First win
-
నాదల్ ఖాతాలో తొలి విజయం
తుంటి గాయం నుంచి కోలుకున్న స్పెయిన్ టెన్నిస్ దిగ్గజం రాఫెల్ నాదల్ కొత్త ఏడాదిలో తొలి విజయం అందుకున్నాడు. బ్రిస్బేన్ ఓపెన్ టోర్నీ పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో నాదల్ 7–5, 6–1తో ప్రపంచ మాజీ మూడో ర్యాంకర్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రేలియా)పై గెలిచాడు. గత ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో రెండో రౌండ్లో ఓడిపోయాక నాదల్ తుంటి గాయంతో మరే టోర్నీలోనూ ఆడలేదు. బ్రిస్బేన్ ఓపెన్‌తో పునరాగమనం చేసిన నాదల్ ఇదే టోర్నీ డబుల్స్‌లోనూ బరిలోకి దిగి తొలి రౌండ్లోనే ఓడిపోయాడు. సింగిల్స్‌లో మాత్రం శుభారంభంతో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. -
ఆసీస్‌ను ఓడించాం
ముంబై: సుదీర్ఘ నిరీక్షణ ముగిసింది. ఎట్టకేలకు పదకొండో ప్రయత్నంలో ఆ్రస్టేలియా మహిళల జట్టుపై భారత జట్టు తొలిసారి టెస్టు విజయాన్ని అందుకుంది. ఇక్కడి వాంఖెడె మైదానంలో ఆ్రస్టేలియాతో జరిగిన నాలుగు రోజుల ఏకైక టెస్టులో భారత జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచింది. తద్వారా సమష్టిగా ఆడితే ఎంతటి మేటి జట్టునైనా ఓడించవచ్చని హర్మన్‌ప్రీత్ కౌర్ బృందం నిరూపించింది. ఆ్రస్టేలియా నిర్దేశించిన 75 పరుగుల విజయలక్ష్యాన్ని టీమిండియా 18.4 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించి గెలిచింది. మ్యాచ్ మొత్తంలో ఏడు వికెట్లు తీసిన భారత ఆఫ్ స్పిన్నర్ స్నేహ్ రాణాకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. పటిష్టమైన ఇంగ్లండ్‌తో గత ఆదివారం డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన ఏకైక టెస్టులో 347 పరుగుల తేడాతో రికార్డు విజయం సాధించిన భారత జట్టు... వారం తిరిగేలోపు మరో మేటి జట్టు ఆ్రస్టేలియాను బోల్తా కొట్టించి ఈ ఏడాదిని దిగ్విజయంగా ముగించింది. రాణించిన స్నేహ్, రాజేశ్వరి ఆట చివరిరోజు ఓవర్‌నైట్ స్కోరు 233/5తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆ్రస్టేలియా కేవలం 28 పరుగులు జోడించి మిగతా ఐదు వికెట్లు కోల్పోయి 261 పరుగుల వద్ద ఆలౌటైంది. యాష్లే గార్డ్నర్ (7)ను ఆట రెండో ఓవర్లోనే పూజ వస్త్రకర్ వికెట్లముందు దొరకబుచ్చుకోవడంతో ఆసీస్ పతనం మొదలైంది. మరోవైపు క్రీజులో పాతుకుపోయిన అనాబెల్ సదర్లాండ్ (102 బంతుల్లో 27; 3 ఫోర్లు)ను...అలానా కింగ్ (0)ను వరుస బంతుల్లో స్నేహ్ రాణా అవుట్ చేయడంతో ఆసీస్ ఇన్నింగ్స్ ఎక్కువసేపు కొనసాగలేదు. చివరి రెండు వికెట్లను రాజేశ్వరి గైక్వాడ్ తీయడంతో ఆసీస్ ఇన్నింగ్స్ 261 పరుగులవద్ద ముగిసింది. 75 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టుకు తొలి ఓవర్లోనే దెబ్బ పడింది. షఫాలీ వర్మ (4) నాలుగో బంతికి పెవిలియన్ చేరింది. ఆ తర్వాత రిచా ఘోష్ (32 బంతుల్లో 13; 3 ఫోర్లు)తో కలిసి స్మృతి మంధాన (61 బంతుల్లో 38 నాటౌట్; 6 ఫోర్లు) రెండో వికెట్‌కు 51 పరుగులు జోడించింది. రిచా అవుటయ్యాక జెమీమా రోడ్రిగ్స్ (15 బంతుల్లో 12 నాటౌట్; 2 ఫోర్లు)తో కలిసి స్మృతి భారత్‌ను విజయతీరానికి చేర్చింది. స్కోరు వివరాలు ఆ్రస్టేలియా తొలి ఇన్నింగ్స్: 219; భారత్ తొలి ఇన్నింగ్స్: 406; ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: బెత్ మూనీ (రనౌట్) 33; లిచ్‌ఫెల్డ్ (బి) స్నేహ్ రాణా 18; ఎలీస్ పెరీ (సి) యస్తిక (బి) స్నేహ్ రాణా 45; తాలియా మెక్‌గ్రాత్ (బి) హర్మన్‌ప్రీత్ 73; అలీసా హీలీ (ఎల్బీడబ్ల్యూ) (బి) హర్మన్‌ప్రీత్ 32; అనాబెల్ సదర్లాండ్ (సి) యస్తిక (బి) స్నేహ్ రాణా 27; యాష్లే గార్డ్నర్ (ఎల్బీడబ్ల్యూ) (బి) పూజ 7; జెస్ జొనాసెన్ (బి) రాజేశ్వరి 9; అలానా కింగ్ (బి) స్నేహ్ రాణా 0; కిమ్ గార్త్ (బి) రాజేశ్వరి 4; లారెన్ చీట్లె (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (105.4 ఓవర్లలో ఆలౌట్) 261. వికెట్ల పతనం: 1–49, 2–56, 3–140, 4–206, 5–221, 6–233, 7–251, 8–251, 9–260, 10–261. బౌలింగ్: రేణుక 11–4–32–0, పూజ వస్త్రకర్ 11–1–40–1, స్నేహ్ రాణా 22–5–66–4, దీప్తి శర్మ 22–7– 35–0, రాజేశ్వరి గైక్వాడ్ 28.4–11 –42–2, జెమీమా 2–0–13–0, హర్మన్‌ప్రీత్ 9–0–23–2. భారత్ రెండో ఇన్నింగ్స్: షఫాలీ వర్మ (సి) అలీసా (బి) గార్త్ 4; స్మృతి మంధాన (నాటౌట్) 38; రిచా ఘోష్ (సి) తాలియా (బి) గార్డ్నర్ 13; జెమీమా (నాటౌట్)12; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (18.4 ఓవర్లలో రెండు వికెట్లకు) 75. వికెట్ల పతనం: 1–4, 2–55. బౌలింగ్: కిమ్ గార్త్ 5–1–19–1, యాష్లే గార్డ్నర్ 9–2–18–1, తాలియా 2–0–14–0, జెస్ జొనాసెన్ 2.4–0–16–0. 7: ఓవరాల్‌గా టెస్టు ఫార్మాట్లో భారత మహిళల జట్టు గెలిచిన టెస్టుల సంఖ్య. 1976 నుంచి 2023 వరకు భారత జట్టు 40 టెస్టులు ఆడింది. ఇందులో ఏడింటిలో గెలిచి, ఆరింటిలో ఓడిపోయింది. మిగతా 27 మ్యాచ్‌లు ‘డ్రా’గా ముగిశాయి. 11: ఆస్ట్రేలియా జట్టుతో 1977 నుంచి 2023 మధ్యకాలంలో భారత్ 11 టెస్టులు ఆడింది. ఈ మ్యాచ్‌కు ముందు ఆ్రస్టేలియా చేతిలో భారత్ నాలుగు మ్యాచ్‌ల్లో ఓడి, ఆరింటిని ‘డ్రా’ చేసుకుంది. 2: స్వదేశంలో భారత జట్టు ఒకే ఏడాది రెండు టెస్టుల్లో గెలవడం ఇదే తొలిసారి. భారత్ నెగ్గిన ఏడు టెస్టుల్లో నాలుగు స్వదేశంలో, మూడు విదేశీ గడ్డపై వచ్చాయి. హర్మన్‌ప్రీత్ కెపె్టన్సీలో భారత జట్టు ఆడిన రెండు టెస్టుల్లోనూ నెగ్గడం విశేషం. 9: గత 17 ఏళ్లలో భారత జట్టు తొమ్మిది టెస్టులు ఆడింది. ఇందులో ఒక టెస్టులో ఓడి, ఐదు టెస్టుల్లో గెలిచి, మూడింటిని ‘డ్రా’ చేసుకుంది. -
Madhya Pradesh: బీజేపీ తొలి విజయం
భోపాల్: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తొలి విజయం నమోదు చేసింది. బుర్హాన్పూర్ జిల్లాలోని నేపానగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి మంజు రాజేంద్ర దాదు 44,805 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి గెందూ బాయి ఓటమి పాలయ్యారు. మంజు రాజేంద్ర దాదుకు మొత్తం 1,13,400 ఓట్లు పోలవగా సమీప అభ్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన గెందూ బాయికి 68,595 ఓట్లు వచ్చాయి. ఇక్కడ మొత్తం 22 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరిగింది. -
మా బౌలింగ్ సూపర్... మారాల్సింది బ్యాటింగే...
-
IPL 2023: చెన్నై చెలరేగగా...
సూపర్ కింగ్స్ సొంత మైదానంలో సత్తా చాటింది...ముందుగా బ్యాటింగ్‌లో చెలరేగి భారీ స్కోరు నమోదు చేసిన ధోని టీమ్, ఆపై ప్రత్యర్థిని నిలువరించడంలో సఫలమైంది. రుతురాజ్, కాన్వేలు చెన్నైకి భారీ స్కోరును అందిస్తే, బౌలింగ్‌లో మొయిన్ అలీ ఆఫ్ స్పిన్ జట్టును గెలుపు దిశగా నడిపించింది. మరో వైపు తమ తొలి మ్యాచ్‌ను గెలుపు జోరు మీదున్న లక్నో ప్రభావం చూపలేకపోయింది. ఓపెనర్ మేయర్స్ ఆట మినహా మిగతా రంగాల్లో విఫలం కావడంతో రాహుల్ బృందానికి ఓటమి తప్పలేదు. చెన్నై: నాలుగేళ్ల తర్వాత ప్రత్యక్షంగా మ్యాచ్‌ను చూసేందుకు వచ్చిన అభిమానులకు చెన్నై సూపర్ కింగ్స్ అమితానందాన్ని పంచింది. గత ఓటమిని మరిచేలా చేస్తూ లీగ్‌లో తొలి విజయాన్ని నమోదు చేసింది. సోమవారం జరిగిన పోరులో చెన్నై 12 పరుగుల తేడాతో లక్నోను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ (31 బంతుల్లో 57; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) వరుసగా రెండో మ్యాచ్‌లో అర్ధ సెంచరీ సాధించగా, డెవాన్ కాన్వే (29 బంతుల్లో 47; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. రవి బిష్ణోయ్, మార్క్‌వుడ్ చెరో 3 వికెట్లు తీశారు. అనంతరం లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 205 పరుగులు చేసింది. కైల్ మేయర్స్ (22 బంతుల్లో 53; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలవగా, ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మొయిన్ అలీ (4/26) ప్రత్యర్థిని దెబ్బతీశాడు. శతక భాగస్వామ్యం... కేవలం 56 బంతుల్లో 110 పరుగులు...చెన్నై తొలి వికెట్ భాగస్వామ్యమిది. రుతురాజ్, కాన్వే చెలరేగుతూ లక్నో బౌలర్లపై విరుచుకుపడ్డారు. అవేశ్ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లతో కాన్వే మొదలుపెట్టగా, గౌతమ్ వేసిన ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో రుతురాజ్ మూడు సిక్సర్లతో చెలరేగాడు. వుడ్ ఓవర్లోనూ 2 ఫోర్లు, సిక్స్‌తో 19 పరుగులు రాబట్టిన చెన్నై పవర్‌ప్లే ముగిసే సరికి 79 పరుగులు సాధించింది. ఈ క్రమంలో 25 బంతుల్లోనే రుతురాజ్ అర్ధసెంచరీ పూర్తయింది. కృనాల్ ఓవర్లో రెండు సిక్సర్లు కొట్టి కాన్వే తన జోరును కొనసాగించాడు. ఎట్టకేలకు బిష్ణోయ్ తన తొలి బంతికే వికెట్ తీసి రుతురాజ్‌ను వెనక్కి పంపడంతో భారీ భాగస్వామ్యానికి తెర పడింది. ఆ తర్వాత కొద్ది సేపటికే కాన్వే అవుట్ కాగా...మూడో స్థానంలో వచ్చిన శివమ్ దూబే (16 బంతుల్లో 27; 1 ఫోర్, 3 సిక్స్‌లు) కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఒక దశలో తాను ఎదుర్కొన్న వరుస నాలుగు బంతుల్లో అతను 6, 4, 6, 6తో చెలరేగిపోయాడు. అతని వికెట్ కూడా బిష్ణోయ్ ఖాతాలోకే చేరగా, అవేశ్ ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు కొట్టిన మొయిన్ అలీ (19)ని కూడా బిష్ణోయ్ అవుట్ చేశాడు. స్టోక్స్ (8), జడేజా (3) విఫలం కాగా...చివర్లో అంబటి రాయుడు (14 బంతుల్లో 27 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), ధోని (12) కలిసి స్కోరును 200 పరుగులు దాటించారు. లక్నో ప్రధాన బౌలర్ మార్క్ వుడ్ తన చివరి రెండు ఓవర్లలో 4 సిక్సర్లతో సహా మొత్తం 30 పరుగులు సమర్పించుకున్నాడు. మేయర్స్ మినహా... భారీ ఛేదనలో జట్టుకు అవసరమైన శుభారంభం లక్నోకు లభించింది. 35 బంతుల్లోనే ఓపెనర్లు 79 పరుగులు జోడించారు. ఇందులో మేయర్స్ మెరుపులే ఎక్కువగా ఉండగా, కేఎల్ రాహుల్ (20) ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యాడు. స్టోక్స్ ఓవర్లో వరుసగా 4, 4, 6 కొట్టిన మేయర్స్ చహర్ వరుస రెండు ఓవర్లలో కలిపి మొత్తం 5 ఫోర్లు బాదాడు. తుషార్ ఓవర్లోనూ 4, 6 కొట్టిన అతను 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. అయితే అలీ తన తొలి ఓవర్లోనే మేయర్స్‌ను అవుట్ చేసి లక్నో పతనానికి శ్రీకారం చుట్టాడు. ఆ తర్వాత ఏ దశలోనూ జెయింట్స్ కోలులోకపోయింది. హుడా (2), కృనాల్ (9) విఫలం కాగా, స్టొయినిస్ (21) కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శనే చేయలేదు. క్రీజ్‌లో ఉన్నంత సేపు నికోలస్ పూరన్ (18 బంతుల్లో 32; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) ధాటిగా ఆడే ప్రయత్నం చేసినా జట్టు విజయానికి అది సరిపోలేదు. రాజ్వర్ధన్ ఓవర్లోనే వరుసగా 6, 4, 4 కొట్టిన పూరన్ జడేజా ఓవర్లో రెండు సిక్స్‌లు బాదాడు. 16వ ఓవర్ చివరి బంతికి పూరన్ అవుట్ కావడంలో లక్నో విజయావకాశాలు పూర్తిగా కోల్పోయింది. స్కోరు వివరాలు: చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: రుతురాజ్ (సి) వుడ్ (బి) బిష్ణోయ్ 57; కాన్వే (సి) కృనాల్ (బి) వుడ్ 47; దూబే (సి) వుడ్ (బి) బిష్ణోయ్ 27; అలీ (స్టంప్డ్) పూరన్ (బి) బిష్ణోయ్ 19; స్టోక్స్ (సి) యష్ (బి) అవేశ్ 8; రాయుడు (నాటౌట్) 27; జడేజా (సి) బిష్ణోయ్ (బి) వుడ్ 3; ధోని (సి) బిష్ణోయ్ (బి) వుడ్ 12; సాన్‌ట్నర్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 217. వికెట్ల పతనం: 1–110, 2–118, 3–150, 4–166, 5–178, 6–203, 7–215. బౌలింగ్: మేయర్స్ 2–0–16–0, అవేశ్ 3–0–39–1, కృనాల్ 2–0–21–0, గౌతమ్ 1–0–20–0, వుడ్ 4–0–49–3, యష్ ఠాకూర్ 4–0–36–0, రవి బిష్ణోయ్ 4–0–28–3. లక్నో సూపర్‌జెయింట్స్ ఇన్నింగ్స్: రాహుల్ (సి) రుతురాజ్ (బి) అలీ 20; మేయర్స్ (సి) కాన్వే (బి) అలీ 53; హుడా (సి) స్టోక్స్ (బి) సాన్‌ట్నర్ 2; కృనాల్ (సి) జడేజా (బి) అలీ 9; స్టొయినిస్ (బి) అలీ 21; పూరన్ (సి) స్టోక్స్ (బి) తుషార్ 32; బదోని (సి) ధోని (బి) తుషార్ 23; గౌతమ్ (నాటౌట్) 17; వుడ్ (నాటౌట్) 10; ఎక్స్‌ట్రాలు 18; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 205. వికెట్ల పతనం: 1–79, 2–82, 3–82, 4–105, 5–130, 6–156, 7–195. బౌలింగ్: దీపక్ చహర్ 4–0–55–0, స్టోక్స్ 1–0–18–0, తుషార్ 4–0–45–2, మొయిన్ అలీ 4–0–26–4, సాన్‌ట్నర్ 4–0–21–1, రాజ్వర్ధన్ 2–0–24–0, జడేజా 1–0–14–0. ధోని ఫటాఫట్... మ్యాచ్‌ను తన భుజస్కంధాలపై మోసే భారంనుంచి చాలా కాలంగా దూరమైన ధోని కొద్ది సేపు క్రీజ్‌లో ఉండి అభిమానులను అలరిస్తే చాలు అన్నట్లుగా ఆడుతున్నాడు. అతని ఆట చూసేందుకు చెపాక్ మైదానానికి భారీ సంఖ్యలో తరలివచ్చిన ఫ్యాన్స్‌ను అతను నిరాశపర్చలేదు. 6, 6, అవుట్...ఆడిన మూడు బంతుల్లోనే రెండు సిక్సర్లతో స్టేడియం హోరెత్తగా, సొంత జట్టు సభ్యులు కూడా ఆ సిక్సర్లకు సంబరాలు చేసుకున్నారు. తొలి మ్యాచ్‌లోనూ 7 బంతుల్లో ఫోర్, సిక్స్ బాదిన అతను 14 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ మ్యాచ్‌తో ధోని ఐపీఎల్లో 5 వేల పరుగులు కూడా పూర్తి చేసుకున్నాడు. లీగ్‌లో ఈ మైలురాయిని దాటిన ఏడో ఆటగాడిగా (కోహ్లి, ధావన్, వార్నర్, రోహిత్, రైనా, డివిలియర్స్ తర్వాత) నిలిచాడు. ఐపీఎల్లో నేడు ఢిల్లీ X గుజరాత్ (రాత్రి గం. 7:30 నుంచి ) స్టార్ స్పోర్ట్స్, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం -
అఫ్గన్ చేతిలో పాక్ చిత్తు
షార్జా: అంతర్జాతీయ క్రికెట్లో పాకిస్తాన్‌తో తొలి మ్యాచ్ ఆడిన పుష్కరకాలం తర్వాత అఫ్గనిస్తాన్‌కు ఆ జట్టుపై మొదటి విజయం దక్కింది. శుక్రవారం జరిగిన తొలి టి20లో అఫ్గన్ 6 వికెట్ల తేడాతో పాక్‌ను చిత్తు చేసింది. ముందుగా పాకిస్తాన్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది. అనంతరం అఫ్గనిస్తాన్ 17.5 ఓవర్లలో 4 వికెట్లకు 98 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మొహమ్మద్ నబీ (38 బంతుల్లో 38 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) అఫ్గన్‌ను గెలిపించాడు. -
ఇంగ్లండ్ సంచలనం.. 62 ఏళ్ల తర్వాత గెలుపు
యూరో–2024 క్వాలిఫయింగ్ టోర్నీలో భాగంగా నేపుల్స్లో ఇటలీతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 2–1 గోల్స్ తేడాతో గెలిచింది. 1961 తర్వాత ఇటలీ జట్టును వారి సొంతగడ్డపైనే ఇంగ్లండ్ ఓడించడం గమనార్హం. ఇంగ్లండ్ తరఫున రైస్ (13వ ని.లో), కెప్టెన్ హ్యారీ కేన్ (44వ ని.లో)... ఇటలీ తరఫున రెటుగుయ్ (56వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. ఈ మ్యాచ్ ద్వారా హ్యారీ కేన్ ఇంగ్లండ్ తరఫున అత్యధిక అంతర్జాతీయ గోల్స్ చేసిన ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పాడు. 53 గోల్స్‌తో వేన్ రూనీ పేరిట ఉన్న రికార్డును 54వ గోల్‌తో హ్యారీ కేన్ సవరించాడు. -
Meltwater Champions Tour Finals: అర్జున్ ఖాతాలో తొలి విజయం
మెల్ట్‌వాటర్ చాంపియన్స్ టూర్ ఫైనల్స్ టోర్నమెంట్లో భారత యువ గ్రాండ్‌మాస్టర్, తెలంగాణ ప్లేయర్ ఇరిగేశి అర్జున్ తొలి విజయం నమోదు చేశాడు. అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోలో జరుగుతున్న ఈ టోర్నీలో శుక్రవారం జరిగిన నాలుగో రౌండ్ మ్యాచ్‌లో అర్జున్ 3–1తో షఖిర్యార్ మమెదైరోవ్ (అజర్బైజాన్)పై గెలుపొందాడు. తొలి గేమ్‌ను 59 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్న అర్జున్, రెండో గేమ్‌లో 58 ఎత్తుల్లో నెగ్గాడు. మూడో గేమ్‌ను 37 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించిన అర్జున్ చివరిదైన నాలుగో గేమ్‌లో 33 ఎత్తుల్లో గెలిచాడు. భారత్‌కే చెందిన మరో యువ గ్రాండ్‌మాస్టర్, చెన్నై కుర్రాడు ప్రజ్ఞానంద టోర్నీలో తొలి ఓటమి చవిచూశాడు. ప్రజ్ఞానంద 1–2తో వెస్లీ సో (అమెరికా) చేతిలో పరాజయం పాలయ్యాడు. ఎనిమిది మేటి గ్రాండ్‌మాస్టర్ల మధ్య ఏడు రౌండ్లపాటు జరుగుతున్న ఈ టోర్నీలో నాలుగో రౌండ్ తర్వాత ప్రజ్ఞానంద నాలుగు పాయింట్లతో ఆరో ర్యాంక్‌లో, అర్జున్ మూడు పాయింట్లతో ఏడో ర్యాంక్‌లో ఉన్నారు. -
IPL 2022: ఎట్టకేలకు హైదరాబాద్ గెలుపు బోణీ
ముంబై: ఐపీఎల్–2022లో రెండు వరస ఓటముల తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మొదటి విజయం దక్కింది. తమలాగే గెలుపు రుచి చూడని చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించి రైజర్స్ పాయింట్ల ఖాతా తెరిచింది. శనివారం జరిగిన పోరులో హైదరాబాద్ 8 వికెట్ల తేడాతో చెన్నైపై ఘన విజయం సాధించింది. డిఫెండింగ్ చాంపియన్ సూపర్ కింగ్స్‌కిది వరుసగా నాలుగో ఓటమి కావడం గమనార్హం. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. మొయిన్ అలీ (35 బంతుల్లో 48; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం హైదరాబాద్ 17.4 ఓవర్లలో 2 వికెట్లకు 155 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అభిషేక్ శర్మ (50 బంతుల్లో 75; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీ చేయగా, రాహుల్ త్రిపాఠి (15 బంతుల్లో 39 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), కెప్టెన్ కేన్ విలియమ్సన్ (40 బంతుల్లో 32; 2 ఫోర్లు, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. రాణించిన అలీ... ఓపెనర్ల వైఫల్యంతో చెన్నైకి టోర్నీలో మరోసారి చెప్పుకోదగ్గ ఆరంభం లభించలేదు. ఉతప్ప (15)ను అవుట్ చేసి సుందర్ తొలి దెబ్బ కొట్టగా, నటరాజన్ తన మొదటి బంతికే రుతురాజ్ (16)ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. ఈ దశలో అలీ, అంబటి రాయుడు (27 బంతుల్లో 27; 4 ఫోర్లు) కలిసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. కొన్ని చక్కటి షాట్లు ఆడిన వీరిద్దరు 50 బంతుల్లో 62 పరుగులు జోడించారు. ఆ తర్వాత మరో 2 పరుగుల వ్యవధిలోనే చెన్నై అలీ, దూబే (3) వికెట్లు కోల్పోయింది. ధోని (3) కూడా విఫలం కాగా, చివర్లో రవీంద్ర జడేజా (15 బంతుల్లో 23; 2 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడటంతో చెన్నై కనీస స్కోరైనా చేయగలిగింది. అలవోకగా... గత మూడు సీజన్లలో హైదరాబాద్ తరఫున ఆడినా... 19 ఇన్నింగ్స్‌లలో ఒక్క హాఫ్ సెంచరీ కూడా నమోదు చేయని అభిషేక్ శర్మ ఈసారి ఓపెనర్‌గా తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టాడు. తొలి రెండు మ్యాచ్‌లలో 9, 13 పరుగులే చేసిను అతను చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌తో జట్టును విజయం దిశగా నడిపించాడు. తీక్షణ ఓవర్లో అభిషేక్ ఫోర్, సిక్స్ కొట్టగా, పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 37 పరుగులకు చేరింది. 32 బంతుల్లో అభిషేక్ అర్ధసెంచరీ పూర్తి కాగా, మరో ఎండ్ నుంచి విలియమ్సన్ కూడా చక్కటి షాట్లతో సహకరించాడు. ఈ జోడీని విడదీసేందుకు తీవ్రంగా ఇబ్బంది పడిన చెన్నై ఎట్టకేలకు 13వ ఓవర్ తొలి బంతికి రైజర్స్ కెప్టెన్‌ను వెనక్కి పంపించగలిగింది. విజయం కోసం 47 బంతుల్లో 66 పరుగులు చేయాల్సిన స్థితిలో బరిలోకి దిగిన త్రిపాఠి దూకుడైన బ్యాటింగ్‌తో దూసుకుపోయాడు. జోర్డాన్ ఓవర్లో అతను ఒక సిక్స్, 2 ఫోర్లు బాదాడు. అభిషేక్, త్రిపాఠి రెండో వికెట్‌కు 31 బంతుల్లోనే 56 పరుగులు జత చేశారు. విజయానికి అతి చేరువగా వచ్చాక అభిషేక్ అవుటైనా... త్రిపాఠి మ్యాచ్ ముగించాడు. స్కోరు వివరాలు చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: ఉతప్ప (సి) మార్క్రమ్ (బి) సుందర్ 15; రుతురాజ్ (బి) నటరాజన్ 16; మొయిన్ అలీ (సి) త్రిపాఠి (బి) మార్క్రమ్ 48; రాయుడు (సి) మార్క్రమ్ (బి) సుందర్ 27; దూబే (సి) ఉమ్రాన్ (బి) నటరాజన్ 3; జడేజా (సి) విలియమ్సన్ (బి) భువనేశ్వర్ 23; ధోని (సి) ఉమ్రాన్ (బి) జాన్సెన్ 3; బ్రేవో (నాటౌట్) 8; జోర్డాన్ (నాటౌట్) 6; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 154. వికెట్ల పతనం: 1–25, 2–36, 3–98, 4–108, 5–110, 6–122, 7–147. బౌలింగ్: భువనేశ్వర్ 4–0–36–1, మార్కో జాన్సెన్ 4–0–30–1, వాషింగ్టన్ సుందర్ 4–0–21–2, నటరాజన్ 4–0–30–2, ఉమ్రాన్ మలిక్ 3–0–29–0, మార్క్రమ్ 1–0–8–1. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: అభిషేక్ శర్మ (సి) జోర్డాన్ (బి) బ్రేవో 75; విలియమ్సన్ (సి) అలీ (బి) ముకేశ్ 32; రాహుల్ త్రిపాఠి (నాటౌట్) 39; నికోలస్ పూరన్ (నాటౌట్) 5; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (17.4 ఓవర్లలో 2 వికెట్లకు) 155. వికెట్ల పతనం: 1–89, 2–145. బౌలింగ్: ముకేశ్ 4–0–30–1, మహీశ్ తీక్షణ 4–0–31–0, జోర్డాన్ 3–0–34–0, జడేజా 3–0–21–0, మొయిన్ అలీ 1–0–10–0, బ్రేవో 2.4–0–29–1. ఐపీఎల్లో నేడు కోల్‌కతా నైట్‌రైడర్స్ X ఢిల్లీ క్యాపిటల్స్ వేదిక: ముంబై, మధ్యాహ్నం గం. 3:30 నుంచి రాజస్తాన్ X లక్నో సూపర్ జెయింట్స్ వేదిక: ముంబై, రాత్రి గం. 7:30 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం. .@SunRisers win by 8 wickets to register their first win in #TATAIPL 2022.#CSKvSRH pic.twitter.com/aupL3iKv5v — IndianPremierLeague (@IPL) April 9, 2022 -
ఎట్టకేలకు గెలిచిన తెలుగు టైటాన్స్
ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్ జట్టు తమ 11వ మ్యాచ్‌లో ఎట్టకేలకు తొలి గెలుపు రుచి చూసింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 35–34తో జైపూర్ పింక్ పాంథర్స్‌ను ఓడించింది. టైటాన్స్ స్టార్ రెయిడర్ రజనీశ్ ఎనిమిది పాయింట్లు... మరో రెయిడర్ ఆదర్శ్ తొమ్మిది పాయింట్లు సాధించారు. జైపూర్ తరఫున అర్జున్ 13 పాయిం ట్లు స్కోరు చేశాడు. టైటాన్స్ ప్రస్తుతం 17 పాయింట్లతో చివరిదైన 12వ స్థానంలో ఉంది. మరో మ్యాచ్‌లో హరియాణా స్టీలర్స్ 37–30తో పుణేరి పల్టన్‌పై గెలిచింది. -
ఎట్టకేలకు పెరెజ్‌కు తొలి ఎఫ్1 టైటిల్
సాఖిర్ (బహ్రెయిన్): తన తొమ్మిదేళ్ల నిరీక్షణకు తెరదించుతూ మెక్సికో డ్రైవర్ సెర్గియో పెరెజ్ ఎట్టకేలకు ఫార్ములావన్ (ఎఫ్1)లో తొలి టైటిల్‌ను సాధించాడు. సాఖిర్ గ్రాండ్‌ప్రి రేసులో 30 ఏళ్ల పెరెజ్ విజేతగా నిలిచాడు. 87 ల్యాప్‌ల ఈ రేసులో రేసింగ్ పాయింట్ జట్టు డ్రైవర్ పెరెజ్ అందరికంటే ముందుగా గంటా 31 నిమిషాల 15.114 సెకన్లలో గమ్యానికి చేరి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. 2011లో ఆస్ట్రేలియన్ గ్రాండ్‌ప్రితో ఫార్ములావన్‌లో అరంగేట్రం చేసిన పెరెజ్ తన కెరీర్‌లోని 190వ రేసులో విజేతగా నిలువడం విశేషం. సాఖిర్ గ్రాండ్‌ప్రిలో ఐదో స్థానం నుంచి రేసును ఆరంభించిన పెరెజ్ మిగతా డ్రైవర్ల తప్పిదాలను తనకు అనుకూలంగా మల్చుకొని తొలి విజయం రుచి చూశాడు. కరోనా బారిన పడటంతో ప్రపంచ చాంపియన్ హామిల్టన్ (మెర్సిడెస్) ఈ రేసులో పాల్గొనలేదు. హామిల్టన్ స్థానంలో మెర్సిడెస్ జట్టు రెండో డ్రైవర్‌గా బరిలోకి దిగిన జార్జి రసెల్ ఒకదశలో విజయం సాధించేలా కనిపించినా... కారు టైర్ పంక్చర్ కావడంతో 80వ ల్యాప్‌లో రేసు నుంచి తప్పుకున్నాడు. ఒకాన్ (రెనౌ), స్ట్రాల్ (రేసింగ్ పాయింట్) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. ఎఫ్1 2020 సీజన్‌లోని చివరిదైన 17వ రేసు అబుదాబి గ్రాండ్‌ప్రి డిసెంబర్ 13న జరుగుతుంది. -
జయహో... యు ముంబా
ముంబై: మొదటి అర్ధభాగంలో పోటీ ఇచ్చిన పుణేరి పల్టన్ తర్వాత చేతులెత్తేయడంతో యు ముంబా విజయాన్ని పట్టేసింది. దీంతో ప్రొ కబడ్డీ ఏడో సీజన్లో రెండు మరాఠా జట్ల పోరులో తొలి విజయం ముంబైని వరించింది. శనివారం ముంబైలో జరిగిన మొదటి మ్యాచ్‌లో మాజీ చాంపియన్ యు ముంబా 33–23తో పుణేరి పల్టన్‌పై గెలిచింది. అభిషేక్ సింగ్ 5 రైడ్ పాయింట్లతో ఆకట్టుకున్నాడు. యు ముంబా సారథి ఫజేల్ అత్రాచలి, రోహిత్, సురీందర్ సింగ్, సందీప్ నర్వాల్‌లు చెరో 4 పాయింట్లతో రాణించా రు. పుణేరి తరఫున సుర్జీత్ సింగ్ 6 పాయింట్లతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ గీతం ఆలపించాడు. నెమ్మదిగా మొదలై.. ఆరంభంలో రెండు జట్లు ఆచితూచి ఆడటంతో పాయింట్లు ఎక్కువగా రాలేదు. పుణే తరఫున తొలి కూతకు వెళ్లిన మంజీత్ రిక్తహస్తాలతో తిరిగొచ్చాడు. అనంతరం ముంబై తరఫున కూతకు వెళ్లిన లీ డాంగ్ జీన్‌ను పుణే పట్టేయడం అదే సమయంలో లీ బోనస్ లైన్‌ను దాటడంతో ఇరు జట్లు ఒకేసారి ఖాతా తెరిచాయి. 2–5తో యు ముంబా వెనుకంజలో ఉన్నప్పుడు ఫజేల్ అత్రాచలి మంజీత్‌ను సూపర్ టాకిల్ చేశాడు. ఆ వెంటనే అభిషేక్ ఒక రైడ్ పాయింట్ తీసుకురావడంతో స్కోరు 5–5తో సమమైంది. పుణే తరఫున సుర్జీత్ సింగ్ సూపర్ టాకిల్ చేయడం, ఆ వెంటనే రైడ్‌కు వెళ్లి సురీందర్ సింగ్, సందీప్ నర్వాల్‌లను ఔట్ చేసి పుణేని 9–8తో ఆధిక్యంలోకి తెచ్చాడు. అయితే ఈ దశలో ముంబై చకచకా మూడు పాయింట్లు సాధించి 11–9తో విరామానికి వెళ్లింది. రెండో అర్ధభాగం ఆరంభమైన కాసేపటికే యు ముంబా ప్రత్యర్థిని ఆలౌట్ చేసి 15–10తో దూసుకెళ్లింది. ఇదే అధిక్యాన్ని చివరి వరకు కొనసాగించిన ముంబై జట్టు విజేతగా నిలిచింది. గట్టెక్కిన జైపూర్... మరో మ్యాచ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్ 27–25తో బెంగాల్ వారియర్స్‌పై నెగ్గింది. చివరి మూడు నిమిషాల్లో తడబడిన బెంగాల్ మూల్యం చెల్లించుకుంది. జైపూర్ డిఫెండర్ సందీప్ ధుల్ (8 టాకిల్ పాయింట్లు)తో బెంగాల్‌ను పట్టేశాడు. రైడర్ దీపక్ హుడా 6 పాయింట్లతో రాణించాడు. నేడు జరిగే మ్యాచ్‌ల్లో దబంగ్ ఢిల్లీతో హరియాణా స్టీలర్స్; యు ముంబాతో బెంగళూరు బుల్స్ తలపడతాయి. -
టైటాన్స్‌కు తొలి విజయం
సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్ జట్టు బోణీ చేసింది. వరుసగా మూడు పరాజయాల తర్వాత సమష్టిగా చెలరేగి సీజన్లో తొలి విజయాన్ని అందుకుంది. సోమవారం గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన లీగ్ మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 35-18 తేడాతో బెంగాల్ వారియర్స్‌ను చిత్తు చేసింది. టైటాన్స్ తరఫున రాహుల్ 10 రైడింగ్ పాయింట్లు స్కోర్ చేయగా, అద్భుతమైన ఆటతీరు కనబర్చిన డిఫెండర్ సందీప్ ధుల్ 8 టాకిల్ పాయింట్లు సాధించి సత్తా చాటాడు. వరుసగా మూడు పరాజయాల తర్వాత టైటాన్స్ ఒక్క సారిగా జూలు విదిల్చింది. మ్యాచ్ ఆరంభం కాగానే ప్రత్యర్థికి ఒక్క పాయింట్ కూడా ఇవ్వకుండా వరుసగా ఆరు పాయింట్లు సాధించిన జట్టు ఆ తర్వాత వారియర్స్‌ను ఆలౌట్ చేసి ఏకంగా 10-1 ఆధిక్యంలోకి దూసుకుపోయింది. తొలి అర్ధ భాగం ముగిసే సరికి టైటాన్స్ 15-8తో పైచేయి సాధించింది. రెండో అర్ధ భాగంలో టైటాన్స్ డిఫెన్స్ మరింత సమర్థవంతంగా పని చేసింది. మరో మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్ 29-27 స్కోరుతో పుణేరీ పల్టన్‌ను ఓడించింది. ప్రొ కబడ్డీలో నేటి మ్యాచ్‌లు తెలుగు టైటాన్స్ X బెంగళూరు బుల్స్ రాత్రి 8 గంటల నుంచి ఫైర్ బర్డ్స్ X స్టార్మ్ క్వీక్స్(మహిళల మ్యాచ్) రాత్రి 9 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్2లో ప్రత్యక్ష ప్రసారం -
యూపీ వారియర్స్‌కు తొలి గెలుపు
లూథియానా: ప్రొ రెజ్లింగ్ లీగ్ (పీడబ్ల్యూఎల్)లో ఉత్తరప్రదేశ్ (యూపీ) వారియర్స్ జట్టు తొలి విజయాన్ని నమోదు చేసింది. ఢిల్లీ వీర్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో యూపీ వారియర్స్ 4-3తో గెలిచింది. బెంగళూరు యోధాస్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో యూపీ వారియర్స్ 1-6తో ఓడిపోగా... రెండో మ్యాచ్‌లో మెరుగైన ప్రదర్శన చేసి విజయాన్ని దక్కించుకుంది. పురుషుల 57 కేజీల బౌట్లో జైదీప్ (వారియర్స్) 3-6తో బెఖ్బాయర్ చేతిలో; 125 కేజీల బౌట్లో జోగిందర్ కుమార్ (వారియర్స్) 8-8తో కృషన్ చేతిలో; మహిళల 48 కేజీల బౌట్లో కొగుట్ ఒలెక్సాండ్రా (వారియర్స్) 0-11తో వినేశ్ ఫోగట్ చేతిలో ఓడిపోయారు. పురుషుల విభాగంలోని 97 కేజీల బౌట్లో సత్యవ్రత్ కడియాన్ (వారియర్స్) 4-1తో గుర్పాల్ సింగ్‌పై, 74 కేజీల బౌట్లో ఉనుర్బట్ (వారియర్స్) 5-0తో దినేశ్ కుమార్‌పై, మహిళల 53 కేజీల బౌట్లో బబిత కుమారి (వారియర్స్) 13-12తో హరిష్నాపై, 58 కేజీల బౌట్లో సరిత (వారియర్స్) 1-0తో ఎలిఫ్ జాలెపై నెగ్గి యూపీ వారియర్స్‌కు 4-3తో విజయా న్ని అందించారు. ఈ లీగ్‌లో ఢిల్లీ వీర్ జట్టుకిది వరుసగా రెండో పరాజయం. బుధవారం జరిగే మ్యాచ్ లో బెంగళూరుతో హరియాణా తలపడుతుంది. -
ఇది సమైక్యాంధ్ర తొలి విజయం
శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్: రాష్ట్ర శాసనసభలో టీ-నోట్‌ను మూజువాణీ ఓటుతో తిరస్కరించడం సమైక్యాంధ్ర ఉద్యమం తొలి విజయంగా ఏపీ ఎన్జీవో సంఘం సహాధ్యక్షుడు చౌదరి పురుషోత్తం నాయుడు పేర్కొన్నారు. గురువారం ఎన్జీవో హోంలో సమైక్యాంధ్ర సాధన సమితి ప్రతినిధులు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వివిధ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు టీ నోట్‌ను తిరస్కరించడంపై పురుషోత్తం నాయుడు హర్షం వ్యక్తం చేశారు. 66 రోజుల ఉద్యోగుల సమ్మెకు ఫలితం దక్కిందని, సీమాంధ్ర ఉద్యోగుల, నాయకులు, విద్యార్థుల, వివిధ సంఘా ల విజయమని అన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ అధిష్టానం, యూపీఏ ప్రభుత్వం కళ్లు తెరిచి ప్రజాభిప్రాయాన్ని గౌరవించాలని కోరారు. కొన్ని రాజకీయ పార్టీలు ముందుకు రాకపోవడం, కొందరు నాయకులు మాటలు మారుస్తున్నారన్నారు. టీ నోట్ తిప్పిగొట్టిన తర్వాతైనా కొన్ని పార్టీలు తమ జెండా, అజెండా వీడి సమైక్య ఉద్యమంలోకి రావాలని పిలుపునిచ్చారు. ఢిల్లీలో సమైక్యవాదం వినిపించేందుకు సీమాంధ్ర పార్లమెంట్ సభ్యులు ఏకతాటిపై నిలిచి ఇతర ప్రాంతాలకు చెందినవారిని, పార్టీలను కలుపుకుని కృషి చేయాలని కోరారు. ఇదే పంథాలో పార్లమెంట్లో బిల్లును ఓడించాలన్నారు. బీజేపీ కూడా సమైక్యాంధ్రకు సానుకూలంగా ఉందని, గతంలో ఆ పార్టీ అధినేతను కలిశామని, అసెంబ్లీలో బిల్లు ఓడిస్తే పార్లమెంట్లో ఓడించేందుకు కృషి చేస్తామని చెప్పారన్నారు. ఎన్జీవో సంఘం జిల్లా అధ్యక్షుడు హనుమంతు సాయిరాం మాట్లాడుతూ ఫిబ్రవరి 3న హైదరాబాద్‌లో జరగనున్న సమావేశంలో పార్లమెంట్లో బిల్లును అడ్డుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఇంకా ఉద్యం కొనసాగించాల్సి ఉందన్నారు. సీమాంధ్రవాసులు మరికొన్నాళ్లు అప్రమత్తంగా మెలగాలని కోరారు. ఫిబ్రవరి నెలలో అధిక సంఖ్యలో ఢిల్లీ వెళుతున్నామని, యూపీఏ ప్రభుత్వం తీరు మారే లా ఉద్యమం చేపట్టాల్సి ఉందన్నారు. ఈ సందర్బగా ఆరు నెలల నుంచి ఉద్య మం చేస్తున్న ప్రజలను ఆయన అభినందించారు. జామి భీమ శకంర్, దుప్పల వెంకటరావు, గీతా శ్రీకాంత్, వేణుగోపాల్ తదితరులు మాట్లాడారు. అంతకుముందు పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేశారు. కార్యక్రమంలో నర్సునాయుడు, శోభారాణి, బుక్కూరు ఉమామహేశ్వరరావు, కాయల శ్రీనివాసరావు, వై.జయరాం పాల్గొన్నారు.