మహారాష్ట్రలో ప్రఖ్యాతి గాంచి షిర్డీ సాయిబాబా ఆలయం నాణేల సమస్యలను ఎదుర్కొంటోంది. ఈ ఆలయానికి ప్రతి నెల నాణేల రూపంలో సుమారు రూ. 28 లక్షల వరకు విలువైన నగదు వస్తుంది. దీన్ని బ్యాంకులో జమ చేస్తారు. ఈ సంస్థ ట్రస్ట్‌కి ప్రభుత్వ సంబంధ బ్యాంకులకు సంబంధించి మొత్తం 13 శాఖల్లో ఖాతాలు ఉన్నాయి. వీటిలో ఎక్కువ బ్యాంకులు షిర్డీలో ఉండగా, ఒకటి నాసిక్‌లో ఉంది. ట్రస్ట్ ఖాతా ఉన్న ప్రతి బ్యాంకు ఆలయం నుంచి విరాళాలను, డిపాజిట్లను సేకరించడానికి ప్రతి నెల తమ సిబ్బందిని పంపుతాయి. ఐతే నాణేల రూపంలో ఇప్పటికే సుమారు రూ. 11 కోట్లు షిర్డీ సంస్థాన్‌కి సంబంధించిన బ్యాంకులో డిపాజిట్ అయ్యింది.
ఇక నాణేలను దాచేందుకు అక్కడ బ్యాంకుల వద్ద స్థలంలో లేదు. దీంతో నాలుగు బ్యాంకుల అధికారులు ప్రతిరోజు లభించే నాణేలను ఉంచడానికి తమ వద్ద స్థలం లేదన్నారు. దీంతో షిర్డీ ట్రస్ట్ నాణేలను ఉంచడం ఒక సమస్యగా మారింది. దీంతో ఈ విషయంలో ఆర్బీఐని జోక్యం చేయయమంటూ..ట్రస్ట్ నేరుగా లేఖ రాయాలని యోచిస్తోంది. ఈ నాలుగు బ్యాంకుల తోపాటు ఇతర బ్యాంకులు కూడా ఇదే మాదిరి నాణేలను దాచేందుకు స్థలం సమస్యను ఎదుర్కొంటున్నట్లు సమాచారం.
ఈ మేరకు ట్రస్ట్ సీఈవో మాట్లాడుతూ..కోవిడ్ మహమ్మారి తర్వాత నుంచి మళ్లీ నాణేల సమ్యస్య తెరపైకి వచ్చింది. ఆలయంలో సగటున రోజువారిగా 50 వేలకు పైగా నాణేలు పేరుకుపోయాయి. నాణేల సేకరణను నాలుగు బ్యాంకులు నిలిపేశాయి. దీంతోపాఏటు మిగిలిన బ్యాంకులు ఇదే సమస్యను ఎదుర్కొటున్నాయి. ఈ సమస్యను పరిష్కరించమని షిర్డీ సంస్థాన్ అధికారులు తనని సంప్రదించినట్లు తెలిపారు.
ఈ విషయమై అహ్మదాబాద్‌లో మిగతా బ్యాంకులను సంప్రదించి..అక్కడ ఖాతాలనుతెరిచే యోచన కూడా చేస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా, బ్యాంకుల మాత్రం తమ వద్ద నాణేలు చాలా పెద్ద మొత్తంలో పేరుకుపోయాయని చెబుతున్నాయి. అప్పట్లో ట్రస్ట్ నాణేలను నిల్వ చేయడానికి ఆలయ ప్రాంగణంలో బ్యాంకుల గదులను ఇచ్చింది. కాని కానీ నిబంధనల ప్రకారం అందుకు అనుమతి లేనందున తిరస్కరించినట్లు చెప్పారు.
(చదవండి: మోదీ పర్యటన వేళ ఆత్మాహుతి దాడి బెదిరింపు లేఖ..అప్రమత్తమైన అధికారులు)
Comments
Please login to add a commentAdd a comment