Anderson
-
అండర్సన్... ఐదేళ్ల తర్వాత మళ్లీ ‘టాప్’లోకి...
దుబాయ్: ఐసీసీ టెస్ట్ బౌలర్ల ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్ పేస్ బౌలర్ అండర్సన్ మళ్లీ నంబర్‌వన్ ర్యాంక్‌ను అందుకున్నాడు. చివరిసారి 2018లో అండర్సన్ నంబర్‌వన్ ర్యాంక్‌లో నిలిచాడు. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో అండర్సన్ ఏడు వికెట్లు పడగొట్టడంతో రెండు స్థానాలు ఎగబాకి 866 పాయింట్లతో అగ్రస్థానానికి చేరాడు. 1936 తర్వాత ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ ర్యాంక్ సాధించిన పెద్ద వయస్కుడిగా అండర్సన్ (40 ఏళ్ల 207 రోజులు) గుర్తింపు పొందాడు. భారత స్పిన్నర్ అశ్విన్ 864 పాయింట్లతో రెండో ర్యాంక్‌లో ఉన్నాడు. -
అండర్సన్, బ్రాడ్లపై వేటు
లండన్: అండర్సన్ 640 వికెట్లు... స్టువర్ట్ బ్రాడ్ 537 వికెట్లు... టెస్టుల్లో వీరిద్దరు కలిసి ఏకంగా 1,177 వికెట్లు పడగొట్టి సుదీర్ఘ కాలంగా ఇంగ్లండ్ విజయాల్లో కీలక పాత్ర పోషించారు. అయితే యాషెస్ సిరీస్‌లో 0–4తో చిత్తయిన ప్రభావం ఈ ఇద్దరు దిగ్గజ బౌలర్లపై కూడా పడింది. వెస్టిండీస్‌తో జరిగే మూడు టెస్టుల సిరీస్ కోసం ఎంపిక చేసిన జట్టులో అండర్సన్, బ్రాడ్‌లకు చోటు దక్కలేదు. ఇంగ్లండ్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన ఇద్దరు బౌలర్లను తప్పించి ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) కఠిన నిర్ణయం తీసుకుంది. యాషెస్ పరాజయం తర్వాత హెడ్ కోచ్, అసిస్టెంట్ కోచ్, మేనేజింగ్ డైరెక్టర్లను తప్పించిన బోర్డు ఇప్పుడు ఆటగాళ్లపై వేటు వేసింది. ఆస్ట్రేలియాలో పర్యటించిన టీమ్ నుంచి మొత్తం ఎనిమిది మందిని తప్పించడం గమనార్హం. బట్లర్, రోరీ బర్న్స్, హసీబ్ హమీద్, మలాన్, స్యామ్ బిల్లింగ్స్, డామ్ బెస్ కూడా జట్టులో స్థానం కోల్పోయారు. -
7 గంటల్లో దిగిపోయినా మళ్లీ స్వీడన్ పీఠంపై ఆండర్సన్
కోపెన్‌హాగెన్(డెన్మార్క్): స్వీడన్ ప్రధాని పీఠంపై మహిళా నేత మాగ్డలీనా ఆండర్సన్ వారం రోజుల వ్యవధిలోనే మళ్లీ ఆసీనులయ్యారు. కూటమి ప్రభుత్వంలోని పార్టీ మద్దతు ఉపసంహరిం చడంతో గత వారం పదవికి రాజీనామా చేసిన ఆమె సోమవారం మళ్లీ ప్రధానిగా ఎన్నికయ్యారు. 349 సీట్లు ఉన్న స్వీడన్ పార్లమెంట్లో ప్రధాని పదవికి జరిగిన ఓటింగ్‌లో ఈమెకు మద్దతుగా 101 ఓట్లు పడ్డాయి. 75 మంది గైర్హాజరయ్యారు. స్వీడన్ రాజ్యాంగం ప్రకారం ప్రధానిగా ఎన్నుకోబడే వ్యక్తిని ఓటింగ్‌లో 175కు మించి సభ్యులు వ్యతిరేకించకూడదు. అంటే వ్యతిరేకంగా 175 ఓట్లు పడితే ఆ ప్రభుత్వం కొలువుతీరదు. అదృష్టవశాత్తు ఆండర్సన్‌కు వ్యతిరేకంగా 173 ఓట్లే పడ్డాయి. దీంతో మైనారిటీలో ఉన్నా సరే సోషల్ డెమొక్రటిక్ పార్టీ సారథ్యంలో ప్రభుత్వం ఏర్పాటైంది. గత వారం గ్రీన్ పార్టీతో సోషల్ డెమొక్రటిక్ పార్టీ సంకీర్ణ ప్రభుత్వాన్నిఏర్పాటుచేసింది. దేశ తొలి మహిళా ప్రధానిగా ఆండర్సన్ బాధ్యతలు చేపట్టి చరిత్ర సృష్టించారు. అంతకుముందే ఆర్థికమంత్రిగా ఉన్న ఆమె అదే హోదాలో బడ్జెట్‌ను వెంటనే ప్రవేశపెట్టారు. ఆ బడ్జెట్ ప్రతిపాదనలు విపక్ష స్వీడన్ డెమొక్రాట్స్ పార్టీ విధానాలకు అనుకూలంగా ఉన్నాయంటూ కూటమి ప్రభుత్వం నుంచి గ్రీన్ పార్టీ వైదొలగింది. దీంతో ఆరోజు కేవలం ప్రధాని అయిన ఏడు గంటలకే ఆండర్సన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. -
టీమిండియా క్రికెటర్ భార్య వెటకారం.. కోహ్లి, రహానేలపై సెటైర్లు!
న్యూఢిల్లీ: టీమిండియా క్రికెటర్ స్టువర్ట్ బిన్నీ భార్య, ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యాత మయంతి లాంగర్.. ప్రస్తుత ఇంగ్లండ్ సిరీస్‌లో ఆండర్సన్ బౌలింగ్‌లో పరుగులు చేసేందుకు ఇబ్బంది పడుతూ, వికెట్లు సమర్పించుకున్న భారత స్టార్ ఆటగాళ్లపై పరోక్షంగా సెటైర్లు వేసింది. ఇంగ్లండ్‌తో మూడో టెస్ట్ అనంతరం ఆమె ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన ఓ స్టోరీ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. తన భర్త స్టువర్ట్ బిన్నీ బౌండరీ బాదితే, అతనికి బౌలింగ్ చేయలేక ఆండర్సన్ అసహనంతో తల పట్టుకున్న ఫోటోను ఆమె తన ఇన్‌స్టా స్టోరీగా పోస్ట్ చేసింది. ఈ ఫోటో 2014 ఇంగ్లండ్ పర్యటనలో తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్ సందర్భంగా తీసింది. ఈ మ్యాచ్ ద్వారా టెస్ట్ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన బిన్నీ.. తొలి ఇన్నింగ్స్‌లో ఒక్క పరుగుకే అవుటైనా, రెండో ఇన్నింగ్స్‌లో 78 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ఈ స్టోరీలో మయంతి ఎలాంటి కామెంట్లు చేయకపోయినా.. ఇంగ్లండ్‌లో ఆండర్సన్‌ను ఎదుర్కోవడం అందరి వల్లా కాదని, దానికి తన భర్తలా సపరేట్ టాలెంట్ ఉండాలని పరోక్షంగా కోహ్లి, రహానే, పుజారాపై సెటైర్లు వేసినట్లుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం మయంతి చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కాగా, భారత మాజీ క్రికెటర్ రోజర్ బిన్నీ కొడుకైన స్టువర్ట్ బిన్నీ.. క్రికెట్ యాంకర్ మయంతి లాంగర్‌ను ప్రేమించి పెళ్లాడాడు. వీరికి గతేడాది సెప్టెంబర్‌లో ఓ కొడుకు కూడా జన్మించాడు. 37 ఏళ్ల స్టువర్ట్ బిన్నీ, ఇంకా అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించలేదు. చివరిసారిగా 2016లో వెస్టిండీస్‌పై టీ20 మ్యాచ్ ఆడిన బిన్నీ.. ఆ మ్యాచ్‌లో ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు సమర్పించుకున్నాడు. టీమిండియా తరుపున 6 టెస్ట్‌లు ఆడిన అతను.. ఓ హాఫ్ సెంచరీతో 194 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో బిన్నీ మూడు వికెట్లు పడగొట్టాడు. అయితే, వన్డే క్రికెట్లో భారత్ తరఫున అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు మాత్రం స్టువర్ట్ బిన్నీ(6/4) పేరిటే నమోదై ఉన్నాయి. 2014లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చిన బిన్నీ.. ఏకంగా ఆరు వికెట్లు పడగొట్టి, అనిల్ కుంబ్లే(6/12) రికార్డును బ్రేక్ చేశాడు. చదవండి: అదును చూసి విరుచుకుపడ్డాం.. ఇంగ్లండ్ బౌలర్లను ఆకాశానికెత్తిన రూట్ -
ప్చ్! కనీసం 60 ఓవర్లు కూడా ఆడలేక..
రచ్చ గెలిచిన భారత్ అదే ఊపులో ఇంట మాత్రం గెలవలేకపోయింది. బ్రిస్బేన్ విజయంతో శిఖరాన నిలిచిన మన జట్టు మద్రాసులో మళ్లీ నేలకు దిగింది. ఇంగ్లండ్‌ను తక్కువగా అంచనా వేసిన టీమిండియా చివరకు ప్రత్యర్థి ముందు తలవంచాల్సి వచ్చింది. ఒకే రోజు 381 పరుగులు చేయడం అసాధ్యమనిపించిన చోట పోరాటపటిమ కనబర్చి ‘డ్రా’ చేసుకోగలదనుకున్న కోహ్లి బృందం కనీసం 60 ఓవర్లు కూడా ఆడలేక చేతులెత్తేసింది. చివరి రోజు అనూహ్యంగా స్పందిస్తూ స్పిన్‌కు అనుకూలించిన పిచ్ మన ఓటమికి బాటలు వేయగా... పేలవ ఆటతో బ్యాట్స్‌మెన్ పరాజయాన్ని ఆహ్వానించారు. అనామక స్పిన్నర్ జాక్ లీచ్ 4 వికెట్లతో భారత్‌ను పడగొట్టగా, ‘ఆల్‌టైమ్ గ్రేట్’లలో ఒకడైన అండర్సన్ అద్భుత పేస్ బౌలింగ్‌తో అసలు దెబ్బ కొట్టాడు. స్వదేశంలో నాలుగేళ్ల తర్వాత మన జట్టు మొదటిసారి ఓడగా, కోహ్లి నాయకత్వంలో ఇది వరుసగా నాలుగో టెస్టు పరాజయం. ఇక 2012 సిరీస్ ఫలితం పునరావృతం కాకూడదనుకుంటే ఈ ఓటమిని మరచి నాలుగు రోజుల తర్వాత ఇదే చెపాక్ మైదానంలో మళ్లీ రెట్టించిన ఉత్సాహంతో, కొత్త వ్యూహంతో బరిలోకి దిగి రెండో టెస్టులో ఇంగ్లండ్‌ను చిత్తు చేయడమే ఇప్పుడు మన జట్టు ముందున్న తక్షణ లక్ష్యం. చెన్నై: భారత్‌తో నాలుగు టెస్టుల సిరీస్‌ను ఇంగ్లండ్ ఘనంగా ప్రారంభించింది. మంగళవారం ముగిసిన తొలి టెస్టులో ఇంగ్లండ్ 227 పరుగుల భారీ తేడాతో భారత్‌ను చిత్తుగా ఓడించింది. 420 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 58.1 ఓవర్లలో 192 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ విరాట్ కోహ్లి (104 బంతుల్లో 72; 9 ఫోర్లు), శుబ్‌మన్ గిల్ (83 బంతుల్లో 50; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో స్పిన్నర్ లీచ్‌కు 4 వికెట్లు దక్కగా, పేసర్ అండర్సన్ 3 కీలక వికెట్లు తీశాడు. చివరి రోజు తొలి సెషన్లో ఐదు వికెట్లు కోల్పోయిన భారత్ ఇన్నింగ్స్ టీ విరామానికి ముందే ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌లో ‘డబుల్ సెంచరీ’ చేసిన ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. తాజా విజయంతో సిరీస్‌లో ఇంగ్లండ్‌కు 1–0తో ఆధిక్యం లభించగా... రెండో టెస్టు ఈ నెల 13 నుంచి ఇదే మైదానంలో జరుగుతుంది. కోహ్లి పోరాడినా... ఓవర్‌నైట్ స్కోరు 39/1తో గిల్, పుజారా (15) చివరి రోజు ఆట కొనసాగించారు. ఆరు ఓవర్ల వరకు వీరిద్దరు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రత్యర్థి బౌలర్లను ఎదుర్కొన్నారు. అయితే లీచ్ ఒక చక్కటి బంతితో ఆటను మలుపు తిప్పాడు. టర్న్, బౌన్స్ కలగలిసిన బంతిని ఆడలేక పుజారా స్లిప్‌లో స్టోక్స్‌కు క్యాచ్ ఇచ్చాడు. ఆ తర్వాత అండర్సన్ అద్భుత బౌలింగ్ ప్రదర్శనకు 18 పరుగుల వ్యవధిలో గిల్, రహానే (0), పంత్ (11) వికెట్లను కోల్పోయిన భారత్ కష్టాల్లో పడింది. ఆ వెంటనే వాషింగ్టన్ సుందర్ (0)ను బెస్ వెనక్కి పంపాడు. ఈ దశలో కోహ్లి, అశ్విన్ కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. కొన్ని చూడచక్కటి షాట్లు ఆడిన కోహ్లి ఆఫ్ స్పిన్నర్ బెస్ ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు కొట్టాడు. 74 బంతుల్లో అతని అర్ధసెంచరీ పూర్తయింది. వీరిద్దరు ఏడో వికెట్‌కు 54 పరుగులు జోడించి కుదురుకుంటున్న దశలో లీచ్ మళ్లీ దెబ్బ తీశాడు. అశ్విన్‌ను అతను పెవిలియన్ పంపించడంతో కీలక భాగస్వామ్యం ముగిసింది. కొద్ది సేపటికే స్టోక్స్ బౌలింగ్‌లో తక్కువ ఎత్తులో వచ్చిన బంతికి కోహ్లి క్లీన్ బౌల్డ్ కావడంతో భారత్ ఆశలు కోల్పోయింది. నదీమ్ (0), బుమ్రా (4) వికెట్లతో ఓటమి లాంఛనం ముగిసింది. కోహ్లి బౌల్డ్.. గిల్ బౌల్డ్ అయిన దృశ్యాలు స్కోరు వివరాలు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 578; భారత్ తొలి ఇన్నింగ్స్: 337; ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: 178; భారత్ రెండో ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (బి) లీచ్ 12, గిల్ (బి) అండర్సన్ 50; పుజారా (సి) స్టోక్స్ (బి) లీచ్ 15; కోహ్లి (బి) స్టోక్స్ 72; రహానే (బి) అండర్సన్ 0; రిషభ్ పంత్ (సి) రూట్ (బి) అండర్సన్ 11; వాషింగ్టన్ సుందర్ (సి) బట్లర్ (బి) బెస్ 0; అశ్విన్ (సి) బట్లర్ (బి) లీచ్ 9; నదీమ్ (సి) బర్న్స్ (బి) లీచ్ 0; ఇషాంత్ (నాటౌట్) 5; బుమ్రా (సి) బట్లర్ (బి) ఆర్చర్ 4; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (58.1 ఓవర్లలో ఆలౌట్) 192. వికెట్ల పతనం: 1–25, 2–58, 3–92, 4–92, 5–110, 6–117, 7–171, 8–179, 9–179, 10–192. బౌలింగ్: ఆర్చర్ 9.1–4–23–1, లీచ్ 26–4–76–4, అండర్సన్ 11–4–17–3, బెస్ 8–0–50–1, స్టోక్స్ 4–1–13–1. -
స్వీట్ 16...
►రాఫెల్ నాదల్‌దే యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ ►కెరీర్లో 16వ గ్రాండ్‌స్లామ్ ట్రోఫీ కైవసం ►ఫైనల్లో అండర్సన్‌పై విజయం ►రూ. 23 కోట్ల 61 లక్షల ప్రైజ్‌మనీ సొంతం ఎలాంటి ‘వండర్’ జరగలేదు. దక్షిణాఫ్రికా ఆజానుబాహుడు అండర్సన్ అద్భుతం చేయలేదు. అనుభవజ్ఞుడైన రాఫెల్ నాదల్ మళ్లీ రఫ్ఫాడించాడు. సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ యూఎస్ ఓపెన్‌లో ముచ్చటగా మూడోసారి చాంపియన్‌గా నిలిచాడు. ఏకపక్షంగా జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్, ప్రపంచ నంబర్‌వన్ నాదల్ తన స్థాయికి తగ్గ ఆటతీరును కనబరిచి ఔరా అనిపించాడు. తన చిన్ననాటి ప్రత్యర్థి అండర్సన్‌ను హడలెత్తించి స్వీట్ 16 గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను హస్తగతం చేసుకున్నాడు. గత రెండేళ్లలో గాయాలతో తడబడిన నాదల్ కెరీర్‌కు తాజా ‘గ్రాండ్’ టైటిల్స్‌తో పూర్వ వైభవం వచ్చింది. న్యూయార్క్: గత రెండేళ్లలో ఎదురైన చేదు ఫలితాలను మరచిపోయే విధంగా ఈ ఏడాది రాఫెల్ నాదల్ చెలరేగిపోయాడు. నాలుగేళ్ల తర్వాత యూఎస్ ఓపెన్‌లో మరోసారి విజేతగా నిలిచి ఈ సీజన్‌ను చిరస్మరణీయంగా మల్చుకున్నాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్, ప్రపంచ నంబర్‌వన్ నాదల్ (స్పెయిన్) 6–3, 6–3, 6–4తో ప్రపంచ 32వ ర్యాంకర్, 28వ సీడ్ కెవిన్ అండర్సన్ (దక్షిణాఫ్రికా)పై వరుస సెట్లలో అలవోకగా గెలిచాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచిన నాదల్, ఫ్రెంచ్ ఓపెన్‌లో టైటిల్ సాధించాడు. వింబుల్డన్‌లో ప్రిక్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించి, యూఎస్ ఓపెన్‌లో చాంపియన్‌గా నిలిచాడు. కెరీర్లో 23వసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఫైనల్‌కు చేరిన నాదల్కు తన 34వ ప్రయత్నంలో తొలిసారి గ్రాండ్‌స్లామ్ ఫైనల్లోకి ప్రవేశించిన అండర్సన్ ఏదశలోనూ పోటీనివ్వలేదు. 6 అడుగుల 8 అంగుళాల ఎత్తు, 93 కేజీల బరువున్న అండర్సన్ సంధించిన పదునైన సర్వీస్‌లకు నాదల్ ఆద్యంతం అంతే చాకచక్యంగా రిటర్న్ చేసి పైచేయి చాటుకున్నాడు. 2 గంటల 28 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో నాదల్ కేవలం 11 అనవసర తప్పిదాలు చేయగా... అండర్సన్ ఏకంగా 40 అనవసర తప్పిదాలు చేయడం ఈ దక్షిణాఫ్రికా ప్లేయర్ ఎంత ఒత్తిడిలో ఆడాడో అర్థమవుతోంది. నాదల్ నెట్ వద్దకు 16సార్లు దూసుకొచ్చి 16 సార్లూ పాయింట్లు సంపాదించగా... అండర్సన్ 34సార్లు నెట్ వద్దకు వచ్చి 16 సార్లు మాత్రమే పాయింట్లు నెగ్గడంలో సఫలమయ్యాడు. స్పెయిన్ స్టార్ ఒక ఏస్ సంధించి, ఒక డబుల్ ఫాల్ట్ చేయగా... అండర్సన్ 10 ఏస్‌లు కొట్టి, నాలుగు డబుల్‌ఫాల్ట్‌లు చేశాడు. మ్యాచ్ మొత్తంలో నాదల్ తన ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేయగా... అండర్సన్‌కు మాత్రం ఒక్కసారి కూడా బ్రేక్ పాయింట్ అవకాశం రాలేదు. ►విజేతగా నిలిచిన నాదల్కు 37 లక్షల డాలర్లు (రూ. 23 కోట్ల 61 లక్షలు)... రన్నరప్ అండర్సన్‌కు 18 లక్షల 25 వేల డాలర్లు (రూ. 11 కోట్ల 64 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. ►3 యూఎస్ ఓపెన్ టైటిల్ గెలిచే క్రమంలో నాదల్ కేవలం మూడు సెట్లు మాత్రమే కోల్పోయాడు. ►5 ఓపెన్ శకంలో (1968 తర్వాత) యూఎస్ ఓపెన్ టైటిల్‌ను మూడు అంతకంటే ఎక్కువసార్లు గెలిచిన ఐదో క్రీడాకారుడు నాదల్. సంప్రాస్, కానర్స్, ఫెడరర్ ఐదేసిసార్లు సాధించగా... మెకన్రో నాలుగుసార్లు గెలిచాడు. ►4 ఒకే ఏడాది రెండు అంతకంటే ఎక్కువ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గడం నాదల్‌కిది నాలుగోసారి. ►74 తన కెరీర్లో నాదల్ సాధించిన సింగిల్స్ టైటిల్స్. ఇప్పటివరకు ఈ ఏడాది అతను ఐదు టైటిల్స్ గెలిచాడు. ►నాదల్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ (16) ►ఆస్ట్రేలియన్ ఓపెన్ (1): 2009 ►ఫ్రెంచ్ ఓపెన్ (10): 2005, 2006, 2007, 2008, 2010, 2011, 2012, 2013, 2014, 2017 ►వింబుల్డన్ (2): 2008, 2010 ►యూఎస్ ఓపెన్ (3): 2010, 2013, 2017 ఆ ఐదుగురి ఆధిపత్యం... 2003 వింబుల్డన్ నుంచి ఈ ఏడాది యూఎస్ ఓపెన్ దాకా జరిగిన 58 గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లలో 53 టైటిల్స్ ఫెడరర్, నాదల్, జొకోవిచ్, ముర్రే, వావ్రింకా ఖాతాలోకే వెళ్లడం విశేషం. ఫెడరర్ 19, నాదల్ 16, జొకోవిచ్ 12 టైటిల్స్ నెగ్గగా... ముర్రే (బ్రిటన్), వావ్రింకా (స్విట్జర్లాండ్) మూడేసి టైటిల్స్‌ను దక్కించుకున్నారు. మరో ఐదుగురు ఆటగాళ్లు రాడిక్ (అమెరికా), గాడియో (అర్జెంటీనా), సఫిన్ (రష్యా), డెల్‌పొట్రో (అర్జెంటీనా), సిలిచ్ (క్రొయేషియా) ఒక్కో గ్రాండ్ టైటిల్‌తో సరిపెట్టుకున్నారు. ఫలితాలపరంగా చూస్తే నా జీవితంలో ఈ సీజన్ అత్యుత్తమమైనది. నిలకడగా విజయాలు సాధించాను. మూడు గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో ఫైనల్‌కు చేరాను. వింబుల్డన్‌లో ప్రిక్వార్టర్ ఫైనల్లో చివరి సెట్‌ను 13–15తో ఓడిపోయాను. గాయాల కారణంగా గత రెండేళ్లు ఎంతో కఠినంగా గడిచాయి. ఈ ఏడాది సాధించిన విజయాలతో ఎంతో భావోద్వేగ అనుభూతి కలుగుతోంది. టెన్నిస్ అంటే గ్రాండ్‌స్లామ్ టోర్నీలే కాదు. రాబోయే నెలల్లో మరిన్ని టోర్నీలు జరగనున్నాయి. వాటిలో కూడా మెరుగైన ఫలితాలు సాధించాలనే పట్టుదలతో ఉన్నాను. – రాఫెల్ నాదల్ -
సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై విజయం
-
ఢిల్లీ.. ఎట్టకేలకు
⇒సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై విజయం ⇒చెలరేగిన అండర్సన్ ⇒యువరాజ్ మెరుపులు వృథా వరుసగా ఐదు పరాజయాలతో అట్టడుగున నిలిచిన ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఎట్టకేలకు అదరగొట్టింది. గత మ్యాచ్‌లో అవమానకర ఆటతీరును ప్రదర్శించిన ఈ జట్టు డిఫెండింగ్ చాంపియన్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై మాత్రం అద్భుతంగా చెలరేగింది. క్రీజులోకి వచ్చిన ప్రతీ బ్యాట్స్‌మెన్ తమ వంతుగా రాణించడంతో భారీ లక్ష్యాన్ని అధిగమించగలిగింది. దీంతో తమ ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకోగలిగింది. అటు యువరాజ్ సింగ్ తుఫాన్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టినా బౌలర్లు తడబడడంతో సన్‌రైజర్స్ విజయాల జోరుకు బ్రేక్ పడింది. న్యూఢిల్లీ: కరుణ్ నాయర్ (20 బంతుల్లో 39; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) వేగవంతమైన ఆరంభానికి.. కోరె అండర్సన్ (24 బంతుల్లో 41 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) ఫినిషింగ్ టచ్ తోడవ్వడంతో ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు చాలా రోజుల తర్వాత ఓ చక్కటి విజయాన్ని అందుకుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో బ్యాట్స్‌మెన్ సమష్టిగా రాణించడంతో ఢిల్లీ 6 వికెట్ల తేడాతో నెగ్గింది. దీంతో తమ చివరి స్థానాన్ని కాస్త మెరుగుపర్చుకోగలిగింది. అంతకుముందు ఫిరోజ్ షా కోట్ల మైదానంలో మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 185 పరుగులు చేసింది. వార్నర్ (21 బంతుల్లో 30; 4 ఫోర్లు, 1 సిక్స్), ధావన్ (17 బంతుల్లో 28; 4 ఫోర్లు, 1 సిక్స్), హెన్రిక్స్ (18 బంతుల్లో 25 నాటౌట్; 2 ఫోర్లు) రాణించారు. అనంతరం బరిలోకి దిగిన ఢిల్లీ 19.1 ఓవర్లలో 4 వికెట్లకు 189 పరుగులు చేసింది. రిషభ్ పంత్ (20 బంతుల్లో 34; 4 ఫోర్లు, 1 సిక్స్), శ్రేయస్ అయ్యర్ (25 బంతుల్లో 33; 1 ఫోర్, 2 సిక్సర్లు), మోరిస్ (7 బంతుల్లో 15 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) వేగంగా ఆడారు. 2 కీలక వికెట్లు తీసిన షమీకి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. యువరాజ్ మెరుపులు ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ మరోసారి మెరుపు ఆరంభానికి ప్రయత్నించింది. దీనికి తగ్గట్టుగానే ఓపెనర్లు వార్నర్, ధావన్ ఇన్నింగ్స్ సాగింది. మూడో ఓవర్లో వార్నర్ భారీ సిక్స్ బాదగా ఆ తర్వాతి ఓవర్లో ధావన్ రెండు ఫోర్లు, ఓ సిక్స్‌తో విరుచుకుపడ్డాడు. అయితే ఆరో ఓవర్లో జట్టుకు గట్టి షాక్ తగిలింది. షమీ వేసిన ఆ ఓవర్ తొలి బంతిని బౌండరీగా మలిచిన వార్నర్ మరుసటి బంతికి బౌల్డ్ అయ్యాడు. దీంతో తొలి వికెట్‌కు 53 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. కొద్దిసేపటికే మిశ్రా గూగ్లీకి ధావన్ (17 బంతుల్లో 28; 4 ఫోర్లు, 1 సిక్స్) కూడా వెనుదిరిగాడు. విలియమ్సన్ (24 బంతుల్లో 24; 1 ఫోర్, 1 సిక్స్) పెద్దగా ఆకట్టుకోలేదు. తను క్రీజులో ఉన్నంత సేపు నిదానంగా ఆడిన యువరాజ్.. ఆ తర్వాత హెన్రిక్స్‌తో కలిసి జట్టును మెరుగైన స్థితిలో నిలిపాడు. 17 ఓవర్ల దాకా నత్తనడకన సాగిన ఇన్నింగ్స్ ఆ తర్వాత యువీ జూలు విదల్చడంతో ఒక్కసారిగా వేగం అందుకుంది. 29 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద సామ్సన్ క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన యువీ.. రబడా వేసిన 18వ ఓవర్లో వరుసగా 4,6 బాదగా అటు హెన్రిక్స్ రెండు ఫోర్లు రాబట్టడంతో 20 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు బాది 34 బంతుల్లో అర్ధ సెంచరీ చేశాడు. ఇక ఆఖరి ఓవర్లో నాలుగు ఫోర్లతో చెలరేగడంతో జట్టు భారీ స్కోరును అందుకుంది. చివరి మూడు ఓవర్లలో 51 పరుగులు రాగా వీరిద్దరి భాగస్వామ్యంలో నాలుగో వికెట్‌కు అజేయంగా 50 బంతుల్లోనే 93 పరుగులు చేరాయి. సమష్టిగా రాణింపు భారీ లక్ష్యం కోసం బరిలోకి దిగిన ఢిల్లీకి ఓపెనర్లు సంజూ సామ్సన్ (19 బంతుల్లో 24; 2 ఫోర్లు, 1 సిక్స్), కరుణ్ నాయర్ మెరుపు ఆరంభాన్నిచ్చారు. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలతో చెలరేగడంతో నాలుగు ఓవర్లలో జట్టు 40 పరుగులు చేసింది. ఐదో ఓవర్లో సామ్సన్ను సిరాజ్ అవుట్ చేయడంతో ఈ జోరుకు బ్రేక్ పడింది. అటు నాయర్ మాత్రం దూకుడును కనబరుస్తూ ఆరో ఓవర్లో రెండు ఫోర్లు, ఓ సిక్స్‌తో రెచ్చిపోయినా తొమ్మిదో ఓవర్లో కౌల్ బౌలింగ్‌లో క్యాచ్ అవుటయ్యాడు. అటు వరుస బౌండరీలతో చెలరేగుతున్న రిషభ్ పంత్‌ను సిరాజ్ అద్భుత యార్కర్‌తో బౌల్డ్ చేశాడు. యువరాజ్ బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్సర్లు బాదిన శ్రేయస్‌ను భువనేశ్వర్ అవుట్ చేయడంతో ఢిల్లీ ఒత్తిడిలో పడింది. అప్పటికి 24 బంతుల్లో 38 పరుగులు చేయాల్సి ఉండగా అండర్సన్ బ్యాట్ ఝుళిపించడంతో లక్ష్యం సులువైంది. తనకు తోడు క్రిస్ మోరిస్ జత కలవడంతో మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే నెగ్గింది. -
టి20లోనూ కివీస్ క్లీన్‌స్వీప్
అండర్సన్ మెరుపు ఇన్నింగ్స్ ∙41 బంతుల్లో 94 నాటౌట్ మూడో మ్యాచ్‌లోనూ బంగ్లా ఓటమి మౌంట్ మాంగనూ (న్యూజిలాండ్): బంగ్లాదేశ్‌తో జరిగిన మూడు టి20ల సిరీస్‌ను కూడా న్యూజిలాండ్ జట్టు క్లీన్‌స్వీప్ చేసింది. ఆదివారం జరిగిన చివరిదైన మూడో టి20లో కోరె అండర్సన్ విధ్వంసకర ఆటతీరుతో 41 బంతుల్లోనే అజేయంగా 94 పరుగులు (2 ఫోర్లు, 10 సిక్సర్లు) చేయడంతో కివీస్ 27 పరుగుల తేడాతో నెగ్గింది. ఇప్పటికే వన్డే సిరీస్‌ను 3–0తో సొంతం చేసుకున్న కివీస్ ఈనెల 12 నుంచి బంగ్లాదేశ్‌తో రెండు టెస్టుల సిరీస్ ఆడుతుంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆతిథ్య జట్టు 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 194 పరుగులు చేసింది. ఓపెనర్ కేన్ విలియమ్సన్ (57 బంతుల్లో 60; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ చేశాడు. 41 పరుగులకు మూడు వికెట్లు పడిన దశలో అండర్సన్, విలియమ్సన్ జోడి బంగ్లా బౌలర్లను ఊచకోత కోస్తూ పరుగుల వరద పారించారు. ముఖ్యంగా అండర్సన్ మోర్తజా బౌలింగ్‌లో 4,6,6తో పాటు సౌమ్య సర్కార్ బౌలింగ్‌లో వరుసగా మూడు సిక్సర్లు బాది 27 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. నాలుగో వికెట్‌కు వీరి మధ్య 124 పరుగులు జత చేరాయి. తమ ఇన్నింగ్స్ చివరి ఓవర్లో 79 పరుగులతో ఉన్న అండర్సన్ రెండు సిక్సర్లు బాది కెరీర్లో తొలి శతకానికి మరో ఆరు పరుగుల దూరంలో ఆగిపోయాడు. అలాగే కివీస్ తరపున టి20ల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా నిలిచాడు. రూబెల్ హŸస్సేన్‌కు మూడు వికెట్లు దక్కాయి. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా 20 ఓవర్లలో 6 వికెట్లకు 167 పరుగులు చేసి ఓడింది. సౌమ్య సర్కార్ (28 బంతుల్లో 42; 6 ఫోర్లు), షకీబ్ (34 బంతుల్లో 41; 4 ఫోర్లు) మాత్రమే ఆడగలిగారు. బౌల్ట్, సోధిలకు రెండేసి వికెట్లు దక్కాయి. -
కొడితే రికార్డులే ...
-
కొడితే రికార్డులే ...
భారీ విజయమే భారత్ లక్ష్యం 4–0పై కోహ్లి సేన దృష్టి ∙పరువు కాపాడుకునే ప్రయత్నంలో ఇంగ్లండ్ నేటి నుంచి చెన్నైలో చివరి టెస్టు ∙ఉ.గం.9.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్–1లో లైవ్ విరాట్ కోహ్లి మరో 135 పరుగులు చేస్తే ఒక సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడవుతాడు. అశ్విన్ మరో 9 వికెట్లు పడగొడితే ఒక సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా నిలుస్తాడు. ఇవి మన స్టార్ ఆటగాళ్లు చేరుకోగలిగే మైలురాళ్లు. భారత్ గెలిస్తే తొలిసారి ఇంగ్లండ్‌ను 4–0తో చిత్తు చేసినట్లవుతుంది. 2011 నాటి సిరీస్ ఓటమికి లెక్క సరిపోతుంది. భారత టెస్టు చరిత్రలో రెండోసారి ప్రత్యర్థిని 4–0తో ఓడించిన జట్టుగా కోహ్లి సేన నిలుస్తుంది. మ్యాచ్ గెలిచినా, ‘డ్రా’ అయినా మన జట్టు వరుసగా 18వ మ్యాచ్‌ను ఓటమి లేకుండా ముగించిన కొత్త రికార్డు నమోదవుతుంది. టెస్టు సిరీస్‌లో భారత్ చెలగాటం ఇంగ్లండ్‌కు ప్రాణసంకటంలా మారింది. వరుస విజయాల జోరుతో మరో మ్యాచ్ నెగ్గాలని, రికార్డులు బద్దలు కొట్టాలని టీమిండియా పట్టుదలగా ఉండగా... సిరీస్ కోల్పోయాక కనీసం పరువు దక్కించుకునేందుకు ఇంగ్లండ్ పోరాడుతోంది. ఇప్పటికే సమష్టి వైఫల్యంతో దెబ్బతిన్న ఇంగ్లండ్... ‘వర్దా’ తర్వాత సొంతగడ్డపై అశ్విన్ రూపంలో రానున్న పెను తుపానును ఎదుర్కోగలదా! చెన్నై: ‘వర్దా’ తుపాను తర్వాత నెలకొన్న ప్రశాంతత మధ్య భారత్, ఇంగ్లండ్ సిరీస్‌లో ఐదో టెస్టుకు చెపాక్‌లో రంగం సిద్ధమైంది. ఎన్నో ప్రతికూలతల మధ్య మ్యాచ్ నిర్వహణ కోసం చిదంబరం స్టేడియం సిబ్బంది తీవ్రంగా శ్రమించడంతో అనుకున్న ప్రకారం నేటి (శుక్రవారం) నుంచి చివరి టెస్టు జరగనుంది. ఇప్పటికే 3–0తో సిరీస్ నెగ్గి తిరుగులేని ఆధిక్యం కనబరిచిన భారత్ దీనిని మరింత పెంచుకోవాలని భావిస్తోంది. భారత్‌లో అడుగు పెట్టిన నాటినుంచి విజయానికి ఆమడ దూరంలో నిలిచిన ఇంగ్లండ్ ఒత్తిడి లేకుండా ఆడి కాస్త మెరుగ్గా సిరీస్ ముగించాలని ఆశిస్తోంది. ప్రస్తుత ఫామ్ ప్రకారం ఈ టెస్టును ఆ జట్టు ‘డ్రా’గా ముగించగలిగినా వారికి గెలుపుతో సమానమే! మార్పుల్లేకుండానే... విరాట్ కోహ్లి టెస్టు కెప్టెన్ అయ్యాక గాయం కారణంగా గానీ, వ్యూహాల వల్ల గానీ ప్రతీ టెస్టు మ్యాచ్‌కు తుది జట్టులో కనీసం ఒక మార్పు అయినా జరిగింది. అయితే పెళ్లి తర్వాత జట్టుతో చేరిన ఇషాంత్ శర్మకు కనీసం ఒక మ్యాచ్‌లోనైనా అవకాశం ఇవ్వాలని భావిస్తే తప్ప... తొలిసారి కోహ్లి నేతృత్వంలో ఎలాంటి మార్పు లేకుండా జట్టు బరిలోకి దిగవచ్చు. తొమ్మిదో స్థానంలో వచ్చే ఆటగాడు కూడా సెంచరీ చేయగల స్థాయిలో ఉన్న భారత జట్టుకు ఎలాంటి బ్యాటింగ్ సమస్యలు లేవు. కోహ్లి తిరుగులేని ఆటకు విజయ్, పుజారా సహకారం ఉంటోంది. లోకేశ్ రాహుల్ నుంచి మాత్రం ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ రాలేదు. గత మ్యాచ్‌లో విఫలమైన అతని కర్ణాటక సహచరుడు కరుణ్ నాయర్ మెరుగ్గా ఆడితేనే మున్ముందు మరిన్ని అవకాశాలు లభిస్తాయి. బౌలింగ్‌లో మన స్పిన్నర్లు అశ్విన్, జడేజా, జయంత్ ఎదురు లేకుండా సాగుతున్నారు. ఇక్కడా కొత్త రికార్డులు కొల్లగొట్టడానికి వీరు సిద్ధమయ్యారు. ఆరంభంలో పిచ్ సీమర్లకు అనుకూలిస్తే ఉమేశ్, భువనేశ్వర్ మంచి ప్రభావం చూపించగలరు. మొత్తంగా వరుస విజయాలు ఇచ్చిన ఆత్మవిశ్వాసం టీమ్‌లో తొణికిసలాడుతోంది. ఈ జట్టును ఆపడం ప్రత్యర్థికి అంత సులువు కాదు. కోలుకుంటారా... నిజానికి ఇంగ్లండ్ భారత గడ్డపై అడుగు పెట్టినప్పుడు ఆ జట్టు ఇంత పేలవంగా ఆడుతుందని ఎవరూ ఊహించలేదు. దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌లతో పోలిస్తే టెస్టు స్పెషలిస్ట్ టీమ్ కావడం, భారత్‌లో కూడా గతంలో మెరుగైన రికార్డు ఉండటం వల్ల గట్టి పోటీ తప్పదనిపించింది. కానీ కోహ్లి సేన దూకుడు ముందు కుక్ బృందం తేలిపోయింది. ఇప్పుడు సిరీస్ ముగింపునకు వచ్చిన సమయంలోనైనా ఆ టీమ్ కాస్త గట్టిగా నిలబడితే మెరుగైన ఫలితం రాబట్టవచ్చు. రూట్ మినహా ఎవరూ బ్యాటింగ్‌లో రాణించలేకపోయారు. కుక్ ఆట కూడా ఆశించిన స్థాయిలో లేకపోగా, స్టోక్స్ గత రెండు టెస్టుల్లోనూ బ్యాటింగ్‌లో విఫలమయ్యాడు. ఈ క్యాలెండర్ ఇయర్లో అత్యధిక పరుగులు చేసిన బెయిర్‌స్టో ఆట జట్టుకు పెద్దగా ఉపయోగపడలేదు. మొయిన్ అలీ కూడా విఫలం కావడం జట్టును దెబ్బ తీసింది. కనీసం ఇద్దరు బ్యాట్స్‌మెన్ పట్టుదలగా ఆడాల్సి ఉంది. గత రెండు మ్యాచ్‌లలో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయిన అండర్సన్ గాయంతో ఈ టెస్టుకు దూరమయ్యాడు. అతని స్థానంలో మూడో స్పిన్నర్‌గా లియామ్ డాసన్ వస్తాడు. మ్యాచ్ రోజు ఉదయం ఫిట్నెస్ టెస్టులో నెగ్గితే వోక్స్ స్థానంలో బ్రాడ్ జట్టులోకి రానున్నాడు. సిరీస్‌లో 22 వికెట్లు తీసిన రషీద్‌కు మెరుగైన ప్రదర్శన ఇచ్చేందుకు మరో అవకాశం వచ్చింది. తుది జట్ల వివరాలు (అంచనా) భారత్: కోహ్లి (కెప్టెన్), రాహుల్, విజయ్, పుజారా, నాయర్, పార్థివ్, అశ్విన్, జడేజా, జయంత్, ఉమేశ్, భువనేశ్వర్/ఇషాంత్. ఇంగ్లండ్: కుక్ (కెప్టెన్), జెన్నింగ్స్, రూట్, అలీ, బెయిర్‌స్టో, స్టోక్స్, బట్లర్, డాసన్, రషీద్, బాల్, బ్రాడ్/ వోక్స్. ⇒ 13 ఈ మైదానంలో ఆడిన 31 టెస్టులలో భారత్ 13 గెలిచింది ⇒ 3 ఇక్కడ 8 టెస్టులు ఆడిన ఇంగ్లండ్ 3 గెలిచి, 4 ఓడింది. మా జట్టేమీ అజేయమైనది కాదు. ఈ విజయాలు ఒక దశ మాత్రమే. రాబోయే 7–8 ఏళ్ల పాటు అత్యుత్తమ జట్టుగా ఆధిపత్యం ప్రదర్శించడంలో భాగంగా సాగుతున్న ప్రక్రియ ఇది. ప్రపంచంలో ఇంకా చాలా చోట్ల ఆడాల్సి ఉందని నాకు తెలుసు. సిరీస్ సాధించినా దూకుడు తగ్గించం. 4–0తో గెలవాలని మేం పట్టుదలగా ఉన్నాం. నాకు అవకాశం లభిస్తే 2018లో జరిగే ఇంగ్లండ్ సిరీస్‌కు ముందు కనీసం నెల రోజులు కౌంటీల్లో ఆడి అక్కడి పిచ్‌లు, వాతావరణానికి అలవాటు పడాలని భావిస్తున్నా. –విరాట్ కోహ్లి, భారత కెప్టెన్ మా ప్రయత్నంలో లోపం లేదు. కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాను. ఓడినప్పుడు సహజంగానే విమర్శలు వస్తాయి. వేగంగా సాగిపోయే క్రికెట్లో ప్రతీకారం అనే మాటను నేను నమ్మను. 2014 సిరీస్ జరిగి కూడా చాలా రోజులైనట్లు అనిపిస్తోంది. నా ఇన్నేళ్ల కెరీర్లో ఎప్పుడూ మ్యాచ్‌కు ముందు నెట్ ప్రాక్టీస్ జరగని రోజు లేదు. అయితే ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన చోట మా ప్రాక్టీస్ ముఖ్యం కాదు. మహా అయితే మేం హోటల్æనుంచి స్టేడియంకు వస్తున్నాము. చుట్టూ పరిస్థితి చూస్తే మేం ఎంత అదృష్టవంతులమో అనిపిస్తుంది. – కుక్, ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ సపరేటు... తుపాను కారణంగా మైదానం చిత్తడిగా ఉండటంతో గురువారం కూడా ఇరు జట్ల ఆటగాళ్లు నెట్ ప్రాక్టీస్‌లో పాల్గొనలేకపోయారు. అయితే ఇంగ్లండ్ ప్రధాన బ్యాట్స్‌మన్ జో రూట్ మాత్రం తన సన్నాహాలకు బ్రేక్ వేయలేదు. అందుకోసం అతను మరో ‘దారి’ని వెతుక్కున్నాడు. చెన్నై గల్లీల్లోకి దూరి తన సాధన కొనసాగించాడు. స్టేడియం సమీపంలో ఉన్న సిమెంట్ రోడ్డుపైన అతను సహాయక సిబ్బందితో కలిసి సుదీర్ఘ సమయం పాటు సీరియస్‌గా సాధన చేయడం విశేషం. పిచ్, వాతావరణం చెన్నై నగరంలో వర్షం తగ్గుముఖం పట్టి గురువారం బాగా ఎండకాసింది. అయితే బొగ్గులతో ఆరబెట్టిన తర్వాత కూడా పిచ్‌పై కాస్త తేమ ఉంది. దాంతో ఆరంభంలో సీమ్‌కు సహకరించవచ్చు. కానీ మ్యాచ్ సాగినకొద్దీ ఇది స్పిన్‌కు అనుకూలంగా మారిపోతుంది. టెస్టు జరిగే రోజులు భారీ వర్ష సూచన లేకున్నా ఆకాశం మేఘావృతమై ఉండటంతో చినుకులు పడే అవకాశం ఉంది. -
మ్యాచ్ డ్రా చేసుకున్నా లాభం లేదు: అండర్సన్
ముంబై: టీమిండియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో వెనకంజలో ఉన్నా ఇంగ్లండ్ ఆటగాళ్ల మాటలు మాత్రం ఆ స్థాయిలో లేవు. ఇక్కడ జరుగుతున్న నాలుగోటెస్టు నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తమ రెండో ఇన్నింగ్స్ లో 6 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. నేడు ఆట నిలిపివేసిన తర్వాత ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ మీడియాతో మాట్లాడాడు. తమ ఆటగాళ్లు చివరిరోజున ఐదురోజు సాధ్యమైనన్ని పరుగులు చేసేందుకు బ్యాటింగ్ చేస్తారన్నాడు. డ్రా చేసే దిశగా తమ జట్టు ఆలోచించడం లేదని చెప్పాడు. సిరీస్ లో ఇప్పటికే భారత్ 2-0 ఆధిక్యంలో ఉండగా, ఈ టెస్ట్ కూడా కోల్పోతే తమకు కోలుకునే అవకాశం ఉందని అండర్సన్ అన్నాడు. టెస్ట్ డ్రా చేసుకున్నా జట్టుకు సిరీస్ ఓటమి తప్పదని, అందుకే ఎదురుదాడే తమ మార్గమని అభిప్రాయపడ్డాడు. విరాట్ కోహ్లీ డబుల్ సెంచరీ(235), జయంత్ యాదవ్ సెంచరీ(104)లతో చెలరేగడంతో భారత్ 631పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్ రూట్ హాఫ్ సెంచరీ(77), బెయిర్ స్టో(50 నాటౌట్) రాణించకుంటే తక్కువ స్కోరుకే ఆలౌటయ్యేది. భారత్ ఇంకా 49 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. -
రెండో టెస్టులో ఆడతా: అండర్సన్
భారత్‌తో జరిగే రెండో టెస్టులో తను బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయని ఇంగ్లండ్ పేసర్ అండర్సన్ చెప్పాడు. భుజం గాయం నుంచి కోలుకుంటున్న తను ప్రస్తుతం జట్టుతో పాటే ఉన్నాడు. ‘వాస్తవానికి నా గాయం తీవ్రత దృష్ట్యా భారత్‌తో టెస్టులకు అందుబాటులో ఉండకపోవచ్చని అనుకున్నాం. కానీ గత మూడు వారాలుగా బాగా మెరుగయ్యాను. రెండో టెస్టు ప్రారంభమయ్యే సమయానికి పూర్తి ఫిట్నెస్తో ఉంటానని భావిస్తున్నాను’ అని అండర్సన్ చెప్పాడు. -
భారత్‌తో తొలి టెస్టుకు అండర్సన్ దూరం
లండన్: వచ్చే నెల 9 నుంచి భారత్‌తో జరిగే తొలి టెస్టుకు తమ ప్రధాన బౌలర్ అండర్సన్ అందుబాటులో ఉండటం లేదని ఇంగ్లండ్ కెప్టెన్ అలిస్టర్ కుక్ చెప్పాడు. ఎడమ భుజం గాయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న అండర్సన్ ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో జరుగుతున్న మ్యాచ్‌లు కూడా ఆడటం లేదు. భారత్‌లో తను తమ జట్టుతో చేరతాడని కుక్ తెలిపాడు. బంగ్లాదేశ్‌తో నేటి నుంచి జరిగే తొలి టెస్టు ద్వారా కుక్ ఇంగ్లండ్ తరఫున అత్యధిక టెస్టులు (134) ఆడిన క్రికెటర్‌గా రికార్డు సృష్టించబోతున్నాడు. హాట్ కేకుల్లా చాంపియన్సట్రోఫీ టిక్కెట్లు వచ్చే ఏడాది ఇంగ్లండ్ ఆతిథ్యమిచ్చే ఐసీసీ చాంపియన్స ట్రోఫీని ప్రత్యక్షంగా చూసేందుకు అభిమానులు భారీగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 4.17 లక్షల టికెట్ల కోసం 60 దేశాలకు చెందిన అభిమానులు నమోదు చేసుకున్నారని ఐసీసీ తెలిపింది. -
ఇంగ్లండ్ ఇన్నింగ్స్ విజయం
శ్రీలంకతో తొలి టెస్టు లీడ్స్: అండర్సన్ (5/29) బంతితో నిప్పులు చెరగడంతో మూడు రోజుల్లోనే ముగిసిన తొలి టెస్టులో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 88 పరుగుల తేడాతో శ్రీలంకపై ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో కుక్‌సేన 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఫాలోఆన్ ఆడుతూ 1/0 ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు శనివారం ఆట కొనసాగించిన లంక రెండో ఇన్నింగ్స్‌లో 35.3 ఓవర్లలో 119 పరుగులకే కుప్పకూలింది. కుషాల్ మెండిస్ (53) మినహా అందరూ విఫలమయ్యారు. ఫిన్‌కు 3 వికెట్లు దక్కాయి. బెయిర్‌స్టోకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. -
‘కంగారు’పడ్డారు!
► లక్ష్య ఛేదనలో తడబడ్డ ఆస్ట్రేలియా ► 8 పరుగులతో నెగ్గిన న్యూజిలాండ్ ► రాణించిన కివీస్ బౌలర్లు ధర్మశాల: ఆస్ట్రేలియా లక్ష్యం 20 ఓవర్లలో 143 పరుగులు... ఓ దశలో జట్టు స్కోరు 121/5... ఇక గెలవాలంటే 12 బంతుల్లో 22 పరుగులు చేయాలి. మామూలుగా ఆసీస్ బ్యాటింగ్ లైనప్‌ను బట్టి చూస్తే విజయం నల్లేరు మీద నడకే. కానీ న్యూజిలాండ్ పేసర్లు మెక్లీంగన్ (3/17), అండర్సన్ (2/29) సూపర్ బౌలింగ్‌తో కంగారూలను అద్భుతంగా కట్టడి చేశారు. 12 బంతుల వ్యవధిలో నాలుగు వికెట్లు తీసి స్మిత్‌సేన విజయాన్ని అడ్డుకున్నారు. ఫలితంగా టి20 ప్రపంచకప్‌లో భాగంగా శుక్రవారం జరిగిన గ్రూప్-2 లీగ్ మ్యాచ్‌లో కివీస్ 8 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై నెగ్గి వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 142 పరుగులు చేసింది. గప్టిల్ (27 బంతుల్లో 39; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), ఇలియట్ (20 బంతుల్లో 27; 3 ఫోర్లు), విలియమ్సన్ (20 బంతుల్లో 24; 4 ఫోర్లు), మున్రో (26 బంతుల్లో 23; 2 ఫోర్లు)లు రాణించారు. అనంతరం ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 9 వికెట్లకు 134 పరుగులకే పరిమితమైంది. ఖవాజ (27 బంతుల్లో 38; 6 ఫోర్లు) టాప్ స్కోరర్. చివర్లో 12 బంతుల వ్యవధిలో మార్ష్(24), అగర్(9), ఫాల్క్‌నర్ (2), కోల్టర్‌నీల్ (1)లు అవుట్ కావడంతో కివీస్ చిరస్మరణీయ విజయాన్ని సొంతం చేసుకుంది. మెక్లీంగన్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. స్కోరు వివరాలు న్యూజిలాండ్ ఇన్నింగ్స్: గప్టిల్ (సి) మ్యాక్స్‌వెల్ (బి) ఫాల్క్‌నర్ 39; విలియమ్సన్ (సి) అగర్ (బి) మ్యాక్స్‌వెల్ 24; మున్రో (సి) ఫాల్క్‌నర్ (బి) మార్ష్ 23; అండర్సన్ (సి) అగర్ (బి) మ్యాక్స్‌వెల్ 3; టేలర్ (సి) మార్ష్ (బి) వాట్సన్ 11; ఇలియట్ రనౌట్ 27; రోంచి (సి) మ్యాక్స్‌వెల్ (బి) ఫాల్క్‌నర్ 6; సాంట్నెర్ రనౌట్ 1; మిల్నె నాటౌట్ 2; ఎక్స్‌ట్రాలు: 6; మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 142. వికెట్ల పతనం: 1-61; 2-66; 3-76; 4-97; 5-117; 6-133; 7-140; 8-142. బౌలింగ్: కోల్టర్‌నీల్ 4-0-33-0; వాట్సన్ 4-0-22-1; అగర్ 1-0-18-0; ఫాల్క్‌నర్ 3-0-18-2; జంపా 1-0-3-0; మ్యాక్స్‌వెల్ 3-0-18-2; మిచెల్ మార్ష్ 4-0-26-1. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: ఖవాజ రనౌట్ 38; వాట్సన్ (సి) విలియమ్సన్ (బి) మెక్లీంగన్ 13; స్మిత్ (స్టంప్డ్) రోంచి (బి) సాంట్నెర్ 6; వార్నర్ (సి) గప్టిల్ (బి) సాంట్నెర్ 6; మ్యాక్స్‌వెల్ (సి) విలియమ్సన్ (బి) సోధి 22; మార్ష్ (సి) మిల్నె (బి) మెక్లీంగన్ 24; అగర్ (సి) టేలర్ (బి) మెక్లీంగన్ 9; ఫాల్క్‌నర్ (సి) గప్టిల్ (బి) అండర్సన్ 2; కోల్టర్‌నీల్ (బి) అండర్సన్ 1; నెవిల్ నాటౌట్ 7; జంపా నాటౌట్ 2; ఎక్స్‌ట్రాలు: 4; మొత్తం: (20 ఓవర్లలో 9 వికెట్లకు) 134. వికెట్ల పతనం: 1-44; 2-51; 3-62; 4-66; 5-100; 6-121; 7-123; 8-124; 9-132. బౌలింగ్: అండర్సన్ 4-0-29-2; మిల్నె 2-0-22-0; ఇలియట్ 2-0-17-0; మెక్లీంగన్ 3-0-17-3; సాంట్నెర్ 4-0-30-2; విలియమ్సన్ 1-0-3-0; సోధి 4-0-14-1. కివీస్ మహిళలు కూడా... మరోవైపు న్యూజిలాండ్ మహిళల జట్టు కూడా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కివీస్ 93 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత కివీస్ మూడు వికెట్లకు 177 పరుగులు చేయగా... ఐర్లాండ్ 83 పరుగులు మాత్రమే సాధించింది. మరో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆరు వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది. 103 పరుగుల విజయలక్ష్యాన్ని ఆస్ట్రేలియా నాలుగు వికెట్లు కోల్పోయి అధిగమించింది. -
ఫీల్డ్‌లో క్రికెటర్ల కొట్లాట
-
వండర్సన్...
మూడో సీడ్ ఆండీ ముర్రేకు షాక్ ♦ దక్షిణాఫ్రికా ప్లేయర్ అండర్సన్ సంచలనం ♦ కెరీర్లో తొలిసారి గ్రాండ్‌స్లామ్ క్వార్టర్స్‌లోకి ♦ ఆరో సీడ్ బెర్డిచ్ కూడా ఇంటిదారి ♦ ఎదురులేని ఫెడరర్ గత ఐదేళ్లుగా గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లలో నిలకడకు మారుపేరుగా నిలిచిన బ్రిటన్ టెన్నిస్ స్టార్ ఆండీ ముర్రే ఈసారి తడబడ్డాడు. దక్షిణాఫ్రికా ఆజానుబాహుడు కెవిన్ అండర్సన్ ధాటికి ముర్రే ప్రిక్వార్టర్ ఫైనల్లో చేతులెత్తేశాడు. భారీ సర్వీస్‌లతో విరుచుకుపడిన అండర్సన్ ఆద్యంతం నిలకడగా ఆడి వండర్ ఫలితాన్ని సాధించాడు. తన కెరీర్లో తొలిసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. న్యూయార్క్ : గొప్ప వేదికలపై గత రికార్డులు ప్రభావం చూపవని... ఆ రోజు అద్భుతంగా ఆడిన వారినే విజయం వరిస్తుందని మరోసారి రుజువైంది. 2011 నుంచి వరుసగా 18 గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లలో కనీసం క్వార్టర్ ఫైనల్‌కు చేరిన బ్రిటన్ స్టార్ ఆండీ ముర్రే ఈసారి అలాంటి ఫలితాన్ని పునరావృతం చేయలేకపోయాడు. సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్‌లో మూడో సీడ్ ముర్రే ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ఇంటిముఖం పట్టాడు. 4 గంటల 18 నిమిషాలపాటు హోరాహోరీగా సాగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్ పోరులో 15వ సీడ్ కెవిన్ అండర్సన్ (దక్షిణాఫ్రికా) 7-6 (7/5), 6-3, 6-7 (2/7), 7-6 (7/0)తో ముర్రేను మట్టికరిపించాడు. ► 6 అడుగుల 8 అంగుళాల ఎత్తు, 90 కేజీల బరువున్న 29 ఏళ్ల అండర్సన్ ఈ మ్యాచ్‌లో 25 ఏస్‌లు సంధించాడు. ముర్రే సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసిన అతను తన సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయాడు. ఐదు డబుల్ ఫాల్ట్‌లు, 57 అనవసర తప్పిదాలు చేసినా.. నిర్ణాయక టైబ్రేక్‌లలో మాత్రం అండర్సన్ పైచేయి సాధించి విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. టాప్-15 ర్యాంకుల్లోని ఆటగాడిపై నెగ్గడం అండర్సన్ కెరీర్లో ఇదే తొలిసారి. ► ఈ మ్యాచ్‌కు ముందు ముర్రేతో గతంలో ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో అండర్సన్ ఐదుసార్లు ఓడిపోయాడు. గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో ఒకే ఒక్కసారి 2010 ఆస్ట్రేలియన్ ఓపెన్ తొలి రౌండ్లో ముర్రేతో ఆడిన అండర్సన్ కేవలం నాలుగు గేమ్‌లు మాత్రమే గెలిచి ఓటమిని మూటగట్టుకున్నాడు. అయితే తనదైన రోజున తానెంత ప్రమాదకర ప్లేయర్‌నో అండర్సన్ నిరూపించాడు. గత ఫలితాలతో సంబంధం లేకుండా ఈసారి అద్భుత విజయాన్ని దక్కించుకొని ముర్రే ఆట కట్టించాడు. ► 1992లో వేన్ ఫెరారీ తర్వాత యూఎస్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్‌కు చేరిన దక్షిణాఫ్రికా ప్లేయర్‌గా అండర్సన్ గుర్తింపు పొందాడు. క్వార్టర్ ఫైనల్లో ఐదో సీడ్ స్టానిస్లాస్ వావ్రింకా (స్విట్జర్లాండ్)తో అండర్సన్ తలపడతాడు. ముఖాముఖి రికార్డులో అండర్సన్ 4-3తో ఆధిక్యంలో ఉండటం విశేషం. ప్రిక్వార్టర్ ఫైనల్లో వావ్రింకా 6-4, 1-6, 6-3, 6-4తో డొనాల్డ్ యంగ్ (అమెరికా)పై గెలుపొందాడు. సూపర్ ఫెడరర్ మరోవైపు రెండో సీడ్ రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్) తన విజయపరంపర కొనసాగిస్తూ క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో ఫెడరర్ 7-6 (7/0), 7-6 (8/6), 7-5తో 13వ సీడ్ జాన్ ఇస్నెర్ (అమెరికా)పై గెలిచాడు. 2 గంటల 39 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఫెడరర్ మూడో సెట్లోని 12వ గేమ్‌లో ఇస్నెర్ సర్వీస్‌ను ఒకసారి బ్రేక్ చేసి గెలిచాడు. ► 6 అడుగుల 10 అంగుళాల ఎత్తు, 109 కేజీల బరువున్న ఇస్నెర్ తన అంతర్జాతీయ కెరీర్లో తొలిసారి ఓ టైబ్రేక్‌ను 0-7తో కోల్పోయాడు. ఐదుసార్లు ఫెడరర్ సర్వీస్‌ను బ్రేక్ చేసే అవకాశం వచ్చినా ఇస్నెర్ సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఫెడరర్ 15 ఏస్‌లు సంధించి,16 అనవసర తప్పిదాలు చేశాడు. ► క్వార్టర్ ఫైనల్లో 12వ సీడ్ రిచర్డ్ గాస్కే (ఫ్రాన్స్)తో ఫెడరర్ తలపడతాడు. ముఖాముఖి రికార్డులో ఫెడరర్ 14-2తో ఆధిక్యంలో ఉన్నాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో రిచర్డ్ గాస్కే 2-6, 6-3, 6-4, 6-1తో ఆరో సీడ్ థామస్ బెర్డిచ్ (చెక్ రిపబ్లిక్)పై సంచలన విజయాన్ని సాధించాడు. చెమటోడ్చి నెగ్గిన హలెప్: మహిళల సింగిల్స్ విభాగంలో రెండో సీడ్ సిమోనా హలెప్ (రుమేనియా) తొలిసారి యూఎస్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్లోకి చేరింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో హలెప్ 6-7 (6/8), 7-5, 6-2తో 24వ సీడ్ సబైన్ లిసికి (జర్మనీ)పై కష్టపడి గెలిచింది. 2 గంటల 38 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో హలెప్ తన ప్రత్యర్థి సర్వీస్‌ను 10 సార్లు బ్రేక్ చేసి, తన సర్వీస్‌ను ఏడుసార్లు కోల్పోయింది. మహిళల టెన్నిస్‌లో వేగవంతమైన సర్వీస్, ఒకే మ్యాచ్‌లో అత్యధిక ఏస్‌లు సంధించిన రికార్డును కలిగిన లిసికి ఈ మ్యాచ్‌లో తొలి రెండు సెట్లలో అద్భుతంగా ఆడింది. అయితే కీలకమైన మూడో సెట్లో తడబడి మూల్యం చెల్లించుకుంది. లిసికి ఏకంగా 72 అనవసర తప్పిదాలు చేయడం గమనార్హం. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో 26వ సీడ్ ఫ్లావియా పెనెట్టా (ఇటలీ) 6-4, 6-4తో 2011 చాంపియన్, 22వ సీడ్ సమంతా స్టోసుర్ (ఆస్ట్రేలియా)ను ఓడించగా... ఐదో సీడ్ పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్) 7-5, 6-3తో క్వాలిఫయర్ జొహనా కొంటా (బ్రిటన్)పై గెలిచింది. మిక్స్డ్ సెమీస్‌లో బోపన్న జంట మిక్స్డ్ డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ రోహన్ బోపన్న (భారత్) -యుంగ్ జాన్‌చాన్ ద్వయం (చైనీస్ తైపీ) 7-6 (9/7), 5-7, 13-11తో ‘సూపర్ టైబ్రేక్’లో సు వీ సెయి (చైనీస్ తైపీ)-హెన్రీ కొంటినెన్ (ఫిన్లాండ్) జంటపై గెలిచింది. మరో క్వార్టర్ ఫైనల్లో లియాండర్ పేస్ (భారత్)-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జోడీకి సిమోనా హలెప్-హొరియా టెకావ్ (రుమేనియా) జంట నుంచి వాకోవర్ లభించింది. సెమీస్‌లో బోపన్న-యుంగ్ జాన్ చాన్‌లతో పేస్-హింగిస్ తలపడతారు. ప్రాంజల పరాజయం జూనియర్ బాలికల సింగిల్స్ విభాగంలో హైదరాబాద్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజలకు తొలి రౌండ్లోనే పరాజయం ఎదురైంది. 15వ సీడ్ ప్రాంజల 6-7 (1/7), 3-6తో వాలెంటిని గ్రామాటికోపులూ (గ్రీస్) చేతిలో ఓడిపోయింది. 84 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రాంజల తన సర్వీస్‌ను నాలుగుసార్లు కోల్పోయింది. -
అండర్సన్ అదుర్స్
తొలి వన్డేలో లంకపై కివీస్ గెలుపుజయవర్ధనే సెంచరీ వృథా క్రైస్ట్‌చర్చ్: బ్రెండన్ మెకల్లమ్ (22 బంతుల్లో 51; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు బ్యాటింగ్‌కు తోడు అండర్సన్ (96 బంతుల్లో 81; 11 ఫోర్లు, 1 సిక్స్) సమయోచితంగా ఆడటంతో శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్ 3 వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత లంక 50 ఓవర్లలో 9 వికెట్లకు 218 పరుగులు చేసింది. జయవర్ధనే (107 బంతుల్లో 104; 12 ఫోర్లు, 1 సిక్స్) కెరీర్లో 18వ సెంచరీ సాధించాడు. మిగతా వారు విఫలమయ్యారు. లంక స్కోరు 200/5 ఉన్న దశలో మెక్లీంగన్ నాలుగు బంతుల వ్యవధిలో మెండిస్, జయవర్ధనే, తిసారా పెరీరా (0)లను అవుట్ చేశాడు. తర్వాత కివీస్ 43 ఓవర్లలో 7 వికెట్లకు 219 పరుగులు చేసి నెగ్గింది. అండర్సన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య రెండో వన్డే గురువారం హామిల్టన్‌లో జరుగుతుంది. -
‘భోపాల్’ ఘోరం.. ఏదీ న్యాయం?
ఘోర నేరస్తులను విచారించలేని దివాలాకోరు వ్యవస్థ మనదని చాటి చెప్పడానికి ఒక్క ‘భోపాల్’ చాలు. యూసీసీ అధిపతి ఆండర్సన్‌ను ఒక ఇన్స్పెక్టర్ అరెస్టు చేస్తే... ప్రధాని నుంచి జిల్లా కలెక్టర్ దాకా విడిపించి, పంపేయకపోతే ఏమౌతుందోనని భయపడ్డారు. యంత్రభూతాల కోరలు తోమే సాధారణ కార్మికులు, వారి కుటుంబాలు విష పెట్టుబడుల కాటుకు ఇలా బలి కావలసిందేనా? సమపాలన, న్యాయం వారికి ఎండమావులేనా? ఇది ఆధునిక నాగరికత వికృతరూపం. 1984లో ఢిల్లీ, భోపాల్ నగరాలలో సాగింది ఘోరం. బాధితులకు ఇంకా న్యాయం జరగకపోవడం అంతకన్నా ఘోరమైన నేరం. 1984 నవంబర్‌లో ఢిల్లీ నగరం సిక్కుల రక్తంతో తడిసింది. ప్రధానమంత్రి ఇందిరాగాంధీ హత్యకు ప్రతీకారంగా వేలాది సిక్కులను ఊచకోత కోశారు. అదే సంవత్సరం భోపాల్ నగరంలో మిక్ రసాయన విషవాయువు విలయ తాండవమాడింది. వేలాదిమందిని హతమార్చింది. జీవరాశిని నాశనంచేసింది. పర్యావరణాన్ని ధ్వంసం చేసింది. రెండు సందర్భాలలోనూ న్యాయం దొరక లేదు. అసలు న్యాయం అనేది ఉందో లేదో కూడా తెలియరాలేదు. హరియాణాలో ఆశ్రమం పేరిట దుర్భేద్యమైన కోటను నిర్మించి యథేచ్ఛగా నేరాల లీలలు సాగిస్తూ, చట్టాలను, కోర్టులను లెక్కచేయక దర్జాగా బతికే ‘స్వాము లను’ పట్టుకోవడానికి వందలాది సాయుధ దళాలు, 27 కోట్ల రూపాయల ఖర్చు అవసరమయ్యాయి. రక్తపాతమూ జరిగింది. ఏమైతేనేం చట్టం చివరకు చట్టం అమలయిందనుకుని సరిపెట్టుకోవచ్చు. 1984 నాటి రెండు మారణ హోమాలు దీనితో పోల్చలేనంత అతి ఘోర దురంతాలు. వాటికి బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలను చేపట్టడం కోసం, బాధితులకు న్యాయం చేయడం కోసం ప్రభుత్వాలు చేసిన ప్రయత్నాలు ఏపాటివి? 30 ఏళ్ల కిందట టన్నుల కొద్దీ విష వాయువులను చిమ్మించి భోపాల్ మానవ మారణ హోమాన్ని సృష్టించిన యూనియన్ కార్బయిడ్ కార్పొరేషన్ (యూసీసీ) నేరస్తుడు వారన్ ఆండర్సన్‌ను మన వ్యవస్థ పట్టుకోలేకపోయింది. చేతగాక కాదు, పట్టుకోవాలని లేక. నిజానికి ఆండర్సన్పై మోపిన నేరాలను విచారించాలంటే ఆయన్ను పట్టి, భారత్‌కు తీసుకురాక తప్పదు. కానీ మన పాలకులు, ప్రభుత్వాలు.. ఆండర్సన్ పోతే కేసుల గొడవపోతుందని ఆయన అంతిమ ఘడియల కోసం ఎదురు చూశారు. అంతేగానీ వేలాది మందిని చంపి, ఇంకెందరినో శాశ్వత వ్యాధిగ్రస్తులను చేసి, రాబోయే తరాల డీఎన్ఏలలో సైతం విషం నింపిన యూసీసీ నేరాలకు చట్టపరమైన పర్యవసానాలు ఏమిటని ఆలోచించలేదు. పాపి చిరాయువు అన్నట్టు ఆండర్సన్ కూడా 92 ఏళ్లు నిశ్చిం తగా జీవించి 29 సెప్టెంబర్ 2014న మరణించాడు. భారత నేర పరిశోధనా వ్యవస్థ ఓ పెద్ద పనైపోయినట్టు.. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంది. ఆండర్సన్‌ను రప్పించాలని ఇటు నుంచి, తప్పించాలని అటు అమెరికా నుంచి ఒత్తిడుల బాధ ఇక వారికి లేదు. మూడు వ్యవస్థలూ ముద్దాయిలే భోపాల్ ఘోరానికి మన మూడు వ్యవస్థలూ కారణమే. విదేశీ కంపెనీల పెట్టు బడులను, వ్యాపారాలను భారత్‌కు రప్పించాలనే ఆరాటమే తప్ప, ఆ టెక్నాలజీ ప్రజా జీవితంలో సంక్షోభాన్ని సృష్టిస్తే అందుకు తగు చర్యలు చేపట్టడానికి, పరిష్కరించడానికి అవసరమైన శాసనాలు చేయని మన శాసన వ్యవస్థ మొదటి ముద్దాయి. విష రసాయన వాయువులకు ఎందరో బలైన తరువాత 1985 నాటికి గానీ పర్యావరణ చట్టం తేవాలన్న ధ్యాస శాసనకర్తలకు కలగలేదు. జీవరాశి నాశనానికి కారణమైన యూసీసీ అధికారులపై హత్య వంటి తీవ్ర అభి యోగాలు మోపడానికి వీల్లేదని ఆరోపణల దశలోనే తీర్పు చెప్పి సుప్రీంకోర్టు న్యాయం మనుగడకు సవాలు విసిరింది. భోపాల్ నేరగాళ్లకు రెండేళ్ల కన్నా ఎక్కువ జైలు శిక్ష వేయలేని అశక్తతలో న్యాయస్థానాలు పడిపోయాయి. ఈ లోపాన్ని సవరించడానికి ‘క్యూరేటివ్ పిటిషన్’ను సుప్రీంకోర్టుకు సమర్పించినా ప్రయోజనం లేకపోయింది. అది కూడా ప్రయోజనం ఉండదని తెలిసీ, ప్రచా రం కోసం చేసిన విన్యాసమేనని ప్రజానీకానికి త్వరలోనే అర్థమైపోయింది. భోపాల్ బాధితులకు ఏదైనా ఉపశమనం దొరికిందంటే అది కేవలం న్యాయ స్థానాల వల్లనే. న్యాయమూర్తులు సృజనాత్మక ఆదేశాలను జారీచేయకపోతే వారికి ఆ కాస్త పరిహారమైనా అందేది కాదు. నిజానికి ఈ దారుణానికి కారణం రాజకీయ ప్రభుత్వాలు. విదేశీ కంపెనీలు మన దేశంలో తయారు చేస్తున్నది విషమా? లేక పురుగుమందా? సాంకేతిక పరిజ్ఞానమా? లేక ఆ పేరుతో దేశం లోకి మృత్యువును దిగుమతి చేస్తున్నారా? అని గమనించని గుడ్డి పాలకులు విధాన నిర్ణయాలు తీసుకున్నారు. భోపాల్ ఘాతుకం జరిగిన తరువాతైనా వారు బాధితులకు న్యాయం చేయడం కోసం, పరిహారాలు ఇప్పించడం కోసం ఏమైనా చేశారా? అదీ లేదు. ఘోర నేరస్తులను విచారించలేని దివాలాకోరు వ్యవస్థ మనదని చాటి చెప్పడానికి ఒక్క ‘భోపాల్’ చాలు. ముద్దాయి అడుగులకు మడుగులు విషవాయువు విలయ నర్తనం చేసిన ఆ ‘డిసెంబర్ 2’ కాళరాత్రి శవాల రాశు లను మిగిల్చింది. విదేశాలలో వాడి పారేసిన పనికిరాని యంత్రాలను భారత్‌కు పంపి, సాయం చేస్తున్నట్టు పోజులిచ్చే కంపెనీలు లాభాల కోసం ఏమైనా చేస్తాయి. అయితే యూసీసీ అధిపతి (సీఈఓ) వారన్ ఆండర్సన్ తమ లాభా పేక్ష ఎంత దారుణ మారణహోమం సృష్టించిందో చూడాలనుకోవడం గొప్ప విషయం. డిసెంబర్ 7న ఆండర్సన్ భోపాల్ విమానాశ్రయంలో దిగాడు. ‘భోపాల్’ నేరానికి ఎఫ్ఐఆర్ నమోదు చేసిన మామూలు పోలీసు అధికారి అతన్ని అక్కడే అరెస్టు చేశాడు. ఆ కింది స్థాయి పోలీసు అధికారి తన బాధ్యత తాను చేశాడు. అదే పెద్ద సంచలనమైంది. సాధారణ ఇన్స్పెక్టర్ అంత ధైర్యం ప్రదర్శించగా...ప్రధాని నుంచి జిల్లా కలెక్టర్ దాకా అంతా ఆండర్సన్‌ను విడిపించకపోతే ఏమవుతుందోనని భయపడిపోయారు. అతన్ని అతి జాగ్రత్తగా యూసీసీ అతిథి గృహంలోనే ఏ ఇబ్బంది లేని ‘కస్టడీ’లో ఉంచారు. ఆ గదిలో ఫోన్ పనిచేస్తున్న విషయం మరిచిపోయినట్టుంది. ఆండర్సన్ దర్జాగా అమెరికా పెద్దలకు ఫోన ్ల మీద ఫోన్లు కొట్టారు. అంతే ఇక ఢిల్లీలోని విదేశీ రాయబార కార్యాలయాలు, విదేశాంగ శాఖ, ప్రధాని కార్యాలయం, మధ్యప్రదేశ్ ముఖ్య మంత్రి కార్యాలయాలలో తెగ హడావుడి, వెంటనే విడుదల చేయాలని కలెక్టర్ మీద ఒత్తిడి పెరిగాయి. ‘‘సార్ మీరు అరెస్టయ్యారు. కాని మీకే ఇబ్బంది లేదు. వెంటనే బెయిల్ ఇచ్చేస్తాం. ఈ కాగితాల మీద సంతకం పెట్టండి’’ అని రాచమర్యాదలు చేశారు. ఆండర్సన్ వద్ద మన కరెన్సీ లేకపోతే మనవాళ్లే 25 వేల రూపాయలు పోగుచేసి సెక్యూరిటీగా కట్టేసి మరీ బెయిల్ ఇప్పించారు. ‘కాందహార్’ హైజాకర్ల బ్లాక్ మెయిల్‌కు భయపడి హోంమంత్రి (1999) స్వయంగా నిర్బంధంలోని పాకిస్తాన్ టైరిస్టును వారికి అప్పగించినట్టు... భోపాల్ నుంచి ప్రత్యేక విమానంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఈ నేరస్తుడిని ఢిల్లీకి పంపింది. రాష్ట్ర ముఖ్యకార్యదర్శి ఆదేశాల మేరకు ఆండర్సన్‌ను బెయిల్‌పై విడుదల చేయక తప్పలేదని నాటి కలెక్టర్ మోతీసింగ్ ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఆనాటి ప్రధాని రాజీవ్‌గాంధీ ప్రిన్సిపల్ కార్య దర్శిగా పనిచేసిన పీసీ అలెగ్జాండర్ ఒక టీవీ ఇంటర్వ్యూలో.. ఆండర్సన్‌ను విడుదల చేయాలని రాజీవ్‌గాంధీ ఆదేశించారని, ఆయన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి అర్జున్‌సింగ్‌తో చాలాసార్లు ఫోన్లో మాట్లాడిన తరువాత ముఖాముఖి కలుసుకున్నారని వివరించారు. ఆండర్సన్ ప్రయాణించిన ప్రత్యేక విమానాన్ని భోపాల్ నుంచి ఢిల్లీకి నడిపిన పైలట్ ఎస్‌హెచ్ అలీ తనకు కెప్టెన్ అశీశ్ సోథీ నుంచి ఆదేశాలు అందినట్టు తెలిపారు. సీఎం కార్యాలయం నుంచి ఏవియేషన్ డెరైక్టర్‌కు, అక్కడి నుంచి తమకు, ఆ ఉత్తర్వులు అందాయని వివరించారు. ‘‘మాకు ఆ తరువాత తెలిసింది... అతను ఆండర్సన్ అని. వెంట ఎస్పీ, కలెక్టర్ ఉన్నారు. ఆండర్సన్ ఒక్కమాట కూడా మాట్లాడలేదు. కళ్లు మూసుకునే ఉన్నాడు. ముఖంలో ఆందో ళన వ్యక్తమయింది’’ అని వివరిం చారు. ‘‘ఇన్ని వేల మంది చనిపోవడానికి కారణం ఏమిటి?’’ అని అతన్ని అడ గలేదే అని పైలట్ బాధపడ్డాడు. ఢిల్లీకి చేరుకున్న ఆండర్సన్ హోంమంత్రి పీవీ నరసింహారావును, విదేశాంగ కార్యదర్శి ఎంకే రస్తోగీని మర్యాదపూర్వకంగా కలసి, అమెరికా వెళ్లిపోయారు. మళ్లీ ఎన్ని సమన్లు పంపినా వచ్చింది లేదు. నేరం చేయాలన్న ఉద్దేశంతోగానీ, అది నేరం అని తెలిసిగానీ పలువురు ఆ నేరంలో పాలుపంచుకుంటే అందులో పాల్గొన్న ప్రతి వ్యక్తీ... ఆ నేరాన్ని అతడొక్కడే చేసినట్టు భావించి విధించే శిక్షకు అర్హుడవుతాడని ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 35 వివరిస్తున్నది. 150 సంవత్సరాలుగా నేర న్యాయస్థానంలో అమలవుతున్న న్యాయ సూత్రం ఇది. దీని ప్రకారం ప్రాణాంతకమైన టెక్నాలజీ అని తెలిసి కూడా, అయితే అయిందిలే అన్న రీతిలో నిర్లక్ష్యంగా దాన్ని వినియోగించడంలో ప్రధాన భాగస్వాములయిన వారంతా నేరస్తులే అవుతారు. విషవాయువు అకస్మాత్తుగా విడుదలయ్యే ప్రమాదం ఉందని, అది ప్రాణాం తకమని తెలిసి కూడా వారు ఈ పనిచేశారని చెప్పడానికి తగిన సాక్ష్యాధారాలు ఉన్నాయని అదనపు సొలిసిటర్ జనరల్ వాదనలు చేశారు. వాటిని పట్టించుకో కుండా సుప్రీంకోర్టు 1996లో భోపాల్ కేసును తీవ్రమైన నేరారోపణల కింద విచారణ జరపాల్సిన అవసరం లేదని కొట్టి పారేసింది. ఇందువల్ల భోపాల్ క్రిమినల్ కోర్టు మన దేశానికి చెందిన నిందితులకు నిర్లక్ష్యంతో వ్యవహరించిన నేరానికి మాత్రమే రెండేళ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పు చెప్పవలసివచ్చింది. అంత ఘోర నేరానికి శిక్ష ఇదేనా? అనీ, అసలు హంతకులను పట్టుకోవడం సాధ్యమేనా? అనీ, ఇదేనా మన న్యాయవ్యవస్థ? అనీ ప్రజలు నిరాశ చెందారు. మన దేశ క్రిమినల్ నేర నిర్ధారణ చరిత్రలోనే ఇదొక ఘోర వైఫల్యం. వైఫల్యాల నిశీథిన కాంతి రేఖ విషవాయువులు కమ్మిన ఈ చీకటిలో ఒక మెరుపు మెరిసింది. భోపాల్ జిల్లా సివిల్ కోర్టు న్యాయాధికారి మహదేవ్ వామనరావ్ దేవ్ యూనియన్ కార్బయిడ్ కేసులో చరిత్రాత్మక ఉత్తర్వులు ఇచ్చారు. ‘‘ఇదొక దారుణం. 2,700 మందిని పొట్టనబెట్టుకుంది. వందలాది మందిని దెబ్బతీసింది. చాలా మంది ఉపాధిని, పని చేసుకునే సామర్థ్యాన్ని కోల్పోయారు. ఇల్లు నడిపే వారు చనిపోవడంతో కుటుంబాలు అనాథలయ్యాయి. నాగరికత పెరిగినపుడు, శాస్త్రసాంకేతిక రంగాలు ప్రగతి చెందినపుడు మనం ఊహించని ప్రమాదాలు జరుగుతాయి. వాటితోపాటు న్యాయశాస్త్రం కూడా ఎదగవలసి ఉంది. ఈ ప్రగతి క్రమంలోని ప్రమాదాలను, సవాళ్లను ఎదుర్కొనేందుకు చట్టం సిద్ధం కావాలి. బాధితులను ఓదార్చే శక్తి చట్టానికి ఉండాలి. ఆ చట్టం కోర్టును కదిలించాలి. కోర్టు పేదల బాధలు తీర్చేందుకు కదలాలి. అందుకే బాధితులకు తాత్కాలికంగా 350 కోట్ల రూపాయల పరిహారం చెల్లించాలని యూనియన్ కార్బయిడ్‌ను ఆదేశిస్తున్నాం’’ అని వామన్రావ్ దేవ్ తాత్కాలిక తీర్పు ఇచ్చారు. ఆ తీర్పుతో న్యాయప్రక్రియ వేగం పుంజుకుంది. ఆయన ప్రారంభించిన న్యాయ చైతన్యం సుప్రీంకోర్టు ద్వారా పూర్తిస్థాయి పరిహారం ఇప్పించే వైపు తీసుకు వెళ్లింది. ప్రమాదకరమైన పరిశ్రమలను నెలకొల్పే సంస్థలు, ఉత్పత్తి క్రమంలో సంభవించే ప్రమాదాలకు పూర్తి స్థాయి పరిహారం చెల్లించే బాధ్యత స్వీకరించి తీరాల్సిందే, దానికి మినహాయింపులు ఉండవు అనే సంపూర్ణ బాధ్యతా సూత్రాన్ని సుప్రీంకోర్టు రూపొందించింది. భోపాల్‌లోని జాతీయ న్యాయ అకాడమీలో మహదేవ్ వామన్రావ్ దేవ్ చిత్రాన్ని ఉంచడంతో పాటూ, చరిత్రాత్మకమైన ఆయన తీర్పులోని ప్రధానాంశాలను గ్రంథాలయంలో ఉంచి ఆయనకు నివాళులర్పించారు. దేవ్ వంటి న్యాయమూర్తులు సుప్రీంకోర్టులో ఉండి ఉంటే బాధితులకు మేలు జరిగేదేమోననే ఆశలు రేకెత్తించింది ఆయన తీర్పు. రసాయన యంత్రభూతాల కోరలు తోమే సాధారణ కార్మికులు, వారి కుటుంబాలు ఈ విష పెట్టుబడులు కాటందుకున్నప్పుడల్లా బలికావలసిందేనా? సమపాలన, న్యాయం వారికి ఎప్పటికీ అందని ఎండమావులేనా? ఇది ప్రకృతి వైపరీత్యం కాదు. ఆధునిక నాగరికత ధరించిన వికృతరూపం. ఢిల్లీ, భోపాల్ నగరాల్లో సాగింది ఘోరం. కానీ అందుకు బలైన వారికి ఇంకా న్యాయం దొరకకపోవడం అంతకన్నా ఘోరమైన నేరం. - (వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్) professorsridhar@gmail.com డా॥ మాడభూషి శ్రీధర్ -
నియమావళిని మార్చేది లేదు: శ్రీనివాసన్
చెన్నై: జడేజా, అండర్సన్ గొడవ నేపథ్యంలో ఆటగాళ్ల క్రమశిక్షణా నియమావళిని మార్చాలనే డిమాండ్‌ను ఐసీసీ తోసిపుచ్చింది. ‘ఆటగాళ్ల కోసం ఏర్పాటు చేసిన ప్రవర్తన నియమావళిని పునర్వ్యవస్థీకరించే ఆలోచన మాకు లేదు’ అని ఐసీసీ చీఫ్ ఎన్.శ్రీనివాసన్ స్పష్టం చేశారు. జడేజాతో జరిగిన వాగ్వాదంలో అండర్సన్ ఎలాంటి శిక్ష లేకుండా తప్పించుకోవడంతో భారత క్రికెట్ బోర్డు ఈ డిమాండ్‌ను తెర మీదకు తెచ్చింది. అటు ద్రవిడ్ కూడా జ్యుడీషియల్ కమిషనర్ ఇచ్చిన తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. -
ఐసీసీ ఏం చెప్పాలనుకుంటోంది!
బీసీసీఐ ఏం చెబితే అది ఐసీసీకి వేదవాక్కు... ఇదీ ఇంతకాలం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రీడాభిమానుల ఆలోచన. కానీ అండర్సన్, జడేజా వివాదంలో భారత్‌కు ఎదురుదెబ్బ తగిలింది. తప్పు చేశానని అండర్సన్ చెప్పినా... సాక్ష్యాలు లేవంటూ శిక్ష విధించలేదు. ఈ అంశంలో బీసీసీఐ చాలా సీరియస్‌గా వ్యవహరించినా... ఐసీసీ నుంచి మాత్రం బోర్డుకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. దీని ద్వారా ఐసీసీ ఏం చెప్పాలనుకుంటోంది? ►అండర్సన్ తప్పు ఒప్పుకున్నా శిక్ష ఎందుకు పడలేదు? ►తొలిసారి భారత్‌కు వ్యతిరేకంగా చర్యలు ప్రస్తుతం ఇంగ్లండ్‌లో జరుగుతున్న సిరీస్‌లో అండర్సన్ పదే పదే క్రమశిక్షణ ఉల్లంఘిస్తున్నాడు. అయినా ఐసీసీ కనీసం వివరణ కోరడం లేదు. తొలి టెస్టులో జడేజాతో వివాదం తర్వాత... నిషేధం గురించి ఏ మాత్రం భయపడని అండర్సన్ మూడో టెస్టులోనూ రహానేతో కయ్యం పెట్టుకునే ప్రయత్నం చేశాడు. కానీ ఐసీసీ దేనినీ పట్టించుకున్నట్లు లేదు. తాను జడేజాపై చేయి వేశానని ఇంగ్లండ్ పేసర్ ఒప్పుకున్నా...సాక్ష్యాలు లేవంటూ శిక్ష తప్పించుకున్నాడు. బీసీసీఐ ఆగ్రహం...: అండర్సన్‌కు ఎలాంటి శిక్ష పడకపోవడం బీసీసీఐకి ఆగ్రహం కలిగించింది. ‘అతడి పేరు ఉచ్ఛరించడానికి కూడా నేను ఇష్టపడను’ అని ధోని వ్యాఖ్యానించాడంటే ఈ విషయాన్ని భారత బృందం ఎంత సీరియస్‌గా తీసుకుందో అర్థం చేసుకోవచ్చు. ‘ఈ కేసులో తీర్పు పూర్తిగా తప్పు. ఇది ఒక చెడ్డ ఉదాహరణగా నిలిచిపోతుంది’ అని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు తాజాగా తన అసంతృప్తిని వెళ్లగక్కారు. అండర్సన్ విషయంలో అసలు బీసీసీఐని ఐసీసీ లెక్క చేసినట్లే కనిపించడం లేదని ఆయన ఆవేశంగా అన్నారు. ‘ఈ ఉదంతంలో వరుసగా తప్పులు జరిగాయి. ముందు జడేజాను రిఫరీ శిక్షించారు. ఆ తర్వాత దానిని తొలగించారు. జడేజాను అండర్సన్ నెట్టడం రుజువైంది. అతనే స్వయంగా చెప్పాడు. అయినా అతడిని దోషిగా గుర్తించలేదు. అంపైర్ ఆక్సెన్‌ఫర్డ్ మైదానంలో తిట్లు ఆపాల్సిందిగా కోరారు. కానీ నిబంధనలు ఉల్లంఘించడంపై ఫిర్యాదు చేయలేదు. ఐసీసీ చాలా అంశాలకు సమాధానం చెప్పాల్సి ఉంది’ అని ఆయన వ్యాఖ్యానించారు. మా తరఫున మాట్లాడాలి...: ఇంతా జరిగితే అండర్సన్‌పై చర్య తీసుకోకపోవడం దుర్మార్గమని బోర్డు అధికారి అభిప్రాయ పడ్డారు. ‘దీని ద్వారా యువ క్రికెటర్లకు ఏం సందేశం ఇవ్వదలిచారు. మీరు తోటి ఆటగాడిని తిట్టవచ్చు, తోసేయవచ్చు, కానీ హాయిగా తప్పించుకోవచ్చు అని చెబుతారా’ అని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో బీసీసీఐ తమ ప్రయత్నాలు కొనసాగిస్తుందని, ఐసీసీ సీఈఓ డేవ్ రిచర్డ్సన్ తమ తరఫున మాట్లాడాలని కోరుకుంటున్నట్లు ఆయన చెప్పారు. - సాక్షి క్రీడావిభాగం రిచర్డ్సన్ అంగీకరిస్తారా... జ్యుడీషియల్ కమిషనర్ ఇచ్చిన తీర్పుపై అప్పీల్ చేయాలా? వద్దా? అనే నిర్ణయం ఇప్పుడు ఐసీసీ సీఈవో డేవ్ రిచర్డ్సన్ చేతుల్లో ఉంది. అయితే తను ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడనేది ఆసక్తికరంగా మారింది. ఐసీసీ చైర్మన్ ఎన్.శ్రీనివాసన్ కూడా భారత్‌కు చెందిన వారే కావడంతో ఈ వివాదంలో నొప్పింపక.. తానొవ్వక తరహాలో ఉండాలని డేవ్ భావిస్తున్నారు. ఈ నెల 10న ఒకవేళ రిచర్డ్సన్ అప్పీలుకు వెళితే 48 గంటల్లోగా ఐసీసీ కోడ్ ఆఫ్ ఎథిక్స్ కమిటీ నుంచి ముగ్గురు సభ్యుల ప్యానెల్ ఏర్పాటు కావాల్సి ఉంటుంది. ఈ ప్యానెల్ చర్య తీసుకునేలోగా అండర్సన్ మిగతా రెండు టెస్టులూ ఆడే అవకాశం ఉంది. -
జడేజాపై దురుసుగా ప్రవర్తించా: ఆండర్సన్
లండన్: భారత్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా, ఇంగ్లండ్ పేసర్ ఆండర్సన్‌ల మధ్య ఏర్పడ్డ వివాదానికి తెరపడింది. ఈ సంఘటనపై విచారించిన ఐసీసీ ఇద్దరికీ క్లీన్ చిట్ ఇచ్చింది. అయితే తొలి టెస్టు సందర్భంగా జడేజాను తాను దూషించినట్టు ఆండర్సన్ అంగీకరించాడు. జడేజాను నెట్టేసి, పళ్లు రాలకొడతానంటూ తిట్టానని చెప్పాడు. ఈ వివాదంలో జడేజాపై మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత... ఇక ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ అండర్సన్‌పై రెండు టెస్టుల వేటు ఖాయమని క్రికెట్ ప్రపంచం తొలుత ఊహించింది. అయితే జ్యుడీషియల్ కమిషనర్ గార్డన్ లూయిస్ విచారణాంతరం ఇద్దరూ నిర్దోషులే అని తేల్చారు. ఈ విషయాన్ని ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది. జడేజా, అండర్సన్ క్రమశిక్షణ చర్యలు ఉల్లంఘించలేదని కమిషనర్ పేర్కొన్నట్టు స్పష్టం చేసింది. దీంతో జడేజాపై విధించిన మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత కూడా ఉపసంహరించుకున్నట్టయ్యింది. -
అండర్సన్‌పై నిషేధం తప్పదు!
బీసీసీఐ దగ్గర బలమైన సాక్ష్యం సౌతాంప్టన్: తొలి టెస్టులో భారత ఆల్‌రౌండర్ జడేజాను తోసివేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇంగ్లండ్ బౌలర్ అండర్సన్‌పై నిషేధం తప్పేలా లేదు. ఈ సంఘటనకు సంబంధించి వీడియో దృశ్యాలు తమ దగ్గర ఉన్నాయని బీసీసీఐ చెబుతోంది. వీటిని ఐసీసీ జ్యుడీషియల్ కమిషనర్ గోర్డల్ లూయిస్‌కు సమర్పించనుంది. ఈ వివాదానికి సంబంధించి నేడు విచారణ జరుగుతుంది. అండర్సన్ దోషిగా తేలితే నాలుగు మ్యాచ్‌ల నిషేధం పడే అవకాశం ఉంది. మరోవైపు ఈ ఘటనలో జడేజాకు జరిమానాపై బీసీసీఐ చేసిన అప్పీలుపై కూడా శుక్రవారం విచారణ జరుగుతుంది. సాహా స్థానంలో నమన్ ఓజా ఇంగ్లండ్ పర్యటనలో భారత రిజర్వ్ వికెట్ కీపర్ సాహా గాయం కారణంగా స్వదేశానికి వెళుతున్నాడు. దీంతో అతడి స్థానంలో నమన్ ఓజాను ఎంపిక చేశారు. ప్రస్తుతం ఓజా ఆస్ట్రేలియాలో భారత ‘ఎ’ జట్టు తరఫున ఆడుతున్నాడు. -
ఆండర్సన్ అదుర్స్; ప్లే ఆప్ లో ముంబై
ముంబై: ఐపీఎల్-7లో మరో అద్భుతం నమోదయింది. అసాధ్యమనుకున్న దాన్ని సొంత మైదానంలో సుసాధ్యం చేసి చూపింది ముంబై ఇండియన్స్ జట్టు. చావురేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్ లో విజృంభించి ఆడి విజయం సాధించింది. 190 పరుగుల భారీ లక్ష్యాన్ని 14.4 ఓవర్లలోనే ఛేధించి ప్లే ఆప్ లోకి దూసుకెళ్లింది. వాంఖేడ్ మైదానంలో రాజస్థాన్ రాయల్స్ తో అత్యంత ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్ లో ముంబై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కోవై ఆండర్సన్ విజృంభించి ఆడి ముంబై విజయంలో కీలకపాత్ర పోషించాడు. 44 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్సర్లతో 95 పరుగులు చేశాడు. అంబటి రాయుడు 10 బంతుల్లో 30 పరుగులు చేసి తన వంతు పాత్ర పోషించాడు. 14.3 ఓవర్లలో ముంబై లక్ష్యాన్ని ఛేదించాల్సివుంది. అయితే 14.3 ఓవర్లలో ముంబై 189 పరుగులు చేసి స్కోరు సమం చేసింది. తర్వాతి బంతికి ఫోర్ కొడితే ముంబై ప్లే ఆప్ కు చేరుతుందని ప్రకటించారు. దీంతో ఇరు జట్లతో పాటు ప్రేక్షకులు ఉత్కంఠకు లోనయ్యారు. ఫాల్కనర్ బౌలింగ్ లో తారే సిక్స్ బాది ముంబైను ప్లే ఆప్ కు చేర్చాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది. కోవె ఆండర్సన్ కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' దక్కింది. శనివారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ 14.2 ఓవర్లలో 161 పరుగులు ఛేదిస్తే ముంబై ఏకంగా 14.4 ఓవర్లలోనే 195 పరుగులు చేసి అత్యద్భుత మనిపించింది. కోల్ కతాలో యూసఫ్ పఠాన్ చెలరేగితే, ముంబై జట్టులో ఆండర్సన్ అద్భుతం చేశాడు. అత్యంత ధర చెల్లించి దక్కించుకున్న ఆండర్సన్ ఇప్పటివరకు సరైన ఇన్నింగ్స్ ఆడలేదు. కానీ సరైన సమయంలో వీరోచిత ఇన్నింగ్స్ ఆడి జట్టును ప్లే ఆప్ కు చేర్చాడు. -
మళ్లీ ఇంటివాడైన బ్రెట్ లీ
మెల్బోర్న్: ఆస్ట్రేలియా మాజీ పేస్ బౌలర్ బ్రెట్ లీ తన ప్రియురాలు లానా అండర్సన్‌ను వివాహమాడాడు. అతనికిది రెండో వివాహం. సీఫోర్త్లోని తన నివాసంలో సన్నిహితుల మధ్య గత వారం ఈ పెళ్లి జరిగింది. 2008లో మొదటి భార్య ఎలిజబెత్ కెంప్కు లీ విడాకులిచ్చాడు. వీరికి ఓ కుమారుడు ఉన్నాడు. 37 ఏళ్ల లీ గతేడాది నుంచి లానాతో డేటింగ్ చేస్తూ సహజీవనం చేస్తున్నాడు. -
అండర్సన్ పై కన్నేసిన ఐపిఎల్ ఫ్రాంచైజీలు
-
న్యూజిలాండ్ క్రికెటర్ ప్రపంచ రికార్డు
-
న్యూజిలాండ్ క్రికెటర్ అండర్సన్ ప్రపంచ రికార్డు
క్వీస్స్టస్ : న్యూజిలాండ్ క్రికెటర్ కోరీ అండర్సన్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. వన్డేల్లో 36 బంతుల్లోనే సెంచరీ చేసి.. 18 ఏళ్లుగా చెక్కుచెదరకుండా ఉన్న పాకిస్తాన్ ఆటగాడు అఫ్రిది రికార్డును బద్ధలుకొట్టాడు. 37 బంతుల్లో సెంచరీ చేసిన అఫ్రిది రికార్డు.. ఆండర్సన్ దెబ్బకు మరుగున పడిపోయింది. క్వీన్స్టన్లో వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలో అండర్సన్ కేవలం 47 బంతుల్లో 131 పరుగులు చేశాడు. ఇందులో 14 సిక్సర్లు, 6 ఫోర్లు ఉన్నాయి. అతని విధ్వంసక ఇన్నింగ్స్‌తో న్యూజిలాండ్ కేవలం 21 ఓవర్లలో 4 వికెట్లకు 283 పరుగులు చేసింది. కాగా 1996లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో అఫ్రిది 37 బంతుల్లో సెంచరీ చేసి రికార్డు సృష్టించాడు. మొత్తానికి ఇన్నాళ్లకు అతని రికార్డు బద్దలైంది. -
అండర్సన్ సెంచరీ: కివీస్ 419/8
ఢాకా: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ భారీ స్కోరు నమోదు చేసింది. కోరి అండర్సన్ (173 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సర్లతో 116) సెంచరీతో చెలరేగడంతో బుధవారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో 133 ఓవర్లలో 8 వికెట్లకు 419 పరుగులు చేసింది. వాట్లింగ్ (59 బ్యాటింగ్), ఇందర్బీర్ సింగ్ సోధి (55 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం మెకల్లమ్ సేన 137 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఓవర్‌నైట్ స్కోరు 107/3 తో మూడో రోజు ఆట కొనసాగించిన కివీస్‌ను బంగ్లా బౌలర్లు కట్టడి చేయలేకపోయారు. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మెన్ విలియమ్సన్ (62), టేలర్ (53) అర్ధసెంచరీలతో భారీ స్కోరుకు పునాది వేశారు. టేలర్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన అండర్సన్ ఆతిథ్య బౌలర్లపై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. విలియమ్సన్తో కలిసి ఐదో వికెట్‌కు 140 పరుగులు జోడించాడు. చివర్లో బ్రేస్‌వెల్ (17), వాగ్నేర్ (8) నిరాశపర్చినా... వాట్లింగ్, సోధి కుదురుగా ఆడారు. వీరిద్దరు తొమ్మిదో వికెట్‌కు అజేయంగా 84 పరుగులు జోడించడంతో కివీస్ భారీ స్కోరు ఖాయమైంది. బంగ్లా బౌలర్లలో షకీబ్ 5, అల్ అమిన్, అబ్దుర్ రజాక్, నాసిర్ హుస్సేన్ తలా ఓ వికెట్ తీశారు. -
డెవ్‌సిక్, అండర్సన్ సెంచరీలు
సాక్షి, విశాఖపట్నం: ఆంటాన్ డెవ్‌సిక్ (185 బంతుల్లో 115; 15 ఫోర్లు), కోరీ అండర్సన్ (126 బంతుల్లో 100; 16 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీలతో ఆదుకోవడంతో భారత్ ‘ఎ’తో సోమవారం ఇక్కడ ప్రారంభమైన రెండో అనధికారిక టెస్టులో న్యూజిలాండ్ ‘ఎ’ కోలుకుంది. వైఎస్ఆర్ ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో తొలి రోజు ఆట ముగిసే సరికి న్యూజిలాండ్ ‘ఎ’ తమ తొలి ఇన్నింగ్స్‌లో 89 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. ఆరంభంలో భారత బౌలర్లు చెలరేగడంతో కివీస్ 43 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. బ్రూమ్ (0), కచోపా (3), రాంచి (0), లాథమ్ (21) వెంట వెంటనే పెవిలియన్ చేరారు. ఈ దశలో అండర్సన్, డెవ్‌సిక్ కలిసి జట్టు ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. వీరిద్దరు కలిసి ఐదో వికెట్‌కు 165 పరుగులు జోడించారు. ఆట ముగిసే సమయానికి బ్రేస్‌వెల్ (12), ఇష్ సోధి (14) క్రీజ్‌లో ఉన్నారు. భారత బౌలర్లలో ధావల్ కులకర్ణి, జలజ్ సక్సేనాలకు చెరో 2 వికెట్లు దక్కాయి.