బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్కు సుప్రీం కోర్టులో ఊరట లభించింది.
న్యూఢిల్లీ: బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్కు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) పదవి చేపట్టకుండా అడ్డుకోవాలన్న పిటిషన్ను వెంటనే విచారించేందుకు నిరాకరించింది. వెంటనే విచారించాల్సిన అవసరం లేదని జస్టిస్ విక్రమ్ జీత్ సేన్ సారథ్యంలోని ధర్మాసనం పేర్కొంది.
బీహార్ క్రికెట్ సంఘం దాఖలు చేసిన పిటీషన్ను సోమవారం సుప్రీం ధర్మాసనం విచారించింది. ఐపీఎల్ అక్రమాల కేసులో శ్రీనివాసన్ విచారణ ఎదుర్కొంటున్నందున ఆయన ఐసీసీ పదవి చేపట్టకుండా అడ్డుకోవాలని కోరింది. అయితే ఆ సయమం వచ్చినపుడు విచారిస్తామని న్యాయస్థానం పేర్కొంది.