refuse
-
నా భార్యపై దారుణంగా దాడి చేశారు.. ఆర్మీజవాన్ వీడియో కలకలం
కొంతమంది వ్యక్తులు నా భార్యపై దారుణంగా దాడి చేశారంటూ ఓ ఆర్మీ జవాన్ ట్విట్టర్లో పోస్ట్ చేసిన వీడియో తీవ్ర కలకలం రేపింది. ఈ మేరకు తమిళనాడులోని నాగపట్నం జిల్లాలో కడవాసల్ గ్రామంలో కొందరు వ్యక్తులు నా భార్యను అర్థనగ్నంగా చేసి దాడి చేశారంటూ ఆమె భర్త ఆర్మీ జవాన్ వీడియోలో పేర్కొన్నాడు. ఈ వీడియోని రిటైర్డ్ ఆర్మీ అధికారి లెఫ్టినెంట్ కల్నల్ ఎన్ త్యాగరాజన్ పోస్ట్ చేశారు. ఆ వీడియోలో.. ఆరోపణలు చేస్తున్న ఆర్మీ జవాన్ హవల్దార్ ప్రభాకరన్ తమిళనాడులోని పడవేడు గ్రామానికి చెందిన వ్యక్తి. అతను ప్రస్తుతం కాశ్మీర్లో ఉద్యోగం చేస్తున్నాడు. ట్విట్టర్లో పోస్ట్ చేసిన వీడియోలో అతను తన భార్యకు జరిగిన అవమానం గురించి వివరించాడు. తన భార్య ఒక స్థలంలో లీజుకు ఓ దుకాణం నుడుపుతోందని వీడియోలో తెలిపాడు. ఆమెను 120 మంది వ్యక్తలు కొట్టి షాపులోని వస్తువులను బయటకు విసిరేశారు. ఎస్పీకి ఫిర్యాదు చేయగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కత్తులతో నా కుటుంబంపై దాడి చేసి బెదిరించారని, తన భార్యను అర్ధ నగ్నం చేసి దారుణంగా కొట్టారని ఆరోపణలు చేశాడు. అయితే పోలీసులు అతని ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు కంధవాసల్ పోలీసులు ప్రాథమిక దర్యాప్తు చేసి ఓ ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటనలో..రేణుగాంబాల్ ఆలయానికి చెందిన స్థలంలో నిర్మించిన దుకాణాన్ని ప్రభాకరన్ మామగారైన సెల్వమూర్తి కుమార్ నుంచి ఐదేళ్ల కాలానికి రూ. 9.5 లక్షలకు లీజుకు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కుమార్ మరణించిన తర్వాత అతని కుమారుడు రాము దుకాణాన్ని తిరిగి ఇవ్వాలని కోరాడు. అందుకు డబ్బు తిరిగి ఇవ్వడాన్ని కూడా అంగీకరించడమే గాక ఒప్పందంపై సంతకం కూడా చేశాడు. ఐతే సెల్వమూర్తి డబ్బు తీసుకునేందుకు తిరస్కరించడమే గాక దుకాణం నుంచి వెళ్లేందుకు నిరాకరించాడని రాము పేర్కొన్నాడు. ఈ క్రమంలో జూన్ 10వ తేదిన సెల్వమూర్తి కుమారులు జీవా, ఉదయలకు డబ్బు ఇచ్చేందుకు రాము దుకాణానికి వెళ్లగా అతనిపై కత్తితో దాడి చేసినట్లు సమాచారం. ఈ గొడవను గమనించి స్థానికులు రాముకు పెద్ద ఎత్తున మద్దతుగా రావడంతో అది కాస్త పెద్దదై, అక్కడ దుకాణంలో వస్తువులు బయటకు విసిరేసేంత వరకు దారితీసిందని పోలీసులు పేర్కొన్నారు. ఆ సమయంలో దుకాణంలో ప్రభాకరన్ భార్య కీర్తి, ఆమె తల్లి దుకాణంలో ఉన్నారని, కానీ వారిపై ఆ గుంపు దాడి చేయలేదని ప్రకటనలో వెల్లడించారు పోలీసులు. ఇదిలా ఉండగా, తమిళనాడు బీజేపీ చీఫ్ కే అన్నామలై ఆర్మీ జవాన్‌తో మాట్లాడి తమ పార్టీ అతని భార్యకు న్యాయం చేయడమే గాక కుటుంబానికి అండగా ఉంటామని ట్వీట్లో పేర్కొన్నారు. ఈ మేరకు బీజేపీ చీఫ్ ఆ ట్వీట్లో..కాశ్మీర్లో మన దేశానికి ధైర్యంగా సేవ చేస్తున్న హవల్దార్, అతని భార్యతో ఫోన్లో మాట్లాడటం జరిగింది. ఆమె కథ విని నిజంగా బాధనిపించింది. తమిళ గడ్డపై ఆమెకు ఇలా జరిగినందుకు సిగ్గుపడ్డాను. వెల్లూరులో ఓ ఆస్పత్రిలో చేరినా ఆమెను తమ పార్టీ పరామర్శించినట్లు ట్వీట్ చేశారు. @ThanthiTV @News18TamilNadu @PTTVOnlineNews @ChanakyaaTv @Def_PRO_Chennai @narendramodi @annamalai_k @rajnathsingh — Lt Col N Thiagarajan Veteran (@NTR_NationFirst) June 10, 2023 (చదవండి: కేకు డబ్బులు అడిగాడని కాల్పులు.. దుకాణదారుని మృతి!) -
వరుడు రంగు తక్కువగా ఉన్నాడని...
ఉత్తరప్రదేశ్‌లోని కౌషాంబిలో విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. ఒక పెళ్లి కుమార్తె తనకు కాబోయే భర్తలోని ఒక లోపాన్ని ఎత్తి చూపుతూ పెళ్లికి నిరాకరించింది. దీంతో ఇదెక్కడి గోలరా అనుకుంటూ అక్కడున్నవారంతా కంగుతిన్నారు. వధువు తనకు కాబోయే భర్త మెడలో దండ వేసేందుకు వివాహ వేదికపైకి వచ్చింది. అతనిని పరిశీలనగా చూసి పూల దండ వేసేందుకు నిరాకరించింది. వధువు నిర్ణయాన్ని విన్న అక్కడున్నవారంతా నిర్ఘాంత పోయారు. వరుడు రంగు తక్కువగా ఉన్నాడని అతనిని పెళ్లి చేసుకునేందుకు నిరాకరించింది. దీనికితోడు ఆ యువకుడు వయసు మీదపడినవానిలా కనిపిస్తున్నాడని కూడా వధువు ఆరోపించింది. వధువు ఈ విధంగా మాట్లాడేసరికి కల్యాణమండపంలో కలకలం చెలరేగింది. పెళ్లికి వచ్చిన పెద్దలు ఎంతనచ్చజెప్పినా ఆమె ససేమీరా అనడంతో వరుడు కల్యాణమండపం నుంచి వెనుదిరగాల్సి వచ్చింది. ఈ ఘటన మే 29న జరిగింది. పిపరీ పోలీస్ స్టేషన్ పరిధిలోని షేర్పురాలో ఉంటున్న యువకునికి చర్వా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామానికి చెందిన యువతితో వివాహం నిశ్చయం అయ్యింది. 29న వరుడు తమ తరపు పెద్దలతో పాటు పెళ్లి ఊరేగింపుతో వధువు ఇంటికి చేరుకున్నాడు. వధువు తరపువారంతా పెళ్లి కొడుకుకు ఘనంగా స్వాగత సత్కారాలు చేశారు. తరువాత వరమాల కార్యక్రమానికి సన్నాహాలు చేశారు. చదవండి: కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌కు ఆ పేరు ఎలా వచ్చిందంటే.. వధువు పూల దండ తీసుకుని వివాహ వేదికపైకి వచ్చింది. అయితే అతనిని పరిశీలనగా చూసి, అతనికి పూల దండ వేసేందుకు నిరాకరించింది. దీంతో అక్కడ గందరగోళ వాతావరణం నెలకొంది. వరుడు కూడా ఆందోళకు లోనయ్యాడు. పెళ్లికి వచ్చిన పెద్దలు వధువును కారణం అడగగా వరుడు రంగు తక్కువగా ఉన్నాడని, వయసు ఎక్కువగా కనిపిస్తున్నదని, అందుకే తాను ఈ వివాహం చేసుకోబోనని తేల్చిచెప్పేసింది. దీంతో వారు ఆమెకు నచ్చజెప్పేందుకు ఎంతగానో ప్రయత్నించారు. అయినా ఆమె వారి మాట వినలేదు. దీంతో ఈ వివాదం పరిష్కారానికి గ్రామంలో పంచాయతీ నిర్వహించారు. అక్కడున్నవారంతా ఆమెకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ, ఆమె తనకు ఈ పెళ్లి వద్దంటూ తెసేసి చెప్పేసింది. వధువు తరపువారు చేసేదేమీ లేక వెనుకకు తిరిగి వెళ్లిపోయారు. -
ఆటోగ్రాఫ్ ఇవ్వని ధోని బతిమాలుకున్న చాహర్..!
-
'షిర్డి ఆలయం నుంచి నాణేలను తీసుకోం'..! అంటున్న బ్యాంకులు
మహారాష్ట్రలో ప్రఖ్యాతి గాంచి షిర్డీ సాయిబాబా ఆలయం నాణేల సమస్యలను ఎదుర్కొంటోంది. ఈ ఆలయానికి ప్రతి నెల నాణేల రూపంలో సుమారు రూ. 28 లక్షల వరకు విలువైన నగదు వస్తుంది. దీన్ని బ్యాంకులో జమ చేస్తారు. ఈ సంస్థ ట్రస్ట్‌కి ప్రభుత్వ సంబంధ బ్యాంకులకు సంబంధించి మొత్తం 13 శాఖల్లో ఖాతాలు ఉన్నాయి. వీటిలో ఎక్కువ బ్యాంకులు షిర్డీలో ఉండగా, ఒకటి నాసిక్‌లో ఉంది. ట్రస్ట్ ఖాతా ఉన్న ప్రతి బ్యాంకు ఆలయం నుంచి విరాళాలను, డిపాజిట్లను సేకరించడానికి ప్రతి నెల తమ సిబ్బందిని పంపుతాయి. ఐతే నాణేల రూపంలో ఇప్పటికే సుమారు రూ. 11 కోట్లు షిర్డీ సంస్థాన్‌కి సంబంధించిన బ్యాంకులో డిపాజిట్ అయ్యింది. ఇక నాణేలను దాచేందుకు అక్కడ బ్యాంకుల వద్ద స్థలంలో లేదు. దీంతో నాలుగు బ్యాంకుల అధికారులు ప్రతిరోజు లభించే నాణేలను ఉంచడానికి తమ వద్ద స్థలం లేదన్నారు. దీంతో షిర్డీ ట్రస్ట్ నాణేలను ఉంచడం ఒక సమస్యగా మారింది. దీంతో ఈ విషయంలో ఆర్బీఐని జోక్యం చేయయమంటూ..ట్రస్ట్ నేరుగా లేఖ రాయాలని యోచిస్తోంది. ఈ నాలుగు బ్యాంకుల తోపాటు ఇతర బ్యాంకులు కూడా ఇదే మాదిరి నాణేలను దాచేందుకు స్థలం సమస్యను ఎదుర్కొంటున్నట్లు సమాచారం. ఈ మేరకు ట్రస్ట్ సీఈవో మాట్లాడుతూ..కోవిడ్ మహమ్మారి తర్వాత నుంచి మళ్లీ నాణేల సమ్యస్య తెరపైకి వచ్చింది. ఆలయంలో సగటున రోజువారిగా 50 వేలకు పైగా నాణేలు పేరుకుపోయాయి. నాణేల సేకరణను నాలుగు బ్యాంకులు నిలిపేశాయి. దీంతోపాఏటు మిగిలిన బ్యాంకులు ఇదే సమస్యను ఎదుర్కొటున్నాయి. ఈ సమస్యను పరిష్కరించమని షిర్డీ సంస్థాన్ అధికారులు తనని సంప్రదించినట్లు తెలిపారు. ఈ విషయమై అహ్మదాబాద్‌లో మిగతా బ్యాంకులను సంప్రదించి..అక్కడ ఖాతాలనుతెరిచే యోచన కూడా చేస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా, బ్యాంకుల మాత్రం తమ వద్ద నాణేలు చాలా పెద్ద మొత్తంలో పేరుకుపోయాయని చెబుతున్నాయి. అప్పట్లో ట్రస్ట్ నాణేలను నిల్వ చేయడానికి ఆలయ ప్రాంగణంలో బ్యాంకుల గదులను ఇచ్చింది. కాని కానీ నిబంధనల ప్రకారం అందుకు అనుమతి లేనందున తిరస్కరించినట్లు చెప్పారు. (చదవండి: మోదీ పర్యటన వేళ ఆత్మాహుతి దాడి బెదిరింపు లేఖ..అప్రమత్తమైన అధికారులు) -
పీరియడ్ లీవ్స్ కొరకు పిల్.. తిరస్కరణ
ఢిల్లీ: విద్యాసంస్థల్లో, పని ప్రదేశాల్లో ఋతుస్రావ సమయంలో.. సెలవులు మంజూరుచేసేలా అన్ని రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతాలను విధివిధానాలను రూపొందించేలా కేంద్రాన్ని ఆదేశించాలంటూ దాఖలైన పిల్‌ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. ఇది తమ పరిధిలోని అంశం కాదంటూనే.. పిటిషనర్‌కు కీలక సూచన చేసింది ధర్మాసనం. ఇది మా పరిధిలోని అంశం కాదు. విధివిధానాల రూపకల్పనకు సంబంధించింది. కాబట్టి, పిటిషనర్ కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖను సంప్రదించడం సముచితంగా ఉంటుంది అని సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రతి నెలా మహిళా ఉద్యోగులకు ఋతు నొప్పి సెలవులు(పీరియడ్స్ లీవ్) మంజూరు చేయాలని కంపెనీలు/యజమానులపై ఒత్తిడి చేస్తే.. అది ఉద్యోగ నియామకాల్లో తీవ్ర ప్రభావం చూపెడుతుందని పిల్‌ను వ్యతిరేకించిన న్యాయవాది(లా స్టూడెంట్ ఒకరు) బెంచ్ ముందు వాదించారు. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. పిల్‌ను తిరస్కరిస్తున్నట్లు తెలిపింది. అయితే.. ఈ ప్రజాప్రయోజన వాజ్యం ద్వారా పిటిషనర్ కొన్ని కీలకాంశాలను లేవనెత్తారని.. కాకపోతే ఇది విధానాల రూపకల్పనకు సంబంధించి కావడంతో.. పిల్‌పై విచారణ ముందుకు సాగించలేమని స్పష్టం చేసింది ధర్మాసనం. ఢిల్లీకి చెందిన శైలేంద్ర మణి త్రిపాఠి.. లాయర్ విశాల్ తివారీ ద్వారా ఈ పిల్ పిటిషన్ దాఖలు చేశారు. మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్, 1961లోని సెక్షన్ 14ను అన్ని రాష్ట్రాలు పాటించేలా కేంద్రం ద్వారా ఆదేశాలు ఇప్పించాలని పిటిషనర్ కోరారు. జపాన్, తైవాన్, ఇండోనేషియా, సౌత్ కొరియా, స్పెయిన్(మూడు రోజులు.. వీలును బట్టి ఐదు రోజులకు కూడా పొడిగించొచ్చు), జాంబియా.. ఇలా చాలా దేశాల్లో పీరియడ్స్ లీవ్‌లను మంజూర చేస్తున్నారు. అలాగే మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్, 1961 ప్రకారం.. మహిళలు ఎదుర్కొనే ఎలాంటి సమస్యలకైనా పెయిడ్ లీవ్ పొందే ఆస్కారం ఉంటుంది. ప్రత్యేకించి గర్భం దాల్చిన సమయంలో. అందునా.. ఆ నిబంధనల పర్యవేక్షణ కోసం సెక్షన్ 14 ప్రకారం ఒక ఇన్స్పెక్టర్ నియమించాల్సి ఉంటుంది కూడా. అయితే.. కేంద్ర ప్రభుత్వం అలాంటి పర్యవేక్షకులను ఇంతదాకా నియమించలేదు అని పిటిషనర్ కోర్టుకు వివరించారు. అంతేకాదు దేశంలో బీహార్ రాష్ట్రం మాత్రమే 1992 నుంచి రుతుస్రావ సమయంలో ప్రత్యేక సెలవులను రెండురోజులపాటు మంజూరు చేస్తూ వస్తోందని సదరు పిటిషనర్ బెంచ్‌కు తెలిపారు. అలాగే జొమాటో, బైజూస్, స్విగ్గీ కూడా పెయిడ్ లీవ్స్‌ను మంజూరు చేస్తున్నాయి. ఇదిలా ఉంటే వికిపీడియా సమాచారం ప్రకారం.. కేరళ ప్రాంతంలో 1912 సంవత్సరంలో ఓ బాలికల పాఠశాలకు పీరియడ్స్ లీవ్స్ మంజూరు చేసినట్లు రికార్డుల్లో ఉంది. అంతేకాదు.. తాజాగా ఉన్నత విద్యాశాఖ ఆధ్వర్యంలోని రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో విద్యార్థినులకు రుతుక్రమ సెలవులు మంజూరు ఇవ్వనున్నట్లు కేరళ ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది కూడా. -
అప్పుడే పట్టణాలు శుభ్రపడతాయి!
ప్రపంచవ్యాప్తంగా పట్టణీకరణ అతి వేగంగా పెరుగుతోంది. భారతదేశంలోనూ ఇది స్పష్టంగా కనిపిస్తోంది. ఇదే సందర్భంలో పట్టణాలలో చెత్త, వ్యర్థాలు ప్రతి రోజూ కుప్పలు కుప్పలుగా పెరిగిపోవటం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఇందువల్ల ప్రజారోగ్యానికీ, పర్యావరణానికీ ఎంతో హాని కలుగుతోంది. స్థానిక సంస్థలకు ఈ చెత్తను తొలగించడం సవాలుగా మారింది. గత రెండు దశాబ్దాలలో వేగవంతమైన పట్టణాభివృద్ధి, జనాభా పెరుగుదల, మారుతున్న జీవన ప్రమాణాలు పట్టణాల్లో వ్యర్థాల పెరుగుదలకు హేతువులుగా చెప్పుకోవచ్చు. స్థానిక సంస్థలు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు బహుముఖ వ్యూహంతో వ్యర్థాల నిర్వహణను చేపట్టవలసిన అవసరం ఉంది. ఇప్పటివరకూ చేపడుతున్న కార్యక్రమాలలో ఆర్ఆర్ఆర్ఆర్ (రెఫ్యూజ్: తిరస్కరణ, రెడ్యూస్: తగ్గించడం, రీయూజ్: తిరిగి వాడటం, రీసైకిల్: వేరుచేసిన చెత్తను ఇతర వస్తువులను తయారు చేయడానికి లేదా పునర్వినియోగానికి సిద్ధం చేయడం) వంటి వ్యూహాలు మెరుగైన ఫలితాలు ఇస్తున్నట్లు ఇండోర్ నగరంలో అమలవుతున్న కార్యక్రమాల ద్వారా తెలుస్తోంది. వ్యర్థాల నిర్వహణలో ఇండోర్ మునిసిపల్ కార్పొరేషన్ గత 5 సంవత్సరాలుగా దేశంలోనే మొదటి ర్యాంకు సాధిస్తోంది. ఇండోర్ నగంలోని ప్రజలలో వచ్చిన అవగాహన, ప్రవర్తనలోని మార్పులు, మునిసిపల్ సిబ్బంది అకుంఠిత దీక్ష వల్లనే ఇది సాధ్యమయింది. ఇండోర్ నగరంలోని వివిధ ప్రాంతాలలో పది ట్రాన్స్ఫర్ కలెక్షన్ సెంటర్లను అత్యాధునిక సాంకేతిక నైపుణ్యంతో ఏర్పాటు చేశారు. ట్రాన్స్ఫర్ స్టేషన్ల నుండి వేరు వేరుగా సేకరించిన చెత్తను భారీ వాహనాల ద్వారా ప్రాసెసింగ్ యూనిట్‌కు తరలిస్తారు. అక్కడ పొడి చెత్తను ఆరు రకాలుగా విభజించి ఆ తదుపరి మిగిలిన కొద్దిపాటి ఉపయోగం లేని చెత్తను శాస్త్రీయ పద్ధతి ద్వారా లాండ్ ఫిల్లింగ్ చేస్తారు. ప్రాసెసింగ్ యూనిట్ నుండి తరలించిన చెత్తతో అనేక నూతన ఆవిష్కరణలు చేస్తున్నారు. ఇటీవల హైదరాబాదులో ‘ఇంక్‌వాష్’ సంస్థ నిర్వహించిన సదస్సులో చెత్త రీసైక్లింగ్ చేయడం ద్వారా అత్యధికంగా లాభాలు పొందే ఉపాధి అవకాశాలపై చర్చ జరిగింది. చెత్తతో వస్తువులను తయారు చేయడానికి ముందుకు వచ్చే స్టార్టప్ సంస్థలను ప్రభుత్వాలు ప్రోత్సహించాలి. జనాభా పెరుగుతున్న నగరాలలో రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్ర ప్రణాళికలను రచించి పకడ్బందీగా ‘చెత్త’ సమస్యను ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి. స్థానిక సంస్థలు, ప్రభుత్వాలు, ప్రజలను చైతన్యవంతులను చేయాలి. కాలనీ, రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లు, స్వచ్ఛంద సంస్థలను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలి. అలాగే నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని, వనరులను సమకూర్చుకోవాలి. అప్పుడే ప్రతి నగరం, పట్టణం పరిశుభ్రతతో అలరారుతుంది. - ప్రొఫెసర్ కుమార్ మొలుగరం భారత ప్రభుత్వ ప్రాంతీయ పట్టణ అధ్యయన కేంద్రం డైరెక్టర్, ఓయూ -
తన ప్రేమను తిరస్కరించిందని...కర్కశంగా కత్తితో పొడిచి ఆ తర్వాత...
ఇటీవల యువతీ యువకులు ప్రేమ కోసం చనిపోవడం లేదా తమ ప్రేమను ఒప్పుకోవడం లేదని చంపేయడం వంటి దారుణాలకు ఒడిగడ్డుతున్నారు. చదువకుకునే వయసులో కలిగే ప్రేమలకు, ఆకర్షణలకు లొంగిపోయి బంగారంలాంటి భవిష్యత్తుని నాశనం చేసుకుంటున్నారు. అదే కోవకు చెందినవాడు తమిళనాడుకు చెందిన ఒక యువకుడు. చక్కగా తన మానాన తాను చదుకుంటున్న ఒక బాలికను ప్రేమ పేరుతో ఆ యువకుడి వెంటపడి వేధించాడు. చివరికి జైల్లో పెట్టించినా మారకపోగా ఆ బాలికను చంపేందుకు యత్నించాడు. వివరాల్లోకెళ్తే...తమిళనాడులోని తిరుచ్చిలో 16 ఏళ్ల బాలిక పరీక్షలు అయిపోయాయని తన బంధువుల ఇంటికి ఆనందంగా వెళ్తోంది. ఇంతలో కేశవన్ అనే వ్యక్తి వచ్చి ఆమె వెళ్తున్న దారిలో అడ్డగించి అడ్డుకుని తన ప్రేమను అంగీకరించమంటూ వేధించాడు. ఆమె నిరాకరించడంతో కోపంగా కత్తితో 14 సార్లు కిరాతకంగా పొడిచి పారిపోయాడు. స్థానికులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. కానీ ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఐతే ఈ కేశవన్ పై ఆ బాలిక గతంలోనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాదు పోలీసులు కేశవన్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఇటీవలే బెయిల్ పై విడుదలై వచ్చి మరీ ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. బాధితురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం ప్రారంభించారు. ఈ ఘటనపై కరూర్ కాంగ్రెస్ ఎంపీ జోతిమణి స్పందిచడమే కాకుండా నిందుతుడి పై కఠిన చర్యలు తీసుకోవల్సిందిగా జిల్లా పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ)ని కోరారు. ఈ మేరకు పోలీసులు కేశవన్ కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు కూడా. అయితే కేశవన్ మణప్పరై సమీపంలో రైలు పట్టాలపై శవమై కనిపించాడు. మృతదేహం వద్ద ఉన్న వస్తువులు, కేశవ తండ్రి ఇచ్చిన వాగ్మూలం ఆధారంగా చనిపోయిన వ్యక్తిని కేశవన్ పోలీసులు నిర్థారించారు. (చదవండి: ప్రియునితో సహజీవనం.. వారిమధ్య ఏం జరిగిందో గానీ..) -
మూడోసారీ బ్రెగ్జిట్‌కు తిరస్కరణే
లండన్: మూడోసారి కూడా బ్రిటన్ ప్రధాని థెరెసా మే తెచ్చిన బ్రెగ్జిట్ బిల్లును ఆ దేశ పార్లమెంటు శుక్రవారం తిరస్కరించింది. దీంతో యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ బయటకొచ్చే పద్ధతి మరింత సంక్లిష్టమైంది. మే తెచ్చిన తాజా బిల్లుకు పార్లమెంటులో అనుకూలంగా 286 ఓట్లు, వ్యతిరేకంగా 344 ఓట్లు వచ్చాయి. ఈ బిల్లు ఆమోదం పొంది ఉంటే బ్రెగ్జిట్‌కు సంబంధించిన అన్ని బిల్లులను ఆమోదింపజేసుకునేందుకు థెరెసాకు మే 22వ తేదీ వరకు సమయం దొరికేది. వాస్తవానికి గత ప్రణాళిక ప్రకారం శుక్రవారం నుంచే (మార్చి 29) బ్రెగ్జిట్ ప్రక్రియ మొదలు కావాల్సి ఉంది. బ్రెగ్జిట్ బిల్లులు పార్లమెంటులో ఆమోదం పొందక పోవడంతో అది వాయిదా పడింది. -
60 లక్షలు పడిపోనున్న కరెన్సీ ప్రింటింగ్!
పెద్ద నోట్లు రద్దైనప్పటి నుంచి ఇటు సాధారణ ప్రజానీకమే కాదు, అటు బ్యాంకు ఉద్యోగులు, ప్రింటింగ్ ప్రెస్ ఉద్యోగులు సతమతమవుతున్న సంగతి తెలిసిందే. సరిపడ నోట్లను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం కోసం అదనపు సమయాలు వెచ్చించి మరీ ప్రింటింగ్ ప్రెస్ ఉద్యోగులు కరెన్సీని ముద్రిస్తున్నారు. కానీ ఇక తమ వల్ల కాదంటూ ప్రింటింగ్ ప్రెస్ ఉద్యోగులు చేతులెత్తేస్తున్నారు. తొమ్మిది గంటల సిఫ్ట్ను పన్నెండు గంటల మేర పనిచేస్తుండటంతో ఆరోగ్యపరమైన సమస్యలు వస్తున్నాయని వాపోతున్నారు. భారతీయ రిజర్వు బ్యాంకు నోట్ ముద్రణ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన సాల్బోని(పశ్చిమబెంగాల్) ప్రింటింగ్ ప్రెస్ ఉద్యోగులు అదనపు సమయాలను పనిచేయకూడదని నిర్ణయించారు. ఈ మేరకు అభిప్రాయాన్ని మేనేజ్మెంట్కు తెలిపారు. ఉద్యోగుల ఈ నిర్ణయం నోట్ల ముద్రణపై పడనుందని తెలుస్తోంది. 12 గంటల సిఫ్ట్లో రోజుకు 460 లక్షల కరెన్సీ నోట్లు ప్రింట్ చేస్తున్న ఈ ప్రెస్, ఉద్యోగుల నిర్ణయంతో రోజుకు ప్రింట్ చేయనున్న కరెన్సీ నోట్లు 60 లక్షలు పడిపోనున్నాయని రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. 12 గంటల సిఫ్ట్లో ఉద్యోగులు పనిచేసి ప్రజల అవసరార్థం ఎక్కువ నగదును అందుబాటులోకి తీసుకొచ్చారు. కానీ ఈ అదనపు పనిగంటలతో ఉద్యోగులకు వెన్నునొప్పి, నిద్రలేమి, శారీరక, మానసిక ఒత్తిడి అధికంగా ప్రబలుతున్నాయని తెలిసింది. దేశ ప్రజల కోసం ఇన్ని రోజులు 12 గంటల సిఫ్ట్లో పనిచేశామని, మరింత కాలం తాము పనిచేయలేకపోతున్నామని భారతీయ రిజర్వు బ్యాంకు నోట్ ముద్రణ్ ప్రైవేట్ లిమిటెడ్ ఉద్యోగుల అసోసియేషన్ సభ్యులు చెప్పారు. మేనేజ్మెంట్తో డిసెంబర్ 14న కుదుర్చుకున్న అగ్రిమెంట్ కూడా డిసెంబర్ 27తో ముగిసిందన్నారు. ఈ ప్రింటింగ్ ప్రెస్‌లో కొత్త రూ.2000, రూ.500 నోట్లతో పాటు అన్ని కరెన్సీ నోట్లను ప్రింట్ చేస్తున్నారు. -
'రాజీనామా చేయాలా.. ఫిట్‌గానే ఉన్నా కదా'
గువాహటి: తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ జ్యోతి ప్రసాద్ రజ్కోవా అన్నారు. ఒక వేళ రాష్ట్రపతికి తనపై అసంతృప్తి కలిగి రాజీనామా చేయాలని చెప్పాక ఆ విషయం గురించి ఆలోచిస్తానని అన్నారు. ఆరోగ్యం బాగాలేని కారణంగా గవర్నర్ పదవి నుంచి దిగిపోవాలని జ్యోతి ప్రసాద్‌ను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. కానీ ఇందుకు మాత్రం ఆయన ససేమిరా అంటూ ఝలక్ ఇచ్చారు. 'నేను రాజీనామా చేయను. ముందు రాష్ట్రపతిని నా విషయంలో అసంతృప్తి ప్రకటించనివ్వండి. అలాగే, ప్రభుత్వం కూడా రాజ్యాంగంలోని 156వ నిబంధనను ఉపయోగించనివ్వండి. నా ఆరోగ్యం బానే ఉంది. నేను పూర్తిగా కోలుకున్నాను. నా విధులు కూడా సక్రమంగా నిర్వహిస్తున్నాను. ఒక వేళ కేంద్రం నన్ను తొలగించాలని వారు అనుకుంటే ప్రధాని, ఆయన కేబినెట్ రాష్ట్రపతికి ప్రతిపాదన పంపించాలి. ఆయన మాత్రమే రాజ్యాంగం ప్రకారం నా విషయంలో తొలగింపు ఆదేశాలు జారీ చేస్తారు. ప్రభుత్వంలో పనిచేసే నాలుగో తరగతి ఉద్యోగి విషయంలోనైనా ఒక లేఖ రూపంలో రాసి సెలవుపైగానీ, కొనసాగింపుపైగానీ రాజీనామా చేయాలని కానీ డిమాండ్ చేస్తారు. అలాంటిది నేను ఒక గవర్నర్‌ను.. నాది రాజ్యంగ బద్ధమైన ఉద్యోగం' అని జ్యోతి ప్రసాద్ చెప్పారు. 'ఓ రోజు ఆగస్టు 27న గువాహటికి చెందిన ఓ వ్యక్తి ఫోన్ చేసి రాజీనామా చేయాలని చెప్పారు. నేను షాకయ్యాను. ఆశ్యర్యపోయాను. వెంటనే నేను హోంమంత్రి రాజ్ నాథ్‌కు ఫోన్ చేసి అడిగితే ఆ విషయం నాకు తెలియదన్నారు. పైగా నేను బాగా పనిచేస్తున్నానని కితాబిచ్చారు. కానీ, మరో కేంద్రమంత్రికి ఫోన్ చేయగా నన్ను ఆగస్టు 30న దిగిపోవాలని, ఆరోగ్యం కారణాలు దృష్టిలో పెట్టుకొని నన్ను రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పైగా ఇది ఉన్నత స్థాయిలో తీసుకున్న నిర్ణయమన్నారు. అందుకు అసలు నేనెందుకు రాజీనామా చేయాలని ప్రశ్నించాను. బానే ఉన్నానుగా అని సమాధానం ఇచ్చాను. నా జీవితంలో ఇప్పటి వరకు ఒక్క తప్పు చేయలేదు. ఒక వేళ నన్ను తొలగించాలనుకుంటే రాష్ట్రపతి ద్వారా తొలగించుకోవచ్చు. అప్పటి వరకు నేను రాజీనామా చేయను' అని జ్యోతి ప్రసాద్ చెప్పారు. -
ఆయన శవం ఎవరికీ వద్దంట
మధుర: ఉత్తరప్రదేశ్‌లోని మథురలో 24మంది మృతికి కారణమైన అల్లర్లకు ప్రధాన సూత్రధారి అయిన రామ్ వృక్ష్ యాదవ్ మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. మథురకు వచ్చి అతడి మృతదేహం తీసుకెళ్లాల్సిందిగా రాయ్ పూర్ బాఘ్ పూర్, ఘాజిపూర్ వాసులకు సమాచారం అందించినా వారు తిరస్కరించారు. అసలు అతడి మృతదేహం తమ ఊళ్లోకి వద్దని అక్కడి వారు అన్నారంట. దీంతో పోలీసులు అవాక్కయ్యారు. యాదవ్ నేతృత్వంలోని మూడువేల మంది మథురలోని జవహర్ బాగ్ పార్కును ఆక్రమించి రెండేళ్లుగా మకాం వేశారు. కోర్టు ఆదేశాల మేరకు ఈ పార్కును ఖాళీ చేసేందుకు పోలీసులు వెళ్లగా యాదవ్ అనుచరులు ఏకే 47 తుపాకులు, గ్రనేడ్లతో విరుచుకుపడ్డారు. దీంతో పోలీసులు-ఆందోళనకారుల మధ్య జరిగిన రణరంగంలో పెద్ద ఎత్తున హింస చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో మథుర జిల్లా ఎస్పీ ముకుల్ ద్వివేది, ఫర్హా పోలీసు స్టేషన్ ఆఫీసర్ సంతోష్ యాదవ్ మృతిచెందారు. దీంతో పోలీసులు జరిపిన కాల్పుల్లో 24 మంది చనిపోయారు. పోలీసు కాల్పుల్లో చనిపోయిన వారిలో ఈ ఆందోళనకు ప్రధాన సూత్రధారి అయిన రామ్ వృక్ష్ యాదవ్ కూడా ఉన్నాడు. దీంతో అతడి మృతదేహం తీసుకెళ్లాలని పోలీసులు ఆదేశించగా ఎవరూ ముందుకు రాలేదు. -
ఈ బుడ్డోడు ట్రంప్‌కు వీర ఫ్యాన్!
కాలిఫోర్నియా: డొనాల్డ్ ట్రంప్.. ఈ పేరు ఇప్పుడు మారుమ్రోగుతోంది. అంతకన్నా ఎక్కువగా ఈ ఎన్నికల్లో ఆయన నినాదం 'మేక్ అమెరికా ప్రైడ్ ఎగైన్' ఇప్పుడు ఎవరి నోట్లో చూసినా నానుతోంది. టీషర్ట్లు, క్యాప్‌లు ఇలా అవకాశం ఉన్న ప్రతిచోటా ఈ నినాదం వెలుగుతోంది. అయితే ట్రంప్ నినాదంతో ఉన్న క్యాప్‌ను ధరించొద్దని ఓ ఎలిమెంటరీ స్కూల్ జారీ చేసిన ఆజ్ఙను ఓ తొమ్మిదేళ్ల బాలుడు లెక్కచేయకుండా వార్తల్లో నిలిచాడు. కాలిఫోర్నియాలోని గిన్స్బర్గ్ ఎలిమెంటరీ స్కూల్లో చదువుతున్న లొగాన్ అట్రీకి ట్రంప్ అంటే అభిమానం. దీంతో గత వారం స్థానికంగా ట్రంప్ ర్యాలీ సందర్భంగా స్కూల్‌కు డుమ్మా కొట్టి మరీ వెళ్లాడు. అక్కడే ర్యాలీలో ట్రంప్ నినాదంతో ఉన్న ఓ క్యాప్‌ను కొనుగోలు చేశాడు. అయితే.. ఆ క్యాప్ పెట్టుకొని స్కూల్‌కు వెళ్లిన అట్రీకి స్కూల్ సిబ్బంది అడ్డు చెప్పారు. ఇలాంటి చర్యలతో మిగతా విద్యార్థులతో విభేదాలు తలెత్తే అవకాశం ఉందని చెప్పి అతనికి సర్థి చెప్పడానికి ప్రయత్నించారు. అయితే ఆ క్యాప్‌ను తీసేయడానికి మాత్రం అట్రీ ఒప్పుకోలేదు. చివరికి స్కూల్ వైస్ ప్రిన్సిపల్ వచ్చి అట్రీకి నచ్చజెప్పడానికి ప్రయత్నించినా లాభం లేకపోయింది. అక్రమ వలసదారుల విషయంలో డొనాల్డ్ ట్రంప్ విధానాలంటే తనకు ఇష్టమని అట్రీ స్థానిక మీడియాతో మాట్లాడుతూ తెలిపాడు. పెద్దయ్యాక పొలిటికల్ లీడర్‌ను అవుతానంటూ చెబుతున్న ఈ కుర్రాడు.. తల్లిదండ్రులు వేరే క్యాప్ కొనిచ్చిన పెట్టుకోవటం లేదట. స్కూల్ యాజమాన్యం ఏమనుకుంటుంది.. తోటి విద్యార్థులు ఏమనుకుంటున్నారు అనే విషయాలతో తనకు సంబంధం లేదని చెబుతున్నాడు. -
జీవో 28 నిలుపుదలకు హైకోర్టు నో
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్ మండల పరిధిలోని మీర్‌పేట, జిల్లెలగూడ, కొత్తపేట, బాలాపూర్, జల్పల్లి, పహాడీ షరీఫ్ గ్రామ పంచాయతీలను డీనోటిఫై చేసి మున్సిపాలిటీలుగా మారుస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 28 అమలును నిలిపేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ జీవో అమలును నిలిపేయాలంటూ సరూర్‌నగర్ మండల ప్రజా పరిషత్ సభ్యుడు తీగల విక్రంరెడ్డి దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను కొట్టేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ప్రధాన పిటిషన్‌పై తుది విచారణను వాయిదా వేశారు. -
పురస్కారం - తిరస్కారం
చరిత్ర 1964లో స్వీడిష్ అకాడమీ నోబెల్ సాహిత్య పురస్కారాన్ని సుసంపన్నమైన భావాలతో, స్వతంత్ర కాంక్షా భరితమై, సత్యశోధనతో మన యుగంపై గొప్ప ప్రభావాన్ని చూపిన రచనలు చేసినందుకు ఫ్రెంచి రచయిత జా పాల్ సార్త్రకు ప్రదానం చేసింది. ఈ సందర్భంగా, ఈ బహుమానాన్ని స్వీకరించేందుకు సుముఖంగా లేనని సార్త్ర తెలియజేశారు. ఈ గౌరవాన్ని సార్త్ర తిరస్కరించిన కారణాన ఈ పురస్కార ప్రాధాన్యత ఏమాత్రం వికృతీకరించబడదు. ఈ పరిస్థితులలో, బహుమతి ప్రదానోత్సవం జరగదని మాత్రమే అకాడమీ పేర్కొనగలదు. LE FIGARO అక్టోబర్ 23, 1964 ప్రతిలో ప్రచురితమైన ఒక బహిరంగ ప్రకటనలో సార్త్ర తానీ పురస్కారాన్ని తిరస్కరించడం వివాదం కావడం పట్ల విచారాన్ని వ్యక్తం చేశారు. స్వీడిష్ అకాడమీ ఒకసారి తీసుకున్న నిర్ణయపు అనుక్రమణీయత తెలియని కారణాన, తనను ఈ బహుమానానికి ఎన్నుకోవలదని ఒక లేఖ ద్వారా స్వీడిష్ అకాడమీని కోరినట్లు సర్వులకు తెలియాలని సార్త్ర అభిలషించారు. తనకు స్వీడిష్ అకాడమీని కించపరిచే ఉద్దేశం లేదని, తన నిరాకరణ ఆత్మగత, ఇతరేతర కారణాల ప్రేరితం అని సార్త్ర ఈ లేఖలో సూచించారు. ఆత్మగత కారణాలకు సంబంధించి, రచయిత కర్తవ్యం గురించి తీసుకున్న భావన మూలంగా తానెప్పుడూ అధికారిక పురస్కారాలను తిరస్కరిస్తూనే వచ్చానని సార్త్ర పేర్కొన్నారు. అంతకుముందు కూడా సార్త్ర LEGION OF HONOUR లో సభ్యత్వాన్ని నిరాకరించి COLLEGE DE FRANCE ప్రవేశాన్ని అభిలషించలేదు. అంతేకాదు, లెనిన్ ప్రైజ్‌ను తనకివ్వజూపినా, దాన్ని కూడా తిరస్కరిస్తానని సార్త్ర అన్నారు. ఈ విధమైన గౌరవాన్ని ఆమోదించడం రచయిత తన వ్యక్తిగత పూచీలను, బాధ్యతలను బహుమతి ప్రదానం చేసిన వ్యవస్థతో సహచరితం చేయడమే. రచయిత ఎటువంటి పరిస్థితిలో కూడా తనను తాను ఒక వ్యవస్థగా పరివర్తన చెందేందుకు అనుమతించకూడదు. ఇతర కారణాలకు సంబంధించి సార్త్ర ఒక పట్టికనిచ్చారు. ఏ వ్యవస్థల జోక్యం లేకుండా ప్రాక్పశ్చిమాల ప్రజల మధ్య, సంస్కృతుల మధ్య, ఆదాన ప్రదానాలు జరగాలని తన నమ్మిక అని సార్త్ర పేర్కొన్నారు. అంతేకాదు తన అభిప్రాయంలో, గతంలో ఈ పురస్కారం అన్ని భావజాలాలకు, అన్ని జాతులకు సమాన ప్రాతినిధ్యం వహించలేదు. ఇటువంటి స్థితిలో తానీ బహుమానాన్ని ఆమోదించడం, అవాంఛనీయ, అన్యాయపూరిత విమర్శలకు తావియ్యవచ్చు అని ఆయనన్నారు. స్వీడిష్ అకాడమీకి ఒక ప్రేమపూర్వక సందేశంతో సార్త్ర తన లేఖను ముగించారు. (స్వీడిష్ అకాడమీ సభ్యుడు ఏండర్స్ ఆసర్లింగ్ ద్వారా) - మువ్వల సుబ్బరామయ్య 8978261496 -
విజయ్ మాల్యాకు హైకోర్టులో చుక్కెదురు!
న్యూ ఢిల్లీ: ఉద్దేశపూర్వక బ్యాంకు రుణాల ఎగవేతదారుగా తనను ఎస్బీఐ పేర్కొనడాన్ని సవాలు చేస్తూ యూబీ గ్రూప్ ప్రమోటర్ విజయ్ మాల్యా దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. మాల్యా అభ్యర్థనను పరిశీలించి ఆయనకు స్వాంతన చేకూర్చే అంశం తన అధికార పరిధిలో లేదని హైకోర్టు స్పష్టం చేసింది. విజయ్ మాల్యాకు గతంలో బాంబే హైకోర్టు నుండి కూడా ఇదే రకమైన సమాధానం వచ్చిన విషయాన్ని ఢిల్లీ హైకోర్టు ఈ సందర్భంగా గుర్తు చేసింది. ఉద్దేశపూర్వకంగా బ్యాంకు రుణాల ఎగవేతకు పాల్పడి, లండన్ వెళ్లేందుకు సిద్ధమవుతున్న విజయ్ మాల్యాను అరెస్ట్ చేసి, అతని పాస్‌పోర్ట్‌ను సీజ్ చేయాల్సిందిగా డెబిట్ రికవరీ ట్రిబ్యునల్(డీఆర్టీ)ను ఇటీవల ఎస్బీఐ కోరింది. డియాజియో నుంచి మాల్యాకు లభించే పరిహారం నిధులను ముందుగా తమకు దఖలుపర్చడంతో పాటు దేశవిదేశాల్లో ఆయనకున్న ఆస్తుల వివరాలన్నీ వెల్లడయ్యేలా ఆదేశించాలని ఎస్బీఐ డీఆర్టీని కోరింది. -
ముద్రగడతో చర్చలకు సీఎం విముఖత!
విజయవాడ: కాపుల రిజర్వేషన్ పోరాటం ఉధృత రూపం దాల్చిన నేపథ్యంలో క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం పార్టీ ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభంతో చర్చలు జరపాలని పలువురు మంత్రులు సూచించగా.. ముఖ్యమంత్రి వారి వాదనను తిరస్కరించినట్లు తెలుస్తోంది. ముద్రగడ విషయంలో రాజీ పడాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పిన చంద్రబాబు.. మిగిలిన కాపు నేతలతో సంప్రదింపులు జరిపి ప్రభుత్వ చర్యలకు మద్దతు పలికేలా చూడాలని కోరినట్లు సమాచారం. కాగా, తుని ఘటనకు సంబంధించి ముద్రగడను బాధ్యునిగా చేస్తూ ఎదురు దాడి చేయాలని, అలాగే ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపులను రెచ్చగొట్టే ధోరణి వల్లే కాపు ఉద్యమం హింసాత్మకమైందని ఆరోపిస్తూ విమర్శలు చేయాలని పార్టీ ముఖ్యనేతలకు చంద్రబాబు సూచించినట్లు తెలుస్తోంది. -
సారీ... బరువెక్కువైతే ఆస్పత్రిలో చేర్చుకోం!
నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు.. అంటూ ఎందుకు పాడుకుంటారో ఢిల్లీ వాసులకు ఇప్పుడు తెలుస్తోంది. ఢిల్లీలోని సర్కారు దవాఖానాల్లో ప్రసిద్ధ లోక్‌నాయక్ జయప్రకాష్, జీబీ పంత్ ఆస్పత్రులు తీసుకున్న ఓ నిర్ణయం రోగులనే కాదు.. దేశ ప్రజలను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ ఆస్పత్రుల్లో డాక్టర్లు... ఊబకాయులకు సారీ చెప్పేస్తున్నారు. 80 కేజీల కంటే ఎక్కువ బరువున్న పేషెంట్లకు సర్జరీలు చేసేది లేదని స్పష్టం చేస్తున్నారు. ఇంతకీ బరువుకు... ఆస్పత్రిలో చేర్చుకోపోవడానికి లింకేంటో అనుకుంటున్నారా? ఆయా ఆస్పత్రుల్లోని ఆపరేషన్ టేబుల్స్ మరీ పాతవైపోవడమే అందుకు కారణమట.. ఇటీవల ఆస్పత్రిలో ఓ రోగికి ఆపరేషన్ నిర్వహిస్తుండగా ఉన్నట్టుండి టేబుల్ ఊగిందట. వైద్యులు అప్రమత్తమయ్యేలోపే టేబుల్ విరిగిపోయి... మత్తులో ఉన్న రోగి నేలపై పడిపోయాడట. ఎలాగో శస్త్రచికిత్స పూర్తయి రోగి ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే ఈ ఎపిసోడ్‌తో మౌలానా అజాద్ మెడికల్ కాలేజ్, దాని అనుబంధ జిబి పంత్ ఆస్పత్రి వైద్యులు షాకయ్యారు. ఇక ఊబకాయులకు చికిత్స చేయడం ప్రమాదమేనని నిర్ణయించుకొన్నారు. దీంతో ఆయా ఆస్పత్రుల్లోని సర్జరీ డిపార్ట్ మెంట్లు అన్నీ కలసి ఓ ఉత్తర్వును జారీ చేశాయి. 80 కేజీలకు పైబడి బరువున్న వారిని ఆస్పత్రిలో చేర్చుకొనేందుకు తిరస్కరించాలని నిర్ణయించారు. 2012 లో ఎల్ఎన్జెపి ఆస్పత్రి బేరియాట్రిక్ శస్త్రచికిత్స విభాగాన్ని ప్రారరంభించింది. అప్పటినుంచి వైవిధ్య సేవలు అందించడంలో దేశంలోనే ఎంతో పేరు తెచ్చుకున్న ఈ విభాగం.. లాప్రోస్కోపిక్ శస్త్రచికిత్సను అందించడంలో ఎంతో పేరు గడించింది. ఒక్క రోజులోనే 100కు పైగా ఆపరేషన్లు ఇక్కడ నిర్వహిస్తుంటారు. అయితే ఆపరేషన్ టేబుల్స్ కొనుగోలుకు ఆమోదం లేకపోవడం, నిర్వహణా లోపం కూడా ప్రస్తుత దుస్థితికి కారణమైంది. ఇప్పుడు రోగి భద్రతే ధ్యేయంగా మేం ఈ నిర్ణయాన్ని తీసుకున్నాం అంటున్నారు సర్జరీ విభాగం హెడ్, ప్రొఫెసర్ డాక్టర్ సంజీవ్ కుమార్ తుడు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో అవసరమైన అన్ని రకాల పరికరాలు అందుబాటులో ఉంటాయని, ప్రభుత్వాసుపత్రుల్లో కూడా అలాంటివి అప్ గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉందని డాక్టర్ తుడు తెలిపారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అధ్యయనం ప్రకారం భారతదేశంలోని దాదాపు 13 శాతం మంది ప్రజలు స్థూలకాయంతో ఇబ్బంది పడుతున్నారు. -
ఆడపిల్ల పుట్టిందని కాపురానికి రావద్దన్న భర్త
హైదరాబాద్ (జగద్గిరిగుట్ట) : ఆడపిల్ల పుట్టిందని భర్త కాపురానికి రావద్దంటున్నాడంటూ ఓ వివాహిత జగద్గిరిగుట్ట పోలీసులకు శనివారం ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళ్తే.. జగద్గిరిగుట్ట వెంకటేశ్వరనగర్‌కు చెందిన మరియాకు 2011లో రవి అనే వ్యక్తితో వివాహం జరిగింది. ఉద్యోగ రీత్యా వీరు కొన్నాళ్ల పాట్లు దక్షిణాఫ్రికాలో ఉండి ఇటీవలే ఇండియాకు వచ్చారు. కాగా మరియా డెలివరీ కోసం తన పుట్టింటికి వెళ్లింది. మూడు నెలల క్రితం మరియా ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఆడపిల్ల ఇష్టం లేని భర్త రవి అప్పటినుంచి ఆమెను దూరంగా ఉంచాడు. దీంతో తనను కాపురానికి రావద్దని చెప్పి పట్టించుకోవడం లేదంటూ మరియ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
రిజర్వాయర్ పనులను అడ్డుకున్న గ్రామస్తులు
పరిహారం ఇస్తేనే పనులు జరగనిస్తాం కలువాయి: కలువాయి, చేజర్ల మండలాల్లోని 7 వేల ఎకరాలకు నీటిని అందించేందుకు చేపట్టిన రిజర్వాయర్ పనులను చవటపల్లి గ్రామస్తులు శనివారం అడ్డుకున్నారు. రాష్ట్రప్రభుత్వం జలయజ్ఞంలో భాగంగా సోమశిల-కండలేరు వరదకాలువ(తెలుగుగంగ) కింద నాలుగు రిజర్వాయర్లు నిర్మించేందుకు రూ.24 కోట్లు మంజూరుచేసింది. కలువాయి మండలం తోపుగుంట, చవటపల్లి, కేశమనేనిపల్లి, చేజర్ల మండలం కండాపురం గ్రామాల్లో వీటిని నిర్మించ తలపెట్టారు. నాలుగు రిజర్వాయర్ల కింద 13,600 ఎకరాల ఆయకట్టు అభివృద్ధి చేయాల్సి ఉంది. అయితే మూడేళ్ల క్రితం పనులు మంజూరైనా ఒక్క రిజర్యాయర్ నిర్మాణం కూడా ఇంతవరకు పూర్తికాలేదు. తోపుగుంట, కండాపురం, కేశమనేనిపల్లి రిజర్వాయర్లు కొంతమేర పనులు చేసి వివిధ కారణాలతో అర్ధంతరంగా నిలిపివేశారు. చవటపల్లి రిజర్యాయర్ వనులు 15 రోజుల క్రితం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో తమ గ్రామానికి చెందిన 600 ఎకరాలు రిజర్వాయర్ నిర్మాణంలో పోతాయని, ఆ పొలాలకు పరిహారం ఇవ్వకుండా పనులు జరుగనీయబోమని గ్రామస్తులు తేల్చిచెప్పారు. 15 రోజుల క్రితం రిజర్వాయర్ నిర్మాణం పనులను కాంట్రాక్టర్ ప్రారంభించారు. అధికారుల పర్యవేక్షణ లేకుండానే పనులు చకచకా సాగుతున్నాయి. విషయం తెలుసుకున్న గ్రామస్తులు శనివారం పనుల జరుగుతున్న ప్రాంతం వద్దకు వెళ్లి తమ పొలాలకు పరిహారం సంగతేమిటని కాంట్రాక్టర్‌ను నిలదీశారు. ఆ విషయం తనకు తెలియదని, అధికారులతో మాట్లాడాలని ఆయన చెప్పడంతో అక్కడ అధికారులు ఎవరూ లేకపోవడాన్ని గమనించి గ్రామస్తులు పనులను అడ్డుకున్నారు. గ్రామస్తులతో పాటు ఎస్సీ, ఎస్టీ కాలనీవాసులు పనులను అడ్డుకుని అధికారులు వచ్చి తమ పొలాలకు పరిహారం విషయం తే ల్చిన తర్వాతే పనులు చేయాలని స్పష్టం చేశారు. మూడేళ్ల క్రితం రిజర్వాయర్ నిర్మాణం కోసం సర్వే చేపట్టిన నాటినుంచి అధికారులు తమ పొలాలకు పరిహారం గురించి పట్టించుకోలేదని, గ్రామంలో రైతులతో సభ కూడా ఏర్పాటు చేయలేదని వారు చెబుతున్నారు. ఈవిషయమై తాము జిల్లా కలెక్టరుకు ఫిర్యాదు చేస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ముందు పరిహారం ఇవ్వాలి గ్రామానికి చెందిన 600 ఎకరాలు రిజర్వాయర్ నిర్మాణంలో పోతున్నాయి. ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన ఆర్డీవో, డీకేటీ పట్టా పొలాలు 400 ఎకరాలు, ఒరిజినల్ పట్టా పొలాలు 200 ఎకరాలు మునిగిపోతున్నాయి. వీటికి పరిహారం చెల్లించి పనులు చేపట్టాలి. - రైతు వెంకట ప్రసాద్ మా కుటుంబాలు వీధిన పడతాయి నాకు ప్రభుత్వం రెండెకరాల సాగు భూమి ఇచ్చింది. అందులో శనగ, మినుము, పెసర, పొగాకు లాంటి మెట్టపైర్లు సాగుచేస్తున్నాం. తమ పొలాలను లాగేసుకుని, పరిహారం కూడా ఇవ్వకుండా రిజర్వాయర్ నిర్మిస్తున్నారు. తమ కుటుంబాలు వీధిన పడకుండా అధికారులు ఆదుకోవాలి. ఇక్కడ అందరూ నాలాంటి పేద రైతులే. -వంగపాటి కృష్ణమ్మ(దళిత మహిళారైతు) -
చికిత్సకు నిరాకరించిన స్వైన్‌ఫ్లూ బాధితురాలు
మహబూబ్‌నగర్: గద్వాల్ పట్టణంలో ఓ మహిళకు స్వైన్‌ఫ్లూ సోకినట్లు మహబూబ్‌నగర్ జిల్లా ఆస్పత్రి వైద్యులు నిర్ధారించారు. సదురు బాధితురాలిని చికిత్స కోసం హైదరాబాద్ వెళ్లమనగా ఆమె నిరాకరించి గద్వాల్‌లోనే ఉంటోంది. అధికారులు శనివారం బాధితురాలి ఇంటికి వెళ్లి చూడగా ఆమె భర్త, కుమారుడు కూడా జ్వరంతో బాధపడుతు కనిపించారు. వారికి కూడా స్వైన్‌ఫ్లూ సోకి ఉండవచ్చేమోనని వైద్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బాధితులను చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. (గద్వాల్) -
చిచ్చురేపుతున్న ఐఐఎం ఏర్పాటు
-
జూలీ సీక్వెల్‌కు నేహ నో
ముంబై: బాలీవుడ్ నటి, మాజీ మిస్ ఇండియా నేహా ధూపియా జూలీ చిత్రం సీక్వెల్లో నటించేందుకు నిరాకరించారు. 2004లో విడుదలైన జూలీ సినిమాలో నేహ గ్లామర్ రోల్లో నటించారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సినిమా సీక్వెల్ ఆఫర్‌ను తిరస్కరించినట్టు నేహా చెప్పారు. పంజాబ్ చిత్రాల్లోనూ నటించిన నేహా ప్రస్తుతం హిందీలో ఓ కమెడీ సినిమాతో పాటు కరణ్ జోహార్ చిత్రంలో నటిస్తున్నారు. -
సుప్రీంలో శ్రీనివాసన్‌కు ఊరట
న్యూఢిల్లీ: బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్‌కు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) పదవి చేపట్టకుండా అడ్డుకోవాలన్న పిటిషన్‌ను వెంటనే విచారించేందుకు నిరాకరించింది. వెంటనే విచారించాల్సిన అవసరం లేదని జస్టిస్ విక్రమ్ జీత్ సేన్ సారథ్యంలోని ధర్మాసనం పేర్కొంది. బీహార్ క్రికెట్ సంఘం దాఖలు చేసిన పిటీషన్‌ను సోమవారం సుప్రీం ధర్మాసనం విచారించింది. ఐపీఎల్ అక్రమాల కేసులో శ్రీనివాసన్ విచారణ ఎదుర్కొంటున్నందున ఆయన ఐసీసీ పదవి చేపట్టకుండా అడ్డుకోవాలని కోరింది. అయితే ఆ సయమం వచ్చినపుడు విచారిస్తామని న్యాయస్థానం పేర్కొంది. -
క్షమాభిక్ష తీర్పును పునఃసమీక్షించం: సుప్రీం
న్యూఢిల్లీ: క్షమాభిక్ష పిటిషన్లపై ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించేది లేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న క్షమాభిక్ష పిటషన్లకు సంబంధించి మరణశిక్షలను జీవిత ఖైదుగా మారుస్తూ ఇటీవల దేశ అత్యున్నత న్యాయస్థానం చరిత్రాత్మక తీర్పును వెలువరించింది. ఉరిశిక్ష పడ్డ 15 మంది ఖైదీలకు శిక్షను జీవిత ఖైదుగా మార్చడాన్ని రద్దు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని సుప్రీం కోర్టు తిరస్కరించింది.