
నియమావళిని మార్చేది లేదు: శ్రీనివాసన్
చెన్నై: జడేజా, అండర్సన్ గొడవ నేపథ్యంలో ఆటగాళ్ల క్రమశిక్షణా నియమావళిని మార్చాలనే డిమాండ్‌ను ఐసీసీ తోసిపుచ్చింది. ‘ఆటగాళ్ల కోసం ఏర్పాటు చేసిన ప్రవర్తన నియమావళిని పునర్‌వ్యవస్థీకరించే ఆలోచన మాకు లేదు’ అని ఐసీసీ చీఫ్ ఎన్.శ్రీనివాసన్ స్పష్టం చేశారు. జడేజాతో జరిగిన వాగ్వాదంలో అండర్సన్ ఎలాంటి శిక్ష లేకుండా తప్పించుకోవడంతో భారత క్రికెట్ బోర్డు ఈ డిమాండ్‌ను తెర మీదకు తెచ్చింది. అటు ద్రవిడ్ కూడా జ్యుడీషియల్ కమిషనర్ ఇచ్చిన తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.