number one rank
-
మళ్లీ ప్రపంచ నంబర్‌వన్ జోడీగా...
న్యూఢిల్లీ: నెల రోజుల తర్వాత భారత బ్యాడ్మింటన్ స్టార్స్ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి మళ్లీ వరల్డ్ నంబర్‌వన్ ర్యాంక్‌ను అందుకున్నారు. మంగళవారం విడుదల చేసిన ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) ర్యాంకింగ్స్‌లో సాత్విక్–చిరాగ్ ద్వయం రెండు స్థానాలు మెరుగు పర్చుకొని మూడో ర్యాంక్ నుంచి టాప్ ర్యాంక్‌కు ఎగబాకింది. గత ఆదివారం థాయ్‌లాండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నీలో సాత్విక్–చిరాగ్ జంట విజేతగా నిలవడంతో వారి ర్యాంక్‌లో మార్పు వచ్చింది. గత ఏడాది అక్టోబర్‌లో తొలిసారి నంబర్‌వన్ ర్యాంక్‌ను అందుకున్న భారత జోడీ రెండు వారాలపాటు అగ్రస్థానంలో కొనసాగి ఆ తర్వాత ఐదో ర్యాంక్‌కు పడిపోయింది. మళ్లీ ఈ ఏడాది జనవరి 23న నంబర్‌వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకొని ఏప్రిల్ 15వ తేదీ వరకు టాప్ ర్యాంక్‌లో కొనసాగి మూడో ర్యాంక్‌కు పడిపోయింది. -
‘టాప్’ ర్యాంక్‌లోనే సూర్యకుమార్
గత మూడు నెలలుగా ఆటకు దూరంగా ఉన్నా... అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) పురుషుల టి20 ర్యాంకింగ్స్‌లో భారత బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ తన నంబర్‌వన్ ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. తాజా ర్యాంకింగ్స్‌లో సూర్యకుమార్ 861 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. టి20 బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో ఐర్లాండ్‌తో జరిగిన టి20 సిరీస్‌లో రాణించిన రషీద్ ఖాన్ నాలుగు స్థానాలు ఎగబాకి పదో ర్యాంక్‌కు చేరుకున్నాడు. భారత స్పిన్నర్ అక్షర్ పటేల్ 4వ ర్యాంక్‌లో ఉన్నాడు. -
అశ్విన్ టాప్ ర్యాంక్ పదిలం
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో భారత సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన నంబర్‌వన్ ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో అశ్విన్ మొత్తం ఆరు వికెట్లు పడగొట్టాడు. బుధవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో అశ్విన్ 853 రేటింగ్ పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. దక్షిణాఫ్రికా పేస్ బౌలర్ కగిసో రబడ ఒక స్థానం పురోగతి సాధించి 851 పాయింట్లతో రెండో స్థానానికి చేరుకున్నాడు. భారత పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా కూడా ఒక స్థానం మెరుగుపర్చుకొని 825 పాయింట్లతో నాలుగో ర్యాంక్‌లో నిలువగా... స్పిన్నర్ రవీంద్ర జడేజా 754 పాయింట్లతో ఆరో ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో భారత కెపె్టన్ రోహిత్ శర్మ ఒక స్థానం పడిపోయి 729 పాయింట్లతో 12వ ర్యాంక్‌లో నిలిచాడు. టెస్టు ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో అశ్విన్, రవీంద్ర జడేజా తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు. -
ATP Rankings: నంబర్‌వన్ బోపన్న
లండన్: సుదీర్ఘ నిరీక్షణ ముగిసింది. అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) పురుషుల డబుల్స్ ర్యాంకింగ్స్‌లో 21 ఏళ్ల తర్వాత మళ్లీ భారత ప్లేయర్ నంబర్‌వన్ ర్యాంక్‌ను అధిరోహించాడు. సోమవారం విడుదల చేసిన అధికారిక తాజా ర్యాంకింగ్స్‌లో రోహన్ బోపన్న రెండు స్థానాలు ఎగబాకి తన కెరీర్లో తొలిసారి టాప్ ర్యాంక్‌లో నిలిచి చరిత్ర పుటల్లోకి ఎక్కాడు. టెన్నిస్ చరిత్రలోనే నంబర్‌వన్ ర్యాంక్‌ను అందుకున్న అతిపెద్ద వయసు్కడిగా బోపన్న (43 ఏళ్ల 330 రోజులు) ప్రపంచ రికార్డు సృష్టించాడు. అమెరికా దిగ్గజం మైక్ బ్రయాన్ (41 ఏళ్ల 76 రోజులు; 2019లో) పేరిట ఉన్న రికార్డును అతను బద్దలు కొట్టాడు. గత శనివారం ఆస్ట్రేలియన్ ఓపెన్ టోరీ్నలో బోపన్న ఆ్రస్టేలియాకు చెందిన మాథ్యూ ఎబ్డెన్తో కలిసి పురుషుల డబుల్స్ విభాగంలో టైటిల్ నెగ్గి తన కెరీర్లో పురుషుల డబుల్స్‌లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ప్రస్తుత ర్యాంకింగ్స్‌లో బోపన్న, ఎబ్డెన్ 8,450 పాయింట్లతో సమంగా ఉన్నప్పటికీ తక్కువ టోరీ్న లు ఆడినందుకు బోపన్నకు టాప్ ర్యాంక్ ఖరారుకాగా, ఎబ్డెన్ రెండో ర్యాంక్‌లో నిలిచాడు. చివరిసారి భారత్ నుంచి లియాండర్ పేస్ 2000 మార్చి 13న ... మహేశ్ భూపతి 1999 జూన్ 14న ఏటీపీ డబుల్స్ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌గా నిలిచారు. బెంగళూరుకు చెందిన బోపన్న 2003లో ప్రొఫెషనల్‌గా మారాడు. తన 21 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్లో బోపన్న ఇప్పటిదాకా పురుషుల డబుల్స్‌లో 19 మంది వేర్వేరు భాగస్వాములతో ఆడి 25 టైటిల్స్ సాధించడంతోపాటు 504 మ్యాచ్‌ల్లో గెలుపొందాడు. 2016లో బెంగళూరులో తన పేరిట టెన్నిస్ అకాడమీని స్థాపించి కుర్రాళ్లకు శిక్షణ ఇస్తున్నాడు. -
మళ్లీ నంబర్‌వన్ ర్యాంక్‌లో సాత్విక్ –చిరాగ్ జోడీ
న్యూఢిల్లీ: ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) పురుషుల డబుల్స్ ర్యాంకింగ్స్‌లో భారత్‌కు చెందిన సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ద్వయం మళ్లీ నంబర్‌వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకుంది. మంగళవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో సాత్విక్–చిరాగ్ జోడీ ఒక స్థానం మెరుగుపర్చుకొని 95,861 పాయింట్లతో టాప్ ర్యాంక్‌కు ఎగబాకింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాత్విక్ ... మహారాష్ట్ర ప్లేయర్ చిరాగ్ శెట్టి ఈ ఏడాది జరిగిన రెండు ప్రధాన టోరీ్నల్లోనూ (మలేసియా ఓపెన్–1000, ఇండియా ఓపెన్–750) అద్భుత ప్రతిభ కనబరిచి రన్నరప్‌గా నిలిచారు. గత ఏడాది అక్టోబర్‌లో ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించాక సాత్విక్ –చిరాగ్ తొలిసారి వరల్డ్ నంబర్‌వన్‌గా అవతరించింది. పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో ప్రణయ్ ఒక స్థానం పురోగతి సాధించి ఎనిమిదో ర్యాంక్‌లో నిలిచాడు. -
ఎనిమిదోసారి ‘టాప్’ ర్యాంక్‌తో...
టురిన్ (ఇటలీ): సెర్బియా టెన్నిస్ దిగ్గజం నొవాక్ జొకోవిచ్ రికార్డుస్థాయిలో ఎనిమిదోసారి ఏడాదిని నంబర్‌వన్ ర్యాంక్‌తో ముగించనున్నాడు. సీజన్ ముగింపు టోర్నీ ఏటీపీ ఫైనల్స్ తొలి లీగ్ మ్యాచ్‌లో జొకోవిచ్ 7–6 (7/4), 6–7 (1/7) 6–3తో హోల్గర్ రూనె (డెన్మార్క్)పై గెలిచి 2023 సీజన్ ముగింపు ‘టాప్’ ర్యాంక్‌ను ఖరారు చేసుకున్నాడు. 36 ఏళ్ల జొకోవిచ్ రెండేళ్ల క్రితమే ఏడోసారి సీజన్‌ను నంబర్‌వన్ ర్యాంక్‌తో ముగించి సంప్రాస్ (అమెరికా; 6 సార్లు) పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు. జొకోవిచ్ 2011, 2012, 2014, 2015, 2018, 2020, 2021లలో నంబర్‌వన్ ర్యాంక్‌తో ముగించాడు. ఏటీపీ ఫైనల్స్ ముగిశాక జొకోవిచ్ ఓవరాల్‌గా ఏటీపీ ర్యాంకింగ్స్ లో 400 వారాలు నంబర్‌వన్ ర్యాంక్‌లో నిలిచిన తొలి ప్లేయర్‌గా గుర్తింపు పొందనున్నాడు. సీజన్ ముగింపు నంబర్‌వన్ ర్యాంక్ ట్రోఫీతో జొకోవిచ్ -
సూపర్ స్వియాటెక్...
మహిళల టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నీ డబ్ల్యూటీఏ ఫైనల్స్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్ ఇగా స్వియాటెక్ (పోలాండ్) తొలిసారి విజేతగా నిలిచి మళ్లీ ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకుంది. మెక్సికోలో మంగళవారం జరిగిన ఫైనల్లో స్వియాటెక్ 6–1, 6–0తో ఐదో ర్యాంకర్ జెస్సికా పెగూలా (అమెరికా)ను ఓడించింది. స్వియాటెక్ కు ట్రోఫీతోపాటు 30,78,000 డాలర్ల (రూ. 25 కోట్ల 62 లక్షలు) ప్రైజ్‌మనీ, రన్నరప్ పెగూలాకు 16,02,000 డాలర్ల (రూ. 13 కోట్ల 33 లక్షలు) ప్రైజ్‌మనీ దక్కింది. -
ప్రపంచ నంబర్‌వన్ జోడీగా సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి
న్యూఢిల్లీ: ఈ ఏడాది అద్భుతమైన ఫామ్‌లో ఉన్న భారత బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి మరో ఘనత సాధించింది. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) ర్యాంకింగ్స్‌లో పురుషుల డబుల్స్‌లో నంబర్‌వన్ ర్యాంక్‌కు చేరుకున్న తొలి భారతీయ జోడీగా చరిత్ర సృష్టించింది. మంగళవారం విడుదల చేసిన బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్‌లో సాత్వి క్–చిరాగ్ ద్వయం 92,411 పాయింట్లతో అగ్రస్థానాన్ని అలంకరించింది. గతవారం హాంగ్జౌలో ముగిసిన ఆసియా క్రీడల్లోసాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీ స్వర్ణ పతకం సాధించింది. దాంతో ఈ జంట ఒక స్థానం పురోగతి సాధించి రెండు నుంచి టాప్ ర్యాంక్‌కు చేరుకుంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాత్విక్, మహారాష్ట్ర ప్లేయర్ చిరాగ్ ఈ సీజన్లో స్విస్ ఓపెన్, ఆసియా చాంపియన్íÙప్లో, ఇండోనేసియా ఓపెన్, కొరియా ఓపెన్లలో విజేతగా నిలిచారు. గతంలో భారత్ నుంచి పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రకాశ్ పదుకొనే (1980లో), శ్రీకాంత్ (2018లో), మహిళల సింగిల్స్‌లో సైనా నెహా్వల్ (2021లో) ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌లో నిలిచారు. -
భళా అర్జెంటీనా.. ఆరేళ్ల తర్వాత అగ్రస్థానం
ఫిఫా ఫుట్‌బాల్ ర్యాంకింగ్స్‌లో అర్జెంటీనా ఆరేళ్ల తర్వాత మళ్లీ అగ్రస్థానాన్ని అధిరోహించింది. ఇటీవలే పనామా, కురాకోతో జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్‌లలో విజయాలు అందుకున్న అర్జెంటీనా 1840. 93 పాయింట్లతో నెంబర్‌వన్ స్థానాన్ని ఆక్రమించింది. ఫిఫా ర్యాంకింగ్స్‌లో మెస్సీ సేన ఆరేళ్ల తర్వాత అగ్రస్థానంలో నిలవడం విశేషం. ఇక గతేడాది డిసెంబర్లో ఖతార్ వేదికగా జరిగిన ఫిఫా వరల్డ్‌కప్‌లో అర్జెంటీనా విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఫైనల్లో ఫ్రాన్స్‌ను పెనాల్టీ షటౌట్లో 4-2తో ఓడించి మూడోసారి విజేతగా నిలిచింది. అన్నీ తానై జట్టును నడిపించిన మెస్సీ తన కోరికను నెరవేర్చుకోవడంతో పాటు అర్జెంటీనా 36 ఏళ్ల నిరీక్షణకు తెరదించాడు. ఇక ఫిఫా వరల్డ్‌కప్ రన్నరప్‌గా నిలిచిన ఫ్రాన్స్ 1838.45 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. యుఇఎఫ్ఎ యూరో క్వాలిఫైయింగ్‌లో భాగంగా ఫ్రాన్స్.. నెదర్లాండ్స్, రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్లను ఓడించి ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి దూసుకొచ్చింది. ఇక ఏడాది కాలంగా నెంబర్ వన్ స్థానంలో ఉన్న బ్రెజిల్.. ఫిఫా వరల్డ్‌కప్‌లో మొరాకో చేతిలో 2-1తో ఓడింది. ఆ తర్వాత బ్రెజిల్ ఆశించినంతగా ఆడలేక 1834.21 పాయింట్లతో మూడో స్థానానికి పడిపోయింది. ఇక బెల్జియం 1792. 53 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉండగా.. ఇంగ్లండ్ 1792.43 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచింది. నెదర్లాండ్స్ 1731. 23 పాయింట్లతో ఆరో స్థానంలో ఉండగా.. యూరోప్ దేశాలైన క్రొయేషియా, ఇటలీ, పోర్చుగల్, స్పెయిన్ ఆరు నుంచి పది స్థానాల్లో నిలిచాయి. 🇦🇷🏆 World champions ✅ 🇦🇷🥇 Top of the #FIFARanking ✅ — FIFA World Cup (@FIFAWorldCup) April 6, 2023 -
మళ్లీ నంబర్‌వన్‌గా జొకోవిచ్
ఏటీపీ వరల్డ్ ర్యాంకింగ్స్‌లో సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ మళ్లీ తన అగ్ర స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. సోమవారం ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్‌లో జొకోవిచ్ నంబర్‌వన్‌గా నిలిచాడు. రెండు వారాల క్రితం అతను తన టాప్ ర్యాంక్‌ను స్పెయిన్‌కు చెందిన అల్కరాజ్కు కోల్పోయాడు.అయితే మయామీ ఓపెన్‌లో అల్కరాజ్ సెమీస్‌లోనే ఓడటంతో రెండో ర్యాంక్‌కు పడిపోయాడు. జొకోవిచ్ కెరీర్ నంబర్‌వన్‌గా ఇది 381వ వారం కావడం విశేషం. -
అండర్సన్... ఐదేళ్ల తర్వాత మళ్లీ ‘టాప్’లోకి...
దుబాయ్: ఐసీసీ టెస్ట్ బౌలర్ల ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్ పేస్ బౌలర్ అండర్సన్ మళ్లీ నంబర్‌వన్ ర్యాంక్‌ను అందుకున్నాడు. చివరిసారి 2018లో అండర్సన్ నంబర్‌వన్ ర్యాంక్‌లో నిలిచాడు. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో అండర్సన్ ఏడు వికెట్లు పడగొట్టడంతో రెండు స్థానాలు ఎగబాకి 866 పాయింట్లతో అగ్రస్థానానికి చేరాడు. 1936 తర్వాత ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ ర్యాంక్ సాధించిన పెద్ద వయస్కుడిగా అండర్సన్ (40 ఏళ్ల 207 రోజులు) గుర్తింపు పొందాడు. భారత స్పిన్నర్ అశ్విన్ 864 పాయింట్లతో రెండో ర్యాంక్‌లో ఉన్నాడు. -
వన్డే, టి20ల్లో మనమే.. ఇక టెస్టులే బాకీ
టీమిండియా సూపర్ ఫామ్‌లో ఉన్నట్లు కనిపిస్తోంది. స్వదేశంలో ఎప్పటికి మనం పులులమే అని మరోసారి కివీస్‌తో సిరీస్ రుజువు చేసింది. న్యూజిలాండ్ జట్టులో సీనియర్లు లేకపోవచ్చు.. కానీ తొలి వన్డేలో న్యూజిలాండ్ బ్యాటింగ్ చేశాకా తీసిపారేయాల్సిన జట్టులా కనిపించలేదు. అందుకే మన జట్టు వారితో పోలిస్తే బలంగా కనిపించినప్పటికి సిరీస్ క్లీన్‌స్వీప్ చేయడం పెద్ద విషయమే. వరుసగా రెండు వన్డే సిరీస్‌లు క్లీన్‌స్వీప్ చేయడం అంటే ఏ జట్టుకైనా కష్టసాధ్యమే. కానీ టీమిండియా మొదట శ్రీలంకను.. తాజాగా న్యూజిలాండ్‌ను అవలీలగా క్లీన్‌స్వీప్ చేసి పారేసింది. ప్రస్తుతం టి20ల్లో, వన్డేల్లో టీమిండియా నెంబర్‌వన్‌గా ఉంది.. ఇక టెస్టుల్లోనూ అగ్రస్థానం అందుకుంటే.. ముచ్చటగా మూడు ఫార్మాట్లలోనూ ఏకకాలంలో నెంబర్‌వన్‌గా నిలిచిన అరుదైన జట్టుగా నిలవనుంది. బహుశా ఇంతకముందెన్నడూ మూడు ఫార్మాట్లలో ఒకే జట్టు నెంబర్‌వన్‌గా లేదన్నది సమాచారం. తాజాగా ఆ అవకాశం టీమిండియాకు లభించనుంది. వచ్చే నెలలో ఆస్ట్రేలియాతో మొదలుకానున్న నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను టీమిండియా గెలిస్తే గనుక టెస్టుల్లో నెంబర్‌వన్ ర్యాంకును పొందుతుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉండగా.. టీమిండియా రెండో స్థానంలో ఉంది. సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయకపోయినా.. 2-1 తేడాతో నెగ్గినా టీమిండియా అగ్రస్థానంలో నిలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కానీ ప్రస్తతం ప్రపంచనెంబర్‌వన్‌గా ఉన్న ఆస్ట్రేలియాను ఓడించడం టీమిండియాకు సవాలే. కానీ టెస్టు సిరీస్ మన దగ్గర జరగడం సానుకూలాంశమనే చెప్పొచ్చు. ఎంత పెద్ద జట్టైనా స్వదేశంలో టీమిండియా ముందు తోక ముడవాల్సిందే. 2017లో ఆస్ట్రేలియా టీమిండియా పర్యటనకు వచ్చినప్పుడు కూడా తొలి టెస్టు మ్యాచ్‌లో నెగ్గిన ఆసీస్.. ఆ తర్వాత రెండు టెస్టుల్లో ఓడి.. ఒక మ్యాచ్ డ్రా చేసుకుంది. అలా టీమిండియా 2-1తో టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకుంది. మరి ఈసారి కూడా టీమిండియా ఆస్ట్రేలియాపై ఆధిపత్యం ప్రదర్శించి టెస్టు సిరీస్ గెలవడంతో పాటు నెంబర్‌వన్ స్థానాన్ని అందుకుంటుందేమో చూడాలి. నెంబర్‌వన్ కావడంతో పాటు పనిలో పనిగా ఆస్ట్రేలియాతో ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఆడే అవకాశం కూడా టీమిండియాకు రానుంది. చదవండి: 'ర్యాంకులు పట్టించుకోం.. ఆసీస్‌తో సిరీస్ అంత ఈజీ కాదు' 𝗡𝗨𝗠𝗕𝗘𝗥 1️⃣ 𝗜𝗡 𝗢𝗗𝗜𝘀! Congratulations #TeamIndia 👏👏 pic.twitter.com/pjzuPZ4ENt — BCCI (@BCCI) January 24, 2023 -
దీపిక... వరల్డ్ నంబర్‌వన్
పారిస్: ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–3 టోర్నీలో మహిళల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో స్వర్ణం సాధించినందుకు భారత స్టార్ ఆర్చర్ దీపిక కుమారికి తగిన ప్రతిఫలం లభించింది. సోమవారం విడుదల చేసిన తాజా ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 27 ఏళ్ల దీపిక రికర్వ్ వ్యక్తిగత విభాగంలో నంబర్‌వన్ ర్యాంక్‌ను అధిరోహించింది. ఈ టోర్నీకి ముందు మూడో ర్యాంక్‌లో ఉన్న దీపిక తాజా ప్రదర్శనతో రెండు స్థానాలు పురోగతి సాధించి 263.7 పాయింట్లతో ‘టాప్’ ర్యాంక్‌ను అందుకుంది. లీసా బార్బెలిన్ (ఫ్రాన్స్–225.5 పాయింట్లు) తొలి ర్యాంక్ నుంచి రెండో ర్యాంక్‌కు పడిపోగా... కాంగ్ చె యంగ్ (దక్షిణ కొరియా–208 పాయింట్లు) మూడో ర్యాంక్‌లో నిలిచింది. తొలిసారి 2012లో వరల్డ్ నంబర్‌వన్‌గా నిలిచిన దీపిక ఆ తర్వాత నిలకడగా టాప్–10లో కొనసాగింది. పారిస్‌లో ఆదివారం ముగిసిన ప్రపంచకప్ స్టేజ్–3 టోర్నీలో దీపిక రికర్వ్ టీమ్ విభాగంలో, మిక్స్డ్ విభాగంలో, వ్యక్తిగత విభాగంలో స్వర్ణాలు నెగ్గి ఒకే ప్రపంచకప్‌లో మూడు బంగారు పతకాలు గెలిచిన తొలి భారతీయ ఆర్చర్‌గా రికార్డు నెలకొల్పింది. తన 12 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్లో దీపిక అన్ని ప్రతిష్టాత్మక టోర్నీలలో పతకాలు సాధించింది. కేవలం ఒలింపిక్ పతకం మాత్రమే ఆమెను ఊరిస్తోంది. ప్రపంచకప్ టోర్నీలలో 35 పతకాలు... ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఐదు పతకాలు... కామన్వెల్త్ గేమ్స్‌లో రెండు స్వర్ణాలు, ఆసియా క్రీడల్లో ఒక పతకం... ఆసియా చాంపియన్‌షిప్‌లో ఆరు పతకాలు ఆమె సాధించింది. 2012 లండన్ ఒలింపిక్స్‌లో టీమ్ విభాగంలో తొలి రౌండ్లో... వ్యక్తిగత విభాగంలో తొలి రౌండ్లో వెనుదిరిగిన దీపిక 2016 రియో ఒలింపిక్స్‌లో టీమ్ విభాగంలో క్వార్టర్ ఫైనల్లో... వ్యక్తిగత విభాగంలో మూడో రౌండ్లో ఓడిపోయింది. వచ్చే నెలలో జరిగే టోక్యో ఒలింపిక్స్‌లో దీపిక కేవలం వ్యక్తిగత విభాగంలో పోటీపడనుంది. -
నా శైలిని మార్చుకోను
మహిళల టి20 ప్రపంచకప్‌లో ఫైనల్ చేరడం కాకుండా ఈ టోర్నీ ద్వారా భారత జట్టుకు జరిగిన మరో మేలు ఒక సంచలన బ్యాటర్ వెలుగులోకి రావడం. 16 ఏళ్ల వయసులోనే దాదాపుగా ప్రపంచకప్‌ను గెలిపించాల్సిన పెను భారాన్ని ఆ అమ్మాయి మోసింది. దురదృష్టవశాత్తూ టైటిల్ నెగ్గకపోయినా మన మహిళల క్రికెట్ భవిష్యత్ భద్రంగా ఉందన్న ధైర్యం కలిగిందంటే ఆమె ఇచ్చిన ప్రదర్శనే కారణం. ఇదంతా హరియాణా టీనేజర్ షఫాలీ వర్మ గురించే. తన దూకుడైన ఆటతో అందరి దృష్టినీ ఆకర్షించిన ఆమె కూడా మున్ముందు మరింతగా దూసుకుపోవాలని పట్టుదలగా ఉంది. సాక్షి క్రీడా విభాగం: టి20 ప్రపంచకప్‌లో షఫాలీ వర్మ 5 ఇన్నింగ్స్‌లలో కలిపి 158.25 స్ట్రయిక్ రేట్‌తో 163 పరుగులు చేసింది. ఫైనల్లో షఫాలీ వైఫల్యం భారత జట్టు తుది ఫలితంపై బలంగా పడిందంటే టోర్నీలో ఆమె ప్రభావం ఎంతో అర్థం చేసుకోవచ్చు. గత ఏడాది ఐపీఎల్ సమయంలో జరిగిన ఉమెన్ చాంపియన్స్ టి20 టోర్నీతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న షఫాలీ ఏడాది తిరిగేలోగా భారత జట్టులో కీలక సభ్యురాలిగా ఎదిగింది. రాబోయే రోజుల్లోనూ తన సత్తా చాటాలని ఉత్సాహంగా ఉన్న షఫాలీ తన కెరీర్‌కు సంబంధించి వివిధ అంశాలపై మాట్లాడింది. విశేషాలు ఆమె మాటల్లోనే.... ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌పై... నా ప్రయాణం ఇప్పుడే మొదలైంది. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్ ర్యాంక్ దాకా చేరడం సంతోషకరమే అయినా మున్ముందు కఠిన పరీక్షా సమయం ఉంది. అయితే నాకు ఎదురయ్యే ఎలాంటి సవాల్‌కైనా సిద్ధంగా ఉన్నా. రాబోయే రోజుల్లో భారత జట్టు ఎక్కువ మ్యాచ్‌లు గెలిచేలా ప్రయత్నించడం, వాటిలో నేనూ కీలక పాత్ర పోషించడమే ప్రస్తుతానికి నా దృష్టిలో లక్ష్యాలు. వరల్డ్‌కప్ ఫైనల్ ఫలితంపై... ఆ రోజు మాకు కలిసి రాలేదు. క్రీడల్లో గెలుపోటములు సహజమే. మేం ఒడిసిపట్టుకొని విజయాన్ని అందుకొనే మరిన్ని అవకాశాలు మున్ముందు వస్తాయి. ఫలితం వచ్చేశాక దానిని మనం మార్చలేం కానీ భవిష్యత్‌లో ఏం చేయాలో మా చేతుల్లోనే ఉంది. తన వ్యక్తిగత ప్రదర్శనపై... క్రీజ్‌లోకి అడుగు పెట్టాక వీలైనన్ని ఎక్కువ పరుగులు చేసి భారత జట్టును మెరుగైన స్థితిలో నిలపడమే నా బాధ్యత. ఎందరో ప్రముఖులు నా ప్రదర్శనను ప్రశంసించినప్పుడు గర్వంగా అనిపిస్తుంది. అయితే ట్రోఫీ గెలిచి ఉంటే ఇది మరింత అద్భుతంగా ఉండేది. జట్టులో వాతావరణంపై... చాలా బాగుంటుంది. సీనియర్లే మాట్లాడాలని, జూనియర్లు వారు చెప్పింది వినాలని అస్సలు ఉండదు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్, స్మృతిలాంటి సీనియర్లయితే నన్ను మరింతగా ప్రోత్సహిస్తూ వచ్చారు. ఇక డబ్ల్యూవీ రామన్ సర్ రూపంలో అద్భుతమైన కోచ్ మాకు ఉన్నారు. ఎలాంటి సమస్య గురించి చెప్పినా ఆయన దగ్గర పరిష్కారం ఉంటుంది. తన మార్గనిర్దేశనంతో మనలో ఎనలేని ఆత్మవిశ్వాసం నింపగలరు. స్మృతితో ఓపెనింగ్‌పై... మేం అతిగా ఆలోచించం. ఇద్దరం సహజసిద్ధమైన ఆటనే ఆడేందుకు ప్రయత్నిస్తాం. కాస్త తేలికైన బంతి పడిందంటే చాలు చితక్కొట్టడమే. దానిపై మరో ఆలోచన లేదు. ఈ విషయంలో ఇద్దరం ఒకే తరహాలో ఆలోచిస్తాం. ఇక మంచి బంతులు వస్తే సింగిల్స్‌పై దృష్టి పెడతాం. సహజసిద్ధమైన ఆటను ఆడటంలో ఉండే సౌకర్యం మరోదాంట్లో రాదు. దానిని మార్చాలని ప్రయత్నిస్తే అది పని చేయదని నా నమ్మకం. కరోనాతో వచ్చిన విరామంపై... నా ఫిట్నెస్ను మెరుగుపర్చుకోవడంపై దృష్టి పెట్టాను. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రతికూల ఆలోచనలు రాకుండా ఉండటం కూడా ఎంతో కీలకం. దీనికి సంబంధించి స్పోర్ట్స్ సైకాలజిస్ట్ నాకు ఎంతో సహకరిస్తున్నారు. ఇక ఒక స్పోర్ట్స్ మేనేజ్మెంట్ కంపెనీతో ఒప్పందం కుదరడం వల్ల ఆర్థికపరంగా నేను ఎలాంటి ఆందోళనకు గురికాకుండా ఉండగలుగుతున్నా. ఎన్నో కష్టాలకోర్చి నేను ఈ స్థాయికి చేరడానికి కారణమైన మా నాన్నపై కూడా ఇప్పుడు ఆ భారం తగ్గింది. -
‘తెలంగాణ నంబర్ 1.. ఒట్టి హంబక్’
సాక్షి, హైదరాబాద్ : దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ రాష్ట్రమంటూ.. కేంద్ర మంత్రులు కూడా ఫిదా అయిపోయి కితాబులిస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారమంతా ఒట్టి హంబక్ అని బీజేపీ విమర్శించింది. ఏఒక్క కేంద్ర మంత్రి కూడా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నేరుగా పొడగలేదని, అదంతా టీఆర్ఎస్ మైండ్‌గేమ్ అని బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాశ్ రెడ్డి తెలిపారు. మరో అధికార ప్రతినిధి నరేశ్‌తో కలిసి శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ టీఆర్ఎస్తో బీజేపీ కుమ్మక్కైందన్న కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. కేంద్ర మంత్రులు ఎక్కడ కూడా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నంబర్ వన్‌గా పేర్కొనలేదు. అలాంటి ప్రకటనలన్నీ టీఆర్ఎస్ భవన్ నుంచి వస్తున్నవే. అరుణ్ జైట్లీకి, కేసీఆర్‌ల మధ్య జరిగిన సంభాషణను ఏదో ప్రకటన మాదిరి టీఆర్ఎస్ ప్రచారం చేసుకుంటోంది. ఒకవేళ కేంద్ర మంత్రులే గనుక టీఆర్ఎస్ పథకాలను భేష్ అని ఉంటే ఎలాంటి బహిరంగ చర్చకైనా మేం సిద్ధం’’ అని ప్రకాశ్‌రెడ్డి, నరేశ్‌లు అన్నారు. -
‘కొత్త నంబర్‌వన్’ హలెప్
బీజింగ్: మహిళల టెన్నిస్‌లో ఈ ఏడాది సిమోనా హలెప్ రూపంలో ఐదో క్రీడాకారిణి ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను ఖాయం చేసుకుంది. చైనా ఓపెన్‌లో సింగిల్స్ విభాగంలో ఫైనల్‌కు చేరుకోవడం ద్వారా హలెప్... సోమవారం విడుదల చేసే తాజా ర్యాంకింగ్స్‌లో ముగురుజా (స్పెయిన్) నుంచి నంబర్‌వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకుంటుంది. సెమీఫైనల్లో హలెప్ 6–2, 6–4తో ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్ ఒస్టాపెంకో (లాత్వియా)పై గెలిచింది. ఆదివారం జరిగే ఫైనల్లో కరోలినా గార్సియా (ఫ్రాన్స్)తో హలెప్ ఆడుతుంది. టాప్ ర్యాంక్ ఖాయం చేసుకున్నందుకు నిర్వాహకులు హలెప్‌కు నంబర్‌వన్ అంకె రూపంలో ఉన్న పూల బోకేను అందజేశారు. 1975లో కంప్యూటర్ ర్యాంకింగ్స్‌ను ప్రవేశపెట్టాక టాప్ ర్యాంక్‌లో నిలువనున్న 25వ క్రీడాకారిణిగా, రొమేనియా తరఫున తొలి ప్లేయర్‌గా హలెప్ గుర్తింపు పొందనుంది. ‘నా కల నిజమైంది. ఈ రోజు నా జీవితంలో మర్చిపోలేని రోజు. నా కోరిక నెరవేరడంతో కోర్టులోనే తొలిసారి ఆనందభాష్పాలు వచ్చేశాయి. ఇక నా తదుపరి లక్ష్యం గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలవడం’ అని 26 ఏళ్ల హలెప్ వ్యాఖ్యానించింది. ఈ ఏడాది కెర్బర్ (జర్మనీ), సెరెనా (అమెరికా), ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్), ముగురుజా (స్పెయిన్) నంబర్‌వన్ ర్యాంక్‌లో నిలిచారు. -
నాలుగో టెస్టు వర్షార్పణం
* 2-0తో సిరీస్ గెలిచిన భారత్ * చేజారిన నంబర్ వన్ ర్యాంక్ పోర్ట్ ఆఫ్ స్పెయిన్: భారత్, వెస్టిండీస్‌ల మధ్య జరిగిన నాలుగో టెస్టు వర్షార్పణం అయింది. మొదటి రోజు కేవలం 22 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యపడగా వెస్టిండీస్ రెండు వికెట్లకు 66 పరుగులు చేసింది. ఆ తర్వాత ఎడతెరపిలేని వర్షం కారణంగా రెండు, మూడు రోజుల ఆట రద్దవగా.. ఔట్‌ఫీల్డ్ సరిగా లేకపోవటంతో చివరి రెండు రోజుల ఆట సాధ్యపడలేదు. దీంతో టెస్టు సిరీస్‌ను భారత్ 2-0తో కైవసం చేసుకుంది. మొదటి, మూడో టెస్టులో భారత్ గెలవగా.. రెండో టెస్టు డ్రాగా ముగిసింది. అశ్విన్‌కు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు లభించింది. ఆఖరి టెస్టుకు ముందు ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ స్థానానికి చేరిన భారత్... ఈ మ్యాచ్ రద్దు కావడంతో కోహ్లిసేన రెండో ర్యాంక్‌కు పడిపోయింది. పాకిస్తాన్ తమ కెరీర్లో తొలిసారి అగ్రస్థానానికి చేరింది. భారత్, వెస్టిండీస్‌ల మధ్య రెండు మ్యాచ్‌ల టి20 సిరీస్ ఈ నెల 27,28 తేదీల్లో అమెరికాలోని ఫ్లోరిడాలో జరుగుతుంది. -
సెరెనా అదరహో...
-
క్లార్క్ వద్దకు చేరిన ‘గద’
దుబాయ్: టెస్టుల్లో నంబర్‌వన్ ర్యాంక్‌ను సాధించిన జట్టుకు ఐసీసీ ఇచ్చే ‘గద’ ఆస్ట్రేలియా కెప్టెన్ మైకేల్ క్లార్క్ వద్దకు చేరింది. బుధవారం బ్రిస్బేన్ మైదానంలో ప్రాక్టీస్ చేస్తున్న అతను ఈ గదను అందుకున్నాడు. 2009 తర్వాత ఆసీస్‌కు ఈ పురస్కారం దక్కడం ఇదే తొలిసారి. మే నెల ఒకటో తేదీ నాటికి టెస్టుల్లో అగ్రస్థానంలో ఉన్న జట్టుకు ఈ గదను అందజేస్తారు. ప్రస్తుతం ఆసీస్, దక్షిణాఫ్రికా 123 రేటింగ్ పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నా... దశాంశమానం తేడాతో కంగారుల జట్టుకు టాప్ ర్యాంక్ దక్కింది. ఆసీస్ గడ్డపైకి గద తిరిగి రావడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నామని క్లార్క్ అన్నాడు. -
టెస్టు ర్యాంకింగ్స్‌లో అశ్విన్‌కు అగ్రస్థానం
దుబాయ్: భారత స్పిన్నర్ అశ్విన్ ఇక ఆల్‌రౌండర్ల కోటాలో చేరినట్లే. వెస్టిండీస్‌తో తొలి టెస్టులో సెంచరీతో అశ్విన్ ... ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ ఆల్‌రౌండర్ల విభాగంలో నంబర్‌వన్ ర్యాంక్‌కు దూసుకొచ్చాడు. అశ్విన్ ఏకంగా 81 రేటింగ్ పాయింట్లు మెరుగుపరుచుకుని 405 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. బంగ్లాదేశ్ ఆటగాడు షకిబుల్ (362 పాయింట్లు), దక్షిణాఫ్రికా స్టార్ కలిస్ (332 పాయింట్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. బౌలింగ్ ర్యాంకుల్లో అశ్విన్ రెండు స్థానాలు మెరుగుపడి ఆరో ర్యాంక్‌కు చేరాడు. టెస్టుల్లో అద్భుతమైన అరంగేట్రం చేసిన రోహిత్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో 63వ స్థానం, బౌలింగ్ ర్యాంకుల్లో షమీ 53వ స్థానం సంపాదించారు. భువనేశ్వర్ (87వ ర్యాంక్) కంటే షమీ మెరుగైన స్థానంలో ఉండటం విశేషం. -
రాంచీని ముంచిన వాన
వన్డేల్లో అగ్రస్థానానికి చేరుకోవాలంటే 6-1తో సిరీస్ గెలవాల్సిన ఆస్ట్రేలియా లెక్క తప్పినట్లే. భారీ వర్షం ఆ జట్టు ఆశలను ముంచేసింది. దాంతో భారత్ తమ నంబర్‌వన్ ర్యాంక్‌ను నిలబెట్టుకుంది. వర్షం కారణంగా నాలుగో వన్డే అర్ధాంతరంగా రద్దయింది. ఫలితంగా సిరీస్‌లో ఆస్ట్రేలియా ఆధిక్యం కొనసాగుతోంది. తుపాన్‌తో ఐదో వన్డే కూడా సందేహాస్పదంగా మారిన నేపథ్యంలో ఈ సుదీర్ఘ సిరీస్‌ను నెగ్గాలంటే భారత్ తీవ్రంగా శ్రమించాల్సిందే. రాంచీ: సొంతగడ్డపై సిరీస్‌ను సమం చేయాలని భావించిన ధోని ఆశలకు అడ్డుకట్ట పడింది. లక్ష్యఛేదనను ఆరంభించిన భారత్ జోరును వర్షం అడ్డుకుంది. బుధవారం ఇక్కడ జరిగిన భారత్, ఆస్ట్రేలియా నాలుగో వన్డేలో వర్షం కారణంగా రెండో ఇన్నింగ్స్ సాధ్యం కాలేదు. పలుమార్లు మైదానాన్ని పరిశీలించిన అంపైర్లు ఆటకు అనువుగా లేకపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఏడు వన్డేల ఈ సిరీస్‌లో ప్రస్తుతం ఆసీస్ 2-1తో ఆధిక్యం ఉంది. ఇరు జట్ల మధ్య ఐదో వన్డే శనివారం కటక్‌లో జరుగుతుంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 295 పరుగులు చేసింది. కెప్టెన్ బెయిలీ (94 బంతుల్లో 98; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), మ్యాక్స్‌వెల్ (77 బంతుల్లో 92; 6 ఫోర్లు, 5 సిక్స్‌లు) సెంచరీలు చేజార్చుకున్నా, జట్టు ఇన్నింగ్స్‌లో కీలక పాత్ర పోషించారు. వీరిద్దరు కలిసి ఐదో వికెట్‌కు 153 పరుగులు జోడించారు. భారత బౌలర్లలో మొహమ్మద్ షమీ 42 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టగా... వినయ్ కుమార్, అశ్విన్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం భారత్ 4.1 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 27 పరుగులు చేసింది. ధావన్ (14), రోహిత్ శర్మ (9) క్రీజ్‌లో ఉన్నారు. ఈ దశలో పడిన వర్షం ఎంతకూ ఆగకపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేయక తప్పలేదు. కీలక భాగస్వామ్యం... వరుసగా విఫలమవుతున్న ఇషాంత్‌తో పాటు భువనేశ్వర్‌ను కూడా పక్కన పెట్టడంతో ఉనాద్కట్, మొహమ్మద్ షమీలకు తుది జట్టులో చోటు దక్కింది. ఉనాద్కట్ పెద్దగా ప్రభావం చూపకపోగా, షమీ మాత్రం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టాడు. ఇన్నింగ్స్ ఆసాంతం 140-145 కి.మీ. వేగంతో బంతులు విసురుతూ, చక్కటి స్వింగ్ కూడా రాబట్టిన షమీ... తన తొలి నాలుగు ఓవర్లలో 3 వికెట్లు తీసి శుభారంభాన్ని అందించాడు. తన తొలి ఓవర్ ఐదో బంతికే చక్కటి ఇన్‌స్వింగర్‌తో ఫించ్ (5)ను క్లీన్‌బౌల్డ్ చేసిన అతను... మూడో ఓవర్లో హ్యూస్ (11)ను పెవిలియన్‌కు పంపించాడు. ఆసీస్ స్కోరు 28/0గా ఉన్న దశలో వర్షం కారణంగా మ్యాచ్ ఆగిపోయింది. మ్యాచ్ మళ్లీ ప్రారంభమయ్యాక మరో అద్భుతమైన బంతి వాట్సన్ (14) వికెట్లను గిరాటేసింది. షమీ జోరుతో ఆసీస్ పవర్ ప్లేలో 3 వికెట్లకు 40 పరుగులు మాత్రమే చేయగలిగింది. తొలి స్పెల్‌లో షమీ గణాంకాలు 6-1-21-3గా ఉండటం విశేషం. కొద్దిసేపటికే అశ్విన్ బౌలింగ్‌లో వోజెస్ (7) కూడా వెనుదిరగడంతో ఆసీస్ 71 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో కెప్టెన్ బెయిలీ, మ్యాక్స్‌వెల్ కలిసి ఇన్నింగ్స్‌ను నిర్మించారు. ఆరంభంలో మెల్లగా ఆడినా నిలదొక్కుకున్న తర్వాత వీరిద్దరు బ్యాట్ ఝళిపించారు. బెయిలీ తన వన్డే ఫామ్‌ను కొనసాగించగా, మ్యాక్స్‌వెల్ కూడా భారీ సిక్సర్లతో దూకుడు ప్రదర్శించాడు. ఈ క్రమంలో బెయిలీ 57 బంతుల్లో, మ్యాక్స్‌వెల్ 45 బంతుల్లో అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. చివరకు వినయ్ కుమార్ ఈ భాగస్వామ్యాన్ని విడదీశాడు. భారీ షాట్ ఆడబోయిన బెయిలీ, డీప్ మిడ్ వికెట్లో రోహిత్‌కు క్యాచ్ ఇచ్చి సెంచరీ చేజార్చుకున్నాడు. తన తర్వాతి ఓవర్లోనే మ్యాక్స్‌వెల్‌ను కూడా వినయ్ అవుట్ చేశాడు. అయితే జాన్సన్ (31 బంతుల్లో 25; 1 ఫోర్, 1 సిక్స్), ఫాల్క్‌నర్ (29 బంతుల్లో 23 నాటౌట్; 1 ఫోర్) చివర్లో ధాటిగా ఆడి ఆస్ట్రేలియాకు మెరుగైన స్కోరు అందించారు. ఆసీస్ తమ చివరి 10 ఓవర్లలో 57 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆరు క్యాచ్‌లు నేలపాలు... నాలుగో వన్డేలో మన ఆటగాళ్ల ఫీల్డింగ్ 90లనాటి భారత జట్టును గుర్తుకు తెచ్చింది. ఒకటి కాదు, రెండు కాదు... ఏకంగా ఆరు క్యాచ్‌లు వదిలేయడం ఫీల్డింగ్ పరిస్థితిని చూపిస్తోంది. వీటిలో రెండు మినహా మిగతా క్యాచ్‌లు పట్టదగినవే! ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ను తీర్చిదిద్దిన బెయిలీ సున్నా స్కోరు వద్ద ఉన్నప్పుడు ఇచ్చిన సులభమైన క్యాచ్‌ను మూడో స్లిప్‌లో కోహ్లి వదిలేయడం భారత్‌పై తీవ్ర ప్రభావం చూపించింది. అతను 35 వద్ద ఉన్నప్పుడు కూడా మరో సునాయాస క్యాచ్‌ను అశ్విన్ వదిలేశాడు. మ్యాక్స్‌వెల్‌కు కూడా రెండు సార్లు అదృష్టం కలిసొచ్చింది. 44 పరుగుల వద్ద యువరాజ్, 69 పరుగుల వద్ద ధోని క్యాచ్‌లు వదిలేశారు. యువీ క్యాచ్ కష్టమైనదే అయినా... ధోని గ్లవ్‌కు తగిలి వెళ్లిన బంతి మ్యాక్స్‌వెల్‌ను బతికించింది. జాన్సన్ 15 పరుగుల వద్ద ఉన్నప్పుడు రైనా, ఇన్నింగ్స్ చివరి బంతికి ఫాల్క్‌నర్ క్యాచ్‌ను ధావన్ జారవిడిచారు. ఈ రెండింటి వల్ల పెద్దగా తేడా రాకపోయినా మనవాళ్ల ఫీల్డింగ్‌కు ఇది నిదర్శనం. స్కోరు వివరాలు: ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: ఫించ్ (బి) షమీ 5; హ్యూస్ (సి) ధోని (బి) షమీ 11; వాట్సన్ (బి) షమీ 14; బెయిలీ (సి) రోహిత్ (బి) వినయ్ 98; వోజెస్ (ఎల్బీ) (బి) అశ్విన్ 7; మ్యాక్స్‌వెల్ (ఎల్బీ) (బి) వినయ్ 92; హాడిన్ (బి) జడేజా 3; ఫాల్క్‌నర్ (నాటౌట్) 23; జాన్సన్ (స్టంప్డ్) ధోని (బి) అశ్విన్ 25; మెక్కే (నాటౌట్) 7; ఎక్స్‌ట్రాలు (లెగ్‌బై 7, వైడ్ 3) 10; మొత్తం (50 ఓవర్లలో 8 వికెట్లకు) 295. వికెట్ల పతనం: 1-5; 2-24; 3-32; 4-71; 5-224; 6-232; 7-238; 8-281. బౌలింగ్: ఉనాద్కట్ 6-0-31-0; షమీ 8-1-42-3; వినయ్ 8-0-52-2; అశ్విన్ 9-0-57-2; జడేజా 10-0-56-1; యువరాజ్ 1-0-12-0; రైనా 8-0-38-0. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (నాటౌట్) 9; ధావన్ (నాటౌట్) 14; ఎక్స్‌ట్రాలు (బై 4) 4; మొత్తం (4.1 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 27 బౌలింగ్: జాన్సన్ 2.1-0-10-0; మెక్కే 2-0-13-0. -
మళ్లీ నాదల్ నెంబర్‌వన్
స్పెయిన్ టెన్నిస్ యోధుడు రఫెల్ నాదల్ మళ్లీ అగ్రపీఠం అధిరోహించనున్నాడు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నాదల్ నెంబర్‌వన్ స్థానాన్ని కైవసం చేసుకోనున్నాడు. చైనా ఓపెన్‌లో ఫైనల్ చేరడంతో ర్యాంక్ మెరుగుపడింది. శనివారం జరిగిన సెమీస్‌లో రఫా ప్రత్యర్థి థామస్ బెర్డిచ్ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. ర్యాంకింగ్స్‌లో సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్, నాదల్ వరుసగా ప్రథమ, ద్వితీయ స్థానాల్లో ఉండేవారు. నాదల్ తాజా విజయంతో జొకోను వెనక్కినెట్టి నెంబర్‌వన్‌గా నిలిచాడు. దీంతో 2011 జూలై తర్వాత రఫా నెంబర్‌వన్ కావడమిదే తొలిసారి. తాజా ర్యాంకింగ్స్ జాబితాను సోమవారం ప్రకటించనున్నారు.