
దుబాయ్: ఐసీసీ టెస్ట్ బౌలర్ల ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్ పేస్ బౌలర్ అండర్సన్ మళ్లీ నంబర్‌వన్ ర్యాంక్‌ను అందుకున్నాడు. చివరిసారి 2018లో అండర్సన్ నంబర్‌వన్ ర్యాంక్‌లో నిలిచాడు. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో అండర్సన్ ఏడు వికెట్లు పడగొట్టడంతో రెండు స్థానాలు ఎగబాకి 866 పాయింట్లతో అగ్రస్థానానికి చేరాడు.
1936 తర్వాత ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ ర్యాంక్ సాధించిన పెద్ద వయస్కుడిగా అండర్సన్ (40 ఏళ్ల 207 రోజులు) గుర్తింపు పొందాడు. భారత స్పిన్నర్ అశ్విన్ 864 పాయింట్లతో రెండో ర్యాంక్‌లో ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment