తుంటి గాయం నుంచి కోలుకున్న స్పెయిన్ టెన్నిస్ దిగ్గజం రాఫెల్ నాదల్ కొత్త ఏడాదిలో తొలి విజయం అందుకున్నాడు. బ్రిస్బేన్ ఓపెన్ టోర్నీ పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో నాదల్ 7–5, 6–1తో ప్రపంచ మాజీ మూడో ర్యాంకర్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రేలియా)పై గెలిచాడు.
గత ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో రెండో రౌండ్‌లో ఓడిపోయాక నాదల్ తుంటి గాయంతో మరే టోర్నీలోనూ ఆడలేదు. బ్రిస్బేన్ ఓపెన్‌తో పునరాగమనం చేసిన నాదల్ ఇదే టోర్నీ డబుల్స్‌లోనూ బరిలోకి దిగి తొలి రౌండ్‌లోనే ఓడిపోయాడు. సింగిల్స్‌లో మాత్రం శుభారంభంతో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు.
Comments
Please login to add a commentAdd a comment