Euro 2024 Qualification, Italy Vs England: England Beat Italy 2-1For 1st Time In 62 Years - Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్‌ సంచలనం.. 62 ఏళ్ల తర్వాత గెలుపు  

Published Sat, Mar 25 2023 7:04 AM | Last Updated on Sat, Mar 25 2023 10:32 AM

England Have One Foot In Euro 2024 After First Win-Italy For 62 years - Sakshi

యూరో–2024 క్వాలిఫయింగ్‌ టోర్నీలో భాగంగా నేపుల్స్‌లో ఇటలీతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ 2–1 గోల్స్‌ తేడాతో గెలిచింది. 1961 తర్వాత ఇటలీ జట్టును వారి సొంతగడ్డపైనే ఇంగ్లండ్‌ ఓడించడం గమనార్హం. ఇంగ్లండ్‌ తరఫున రైస్‌ (13వ ని.లో), కెప్టెన్‌ హ్యారీ కేన్‌ (44వ ని.లో)... ఇటలీ తరఫున రెటుగుయ్‌ (56వ ని.లో) ఒక్కో గోల్‌ చేశారు.

ఈ మ్యాచ్‌ ద్వారా హ్యారీ కేన్‌ ఇంగ్లండ్‌ తరఫున అత్యధిక అంతర్జాతీయ గోల్స్‌ చేసిన ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పాడు. 53 గోల్స్‌తో వేన్‌ రూనీ పేరిట ఉన్న రికార్డును 54వ గోల్‌తో హ్యారీ కేన్‌ సవరించాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement