జీవో 28 నిలుపుదలకు హైకోర్టు నో | high court refuse to stay on go 28 | Sakshi
Sakshi News home page

జీవో 28 నిలుపుదలకు హైకోర్టు నో

Published Fri, Apr 22 2016 2:21 AM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM

high court refuse to stay on go 28

సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్ మండల పరిధిలోని మీర్‌పేట, జిల్లెలగూడ, కొత్తపేట, బాలాపూర్, జల్‌పల్లి, పహాడీ షరీఫ్ గ్రామ పంచాయతీలను డీనోటిఫై చేసి మున్సిపాలిటీలుగా మారుస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 28 అమలును నిలిపేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ జీవో అమలును నిలిపేయాలంటూ సరూర్‌నగర్ మండల ప్రజా పరిషత్ సభ్యుడు తీగల విక్రంరెడ్డి దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను కొట్టేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ప్రధాన పిటిషన్‌పై తుది విచారణను వాయిదా వేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement