆలయ త్రిసభ్య కమిటీ వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు అధికారులు స్పష్టంచేశారు. -
విఠల్‌రావు విషాదాంతం
-
విఠల్‌రావు విషాదాంతం
ప్రముఖ గజల్ గాయకుడు విఠల్‌రావు కన్నుమూత * మతిస్థిమితం కోల్పోయి గతనెల 29న షిర్డీలో అదృశ్యం * చివరికి అనామకుడిగా గాంధీ ఆస్పత్రిలో మరణం * మార్చురీలో మృతదేహాన్ని గుర్తించిన సీసీఎస్ ఇన్స్పెక్టర్ * తొలి తరం తెలంగాణ గజల్ గాయకుడు విఠల్‌రావు * నిజాం ఆస్థాన కవిగా కీర్తిప్రతిష్టలు.. దేశవిదేశాల్లో వేలాది ప్రదర్శనలు సాక్షి, హైదరాబాద్: తొలితరం తెలంగాణ గజల్ గాయకుడు పండిట్ శివపూర్కర్ విఠల్‌రావు (86) అదృశ్యం మిస్టరీ విషాదాంతమైంది. అద్భుతమైన గాత్రంతో దశాబ్దాలకు పైగా సాహితీ ప్రియులను అలరించిన ఆయన చివరికి అనామకుడిలా మరణించారు. అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్న విఠల్‌రావు మే 29న షిర్డీలో కనిపించకుండా పోయిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన ఆచూకీ కోసం పోలీసులు, కుటుంబసభ్యులు తీవ్రంగా వెతుకుతున్నారు. ఈ నెల 24న హైదరాబాద్‌లోని బేగంపేట కంట్రీ క్లబ్ ఫ్లై ఓవర్ కింద అపస్మారక స్థితిలో పడి ఉన్న విఠల్‌రావును స్థానికులు యాచకునిగా భావించి 108కు సమాచారమిచ్చారు. గాంధీ ఆస్పత్రికి తరలించగా ఆయన అదే రోజు మరణించారు. గుర్తు తెలియని మృతదేహంగా పోలీసులు కేసు నమోదు చేసి మార్చురీలో భద్రపరిచారు. కాగా, విఠల్‌రావు అదృశ్యం కేసు దర్యాప్తు చేస్తున్న సీసీఎస్ ఇన్స్పెక్టర్ శాంబాబు.. ఫొటోల ఆధారంగా మార్చురీలోని మృతదేహం ఆయనదేనని గుర్తించారు. కుళ్లిపోయిన స్థితిలో ఉన్న విఠల్‌రావు మృతదేహాన్ని ఆయనకు అమర్చిన కృత్రిమ కన్ను ద్వారా కుమారుడు సంతోష్ గుర్తించారు. కొన్నేళ్ల కింద ఆయన ఎడమ కన్ను తొలగించి కృత్రిమ కన్ను అమర్చారు. విఠల్‌రావుకు భార్య తారాభాయి, కుమారులు సంజయ్, సంతోష్, కుమార్తెలు సంధ్య, వింధ్య, సీమ ఉన్నారు. ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఆస్థాన గాయకుడిగా , దేశ,విదేశీల్లో పేరొందిన ఆయన మృతి చెందిన తీరు కుటుంబసభ్యులు, బంధువులు, అభిమానులను తీవ్రంగా కలచివేస్తోంది. విఠల్‌రావు అంత్యక్రియలను ఆయన స్వస్థలమైన గోషామహల్లో శనివారం నిర్వహించనున్నట్లు ఆయన కుమారుడు సంతోష్తెలిపారు. సన్మానం అందుకోకుండానే... జూన్ 2న తెలంగాణ అవతరణ వేడుకల సందర్భంగా విఠల్‌రావుకు సన్మానం చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. కుటుంబసభ్యులకు సమాచారం అందించింది. అయితే అప్పటికే ఆయన అదృశ్యం కావడంతో ఆయనను సన్మానించలేకపోయింది. ఆయన ఆచూకీ కనిపెట్టాలని పోలీసులను ఆదేశించింది. దేశంలోని అన్ని పోలీస్ స్టేషన్లకు సమాచారం పంపించారు. మరోవైపు కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు షిర్డీ పోలీసులు కూడా దర్యాప్తు చేపట్టారు. షిర్డీలో పోలీసులు, కుటుంబసభ్యులు గాలింపు చేపట్టారు. అయినా ఎక్కడా ఆయన ఆచూకీ దొరకలేదు. కుటుంబసమేతంగా షిర్డీకి.. విఠల్‌రావు కుటుంబసభ్యులంతా కలసి మే 26న గోషామహల్ నుంచి షిర్డీ యాత్రకు బయలుదేరారు. మార్గ మధ్యలో విఠల్ చెల్లెలు అంబిక ఇంటికి వెళ్లి అక్కడ రెండు రోజులున్నారు. ఆ తర్వాత మే 29న అందరూ కలసి షిర్డీ చేరుకున్నారు. బాబా దర్శనం చేసుకున్నాక తిరిగి వస్తుండగా విఠల్‌రావు కనిపించకుండా పోయారు. అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్న ఆయన షిర్డీలో తప్పిపోయి హైదరాబాద్‌లో ఎలా ప్రత్యక్షమయ్యారో తెలియడం లేదు. ఈ నెల 23 రాత్రి నాగర్సోల్లో అజంతా ఎక్స్‌ప్రెస్ ఎక్కి 24న ఉదయం బేగంపేట రైల్వేస్టేషన్లో దిగి ఉంటారని, కాలినడకన బయల్దేరి నీరసంతో బేగంపేట ఫ్లైఓవర్ కింద కుప్పకూలి ఉంటారని అంటున్నారు. దేశవిదేశాల్లో ప్రదర్శనలు: విఠల్‌రావు ప్రస్థానం నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఆస్థాన గాయకుడిగా మొదలైంది. చివరగా ఆయన ఈ ఏడాది ఏప్రిల్ 28న ఢిల్లీలో ప్రదర్శన ఇచ్చారు. భారతరత్న ఉస్తాద్ బిస్మిల్లాఖాన్‌తో కలసి హైదరాబాద్‌లో ఆయన ప్రదర్శన ఇచ్చారు. చౌమొహల్లాప్యాలెస్, రవీంద్రభారతి, తారామతి బారదరిలో విఠల్ ఇచ్చిన ప్రదర్శనలు చరిత్రలో నిలిచిపోతాయనే చెప్పుకోవచ్చు. చాలామంది ప్రముఖులు ఆయన గజల్స్‌కు మంత్రముగ్ధులయ్యేవారు. రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు, గవర్నర్లు, సీఎంలను ఆయన గజల్స్ అలరించాయి. కువైట్, కెనడా,అమెరికా, బ్రిటన్, న్యూజిలాండ్, దుబాయ్ తదితర దేశాల్లోనూ ఆయన ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. ఎన్నో అవార్డులు, రివార్డులు ఆయనను వరించాయి. సీఎం కేసీఆర్ సంతాపం విఠల్‌రావు మృతి పట్ల శుక్రవారం సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ఏడో నిజాం ఆస్థానంలో విద్వాంసుడిగా పని చేసిన విఠల్‌రావు దేశవ్యాప్తంగా పేరొందిన కళాకారుడని సీఎం గుర్తు చేశారు. విఠల్‌రావు కుటుంబసభ్యులకు, శిష్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం విఠల్‌రావును ప్రత్యేకంగా గుర్తించి పారితోషికాన్ని అందించింది. అలాగే ప్రముఖ పర్యావరణవేత్త, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజామణి మరణం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. -
తెగబడ్డ దోపిడీ దొంగలు
బాలాపూర్: షిరిడీ-మైసూర్ రైలులో దోపిడీ దొంగలు తెగబడ్డారు. మంగళవారం అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో రైల్లో భారీ దోపిడీకి పాల్పడ్డారు. రైల్లోకి ప్రవేశించిన 30 మంది దోపిడీ దొంగలు ఎస్ 1 బోగి నుంచి ఎస్ 14 బోగిల వరకు స్వైర విహారం చేశారు. ప్రయాణికులను బెదిరించి భారీగా బంగారం, నగదు దోచుకున్నారు. మహారాష్ట్రలోని బాలాపూర్ వద్ద ఘటన చోటు చేసుకుంది. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దోపిడీ దొంగలను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. -
షిర్డీలో యువతిపై అత్యాచారం, హత్య
థానె: షిర్డీలో ఓ యువతిపై లైంగిక దాడికి పాల్పడి హత్య చేశారు. ఇటీవల మహారాష్ట్రలోని సాహాపూర్ జిల్లా హడవేలి గ్రామానికి చెందిన 21 ఏళ్ల యువతిని ముగ్గురు వ్యక్తులు షిర్డీకి తీసుకెళ్లారు. గోరక్, రాహుల్ అనే ఇద్దరు వ్యక్తులతో మరో గుర్తు తెలియని మహిళను ఆ యువతి వెంట ఉన్నారు. షిర్డీలో మూడు రోజుల పాటు బాధితురాలిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. అనంతరం హత్య చేసి సమీపంలోని నదిలోకి విసిరేశారు. స్థానికులు యువతి మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు నిందితుల్లో ఒకరిని అరెస్ట్ చేశారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. -
‘న్యూ ఇయర్’ కోసం షిర్డీ సిద్ధం..
సాక్షి, ముంబై: నూతన సంవత్సరం సందర్భంగా షిర్డీ పుణ్యక్షేత్రానికి లక్షల సంఖ్యలో తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు సాయి సంస్థాన్ కార్యనిర్వాహక అధికారి రాజేంద్ర జాదవ్ చెప్పారు. ఈ నెల 31వ తేదీన (బుధవారం) 24 గంటలూ బాబా ఆలయాన్ని తెరిచే ఉంచుతామని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం విద్యా సంస్థలకు క్రిస్మస్ సెలవులు ప్రకటించారు. ఇవి పూర్తికాకముందే నూతన సంవత్సర వేడుకలు వస్తున్నాయి. కొత్త సంవత్సరం రోజున బాబాను దర్శించుకునేందుకు యేటా రాష్ట్రంతోపాటు దేశం నలుమూలల నుంచి లక్షలాది జనం షిర్డీకి తరలివస్తారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని బాబాను దర్శించుకునేందుకు బుధవారం ఉదయం నుంచి గురువారం రాత్రి వరకు నిరంతరంగా క్యూ కొనసాగుతూనే ఉంటుందని జాదవ్ చెప్పారు. కేవలం ఆరతి సమయంలో 15 నిమిషాలపాటు క్యూను నిలుపుతారని చెప్పారు. ప్రస్తుతం షర్డీలో విపరీతమైన చలి ఉంది. భక్తులు సాధ్యమైనంత వరకు అతిథి గృహాలు, భవనాల వరండాల్లో బస చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. చలి నుంచి తట్టుకునేందుకు అదనంగా చద్దర్లు, తివాచీలు సమకూర్చారు. తాగునీరు, స్నానాల గదులు, ఇతర మౌలిక సదుపాయాలు కూడా కల్పిస్తున్నట్లు జాదవ్ తెలిపారు. రెండు పూటలా భోజనం, ఉదయం అల్పాహారం, టీ, కాఫీ, లడ్డు ప్రసాదం కోసం అదనంగా కూపన్ విక్రయ కౌంటర్లు ఏర్పాటు చేయనున్నారు. -
ఔటర్‌పై లారీని ఢీకొన్న కారు. ఒకరి మృతి
హైదరాబాద్: శంషాబాద్ మండలం పెద్దగోల్కొండ వద్ద ఆగివున్న లారీని కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా , ఐదుగురికి త్రీవ గాయాలయ్యాయి. షిర్డీ నుంచి ఒంగోలు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగ్రాతులు ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన వారిగా గుర్తించారు. -
షిర్డీ సాయిబాబాకు విరాళాల వెల్లువ
షిర్డీ: షిర్డీ సాయిబాబా దేవాలయానికి గత మూడు రోజుల్లో విరాళాలు పెద్ద ఎత్తున వచ్చాయి. సాయిబాబా భక్తులు నగదు, చెక్‌లు, డీడీలు, బంగారు, వెండి ఆభరణాల రూపంలో దాదాపు 4.10 కోట్ల విలువైన విరాళాలు అందజేశారు. దసరా పండుగ సందర్భంగా మూడు రోజుల్లో దాదాపు 1.70 లక్షల మంది భక్తులు బాబాను దర్శించుకున్నట్టు ట్రస్ట్ అధికారులు చెప్పారు. -
కేవలం మూడు రోజుల్లోనే 4.47 కోట్లు విరాళాలు!
షిర్డి: గురు పూర్ణిమ పర్వదినం నేపథ్యంలో షిర్డిలోని సాయిబాబ ఆలయానికి భారీగా విరాళాల్ని భక్తులు సమర్పించుకున్నారు. గురు పూర్ణిమ సందర్భంగా జరిగిన మూడు రోజుల ఉత్సవాల్లో 4.47 కోట్ల రూపాయలు విరాళాలు వచ్చాయని ఆలయ నిర్వాహకులు తెలిపారు. గత సంవత్సరంతో పోల్చుకుంటే విరాళాలు గణనీయంగా పెరిగాయని నిర్వహకులు వెల్లడించారు. గత సంవత్సరం కార్యక్రమాలకు కేవలం 38 లక్షలు మాత్రమే వచ్చాయన్నారు. డొనేషన్ బాక్సులో నగదు, బంగారం, వెండి రూపంలో 3.10 కోట్ల రూపాయలు, ఆన్ లైన్ లో 1.46 కోట్లు వచ్చాయని ఆలయ నిర్వాహకులు తెలిపారు. -
షిర్డీ నుంచి వస్తున్న ఎస్వీఆర్ ట్రావెల్స్ బస్సు బోల్తా
హైదరాబాద్ : షిర్డీ నుంచి హైదరాబాద్ వస్తున్న ఎస్వీఆర్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో ప్రయాణికులు గాయపడ్డారు. మహారాష్ట్రా ఉస్మానాబాద్ సమీపంలో బుధవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి బస్సు అదుపు తప్పినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో సుమారు 12మంది ప్రయాణికులు గాయపడినట్లు సమాచారం. వారిని చికిత్స నిమిత్తం ఉస్మానాబాద్ లోని ఆస్పత్రికి తరలించినట్లు షిర్డీలోని ఎస్వీఆర్ ట్రావెల్స్ ఎండీ బోస్ తెలిపారు. మిగతా ప్రయాణికులను మరో బస్సులో షిర్డీకి తరలించినట్లు ఆయన చెప్పారు. బాబా దర్శనం అనంతరం వారిని హైదరాబాద్ తరలించనున్నట్లు చెప్పారు. -
షిర్డీసాయి సన్నిధిలో ఘనంగా గురుపౌర్ణమి
సాక్షి ముంబై: షిర్డీలో గురుపౌర్ణమి ఉత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. షిర్డీ సాయిబాబా సంస్థాన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ వేడుకల్లో భాగంగా శనివారం పలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రాష్ట్రంతోపాటు దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు సాయిబాబాను దర్శించుకున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో రావడం తో షిర్డీ పురవిధులన్నీ భక్తులతో కిటకిటలాడాయి. మందిరాన్ని కూడా రకరకాల పుష్పాలు, కళ్లు మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీపాలతో అలంకరించారు. గురుపౌర్ణిమను పురస్కరించుకుని సోమవారం ‘శ్రీసాయి సచ్ఛరిత్ర’ పవిత్ర గ్రంథం అఖండ పారాయణం ముగిసింది. ఈ సందర్భంగా శ్రీసాయి చిత్రపటం, పోతిని ఊరేగింపు నిర్వహించారు. ఈ ఊరేగింపులో సాయిబాబా సంస్థాన్ అధ్యక్షుడు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి శశికాంత్ కులకర్ణి ‘పోతి’ (ధాన్యం సంచి), మందిరం ఈఓ కుందన్ కుమార్ సోనవణే, డిప్యూటి ఈఓ అప్పాసాహెబ్ షిండే సాయిచిత్రపటాన్ని చేతపట్టుకున్నారు. ఈ ఊరేగిం పులో సంస్థాన్ అధికారులు, వారి సతీమణులు, భక్తులు, స్థానికులు భారీ సంఖ్యల్లో పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఆలయానికి సమీపంలో నిర్మించిన భారీ వేదికపై రోజంతా వివిధ భక్త మండలులు భజనలు, కీర్తనలు ఆలపిస్తున్నాయి. ఉచిత ప్రసాదాలు.. తెలుగు భక్తులతోపాటు ఇతర ప్రాంతాల భక్తులు అందజేసిన విరాళాలలతో షిర్డీ వచ్చే భక్తులందరికీ ఉచితంగా ప్రసాదాలు, భోజనాలు పెడుతున్నారు. హైదరాబాద్‌కు చెందిన కరణం నారాయణ, పోత్రాపులా పార్థసారథి, సులోచనా కార్తీక్ సంజయ్, చీరాలకు చెందిన వెంకటరమణా రెడ్డితోపాటు ముంబై, జబల్పూర్ భక్తులు అందించిన సహాయంతో ప్రసాదాలు, భోజనాలు పెట్టారు. గురుపౌర్ణమి ఉత్సవాల మొదటి రోజు శుక్రవారం 70 వేల మంది భక్తులకు ఉచితంగా లడ్డూలు పంపిణీ చేశారు. ‘సాయి సన్నిధ్యాత్’ పుస్తకం అవిష్కరణ... ముంబైకి చెందిన సాయిభక్తురాలు ముగ్ధా దివాడ్కర్ రచించిన ‘సాయి సన్నిధ్యాత్’ అనే గ్రంథాన్ని గురుపౌర్ణమిని పురస్కరించుకుని అవిష్కరిచారు. ఈ పుస్తకాన్ని సంస్థాన్ ఈఓ కుందన్‌కుమార్ సోనవణే చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటి ఈఓ అప్పాసాహెబ్ షిండే, పిఆర్ ఓ మోహన్ జాధవ్, రచయిత ముగ్ధ, ప్రచురణకర్త కులకర్ణి తదితరులు పాల్గొన్నారు. నేడు రుద్రాభిషేకం... గురుపౌర్ణమి ఉత్సవాల చివరి రోజు గురుస్థాన్ ఆల యంలో రుద్రాభిషేకం నిర్వహించనున్నారు. అదేవిధంగా ఉట్టిత్సవాలు, ప్రత్యేక కీర్తనలు తదితర కార్యక్రమాలు ఉంటాయి. గ్రాంట్‌రోడ్డులో.. గ్రాంట్ రోడ్డులోని జగనాథ్ శంకర్‌సేఠ్ సెకండరీ మున్సిపల్ పాఠశాల ఆధ్వర్యంలో శనివారం ఉదయం పాఠశాల ప్రాంగణంలో ‘గురుపూర్ణిమ’ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. గురుశిష్యుల మధ్య సఖ్యత ప్రాధాన్యాన్ని వివరిస్తూ విద్యార్థులు గేయాలు ఆలపించారు. తరువాత ప్రతి ఉపాధ్యాయుడికీ పుష్పగుచ్ఛాలు ఇచ్చి అభినందనలు తెలిపారు. పాఠశాల ప్రిన్సిపాల్ రాపెల్లి సుదర్శన్ మాట్లాడుతూ గురుపూర్ణిమ చారిత్రక ప్రాధాన్యం, విశిష్టత గురించి వివరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు కె.రాజు, గాల్డె సదానంద్, తాటికొండ సంగీత, వసం షేక్, అర్చన, శిల్ప, రింకీ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
షిరిడీ ఆలయంలో చోరీ.. గార్డు అరెస్టు
షిరిడీ సాయి సంస్థానంలో వెండి, బంగారు ఆభరణాలను దొంగిలించిన నేరంలో సంస్థాన్ సెక్యూరిటీ గార్డు ఒకరిని అరెస్టు చేశారు. ట్రస్టుకు చెందిన కౌంటింగ్ హాలు నుంచి అతడీ ఆభరణాలను దొంగిలించినట్లు పోలీసులు తెలిపారు. మంగళవారం నాడు నిర్వహించిన తనిఖీలలో.. దినకర్ హనుమంత్ డోఖే (58) అనే సెక్యూరిటీ గార్డు ఒక గ్రాము బంగారు నాణెం, మూడు గ్రాముల బంగారు ఆభరణాలు, 36 గ్రాముల వెండి ఆభరణాలను కౌంటింగ్ హాలు నుంచి దొంగిలించినట్లు ఇన్స్పెక్టర్ సందీప్ కహాలే తెలిపారు. ట్రస్టు ఆస్పత్రిలో పనిచేసే ఈ గార్డును మంగళవారం రాత్రి అరెస్టు చేశామని, అతడిపై ఐపీసీ సెక్షన్ 379 కింద కేసు నమోదు చేశామని చెప్పారు. ఈ సంఘటన అనంతరం గార్డు ఉద్యోగం నుంచి డోఖేను సంస్థానం సస్పెండ్ చేసినట్లు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అప్పా సాహెబ్ షిండే తెలిపారు. -
గురుపౌర్ణమికి షిర్డీ ముస్తాబు
సాక్షి, ముంబై : గురుపౌర్ణమి ఉత్సవాలు పురస్కరించుకుని ప్రముఖ పుణ్యక్షేత్రమైన షిర్డీ ముస్తాబైంది. రకరకాల పూలతో, విద్యుత్ దీపాలతో ఆలయాన్ని ముస్తాబుచేసే అలంకరణ పనులు తుది దశకు చేరుకున్నాయి. షిర్డీలో ఈ నెల 11, 12, 13 తేదీల్లో గురుపౌర్ణమి ఉత్సవాలు జరగనున్నాయి. ఇక్కడకు వచ్చే భక్తుల సౌకర్యార్థం సాయిబాబా ఆలయ సంస్థాన్ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ఉత్సవాల సమయంలో ఆలయంలో వివిధ కార్యక్రమాలు జరగనున్నాయి. భజన బృందాలు భక్తి పాటలు, కీర్తనలు ఆలపించేందుకు ఆలయం పక్కన 75 వేల చ.ట. భారీ మండపం ఏర్పాటు చేశారు. వర్షాలతో భక్తులు అసౌకర్యానికి గురికాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. భక్తులందరికి ప్రసాదం సులభంగా లభించాలనే ఉద్దేశంతో 275 క్వింటాళ్ల చక్కెర లడ్డూలు సిద్ధం చేస్తున్నారు. పల్లకీలతో వచ్చే భక్తులు బస చేసేందుకు సాయి ఆశ్రమం-2 లో ఉచితంగా సౌకర్యం కల్పించి, బస, భోజన ఏర్పాట్లు చేసినట్లు బాబా ఆలయ సంస్థాన్ కార్యనిర్వాహక అధికారి కుందన్‌కుమార్ సోనవణే తెలిపారు. రెండు చోట్ల ప్రథమ చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేసి, అందులో వైద్యులు రెండు షిప్టులకీ పనిచేస్తారని సోనవణే అన్నారు. ఈ ఉత్సవాలు పారదర్శకంగా నిర్వహించేందుకు బాబా సంస్థాన్ అధ్యక్షుడు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి శశికాంత్ కులకర్ణి, సంస్థాన్ పదాధికారి అనీల్ కవాడే, ఇతర పదాధికారులు కృషి చేస్తారని ఆయన అన్నారు. మూడు రోజులు జరిగే కార్యక్రమాలు : 11న సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు మాధవ్‌రావ్ ఆజేగావ్కర్గారి కీర్తనలు ఉంటాయి. రాత్రి 7.30 నుంచి 10.30 గంటల వరకు సుమీత్ బోపాల్ గారి సాయి అమృత్ కథ కార్యక్రమం ఉంటుంది. 12న సాయంత్రం నాలుగు గంటలకు వివిధ భక్తుల కీర్తనలు ఉంటాయి. రాత్రి 7.30 నుంచి వివిధ భక్తి నాటకాల ప్రదర్శన ఉంటుంది. 13న ఉదయం 10.30 గంటలకు ఉట్టి ఉత్సవం, కీర్తనల ఆలాపన, రాత్రి 7.30 గంటలకు సాయి మిలన్ అనే భక్తి కార్యక్రమం ఉంటుందని కుందన్‌కుమార్ అన్నారు. హైదరాబాద్, ముంబై, జబల్పూర్ ప్రాంతాలకు చెందిన భక్తులు అందజేసిన విరాళాలతో ఈ మూడు రోజుల పాటు షిర్డీ వచ్చే భక్తులందరికీ ఉచిత భోజన వసతి కల్పించినట్లు ఆయన చెప్పారు. -
బాబా దేవుడు కాదా ? - ప్రత్యేక చర్చ2
-
బాబా దేవుడు కాదా ? - ప్రత్యేక చర్చ1
-
బాబా దేవుడు కాదా ?.. మీరింతకీ స్వాములేనా?
-
బాలీవుడ్ తార శిల్పాశెట్టి నేత్రదానం!
అన్ని దానాల్లో నేత్రదానం గొప్పదని బాలీవుడ్ తార శిల్పాశెట్టి తెలియ చెప్పారు. తాజాగా శిల్పాశెట్టి నేత్రదానం చేసి అందరికి ఆదర్శంగా నిలిచారు. యశ్వంత్ సమాజిక్ ప్రతిస్థాన్ సామాజిక సంస్థకు తన నేత్రాలను శిల్పాశెట్టి దానం చేశారు. తన భర్త రాజ్ కుంద్రాతో కలిసి షిర్డీలో సాయిబాబాను దర్శించుకున్న తర్వాత ఆహ్వద్ నగర్ లోని సోనాయ్ గ్రామంలోని శని శింగనపూర్ ఆలయంలో శిల్పాశెట్టి పూజలు నిర్వహించారు. నా మరణం తర్వాత నా కళ్ల వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. మరొకరి దృష్టిని ప్రసాదిస్తుందనే విషయం తనకు సంతృప్తిని కలిగిస్తోందని శిల్పాశెట్టి అన్నారు. ఐపీఎల్ తన జట్టు రాజస్థాన్ రాయల్స్ ఐదవ స్థానంలో నిలవడాన్ని ఎప్పుడో మరిచిపోయాను.. ఓటమిని ఎక్కువగా గుర్తుంచుకోనని ఆమె అన్నారు. ఓటముల నుంచి తన జట్టు పాఠాలు నేర్చుకుంటుందన్నారు. శిల్ప సోదరి షమితా శెట్టి కూడా తన నేత్రాలను దానం చేయడం విశేషం. -
వెలవెలబోతున్న హోటళ్లు
సాక్షి, ముంబై: బాబా పుణ్యక్షేత్రం షిర్డీలో వ్యాపారం వెలవెలబోతోంది. బసచేసే భక్తుల సంఖ్య తగ్గిపోవడంతో హోటళ్లు, లాడ్జీలకు ఆదాయం భారీగా తగ్గిపోయింది. దీంతో వాటి యజమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే షిర్డీలో సౌకర్యాల లేమీయే దీనికి కారణమని తెలుస్తోంది. తిరుపతి తరువాత అత్యధిక శాతం భక్తులు వచ్చే పుణ్యక్షేత్రంగా షిర్డీ పేరు గాంచింది. షిర్డీ పుణ్యక్షేత్రం నిత్యం భక్తులతో కిటకిటలాడుతోంది. గత రెండేళ్ల కాలంలో బాబాను దర్శించుకునే వచ్చే భక్తుల సంఖ్య విపరీతంగా పెరిగింది. కానీ హోటల్, లాడ్జింగ్‌లు మాత్రం వెలవెలబోతున్నాయి. షిర్డీలో సుమారు 400పైగా చిన్న, పెద్ద హోటళ్లు, లాడ్జింగులు ఉన్నాయి. అందులో వందకు పైగా విలాసవంతమైన, రెండు, ఐదు నక్షత్రాల హోటళ్లు ఉన్నాయి. దాదాపు అన్ని హోటళ్లలో సాగానికిపైగా గదులు ఖాళీగానే ఉంటున్నాయి. ఫలితంగా వాటి యజమనులు నష్టాల బాట పడుతున్నారు. అంతేకాదు ఇప్పటికే 50కిపైగా వాటిని విక్రయించారు. మరో 50 హోటళ్లు, లాడ్జింగ్‌లు విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. నిజానికి ఏడాదికి హోటళ్లు, లాడ్జింగుల్లో ఉన్న గదుల్లో 50-60 శాతం వరకు భక్తులు అద్దెకు దిగాలి. అప్పుడే యజమానాలకు గిట్టుబాటు అవుతుంది. కానీ 30-40 శాతం మాత్రమే భక్తులు అద్దెకు దిగడంతో నష్టపోవాల్సి వస్తుంది. దీనికి తోడు బాబా సంస్ధాన్ ద్వారా షిర్డీలో అనేక చోట్ల అద్దె గదులు నిర్మించారు. మరికొన్ని నిర్మాణంలో ఉన్నాయి. దీంతో షిర్డీకి వచ్చే భక్తులు చౌక ధరకు లభించే బాబా సంస్థాన్ నిర్మించిన గదుల్లోనే బస చేస్తున్నారు. దీంతో వీరి పరిస్థితి మూలిగే నక్కమీద తాటికాయ పడ్డట్లుగా మారింది. ఇటీవల సంస్థాన్ ఏసీ గదుల అద్దెను రూ.900 నుంచి రూ.500 తగ్గించింది. అదేవిధంగా సాధారణ గదుల అద్దె రూ.500 నుంచి రూ.200 తగ్గించింది. దీంతో పోటీ మరింత తీవ్రమైంది. దీని ప్రభావం ప్రైవేటు హోటల్, లాడ్జింగ్ వ్యాపారులపై పడింది. దుబాయికి చెందిన ఇద్దరు వ్యాపారులు రెండు స్టార్ హోటళ్లను కొద్ది సంవత్సరాల కోసం లీజుకు తీసుకున్నారు. అయితే భక్తులు అటువైపు చూడకపోవడంతో కేవలం ఆరు నెలల్లోనే ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకుని వెళ్లిపోయారు. ఇలా అనేక మంది డిపాజిట్ చెల్లించి లాడ్జింగ్‌లను నడిపేందుకు తీసుకున్నారు. కాని గిట్టుపాటు కాకపోవడంతో డిపాజిట్‌ను వదులుకుని అర్ధంతరంగా వెళ్లిపోయారు. మరికొందరు బ్యాంకులనుంచి రుణాలు తీసుకుని హోటళ్లు, లాడ్జింగులు నిర్మించారు. బ్యాంక్ వాయిదాలు చెల్లించడంలో ఇబ్బందులు పడుతున్నారు. 20-30 శాతం డిస్కౌంట్ ఇచ్చినప్పటికీ వ్యాపారాలు సాగడం లేదు. దీంతో వ్యాపారులు లబోదిబోమంటున్నారు. -
షిర్డీలో బాబాను దర్శించుకున్న రాహుల్
-
అంతా రామమయం
సాక్షి, ముంబై: షిర్డీలో శ్రీరామనవమి ఉత్సవాలు సోమవారం నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి. షిర్డీ పరిసరాలు శ్రీరాముని నామస్మరణతో మార్మోగుతున్నాయి. శ్రీరామనవమి పురస్కరించుకుని మొదటి రోజు సోమవారం ఆలయ నిర్వాహకులు వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. తెల్లవారుజామున నాలుగు గంటలకు బాబా విగ్రహానికి మంగళస్నానం చేయించారు. కాకడ్ హారతి పూర్తికాగానే ఆయన చిత్రపటం, పవిత్ర గ్రంథాన్ని ఊరేగించారు. ఈ ఊరేగింపు ద్వారకామాయి చేరుకోగానే అఖండ పారాయణ పఠనం ప్రారంభమైంది. బాబా చిత్రపటాన్ని, గ్రంథాన్ని, ఆయన వాడిన గోనే సంచిని ఆలయ కమిటీ పదాధికారులు అప్పాసాహెబ్ షిండే, రామరావ్ శేల్కే, అజయ్ మోరే, ఆలయ పురోహితుడు ఉపేంద్ర పాటక్లు తమ చేతులతో పట్టుకుని ఊరేగింపులో పాల్గొన్నారు. భక్తుల సందడి... శ్రీరామనవమి ఉత్సవాల్లో బాగంగా ఆలయాలు, పరిసరాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. మొదటి రోజు ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఆదివారం రాత్రికే భక్తులు పెద్దసంఖ్యలో షిర్డీకి చేరుకున్నారు. పల్లకీలు, కాలిబాటన వచ్చే భక్తులు రామనామస్మరణతో పరిసర ప్రాంతాల్లో భక్తిమయ వాతావరణం నెలకొంది. దీంతో భక్తులు బసచేసేందుకు సంస్థాన్ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఆలయం పక్కనే ఏర్పాటుచేసిన వేదికపై వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భజన కళాకారులు భక్తి గీతాలు, కీర్తనలను ఆలపించారు. మందిర పరిసరాల్లో ద్వారకామాయి మండలి తరఫున ఏర్పాటుచేసిన విద్యుత్ దీపాలతో అలంకరించిన శ్రీరాముని ప్రతిమ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. భక్తులకు ఉచిత భోజనం.... భక్తులకు ఉచిత భోజన సౌకర్యం కల్పించారు. విజయవాడకు చెందిన పద్మలత శ్రీనివాస్, భోపాల్‌కు చెందిన ముకేష్ భరద్వాజ్, మితేష్ క్లాసెస్, ఔరంగాబాద్‌కు చెందిన దినేశ్ చంద్ర, సురేశ్ చంద్ర వాడేగావ్కర్, చెన్నైకి చెందిన టి.విజయ్ తదితర భక్తులు అందజేసిన విరాళాలతో ఉచిత భోజన సౌకర్యం కల్పించినట్లు బాబా సంస్థాన్ కార్యనిర్వాహక అధికారి అజయ్ మోరే అజయ్ మోరే తెలిపారు. రాత్రంతా మందిరం తెరిచి ఉంచుతాం: మోరే శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా సాయిబాబా మందిరాన్ని మూడు రోజుల పాటు రాత్రంతా తెరిచే ఉంచుతామని అజయ్ మోరే చెప్పారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు సాయిబాబా సంస్థాన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందన్నారు. రెండో రోజు మంగళవారం కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ పూజా కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. -
షిర్డీకి పెరిగిన రద్దీ
సాక్షి, ముంబై : ఒకపక్క క్రిస్మస్ సెలవులు మరోపక్క నూతన సంవత్సరం కలసి రావడంతో ప్రముఖ పుణ్యక్షేత్రం షిర్డీలో భక్తుల రద్దీ అధికమైంది. ఫలితంగా సాయిబాబాను దర్శించుకునేందుకు కనీసం ఎనిమిది నుంచి 10 గంటల సమయం పడుతోంది. బాబా సంస్థాన్‌కు చెందిన భక్తి నివాస్, భక్తిధామ్ తదితర ఖరీదైన గదులతోపాటు పేదల కోసం నిర్మించిన చౌకఅద్దె గదులన్నీ కిటకిటలాడుతున్నాయి. నూతన సంవత్సరం మొదటిరోజు తెల్లవారుజామునే బాబా సమాధిని దర్శించుకోవడానికి వేలాది మంది ఒక రోజు ముందే షిర్డీ పుణ్యక్షేత్రానికి చేరుకుంటారు. తొలిరోజే బాబాను దర్శించుకోవడం వల్ల అన్ని శుభాలు జరుగుతాయన్నది భక్తుల నమ్మకం. ఈ ఏడు నూతన సంవత్సరం బుధవారం రావడంతో మంగళవారం సాయంత్రం వరకు రాష్ట్రంతోపాటు ఆంధ్రప్రదేశ్ నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు షిర్డీకి చేరుకుంటారు. క్రిస్మస్ సెలవులు కావడంతో షిర్డీలో ఇది వరకే విపరీతమైన రద్దీ ఉంది. చౌకగానే లభించే బాబా సంస్థాన్‌కు చెందిన అద్దె గదులన్నీ నిండిపోయాయని సంస్థాన్ అధికారులు తెలిపారు. షిర్డీలో ఎముకలు కొరికే చలి ఉండగా, తలదాచుకుందామంటే గదులు దొరకడం లేదు. దీంతో భక్తులు చేసేదేంలేక ప్రైవేటు లాడ్జీలను ఆశ్రయిస్తున్నారు. దీన్ని అదనుగా చేసుకుని హోటల్, లాడ్జీల యజమానులు భక్తులను నిలువు దోపిడీ చేస్తున్నారు. ఒక్కసారిగా హోటల్ గదుల అద్దెలు నాలుగురెట్లు పెంచేసి జేబులు నింపుకుంటున్నారు. వివిధ ప్రాంతాల నుంచి షిర్డీకి వచ్చే ప్రైవేటు లగ్జరీ బస్సుల యజమానులు కూడా అడ్డగోలుగా చార్జీలు వసూలు చేస్తున్నారు. గుర్రపు బళ్లు మొదలుకుని ఆటోలు, సామానులు మోసే కూలీలు, గదులు చూపించే బ్రోకర్లు సైతం ఇష్టం వచ్చిన రీతిలో వసూలు చేస్తున్నారు. ఒక్కసారిగా రద్దీ పెరిగిపోవడంతో దర్శనం కోసం క్యూలో నిలబడే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చలిలో దూరప్రాంతం నుంచి ప్రయాణం చేసి వచ్చి గంటల తరబడి క్యూలో నిలబడడంతో తీవ్రంగా అలసిపోతున్నారు. ముఖ్యంగా వృద్థులు, పిల్లలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని వీఐపీలు సంస్థాన్‌లో పైరవీలు చేయకుండా నిరోధించడానికి ప్రజాసంబంధాల కార్యాలయాన్ని మూసివేశారు. దీంతో సామాన్య భక్తుల మాదిరిగానే వీఐపీలు, రాజకీయ నాయకులు, ఇతర రంగాల ప్రముఖులు క్యూలోనే బాబాను దర్శించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదిలాఉండగా భారీగా నిర్మించిన ప్రసాదాలయం కూడా ఎటూ సరిపోవడం లేదు. గంటల తరబడి క్యూలో నిలబడితే తప్ప భోజనం లభించడం లేదు. ఇదే పరిస్థితి అల్పహారం, టీ, కాఫీ కౌంటర్ల వద్ద కూడా కనిపిస్తోంది. భక్తులను నియంత్రించేందుకు పట్టణవ్యాప్తంగా పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. -
31 రాత్రంతా సాయి దర్శనం
సాక్షి, ముంబై: పుణ్యక్షేత్రం షిర్డీలో ఈ నెల 31న శ్రీ సాయిబాబా సమాధి మందిరం రాత్రంతా తెరిచి ఉండనుంది. క్రిస్మస్ సేవలు, అలాగే సంవత్సరం చివరి రోజు, నూతన సంవత్సరం వేడుకలను పురస్కరించుకొని పెద్ద సంఖ్యలో భక్తులు బాబా దర్శనం కోసం షిర్డీకి తరలివచ్చే అవకాశముండటంతో ఈ నిర్ణయం తీసుకున్నామని శ్రీ సాయిబాబా సంస్థాన్ కార్యనిర్వాహక అధికారి అజయ్ మోరే తెలిపారు. ఈ సందర్భంగా మందిరం వద్ద వేర్వేరు భక్తి కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. ఈ వేడుకల సమయంలో సాయి పల్లకీతో కాలి నడకన పాదయాత్ర చేసి వచ్చిన భక్తులు కూడా సామాన్య దర్శ నం నుంచే బాబాను దర్శించుకోవల్సి ఉంటుందని తెలిపారు. పాదయాత్రికులు బస చేయడం కోసం పలుచోట్ల మండపాలు, అదనంగా నివాస, ప్రసాద భోజన ఏర్పాటు చేస్తామన్నారు. ‘డిసెంబర్ 31న సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకు ముంబైకి చెందిన సచ్చిదానంద ఆప్పాచే హిందీ, మరాఠీ భక్తి సంగీత కార్యక్రమం ఉంటుం ది. రాత్రి 8.45 నుంచి 10.15 గంటల వరకు పార స్ జైన్, ప్రవీణ్ మహాముని, జిమ్మీ శర్మాల సాయిభజన కార్యక్రమం నిర్వహిస్తాం. ఆ తర్వాత 10.30 నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు ఠాణేకు చెందిన జగదీశ్ పాటిల్చే భజన కార్యక్రమం జరుగుతుం ద’ని అజయ్ మోరే తెలిపారు. డిసెంబర్ 31న శేజారతి, జనవరి ఒకటిన కాకడ హారతి ఉంటుందన్నారు. మందిరం పరిసర ప్రాంతాల్లో టపాసులు, వాయిద్యాల చప్పుడు చేయరాదని తెలిపారు. భద్రతా దృష్ట్యా భక్తులు సంస్థాన్ సూచనలను పాటించాలని ఆయన కోరారు. వీఐపీ పాస్‌ల నిలిపివేత షిర్డీలో సాయిబాబా దర్శనం కోసం ఇవ్వబడే వీఐపీ పాస్‌లను ఈ నెల 25, 31, జనవరి ఒకటి తేదీల్లో నిలిపివేయనున్నారు. క్రిస్మస్, సంవత్సరం చివరి రోజు, నూతన సంవత్సరం సెలవులను పురస్కరించుకొని భక్తులు పెద్ద సంఖ్యలో షిర్డీకి వస్తారు. ఈ నేపథ్యంలో అతి ముఖ్యమైన వ్యక్తులకు జారీ చేసే వీఐపీ పాస్‌లను ఈ నెల 25, 31, జనవరి ఒకటిన రద్దు చేయనున్నట్లు శ్రీ సాయిబాబా సంస్థాన్ నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. -
షిర్డీలో గదుల అద్దె తగ్గింపు
జనవరి ఒకటినుంచి అమలులోకి సాక్షి, ముంబై: సాయిబాబా భక్తులకు శుభవార్త. భక్తి నివాస్ ప్రాంగణంలోని గదుల అద్దెను సగానికి తగ్గించాలని షిర్డీ సాయిబాబా సంస్థాన్ యాజమాన్యం నిర్ణయించింది. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి దీనిని అమలు చేస్తామని సంస్థాన్ కార్యనిర్వాహక అధికారి అజయ్ మోరే చెప్పారు. ప్రస్తుతం భక్తి నివాస్ భవనంలో సాధారణ గదికి రోజుకు రూ.500 చొప్పున వసూలు చేస్తున్నారు. తాజా నిర్ణయం ప్రకారం జనవరి నుంచి రూ.200 చొప్పున వసూలు చేస్తారు. అదేవిధంగా ఏసీ గదులకు రోజుకు రూ.900 వసూలు చేస్తుండగా, జనవరి నుంచి రూ.500 చెల్లిస్తే సరిపోతుంది. ఓ సాయి భక్తుడు అందజేసిన విరాళాలతో నిర్మించిన సాయిఆశ్రం ప్రాజెక్టులో ఒక్కొక్క గదిలో మూడు పడకలు ఉన్నాయి. ఇటువంటి వి మొత్తం 1,536 గదులు ఉన్నాయి. హారతి కార్యక్రమంలో పాల్గొనే భక్తుల వద్ద నుంచి వసూలు చేస్తున్న రుసుమును సంస్థాన్ ఇటీవల రద్దు చేసిన సంగతి విదితమే. దీంతో హారతి సమయంలో సాధారణ భక్తుల సంఖ్య పెరిగింది. అయినప్పటికీ సంస్థాన్ బాబా దర్శనంకోసం వచ్చే భక్తులతో వ్యాపారం చేస్త్తోందంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఆరోపణలను తిప్పికొట్టేందుకు గదుల అద్దె తగ్గించాలని సంస్థాన్ నిర్ణయించింది. ఇదిలాఉంచితే బాబా సమాధి చుట్టూ అద్దాలను ఏర్పాటు చేయాలని సంస్థాన్ యోచిస్తోంది. రాష్ట్రంతోపాటు దేశ నలుమూలలనుంచి ఎంతో భక్తిశ్రద్ధలతో బాబాను దర్శించుకునేందుకు భారీసంఖ్యలో భక్తులు షిర్డీకి వెళతారు. -
షిర్డీ సోలార్ ప్రాజెక్టుకు పురస్కారం
సాక్షి, ముంబై: షిర్డీలో ప్రసాదాలయ భవనం టెరెస్‌పై ఏర్పాటుచేసిన ‘సోలార్ స్టీం కుకింగ్ ప్రాజెక్టు’కు కేంద్ర భారీ విద్యుత్ శాఖ, దానికి పురస్కారం ప్రకటించింది. ఈ పురస్కారాన్ని ఈ నెల 17వ తేదీన న్యూఢిల్లీలో కేంద్ర భారీ విద్యుత్ శాఖ మంత్రి డాక్టర్ ఫరూక్ అబ్దుల్లా ప్రదానం చేయనున్నట్లు షిర్డీ సాయి సంస్థాన్ కార్యనిర్వాహక అధికారి అజయ్ మోరే బుధవారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. షిర్డీ పుణ్య క్షేత్రంలో సాయి సంస్థాన్ నిత్యం వేలాది మందికి నామమాత్రపు రుసుం తీసుకుని భోజన వసతి కల్పిస్తోంది. భారీగా తయారుచేసే వంటకాలకు నిత్యం పెద్ద ఎత్తున విద్యుత్ వినియోగమవుతోంది. విద్యుత్ పొదుపు చేయాలనే ఉద్దేశంతో సాయి సంస్థాన్ వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. ప్రపంచంలోనే అత్యంత భారీ సోలార్ స్టీం కుకింగ్ ప్రాజెక్టును నెలకొల్పింది. దీన్ని 2009 జూలై 30న ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రతిరోజు 260 కిలోల గ్యాస్ ఆదా అవుతోంది. ఆ ప్రకారం బాబా సంస్థాన్‌కు సరాసరి రోజుకు రూ.21వేల విలువైన ఇంధనం ఆదా అవుతోంది. అంతేకాక తరుచూ పెరుగుతున్న గ్యాస్ ధర బెడదనుంచి సంస్థాన్‌కు విముక్తి లభించింది. ప్రాజెక్టుకు ఇండియన్ బాయిలర్ యాక్ట్ ప్రకారం ఇటీవలే మార్పులు చేశామని మోరే అన్నారు. ప్రమాదాలకు ఏ మాత్రం ఆస్కారమివ్వకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. అందుకు కొందరు నిపుణులను, సలహాదారులను ప్రత్యేకంగా నియమించారు. కాగా, పురస్కారం అందుకునేందుకు సాయి సంస్థాన్ పదాధికారులు ఆ రోజు ఢిల్లీకి రావాలని విద్యుత్ శాఖ సమాచారం పంపింది. పురస్కారం ప్రకటించిన విషయం తెలియగానే ప్రసాదాలయం నిర్వహణ బాధ్యతలు చూసుకుంటున్న ఉత్తం గోంద్కర్, మెకానికల్ విభాగం చీఫ్ అమృత్ జగ్తాప్, ఇతర సిబ్బందిని సంస్థాన్ అధ్యక్షుడు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జయంత్ కులకర్ణి, కలెక్టర్, సంస్థాన్ సభ్యుడు సంజయ్‌కుమార్, డిప్యూటీ కార్యనిర్వాహక అధికారి, తహశీల్దార్ అప్పాసాహెబ్ షిందే తదితరులు అభినందించారు. -
షిర్డీకి ప్రత్యేక రైలు
సాక్షి, గుంటూరు: షిర్డీ సాయిబాబా భక్తులకు శుభవార్త. డిసెంబరు 5వ తేదీ నుంచి గుంటూరు మీదుగా నాగర్సోల్ వరకు ప్రత్యేక వీక్లీ స్పెషల్ ట్రైన్ నడవనుంది. వారంలో రెండు రోజుల పాటు ఈ రైలు గుంటూరు, నల్లగొండ జిల్లా వాసులకు అందుబాటులో ఉంటుంది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు న్యూ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ షెడ్యూలును బుధవారం ప్రకటించారు. ప్రస్తుతం గుంటూరు జిల్లా భక్తులు బాబా దర్శనం కోసం షిర్డీ వెళ్లేందుకు విజయవాడ, సికింద్రాబాద్ స్టేషన్లకు వెళ్లి అక్కడ నుంచి వెళ్లే మన్మాడ్ ఎక్స్‌ప్రెస్ ఎక్కుతున్నారు. దీని వల్ల ప్రయాణ సమయంతో పాటు అధిక మొత్తంలో చార్జీలు కూడా అవుతున్నాయి. నల్లగొండ జిల్లా భక్తులు కూడా విధిగా సికింద్రాబాద్ వెళ్లి రెలైక్కాల్సి వ స్తోంది. దీనికితోడు గుంటూరు డివిజన్ ఏర్పడినప్పటి నుంచి ఎంపీలు రాయపాటి సాంబశివరావు, మోదుగుల వేణుగోపాలరెడ్డి షిర్డీకి రైలు నడపండని రైల్వే అధికారులను కోరుతున్నారు. ఎట్టకేలకు అధికారులు డిసెంబరు 5 నుంచి న్యూ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌ను గుంటూరు, పిడుగురాళ్ల, నల్లగొండ మీదుగా నడిపేందుకు నిర్ణయం తీసుకున్నారు. గుం టూరు డివిజన్ సీనియర్ కమర్షియల్ మేనేజర్ సీ రామకృష్ణ షిర్డీ రైలు ప్రారంభాన్ని బుధవారం సాయంత్రం ధ్రువీకరించారు. డిసెం బరు 5 నుంచి ప్రతి గురు, ఆదివారాల్లో నర్సాపూర్ నుంచి నాగర్సోల్ వరకూ ట్రైన్ నెంబరు 17231 నడుస్తుంది. అదేవిధంగా నాగర్సోల్ నుంచి నర్సాపూర్‌కు శుక్ర, సోమవారాల్లో (17232) ఈ బండి నడుస్తుంది. షిర్డీ రైలు షెడ్యూలు ఇలా... గురువారం ఉదయం 10.30 గంటలకు నర్సాపూర్‌లో బయలుదేరే 17231 ట్రైన్ అదేరోజు మధ్యాహ్నం 2.55 గంటలకు గుంటూరు స్టేషన్‌కు చేరుతుంది. ఐదు నిమిషాల విరామం తరువాత ఇక్కడి నుంచి బయల్దేరి 3.40 గంటలకు సత్తెనపల్లి, 4.15 గంటలకు పిడుగురాళ్ల, 4. 36 గంటలకు నడికుడి, సాయంత్రం 6 గంటలకు నల్లగొండ చేరుతుంది. రాత్రి 9.30 గంటలకు సికింద్రాబాద్ చేరుకునే షిర్డీ ఎక్స్‌ప్రెస్ రాత్రి 10 గంటలకు అక్కడి నుంచి నాగర్సోల్ బయలుదేరుతుంది. మరుసటి రోజు ఉదయం 10 గంటలకు నాగర్సోల్ చేరుతుంది. శుక్ర, సోమవారాల్లో ఉదయం 11.15 గంటలకు నాగర్సోల్ నుంచి బయలుదేరే 17232 ఎక్స్‌ప్రెస్ ఔరంగాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, సికింద్రాబాద్‌ల మీదుగా రాత్రి 11.10 గంటలకు సికింద్రాబాద్, మరుసటి రోజు ఉదయం 4.25 గంటలకు గుంటూరు చేరుకుంటుంది. 2014 ఫిబ్రవరి 7వ తేదీ తరువాత నర్సాపూర్ నుంచి నాగర్సోల్ వెళ్లే రైలు శుక్ర, ఆదివారాల్లోనూ, నాగర్సోల్ నుంచి నర్సాపూర్ వైపు వెళ్లే రైలు అదేనెల 8 తరువాత శని, సోమవారాల్లోనూ నడుస్తాయని గుంటూరు సీనియర్ డీసీఎం రామకృష్ణ వివరించారు. 21 బోగీలతో నడిచే ఈ ఎక్స్‌ప్రెస్‌లో 10 కోచ్‌లు సెకండ్‌క్లాస్ స్లీపర్, టూ టైర్, త్రీ టైర్ ఏసీ కోచ్‌లు ఒక్కొక్కటి చొప్పున ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. త్వరలో అడ్వాన్సు రిజర్వేషన్ వివరాలను వెల్లడిస్తామని రైల్వే వర్గాలు తెలిపాయి. -
షిర్డీ హారతి వీఐపీ టికెట్ల ధర పెంపు
షిర్డీ: ప్రసిద్ధ షిర్డీ సాయిబాబా సన్నిధిలో బాబాకు నిత్యం చేసే హారతి సేవల్లో పాల్గొనే వీఐపీ భక్తుల టికెట్ల రుసుమును ఆలయ సంస్థాన్ బోర్డు భారీగా పెంచింది. ఉదయం 4.30 గంటలకు ఇచ్చే కాగడ హారతిలో పాల్గొనే వీఐపీలకు ఒక్కొక్కరికీ రూ.500, మధ్యాహ్నం(12 గం.), సాయంత్రం(7 గం.), రాత్రి(10.30గం.)ల హారతుల్లో పాల్గొనే వారికి రూ.300 టికెట్ ధరలుగా నిర్ణయించింది. ఈ పెంపు సోమవారం నుంచి అమల్లోకి రానుంది. -
షిర్డి సాయిబాబాను దర్శించుకున్న శృతి హసన్
తెలుగు, తమిళ తార, కమల్ హసన్ కూతురు శృతి హసన్ ఆదివానం షిర్డిలోని సాయిబాబాను దర్శించుకున్నారు. సోషల్ మీడియా వెబ్ సైట్ ట్విటర్ ద్వారా లో షిర్డీ పర్యటన వివరాలను శృతి హసన్ తెలిపారు. భగవాన్ సాయిబాబాను దర్శించుకోవడం ఇదే తొలిసారి అని తెలిపారు. తొలిసారి షిర్డిని సందర్శించి సాయిబాబాను దర్శించుకోవడం గొప్ప అనుభూతి కలిగించింది అని అన్నారు. షిర్డి నుంచి ముంబై చేరుకుని చత్రపతి శివాజి అంతర్జాతీయ విమానాశ్రయానికి 20 కిలో మీటర్ల దూరంలో ఉన్న చెంబూరు మురుగన్ దేవాలయంలో కార్తీక పౌర్ణమి పండుగను జరుపుకున్నానని తెలిపారు. ముంబైలో తక్కలి తోగయల్ పచ్చడి (తమిళ వంటకం)తో దోశ తిన్నాను.. ఆదివారం బ్రహ్మండంగా గడిచిందని శృతి హసన్ ట్విటర్ లో పోస్ట్ చేశారు. -
భక్తుల్లో భయాందోళనలు
-
డిసెంబర్‌లోగా షిర్డీ ఎయిర్పోర్ట్ నిర్మాణం పూర్తి
ఈ ఏడాది చివరి నాటికి షిర్డి సమీపంలోని ఎయిర్ పోర్ట్ నిర్మాణం పూర్తి అవుతోందని మహారాష్ట్ర ఎయిర్పోర్ట్ డెవలెప్మెంట్ కంపెనీ (ఎంఏడీసీ) ఎండీ తనజి సత్రి శుక్రవారం షిర్డిలో వెల్లడించారు. నిర్మాణ పనులను ఆయన పర్యవేక్షించారు. అనంతరం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... ఎయిర్‌పోర్ట్‌లో రన్ వే నిర్మాణం ఇప్పటికే పూర్తి అయిందని, టెర్మినల్‌కు సంబంధించిన నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయని అన్నారు. సాయనాధుని దివ్య సన్నిధిని సందర్శించేందుకు ప్రపంచవ్యాప్తంగా నిత్యం వేలాది మంది భక్తులు షిర్డీ విచ్చేస్తారని తెలిపారు. ఎయిర్ పోర్ట్ నిర్మాణం పూర్తి అయితే సులభంగా షిర్డీ చేరుకునే సౌకర్యం ప్రయాణికులకు కలుగుతోందని ఆయన చెప్పారు. షిర్డీ పట్టణానికి 14 కిలో మీటర్ల దూరంలోని కాకడి గ్రామం వద్ద ఎయిర్‌పోర్ట్‌ను నిర్మిస్తున్నారు. ఆ ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం సాయిబాబ దేవాలయ ట్రస్ట్ రూ. 45 కోట్లను విరాళంగా అందజేసిన సంగతిని ఈ సందర్బంగా తనజి సత్రి గుర్తు చేశారు.