జర్మనీ వేదికగా జరుగుతున్న యూరో కప్ ఫుట్‌బాల్ టోర్నీ-2024లో సెమీఫైనల్ బెర్త్‌లు అధికారకంగా ఖరారయ్యాయి. శనివారం రాత్రి స్విట్జర్లాండ్‌తో ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో విజయం సాధించిన ఇంగ్లండ్ మూడో జట్టుగా సెమీస్‌కు అర్హత సాధించగా.. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో టర్కీని ఓడించి నెదర్లాండ్స్ నాలుగో జట్టుగా సెమీస్‌లో అడుగుపెట్టింది.
ఇంగ్లండ్-స్విట్జర్లాండ్ మ్యాచ్ నిర్ణీత సమయానికి 1-1తో సమమైంది. కానీ పెనాల్టీ షూటౌట్‌లో ఇంగ్లండ్ 5 గోల్స్ చేయగా స్విస్ జట్టు 3 గోల్స్‌కే పరిమితమై ఓటమి చవి చూసింది. మరోవైపు నాలుగో క్వార్టర్స్ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ 2-1తో టర్కీని ఓడించింది.
కాగా యూరో కప్ సెమీఫైనల్లో నెదర్లాండ్స్ అడుగుపెట్టడం 20 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. కాగా ఇప్పటికే ఫ్రాన్స్, స్పెయిన్ తమ సెమీఫైనల్స్ బెర్త్‌లను ఖారారు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక మంగళవారం జరిగే తొలి సెమీఫైనల్లో స్పెయిన్‌తో ఫ్రాన్స్; బుధవారం జరిగే రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్‌తో నెదర్లాండ్స్ తలపడతాయి.
Comments
Please login to add a commentAdd a comment