srinivasan
-
అల్ట్రాటెక్ చేతికి ఇండియా సిమెంట్స్.. శ్రీనివాసన్ రాజీనామా
సిమెంట్ (cement) రంగ దిగ్గజం అల్ట్రాటెక్ తాజాగా ఇండియా సిమెంట్స్(India cements)లో ప్రమోటర్లకున్న 32.72 శాతం వాటాను సొంతం చేసుకుంది. దీంతో ఎన్.శ్రీనివాసన్ (srinivasan) సహా ఇతర ఇండియా సిమెంట్స్ ప్రమోటర్లు తమ పదవుల నుంచి తప్పుకున్నారు. ఐసీఎల్‌లో 10.13 కోట్ల షేర్ల(32.72 శాతం వాటా)ను ఆదిత్య బిర్లా గ్రూప్ దిగ్గజం అల్ట్రాటెక్ తాజాగా చేజిక్కించుకుంది. దీంతో ఐసీఎల్‌లో ఇప్పటికే 22.77 శాతం వాటా(7.05 కోట్ల షేర్లు) కలిగిన అల్ట్రాటెక్ దీంతో ప్రధాన ప్రమోటర్‌గా అవతరించింది.ఇండియా సిమెంట్స్‌లో వాటాను 55.49 శాతానికి(17.19 కోట్ల షేర్లు) పెంచుకుంది. వెరసి ఈ నెల 24 నుంచి అల్ట్రాటెక్ (UltraTech)కు అనుబంధ సంస్థగా ఐసీఎల్ ఆవిర్భవించింది. ఈ నేపథ్యంలో వైస్‌చైర్మన్, ఎండీ పదవులకు శ్రీనివాసన్ రాజీనామా చేసినట్లు ఐసీఎల్ వెల్లడించింది. అంతేకాకుండా ఆయన భార్య చిత్రా శ్రీనివాసన్, కుమార్తె రూపా గురునాథ్, వీఎం మోహన్ సైతం బోర్డు నుంచి తప్పుకున్నట్లు పేర్కొంది. ఈ బాటలో స్వతంత్ర డైరెక్టర్లు ఎస్.బాలసుబ్రమణ్యన్ ఆదిత్యన్, కృష్ణ శ్రీవాస్తవ, లక్ష్మీ అపర్ణ శ్రీకుమార్, సంధ్యా రాజన్ సైతం బుధవారం(25న) రాజీనామా చేసినట్లు తెలియజేసింది. కొత్త డైరెక్టర్లు కొత్తగా కేసీ జన్వర్, వివేక్ అగర్వాల్, ఈఆర్ రాజ్ నారాయణన్, అశోక్ రామచంద్రన్ డైరెక్టర్లుగా ఐసీఎల్ బోర్డు ఎంపిక చేసింది. స్వతంత్ర డైరెక్టర్లుగా అల్కా భరూచా, వికాస్ బాలియా, సుకన్య క్రిపాలు ఎంపికయ్యారు. ఐసీఎల్‌లో మెజారిటీ వాటా కొనుగోలు(రూ. 7,000 కోట్ల డీల్) ప్రతిపాదనకు కాంపిటీషన్ కమిషన్ గత వారం అల్ట్రాటెక్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతోపాటు ఓపెన్ ఆఫర్ ద్వారా ఐసీఎల్‌లో మరో 26% వాటాను సొంతం చేసుకునేందుకు సైతం అనుమతించింది. ఏం జరిగిందంటే? ఈ ఏడాది జూలై 28న ఐసీఎల్‌లో ప్రమోటర్ల నుంచి 32.72 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు అల్ట్రాటెక్ సిమెంట్ ప్రతిపాదించింది. ఇందుకు రూ. 3,954 కోట్ల డీల్ కుదుర్చుకున్నట్లు అల్ట్రాటెక్ వెల్లడించింది. దీంతో నిబంధనల ప్రకారం ఐసీఎల్ వాటాదారుల నుంచి 26 శాతం వాటా కొనుగోలు(రూ. 3,142 కోట్ల విలువ)కు ఓపెన్ ఆఫర్ సైతం ప్రకటించింది. తద్వారా వేగవంత వృద్ధితోపాటు, తీవ్ర పోటీ నెలకొన్న దక్షిణాది సిమెంట్ మార్కెట్లో విస్తరించేందుకు ప్రణాళికలు అమలు చేసింది. మరోపక్క అంతకుముందే అంటే జూన్‌కల్లా ఐసీఎల్‌లో 23 శాతం వాటాను అల్ట్రాటెక్ సొంతం చేసుకుంది. ఈ బాటలో సుమారు రూ. 1,900 కోట్లు వెచ్చించి రెండు బ్లాక్‌డీల్స్ ద్వారా ఐసీఎల్‌లో డీమార్ట్ రిటైల్ స్టోర్ల దమానీ గ్రూప్‌నకు గల వాటాను చేజిక్కించుకుంది.కన్సాలిడేషన్ బాట..దేశీయంగా సిమెంట్ పరిశ్రమ కన్సాలిడేషన్ బాటలో సాగుతున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ప్రధానంగా కుమార మంగళం బిర్లాకు చెందిన ఆదిత్య బిర్లా గ్రూప్, గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్ పోటీ పడుతున్నాయి. చిన్న సిమెంట్ కంపెనీలను కొనుగోలు చేస్తున్నాయి. ఆదిత్య బిర్లా గ్రూప్ 2026–27కల్లా వార్షికంగా 200 టన్నుల(ఎంటీపీఏ) సామర్థ్యంతో టాప్ ర్యాంకులో నిలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు అదానీ గ్రూప్ 2027–28కల్లా సిమెంట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని 140 ఎంటీపీఏకు పెంచుకునే ప్రణాళికల్లో ఉంది.అల్ట్రాటెక్ ప్రస్తుత సామర్థ్యం 156.66 ఎంటీపీఏగా ఉంది. ఇప్పటికే సంఘీ ఇండస్ట్రీస్, పెన్నా ఇండస్ట్రీస్‌ను సొంతం చేసుకున్న అదానీ సిమెంట్ ఇటీవలే సీకే బిర్లా గ్రూప్ కంపెనీ ఓరియంట్ సిమెంట్‌ను కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఈ ఏడాది(2024–25) 100 ఎంటీపీఏను అందుకోనుంది. ఇదేవిధంగా అల్ట్రాటెక్ కేశోరామ్ ఇండస్ట్రీస్ సిమెంట్ బిజినెస్‌పై దృష్టి పెట్టింది. కొనుగోలు ప్రక్రియను పూర్తి చేసేందుకు నియంత్రణ సంస్థల అనుమతుల కోసం ఎదురు చూస్తోంది. -
Apoorva Srinivasan Wedding: సైలెంట్‌గా పెళ్లి చేసుకున్న టాలీవుడ్ బ్యూటీ (ఫోటోలు)
-
రెక్కల పురుగు కథ ఏమిటో అడుగు
రెక్కల పురుగులన్నీ సీతాకోక చిలుకలు కావు.కాని సీతాకోకచిలుకలన్నీ రెక్కల పురుగులే.హిమాలయప్రాంతాలకు చెందిన మాత్ (రెక్కల పురుగు)లపై తీసిన ‘నాక్టర్న్స్’ డాక్యుమెంటరీ అమెరికాలో జరిగిన ‘సండాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్’లో స్పెషల్ జ్యూరీ అవార్డ్ పొందింది. ఇండియా నుంచి అవార్డ్ గెలిచిన డాక్యుమెంటరీ ఇదొక్కటే. డైరెక్టర్ అనుపమ శ్రీనివాసన్ పరిచయం. అమెరికాలో ప్రతి ఏటా జరిగే సండాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో నామినేషన్ పొందడమే పెద్ద గుర్తింపుగా భావిస్తారు. అవార్డు రావడం ఇంకా పెద్ద గౌరవం. ఈ సంవత్సరం ఉటాలో జనవరి 18–28 తేదీల మధ్య జరిగిన ఈ ఫిల్మ్ ఫెస్టివల్లో మన దేశం నుంచి ‘వరల్డ్ డాక్యుమెంటరీ కాంపిటీషన్’లో ‘నాక్టర్న్స్’లో చోటు సంపాదించడమే కాకుండా ‘స్పెషల్ జ్యూరీ అవార్డ్ ఫర్ క్రాఫ్ట్’ అవార్డు పొందింది. అనిర్ బన్‌దత్తాతో కలిసి అనుపమా శ్రీనివాసన్ దర్శకత్వం వహించిన ఈ డాక్యుమెంటరీ రెక్కల పురుగుల లోకంలో ప్రేక్షకులను విహరింపచేస్తుంది. ఢిల్లీ కృత్రిమత్వం నుంచి ‘నేను, అనిర్ బన్ దత్త ఢిల్లీలో జీవిస్తుంటాము. రోజూ ఒకే రకమైన ట్రాఫిక్, ΄÷ల్యూషన్. ప్రకృతితో మాకు ఏమీ సంబంధం లేదనిపించేది. ఆ సమయంలో మాకు మాన్సీ అనే పర్యావరణ శాస్త్రవేత్త పరిచయం అయ్యింది. హిమాలయాలలో ‘మాత్స్’ (రెక్కల పురుగులు) మీద పరిశోధన చేస్తున్నానని చెప్పింది. వాతావరణ మార్పుల వల్ల వీటికి కలుగుతున్న నష్టం ఏమిటో ఆమె తెలుసుకుంటోంది. ఇది డాక్యుమెంటరీ చేయాల్సిన విషయం అనుకున్నాం. గత కొన్నేళ్లుగా నేను, అనిర్బన్ డాక్యుమెంటరీలు తీస్తున్నాం. మెయిన్‌స్ట్రీమ్ పట్టించుకోని విషయాలను మేం పట్టించుకుంటాం. దీనికి ముందు మేము ఇండో–మయన్మార్ సరిహద్దులోని తోరా అనే పల్లెకు (మణిపూర్‌లో ఉంది) కరెంటు రావడం గురించి డాక్యుమెంటరీ తీశాం. దాని పేరు ‘ఫ్లికరింగ్ లైట్స్’. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్నా కరెంటు లేని పల్లె ఉండటం, దానికి కరెంటు కోసం కొందరు ఎదురు చూడటం, దేశంలోనే ఉన్నా పరాయీకరణ భావన ఎదుర్కొనడం దీనిలో చూపించాం. ఈ డాక్యుమెంటరీకి ఆమ్స్టర్ డ్యామ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో అవార్డు దక్కింది. ఇప్పుడు మాత్స్ గురించి తీసిన ‘నాక్టర్న్స్’కు కూడా సండాన్స్ ఫెస్టివల్లో అవార్డ్ వచ్చింది. ఇందుకు మాకు చాలా సంతోషంగా ఉంది’ అని తెలిపింది అనుపమా శ్రీనివాసన్. కష్టనష్టాలకు ఓర్చి ‘నాక్టర్న్స్ డాక్యుమెంటరీలో రెండే పాత్రలుంటాయి. ఒకటి పర్యావరణ శాస్త్రవేత్త మాన్సీ, రెండు హిమాలయాల స్థానిక బగున్ తెగకు చెందిన బికి అనే గిరిజనుడు. అతని సాయంతో ఆమె రెక్కల పురుగులను అన్వేషణ చేస్తుంటే మేం రికార్డు చేస్తూ వెళ్లాం. సాయంత్రం అయ్యాక మాన్సీ పలచటి తెర కట్టి దాని వెనుక నీలం రంగు బల్బు వెలిగించేది. ఆ తర్వాత కాసేపటికే వేలాది రెక్కల పురుగులు వచ్చి ఆ స్క్రీన్ మీద వాలేవి. వాటి రంగులు, రూపాలు, ఆకారాలు అన్నీ అద్భుతం. అవి తాము మనిషితో కలిసి జీవిస్తున్నామన్నట్టు ఉన్నాయి. మనమే వాటితో కలిసి జీవిస్తున్నాం అన్న ఎరుకలో లేము’ అంటుంది అనుపమా శ్రీనివాసన్. ‘హిమాలయాల్లో షూటింగ్... అదీ అడవుల్లో అంటే చాలా శ్రమ. అక్కడంతా తేమగా ఉంటుంది. ఏ క్షణమైనా వాన పడొచ్చు. అంతేగాక రాత్రి వేళల్లో విపరీతమైన చలి. జలగలు పట్టి పీక్కుతినాలని చూసేవి. కాని ఇన్ని సమస్యల మధ్య ఆ రెక్కల పురుగుల జీవనం, వాటి కదలికలు ఎంతో ఆసక్తి కలిగించేవి. మా డాక్యుమెంటరీకి అవార్డు రావడానికి కారణం మేము ప్రకృతి ధ్వనులను పరిపూర్ణంగా రికార్డు చేశాం. ఆ ధ్వనుల వల్ల అడవిలో ఉంటూ మాత్స్‌ను చూస్తున్న అనుభూతి కలుగుతుంది’ అంది అనుపమా శ్రీనివాసన్. -
ABC: ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ ఛైర్మన్‌గా శ్రీనివాసన్ స్వామి
న్యూస్ పేపర్ల సర్క్యులేషన్‌ను ప్రకటించే ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్, ABCకి కొత్త కార్యవర్గం ఎన్నికయింది. 2023-24 ఏడాదికి గాను ABC ఛైర్మన్‌గా శ్రీనివాసన్ K.స్వామి ఎన్నికయ్యారు. శ్రీనివాసన్ ఎన్నికకు సంబంధించి ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ ఒక అధికారిక ప్రకటన చేసింది. శ్రీనివాసన్ ప్రస్తుతం RK స్వామి హన్స గ్రూప్‌కు ఛైర్మన్‌గా ఉన్నారు. పత్రికా రంగంలో సుదీర్ఘ అనుభవం ఉన్న శ్రీనివాసన్.. వివిధ హోదాల్లో ఎన్నో సేవలందించారు. గతంలో ఏషియన్ ఫెడరేషన్ ఆఫ్ అడ్వర్టైజింగ్ అసొసియేషన్‌కు ఛైర్మన్‌గా, అలాగే ఇంటర్నేషనల్ అడ్వర్టైజింగ్ అసొసియేషన్ ఛైర్మన్‌గా పని చేశారు. మద్రాస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మేనేజ్మెంట్ అసొసియేషన్లోనూ ఆయన సేవలందించారు. అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్ అసొసియేషన్ ఆఫ్ ఇండియా తరపున లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును గతంలో అందుకున్నారు శ్రీనివాసన్. చదవండి: మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టులో నిరాశ 2023-24కు గాను ఎన్నికయిన కార్యవర్గం వివరాలు ► డిప్యూటీ ఛైర్మన్ - రియాద్ మాథ్యూ (చీఫ్ అసొసియేట్ ఎడిటర్, మలయాళ మనోరమా) ►గౌరవ కార్యదర్శి - మోహిత్ జైన్ (ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, బెన్నెట్ కోలెమన్) ►ట్రెజరర్ - విక్రమ్ సకుజా(గ్రూప్ సీఈవో, మాడిసన్ కమ్యూనికేషన్స్) ABCలో అడ్వర్టైజింగ్ ఏజెన్సీ ప్రతినిధులు ►శ్రీనివాసన్ స్వామి, ఛైర్మన్ ►విక్రమ్ సకుజా, ట్రెజరర్ ►ప్రశాంత్ కుమార్, సభ్యులు ►వైశాలి వర్మ, సభ్యులు పబ్లిషర్స్ ప్రతినిధులుగా ►రియాద్ మాథ్యూ, డిప్యూటీ ఛైర్మన్ ►ప్రతాప్ జి.పవార్, సకల్ పేపర్స్ ►శైలేష్ గుప్తా, జాగరన్ ప్రకాషణ్ ►ప్రవీణ్ సోమేశ్వర్, HT మీడియా ►మోహిత్ జైన్, బెన్నెట్ కోలెమన్ ►ధృబ ముఖర్జీ, ABP ►కరణ్ దర్దా, లోక్మత్ ►గిరీష్ అగర్వాల్, DB ఎన్నికయ్యారు కరుణేష్ బజాజ్, ITC, అనిరుద్ధ హల్దార్, శశాంక్ శ్రీవాస్తవ, మారుతీ సుజుకి కార్పోరేట్ ప్రతినిధులుగా ఎన్నికయ్యారు. -
‘పుడమి సాక్షిగా’ క్యాంపెయిన్‌కు ప్రతిష్టాత్మక ఏఎఫ్‌ఏఏ అవార్డు
సాక్షి, హైదరాబాద్: పుడమి సంరక్షణ కోసం సాక్షి మీడియా గ్రూప్ చేస్తోన్న ‘పుడమి సాక్షిగా’క్యాంపెయిన్‌కు అంతర్జాతీయ గౌరవం దక్కింది. అడ్వర్టైజింగ్ ఇండస్ట్రీ ఆఫ్ ఏషియా (ఏఐఏ) ఆధ్వర్యంలోని ఏషియన్ ఫెడరేషన్ ఆఫ్ అడ్వర్టైజింగ్ అసోసియేషన్ (ఏఎఫ్‌ఏఏ).. పుడమి సాక్షిగా కార్యక్రమాన్ని ఈ అవార్డుకు ఎంపిక చేసింది. ‘కార్పొరేట్ సోషల్ క్రూసేడర్ ఆఫ్ ది ఇయర్’సిల్వర్ అవార్డుతో సత్కరించింది. ముంబై వేదికగా జరిగిన ఈ అవార్డుల కార్యక్రమంలో సాక్షి కార్పొరేట్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ రాణి రెడ్డి ఈ అవార్డును అందుకున్నారు. ఏఎఫ్‌ఏఏ చైర్మన్ శ్రీనివాసన్ స్వామి, ఏఐఏ ప్రెసిడెంట్ అవినాష్ పాండే, ఆలివ్ క్రౌన్ చైర్మన్ జనక్ సర్థా ఈ అవార్డును అందజేశారు. పుడమి‘సాక్షి’గా లక్ష్యాలివే.. ప్రతీ ఏటా జనవరి 26న మెగా టాకథాన్‌గా వస్తోన్న పుడమి సాక్షిగా కార్యక్రమం 2020–21లో ప్రారంభమైంది. ఇప్పటివరకు మూడు ఎడిషన్లు పూర్తి చేసుకుంది. పర్యావరణాన్ని కాపాడడం, కాలుష్యం తగ్గించడం, స్వచ్ఛమైన పుడమిని భవిష్యత్ తరాలకు అందించడం.. పుడమి సాక్షిగా లక్ష్యాలు. ప్రాణకోటికి జీవనాధారమైన ధరిత్రి ప్రమాదంలో పడడానికి మనుషులే ప్రధాన కారణం. ఈ భూమి మళ్లీ పునర్వవైభవం దక్కించుకోవాలంటే.. ప్రతి ఒక్కరూ చేయాల్సిన కృషిని పుడమి సాక్షిగా గుర్తు చేస్తోంది. ప్రతి నెలా ఏదో ఒక రూపంలో పుడమి కార్యక్రమాలు చేపడుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో క్షేత్రస్థాయిలో పర్యావరణంపై అవగాహన కల్పించడంతో పాటు ఇందులో ప్రజలను భాగస్వామ్యులను చేస్తోంది. దీంతోపాటు గణతంత్ర దినోత్సవం రోజున సాక్షి టీవీలో దాదాపు 10 గంటలపాటు మెగా టాకథాన్ రూపంలో ప్రసారం చేస్తోంది. పర్యావరణ పరిరక్షణ కోసం పాటు పడుతున్న పెద్దలు, సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు ఇందులో పాల్గొంటున్నారు. తమ అనుభవాలను పంచుకుంటూ సమాజానికి స్పూర్తి కలిగిస్తున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన సమస్త సమాచారం, స్టోరీలు, వీడియోలు https://www.pudamisakshiga.com/ వెబ్ సైట్లో చూడవచ్చు. -
నేను చనిపోయేలోపు మోహన్‌లాల్ బండారం బయటపెడతా: నటుడు
మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు సీనియర్ నటుడు శ్రీనివాసన్. దివంగత నటుడు ప్రేమ్ నజీర్ డైరెక్ట్ చేయాలనుకున్న డ్రీమ్ ప్రాజెక్ట్ సినిమాను మోహన్‌లాల్ తిరస్కరించాడని, కానీ మీడియా ముందు మాత్రం మాట మార్చాడని ఆరోపణలు గుప్పించాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో శ్రీనివాసన్ మాట్లాడుతూ.. 'ప్రేమ్ నజీర్‌కు మోహన్‌లాల్‌తో ఓ సినిమా తీయాలని ఎంతో కోరికగా ఉండేది. కడతనందన్ అంబాడీ సినిమా సెట్లో ప్రేమ్ నాకు ఈ విషయం చెప్పాడు. మరింకే, మోహన్‌లాల్‌కు సూటయ్యేలా మంచి కథ రాసుకోమని సూచించాను. దీంతో ఓ కథ సిద్ధం చేసుకుని మోహన్‌లాల్‌కు వినిపిస్తే అతడు ఏమాత్రం ఆసక్తి చూపించలేదు. తర్వాత నేను ఓసారి నడరాజన్ అనే మధ్యవర్తి ద్వారా కథ వినిపిస్తే ఏకంగా అతడిని తిట్టాడు కూడా! అదే కథ 'సందేశం'గా రిలీజైంది. నిజానికి ఈ సినిమా కోసం ప్రేమ్.. మోహన్‌లాల్‌కు ముందుగానే అడ్వాన్స్ కూడా ఇచ్చాడు. అప్పుడు ఆయన ఎంగేజ్మెంట్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత కొంతకాలానికే ప్రేమ్ కన్నుమూశాడు. అతడు చనిపోయినప్పుడు మాత్రం మోహన్‌లాల్.. ప్రేమ్ సినిమాలో నటించాలనుకున్నాను, కానీ ఇంతలోనే ఇలా జరిగిపోయింది అని కపట మాటలు మాట్లాడాడు. నేను చచ్చేలోపు కచ్చితంగా అతడి నిజస్వరూపాన్ని మొత్తం బయటపెడతా' అని పేర్కొన్నాడు. శ్రీనివాసన్ వ్యాఖ్యలపై ప్రేమ్ నజీర్ తనయుడు షానవాజ్ స్పందిస్తూ.. 'నాన్నగారు మోహన్‌లాల్‌తో సినిమా చేయాలనుకున్న మాట వాస్తవమే! మోహన్‌లాల్ ఎప్పుడూ ప్రియదర్శన్‌ను వెంటేసుకుని స్క్రిప్ట్ డిస్కషన్స్‌కు వస్తుండేవారు. మరి ఆ కథ ఎందుకు పట్టాలెక్కలేదనేది ఎవరికీ తెలియదు. కానీ ఓ విషయం మాత్రం చెప్పగలను.. శ్రీనివాసన్ చెప్పాడంటే కచ్చితంగా అందులో నిజం ఉండే ఉంటుంది. ఆయన మాటలను నమ్మకుండా ఉండలేం' అని చెప్పుకొచ్చాడు. నటుడు ప్రేమ్ నజీర్ -
దేశ ఆర్థిక వ్యవస్థలో ఎన్టీపీసీ పాత్ర కీలకం
సాక్షి, హైదరాబాద్: దేశ ఆర్థిక వ్యవస్థలో ఎన్టీపీసీ పాత్ర కీలకమైనదని ఆ సంస్థ సీజీఎం(ఐటీ) శైలేష్ శ్రీనివాసన్ అన్నారు. 46 ఏళ్ల ప్రస్థానంలో నిరంతర విద్యుత్ సరఫరాతో ఎన్టీపీసీ దేశంలో స్ఫూర్తిదాయక సంస్థగా కొనసాగుతుందన్నారు. సంస్థ సదరన్ రీజియన్ క్వార్టర్స్‌లో ‘ఎన్టీపీసీ రైజింగ్‌డే –2021’ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన శైలేష్ శ్రీనివాసన్ జెండాను ఎగరవేసి మాట్లాడారు. కరోనా విజృంభించిన సమయంలోనూ సంస్థ మంచి పనితీరును కనబరించిందని కితాబిచ్చారు. దక్షిణ ప్రాంతంలోని ఎన్టీపీసీ పవర్ ప్లాంట్ల పనితీరు పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ ఎన్టీపీసీ ప్రాజెక్టు, సోలార్ పీవీ ప్రాజెక్టుల పురోగతిని వివరించారు. అనం తరం ‘హిందీ పక్వాడా’, ‘విజిలెన్స్ అవేర్నెస్ వీక్’ సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీ ల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఎన్టీపీసీ జీఎం మణికాంత్ పాల్గొన్నారు. -
ఈ నత్త గుళ్లల వయసు ఆరున్నర కోట్ల ఏళ్లు..
సాక్షి, హైదరాబాద్: ఈ చిత్రంలోని నత్తగుళ్లల వయసు ఎంతో తెలుసా..? ఏకంగా ఆరున్నర కోట్ల సంవత్సరాలు. ఆసిఫాబాద్ జిల్లా గిన్నెధారి అటవీ రేంజ్ పరిధిలోని గోయెనా గుట్టల మీద ఈ నత్తగుల్లల శిలాజాలను గుర్తించారు. ‘పబ్లిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ హిస్టరీ, ఆర్కియాలజీ అండ్ హెరిటేజ్ (ప్రిహా)’ప్రధాన కార్యదర్శి ఎంఏ శ్రీనివాసన్, ఫారెస్టు రేంజ్ అధికారి, ప్రిహా సభ్యుడు టి.ప్రణయ్, సిబ్బంది తాజాగా వీటిని గుర్తించారు. గతం లో ఈ ప్రాంతంలో మంచినీటి సరస్సు ఉండేదని, భూమి పొరల నుంచి లావా ఉబికి ఆ సరస్సు ప్రాం తాన్ని కమ్మివేయటంతో అందులోని జీవరాశులు ఇలా శిలాజాలుగా మారి ఉంటాయని శ్రీనివాసన్ అభిప్రాయపడ్డారు. 30 ఏళ్ల తర్వాత.. సంగారెడ్డి జిల్లా తేర్పోల్ శివారులో 30 ఏళ్ల కిందట జియాలజిస్టు అయ్యస్వామి పరిశోధించి ఈ తరహా నత్త శిలాజాలను గుర్తించారు. దీంతో వాటిని ఆ గ్రామం పేరుతో ‘పైజా తిర్పోలెన్సిస్’ అని నామకరణం చేశారు. ఇప్పుడు తాజాగా వెలుగు చూసిన నత్త శిలాజాలు కూడా అదే ప్రజాతికి చెందినవని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా విశ్రాంత డిప్యూటీ డైరెక్టర్ జనరల్ చకిలం వేణుగోపాలరావు నిర్ధారించినట్టు శ్రీనివాసన్ తెలిపారు. ఈ 3దశాబ్దాల కాలంలో ఇప్పటివరకు స్థానికంగా మరెక్కడా నత్త శిలాజాలు వెలుగు చూడలేదని పేర్కొన్నారు. అప్పుడు ఎడమ.. ఇప్పుడు కుడి.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నత్తగుళ్లలు కుడివైపు తెరుచుకుని కన్పిస్తుంటాయి. అరుదుగా మాత్రమే ఎడమవైపు తెరుచుకుంటాయి. ఈ శిలాజాల్లో మాత్రం ఎడమవైపు తెరుచుకుని ఉన్నాయి. ఈ ప్రాంతంలో వేల సంఖ్యలో నత్త శిలాజాలుండటం విశేషం. ఒకే రాతి ముక్కలో 18 నత్తగుళ్లలు ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. దీని ఆధారంగా ఇది సరస్సు ఉండే ప్రాంతమే అయి ఉంటుందని భావిస్తున్నారు. ఇటీవల ఇదే ప్రాంతంలో పొడవైన సున్నపురాతి గుహలను కూడా గుర్తించారు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గతంలో ఇక్కడ పరిశోధనలు చేసి ఎన్నో శిలాజాలను గుర్తించింది. వెరసి ఈ ప్రాంతాన్ని ఫాజిల్(శిలాజ) పార్కుగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని, దీనివల్ల శిలాజాల చరిత్రను భావితరాలు తెలుసుకునేందుకు అవకా శం చిక్కుతుందని శ్రీనివాసన్ పేర్కొన్నారు. ఆసిఫాబాద్ జిల్లా అటవీశాఖ అధికారి శాంతారం, ఎస్డీవో దినేశ్ ప్రోత్సాహంతో ఈ శిలాజాలను గుర్తించినట్టు అటవీ శాఖ అధికారి ప్రణయ్ పేర్కొన్నారు. -
యువకుడి హత్య; లొంగిపోయిన ప్రియురాలు
సాక్షి, చెన్నై : భువనగిరి సమీపంలో యువకుడిని హత్య చేసిన ప్రియురాలితో పాటు ఆమె తల్లిని పోలీసులు గురువారం అరెస్టు చేశారు. కడలూర్ జిల్లా భువనగిరి సమీపంలోని కీరప్పాలయమ్‌కు చెందిన రామలింగమ్ కుమారుడు శ్రీనివాసన్ (23) ఎమ్మెస్సీ పూర్తి చేశాడు. ఈ నెల 24న ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో ఆవేదన చెందిన శ్రీనివాసన్ తల్లిదండ్రులు... బంధువులు, స్నేహితుల ఇళ్లలో గాలించినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో కీరప్పాలయమ్ జేజేనగర్లో ముళ్లపొదరులో రక్త గాయాలతో శ్రీనివాసన్ శవంగా కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో కీరప్పాలయానికి చెందిన కుమార్ భార్య తామరైసెల్వి (26), ఆమె తల్లి లక్ష్మి (45) గురువారం కీప్పాలయమ్ గ్రామ నిర్వాహక అధికారి ముత్తులక్ష్మి వద్ద లొంగిపోయారు. తామే శ్రీనివాసన్ని హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. వారిని భువనగిరి పోలీసులకు అప్పగించారు. పోలీసుల విచారణలో తామరైసెల్వి మాట్లాడుతూ.. తన భర్త కుమార్ విదేశంలో పని చేస్తున్నాడని..ఈ క్రమంలో తనకు శ్రీనివాసన్‌తో వివాహేతర సంబంధం ఏర్పడిందని తెలిపింది. తరచు తన ఇంటికి వచ్చి వెళుతుండేవాడని.. విషయం తెలుసుకున్న తన భర్త కుమార్ తనను మందలించాడని పేర్కొంది. దీంతో శ్రీనివాస్‌ను ఇంటికి రావద్దని హెచ్చరించానని.. అయినా ఇతను ఇంటికి వచ్చేవాడని తెలిపింది. సంఘటన జరిగిన రోజు రాత్రి ఇంటికి వచ్చిన శ్రీనివాసన్‌కి తనకు మధ్య గొడవ జరిగిందని..ఆవేశంలో తల్లి లక్ష్మితో కలిసి శ్రీనివాసన్ని కొట్టి హత్య చేశామని ఒప్పుకుంది. మృతదేహాన్ని ముళ్లపొదలో విసిరేశామని చెప్పింది. -
అనర్హత ఎమ్మెల్యేలపై మంత్రి సంచలన వ్యాఖ్యలు
సంచలన వ్యాఖ్యలు, విమర్శలకు కేంద్రబిందువైన రాష్ట్ర అటవీశాఖ మంత్రి దిండుగల్లు శ్రీనివాసన్ మరోసారి మాటల బాంబు పేల్చారు. ఈసారి ఏకంగా దివంగత ముఖ్యమంత్రి జయలలితపైనే విసిరారు. కోట్లు కొల్లగట్టిన జయలలిత ధనం దినకరన్ ద్వారా పొంది ఎమ్మెల్యేలుగా గెలుపొందారని అనర్హత వేటుపడిన 18 మంది ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించి కలకలం రేపారు. సాక్షి ప్రతినిధి, చెన్నై: దిండుగల్లులో సోమవారం రాత్రి జరిగిన కావేరి నదీ జలాల పోరాట విజయోత్సవ సభలో ఆయన ప్రసంగించారు. దినకరన్ వర్గానికి చెందిన 18 మంది ఎమ్మెల్యేల అనర్హతవేటు కేసును విచారించిన ఇరువురు న్యాయమూర్తుల్లో చెల్లుతుందని ఒకరు, చెల్లదని ఒకరు తీర్పు చెప్పారు. కేసు మూడో న్యాయమూర్తి వద్దకు వెళ్లింది. మూడో న్యాయమూర్తి సైతం వేటును సమర్థ్దిస్తే సుప్రీం కోర్టులో అప్పీలు చేసుకోవచ్చు. ఆ తరువాత ఫుల్‌బెంచ్‌కు మొరపెట్టుకోవచ్చు. ఈలోగా నాలుగైదు ఏళ్లు గడిచిపోతాయి. చివరి నిమిషంలో అప్పీలు పిటిషన్‌ను వెనక్కుతీసుకుంటామని వేటుపడిన ఎమ్మెల్యేల్లో ఒకరైన తంగతమిళ్‌సెల్వన్ ప్రకటిస్తారు. అంటే స్పీకర్ తీసుకున్న నిర్ణయం సరైనదనే కదా. జయలలిత మరణం తరువాత పార్టీని రెండుగా చీల్చిన దినకరన్ వెంట 18 మంది ఎమ్మెల్యేలు నడవడం ద్రోహం. జయ వల్ల పార్టీ నుంచి తొలగించబడిన ద్రోహి దినకరన్. జయలలిత తన స్వేదం, రక్తాన్ని చిందించి, ఎంతోధనం ఖర్చుపెట్టి ఎమ్మెల్యేలందరినీ గెలిపించింది. ఈ 18 మంది ఎమ్మెల్యేలు వెళ్లిపోయినంత మాత్రాన పార్టీ నాశనం కాదు. వివాదాస్పద వ్యాఖ్యలు: జయలలిత చలువతో కోట్లు గడించిన దినకరన్ నుంచి భారీస్థాయిలో ఆర్థిక లబ్ధి పొంది ఎన్నికల్లో గెలుపొందిన 18 మంది ఎమ్మెల్యేలు తమ సొంత పార్టీ ప్రభుత్వాన్నే కూలదోసేందుకు కుట్రపన్నుతున్నారు. వేటు పుణ్యమాన్ని మైసూరు, అమెరికాల్లో విహారయాత్ర చేçస్తుంటే చూస్తూ ఊరుకోలేమని ఆయన అన్నారు. జయలలితను అడ్డుపెట్టుకుని దినకరన్ కోట్లు గడించాడని దిండుగల్లు చేసిన విమర్శలతో వేదికపై ఉన్న నేతలు హడలిపోయారు. అమ్మ అభిమానుల్లో కంగారుపుట్టించాయి. అన్నాడీఎంకే మంత్రుల్లో అమ్మ గురించి ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు ఎవ్వరూ చేయలేదు. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం దిండుగల్లుకు కొత్తేమీ కాదు. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా జయలలిత ఇడ్లీ, చట్నీ తిన్నట్లుగా అప్పట్లో మేము చెప్పిన మాటలు అన్నీ అబద్దాలని గతంలో వ్యాఖ్యానించారు. అలాగే, డబ్బు లేకుండా ఎన్నికల్లో ఏమీ చేయలేమని మరోసారి అన్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం భారత ప్రధాని మన్మోహన్సింగ్ను కలిసి డెంగీ నివారణ చర్యలపై చర్చలు జరిపారని ఒక సందర్భంలో దిండుగల్లు మాట్లాడటంతో ప్రధాని ఎవరో కూడా ఈ మంత్రికి తెలియదని సామాజిక మాధ్యమాల్లో చలోక్తులు విసిరారు. దీంతో బహిరంగసభల్లో దిండుగల్లు ప్రసంగించకుండా పార్టీ దూరం పెట్టింది. అయితే కొంత విరామం తరువాత సోమవారం రాత్రి వేదికనెక్కిన దిండుగల్లు మరోసారి దివంగత జయలలితపై అక్రమార్జన మాటల బాంబును విసిరారు. వివాదాస్పదమైన మంత్రి దిండుగల్లు మాటలపై అన్నాడీఎంకే నేతలు లోలోన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నా బహిరంగంగా ఎవ్వరూ ఖండించలేదు. -
పోయి దొరికిన ప్రాణం
చెన్నై సామియర్స్ రోడ్డులో నివాసం ఉంటున్న 81 ఏళ్ల శాంతా శ్రీనివాసన్ 2015 వరదల్లో తన సర్వస్వం కోల్పోయారు. అందుకు ఆమె పెద్దగా బాధపడలేదు కానీ, దశాబ్దాలుగా ఆమె సేకరించుకుంటూ వస్తున్న అరుదైన తపాలా బిళ్లలు కూడా పోగొట్టుకున్న ఆ ‘సర్వస్వం’లో ఉండటం ఆమెను ఎంతో మనోవేదనకు గురిచే సింది. అలాగని ఆమె చింతిస్తూ కూర్చోలేదు. మూడేళ్లపాటు నిర్విరామంగా కష్టపడి, తిరిగి తన స్టాంపుల సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. ఇప్పుడా తపాలా బిళ్లల్ని అన్నా రోడ్డులోని ప్రధాన తపాలా కార్యాలయంలో ఉన్న ‘ఫిలాటñ లిక్ బ్యూరో’ ప్రదర్శనకు పెట్టింది. వాటిల్లో లైంగిక సమానత్వం, వర్కింగ్ ఉమన్ ప్రధానాంశాలుగా ఉన్న స్టాంపులు కూడా ప్రత్యేక విభాగంగా ఉన్నాయి. 1940లలో పాఠశాల విద్యార్థినిగా ఉన్నప్పటి నుంచి శాంత తపాలా బిళ్లల్ని సేకరిస్తున్నారు. ఈ అద్భుతమైన ‘ఫిలాటలీ’ ప్రపంచాన్ని (స్టాంపుల సేకరణ, అధ్యయనం) చిత్తూరులో ఉండే ఆమె కజిన్ ఆమెకు మొదట పరిచయం చేశారు. అక్కడి నుంచి ఆమెకు ‘ఫస్ట్ డే కవర్స్’, కొత్తగా విడుదలైన స్టాంపులను ఆ కజిన్ పంపించేవారు. (అధికారికంగా విడుదలైన వెంటనే ఆ స్టాంపులతో బట్వాడా అయ్యే కవర్లను ఫస్ట్ డే కవర్స్ అంటారు). విదేశాలకు వెళ్లినప్పుడు కూడా అక్కడి నుంచి ప్రత్యేకంగా పోస్టల్ స్టాంపులను సేకరించి తెచ్చుకునేవారు శాంత. శాంత భర్త శ్రీనివాసన్ ఇండియన్ ఆర్మీలో పనిచేసేవారు. అలా కూడా సెంట్రల్ ఆర్మీ పోస్ట్ ఆఫీస్ నుంచి అరుదైన స్టాంపులు అమెకు అందేవి. అలాగే కొన్ని స్టాంపుల్ని తోటి ఫిలాటలిస్టుల నుంచి ఆమె ఇచ్చిపుచ్చుకునేవారు. 1857కు పూర్వపు స్వాతంత్య్ర సమరయోధులైన రాణీ వేలు నచియార్, రాణీ అవంతీబాయి, సంగీత విద్వన్మణులు వీణా ధనమ్మాళ్, డి.కె.పట్టమ్మాళ్, ఎం.ఎస్. సుబ్బులక్ష్మి.. ఇంకా అనేక రంగాలలోని సుప్రసిద్ధులపై వచ్చిన తపాలా బిళ్లలు శాంత కలెక్షన్లో ఉన్నాయి. ‘‘స్టాంపులపై శాంతా శ్రీనివాసన్‌కు ఉన్న ఆసక్తిని, ఆమెలోని తపనను చూశాక ఆమె కలెక్షన్‌కు చోటు కల్పించాలని నిర్ణయించుకున్నాం. తమిళనాడులోని తపాలాశాఖలలో డిపాజిట్ అకౌంట్లు ఉన్న ఖాతాదారులలో శాంతమ్మలా దాదాపు 12 వేల మంది స్టాంపుల సేకరణ హాబీ ఉన్నవారు ఉన్నారు’’ అని చెన్నై సిటీ రీజియన్ పోస్ట్‌మాస్టర్ జనరల్ ఆర్.ఆనంద్.. శాంతను అభినందిస్తూ చెప్పారు. -
వెంగ్‌సర్కార్ చెప్పింది అబద్ధం
చెన్నై : ‘విరాట్ కోహ్లిని 2008లో టీమిండియాకు ఎంపిక చేయడాన్ని నేను ఇష్టపడలేదని మాజీ చీఫ్ సెలెక్టర్ వెంగ్‌సర్కార్ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదు. అసలు అతడు ఎవరి తరఫున, ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు? ఇదంతా అబద్ధం’ అని బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్ శుక్రవారం ఖండించారు. శ్రీనివాసన్ బీసీసీఐ కోశాధికారిగా ఉన్న సమయంలో బద్రీనాథ్‌ను తీసుకోవాలని పట్టుబట్టినా తాను వినకపోవడంతో చీఫ్ సెలెక్టర్ పదవిని కోల్పోయానని బుధవారం వెంగ్‌సర్కార్ వ్యాఖ్యానించాడు. దీనిపై శ్రీనివాసన్ స్పందించారు. ‘ఒక క్రికెటర్ ఈ రకంగా మాట్లాడటం మంచిది కాదు. వెంగ్‌సర్కార్‌ను ముందుగానే తప్పించామనడం తప్పు. ఈ విషయాన్ని ఇప్పుడు ప్రస్తావించడంలో అర్థం లేదు. జట్టు ఎంపికలో నేను జోక్యం చేసుకునేవాడిని కాదు. అతడు చెప్పిన ఇద్దరు ఆటగాళ్లు (కోహ్లి, బద్రీనాథ్) 2008 శ్రీలంక సిరీస్‌లో ఆడారన్న విషయం గుర్తుంచుకోవాలి. 2008లో కొత్త కమిటీలు ఏర్పాటు చేయాల్సిన తరుణంలో బోర్డు సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ముంబై క్రికెట్ సంఘం ఉపాధ్యక్షుడిగా వెళ్లేందుకే వెంగ్‌సర్కార్ మొగ్గుచూపాడు. అందుకే సెలెక్షన్ కమిటీలో చోటుకు పరిగణనలోని తీసుకోలేదు. వివాదం సృష్టించేందుకే ఇలా మాట్లాడినట్లున్నాడు. ఇదంతా నిరాధారం’ అని శ్రీనివాసన్ వివరించారు. ‘అతడితో నాకు శత్రుత్వం ఏమీ లేదు. నా చొరవ కారణంగా ప్రోత్సాహకాలు దక్కిన మాజీ క్రికెటర్లలో వెంగ్‌సర్కార్ ఒకడు. 1994లో వెంగీ బెనిఫిట్ మ్యాచ్ కోసం ఇండియా సిమెంట్స్ లక్ష రూపాయలు ఇచ్చింది. అతను ఆడిన దాదర్ క్లబ్లో సౌకర్యాలు మెరుగుపర్చేందుకు మేం పెద్ద మొత్తంలో డబ్బులు ఇవ్వడం నాకు బాగా గుర్తుంది. క్రికెటర్‌గా కల్నల్ అంటే గౌరవం ఉంది. అతడిని మేం ఒక జాతీయ హీరోగా చూశాం. ఇలా మాట్లాడటం దురదృష్టకరం’ అని శ్రీనివాసన్ స్పందించారు. -
'ఇంద్రసేన' మూవీ రివ్యూ
టైటిల్ : ఇంద్రసేన జానర్ : ఫ్యామిలీ యాక్షన్ డ్రామా తారాగణం : విజయ్ ఆంటోని, డయానా చంపికా, మహిమా, జ్యువెల్ మేరి, రాధా రవి, సంగీతం : విజయ్ ఆంటోని దర్శకత్వం : జి. శ్రీనివాసన్ నిర్మాత : రాధికా శరత్ కుమార్, ఫాతిమా విజయ్ ఆంటోని బిచ్చగాడు సినిమాతో తెలుగు నాట సంచలన విజయం సాధించిన విజయ్ ఆంటోని ఆ తరువాత విడుదలైన సినిమాలతో ఆ స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. దీంతో మరోసారి తనకు స్టార్ ఇమేజ్ తెచ్చిపెట్టిన సెంటిమెంట్ నే నమ్ముకొని ఇంద్రసేన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి మరోసారి విజయ్ ఆంటోని మ్యాజిక్ రిపీట్ అయ్యిందా,,.? అమ్మ సెంటిమెంట్ లాగే తమ్ముడు సెంటిమెంట్ కూడా సక్సెస్ సాధించిందా..? కథ : ఇంద్ర సేన (విజయ్ ఆంటోని) తను ప్రేమించిన అమ్మాయి తన కళ్లముందే ప్రమాదంలో చనిపోవటంతో తాగుబోతుగా మారిపోతాడు. ఎప్పుడు తను ప్రేమించిన అమ్మాయి సమాధి మీదే పడుకొని తాగుతూ ఉంటాడు. పెళ్లి చేస్తే బాగుపడతాడని తల్లిదండ్రులు ప్రయత్నించినా.. తాగుబోతు అన్న ముద్ర పడటంతో ఎవరు అమ్మాయిని ఇచ్చేందుకు ఒప్పకోరు. అదేసమయంలో అచ్చు ఇంద్రసేనలా ఉండే అతని తమ్ముడు రుద్రసేనకు పెళ్లి కుదురుతుంది. (సాక్షి రివ్యూస్) కానీ ఇంద్రసేన చేసిన ఓ చిన్నపోరపాటు వాళ్ల జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది. హ్యతకేసులో ఇంద్రసేనకు ఏడేళ్ల జైలు శిక్ష పడుతుంది. రుద్రసేన ఉద్యోగం పోగొట్టుకుంటాడు.. పెళ్లి ఆగిపోతుంది. వాళ్ల వ్యాపారాలను కూడా కోల్పోవాల్సి వస్తుంది. ఏడేళ్ల తరువాత ఇంద్రసేన జైలు నుంచి బయటకు వచ్చేసరికి పరిస్థితులన్ని మారిపోతాయి. రుద్రసేన రౌడీగా మారతాడు. తన వల్లే తన కుటుంబం ఇలా ఇబ్బందుల్లో పడిందని భావించిన ఇంద్రసేన ఎలాగైన తమ్ముడికి తిరిగి మామూలు జీవితం ఇవ్వాలని నిర్ణయించుకుంటాడు. అందుకోసం ఇంద్రసేన ఏం చేశాడు..? అన్నదే మిగతా కథ. విశ్లేషణ : బిచ్చగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన విజయ్ ఆంటోని, ఇంద్రసేనగా మరోసారి ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ద్విపాత్రాభినయం చేసిన విజయ్, లుక్ విషయంలో వేరియేషన్ చూపించినా.. నటన పరంగా రెండు క్యారెక్టర్లలో పెద్దగా వేరియేషన్ ఏమీ లేదు. హీరోయిన్ల పాత్రలకు అంతగా ఇంపార్టెన్స్ లేకపోవటం, వారు తెలుగు ప్రేక్షకులకు పరిచయం ఉన్న తారలు కూడా కాకపోవటంతో పెద్దగా కనెక్ట్ కాలేరు. రాధ రవిలాంటి ఒకరిద్దరు నటులు తప్ప తెలుగు ఆడియన్స్ గుర్తు పట్టగలిగే వారు లేకపోవటంతో డబ్బింగ్ సినిమ ఆచూస్తున్నామన్న భావనే కలుగుతుంది. తన ప్రతీ సినిమాను డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కించే విజయ్ ఈ సినిమా విషయంలో కూడా అదే ఫాలో అయ్యాడు. అన్నదమ్ముల కథను ఆకట్టుకునే కథనంతో తెరకెక్కించే ప్రయత్నం చేశారు. (సాక్షి రివ్యూస్)దర్శకుడు శ్రీనివాసన్ సినిమాను పూర్తిగా తమిళ ప్రేక్షకులను దృష్టిలోపెట్టుకొని తెరకెక్కించినట్టుగా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ కాస్త నెమ్మదిగా సాగినా.. సెకండ్ హాఫ్ యాక్షన్ మోడ్ లో సాగటం ఆకట్టుకుంటుంది. అయితే ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ లో వచ్చే ఎమోషనల్ సీన్స్ తెలుగు ఆడియన్స్ ను ఏ మేరకు ఆకట్టుకుంటాయన్న దాని మీదే సినిమా విజయం ఆదారపడి ఉంటుంది. ప్లస్ పాయింట్స్ : ఎమోషనల్ సీన్స్ సినిమా నిడివి మైనస్ పాయింట్స్ : తమిళ నేటివిటి - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్ -
మరో నటుడిని ఊహించలేం
సాక్షి సినిమా: అన్నాదురై చిత్రంలో కథానాయకుడిగా విజయ్‌ఆంటోనిని మినహా వేరొకరిని ఊహించలేమని అంటున్నారు ఆ చిత్ర దర్శకుడు శ్రీనివాసన్. విజయ్‌ఆంటోని హీరోగా నటించిన తాజా చిత్రం అన్నాదురై. నటి రాధికాశరత్‌కుమార్ ఆర్.స్టూడియోస్, ఫాతిమా విజయ్‌ఆంటోని ఫిలిం కార్పోరేషన్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం అన్నాదురై. డయానాచంపిక, మహిమ హీరోయిన్లుగా నటించిన ఇందులో రాధారవి, కాళీవెంకట్, నళినికాంత్ ముఖ్యపాత్రలను పోషించారు. విజయ్అంటోని సంగీతం అందించిన ఈ చిత్రం ఈ నెల 30న విడుదలకు ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు శ్రీనివాసన్ మాట్లాడుతూ చాలా ఆసక్తిగా, కొంచెం అలజడిగానూ ఉందన్నారు. ఇలాంటి అనుభూతి కోసం చాలాకాలంగా ఎదురు చూస్తున్నానని చెప్పారు. ఒక దర్శకుడికి ప్రముఖ కథానాయకుడు, అనుభవజ్ఞులైన నటీనటులు, ప్రతిభావంతులైన సాంకేంతిక వర్గం లభిస్తే ఆది చిత్రానికి బలం అవుతుందన్నారు. ఇందులో విజయ్‌ఆంటోని పవర్ఫుల్ నటన అదనపు ఆకర్షణగా నిలుస్తుందని పేర్కొన్నారు. తాను దర్శకుడు వసంతబాలన్ వద్ద క్లాస్, సుశీంద్రన్ వద్ద కమర్షియల్‌ను, భూపతిపాండియన్ వద్ద హ్యూమరస్, ఎళిల్ వద్ద ప్రణాళిక ప్రకారం చిత్రాన్ని ఎలా పూర్తి చేయాలన్న విషయాలను నేర్చుకున్నానని తెలిపారు. అన్నాదురై చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం కావడం గర్వంగా ఫీలౌతున్నానని శ్రీనివాసన్ పేర్కొన్నారు. -
‘పవర్‌స్టార్’ అరెస్ట్‌కు కోర్టు ఉత్తర్వులు
చెన్నై : నటుడు పవర్‌స్టార్ శ్రీనివాసన్‌ను అరెస్ట్ చేసి హాజరుపరచాల్సిందిగా దురైయూర్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. వివరాల్లోకి వెళ్లితే నటుడు పవర్‌స్టార్ శ్రీనివాసన్‌పై పలు మోసపు కేసులు నమోదయిన విషయం తెలిసిందే. పలు మార్లు అతన్ని పోలీసులు అరెస్ట్ చేసి జైలులో పెట్టారు. కాగా తిరుచ్చి జిల్లా, దురైయూర్కు చెందిన వరదరాజన్ అనే వ్యక్తికి పవర్‌స్టార్ శ్రీనివాసన్ ఒక ఫైనాన్స్ సంస్థ నుంచి కోట్ల రూపాయలు రుణం ఇప్పిస్తానని చెప్పి కమీషన్‌గా అతని వద్ద రూ.30 లక్షలు తీసుకున్నాడు. అయితే ఆ తరువాత వరదరాజన్‌కు శ్రీనివాసన్ ఎలాంటి రుణం ఇప్పించలేదు. దీంతో వరదరాజన్ తాను ఇచ్చిన రూ.30 లక్షలు తిరిగి ఇవ్వవలసిందిగా అడగడంతో రెండేళ్ల క్రితం అతనికి శ్రీనివాసన్ చెక్కు ఇచ్చాడు. అది బ్యాంక్‌లో బౌన్స్ అవ్వడంతో తాను మోసపోయానని భావించిన వరదరాజన్ దురైయూర్ నేర విభాగ శాఖ కోర్టులో శ్రీనివాసన్‌పై పిటిషన్ దాఖలు చేశాడు. ఈ కేసు పలు సార్లు విచారణకు వచ్చినా శ్రీనివాసన్ కోర్టుకు హాజరు కాలేదు. మరోసారి గురువారం న్యాయమూర్తి వడివేలు సమక్షంలో విచారణకు వచ్చింది. మళ్లీ శ్రీనివాసన్ కోర్టుకు హాజరు కాకపోవడంతో న్యాయమూర్తి... శ్రీనివాసన్‌ను అరెస్ట్ చేసి కోర్టుకు హాజరు పరచాల్సిందిగా పోలీసులకు ఉత్తర్వులు జారీ చేశారు. -
నటి భువనేశ్వరి కొడుకుపై మరో కేసు
పెరంబూరు: నటి భువనేశ్వరి కొడుకుపై కేలంబాక్కం పోలీస్‌స్టేషన్‌లో కొత్తగా మరో కేసు నమోదైంది. నటి భువనేశ్వరి కొడుకు మిథున్ శ్రీనివాసన్ లా చదువుతున్నాడు. ఇతను స్థానిక తిరుమంగళంకు చెందిన వైద్య విద్యార్థిని అనుగ్రహను పెళ్లి చేసుకోమని వేధించిన చేసిన కేసులో ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు తిరుమంగళం పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో పరారీలో ఉన్న మిథున్ శ్రీనివాసన్‌ను రెండు రోజుల క్రితం పోలీసులు అరెస్ట్ చేసి పుళల్ జైలులో ఉంచారు. అనుగ్రహపై హత్యా బెదిరింపులకు పాల్పడినందుకు గానూ మిథున్ శ్రీనివాసన్‌పై గురువారం కేలంబాక్కం పోలీస్‌స్టేషన్‌లో మహిళా చిత్రహింస చట్టం కింద మరో కేసును నమోదైంది. -
‘పవర్‌స్టార్’పై మరో కేసు నమోదు
చెన్నై : నటుడు పవర్‌స్టార్ శ్రీనివాసన్‌పై వణ్ణార్పేట పోలీస్‌స్టేషన్‌లో మరో మోసం కేసు నమోదయ్యింది. స్థానిక అన్నానగర్‌కు చెందిన శ్రీనివాసన్‌పై ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి. జైలు జీవితం అనుభవించి బెయిల్‌పై వచ్చిన శ్రీనివాసన్ స్వతహాగా వైద్యుడు. అయితే నటనతో పవర్‌స్టార్‌గా ప్రాచుర్యం పొందాడు. అంతే స్థాయిలో మోసం కేసుల్లోనూ పాపులర్ అయ్యాడు. వడ్డీకి డబ్బు ఇప్పిస్తానని, సినిమాల్లో అవకాశాలు కల్పిస్తానని చెప్పి మోసానికి పాల్పడినట్లు శ్రీనివాసన్‌పై చెన్నై నేరపరిశోధన శాఖావిభాగంలో, కీల్పాక్కం, అన్నానగర్ పోలీస్స్టేషన్లలో పలు కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా రూ.వెయ్యి కోట్ల రుణం ఇప్పిస్తానని ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త వద్ద కమీషన్‌గా రూ.100 కోట్లు తీసుకుని మోసం చేసిన కేసులో ఢిల్లీ పోలీసులు శ్రీనివాసన్‌ను ఈ మధ్యే అరెస్ట్ చేశారు. ఆ కేసులో బెయిల్ పొందిన శ్రీనివాసన్‌పై తాజాగా పుదు వణ్ణైయార్పేటకు చెందిన ముత్తు కుమారుడు దయానిధి(32) వణ్నైయార్పేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. శ్రీనివాసన్ తనకు సినిమా అవకాశాలను కల్పిస్తానని చెప్పి 2015 సెప్టెంబరులో రూ.4.15లక్షలు తీసుకున్నాడని, అప్పటి నుంచి ఒక్క సినిమా అవకాశం కూడా కల్పించలేదని అతడు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. డబ్బు తిరిగి ఇవ్వాలని అడగ్గా..‘నువ్వు నాకెప్పుడు ఇచ్చావంటూ’ బెదిరిస్తున్నాడని వాపోయాడు. తన డబ్బు తిరిగి ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరాడు. కేసు నమోదు చేసుకున్న వణ్ణైయార్‌పేట పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
హాస్యనటులతో సంఘవి
తమిళసినిమా: హాస్య నటులు పవర్‌స్టార్ శ్రీనివాసన్, గంజాకరుప్పు, యోగిబాబుతో నటి సంఘవి ఒక చిత్రంలో నటించనున్నారు. వీరితో పాటు రోషన్, హర్షిత, మెర్కురి సత్య, కేపీ.శంకర్, జీవిత, స్నేహన్రాజా, కేపీ.సెంథిల్‌కుమార్, బోండామణి, త్రిలోక్, వి.రాజా, ఆర్.స్టాలిన్, కింగ్‌కాంగ్, రణాదేవి, ఎంఆర్జీ.రాజేశ్వరి, మయిలైదేవి, వీరమణి, కాదల్ హుస్సేన్ ముఖ్య పాత్రలు ధరించనున్నారు. ఈ చిత్రానికి నాన్‌యార్ తెరియుమా అనే టైటిల్‌ను నిర్ణయించారు. గ్లామర్ సినీగైడ్ పతాకంపై తెరకెక్కనున్న ఈ చిత్రానికి నవీన్‌రాజా దర్శకత్వం వహించనున్నారు. నాన్ యార్ తెరియుమా చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ పోలీస్ అధికారి కావాలన్న లక్ష్యంతో చెన్నైకి వచ్చిన ముగ్గురు వ్యక్తుల జీవితంలో ఒక ఆడ దెయ్యం ప్రవేశిస్తుందన్నారు.ఆ ముగ్గురు పోలీస్ అధికారులు కావాలంటే ఆ దెయ్యం మూడు నిబంధనలు విధిస్తుందన్నారు. వాటిని సవాల్‌గా తీసుకున్న ఈ ముగ్గురు పోరాటంలో పడే బాధలను వినోదభరితంగా తెరకెక్కించనున్న చిత్రం నాన్ యార్ తెరియుమా అని తెలిపారు. దీనికి చంద్రన్సామి ఛాయాగ్రహణం, రశాంత్ సంగీతాన్ని అందిస్తున్నట్లు దర్శకుడు తెలిపారు. -
శ్రీనివాసుడికి రూ. రెండు కోట్లు విరాళం
తిరుమల : తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామికి ఓ భక్తుడు రూ. 2 కోట్లు విరాళంగా ఇచ్చి తన భక్తిని చాటుకున్నాడు. టీటీడీ ఈవో డి.సాంబశివరావును టీవీఎస్ మోటార్స్ అధినేత శ్రీనివాసన్ శనివారం తిరుమలలో కలిశారు. అనంతరం ఆయకు రూ. 2 కోట్ల చెక్కును అందజేశారు. ఈ నగదు మొత్తాన్ని టీటీడీ అన్న ప్రసాదం ట్రస్టు కింద జమ చేయాలని ఈవోను శ్రీనివాసన్ కోరారు. అంతుకుముందు వీఐపీ బ్రేకు సమయంలో శ్రీవారిని శ్రీనివాసన్ దర్శించుకున్నారు. ఆ తర్వాత ఆయనకు ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. -
ఏవండీ.. ఆయనతో వెళ్లిపోతున్నా..!
హొసూరు: ఇద్దరు పిల్లల తల్లి అదృశ్యమైన సంఘటన క్రిష్ణగిరి పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. జిల్లా కేంద్రం క్రిష్ణగిరి పాతపేటకు చెందిన కార్పెంటర్ శ్రీనివాసన్(32). అతని భార్య అర్చన(25). వీరికి హర్షిత(3), తేజశ్రీ(2) పిల్లలున్నారు. ఈ నెల 8వ తేదీ అర్చన విధులకెళ్లిన భర్త శ్రీనివాస్‌కు ఫోన్ చేసి తాను 9 నెలలుగా మరో వ్యక్తిని గాఢంగా ప్రేమిస్తున్నట్లు, తన రెండవ సంతానం తేజశ్రీని తీసుకొని అతనితో వెళ్లిపోతున్నట్లు, మొదటి సంతానం హర్షితను వదలివె ళ్లుతున్నట్లు తెలిపింది. వెంటనే ఇంటికొచ్చిన శ్రీనివాస్‌కు భార్య కనిపించకపోవడంతో చుట్టు పక్కల, బంధువుల ఇళ్లలో గాలించినా దొరకకపోవడంతో శ్రీనివాస్ క్రిష్ణగిరి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని అదృశ్యమైన అర్చన కోసం గాలిస్తున్నారు. -
శ్రీనివాసన్‌కు దక్కలేదు
అమెరికా సుప్రీం జడ్జిగా మెర్రిక్ గార్లాండ్ వాషింగ్టన్: అమెరికా సుప్రీం కోర్టు జడ్జిగా మెర్రిక్ గార్లాండ్ (63)ను ఆ దేశాధ్యక్షుడు బరాక్ ఒబామా నామినేట్ చేశా రు. చివరి నిమిషం వరకు భారత సంతతికి చెందిన శ్రీ శ్రీనివాసన్‌కే ఒబామా అవకాశం కల్పిస్తారని భావించినా అది జరగలేదు. వైట్‌హౌజ్‌లోని రోజ్ గార్డెన్లో జరిగిన ఓ కార్యక్రమంలో మెర్రిక్ పేరును ఒబామా ప్రటిం చారు. ‘గార్లాండ్ సుప్రీం కోర్టుకు నైతికత, గొప్పదనం, పారదర్శకత తీసుకు రాగల సమర్థుడు’ అని ఒబామా ప్రశంసించారు. చివరి వరకు శ్రీనివాసన్ పేరునే ప్రకటించే అవకాశం కనిపించింది. అయితే.. ఎన్నికల సంవత్సరం కావడంతో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సెనేట్ రిపబ్లికన్లు ఒబామాను హెచ్చరించారు. వచ్చే అధ్యక్షుడు 9 మంది సభ్యుల ధర్మాసనం నుంచి ఒకరిని ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు. కానీ ఒబామా, డెమోక్రాట్లు మాత్రం.. మరో పది నెలల సమయం ఉన్నందున ఈ విషయాన్ని అప్పుడు ఆలోచించుకోవచ్చని భావించారు. చివరి వరకు జరిగిన తర్జన భర్జనల అనంతరం గార్లాండ్ పేరును ప్రకటించినట్లు తెలిసింది. క్లింటన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా సర్క్యూట్‌కు యూస్ కోర్టు ఆఫ్ అప్పీల్స్ చీఫ్ జస్టిస్‌గా నియమితులైన గార్లాండ్.. హార్వర్డ్ వర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. సుప్రీం కోర్టు నామినీల చరిత్రలోనే ఫెడరల్ చట్టాలపై విస్తృత అనుభవం ఉన్న వ్యక్తి గార్లాండ్ అని వైట్‌హౌజ్ కొనియాడింది. గత నెలలో సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అంటోనిన్ హఠాన్మరణంతో ఈ పదవి ఖాళీ అయింది. -
ఒబామా మద్దుతు శ్రీనివాసన్‌కే
వాషింగ్టన్: అమెరికా సుప్రీం కోర్టు జడ్జీ బరిలో శ్రీ శ్రీనివాసన్, మరో ఇద్దరి మధ్య పోటీ నెలకొంది. ప్రస్తుతం అధ్యక్షుడు ఒబామా ఈ జాబితాను పరిశీలిస్తున్నారు. అయితే శ్రీనివాసన్, మెర్రిక్ గార్లాండ్ రిపబ్లికన్ పార్టీ మద్దతుతో ముందంజలో ఉన్నారు. అరుదుగా ఖాళీ అయ్యే ఈ స్థానంలో సమర్థుడైన వారిని నియమించాలని ఒబామా యోచిస్తున్నట్లు సమాచారం. అయితే బరిలో కేటన్జీ బ్రౌన్ జాక్సన్(45) కూడా ఉన్నట్లు వైట్‌హౌజ్ వర్గాలు పేర్కొంటున్నాయి. సుప్రీం కోర్టు జడ్జీ జస్టిస్ స్కాలియా అనుమానాస్పదంగా మృతి చెందడంతో ఈ ఖాళీ ఏర్పడిన విషయం విదితమే. 2013లో శ్రీనివాసన్ డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా సర్య్కూట్ అప్పీల్స్ కోర్టు జడ్జిగా నియమితులయ్యారు. యూఎస్‌లో ఇది అత్యంత ప్రాధాన్యమైన కోర్టుల్లో ఇది రెండవది. శ్రీ శ్రీనివాసన్‌కే ఒబామా మద్దత్తు ఉన్నట్లు తెలుస్తోంది. -
బహుముఖ సహకారంతోనే దేశాభివృద్ధి
భారత మాజీ రాయబారి శ్రీనివాసన్ యూనివర్సిటీ క్యాంపస్ (తిరుపతి): దేశాల మధ్య పరస్పర సహకారంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని భారత మాజీ రాయబారి టీపీ శ్రీనివాసన్ పేర్కొన్నారు. తిరుపతి ఎస్వీయూలోని సీప్‌స్టడీస్ విభాగంలో సోమవారం అంతర్జాతీయ సదస్సు ప్రారంభమైంది. ఈసదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన శ్రీనివాసన్ మాట్లాడుతూ ప్రస్తుతం ప్రపంచంలో చిన్న, మధ్య తరగతి దేశాలు తమ ఆర్థిక, రాజకీయ, వ్యూహాత్మక అసవరాల కోసం బహుముఖ సహకారం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం వుందన్నారు. భారతదేశం ఇంకా పలుదేశాలతో సత్సంబంధాలు కొనసాగిస్తుందన్నారు. ఈ సంబంధాలు ఇంకా మెరుగుపడాల్సి వుందన్నారు. ఎస్వీయూ రెక్టార్ ఎం.భాస్కర్ మాట్లాడుతూ 21వ శతాబ్దంలో సమాచార, సాంకేతిక రంగాల్లో వచ్చిన విప్లవాత్మక మార్పులు ప్రపంచ దేశాల మధ్య అంతర్జాతీయ స్థాయిలో వివిధ రంగాల్లో సంబంధాలు బలపడటానికి దోహదపడతాయన్నారు. ఈ సందర్భంగా సౌత్ ఈస్ట్ ఏషియన్ పసిఫిక్ స్టడీస్ ప్రచురించిన పరిశోధన గ్రంథాన్ని ఆవిష్కరించారు. శ్రీనివాసన్‌కు జీవితసాఫల్య పురస్కారం భారత రాయబారిగా శ్రీనివాసన్ చేసిన సేవలకు గుర్తింపుగా సీప్ స్టడీస్ ఆయనకు జీవిత సాఫల్య పురస్కారం అందజేసింది. ఈకార్యక్రమంలో ఇండియన్ కౌన్సిల్ ఫర్ వరల్డ్ ఎఫైర్స్ డెప్యూటీ డెరైక్టర్ అజనీష్కుమార్, వియత్నాంకు చెందిన ప్రొఫెసర్ సువాన్ బింగ్, సీప్‌స్టడీస్ డెరైక్టర్ జి.జయచంద్రారెడ్డి, మాజీ డెరైక్టర్లు రాజారెడ్డి, లక్ష్మణశెట్టి, యాగమరెడ్డి, రవీంద్రనాధరెడ్డి, అధ్యాపకులు ప్రయాగ, విజయకుమార్, రమేష్‌బాబు పాల్గొన్నారు. -
నష్టం క్రికెట్‌కే... ఆయనకు కాదు!
‘ఇలా చేస్తే క్రికెట్‌కు మేలు జరుగుతుంది. కాబట్టి ఇలానే చేస్తాం. మీరు మాతో వచ్చినా రాకపోయినా ఇలాగే జరుగుతుంది. వస్తే మిమ్మల్నీ కలుపుకుని పోతాం’ ఏడాది క్రితం ఐసీసీలో కొత్త సంస్కరణల సందర్భంగా శ్రీనివాసన్ వ్యాఖ్య ఇది. ఐసీసీ పాత నిబంధనలన్నీ మార్చివేసిన సందర్భంలో అభ్యంతరం చెప్పిన దేశాల సభ్యులకు ఆయన చెప్పిన మాట ఇది. ఈ ఒక్క విషయంలోనే కాదు... ఆయన ఏ విషయంలో అయినా అలాగే ఉన్నారు. ఈ వైఖరి కాస్త బెదిరింపు తరహాలో కనిపించవచ్చు. కానీ అనుకున్నది చేయడానికి ఆయన ముక్కుసూటి మార్గాన్నే ఎంచుకుంటారు. అందుకే సుదీర్ఘకాలం భారత క్రికెట్లో ‘కింగ్’లా నిలిచారు. 2002లో తమిళనాడు క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన శ్రీనివాసన్... ఆ తర్వాత దాదాపు ప్రతిసారీ ఏకగీవ్రంగా ఈ పదవిని గెలిచారు. తమిళనాడు అధ్యక్షుడిగా వరుసగా 14 సార్లు ఎన్నికై రికార్డు సృష్టించారు. 2008లో బీసీసీఐ కార్యదర్శిగా ఎన్నికైన శ్రీనివాసన్, అప్పటి అధ్యక్షుడు శశాంక్ మనోహర్ సన్నిహితంగానే ఉండేవారు. 2011లో శ్రీనివాసన్ కార్యదర్శి నుంచి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 2014 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగారు. అయితే అదే ఏడాది ఐసీసీ చైర్మన్‌గానూ బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఐసీసీకి కేవలం అధ్యక్షుడు మాత్రమే ఉండేవారు. కానీ గత ఏడాది నుంచి కొత్తగా చైర్మన్ పదవిని సృష్టించారు. ఇందులో కేవలం భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ బోర్డులకు మాత్రమే చైర్మన్ పదవి తీసుకునే హక్కు ఉంది. ఇది కూడా శ్రీనివాసన్ ఆలోచనే. ప్రపంచ క్రికెట్‌పై భారత పట్టు కాపాడటం కోసం ఆయన దూరదృష్టితో చేసిన ఏర్పాటు ఇది. చేసిన తప్పేంటి..? బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి తొలగించాల్సిన, ఐసీసీ చైర్మన్ పదవి నుంచి పంపించాల్సిన తప్పు శ్రీనివాసన్ ఏమీ చేయలేదు. స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ వివాదం 2013లో బయటకు వచ్చినప్పుడు... శ్రీనివాసన్ అల్లుడు, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ప్రిన్సిపల్ గురునాథ్ మెయ్యప్పన్ బెట్టింగ్‌కు పాల్పడ్డారనేది ఆరోపణ. ఈ ఆరోపణల మీద విచారణ కోసం సమావేశం జరిగినప్పుడు శ్రీనివాసన్ ఆ సమావేశానికి కూడా దూరంగా ఉన్నారు. అయితే ఎప్పుడైతే మెయ్యప్పన్ మీద ఆరోపణలు వచ్చాయో... ఆ వెంటనే శ్రీనివాసన్ వ్యతిరేక శక్తులన్నీ ఏకమయ్యాయి. ఇలాంటి వాళ్లందరినీ తన బలంతో అధిగమిస్తూ వచ్చిన శ్రీనివాసన్... కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రస్ట్ అనే ఆరోపణను ఎదుర్కొన్నారు. ఈలోగా రకరకాల విచారణలు, కేసుల నేపథ్యంలో క్రమంగా శ్రీనివాసన్ అనుచరులు ఒక్కొక్కరు దూరమయ్యారు. అధికారం లేకపోతే అంతే... గత ఏడాది కాలంగా జరిగిన పరిణామాలు శ్రీనివాసన్‌కు ఓ కొత్త విషయాన్ని కూడా నేర్పాయి. శ్రీనివాసన్ అధికారంలో ఉన్నప్పుడు లబ్ధి పొందిన అనేక సంఘాలు, ఇప్పుడు అదే లబ్ధి కోసం మనోహర్ పంచన చేరాయి. కార్పొరేట్ రంగంలో ఢక్కామొక్కీలు తిన్న ఆయనకు ఇది కొత్త కాకపోయినా, క్రికెట్లో రాజకీయాలు ఎలా ఉంటాయనేది కూడా తెలిసొచ్చింది. -సాక్షి క్రీడావిభాగం ‘ఐసీసీలో ఎవరిని ప్రతినిధిగా ఉంచాలో నిర్ణయించేది బీసీసీఐ. వారి నిర్ణయాన్ని నేను గౌరవిస్తా. బోర్డు అభివృద్ధిలో నేను పోషించిన పాత్ర పట్ల గర్వంగా ఉన్నా. ఐసీసీ ఇప్పుడు మరింత బలంగా తయారైంది. క్రికెట్ ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డుల సహకారంతో ఐసీసీ చైర్మన్ హోదాలో మీడియా హక్కులకు సంబంధించి తీసుకున్న నిర్ణయం అత్యుత్తమమని చెప్పగలను. క్రికెట్ పరిపాలనను నేను ఒక ఉద్యోగంలా, బాధ్యతలా భావించాను. నాకు పెద్ద వ్యాపార ప్రపంచం ఉంది. దానిపై ఇప్పుడు చాలా దృష్టి పెట్టాలి. సరదాగా చెప్పాలంటే ఇక ముందు గోల్ఫ్‌లో నా ఆటను మరింత మెరుగు పర్చుకోవడంపై దృష్టి పెడతా. ఎనిమిదేళ్లలో నేను ఏమాత్రం పట్టించుకోని అంశం అంటే గోల్ఫ్ ఒక్కటే.’ -ఎన్. శ్రీనివాసన్, ఐసీసీ మాజీ చైర్మన్ మళ్లీ వస్తారా...? నిజానికి ఐసీసీ చైర్మన్ పదవి మరో 8 నెలలు మాత్రమే ఉంది. ఈ ఎనిమిది నెలలు ప్రస్తుతం కార్యవర్గం ఓపిక పడితే ఆయనంతట ఆయనే పూర్తిగా క్రికెట్ నుంచి తప్పుకునేవారు. భారత క్రికెట్లోనే కాదు... ప్రపంచ క్రికెట్లోనే ఎన్నో మార్పులు తీసుకొచ్చి అభివృద్ధి బాటలోకి తెచ్చిన శ్రీనివాసన్‌ను ఇలా పంపించాల్సింది కాదేమో. దీని వల్ల ఆయన బాధపడటం కూడా సహజమే. ఈ కేసులు, గొడవలు మహా అయితే రెండేళ్లు ఉంటాయి. మెయ్యప్పన్ చేసిన తప్పులకు వ్యక్తిగా శ్రీనివాసన్‌కి ఎలాంటి బాధ్యతలు లేవు. నిజానికి ఆయనను తొలగించడానికి సరైన కారణమే లేదు. కాకపోతే ప్రస్తుతం ఆయనకు నమ్మకస్తులు బీసీసీఐలో ఎక్కువమంది లేకపోవడం వల్ల ఇదంతా వచ్చింది. అయితే దీనిని పరిష్కరించుకుని మళ్లీ మద్దతు కూడగట్టుకోవడానికి శ్రీనివాసన్‌కు రెండేళ్లు చాలు. తనని పంపించిన విధానం బాధపెట్టి ఉంటే మాత్రం తిరిగి రెండేళ్ల తర్వాత గోడకు కొట్టిన బంతిలా తిరిగొస్తారా చూద్దాం! -
ఐసీసీ చైర్మన్‌గా మనోహర్
శ్రీనివాసన్ తొలగింపు బీసీసీఐ కీలక నిర్ణయం ముంబై: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) పరిపాలనలో సుదీర్ఘ కాలంగా తనదైన ముద్ర వేసిన నారాయణస్వామి శ్రీనివాసన్ శకం ముగిసింది. బోర్డు అధ్యక్షుడు శశాంక్ మనోహర్ ఇకపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్‌గా వ్యవహరిస్తారు. భారత ప్రతినిధిగా ఇప్పటివరకు చైర్మన్‌గా ఉన్న శ్రీనివాసన్‌ను తప్పిస్తూ బోర్డు వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో సోమవారం నిర్ణయం తీసుకున్నారు. ఐసీసీ చైర్మన్ పదవిలో మనోహర్ జూన్ 2016 వరకు కొనసాగుతారు. ఏదైనా కారణంతో ఆయన గైర్హాజరైతే ఆ స్థానంలో ప్రత్యామ్నాయ డెరైక్టర్ హోదాలో బీసీసీఐ తరఫున శరద్ పవార్ ఐసీసీ సమావేశాల్లో పాల్గొంటారు. పలు కారణాలతో అనేక సార్లు వాయిదా పడిన బోర్డు ఏజీఎం ఎట్టకేలకు సోమవారం జరిగింది. ఈ సమావేశంలో భారత క్రికెట్‌కు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. శ్రీనివాసన్‌ను తొలగిస్తూ ప్రకటన చేసిన తర్వాత ఐసీసీ చైర్మన్‌గా ఆయన చేసిన సేవలను బోర్డు సభ్యులు ప్రస్తుతించారు. ఐపీఎల్ కౌన్సిల్ నుంచి రవిశాస్త్రి అవుట్ ఈ సమావేశంలో బోర్డు వేర్వేరు సబ్ కమిటీలను ప్రకటించింది. కొన్నింటిలో సభ్యులను మార్చగా, మరికొన్ని కమిటీల్లో సభ్యుల సంఖ్యను బాగా తగ్గించారు. ఐదుగురు సభ్యుల ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్‌గా రాజీవ్‌శుక్లా కొనసాగనున్నారు. అయితే భారత జట్టు డెరైక్టర్‌గా వ్యవహరిస్తున్న రవిశాస్త్రిని ఈ కౌన్సిల్నుంచి తప్పించారు. బీసీసీఐ టెక్నికల్ కమిటీ చైర్మన్‌గా అనిల్ కుంబ్లే స్థానంలో సౌరవ్ గంగూలీని ఎంపిక చేశారు. బోర్డు సభ్యుల కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రస్ట్ (పరస్పవర విరుద్ధ ప్రయోజనాల సంఘర్షణ)కు సంబంధించి తీవ్రంగా చర్చ జరిగినా చెప్పుకోదగిన నిర్ణయం ఏదీ తీసుకోలేదు. అయితే ఈ తరహా కార్యకలాపాలను బోర్డు తరఫున పర్యవేక్షించేందుకు తొలిసారి మాజీ న్యాయమూర్తి ఏపీ షా ను ‘అంబుడ్స్‌మన్’గా నియమించారు. -
అది బీసీసీఐ ఇష్టం
శ్రీనివాసన్‌కు అనుమతిపై సుప్రీం కోర్టు న్యూఢిల్లీ: తమ సమావేశాల్లో ఐసీసీ చైర్మన్ ఎన్.శ్రీనివాసన్‌ను అనుమతించాలా? వద్దా? అనే విషయంలో పూర్తి అధికారం బీసీసీఐకే ఉందని సుప్రీం కోర్టు తేల్చింది. దీంట్లో తాము జోక్యం చేసుకోవాల్సిన అవసరమేమీ లేదని జస్టిస్ టీఎస్ ఠాకూర్, ఎఫ్ఎమ్ఐ కలీఫుల్లాతో కూడిన బెంచ్ తెలిపింది. ‘శ్రీనివాసన్ విషయంలో ఇంకా పరస్పర విరుద్ధ ప్రయోజనాలు ఉన్నాయో లేదో బీసీసీఐ చూసుకోవాలి. ప్రతిసారీ మా దగ్గరకు రావాల్సిన పని లేదు. అసలు ఆయనపై ఏమైనా నిర్ణయం తీసుకుంటే దానికే కట్టుబడండి. మేం జనవరిలో ఇచ్చిన తీర్పులోనే స్పష్టంగా పేర్కొన్నాం. మీ ప్రతి నిర్ణయంపై మా ముద్ర ఉండాలని కోరుకుంటున్నారా? ఒకవేళ ఆయనకు ఏమైనా సమస్య ఉంటే కోర్టుకు వస్తారు’ అని బీసీసీఐకి ఘాటుగా సమాధానమిచ్చింది. ఠాకూర్‌పై పిటిషన్ ఉపసంహరణ బీసీసీఐ అధ్యక్షుడు శశాంక్ మనోహర్ విజ్ఞప్తి మేరకు కార్యదర్శి అనురాగ్ ఠాకూర్‌పై వేసిన క్రిమినల్ పిటిషన్‌ను శ్రీనివాసన్ ఉపసంహరించుకున్నారు. -
వేడెక్కిన క్రికెట్ రాజకీయాలు
-
సొంత రాష్ట్రంలోనూ శ్రీనివాసన్ హవా
చెన్నై: బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, ఐసీసీ చైర్మన్ ఎన్. శ్రీనివాసన్ సొంత రాష్ట్రంలోనూ హవా కొనసాగిస్తున్నారు. తమిళనాడు క్రికెట్ అసోసియేషన్(టీఎన్ సీఏ) అధ్యక్షుడిగా మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం జరిగిన టీఎన్ సీఏ 85వ వార్షిక కార్యవర్గ సమావేశంలో శ్రీనివాసన్ ను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఏడాది పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. ప్రస్తుత టీఎన్ సీఏ కార్యదర్శి కాశీ విశ్వనాథన్ కూడా తన పదవిని నిలబెట్టుకున్నారు. వీపీ నరసింహన్ కోశాధికారిగా ఎన్నికయ్యారు. -
మరో ఇద్దరిపై వేటు
ముంబై : పదవిలోకి వచ్చిన తర్వాత శ్రీనివాసన్ సంబంధీకులను బోర్డు నుంచి సాగనంపుతున్న బీసీసీఐ కొత్త కార్యవర్గం తాజాగా మరో ఇద్దరిని తప్పించింది. శ్రీనివాసన్ సన్నిహితులుగా గుర్తింపు తెచ్చుకున్న టీమ్ లాజిస్టిక్ మేనేజర్ ఎంఏ సతీశ్, మీడియా మేనేజర్ ఆర్ఎన్ బాబాలను ఆ పదవుల నుంచి తొలగించింది. 2011 నుంచి మధ్యలో కొద్ది రోజులు మినహా సతీశ్... 2012 టి20 ప్రపంచకప్ నుంచి బాబా భారత జట్టు సహాయక సిబ్బందిలో భాగంగా ఉన్నారు. ఇప్పటి వరకు సతీశ్‌కు నెలకు రూ. 6 లక్షలు, బాబాకు ప్రతీ టూర్‌కు రూ. 5 లక్షల చొప్పున బోర్డు చెల్లించినట్లు సమాచారం. బంగ్లా పర్యటనకు సతీశ్ స్థానంలో రిషిక్ ఉపాధ్యాయను ఎంపిక చేయగా, అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ బిశ్వరూప్ డే మీడియా మేనేజర్‌గా కూడా వ్యవహరిస్తారు. -
'ఏడేళ్ల కంటే ఎక్కువ శిక్ష పడొచ్చు'
-
'ఏడేళ్ల కంటే ఎక్కువ శిక్ష పడొచ్చు'
న్యూఢిల్లీ: ఎమ్మెల్యేకు ముడుపుల కేసులో అరెస్టయిన టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిపై నమోదు చేసిన 120 B, 34 సెక్షన్ల ప్రకారం త్వరగా బెయిల్ రాదని సీనియర్ న్యాయవాది శ్రీనివాసన్ అన్నారు. ప్రజా ప్రతినిధులు నిందితులుగా ఉన్న ఇలాంటి కేసులను కోర్టులు తీవ్రంగా పరిగణిస్తాయని చెప్పారు. దోషీగా తేలితే ఏడేళ్ల కంటే ఎక్కవు శిక్ష పడే అవకాశముందని శ్రీనివాసన్ అభిప్రాయపడ్డారు. సెక్షన్ 34 ప్రకారం కేసులో ప్రమేయమున్న వారందరిపైనా ఛార్జిషీట్ దాఖలు చేయవచ్చని చెప్పారు. కేసు పురోగతిని బట్టి మరి కొన్ని సెక్షన్లను కూడా చేర్చవచ్చని శ్రీనివాసన్ అన్నారు. -
హోరాహోరీ...ఉత్కంఠ...
-
హోరాహోరీ...ఉత్కంఠ...
ఆసక్తికరంగా జరిగిన బీసీసీఐ ఎన్నికలు ఒక్క ఓటుతో కార్యదర్శిగా నెగ్గిన ఠాకూర్ మిగతా పదవులన్నీ శ్రీనివాసన్ వర్గానివే దాల్మియా, గంగరాజు ఏకగ్రీవమే క్రాస్ ఓటింగ్, అధ్యక్షుడి నిర్ణయాత్మక ఓటు, ఒకే ఓటుతో ఫలితం మార్పు, సంచలన విజయం, చైర్మన్‌పై ఆరోపణలు ...ఇలా క్రికెట్ మ్యాచ్‌ను తలపించేలా అన్ని మలుపులతో బీసీసీఐ ఎన్నికలు జరిగాయి. ఏకపక్షంగా ఫలితాలు వస్తాయని భావించినా.... కొన్ని ప్రధాన పదవుల కోసం హోరాహోరీగా పోరు సాగింది. అతి ముఖ్యమైన కార్యదర్శి పదవి కోసం జరిగిన ఎన్నికలో అనురాగ్ ఠాకూర్ ఒక్క ఓటు ఆధిక్యంతో ప్రస్తుత కార్యదర్శి సంజయ్ పటేల్‌ను ఓడించారు. సాక్షి, చెన్నై: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శిగా అనురాగ్ ఠాకూర్ ఎన్నికయ్యారు. సోమవారం ఇక్కడ జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో ఆయన తన ప్రత్యర్థి సంజయ్ పటేల్‌పై ఒక ఓటు తేడాతో నెగ్గారు. పటేల్, శ్రీనివాసన్‌కు ఆత్మీయుడు కాగా, ఠాకూర్‌ను పవార్ వర్గం బలపరిచింది. అయితే హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ అయిన ఠాకూర్‌కు అనుకూలంగా క్రాస్ ఓటింగ్ జరిగినట్లు సమాచారం. ఇది మినహా అంతటా శ్రీని వర్గం ఆధిపత్యం కనిపించింది. మరో వైపు అధ్యక్షుడిగా జగ్మోహన్ దాల్మియా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈస్ట్‌జోన్‌కు చెందిన ఆరు సంఘాలు ఆయన పేరును ప్రతిపాదించగా.... అటు శ్రీనివాసన్, ఇటు పవార్ వర్గీయులు మొత్తం దాల్మియాకు మద్దతుగా నిలిచారు. సంయుక్త కార్యదర్శి పదవి కోసం జరిగిన ఎన్నికలో అమితాబ్ చౌదరి, చేతన్ దేశాయ్ మధ్య పోరు ఉత్కంఠగా సాగింది. వీరిద్దరికి సమంగా ఓట్లు వచ్చాయి. దాంతో అధ్యక్ష స్థానంలో ఉన్న శివలాల్ తన నిర్ణయాత్మక ఓటు అమితాబ్‌కు వేసి గెలిపించారు. ఐదు ఉపాధ్యక్ష పదవుల్లో ముగ్గురు... గోకరాజు గంగరాజు (ఆంధ్ర క్రికెట్ సంఘం కార్యదర్శి-సౌత్‌జోన్), గౌతమ్ రాయ్ (ఈస్ట్), నెహ్రూ (నార్త్) ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. సెంట్రల్ జోన్ తరఫున సీకే ఖన్నా ఎన్నికయ్యారు. పవార్ బలపరిచిన జ్యోతిరాదిత్య సింథియాపై ఆయన సంచలన విజయం సాధించడం విశేషం. వెస్ట్ తరఫున రవిసావంత్‌ను ఓడించి టీసీ మ్యాథ్యూ ఉపాధ్యక్షుడయ్యారు. బోర్డులో సుదీర్ఘ కాలంగా ప్రభావవంతమైన వ్యక్తిగా ఉన్న రాజీవ్‌శుక్లాకు కూడా ఓటమి ఎదురైంది. కోశాధికారి పదవి కోసం జరిగిన ఎన్నికల్లో అనిరుధ్ చౌదరి... శుక్లాపై గెలుపొందారు. ఐసీసీ సీఈ సమావేశాల్లో ఇకపై ఠాకూర్ బీసీసీఐకి ప్రాతినిధ్యం వహిస్తారని ఏజీఎంలో ఖరారు చేశారు. సందీప్ పాటిల్ నేతృత్వంలోని ప్రస్తుత క్రికెట్ సెలక్షన్ కమిటీ పదవీకాలాన్ని మరో ఆరు నెలలు పెంచుతూ కూడా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. శివలాల్‌పై ఆరోపణలు: ఏజీఎంకు అధ్యక్షత వహించిన శివలాల్ యాదవ్ ప్రజాస్వామ్య విరుద్ధంగా వ్యవహరించారని ఆరోపణలు వచ్చాయి. బరోడా సంఘం తరఫున రాకేశ్ పారిఖ్‌ను అనర్హతకు గురి చేస్తూ... సమర్జిత్ గైక్వాడ్‌కు ఓటింగ్ అవకాశం ఇవ్వడాన్ని కొందరు తప్పుపట్టారు. ఉపాధ్యక్షుడిగా పోటీచేసి ఓడిన రవిసావంత్ ఈ వివాదంపై మంగళవారం బాంబే హైకోర్టులో పిటిషన్ వేయనున్నారు. బీసీసీఐ కొత్త కార్యవర్గం అధ్యక్షుడు: జగ్మోహన్ దాల్మియా కార్యదర్శి: అనురాగ్ ఠాకూర్ సంయుక్త కార్యదర్శి: అమితాబ్ చౌదరి కోశాధికారి: అనిరుధ్ చౌదరి ఉపాధ్యక్షులు: ఎంఎల్ నెహ్రూ (నార్త్), గోకరాజు గంగరాజు (సౌత్), గౌతమ్ రాయ్ (ఈస్ట్), టీసీ మ్యాథ్యూ (వెస్ట్), సీకే ఖన్నా (సెంట్రల్). బీసీసీఐ ఎన్నికలు, అనురాగ్ ఠాకూర్, శ్రీనివాసన్, -
శ్రోతాభిరామం
రేడియో అంతరంగాలు నేడు వరల్డ్ రేడియో డే ‘రేడియో రామం’ గా ఎస్.బి. శ్రీరామమూర్తి శ్రోతలందరికీ సుపరిచితం! రేడియోలో ఆయన ఎంత వినూత్నంగా కార్యక్రమాలను రూపొందించగలరో.. మాండలిన్తో సరిగమలనూ అంతే హృదయ రంజకంగా వినిపించగలరు. కాన్వాస్ మీద అంత సృజనాత్మకంగాను చిత్రాలను గీయగలరు! ఇలా తనకు తెలిసిన అన్ని విద్యలతో తెలుగు రేడియోకి విలక్షణ కళాకారుడైన రామం... ఈవారం ‘రేడియో అంతరంగాలు’ కు శారదా శ్రీనివాసన్ ఎంచుకున్న ఆత్మీయ అతిథి. (శ్రీరామమూర్తినిశారదా శ్రీనివాసన్ కూడా ఆప్యాయంగా రామం అనే పిలుస్తారు. ఆయన కూడా శారద అత్తా, శ్రీనివాసన్ మామా అంటూ వాళ్లని అంతే ఆప్యాయంగా పిలుస్తారు. విజయవాడ ఆకాశవాణి నుంచి రామం రిటైరై పన్నెండేళ్లవుతోంది. అప్పటి నుంచి హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో శారదా శ్రీనివాసన్.. రామంను మళ్లీ ఒకసారి కలుసుకున్నారు. వారి సంభాషణ అలా.. ఆ పాత జ్ఞాపకాలతోనే మొదలైంది). మహామహులు పనిచేసిన విజయవాడ రేడియోస్టేషన్లో నువ్వూ పనిచేశావు. అప్పటి నీ అనుభవాలు, అనుభూతులు తెలుసుకోవాలని వచ్చాను రామం.... నిజంగానే అది నా అదృష్టం అత్తా! 1972లో విజయవాడ కేంద్రానికి పర్మినెంట్ అనౌన్సర్‌గా వెళ్లినా 1968 నుంచే రేడియోతో నాకు సంబంధాలున్నాయి. దానికన్నా ముందు.. డిగ్రీ అయిపోగానే మద్రాసు వెళ్లి అక్కడి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఫోటోగ్రఫీ, సౌండ్, ప్రాసెసింగ్ విభాగాల్లో మూడేళ్లు కోర్సు చేశాను. మరి సినిమాలకు వెళ్లకుండా రేడియో వైపు వచ్చావేం? ఈ ప్రశ్నే రేడియో ఉద్యోగం కోసం చేసిన ఇంటర్వ్యూలోనూ అడిగారత్తా! ‘ఫిల్మ్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవాడివి.. రేడియోలోకొస్తే డిస్క్వాలిఫికేషన్ అవుతుంది. ఉద్యోగం ఇవ్వం’ అని కూడా అన్నారు. అప్పుడు నేను చెప్పా.. ‘ఇది ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ అవుతుందండి, డిస్ క్వాలిఫికేషన్ కాదు. నేను అక్కడ నేర్చుకున్న రికార్డింగ్, ఎడిటింగ్ టెక్నిక్స్ అన్నీ ఇక్కడ ఉపయోగిస్తాను. ప్రూవ్ చేస్తాను ఉద్యోగం ఇస్తే’అని! ఇచ్చారు. యువవాణితో మొదలు 1968లో ఆల్ ఇండియా రేడియోలో యువతను ప్రోత్సహించడానికి యువవాణిని మొదలుపెట్టారు. అప్పుడే మద్రాస్ నుంచి కాకినాడ వచ్చేశాను. ఈ యువవాణిని వింటుండేవాడిని. ‘అరే.. బాగుందే.. మనం కూడా ఏదైనా రాయొచ్చు, చేయొచ్చు’ అనిపించింది. విజయవాడ వెళ్లి ఎవరినైనా కలుసుకుని వద్దాం అని బయలుదేరి వెళ్లా. ‘ఏంచేస్తావేంటీ’ అని అడిగారు. ‘మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్’ అని చెప్పాను. ‘ప్రతి శుక్రవారం మార్నింగ్ ఒక అరగంట ఫిల్మ్ రికార్డులు వేసే కార్యక్రమం ఉంది. ముందది చేయండి. తర్వాత మీరేమైనా రాసుకొని పట్టుకొస్తే అప్పుడు చూద్దాం’ అన్నారు. అలా రేడియోలో సినిమారికార్డులు వేసే పనితో నేను ఉద్యోగానికి ముందే ఎంటర్ అయ్యానన్నమాట. స్టేషన్‌కే కొత్త ఐడియా కొన్ని రోజులకి నేనే ఓ ప్రోగ్రామ్ రూపొందించా. మూడ్ మ్యూజిక్ కాన్సెప్ట్‌తో. మద్రాస్‌లో ఉన్నప్పుడు ఓ షార్ట్‌ఫిల్మ్ కోసమని రాసుకున్న స్క్రిప్టునే ఇక్కడ ప్రోగ్రామ్‌గా మలిచా. ప్రకృతిలోని చక్కటి దృశ్యాన్ని చూస్తుంటే చక్కటి సంగీతాన్ని వింటున్న అనుభూతి కూడా కలుగుతుంది. అనాహత శబ్దం అంటామే అది. దీన్ని నేను రివర్స్‌లో చెప్పటానికి ట్రై చేశా ఆ ప్రోగ్రామ్‌లో. ఎలాగంటే ముందుగా ఓ ప్రభాత దృశ్యాన్ని వర్ణించి.. వెంటనే పండిట్ రవిశంకర్ సితార్ మీద మీటిన ఆహిర్భైరవి రాగాన్ని వినిపించేవాడిని. తర్వాత రెండిటినీ సమన్వయం చేస్తూ కామెంట్ చెప్పేవాడిని. అలా ఏడెనిమిది దృశ్యాలు వర్ణించేవాడిని. దశ్యాన్ని శబ్దీకరించడమన్నమాట. దీనికి నన్ను ప్రోత్సహించిందెవరనుకున్నారు? మహా విద్యాంసులు ఓలేటి వెంకటేశ్వర్లు గారు. చిన్నకుర్రాడిని వెళ్లి.. శాస్త్రీయ సంగీతాన్ని బేస్ చేసుకొని ఓ ప్రోగ్రామ్ చేస్తానంటే.. ఏమాత్రం నిరుత్సాహపరచకుండా ‘నాతో రా, సాయంకాలం మాట్లాడుకుందాం’ అన్నారు. విజయవాడలోని పరేడ్ గ్రౌండ్లో ఆయన ఈవినింగ్వాక్కి వెళ్లేవారు. అలా నన్నూ తీసుకెళ్లి నేను చెప్పింది చక్కగా ఓపిగ్గా విని ‘ఐడియా చాలా బాగుందండీ.. మా స్టేషన్‌కే కొత్త ఐడియా’అన్నారు. నాకొచ్చిన ఎన్నో రేడియో జాతీయ అవార్డులన్నిటికంటే గొప్ప అవార్డు ఆ మాట. నేను రూపొందించిన ప్రోగ్రామ్ విని బాగా ఇంప్రెస్ అయ్యి ఓ చక్కటి ఇంట్రడక్షనూ ఇచ్చారు. ఆ ప్రోగ్రామ్ పేరు ‘భావనా సంగీతం’! ఇది కాంట్రాక్ట్ బేస్ ఉద్యోగం. దీనికి నాకందిన పారితోషికం 20 రూపాయలు. పుట్టినరోజు గిఫ్ట్ అలా రకరకాల ప్రోగ్రామ్స్ చేస్తూనే రేడియోలోనే పర్మినెంట్ ఉద్యోగంలో చేరే అవకాశం కోసం చూస్తుండే వాడిని. అప్పట్లో ‘వాణి’ అనే రేడియో పక్షపత్రికొచ్చేది. అందులో ఆకాశవాణికి సంబంధించిన ఉద్యోగాల నోటిఫికేషన్సూ వేసేవారు. ప్రోగ్రామ్స్ హడావిడిలో ఉండి దాన్ని పెద్దగా పట్టించుకోలేదు కానీ.. వైజాగ్‌లో ఓ ఖాళీ ఉందని తెలిసివెళ్లాను. ఆడిషన్లో పాసయ్యాను. అందులో నా నంబర్ 11. ముగ్గురికి అవకాశమిచ్చి మిగతావాళ్లను ఆపారు. అలా నేను పెండింగ్ లిస్ట్‌లో ఉన్నాను. అప్పుడే అదృష్టవశాత్తు వివిధభారతిలో కొత్తగా తెలుగు సర్వీస్ మొదలయింది హైదరాబాద్, విజయవాడలో. ఆ సర్వీస్‌ని సీబీఎస్ అనిపిలిచేవాళ్లు అంటే కమర్షియల్ బ్రాడ్‌కాస్టింగ్ సర్వీస్. దానికి అనౌన్సర్స్ని తీసుకుంటున్నారని తెలిసి వెళ్లాను. అప్పటికే నేను పెండింగ్లిస్ట్లో ఉన్నాను కాబట్టి వీళ్లు నన్ను తీసుకునే ఛాన్స్ ఉంటుందని విజయవాడకు వెళ్లాను. అక్కడ అవకాశం దొరకలేదు. ఓలేటి వెంకటేశ్వర్లుగారి సలహా మేరకు హైదరాబాద్ వచ్చాను. శ్రీనివాసన్ మామను కలిశాను. కొంత టైమ్ పట్టినా హైదరాబాద్ వివిధభారతిలో అనౌన్సర్‌గా చేరాను. అది 1971, జూన్ 3న. ఆ రోజు నా పుట్టినరోజు. గుర్తుందా.. అత్తా.. ఆ కాంట్రాక్ట్‌ను మీరే పట్టుకొచ్చి ఇచ్చారు.. నా పుట్టినరోజు గిఫ్ట్‌గా!’. ఎందుకు గుర్తులేదూ.. గుర్తుంది రామం... తర్వాత ఆ ఉద్యోగం పర్మినెంట్ అయింది. కాకపోతే విజయవాడ పోస్టింగ్. యేడాదిగా హైదరాబాద్‌లో అందరూ క్లోజ్ అయ్యేసరికి విజయవాడ వెళ్లడానికి మనసొప్పలేదు. సీనియర్ ఎనౌన్సర్లు డి.వెంకటరామయ్యగారు, శమంతకమణిగారు, రత్నప్రసాద్గారు.. ‘విజయవాడలో కన్సోల్ దగ్గర కాళ్లు పెట్టుకోవడానికి పీటలాంటిది తయారుచేశారట శ్రీరామ్మూర్తీ.. హాయిగా అక్కడికి వెళ్లు’అంటూ నా మీద జోక్స్ వేశారు. ఇక్కడే ఉంటానని స్టేషన్ డెరైక్టర్ కందస్వామిని రిక్వెస్ట్ చేశాను కూడా. ఆయన నన్ను సముదాయించి విజయవాడ పంపించారు. బాలాంత్రపు రజనీకాంతరావుగారు మొట్టమొదటి మా స్టేషన్ డెరైక్టర్. ఆయన మాకు గురువు, దైవం అన్నీ! ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో ట్రైనింగ్, టెక్నికల్ విషయాల పట్ల ఆసక్తి, అవగాహన నా రేడియో కెరీర్‌కి ప్లస్పాయింట్స్ అయ్యాయి. అందుకే నా ప్రోగ్రామ్స్‌ని శబ్దచిత్రాలు అని పేరుపెట్టుకున్నాను. అంటే శబ్దం ద్వారా చిత్రాన్ని చూపించడం. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రోగ్రామ్‌కి నేను సరిపోవడం, నాకు మంచి ప్రోగ్రామ్ రావడం.. రెండూ కుదిరాయి అత్తా. ఒక్కో కార్యక్రమం ఒక్కో జ్ఞాపకం. గొప్ప అనుభూతి. ప్రశంసలు, నేర్చుకునేలా చేసిన విమర్శలు,పెద్దపెద్ద వాళ్ల సాంగత్యం, విడదీయలేని అనుబంధం.. ఇవన్నీ రేడియో ఇచ్చిన సంపదలే! చెప్పాలంటే రోజైనా పడుతుంది! ప్రెజెంటేషన్: సరస్వతి రమ ఫొటో: గోదాసు రాజేష్ ‘ఒక పాటపుట్టింది’ ప్రోగ్రామ్ చేశా కదా ఆ ఐడియా ఎలా వచ్చిందంటే..? రేడియో స్టేషన్లో ఓ పాట ఎలా రికార్డ్ అవుతుందో అనుకునే ఓ సగటు శ్రోత కుతూహలాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రోగ్రామ్ రూపొందించాను. ప్రసారం అయ్యాక ఎంత రెస్పాన్స్ వచ్చిందో. నా ఫస్ట్ ప్రోగ్రామ్ నీలినీడలు కూడా ఇలాంటి వినూత్న కార్యక్రమమే. ఆ మాటకొస్తే ఒక పాట పుట్టింది ప్రోగ్రామ్ చేసేటప్పటికే ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ కింద నాకు నాలుగైదు అవార్డులు వచ్చి ఉన్నాయి. ఈ ప్రోగామ్కీ అవార్డు వచ్చింది. ఇలాంటివి చాలా చేశాను. ‘మెట్లు’ అనే కాన్సెప్ట్ తీసుకొని జీవితంలో మెట్లకున్న ప్రాధాన్యాన్ని చెప్పడానికి రకరకాల థీమ్స్‌తో ప్రోగ్రామ్ చేశాను. ఒకసారి విజయం, పరాజయాలకి చిహ్నంగా, ఇంకోసారి బుద్ధుడి భాగస్వామి యశోధర ప్రధానపాత్రగా శ్రవణనాటకాన్ని రూపొందించాను. ఒకరకంగా ఇది స్త్రీవాద ధోరణిలో సాగే నాటకం. ఇలా చాలా ప్రయోగాలు చేశాను... కేవలం శబ్దాన్ని మాత్రమే ఓరియెంటేషన్‌గా తీసుకుంటూ! జీవితంలో పెరిగిన వేగం మీదా కామెడీ ప్రోగ్రామ్ రూపొందించాను.. ‘చూసిందే మళ్లీ చూడు’ అనే పేరుతో. ఇలాంటి నా కార్యక్రమాలకు పదీపన్నెండు రేడియో జాతీయ అవార్డులు వచ్చాయి. -
8న బీసీసీఐ వర్కింగ్ కమిటీ సమావేశం
ఏజీఎమ్ తేదీని ఖరారు చేసే అవకాశం న్యూఢిల్లీ: బీసీసీఐ వర్కింగ్ కమిటీ సమావేశం ఈనెల 8న చెన్నైలో జరగనుంది. ఐసీసీ చైర్మన్ శ్రీనివాసన్ భవితవ్యంతో పాటు వార్షిక సర్వసభ్య సమావేశం తేదీని ఇందులో ఖరారు చేయనున్నారు. అయితే వర్కింగ్ కమిటీలో ఎక్కువ మంది సభ్యులు 7వ తేదీనే అనధికారికంగా శ్రీనివాసన్‌తో సమావేశం అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ‘8న వర్కింగ్ కమిటీ సమావేశం ఉందని మాకు సర్క్యులర్ అందింది. కాబట్టి శ్రీని మద్దతుదారుల సమావేశం 5న జరిగే అవకాశాల్లేవు. 7వ తేదీన తనకు మద్దతిచ్చే కొన్ని రాష్ట్రాల సంఘాలతో ఆయన భేటి కానున్నారు. శ్రీని వ్యతిరేక వర్గం సభ్యులు కూడా వర్కింగ్ కమిటీకి హాజరవుతారు. అయితే సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో తన భవిష్యత్‌పై చైర్మన్ ఇంత వరకు ఏమీ చెప్పలేదు’ అని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. -
ఇకపై.. ఏదో ఒక్క పదవిలోనే..!
-
ఐపీఎల్ బెట్టింగ్ స్కామ్‌పై సుప్రీం తీర్పు
-
ఐపీఎల్‌కు దూరంగా ఉంటా: శ్రీనివాసన్
బీసీసీఐ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తనకు అనుమతి ఇవ్వాలని బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్ సుప్రీంకోర్టును కోరారు. ఐపీఎల్ బెట్టింగ్ కుంభకోణం వ్యవహారంపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. ఒకవేళ తాను ఆ సంఘానికి అధ్యక్షుడిగా ఎన్నికైతే.. ఐపీఎల్ బెట్టింగ్ కుంభకోణం విషయంలో తనకు ఉన్నత స్థాయి సంఘం నుంచి క్లీన్ చిట్ వచ్చేవరకు ఐపీఎల్ వ్యవహారాలకు దూరంగా ఉంటానని కూడా సుప్రీంకోర్టుకు ఆయన తెలిపారు. -
మేయప్పన్‌ను పక్కన పెట్టాం: శ్రీనివాసన్
చెన్నై సూపర్ కింగ్స్ ప్రిన్సిపల్ గురునాథ్ మేయప్పన్ మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. ఐపీఎల్ మ్యాచ్‌లలో ఫిక్సింగ్, బెట్టింగ్ వ్యవహారాలపై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోంది. ఈ వ్యవహారంలో బీసీసీఐని పక్కన పెట్టలేమని, ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పాలని శ్రీనివాసన్‌ను సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ప్రశ్నించారు. గురునాథ్ మేయప్పన్‌ను ఇప్పటికే పక్కన పెట్టామని శ్రీనివాసన్ సుప్రీంకోర్టుకు సమాధానం ఇచ్చారు. ఎలాంటి శిక్ష విధించాలో నిర్ణయించాల్సిందిగా ముద్గల్ కమిటీకే చెప్పాలని ఆయన కోరారు. -
శ్రీనివాసన్‌ను నమ్మేదెలా: సుప్రీంకోర్టు
-
శ్రీనివాసన్‌ను నమ్మేదెలా: సుప్రీంకోర్టు
ఐపీఎల్ బెట్టింగ్ కుంభకోణం విషయంలో సుప్రీంకోర్టు ఘాటుగా స్పందించింది. శ్రీనివాసన్‌కు ద్వంద్వ ప్రయోజనాలు లేవంటే నమ్మేదెలాగని ఈ కేసును విచారిస్తున్న ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఆయన బీసీసీఐ అధ్యక్షుడిగా, చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీకి యజమానిగా ఉన్నారని.. ఆయన అల్లుడు గురునాథ్ మేయప్పన్ ఫ్రాంచైజీకి ప్రిన్సిపల్‌గా ఉన్నారని తెలిపింది. ఇలాంటి శ్రీనివాసన్.. అభియోగాలకు అతీతంగా ఉండాల్సిందని, ఆట స్వచ్ఛతను కాపాడాల్సింది ఆయనేనని సుప్రీంకోర్టు తెలిపింది. -
క్రికెట్‌ను బీసీసీఐ చంపేస్తోంది: సుప్రీం
అవినీతికి అవకాశం ఇవ్వడం ద్వారా భారతదేశంలో క్రికెట్‌ను బీసీసీఐ చంపేస్తోందని సుప్రీంకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. ఐపీఎల్లో స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ తదితర అంశాలపై విచారణ సందర్భంగా సుప్రీం ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. అయితే, భారత క్రికెట్ ప్రతిష్ఠను ఎవరూ దెబ్బతీయలేరని ఐసీసీ ఛైర్మన్ శ్రీనివాసన్ చెన్నైలో వ్యాఖ్యానించారు. ఐసీసీ వరల్డ్ కప్ కోసం ఎంఆర్ఎఫ్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకునేందుకు ఆయన చెన్నై వచ్చారు. ఎంఆర్ఎఫ్ సంస్థతో ఒప్పందాలను ఆయన మార్చుకున్నారు. కోర్టులో ఉన్న విషయాలపై తాను మాట్లాడబోనని, ఎంఆర్ఎఫ్ ఒప్పందం కోసం తాను ఐసీసీ ఛైర్మన్‌గా మాత్రమే వచ్చానని చెప్పారు. -
అన్నీ మంచి శకునములే !
భారత క్రికెట్ పరిపాలనా వ్యవహారాల్లో శ్రీనివాసన్‌కు ఎదురులేదని మరోసారి రుజువు కాబోతోంది. మంగళవారం జరిగిన వర్కింగ్ కమిటీ సమావేశం ద్వారా చాలా అంశాల్లో స్పష్టత వచ్చింది. ఇక డిసెంబరులో శ్రీనివాసన్ బీసీసీఐ అధ్యక్ష బాధ్యతలు తీసుకోవడం లాంఛనమే కానుంది. సాక్షి క్రీడావిభాగం స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ కేసు విచారణ సందర్భంగా ముద్గల్ కమిటీ నివేదికను పరిశీలించిన సుప్రీం కోర్టు బెంచ్... ‘ఓ క్రికెటర్ తప్పు చేస్తున్నాడని శ్రీనివాసన్‌కు తెలిసినా ఆయన పట్టించుకోలేదు’ అని తెలిపింది. ఈ మొత్తం కేసుల విషయంలో ఆయనపై ఉన్న ప్రధాన ఆరోపణ ఇదొక్కటే. బెట్టింగ్, ఫిక్సింగ్‌లతో ఆయనకు సంబంధం లేదని నివేదిక ద్వారా వెల్లడైంది. అయితే ఉన్న ఒక చిన్న ఆరోపణ విషయంలో కూడా ఆయన దోషి కాదని బీసీసీఐ నిర్ధారించింది. సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన అంశం గురించి మంగళవారం జరిగిన వర్కింగ్ కమిటీ సమావేశంలో ఐపీఎల్ చైర్మన్ రంజీబ్ బిస్వాల్ వివరణ ఇచ్చారు. అదేమిటంటే... 2010లో భారత జట్టు శ్రీలంకలో పర్యటిస్తున్న సమయంలో బిస్వాల్ జట్టుకు మేనేజర్‌గా వ్యవహరించారు. ఆ పర్యటనలో ఒక భారత క్రికెటర్ (ముద్గల్ కమిటీలో ఈ క్రికెటర్ నంబర్ 3, చెన్నై సూపర్‌కింగ్స్ ఆటగాడు) తన హోటల్ రూమ్‌లో నిద్రపోకుండా ఒక మహిళతో బయట తిరుగుతూ కనిపించాడు. ఈ విషయాన్ని బిస్వాల్ అప్పుడే బోర్డుకు తెలిపారు. అప్పుడు శశాంక్ మనోహర్ బోర్డు అధ్యక్షుడు, శ్రీనివాసన్ కార్యదర్శి. వీరిద్దరితో పాటు రాజీవ్ శుక్లాకు కూడా ఈ విషయం చెప్పారు. దీంతో అప్పటి అధ్యక్షుడు మనోహర్ స్పందించి... ఆ క్రికెటర్‌ను గట్టిగా హెచ్చరించాలని బిస్వాల్‌కు సూచించారు. ఈ వ్యవహారంలో అధ్యక్షుడు చర్యలు తీసుకున్నందున నాటి కార్యదర్శి శ్రీనివాసన్ ఏమీ మాట్లాడలేదు. ముద్గల్ కమిటీ కూడా ఆ అంశాన్నే ప్రస్తావించిందని వర్కింగ్ కమిటీలో స్పష్టత వచ్చింది. ఫిక్సింగ్ కేసు విచారణ సందర్భంగా ఈ వ్యవహారాన్ని పూర్తిస్థాయిలో సుప్రీం కోర్టు దృష్టికి తీసుకువెళతారు. కాబట్టి శ్రీనివాసన్‌కు ఎలాంటి న్యాయపరమైన సమస్యలు రావని వర్కింగ్ కమిటీ భావిస్తోంది. ఈస్ట్‌జోన్‌లో కీలకమైన బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (క్యాబ్) అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా, శ్రీనివాసన్‌కు పూర్తిస్థాయిలో మద్దతు ప్రకటించారు. తొలుత కాస్త వెనుకడుగు వేసినా శ్రీని తప్పులేదని వర్కింగ్ కమిటీ తేల్చడంతో అండగా నిలిచేందుకు దాల్మియా ముందుకొచ్చారు. ఈ జోన్‌లోని ఆరు యూనిట్లు కూడా శ్రీనివాసన్‌కు పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతూ డిసెంబర్ 17న జరిగే ఏజీఎమ్‌లో ఆయన నామినేషన్ పత్రాలపై సంతకాలు చేయనున్నాయి. దీంతో అధ్యక్ష పదవి ఆశిస్తున్న శరద్ పవార్‌కు దాదాపుగా అన్ని ద్వారాలు మూసుకుపోయినట్లే. ఏజీఎమ్‌లో పవార్ వెనక్కి తగ్గినా.. అప్పటికప్పుడు కొత్త వ్యక్తి అధ్యక్షుడు అయ్యే అవకాశాలు లేవు. ఈస్ట్‌జోన్ మొత్తం శ్రీనివాసన్ వెంటే ఉంది. కాబట్టి ఆయన మూడోసారి బీసీసీఐ అధ్యక్షుడు కావడానికి లైన్ క్లియర్ అయినట్లే. మూడు సంఘాలపై చర్యలు! బీసీసీఐ ఎన్నికల అనంతరం మూడు సంఘాలపై కఠిన చర్యలు తీసుకోవాలని బోర్డు పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటివరకు బోర్డుకు అయిన కోర్టు ఖర్చులన్నీ ముంబై, పంజాబ్, విదర్భ సంఘాల నుంచి రాబట్టాలని భావిస్తున్నారు. గుర్తింపు లేని బీహార్ క్రికెట్ అసోసియేషన్‌కు చెందిన ఆదిత్య వర్మ కోర్టులో కేసు దాఖలు చేస్తే... ఈ మూడు సంఘాలకు సంబంధించిన అధికారులు వర్మకు అండగా నిలవడం వల్లే చర్యలు తీసుకుంటున్నారని క్రికెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక నుంచి ముంబైలో మ్యాచ్‌లు ఎంసీఏకి ఇవ్వకుండా... సీసీఐకి ఇచ్చి, బ్రబౌర్న్‌లో నిర్వహించాలనే ప్రతిపాదన కూడా ఉంది. -
దాల్మియాను కలిసిన శ్రీనివాసన్
కోల్‌కతా: ఐసీసీ చైర్మన్ ఎన్. శ్రీనివాసన్ ఆదివారం బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియాను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ‘క్యాబ్’ అనుబంధ యూనిట్లకు చెందిన 103 మంది సభ్యులు శ్రీనివాసన్‌ను సన్మానించారు. దాల్మియా ఇంట్లో ఈ కార్యక్రమం జరిగింది. ‘ఇందులో ప్రత్యేకంగా చూడాల్సింది ఏమీ లేదు. శ్రీనివాసన్ ఐసీసీ చైర్మన్ అయ్యాక దాల్మియాను తొలిసారి కలిశారు. అందుకే మా సభ్యులు కూడా సత్కరించారు’ అని క్యాబ్ సభ్యుడొకరు వెల్లడించారు. అనంతరం ‘క్యాబ్’ కోశాధికారి బిస్వరూప్ డే ఆధ్వర్యంలో నడుస్తున్న ‘రెఫ్యూజ్’ అనే ఎన్జీఓను ఐసీసీ చైర్మన్ సందర్శించారు. ఈ సందర్భంగా వ్యక్తిగత హోదాలో శ్రీనివాసన్ ఎన్జీవోకు రూ. 1 కోటి విరాళంగా అందజేశారు. మరోవైపు భారత సిరీస్‌నుంచి విండీస్ వైదొలగిన వ్యవహారంపై స్పందించేందుకు ఆయన నిరాకరించారు. -
శ్రీనివాసన్‌కు క్లీన్చిట్!
న్యూఢిల్లీ: ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్పై ఇంకా విచారణ కొనసాగుతున్నా... ఐసీసీ చైర్మన్ శ్రీనివాసన్‌కు మాత్రం ఊరట దక్కే అవకాశాలు కనబడుతున్నాయి. ఇప్పటి వరకు జరిగిన విచారణలో శ్రీని ప్రమేయం లేదని ఓ నిర్ధారణకు వచ్చిన ముద్గల్ కమిటీ ఆయనకు క్లీన్చిట్ ఇవ్వనున్నట్లు సమాచారం. ఫిక్సింగ్ కేసులో శ్రీనివాసన్‌కు వ్యతిరేకంగా ఒక్క ఆధారాన్నీ సేకరించలేకపోయిన కమిటీ సీబీసీఐడీ దర్యాప్తులో కూడా ఆయన జోక్యం లేదని తేల్చింది. కేవలం ఇద్దరు అధికారులు కావాలని ఆరోపణలు చేసినట్లు గుర్తించింది. మ్యాచ్‌లు ఫిక్స్ చేయాలని అటు కెప్టెన్ ధోనితోపాటు సూపర్‌కింగ్స్ ఆటగాళ్లకు కూడా శ్రీనివాసన్ ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదని కమిటీ దృష్టికి వచ్చింది. ఇటీవల సుప్రీంకోర్టుకు సమర్పించిన మధ్యంతర నివేదికలో కమిటీ ఈ అంశాలను పొందుపర్చినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే గురునాథ్ మెయ్యప్పన్‌పై కొన్ని ఆరోపణలు చేసిన కమిటీ... విక్రమ్ అగర్వాల్, ధోని, మెయ్యప్పన్ల మధ్య జరిగిన సమావేశంలో ఫిక్సింగ్ అంశాలు చోటు చేసుకోలేదని నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. -
ఆంధ్ర నుంచి ఆటగాళ్లు రావాలి!
ఐసీసీ చైర్మన్ శ్రీనివాసన్ ఆకాంక్ష త్వరలోనే విశాఖకు టెస్టు హోదా ముగిసిన ఏసీఏ వజ్రోత్సవాలు సాక్షి, విశాఖపట్నం: ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) భవిష్యత్తులో ఎక్కువ సంఖ్యలో అంతర్జాతీయ క్రికెటర్లను తయారు చేయాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్ ఎన్. శ్రీనివాసన్ ఆకాంక్షించారు. ఇక్కడి అకాడమీలలో అత్యున్నత స్థాయి సౌకర్యాలు ఉన్నాయని, వర్ధమాన ఆటగాళ్లు వాటిని ఉపయోగించుకొని కెరీర్లో ఎదగాలని ఆయన సూచించారు. రెండు రోజుల పాటు నిర్వహించిన ఏసీఏ వజ్రోత్సవాలు ఆదివారం ఇక్కడ ముగిశాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీనివాసన్, చక్కటి స్టేడియం ఉన్న విశాఖకు త్వరలోనే టెస్టు హోదా కల్పిస్తామని చెప్పారు. టెస్టు హోదా గురించి బీసీసీఐ ఇచ్చిన నివేదిక ఇప్పుడు ఐసీసీ పరిశీలనలో ఉందని అన్నారు. క్రికెట్ అభివృద్ధి కోసం ఒక్కో అసోసియేషన్‌కు బీసీసీఐ దాదాపు రూ. 50 కోట్లు కేటాయిస్తోందని, అన్ని ప్రాంతాల్లో క్రికెట్ అభివృద్ధిపై బోర్డు దృష్టి పెట్టిందన్నారు. ‘జార్ఖండ్ తదితర రాష్ట్రాలు ఈ నిధులతో కొత్త స్టేడియాలు నిర్మించుకున్నాయి. గతంతో పోలిస్తే చిన్న నగరాలనుంచి ఆటగాళ్లు ఇప్పుడు ఎక్కువ మంది పెద్ద స్థాయికి చేరుకుంటున్నారు. ధోని ఇందుకు చక్కటి ఉదాహరణ’ అని శ్రీని వ్యాఖ్యానించారు. గత ఐదేళ్లలో బీసీసీఐతో పాటు ఐసీసీ ఆదాయం కూడా భారీగా పెరిగిందని, ఐపీఎల్ కారణంగా కూడా ఆదాయం పెరుగుతోందని శ్రీనివాసన్ వెల్లడించారు. ఆంధ్ర మాజీ క్రికెటర్లకు ఆర్థిక సహాయం నిమిత్తం ఏసీఏ ప్రకటించిన చెక్‌ను అందజేసిన ఐసీసీ చైర్మన్... బీసీసీఐ కూడా గతంలోనే మాజీ ఆటగాళ్లు, అంపైర్ల సంక్షేమం కోసం ‘వన్ టైమ్ బెనిఫిట్ స్కీమ్’ను ప్రారంభించిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బీసీసీఐ అధ్యక్ష, కార్యదర్శులు శివలాల్ యాదవ్, సంజయ్ పటేల్, మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే, ఏసీఏ అధ్యక్ష, కార్యదర్శులు డీవీ సుబ్బారావు, గోకరాజు గంగరాజు, ఏపీ రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాసరావు, అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏసీఏ 13 జిల్లాల ప్రతినిధులు శ్రీనివాసన్‌ను గజమాలతో సత్కరించారు. జాతీయ క్రీడలకు ఆతిథ్యమిస్తాం... 2017లో జరిగే జాతీయ క్రీడలకు ఆంధ్రప్రదేశ్ ఆతిథ్యం ఇవ్వనుందని రాష్ట్ర క్రీడా మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు. రాష్ట్రంలో క్రీడా వసతులు మెరుగు పర్చుకునేందుకు జాతీయ క్రీడల నిర్వహణ మంచి అవకాశమన్న ఆయన... కేంద్ర ప్రభుత్వం ఇందుకోసం రూ. 2 వేల కోట్లు ఇవ్వవచ్చని వెల్లడించారు. -
ఆంధ్రా ఆటగాళ్లు భారతజట్టుకు ఆడాలి: శ్రీనివాసన్
విశాఖపట్నం: ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ వజ్రోత్సవాలు ఆదివారం విశాఖపట్నంలో ఘనంగా జరిగాయి. ఈ వజ్రోత్సవ కార్యక్రమానికి ఐసీసీ చైర్మన్ శ్రీనివాసన్, క్రికెటర్ అనీల్ కుంబ్లేలు హాజరయ్యారు. 2017లో ఏపీలో నేషనల్ గేమ్స్ నిర్వహించే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకుంటుందని క్రీడాశాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. జాతీయ క్రీడల్ని నిర్వహించడం ద్వారా వచ్చే నిధులతో విశాఖలో స్పోర్ట్ కాంప్లెక్స్ నిర్మించుకోవచ్చని అచ్చెన్నాయుడు అన్నారు. క్రీడలను ప్రోత్సహించే విధంగా పాఠ్యపుస్తకాల్లో క్రీడా అంశాలను చేర్చాలని విద్యాశాఖను అచ్చెన్నాయుడు కోరారు. దేశంలో అన్ని స్టేడియాలు మోడ్రనైజ్ అవుతున్నాయని, క్రీడాకారులకు అవకాశాలు మెండుగా ఉన్నాయని, వాటిని అందరూ అందిపుచ్చికోవాలని ఐసీసీ ఛైర్మన్ శ్రీనివాసన్ ఈకార్యక్రమంలో తెలిపారు. ఆంధ్రా నుంచి ఆటగాళ్లు భారతజట్టుకు ప్రాతినిథ్యం వహించాలని కోరుకుంటున్నానని శ్రీనివాసన్ తెలిపారు. -
నియమావళిని మార్చేది లేదు: శ్రీనివాసన్
చెన్నై: జడేజా, అండర్సన్ గొడవ నేపథ్యంలో ఆటగాళ్ల క్రమశిక్షణా నియమావళిని మార్చాలనే డిమాండ్‌ను ఐసీసీ తోసిపుచ్చింది. ‘ఆటగాళ్ల కోసం ఏర్పాటు చేసిన ప్రవర్తన నియమావళిని పునర్వ్యవస్థీకరించే ఆలోచన మాకు లేదు’ అని ఐసీసీ చీఫ్ ఎన్.శ్రీనివాసన్ స్పష్టం చేశారు. జడేజాతో జరిగిన వాగ్వాదంలో అండర్సన్ ఎలాంటి శిక్ష లేకుండా తప్పించుకోవడంతో భారత క్రికెట్ బోర్డు ఈ డిమాండ్‌ను తెర మీదకు తెచ్చింది. అటు ద్రవిడ్ కూడా జ్యుడీషియల్ కమిషనర్ ఇచ్చిన తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. -
వజ్రోత్సవ ధగధగలు
నేటి నుంచి ఏసీఏ డైమండ్ జూబ్లీ వేడుకలు రేపు విశాఖ రానున్న ఐసీసీ చైర్మన్ శ్రీనివాసన్ విశాఖపట్నం: ఆరు దశాబ్దాల క్రితం.. అప్పటి మద్రాసు నగరం నుంచి స్వయం ప్రతిపత్తి కోసం తరలివచ్చిన ఓ క్రీడా సంస్థ ఇప్పుడు ఇంతింతై ఎదిగి అవధుల్లేని ఉత్సాహంతో పరవళ్లు తొక్కుతోంది. ఆంధ్రప్రాంతంలో క్రికెట్ వటవృక్షంగా విస్తరించిన ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) వజ్రోత్సవాలకు ఉరకలేస్తోంది. ఏసీఏ కీర్తి కిరీటంలో వజ్రం వంటి విశాఖ ఈ ఉత్సవాలకు వేదికగా నిలుస్తోంది. రెండు రోజుల వజ్రోత్సవ వేడుకలకు విశాఖ ఆతిథ్యం ఇవ్వనుంది. క్రికెట్ ఘనాపాఠీలంతా పాల్గొనే ఉత్సవాలకు మరింత వన్నె తెచ్చే విధంగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్ శ్రీనివాసన్ విశాఖ రానున్నారు. తొలిరోజైన శనివారం వేడుకల్లో నిన్నటి స్టైలిష్ బ్యాట్స్‌మన్ వీవీఎస్ లక్ష్మణ్, గతతరం మేటి బౌలర్ జవగళ్ శ్రీనాథ్ హాజరు కానున్నారు. రెండో రోజు ఆదివారం వేడుకల్లో ఐసీసీ అధ్యక్షుడు శ్రీనివాసన్ పాల్గొనబోతున్నారు. తొలిరోజు వేడుకలు వాల్తేర్ క్లబ్లో మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభం కానున్నాయి. మలిరోజు వేడుకలు నొవాటెల్‌లో ఐదుగంటలకు మొదలు కానున్నాయని శుక్రవారం నిర్వహించిన వజ్రోత్సవ వేడుకల ప్రారంభ కార్యక్రమంలో ఏసీఏ కార్యదర్శి గోకరాజు గంగరాజు తెలిపారు. ఇదీ కార్యక్రమం : ఆంధ్ర మాజీ రంజీ ఆటగాళ్లకు సన్మానాలు, సాంస్కతిక కార్యక్రమాలతో వేడుకలు ఉల్లాసంగా సాగిపోనున్నాయి. ము గింపు వేడుకలకు బీసీసీఐ ప్రతినిధులు శివలాల్ యాద వ్, సంజయ్‌పటేల్, ఐపీఎల్ చైర్మన్ రంజీబ్ బిస్వాల్, అనిల్‌కుంబ్లే, పాండవ్, మాథ్యూస్, వినోద్, చేతన్ భగత్ రానున్నారు. పూర్వ రంజీ ఆటగాళ్లకు ప్రోత్సాహం గడచిన అర్ధశతాబ్దిలో రంజీల్లో ఆంధ్రకు ప్రాతినిధ్యం వహించిన 108 మంది క్రికెటర్లకు వజ్రోత్సవ వేడుకల్లో నగదు ప్రోత్సాహకం అందించనున్నారు. ఆడిన మ్యాచ్‌ల ప్రకారం లక్ష నుంచి ఐదు లక్షల వరకు అందుకోనున్నారు. అటువంటి వారి ఆరోగ్య సమస్యలపై కూడా ఏసీఏ దృష్టి సారించనుందని గంగరాజు చెప్పారు. త్వరలోనే టెస్ట్ హోదా ఏసిఏ -వీడీసీఏ సంయుక్తంగా నిర్మించిన వైఎస్ఆర్ స్టేడియంకు త్వరలో టెస్ట్ హోదా లభించనుందని గంగరాజు తెలిపారు. ఇటీవలే ప్రతినిధుల బృందం స్టేడియాన్ని మ రోసారి పరిశీలించి పంపిన నివేదిక ప్రకారం కొన్ని మార్పులు చేస్తే త్వరలోనే విశాఖకు టెస్ట్ హోదా లభించనుందని చెప్పారు. అక్టోబర్‌లో మరో వన్డే ఏడాది వ్యవధిలో రెండు వన్డేలు నిర్వహించిన ఘనత విశాఖ స్టేడియం పరం కానుంది. గతేడాది చివర్లో వైఎస్సార్ స్టేడియంలో వెస్టిండీస్- భారత్ వన్డే మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. అక్టోబర్‌లో వెస్టీండీస్ పర్యటనలో భాగంగా మరో మ్యాచ్ కు స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. ఏసీఏ వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా బీసీసీఐ కానుక అందించనుంది. ఏ క్రీడకైనా ప్రోత్సాహం ఏ క్రీడలో ప్రతిభ చూపుతున్న క్రీడాకారుడికైనా ఆర్థిక సాయం అందించేందుకు ఏసీఏ ముందుంటుంది. అందు కోసం రూ. 30 లక్షల నిధిని ఏర్పాటు చేశాం. వ్యక్తిగత క్రీడాంశాల్లోనే కాకుండా టీ మ్ ఈవెంట్లలోనూ ప్రతిభ చూపే ఆటగాళ్లకు సా యం అందిస్తాం. చెస్, ఆర్చరీ, స్విమింగ్‌లో ప్ర తిభావంతులకు ఈ సాయం అందించాం. - గోకరాజు గంగరాజు, ఏసీఏ కార్యదర్శి -
చదువుతూనే దొంగతనాలు
వారు ముగ్గురూ స్నేహితులు. బాగా చదువుకున్న వారు. ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడి పేరుప్రతిష్టలు తెస్తారని తల్లిదండ్రులు ఆశించారు. అయితే వారి ఆశలను అడియాశలు చేశారు. జల్సాలకు అలవాటుపడి దొంగలు, దోపిడీదారులుగా మారిపోయారు. కన్నవారికి పుత్రశోకాన్నిమిగిల్చారు. చెన్నై, సాక్షి ప్రతినిధి: ఓ ముగ్గురు మిత్రులు చదువుతూనే దొంగనాలకు అలవాటు పడ్డారు. ఇష్టారాజ్యంగా దోపిడీలు చేస్తూ పోలీసులను బురిడీ కొట్టించారు. వీరిపై నిఘా వేసిన పోలీసులు గురువారం చాకచక్యంగా పట్టుకుని కటకటాలకు పంపారు. శుక్రవారం విచారణలు పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. చెన్నై కొడంగయ్యూరుకు చెందిన శ్రీనివాసన్, ముగప్పేర్‌కు చెందిన ఎల్.రాయన్ స్నేహితులు. తాంబరంలోని కాలేజీలో ఎంఏ మొదటి సంవత్సరం చదువుతున్నారు. శ్రీనివాసన్‌తో ప్లస్ 2 వరకు చదివిన అభిషేక్ తోడయ్యాడు. వీరు ముగ్గురు ఒక్కటిగా ఉంటూ అన్నిచోట్లకూ కలిసే వెళ్లేవారు. శ్రీనివాసన్ తండ్రి రాజశేఖర్‌ది తిరునెల్వేలి. గతంలో వారి బంధువుల ఇంట్లో పెళ్లి జరిగింది. శ్రీనివాసన్ తన ఇద్దరు మిత్రులను తీసుకెళ్లాడు. పెళ్లికి హాజరైన మహిళలంతా భారీ స్థాయిలో నగలు ధరించడం చూశారు. వాటిపై ఎల్లరాయన్ కన్నుపడింది. నగలు కాజేస్తే జీవితాంతం ఉల్లాసంగా గడపవచ్చని తన స్నేహితులకు నూరిపోశాడు. చెన్నై నుంచి రైలులో తిరునెల్వెలీ చేరారు. ముందుగానే సిద్ధం చేసుకున్న మోటార్‌బైక్‌ను రైల్వేస్టాండ్ నుంచి తీసుకుని రోడ్లలో వెళ్లే మహిళల మెడల్లోని బంగారు నగలను దోచుకున్నారు. అదే రోజు రాత్రి లాడ్జీల్లో బసచేసి ఆన్లైన్ ద్వారా ఏసీ బస్సుల్లో రిజర్వేషన్ చేసుకుని చెన్నైకి చేరుకుంటారు. ఏడాదిన్నర కాలంలో ఈ విద్యార్థులు 27 దొంగతనాలు చేశారు. నెల్లైలో తరచూ దొంగతనాలు జరగడం, నిందితులు పట్టుపడక పోవడం అక్కడి పోలీసులకు తలనొప్పిగా మారింది. ఇటీవల ఒక మహిళను దోచుకునిపోతూ శ్రీనివాసన్ పట్టుబడడంతో విద్యార్థుల వ్యవహారం బట్టబయలైంది. శ్రీనివాసన్ ఇచ్చిన సమాచారంతో గురువారం చెన్నైకి చేరుకున్న పోలీసులు అభిషేక్‌ను పట్టుకుని వంద సవర్ల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. దొంగతనాలకు నాయకత్వం వహించిన ఎల్లరాయన్ పట్టుబడితే మరో 60 సవర్ల నగలు దొరకవచ్చని పోలీసులు భావిస్తున్నారు. కాలేజీ ఎన్నికల్లో విద్యార్థుల సంఘాధ్యక్షునిగా పోటీచేసిన శ్రీనివాసన్ చోరీ సొమ్ముతో పాండిచ్చేరి నుంచి రూ.3 లక్షలతో మద్యం బాటిళ్లు తెప్పించి పంచిపెట్టాడు. మరికొంత సొమ్ముతో చెన్నైలో కాల్‌సెంటర్‌ను స్థాపించి అందమైన అమ్మాయిలను పనిలో చేర్చుకున్నాడు. తమకు అనుకూలంగా వ్యవహరించే అమ్మాయిలకు అధిక జీతాలు చెల్లిస్తూ వారితో విలాసంగా తిరిగేవారు. మహాలక్ష్మి అనే యువతికి ఎల్లరాయన్ లక్షలాది రూపాయలు ఇచ్చేవాడు. పోలీసులు తనకోసం వెదుకుతున్నారని తెలుసుకున్న ఎల్లరాయన్ సదరు మహాలక్ష్మిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లినట్లు పోలీసులు చెబుతున్నారు. అరెస్టయిన మరో విద్యార్థి అభిషేక్ సైతం చెన్నైలో ఉద్యోగావకాశాల సంస్థను స్థాపించి, తన ఆశలను తీర్చినవారికి ఉద్యోగాలు ఇప్పించాడు. ఎల్లరాయన్ తల్లిదండ్రులు దుబాయ్‌లో ఉద్యోగం చేస్తున్నారు. వీరికి ముగప్పేరులో ఖరీదైన బంగ్లా ఉంది. తల్లిదండ్రులు దూరంగా ఉండడం వల్ల విలాసాలకు అలవాటుపడిన ఎల్లరాయన్కు అందుకు తగిన ఆదాయం కోసం దోపిడీ బాటపట్టాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు దుబాయ్ నుంచి చెన్నైకు వచ్చి తల్లడిల్లిపోయారు. పరారీలో ఉన్న కుమారుడిని వెతికిపట్టుకుని జైల్లో పెట్టాలని పోలీసులను కోరారు. అభిషేక్ తల్లిదండ్రులది కన్యాకుమారి జిల్లా. ప్రభుత్వ రవాణాశాఖలో కండక్టర్‌గా పనిచేసి రిైటె రయ్యాడు. దొంగిలించిన నగలను అమ్మే బాధ్యతను అభిషేక్ తీసుకున్నాడు. జాబ్ కన్సల్టెన్సీ పేరుతో నిరుద్యోగులను బోల్తాకొట్టించాడు. రూ.500లు కట్టి రిజిష్టరు చేసుకుంటే వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసగించేవాడు. ఈ ముగ్గురు విద్యార్థులు తిరునెల్వేలోనే కాదు చెన్నై శివార్లలో సైతం దొంగతనాలు చేసినట్లు విచారణలో వెల్లడైంది. -
అన్నను హత్య చేసిన తమ్ముడు
ఒంగోలు క్రైం : వివాహేతర సంబంధం నేపథ్యంలో అన్నపై తమ్ముడు గొడ్డలితో దాడి చేయడంతో అన్న అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన నగరం పరిధిలోని పేర్నమిట్టలో శనివారం రాత్రి జరిగింది. వివరాలు.. స్థానిక క్రిస్టియన్‌పాలేనికి చెందిన గుండె కోటయ్య (48)కు, ఆయన తమ్ముడు జయరావుకు కొంతకాలంగా మనస్పర్థలున్నాయి. పక్కపక్కనే నివాసం ఉంటూ ఘర్షణ పడ్డారు. కోపోద్రిక్తుడైన తమ్ముడు జయరావు గొడ్డలితో అన్న కోటయ్యపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన కోటయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. అన్నదమ్ముల మధ్య కుటుంబ కలహాలతో పాటు వివాహేతర సంబంధం విషయంలో కూడా వివాదం ఉన్నట్లు సమాచారం. గతంలో పెద్దలు ఇద్దరి మధ్య రాజీ కుదిర్చి గొడవలు లేకుండా చేశారు. తమ్ముడు జయరావు పెద్దల మాటలు లెక్క చేయకుండా యథావిధిగా సంబంధం కొనసాగిస్తుండటంతో అతని గొడ్డలి వేటుకు అన్న బలయ్యాడు. కోటయ్యకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. తండ్రి మృతితో కుమార్తెలు రమాదేవి, సౌజన్య, మాధవి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. నిందితుడు జయరావు పరారయ్యాడు. సమాచారం తెలుసుకున్న తాలూకా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. సీఐ ఐ.శ్రీనివాసన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
క్రికెట్ ఆదాయం క్రికెట్‌కే: శ్రీనివాసన్
చెన్నై: పలు మార్గాల నుంచి వస్తున్న ఆదాయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) క్రికెట్ అభివృద్ధికే ఖర్చు చేస్తోందని ఐసీసీ చైర్మన్ శ్రీనివాసన్ అన్నారు. ఆదాయాన్ని క్రికెటర్లకు, రాష్ట్ర సంఘాలకు పంచుతున్నట్లు ఆయన వివరించారు. ఐసీసీ చైర్మన్‌గా ఎన్నికైన శ్రీనివాసన్‌ను మంగళవారం మద్రాస్ చాంబర్ ఆఫ్ కామర్స్, మద్రాస్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా శ్రీనివాసన్ మాట్లాడుతూ... బీసీసీఐ లాభాపేక్ష లేని బోర్డు అని, కానీ అందరూ దానిని తప్పుగా అర్థం చేసుకుంటారని ఆయన స్పష్టం చేశారు. ‘తరుచుగా బీసీసీఐని అంతా తప్పుగా అర్థం చేసుకుంటారు. బోర్డు చేసే అభివృద్ధి పనులను ఎవరూ పట్టించుకోరు. 2004 నుంచి బీసీసీఐకి మీడియా హక్కులు, స్పాన్సర్ల ద్వారా భారీగా ఆదాయం వస్తోంది. క్రికెట్ అభివృద్ధే లక్ష్యంగా 26 శాతం ఆదాయాన్ని క్రికెట్ సంఘాలకు, దేశవాళీ, జాతీయ క్రికెటర్లకు పంచుతోంది. ఒకప్పుడు రంజీ ట్రోఫీ ఆడే ఆటగాళ్లకు రోజు వందల్లో ఫీజు దక్కేది. ఇప్పుడు రూ. 35 వేలు చెల్లిస్తోంది. అందుకే ఆటగాళ్లు ప్రొఫెషనల్‌గా తయారవుతున్నారు’ అని శ్రీనివాసన్ చెప్పారు. -
చైనా కూడా సిద్ధంగా ఉంది!
ఆట పది దేశాలకే పరిమితం కారాదు కొత్త జట్లపై ఐసీసీ చైర్మన్ శ్రీనివాసన్ వ్యాఖ్య న్యూఢిల్లీ: టెస్టు క్రికెట్ పది దేశాలకే పరిమితం కారాదని, ఆసక్తి ఉన్న అన్ని దేశాలనూ ఆటలోకి చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నామని ఐసీసీ తొలి చైర్మన్ ఎన్. శ్రీనివాసన్ అన్నారు. చైనా కూడా ఇందుకు సిద్ధంగా ఉందని ఆయన వెల్లడించారు. ‘టెస్టు క్రికెట్ పది మందికే పరిమితమైన క్లబ్‌లాగా ఉండరాదు. అవకాశం ఉన్న ప్రతీ దేశంలో ఆటను అభివృద్ధి చేయాల్సి ఉంది. ముఖ్యంగా ఏసీసీ సభ్య దేశమైన చైనా కూడా ఆసక్తిగా ఉంది. ప్రస్తుతం ఇతర క్రీడలపై దృష్టి సారిస్తున్నా... ఒలింపిక్ క్రీడగా గుర్తిస్తే తామూ క్రికెట్లోకి పూర్తి స్థాయిలో అడుగు పెడతామని వారు స్పష్టం చేశారు’ అని శ్రీనివాసన్ చెప్పారు. క్రికెట్ అభివృద్ధి కోసమే తాను పని చేస్తానని, ఇందుకు ఐసీసీ సభ్యులందరి సహకారం కోరినట్లు ఆయన అన్నారు. టెస్టులు, వన్డేలు తర్వాత టి20 క్రికెట్‌కు కూడా తాను మద్దతు పలికినట్లు శ్రీని చెప్పారు. ‘టెస్టుల సమయంలో వన్డేలు అవసరమా అని, ఆ తర్వాత టి20లు ఎందుకు అని నేనూ భావించాను. కానీ టి20లు కొత్త ఆటగాళ్లను, అభిమానులను క్రికెట్ వైపు తీసుకొచ్చాయి’ అని ఐసీసీ బాస్ అభిప్రాయపడ్డారు. ఇప్పుడు ఐసీసీలో భారత్ ఆధిపత్యం 70-80 ఏళ్ల శ్రమకు ఫలితమన్నారు. టెస్టు క్రికెట్ ప్రధాన వేదికల్లో ఒకటైన చెన్నైకి ఐపీఎల్లో జట్టు లేకపోతే ఒక క్రికెట్ అభిమానిగా తాను బాధపడేవాడినని, అందుకే సూపర్ కింగ్స్‌ను తీసుకున్నట్లు శ్రీనివాసన్ చెప్పారు. బీసీసీఐలో తాను శాశ్వతం కాదని, పదవీకాలం ముగిసిపోతే దానితో సంబంధం ఉండదని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు కేంద్ర ఆర్థిక మంత్రి, బీసీసీఐ మాజీ ఉపాధ్యక్షుడు అరుణ్ జైట్లీని ఆదివారం మర్యాద పూర్వకంగా కలిశారు. -
ఐసీసీ ఛైర్మన్ గా శ్రీనివాసన్ నియామకం
మెల్బోర్న్ : అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తొలి చైర్మన్‌గా బీసీసీఐ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్ నియమితులయ్యారు. ఐసీసీ వార్షిక సమావేశంలో గురువారం ఆయన పేరును అధికారికంగా ప్రకటించారు. ఈ వార్షిక సమావేశం అనంతరం 29న శ్రీనివాసన్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. శ్రీనివాసన్ ఐసీసీ చైర్మన్ పదవి చేపట్టకుండా నిలువరించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే. పిటిషన్ దాఖలు చేసిన క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బీహార్ (క్యాబ్)కు అధికారిక గుర్తింపు లేనందున సుప్రీంకోర్టు దాన్ని తిరస్కరించింది. శ్రీనివాసన్ అభ్యర్థిత్వాన్ని బీసీసీఐ ఇంతకుముందే నిర్ణయించినప్పటికీ ఐసీసీ నిబంధనల ప్రకారం ఎన్నికకు వారం రోజులు ముందు మరోసారి దాన్ని ఖరారు చేయాల్సి వుంటుంది. -
సుప్రీంలో శ్రీనివాసన్‌కు ఊరట
న్యూఢిల్లీ: బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్‌కు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) పదవి చేపట్టకుండా అడ్డుకోవాలన్న పిటిషన్‌ను వెంటనే విచారించేందుకు నిరాకరించింది. వెంటనే విచారించాల్సిన అవసరం లేదని జస్టిస్ విక్రమ్ జీత్ సేన్ సారథ్యంలోని ధర్మాసనం పేర్కొంది. బీహార్ క్రికెట్ సంఘం దాఖలు చేసిన పిటీషన్‌ను సోమవారం సుప్రీం ధర్మాసనం విచారించింది. ఐపీఎల్ అక్రమాల కేసులో శ్రీనివాసన్ విచారణ ఎదుర్కొంటున్నందున ఆయన ఐసీసీ పదవి చేపట్టకుండా అడ్డుకోవాలని కోరింది. అయితే ఆ సయమం వచ్చినపుడు విచారిస్తామని న్యాయస్థానం పేర్కొంది. -
ఆదేశాలను మార్చలేం!
శ్రీనివాసన్ అభ్యర్థన తిరస్కరణ న్యూఢిల్లీ: బీసీసీఐ అధ్యక్షుడిగా ఐపీఎల్ యేతర వ్యవహారాలు చేపట్టడానికి వీలుగా ఆదేశాల్లో మార్పులు చేయాలన్న శ్రీనివాసన్ అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. జస్టిస్ పట్నాయక్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను తాము మార్చలేమని జస్టిస్ బీఎస్ చౌహన్, సిక్రిలతో కూడిన ద్విసభ్య బెంచ్ వెల్లడించింది. దీంతో శ్రీని పిటిషన్‌ను విచారణకు స్వీకరించేందుకు న్యాయమూర్తులు అంగీకరించలేదు. మార్పులు కావాలనుకుంటే గతంలో తీర్చు ఇచ్చిన బెంచ్‌నే సంప్రదించాలని సూచించారు. ‘ఈ కేసులో మీరు ప్రతివాదులుగా ఉన్నారు. విచారణ మొత్తం మీ ముందే జరిగింది. మీకు తెలియకుండా ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. మీ సమక్షంలోనే తీర్పు వెల్లడించారు. కాబట్టి వేరే బెంచ్ ఇచ్చిన ఆదేశాల్లో మేం మార్పు చేయలేం’ అని బెంచ్ స్పష్టం చేసింది. -
ఫిక్సింగ్పై విచారణకు త్రిసభ్య కమిటీ
ప్యానెల్లో రవిశాస్త్రి, సీబీఐ మాజీ డెరైక్టర్ రాఘవన్ బీసీసీఐ వర్కింగ్ కమిటీ నిర్ణయం న్యూఢిల్లీ: గతేడాది ఐపీఎల్లో వెలుగుచూసిన స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ ఉదంతాలపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మరోసారి విచారణ కమిటీని నియమించనుంది. సుప్రీం కోర్టు ఆధ్వర్యంలో ఏర్పాటైన ముద్గల్ కమిటీ నివేదికలో బోర్డు అధ్యక్షుడు శ్రీనివాసన్‌తో పాటు మరో 12 మందిని నిందితులుగా పేర్కొన్న విషయం తెలిసిందే. ఫిక్సింగ్పై పూర్తి పారదర్శకంగా విచారణ సాగాలంటే సభ్యులుగా ఎవరిని నియమిస్తారో తెలపాల్సిందిగా ఈనెల 16న కోర్టు బీసీసీఐని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆదివారం జరిగిన వర్కింగ్ కమిటీ... ఫిక్సింగ్పై విచారణకు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో మాజీ ఆల్‌రౌండర్ రవిశాస్త్రితో పాటు కలకత్తా హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ జేఎన్ పటేల్, సీబీఐ మాజీ డెరైక్టర్ ఆర్కే రాఘవన్ సభ్యులుగా ఉంటారని తెలిపింది. 1999-2000లో సంచలనం సృష్టించిన మ్యాచ్ ఫిక్సింగ్పై సీబీఐ విచారణకు రాఘవన్ నేతృత్వం వహించారు. ఓ దశలో లోక్‌సభ మాజీ స్పీకర్ సోమ్‌నాథ్ ఛటర్జీ పేరుపై కూడా చర్చ జరిగింది. సభ్యుల పేర్లను సుప్రీం కోర్టు పరిశీలనకు పంపనున్నారు. ‘ఈ త్రిసభ్య కమిటీకి ఎవరు నేతృత్వం వహించాలో కోర్టు తెలుపుతుంది. మా బాధ్యతల్లా విచారణ కమిటీకి సభ్యులను నియమించడం వరకే. దాన్ని పూర్తి చేశాం’ అని వర్కింగ్ కమిటీలో పాల్గొన్న సభ్యుడొకరు తెలిపారు. శ్రీనివాసన్‌ను విమర్శిస్తున్న శశాంక్ మనోహర్ విద ర్భ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధిగా సమావేశానికి హాజరయ్యారు. క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌గా శ్రీని స్థానంలో మరొకరు... మరోవైపు సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం బోర్డు క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌గా ఉన్న శ్రీనివాసన్ స్థానంలో మరొకరిని నియమించనున్నారు. మే రెండో వారంలో జరిగే ప్రత్యేక సాధారణ సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకుంటామని ముంబై క్రికెట్ సంఘం (ఎంసీఏ) సంయుక్త కార్యదర్శి పీవీ శెట్టి తెలిపారు. మరోవైపు ఈ కమిటీలో ఉన్న రవిశాస్త్రి ఐపీఎల్, క్రికెట్ కామెంట్రీతో సంబంధం ఉన్నవాడని, అందుకే వీరు ఏమేరకు స్వేచ్ఛగా పనిచేస్తారో చూడాల్సిందని బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఏసీ ముత్తయ్య అభిప్రాయపడ్డారు. రవిశాస్త్రి ఎంపికపై అభ్యంతరం ఫిక్సింగ్పై విచారణ కోసం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీలో రవిశాస్త్రిని నియమించడాన్ని బీహార్ క్రికెట్ సంఘం కార్యదర్శి ఆదిత్య వర్మ వ్యతిరేకించారు. ‘బీసీసీఐ ఏర్పాటు చేసిన ఈ ప్యానెల్‌ను 22న సుప్రీం కోర్టులో జరిగే విచారణలో వ్యతిరేకిస్తాను. సీబీఐ లేదా జాతీయ ఇం టెలిజన్స్ ఏజెన్సీ (ఎన్ఐఏ) ఆధ్వర్యంలో మాత్రమే విచారణ జరగాలి. ముగ్గురు సభ్యుల్లో ఇద్దరిపై నాకెలాంటి వ్యతిరేకత లేకపోయినా రవిశాస్త్రి చాలాకాలంగా బీసీసీఐ నుంచి వేతనం పొందుతున్న ఉద్యోగి. గత కొన్ని రోజులుగా ఆయన శ్రీని జపం చేస్తున్నారు. అందుకే ఆయనపై ఎలాంటి ఆశ లేదు’ అని వర్మ తేల్చి చెప్పారు. -
బీసీసీఐ త్రిసభ్య కమిటీలో రవిశాస్త్రి!
ముంబై: ఐపీఎల్-6 స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలకు సంబంధించి త్రిసభ్య కమిటీని బీసీసీఐ ఏర్పాటు చేసింది. దీనిపై ఆదివారం బీసీసీఐ అత్యవసరంగా సమావేశమైంది. భారత మాజీ ఆల్ రౌండర్ రవిశాస్త్రి, కోల్ కతా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జేఎన్ పటేల్, మాజీ సీబీఐ డైరెక్టర్ రాఘవన్ లకు ఈ కమిటీలో స్థానం కల్పిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఈ త్రిసభ్య కమిటీలోని పేర్లను బీసీసీఐ సుప్రీంకోర్టుకు నివేదించింది. ఐపీఎల్లో వెలుగు చూసిన స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్‌లపై విచారణ పారదర్శకంగా జరగాలంటే శ్రీనివాసన్ అధ్యక్ష స్థానం నుంచి తాత్కాలికంగా తప్పుకోవాలని గతంలో సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 22వ తేదీన ఫిక్సింగ్ కేసు సుప్రీంలో విచారణకు రానున్న సందర్భంలో బీసీసీఐ అత్యవసరంగా సమావేశమైంది. ఈ భేటీకి విదర్భ క్రికెట్ అసోసియేషన్ తరుపున శశాంక మనోహర్ హాజరైయ్యాడు. ముగ్గురు సభ్యుల కమిటీకి రాజ్యసభ మాజీ స్పీకర్ సోమనాథ్ చటర్జీ పేరును కూడా వర్కింగ్ కమిటీలో ప్రస్తావించారు. -
‘నన్ను కొనసాగనివ్వండి’
బోర్డు అధ్యక్ష పదవిపై సుప్రీంలో శ్రీనివాసన్ అఫిడవిట్ న్యూఢిల్లీ: బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి తాను తప్పుకోవాలన్న తీర్పును పునస్సమీక్షించాలని కోరుతూ ఎన్.శ్రీనివాసన్ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. తిరిగి తనను పదవీ బాధ్యతలు తీసుకునేలా ఆదేశించాలని కోరారు. బీహార్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఆదిత్య వర్మ చేసిన అభియోగాల్లో ఎలాంటి వాస్తవాలు లేవని ఆయన పేర్కొన్నారు. ఐపీఎల్లో వెలుగు చూసిన స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్‌లపై విచారణ పారదర్శకంగా జరగాలంటే శ్రీనివాసన్ అధ్యక్ష స్థానం నుంచి తాత్కాలికంగా తప్పుకోవాలని గతంలో సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ‘ఫిక్సింగ్పై జరుగుతున్న వాదనల్లో నాపై పూర్తి నిరాధార, అవాస్తవ ఆరోపణలు తీవ్ర ఆవేదనను కలిగించాయి. అలాగే బోర్డు పదవిలో నేనెందుకు కొనసాగకూడదని కోర్టు తెలిపిందో అర్థం కావడం లేదు. ఈ సెప్టెంబర్‌లో నా పదవీకాలం ముగుస్తుంది కాబట్టి నన్ను కొనసాగించాలని కోరుకుంటున్నాను. నాపై ఎలాంటి విచారణ జరగడం లేదు. నాకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలు లేవు. బీసీసీఐ రాజ్యాంగంలో తాత్కాలిక అధ్యక్షుడి ప్రతిపాదన లేదు. నా అల్లుడిపై జరుగుతున్న విచారణలో కూడా నేనెలాంటి జోక్యం చేసుకోలేదు’ అని శ్రీనివాసన్ తన అఫిడవిట్లో పేర్కొన్నారు. -
అసోసియేట్ దేశాలకూ టెస్టు హోదా
కొత్తగా ఐసీసీ టెస్టు చాలెంజ్ టోర్నీ 2018లో ప్రారంభం దుబాయ్: ఇక నుంచి ఐసీసీలో అసోసియేట్ సభ్య దేశాలుగా కొనసాగుతున్న జట్లు కూడా టెస్టు హోదా దక్కించుకునే అవకాశం ఉంది. ఈమేరకు దుబాయ్‌లో రెండు రోజుల పాటు జరిగిన తమ ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా ‘ఐసీసీ టెస్టు చాలెంజ్’ పేరిట ఓ టోర్నీ నిర్వహించనున్నారు. ఇది 2018లో ప్రారంభమై ప్రతి నాలుగేళ్లకోసారి జరుగుతుంది. దీంట్లో టెస్టు ర్యాంకింగ్స్‌లో అట్టడుగు స్థాయిలో ఉన్న జట్టుతో ఐసీసీ ఇంటర్-కాంటినెంటల్ కప్ విజేత తలపడుతుంది. ఈనేపథ్యంలో తక్కువ ర్యాంకులో ఉండే జింబాబ్వే, బంగ్లాదేశ్ జట్లతో నెదర్లాండ్స్, ఐర్లాండ్ లేక యూఏఈ జట్లు టెస్టు హోదా కోసం తలపడే అవకాశం ఉంటుంది. ‘అసోసియేట్ దేశాలు కూడా ఇక నుంచి టెస్టులకు అర్హత సంపాదించవచ్చు. ఐసీసీ టెస్టు జట్ల ర్యాంకింగ్స్‌లో డిసెంబర్ 31, 2017 వరకు పదో స్థానంలో ఉన్న జట్టు రెండు ఐదు రోజుల మ్యాచ్‌లు తమ దేశంలో.. మరో రెండు ఐదు రోజుల మ్యాచ్‌లు ఇంటర్ కాంటినెంటల్ కప్ విజేత దేశంలో ఆడుతుంది. ప్రారంభ ఐసీసీ టెస్టు చాలెంజ్ 2018లో జరుగుతుంది’ అని అంతర్జాతీయ క్రికెట్ మండలి ఓ ప్రకటనలో తెలిపింది. ఇక వచ్చే ఎనిమిదేళ్లలో రెండు ఐసీసీ ఇంటర్ కాంటినెంటల్ కప్ టోర్నీలు జరుగనున్నాయి. 2015, 2017మధ్య తొలి టోర్నీ... 2019, 2017 మధ్య రెండో టోర్నీ జరగొచ్చు. ముఖ్య తీర్మానాలు ఫిబ్రవరి 8న సింగపూర్ సమావేశంలో తీసుకున్న ప్రతిపాదనలకు ఆమోదం.తప్పనిసరి రాజ్యాంగ సవరణ చేసే అధికారం ఐసీసీ బోర్డుకు అప్పగింత. దీన్ని జూన్ నెలాఖరున మెల్బోర్న్లో జరిగే ఐసీసీ వార్షిక సమావేశంలో సమర్పించాల్సి ఉంటుంది. భవిష్యత్ పర్యటనల కార్యక్రమం (ఎఫ్టీపీ) 2023 వరకు కొనసాగుతుంది. టి20 ప్రపంచకప్‌ను విజయవంతంగా నిర్వహించినందుకు బంగ్లాదేశ్‌కు అభినందనలు. 2016లో భారత్‌లో జరిగే టి20 ప్రపంచకప్ కూడా ఇదే ఫార్మాట్లో ఉండనుంది. 2014 ఏప్రిల్ 30 వరకు టి20 ర్యాంకింగ్స్‌లో టాప్-8గా ఉన్న దేశాలు రెండో రౌండ్‌కు నేరుగా అర్హత సాధిస్తాయి. -
'భారత క్రికెట్‌ను సక్సెస్ బాటలో నడిపిస్తా'
-
క్రికెట్ కింగ్
-
ధోనీ గరం గరం..!
-
చెన్నైకి ధోని రాం రాం
-
'ఐపీఎల్లో ఏ జట్టునూ తొలగించం'
-
బీసీసీఐ అధ్యక్షుడిగా గవాస్కర్!
సుప్రీం కోర్టు సలహా శ్రీనివాసన్‌ను తప్పించాల్సిందే చెన్నై, రాజస్థాన్ జట్లను సస్పెండ్ చేయాలి బోర్డు ఒప్పుకుంటే మధ్యంతర ఉత్తర్వులు రోజుకో కొత్త మలుపు తిరుగుతున్న ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో గురువారం సుప్రీం కోర్టు కొన్ని కీలక ప్రతిపాదనలు చేసింది. శ్రీనివాసన్‌ను అధ్యక్ష పదవి నుంచి తప్పించి గవాస్కర్ లేదా అలాంటి క్రికెట్ అనుభవం ఉన్న వ్యక్తులకు కట్టబెట్టాలని సూచింది. దీంతో ఓవరాల్‌గా శ్రీనికి పదవి గండం తప్పేలా లేదు. మాజీ ఆటగాళ్లు కూడా కోర్టు ప్రతిపాదనలకే మొగ్గు చూపుతుండటంతో కేసులో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ‘దోషులుగా నిర్ధారణ అయ్యేవరకు ఎవరైనా అమాయకులే. ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాలి. సుప్రీం కోర్టు చేసిన సూచనలను పాటించాలి. బీసీసీఐ అధ్యక్ష పదవి చేపట్టేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. దీనికోసం బోర్డుతో వ్యాఖ్యాతగా ఉన్న కాంట్రాక్టును కూడా వదులుకుంటా. క్రికెట్లో ఓపెనర్ శారీరకంగా, మానసికంగా అన్ని సవాళ్లను ఎదుర్కోవాలి. ఓపెనర్‌గా ఆడిన నేను ఏ సవాల్‌కైనా సిద్ధమే. రెండు జట్లను దూరంగా ఉంచినంత మాత్రాన అవినీతి రహిత క్రికెట్ సాధ్యమవుతందని నేను అనుకోను. ఐపీఎల్లో చెన్నై, రాజస్థాన్ జట్లు లేకపోతే అభిమానులు నిరాశ చెందుతారు. 1999-2000లో మ్యాచ్ ఫిక్సింగ్ ఉదంతం బయటపడినప్పుడు టెస్టు క్రికెట్ ఆడొద్దని ఎవరూ చెప్పలేదు. కఠిన చర్యలు తీసుకున్నప్పుడే ఇలాంటి వాటిని నిరోధించవచ్చు.’ - గవాస్కర్ మాజీ ఆటగాళ్లు, బోర్డు సభ్యులు సుప్రీంకోర్టు చేసిన ప్రతిపాదనలను సమర్థించారు. కోర్టు వెలువరించే తుది ఆదేశాలను తప్పక పాటించాల్సిందేనని వారు వ్యాఖ్యానించారు. ఈ అంశంపై వారి స్పందన... చెన్నై సూపర్ కింగ్స్ జట్టును కొనుగోలు చేయడానికి శ్రీనివాసన్‌కు అనుమతినివ్వడం బీసీసీఐ చేసిన మొదటి తప్పు. అప్పట్లో అతను జట్టును కొనుగోలు చేయకుండా అడ్డుకుంటే బాగుండేది. - రవిసావంత్, బీసీసీఐ ఉపాధ్యక్షుడు బీసీసీఐకి ఇది దురదృష్టకరమైన రోజు. పరిస్థితి చేయిదాటి పోయింది. క్రికెట్ భవిష్యత్ దృష్ట్యా సుప్రీంకోర్టు ఏ నిర్ణయం తీసుకున్నా అందరూ శిరసావహించాల్సిందే. - నిరంజన్ షా, బీసీసీఐ మాజీ కార్యదర్శి ఈ వ్యవహారం కోర్టు పరిధిలో ఉంది. కాబట్టి ఈ స్థితిలో ఏ అంశంపైనా నేను ఎక్కువగా స్పందించలేను. - శ్రీకాంత్, మాజీ చీఫ్ సెలక్టర్ బీసీసీఐ ప్రతిపాదనలేమిటో నేను చూడలేదు. కోర్టు నిర్ణయం వెలువరించేంతవరకు అంతా ఎదురుచూడాలి. దీనిపై నేను ఎలాంటి వ్యాఖ్య చేయను. - ద్రవిడ్, మాజీ కెప్టెన్ గతంలో ఇలాంటి సంఘటనలు జరిగాయి. అయితే అవి ఆటను దెబ్బతీయలేవు. ఇతర రంగాల లాగే క్రికెట్లోనూ తప్పులు జరిగి ఉండొచ్చు. - అనిల్ కుంబ్లే, మాజీ కెప్టెన్ న్యూఢిల్లీ: ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసు నేపథ్యంలో బీసీసీఐ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్ పదవికి ఉచ్చు బిగుసుకుంటోంది. ఈ కేసును విచారిస్తున్న సుప్రీం కోర్టు గురువారం మరికొన్ని కీలక ప్రతిపాదనలు చేసింది. బోర్డులో సమూల మార్పులు చేయాలని ఆదేశించడంతో పాటు శ్రీనివాసన్‌ను పదవి నుంచి తప్పించాలని సూచించింది. కేసు పరిష్కారమయ్యే వరకు మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ లేదా ఆ స్థాయి వ్యక్తుల్లో ఎవరినైనా బోర్డు అధ్యక్షుడిగా నియమించాలని సలహా ఇచ్చింది. మరోవైపు బెట్టింగ్ కేసు తేలే వరకు ఐపీఎల్-7 నుంచి చెన్నై సూపర్‌కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లపై సస్పెన్షన్ విధించాలని తెలిపింది. గురువారం రెండు గంటలకుపైగా ఈ కేసును విచారించిన జస్టిస్ ఏకే పట్నాయక్ బెంచ్ ఈ ప్రతిపాదనలను చేసింది. వీటిపై బోర్డు తమ స్పందనను శుక్రవారం (నేడు) తెలియజేస్తే మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తామని చెప్పింది. అయితే ఇప్పటి వరకు కోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేయకపోయినా... ఈ పరిణామాలపై శ్రీనివాసన్ ఎలా స్పందిస్తారని క్రికెట్ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. వాళ్లను కట్టడి చేయండి... బీసీసీఐ తరఫున సీఏ సుందరమ్ వాదనలను వినిపించగా, బీహార్ క్రికెట్ అసోసియేషన్ తరఫున సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే ప్రతి వాదనలు చేశారు. స్పాట్ ఫిక్సింగ్పై ముద్గల్ కమిటీ చేసిన ప్రతిపాదనలను అమలు చేస్తామని చెప్పిన సుందరమ్ మంగళవారం సుప్రీం కోర్టు చేసిన ప్రతిపాదనలపై బోర్డు స్పందనను ఓ సీల్డ్ కవర్లో బెంచ్ ముందుంచారు. అయితే న్యాయమూర్తులు దాన్ని చదివి పక్కనబెట్టి వాదలను వినిపించాలని కోరారు. బీసీసీఐ వ్యవస్థలో చాలా మంది శ్రీనివాసన్‌కు చెందిన ఇండియా సిమెంట్స్ అధికారులే ఉన్నారని సాల్వే చేసిన వాదనను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఇక ముందు ఇండియా సిమెంట్స్ అధికారులెవ్వరూ బోర్డు కార్యకలాపాల్లో పాలుపంచుకోరాదని ఆదేశించింది. ధోని ఇండియా సిమెంట్స్ ఉపాధ్యక్షుడా! భారత కెప్టెన్ ధోని ప్రవర్తనపై కూడా సాల్వే చాలా ప్రశ్నలు లేవనెత్తారు. మహీ అవినీతి ప్రవర్తనతో వ్యవహరిస్తున్నాడని కాస్త ఘాటుగా వ్యాఖ్యానించారు. ఫిక్సింగ్‌లో గురునాథ్ హస్తం ఉందని ముద్గల్ కమిటీ ఇచ్చిన నివేదికపై కెప్టెన్ ఏం సమాధానం చెబుతాడని ప్రశ్నించారు. శ్రీనివాసన్, ధోని, ఇండియా సిమెంట్స్ అధికారుల ప్రమేయం లేకుండా గురునాథ్ ఒక్క పని కూడా చేయలేడని కమిటీ తన నివేదికలో పేర్కొన్న సంగతి తెలిసిందే. దోనిని ఇండియా సిమెంట్స్ ఉపాధ్యక్షుడిగా నియమిస్తూ ఇచ్చిన అపాయింట్మెంట్ ఆర్డర్‌ను సాల్వే కోర్టు ముందుంచారు. దీంతో న్యాయమూర్తులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యారు. చివరగా చెన్నై, రాజస్థాన్ ఫ్రాంచైజీలను రద్దు చేయాలని సాల్వే వాదించారు. వాదనల మధ్యలో... స్వతంత్ర వ్యవస్థ అయిన బీసీసీఐలో సమూల మార్పులు చేయాలని ఆదేశించే అధికారం ఈ కోర్టుకు ఉందా అని న్యాయమూర్తులు అడిగిన ప్రశ్నకు తాను లిఖితపూర్వకంగా సమాధానమిస్తానని చెప్పారు. -
ఐపీఎల్ నుండి చెన్నై, రాజస్థాన్ ఔట్..!
-
'BCCI పదవి వదలాలా ?... నో వే..'
-
ఫ్లెచర్‌కు బీసీసీఐ మద్దతు
న్యూఢిల్లీ: ఇటీవలి భారత జట్టు వరుస పరాజయాలకు ప్రస్తుత కోచ్ డంకన్ ఫ్లెచర్‌ను బాధ్యుడిని చేసే ఆలోచన లేదని బీసీసీఐ తేల్చి చెప్పింది. ఆయన్ని ఆ పదవి నుంచి తప్పించబోమని స్పష్టం చేసింది. జట్టు పేలవ ప్రదర్శనపై చర్చించేందుకు బోర్డు అధ్యక్షుడు శ్రీనివాసన్‌తో గురువారం కోచ్ ఫ్లెచర్ సమావేశమయ్యారు. ‘నేనో విషయం స్పష్టం చేయదలుచుకున్నాను. ఫ్లెచర్‌కు బీసీసీఐ నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుంది. ఆయన తొలగింపుపై ఎలాంటి చర్చ జరుగలేదు. ‘మీ శిక్షణ సామర్థ్యంపై మాకు నమ్మకముంది. ఈ విషయంలో ఎలాంటి ఆందోళన వద్దు’ అని ఫ్లెచర్‌కు చెప్పాము. మా అధ్యక్షుడు ఆయన్ని హెచ్చరించాడనే విషయం అబద్ధం’ అని బోర్డు కార్యదర్శి సంజయ్ పటేల్ తెలిపారు. ఫ్లెచర్‌ను వెంటనే తొలగించాలని మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ చేస్తున్న డిమాండ్‌పై స్పందిస్తూ... అది ఆయన వ్యక్తిగత అభిప్రాయమని... ఈ విషయంలో బీసీసీఐ చేయాల్సింది ఏమీ లేదని స్పష్టం చేశారు. -
ల్యాప్‌టాప్‌ల దొంగ అరెస్టు
సాక్షి, ఒంగోలు :బస్సుల్లో ప్రయాణిస్తూ పక్కవారు ఆదమరిచి ఉన్న సమయంలో ల్యాప్‌టాప్‌లు, ఐపాడ్లు, ఐఫోన్లు దొంగిలిస్తూ తప్పించుకు తిరుగుతున్న ఘరానా దొంగను బైపాస్ వద్ద ఒంగోలు తాలూకా సీఐ శ్రీనివాసన్ ఆదివారం ఉదయం అరెస్టు చేశారు. విశాఖ జిల్లా తుని గ్రామానికి చెందిన ఇసంపల్లి లక్ష్మణకుమార్ అలియాస్ కుమార్ నుంచి 16 ల్యాప్‌టాప్‌లు, ఐపాడ్, ఐఫోన్, రెండు సవర్ల బంగారు నగలు, కంప్యూటర్ హార్డ్‌డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ పి.ప్రమోద్‌కుమార్ వెల్లడించారు. ఆదివారం మధ్యాహ్నం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ల్యాప్‌టాప్‌ల రిపేరు, వాటి సాంకేతిక పరిజ్ఞానంపై పట్టున్న కుమార్ దొంగిలించిన ల్యాప్‌టాప్‌లకు నకిలీ బిల్లులు సృష్టించి అమ్ముకుంటూ జల్సాలు చేసేవాడు. 2006లో హైదరాబాద్‌లోని సనత్‌నగర్ పోలీసుస్టేషన్ పరిధిలో జరిగిన దొంగతనానికి సంబంధించి పోలీసులు అరెస్టు చేసి చర్లపల్లి జైలుకు కూడా పంపారు. ఈ కేసులకు సంబంధించి ప్రస్తుతం వారెంటు కూడా పెండింగ్‌లో ఉంది. కావేరి, కేశినేని, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తూ ఒంగోలు వెళ్లే వారి వద్ద ఉన్న ల్యాప్‌టాప్‌లను దొంగిలిస్తుంటాడు. ఒంగోలు తాలూకా పోలీసుస్టేషన్ పరిధిలో పది, నెల్లూరుకు సంబంధించి రెండు, చిలకలూరిపేటకు సంబంధించి రెండు, తిరుపతిలో ఒకటి, తునిలో రెండు కేసులతో పాటు రైల్వే పోలీసులకు సంబంధించి మరో మూడు కేసుల్లో కుమార్ నిందితుడిగా ఉన్నాడు. ఎంతోకాలం నుంచి తప్పించుకు తిరుగుతున్న ఘరానా నేరస్తుడిని అరెస్టు చేయడంలో ఒంగోలు నగర డీఎస్పీ పి.జాషువా, తాలూకా సీఐ ఐ.శ్రీనివాసన్‌తో పాటు ఎస్ఐలు పాండురంగరావు, విజయచందర్, రంగనాథ్, సమీవుల్లా, హెడ్ కానిస్టేబుళ్లు సీహెచ్ రాము, దయానందరావు, జేసుదాసు, కె.సురేశ్, కానిస్టేబుళ్లు బి.అచ్చయ్య, సురేశ్‌రెడ్డి, జె.మాలకొండయ్య, వి.వాసు, జి.బాబుల కృషి ఉందని ఎస్పీ ప్రమోద్‌కుమార్ పేర్కొన్నారు. -
భారత ఒలింపిక్ సంఘంపై సస్పెన్షన్ ఎత్తివేత
భారత క్రీడాభిమానులకు పెద్ద ఊరట. రాబోయే ఒలింపిక్స్‌లో భారత పతాకాన్ని పట్టుకునే మన క్రీడాకారులు వెళ్లచ్చు. భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ)పై ఉన్న సస్పెన్షన్‌ను అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) ఎత్తేసింది. దాంతో దాదాపు ఏడాది నుంచి ఉన్న ఇబ్బంది తొలగిపోయినట్లయింది. ఐఓఏకు కొత్తగా ఎన్నికలు నిర్వహించడంతో ఈ నిషేధాన్ని ఐఓసీ ఎత్తేసింది. ఆరోపణలున్న వారిని ఐఓఏలో ఎలా కొనసాగిస్తారంటూ 14 నెలల క్రితం ఐఓసీ మన ఒలింపిక్ సంఘంపై నిషేధం విధించింది. బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసన్ తమ్ముడు ఎన్.రామచంద్రన్ ప్రపంచ స్క్వాష్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా ఎన్నిక కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. కాగా, ఇప్పుడు కొత్తగా కార్యవర్గాన్ని ఎన్నుకోవడంతో నిషేధాన్ని ఎత్తేసినట్లు ఐఓసీ తమకు ఫోన్ ద్వారా తెలియజేసిందని ఐఓఏ సెక్రటరీ జనరల్ రాజీవ్ మెహతా తెలిపారు. ఇక్కడ కొత్తగా జరిగిన ఎన్నికలను ఐఓసీకి చెందిన ముగ్గురు పరిశీలకులు కూడా ప్రత్యక్షంగా వచ్చి చూశారు. వారు సంతృప్తి చెందడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. -
దైవదర్శనానికి వెళుతూ మృత్యు ఒడికి..
రోడ్డు ప్రమాదంలో దంపతులు, కుమార్తె మృతి అనాథగా మిగిలిన కుమారుడు దైవ దర్శనానికి బయలుదేరినవారిని విధి చిన్నచూపు చూసింది. రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. పన్నెండేళ్ల బాలుడు అనాథగా మారాడు. చిత్తూరు (కొంగారెడ్డిపల్లె), న్యూస్‌లైన్: చిత్తూరులోని గిరింపేటకు చెంది న శ్రీనివాసన్ (45) నగరంలోని ఓ బట్టల దుకాణంలో పనిచేస్తున్నాడు. ఇతనికి భార్య రాజేశ్వరి(40), కుమారుడు అక్షయ్‌కుమార్ (12), కుమార్తె రోహిణి(9) ఉన్నారు. ఆదివారం సా యంత్రం శ్రీనివాసన్ భార్య రాజేశ్వరి (40), కుమార్తె రోహిణి (9)తో కలిసి మురకంబట్టులోని మునీశ్వర దేవాల యానికి ద్విచక్ర వాహనంలో బయలుదేరారు. కట్టమంచి వెంకుశా కల్యాణ మండపం ఎదురుగా చిత్తూరు- తిరుపతి రహదారి మలుపు వద్ద టమాట లోడ్‌తో వెళుతున్న లారీ (ఏపీ03 టీఏ 2889) ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. దీంతో శ్రీనివాసన్, రాజేశ్వరి, రోహిణి అదుపుతప్పి రోడ్డుపై పడ్డారు. లారీ ముందు చక్రం రాజేశ్వరి మీదుగా వెళ్లింది. అలాగే రోడ్డుపై పడ్డ శ్రీనివాసన్, రోహిణి తలలకు తీవ్ర గాయాలయ్యాయి. రాజేశ్వరి, రోహిణి అక్కడికక్కడే మృతి చెందారు. సుమారు 20 నిమిషాలు మృత్యువుతో పోరాడిన శ్రీనివాసన్ చివరికి మృతి చెందాడు. లారీ డ్రైవర్ పరారయ్యాడు. సంఘటన స్థలాన్ని చిత్తూరు ట్రాఫిక్ సీఐ వి.వి.గిరిధర్, ఎస్ఐ వేణుగోపాల్ పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. జాడలేని అంబులెన్స్ ప్రమాదం జరిగిన కొంతసేపటికే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. వెంటనే 108 అంబులెన్స సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఎంతకీ అంబులెన్స జాడలేదు. ఈ క్రమంలో 20 నిమిషాలు మృత్యువుతో పోరాడిన శ్రీనివాసన్ మృతి చెందాడని ఆయన బంధువులు తెలిపారు. ఆఖరికి మృతదేహాలను పోలీసులు ప్రయివేటు అంబులెన్స ద్వారా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఒక్కడు మిగిలాడు శ్రీనివాసన్ కుమారుడు అక్షయ్‌కుమార్ (12) ఆదివారం సెలవు కావడంతో మురకంబట్టులోని అమ్మమ్మ ఇంటికి వెళ్లాడు. ఈ క్రమంలో శ్రీనివాసన్, రాజేశ్వరి, రోహిణి మాత్రమే ఆలయానికి బయలుదేరారు. మార్గమధ్యంలో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు విడిచారు. తల్లిదండ్రులు, చెల్లిని కోల్పోయిన అక్షయ్ కుమార్ ఒంటరివాడయ్యాడు. ఇక తన వారు లేరని తెలిసి బోరున విలపించాడు. -
శ్రీనివాసన్ పుణ్యమే
సాక్షి, హైదరాబాద్: ఐసీసీలో మార్పుల గురించి ప్రపంచ క్రికెట్లో పెద్ద దుమారమే రేగుతోంది. మాజీ క్రికెటర్లంతా కొత్త ప్రతిపాదనలు వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ కార్యదర్శి శ్రీనివాసన్... భారత్ వైఖరి గురించి, ఐసీసీలో మార్పుల గురించి మీడియాతో మాట్లాడారు. ఈ మార్పుల ఆలోచన శ్రీనివాసన్‌దేనని, దీనివల్ల భారత్‌తో పాటు ప్రపంచ క్రికెట్లో కూడా ఆదాయం పెరుగుతుందని ఆయన చెప్పారు. పటేల్ చెప్పిన వివరాలు ఆయన ఆటల్లోనే.. అది మన హక్కు: ఆట విషయంలో గానీ, ఆర్థి కాంశాల విషయంలో గానీ ఎన్నో ఏళ్లుగా భారత్‌దే పెద్ద పాత్ర. కాబట్టి వాటిలో వాటా కోరడం మన హక్కు. దురదృష్టవశాత్తూ గత బీసీసీఐ నాయకత్వంలో దీనిపై ఎవరూ దృష్టి పెట్టలేదు. శ్రీనివాసన్ ఆలోచన: ప్రస్తుత అధ్యక్షులు శ్రీనివాసన్ పూర్తిగా అన్ని అంశాలను అధ్యయనం చేసిన తర్వాత ఈ ప్రతిపాదనలు తెచ్చారు. వీటిని రూపొందించేందుకు ఆయన నేతృత్వంలోని బృందం తీవ్రంగా శ్రమించింది. అధికారం కోసం కాదు: కొత్త ప్రతిపాదనల గురించి అనవసరపు అపోహలు ఉన్నాయి. మేం వాస్తవిక దృష్టిలో దీనిని రూపొందించాం. పవర్ గేమ్ ఆడుతున్నామని మా గురించి చెబుతున్నారు. అయితే ఇది అధికారానికి సంబంధించిన విషయం కాదు. మా మూడు పెద్ద దేశాలనుంచి ఎవరో ఒకరు ఐసీసీని నడిపించాల్సిన అవసరం ఉంది. ఆటలో, ఆదాయంలో భారత్ పాత్ర ఏమిటనేది అందరికీ తెలుసు. ఆర్థికంగా కూడా మాకు ఏది దక్కాలో అదే కోరుతున్నాం. అంతా అనుకున్నట్లే జరుగుతుందని మేం నమ్ముతున్నాం. అది నిరసన కాదు: కొత్త ప్రతిపాదనలపై స్వేచ్ఛగా చర్చించేందుకు అందరికీ అవకాశం ఇచ్చాం. ఒక్క పాకిస్థాన్ మినహా అందరూ దీనిని ఒప్పుకుంటారు. ఒక్కరి కోసం మేం ఆపాల్సిన అవసరం లేదు. ఇన్నాళ్లూ ఐసీసీ నుంచి అన్ని దేశాలకు ఏం లభిస్తుందో, ఇకపై కూడా అదే లభిస్తుంది. ఐసీసీలో బీసీసీఐ ఆధిపత్యం: అలాంటిదేమీ లేదు. మేం ఐసీసీ ఆదాయంలో అడుగుతున్న వాటా న్యాయమైనదే. భారత్ నుంచి 60 నుంచి 70 శాతం ఆదాయం వస్తోంది. కానీ ఐసీసీ నుంచి మనకు తిరిగి 4 శాతం మాత్రమే వచ్చేది. ఇది న్యాయం కాదు. ఆదాయాన్ని ఇస్తున్న దేశానికి ఎక్కువ వాటా రావాలి. ఇకపై అలా జరుగుతుంది. అలాగే ఐసీసీ ఆదాయం కూడా కొత్త ప్రతిపాదనల వల్ల కచ్చితంగా పెరుగుతుంది. టెస్టుల కోసం నిధి: టెస్టు క్రికెట్ ఆదాయ వనరు కాదు. కానీ అది ఆటలో భాగం. భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియాను మినహాయించి మిగిలిన దేశాలు టెస్టులు ఆడినా నష్టపోకుండా ఉండేలా ప్రత్యేక నిధిని కేటాయిస్తాం. ఇంటర్ కాంటినెంటల్ కప్‌లో విజేతగా నిలిచిన జట్టుకు టాప్-10 దేశాలతో ఆడే అవకాశం దక్కుతుంది. -
ఐసీసీ పునర్వ్యవస్థీకరణకు మద్దతు
బీసీసీఐ వర్కింగ్ కమిటీ తీర్మానం చెన్నై: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నుంచి సాధ్యమైనంత లబ్ధి పొందేలా బీసీసీఐ తమ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. దీంట్లో భాగంగా ఐసీసీ ఆర్థిక, వాణిజ్య వ్యవహారాల కమిటీ ముందుకు రాబోతున్న ప్రతిపాదనలను బోర్డు వర్కింగ్ కమిటీ ఏకగ్రీవంగా ఆమోదించింది. దీని ప్రకారం ఐసీసీలో కీలక నిర్ణయాలు తీసుకునే అధికారం తమతో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డులకు ఉండనుంది. గురువారం స్థానికంగా జరిగిన అత్యవసర వర్కింగ్ కమిటీలో ఈ అంశంపై సుదీర్ఘ చర్చ జరిగింది. ‘ఐసీసీ వర్కింగ్ గ్రూప్ ప్రతిపాదనలపై ప్రధానంగా చర్చ జరిపాం. దీని ద్వారా భవిష్యత్‌లో క్రికెట్‌కు మంచి జరుగుతుంది’ అని బోర్డు కార్యదర్శి సంజయ్ పటేల్ తెలిపారు. అలాగే ఐసీసీ కమర్షియల్ రైట్స్‌పై కూడా సభ్యులు చర్చ జరిపారు. ప్రస్తుతం ఐసీసీకి లభిస్తున్న ఆదాయంలో 75 శాతం... బోర్డు పది సభ్య దేశాలకు సమానంగా పంచుతుండగా, మిగిలినది అసోసియేట్ సభ్యులకు వెళుతోంది. అయితే ఇకపై క మర్షియల్ రైట్స్ (2015 నుంచి 2023 వరకు) నుంచి మాత్రం సింహభాగం తమకే దక్కాలని బీసీసీఐ కోరనుంది. ‘క్రికెట్లో మేం మమేకమైన తీరుతో పాటు మా నుంచి లభిస్తున్న అధిక ఆదాయానికి ఇది గుర్తింపుగా భావిస్తున్నాం. న్యాయపరమైన హక్కునే మా బోర్డు అడుగుతోంది. దీనివల్ల క్రికెట్ కార్యకలాపాలకు ఎలాంటి విఘాతం కలుగదు’ అని సంజయ్ పటేల్ అన్నారు. శ్రీనివాసన్‌కు మాతృవియోగం బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసన్ తల్లి జయలక్ష్మి నారాయణస్వామి గురువారం తెల్లవారుజామున మరణించారు. ఆవిడ వయసు 92 సంవత్సరాలు. మాతృ వియోగం కారణంగా శ్రీనివాసన్ బీసీసీఐ అత్యవసర వర్కింగ్ కమిటీ సమావేశానికి హాజరు కాలేదు. దీంతో ఆయన స్థానంలో బోర్డు ఉపాధ్యక్షుడు శివలాల్ యాదవ్ కమిటీ సమావేశానికి నేతృత్వం వహించారు. ఏప్రిల్ 10నుంచి ఐపీఎల్ ? ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఏడో సీజన్ ఏప్రిల్ 10 నుంచి జరిగే అవకాశం ఉంది. అయితే పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాతే ఐపీఎల్ పూర్తి షెడ్యూల్‌ను ఖరారు చేస్తారు. ఏప్రిల్ 6న టి20 ప్రపంచ కప్ ముగుస్తుంది. 10 నుంచి ఐపీఎల్ నిర్వహించాలని బోర్డు భావిస్తోంది. కింగ్స్ ఎలెవన్ సహాయక కోచ్‌గా బంగర్ చండీగఢ్: భారత మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్‌ను పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్టు తమ సహాయక కోచ్‌గా నియమించుకుంది. 2014 సీజన్ కోసం ఈ నియామకం చేసినట్లు జట్టు ప్రకటించింది. మరోవైపు కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు భారత మాజీ క్రికెటర్ డబ్ల్యు.వి.రామన్‌ను తమ బ్యాటింగ్ కోచ్‌గా నియమించుకుంది. -
ఐసీసీ చైర్మన్‌గా శ్రీనివాసన్?
న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తొలి చైర్మన్‌గా బీసీసీఐ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్ బరిలో నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. గురువారం చెన్నైలో జరిగే బోర్డు అత్యవసర వర్కింగ్ కమిటీ సమావేశంలో ఈమేరకు చర్చ జరిగే అవకాశం ఉంది. ఆ తర్వాత బోర్డు పాలకమండలి ఆయన పేరును ప్రతిపాదించే అవకాశం ఉంది. అలాగే బోర్డు నుంచి ఐసీసీకి వెళుతున్న భారీ ఆదాయంలో అధిక వాటాను అడిగేందుకు కమిటీ సిద్ధమవుతోంది. ‘ఐసీసీ చైర్మన్‌గా శ్రీనివాసన్ పేరును ప్రతిపాదించే అధికారం వర్కింగ్ కమిటీకి ఉండదు. అయితే చర్చించే వీలుంటుంది. ఆ పదవి విషయంలో ఆయనకు బీసీసీఐ నుంచి పూర్తి మద్దతు ఉంటుంది. కానీ పాలక మండలి సమావేశం అంగీకారం కావాల్సి ఉంటుంది’ అని బోర్డు అధికారి ఒకరు తెలిపారు. ఐసీసీలో ఇంతకాలం చైర్మన్ పదవి లేదు. -
నేడు కోర్టుకు శ్రీనివాసన్
సాక్షి, హైదరాబాద్: వైఎస్ జగన్ కంపెనీల్లో ఇండియా సిమెంట్స్ పెట్టుబడులకు సంబంధించిన కేసులో నిందితునిగా ఉన్న ఇండియా సిమెంట్స్ అధినేత, బీసీసీఐ చైర్మన్ శ్రీనివాసన్ శుక్రవారం సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరుకానున్నారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆడిటర్ విజయసాయిరెడ్డి, ఐఏఎస్ అధికారులు శామ్యూల్, ఆదిత్యానాథ్‌దాస్, రఘురామ్ సిమెంట్స్, ఇండియా సిమెంట్స్, జగతి పబ్లికేషన్స్, కార్మెల్ ఏషియా కంపెనీల ప్రతినిధులు కూడా హాజరుకావాల్సి ఉంటుంది. ఈ కేసులో సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు... నవంబర్ 1న నిందితులను ప్రత్యక్షంగా హాజరుకావాలంటూ సమన్లు జారీచేసిన విషయం తెలిసిందే. -
ముక్కంటి సేవలో శ్రీనివాసన్
శ్రీకాళహస్తి, న్యూస్‌లైన్: చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి దేవస్థానానికి మంగళవారం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు శ్రీనివాసన్ విచ్చేశారు. స్వామి, అమ్మవార్లను ప్రత్యేకంగా దర్శించుకున్నారు. అనంతరం గురుదక్షిణామూర్తి వద్ద వేదపండితుల నుంచి ఆశీర్వచనం పొందారు. ఆలయాధికారులు ఆయనను శాలువాతో సత్కరించి, స్వామి, అమ్మవార్ల చిత్రపటాన్ని, తీర్థప్రసాదాలను అందజేశారు. బీసీసీఐది ద్వంద్వ వైఖరి: సుబ్రతో రాయ్ ముంబై: ఐపీఎల్ ఫ్రాంచైజీల విషయంలో బీసీసీఐ ద్వంద్వ వైఖరి అవలంభిస్తోందని సహారా ఇండియా చైర్మన్ సుబ్రతో రాయ్ ధ్వజమెత్తారు. లీగ్ నుంచి తమ పుణే వారియర్స్ జట్టును తొలగించడంతో తాను దగా పడ్డానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. -
శ్రీనివాసన్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టరాదు: సుప్రీం
న్యూఢిల్లీ : ఐపీఎల్ బెట్టింగ్, ఫిక్సింగ్ స్కామ్ విచారణ నేపథ్యంలో శ్రీనివాసన్ బోర్డు ప్రెసిడెంట్ బాధ్యతలు చేపట్టరాదంటూ సుప్రీంకోర్టు సోమవారం స్టే ఆదేశాలు జారీ చేసింది. ఐపీఎల్ కార్యకలాపాలకు దూరంగా వుంటేనే బీసీసీఐ చీఫ్‌గా బాధ్యతలను శ్రీనివాసన్ చేపట్ట వచ్చని సుప్రీం కోర్టు ఆదేశాలను జారీ చేసింది. ఐపీఎల్ బెట్టింగ్, స్పాట్ ఫిక్సింగ్ స్కామ్‌పై విచారణకు హైకోర్టు మాజీ న్యాయమూర్తి ముద్గల్ అధ్యక్షతన అడ్వకేట్ నాగేశ్వరరావు, నీలయ్ దత్తాలతో కూడిన త్రి సభ్య కమిటీని సుప్రీం కోర్టు నియమించింది. -
శ్రీనివాసన్ నిరంకుశుడు
ముంబై: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)లో నివురుగప్పిన నిప్పులా ఉన్న రాజకీయాలు ఇప్పుడు ఒక్కోటి బయటికి వస్తున్నాయి. ఇంత కాలం శ్రీనివాసన్ వ్యవహారాలపై మౌనంగా ఉన్న బోర్డు మాజీ అధ్యక్షుడు శశాంక్ మనోహర్ తాజాగా తీవ్ర వ్యాఖ్యలతో ముందుకు వచ్చారు. శ్రీనివాసన్‌ను ‘నిరంకుశుడు’గా మనోహర్ అభివర్ణించారు. ‘ఆయనకు అధ్యక్షుడిగా కొనసాగే హక్కు లేదు. ఏ మాత్రమైనా మనస్సాక్షి, ఆత్మ గౌరవం ఉంటే తన అల్లుడు అరెస్ట్ కాగానే రాజీనామా చేయాల్సింది. కానీ ఆయన అలాంటిదేమీ చేయలేదు. ప్రజలు పూర్తిగా నమ్మకం కోల్పోయే స్థితికి బోర్డు ప్రతిష్ట పడిపోయింది’ అని మనోహర్ విమర్శించారు. 2008నుంచి 2011 వరకు మనోహర్ బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న కాలంలోనే శ్రీనివాసన్ కార్యదర్శిగా పని చేశారు. జగ్మోహన్ దాల్మియా సహా అనేక మంది తనను బోర్డు ఎన్నికల్లో పోటీ చేయమని కోరారని, అయితే తిరిగి వచ్చే ఆలోచన తనకు లేక వద్దన్నానని మనోహర్ వెల్లడించారు. అయితే అందరూ కోరుకుంటే తాను బాధ్యతలనుంచి తప్పించుకునే ప్రయత్నం చేయనని ఆయన అన్నారు. బోర్డును సరిదిద్దాలనే ఆలోచన ఏ మాత్రం లేని శ్రీనివాసన్ కొన్ని నెలల్లోనే దానిని భ్రష్టు పట్టించారని మాజీ అధ్యక్షుడు పేర్కొన్నారు. ‘తన జట్టుతో సహా ప్రతీ ఒక్కరిని రక్షించేందుకే ఆయన ప్రయత్నిస్తున్నారు. శ్రీని స్థానంలో నా కొడుకు ఉంటే వెంటనే రాజీనామా చేయమనేవాడిని. ఆయన అన్ని అధికారాలు తన వద్దే ఉండాలనుకుంటారు. తన అల్లుడిని తాను ఎంచుకోలేదని, తన కూతురు అతడిని ఎంచుకుందని కోర్టులో వాదించడం ఎంత హాస్యాస్పదం. కుటుంబానికి మద్దతుగా నిలవలేని వ్యక్తి బోర్డును ఎలా నడిపిస్తారు. గురునాథ్ టీమ్ ఓనర్ అనేందుకు చాలా సాక్ష్యాలున్నాయి. చట్టప్రకారం త్వరలో అన్నీ తేలుతాయి’ అని మనోహర్ విరుచుకు పడ్డారు. బీసీసీఐ అసంతృప్తి... శశాంక్ మనోహర్ తాజా వ్యాఖ్యలు బీసీసీఐని ఇబ్బందిలో పడేశాయి. అయితే బోర్డు కార్యదర్శి సంజయ్ పటేల్ మాత్రం శ్రీనివాసన్‌ను వెనకేసుకు వచ్చే ప్రయత్నం చేశారు. ‘మాజీ అధ్యక్షుడు పత్రికలో చేసి వ్యాఖ్యల పట్ల బీసీసీఐ తొందర పడి స్పందించదు. బీసీసీఐ ఆఫీస్ బేరర్లు అందరి మద్దతుతో నడిచే సంస్థ. ఇక్కడ అన్నీ సమష్టి నిర్ణయాలే ఉంటాయి. బోర్డు మాజీ అధికారులు ఏమైనా వ్యాఖ్యలు చేసేముందు దీనిని గుర్తుంచుకోవాలని మాత్రమే చెప్పగలను. బోర్డులో ఒకరిని దోషిగా చూపిస్తూ మరొకరు పక్కకు తప్పుకోలేరు’ అని సమాధానమిచ్చారు. -
శ్రీధర్‌ను ఎలా నియమిస్తారు!
న్యూఢిల్లీ: బీసీసీఐ జనరల్ మేనేజర్ (క్రికెట్ ఆపరేషన్స్)గా హెచ్‌సీఏ కార్యదర్శి ఎంవీ శ్రీధర్‌ను నియమించడం బోర్డులో కొంత మందిలో అసంతృప్తి దారి తీసింది. చివరి వరకు ఆయన నియామకం గురించి తెలీదని శ్రీనివాసన్ వ్యతిరేక వర్గానికి చెందిన సభ్యుడు ఒకరు వ్యాఖ్యానించారు. ‘ఎందుకు శ్రీధర్‌ను జీఎంగా నియమించారో, ఆయన అర్హత ఏమిటో శ్రీనివాసన్ వివరణ ఇవ్వలేదు. కేవలం శ్రీకి మద్దతు ఇచ్చిన కారణంగానే ఆ పదవి దక్కింది. సమావేశం సమయంలోనే మాకు ఆ విషయం తెలిసింది’ అని ఆయన అన్నారు. అయితే మరో సభ్యుడు దీనిని కొట్టి పారేశారు. ‘శ్రీనికి అవసరమున్నాదానికంటే ఎక్కువ మద్దతు లభించింది. కాబట్టి ఆ కారణంగా శ్రీధర్‌ను జీఎం చేశారనడంలో వాస్తవం లేదు’ అని ఆయన అన్నారు. ఎంవీ శ్రీధర్ ముంబై నుంచి క్రికెట్ వ్యవహారాలు పర్యవేక్షించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జీఎం (గేమ్ డెవలప్మెంట్) పదవిలో ఉన్న రత్నాకర్ షెట్టి అధికారాల్లో కోత పడే అవకాశం ఉంది. అర్థం లేని విమర్శ ‘అర్హత లేని, క్రికెట్ తెలీని వారికి పెద్ద పదవి ఇస్తే దానిని ప్రశ్నించవచ్చు. కానీ నాపై విమర్శల్లో అర్థం లేదు. బోర్డులో వేర్వేరు పదవులు కేటాయించినపుడు కొంత మందికి నిరాశ తప్పదు. కానీ ఎవరో ఒకరు బాధ్యతలు నిర్వర్తించాలి కదా. ఏదైనా ముందుగా ఎలా ప్రకటిస్తారు. ఏజీఎంలోనే స్వయంగా శ్రీనివాసన్ నా పేరు చదివి వినిపించాక ఇంక విమర్శలు ఎందుకు.’ - ‘సాక్షి’తోఎంవీ శ్రీధర్