షిరిడీ ఆలయంలో చోరీ.. గార్డు అరెస్టు | Saibaba trust employee held for stealing ornaments | Sakshi
Sakshi News home page

షిరిడీ ఆలయంలో చోరీ.. గార్డు అరెస్టు

Published Wed, Jul 9 2014 1:15 PM | Last Updated on Sat, Sep 2 2017 10:03 AM

షిరిడీ ఆలయంలో చోరీ.. గార్డు అరెస్టు

షిరిడీ ఆలయంలో చోరీ.. గార్డు అరెస్టు

షిరిడీ సాయి సంస్థానంలో వెండి, బంగారు ఆభరణాలను దొంగిలించిన నేరంలో సంస్థాన్ సెక్యూరిటీ గార్డు ఒకరిని అరెస్టు చేశారు. ట్రస్టుకు చెందిన కౌంటింగ్ హాలు నుంచి అతడీ ఆభరణాలను దొంగిలించినట్లు పోలీసులు తెలిపారు. మంగళవారం నాడు నిర్వహించిన తనిఖీలలో.. దినకర్ హనుమంత్ డోఖే (58) అనే సెక్యూరిటీ గార్డు ఒక గ్రాము బంగారు నాణెం, మూడు గ్రాముల బంగారు ఆభరణాలు, 36 గ్రాముల వెండి ఆభరణాలను కౌంటింగ్ హాలు నుంచి దొంగిలించినట్లు  ఇన్స్పెక్టర్ సందీప్ కహాలే తెలిపారు.

ట్రస్టు ఆస్పత్రిలో పనిచేసే ఈ గార్డును మంగళవారం రాత్రి అరెస్టు చేశామని, అతడిపై ఐపీసీ సెక్షన్ 379 కింద కేసు నమోదు చేశామని చెప్పారు. ఈ సంఘటన అనంతరం గార్డు ఉద్యోగం నుంచి డోఖేను సంస్థానం సస్పెండ్ చేసినట్లు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అప్పా సాహెబ్ షిండే తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement