మళ్లీ నాదల్ నెంబర్వన్ | Rafael Nadal will return to number one rank | Sakshi
Sakshi News home page

మళ్లీ నాదల్ నెంబర్వన్

Published Sat, Oct 5 2013 4:47 PM | Last Updated on Fri, Sep 1 2017 11:22 PM

మళ్లీ నాదల్ నెంబర్వన్

మళ్లీ నాదల్ నెంబర్వన్

 స్పెయిన్ టెన్నిస్ యోధుడు రఫెల్ నాదల్ మళ్లీ అగ్రపీఠం అధిరోహించనున్నాడు. ప్రపంచ ర్యాంకింగ్స్లో నాదల్ నెంబర్వన్ స్థానాన్ని కైవసం చేసుకోనున్నాడు. చైనా ఓపెన్లో ఫైనల్ చేరడంతో ర్యాంక్ మెరుగుపడింది. శనివారం జరిగిన సెమీస్లో రఫా ప్రత్యర్థి థామస్ బెర్డిచ్ రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగాడు.
 
ర్యాంకింగ్స్లో సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్, నాదల్ వరుసగా ప్రథమ, ద్వితీయ స్థానాల్లో ఉండేవారు. నాదల్ తాజా విజయంతో జొకోను వెనక్కినెట్టి నెంబర్వన్గా నిలిచాడు. దీంతో 2011 జూలై తర్వాత రఫా నెంబర్వన్ కావడమిదే తొలిసారి. తాజా ర్యాంకింగ్స్ జాబితాను సోమవారం ప్రకటించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement