Harry Kane
-
ఇంగ్లండ్ సంచలనం.. 62 ఏళ్ల తర్వాత గెలుపు
యూరో–2024 క్వాలిఫయింగ్ టోర్నీలో భాగంగా నేపుల్స్లో ఇటలీతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 2–1 గోల్స్ తేడాతో గెలిచింది. 1961 తర్వాత ఇటలీ జట్టును వారి సొంతగడ్డపైనే ఇంగ్లండ్ ఓడించడం గమనార్హం. ఇంగ్లండ్ తరఫున రైస్ (13వ ని.లో), కెప్టెన్ హ్యారీ కేన్ (44వ ని.లో)... ఇటలీ తరఫున రెటుగుయ్ (56వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. ఈ మ్యాచ్ ద్వారా హ్యారీ కేన్ ఇంగ్లండ్ తరఫున అత్యధిక అంతర్జాతీయ గోల్స్ చేసిన ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పాడు. 53 గోల్స్‌తో వేన్ రూనీ పేరిట ఉన్న రికార్డును 54వ గోల్‌తో హ్యారీ కేన్ సవరించాడు. -
'ఆ ఎక్స్ప్రెషన్ ఏంటయ్యా.. పిల్లలు జడుసుకుంటారు'
ఫిఫా వరల్డ్‌కప్‌లో భాగంగా ఇంగ్లండ్, ఫ్రాన్స్ మధ్య జరిగిన క్వార్టర్ ఫైనల్ పోరు హోరాహోరీగా జరిగింది. 2018 ఫిఫా ఛాంపియన్స అయిన ఫ్రాన్స్ వరుసగా రెండోసారి సెమీస్‌కు దూసుకెళ్లింది. వరుసగా రెండోసారి వరల్డ్‌కప్‌ను నిలబెట్టుకునేందుకు రెండు అడుగుల దూరంలో నిలిచింది ఫ్రాన్స్ జట్టు. 1958, 1962లో బ్రెజిల్ వరుసగా రెండుసార్లు విజేతగా నిలిచింది. తాజాగా 60 సంవత్సరాల తర్వాత ఫ్రాన్స్‌కు ఆ అవకాశం వచ్చింది. మరి ఫ్రాన్స్ కప్పును నిలుపుకుంటుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఇక మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ కేన్ పెనాల్టీ కిక్‌ను మిస్ చేయడంతో.. ఫ్రాన్స్ సూపర్‌స్టార్ కైలియన్ ఎంబాపె ఇచ్చిన ఎక్స్ప్రెషన్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆట 84వ నిమిషంలో పెనాల్టీ కిక్‌ను హ్యారీ కేన్ బంతిని గోల్పోస్టుపైకి తన్నాడు. ఇదే ఇంగ్లండ్ ఓటమికి బాటలు పరిచింది. తొలిసారి పెనాల్టీని సద్వినియోగం చేసుకున్న హ్యారీ కేన్.. రెండోసారి విఫలం కావడంతో ఫ్రాన్స్ స్టార్ ఎంబాపె.. పట్టరాని సంతోషంతో గట్టిగా కేకలు వేశాడు. ఆ తర్వాత హ్యారీ కేన్‌ను చూస్తూ ఎంబాపె ఫేస్‌తో ఇచ్చిన ఎక్స్ప్రెషన్ మ్యాచ్‌కే హైలైట్ గా నిలిచింది.కేవలం పెనాల్టీ కిక్ పోయినందుకే ఇంత సెలబ్రేట్ చేసుకుంటే.. ఫ్రాన్స్ ప్రపంచకప్ సాధిస్తే ఎంబాపెను ఆపడం ఎవ్వరి తరం కాదని అభిమానులు కామెంట్స్ చేశారు. ⚽️ La réaction de Mbappe suite au pénalty manqué d’Harry Kane. 🇫🇷😂#FRAANG #Qatar2022 #WorldCup2022 pic.twitter.com/Y9OMtkYoeu — MOTH🦋 (@MOTHCREW) December 10, 2022 చదవండి: Harry Kane: హీరో అనుకుంటే జీరో అయ్యాడు -
Harry Kane: హీరో అనుకుంటే జీరో అయ్యాడు
ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్ కథ క్వార్టర్స్‌లోనే ముగిసింది. ఫ్రాన్స్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 2-1 తేడాతో ఓటమి పాలైంది. తద్వారా ఫిఫా వరల్డ్‌కప్‌లో ఏడుసార్లు క్వార్టర్స్‌లోనే వెనుదిరిగిన జట్టుగా ఇంగ్లండ్ చెత్త రికార్డు నమోదు చేసింది. అయితే మ్యాచ్‌లో ఇంగ్లండ్‌కు లభించిన ఒక్క గోల్ ఆ జట్టు కెప్టెన్.. స్టార్ ఆటగాడు హ్యారీ కేన్ నుంచి వచ్చిందే. అలా తొలి పెనాల్టీ కిక్‌ను గోల్‌గా మలిచి హీరో అయిన కేన్ చివర్లో జీరో అయ్యాడు. రెండో అర్థభాగంలో చివర్లో వచ్చిన రెండు పెనాల్టీ కిక్‌లను ఆటగాళ్లు గోల్ పోస్ట్‌లోకి పంపడంలో విఫలం కావడం ఇంగ్లండ్ కొంపముంచింది. ఆట 84వ నిమిషంలో పెనాల్టీ కిక్‌ను హ్యారీ కేన్ బంతిని గోల్పోస్టుపైకి తన్నాడు. ఇక ఆ తర్వాత అదనపు సమయం చివర్లో వచ్చిన మరో పెనాల్టీని ఈసారి రష్‌ఫోర్డ్ గోల్‌పోస్టు పైకి షాట్ కొట్టాడు. అంతే ఇంగ్లండ్ బాధలో మునిగిపోతే.. ఫ్రాన్స్ మాత్రం విజయ సంబరాల్లో మునిగిపోయింది. వాస్తవానికి మ్యాచ్‌లో ఫ్రాన్స్ కంటే ఇంగ్లండ్ స్పష్టమైన ఆధిక్యం చూపించింది. తొలి హాఫ్, రెండో హాఫ్ కలిపి ఇంగ్లండ్ ఆటగాళ్లు 503 సార్లు పాస్‌లు ఇచ్చుకుంటే.. ఫ్రాన్స్ మాత్రం 377 సార్లు మాత్రమే పాస్‌లు ఇచ్చుకుంది. బంతిని ఎక్కువగా ఆధీనంలో ఉంచుకుంది కూడా ఇంగ్లండ్ జట్టే. మరి ఇన్ని చేసి కూడా 1966 విజేత అయిన ఇంగ్లండ్ మరోసారి తమ పోరును క్వార్టర్స్‌తోనే ముగించడం బాధాకరం. Oh Harry, what have you done? 🫣 How costly was this miss for @England in #ENGFRA?#Qatar2022 #FIFAWorldCup #WorldsGreatestShow #FIFAWConJioCinema #FIFAWConSports18 pic.twitter.com/uI5IlBN5vg — JioCinema (@JioCinema) December 10, 2022 FIFA WC: ఎదురులేని ఫ్రాన్స్.. వరుసగా రెండోసారి సెమీస్‌కు -
సెమీఫైనల్‌కు చేరిన ఫ్రాన్స్.. క్వార్టర్స్‌లో ఇంగ్లండ్ ఓటమి
ఫిఫా ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్ తమ జోరును కొనసాగిస్తుంది. శనివారం అర్ధరాత్రి జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఇంగ్లండ్‌ను ఓడించి సెమీఫైనల్లో ఫ్రాన్స్ అడుగు పెట్టింది. ఆఖరి వరకు హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో 2-1 తేడాతో విజయం సాధించిన యూరప్ జట్టు తమ సెమీస్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. ఇంగ్లీష్ జట్టు ఆఖరి వరకు అద్భుతంగా పోరాడినప్పటికీ.. ఓటమి నుంచి మాత్రం గట్టుక్కలేకపోయింది. మ్యాచ్ తొలి ఆర్ధబాగంలో ఫ్రాన్స్ ఆటగాడు అరెలియన్ చౌమెనీ అద్భుతమైన కిక్‌తో తమ జట్టుకు తొలి గోల్‌ను అందించాడు. దీంతో ఫ్రాన్స్ 1-0 తేడాతో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇక ఆ తర్వాత ఇరు జట్లు హోరాహోరీగా పోటీపడినప్పటికీ గోల్ మాత్రం సాధించలేకపోయాయి. ఇక సెకెండ్ హాఫ్‌లో బ్రిటన్ ఆటగాడు హారీ కేన్ పెనాల్టీ కిక్‌ను గోల్‌గా మలిచాడు. దీంతో ఇరు జట్లు 1-1 సమంగా నిలిచాయి. ఈ క్రమంలో ఇరు జట్ల శిబిరాల్లో తీవ్ర ఉత్కంఠత నెలకొంది. ఇటువంటి సమయంలో 78 నిమిషాల వద్ద ఫ్రాన్స్ ఆటగాడు ఒలివర్ గిరౌడ్ సంచలన గోల్‌తో తమ జట్టును 2-1 తేడాతో ఆధిక్యంలో నిలిచాడు. ఆ తర్వాత 84 నిమిషాల వద్ద ఇంగ్లాండ్‌కు మరో పెనాల్టీ అవకాశం వచ్చింది. అయితే తొలి పెనాల్టీని గోల్‌గా మలిచిన హారీ కేన్ రెండో ప్రయత్నంలో విఫలమయ్యాడు. దీంతో 2-1 తేడాతో ఓటమిపాలైన ఇంగ్లీష్ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక ఫ్రాన్స్ సెమీస్‌లో ఆఫ్రికా జట్టు మొరాకోతో తలపడనుంది. చదవండి: IND vs BAN: ఒక్కడి చేతిలో బంగ్లా ఓడింది.. 28 పరుగులు తక్కువ! అదే జరిగితే -
ఐపీఎల్: రిటైన్ లిస్టులో పేరు లేకపోవడం బాధాకరం
ఐపీఎల్ 2021 సీజన్‌కు సంబంధించి మినీ వేలంకు సిద్ధమవుతున్న 8 ఫ్రాంచైజీలు ఆటగాళ్లను భారీగానే వదులుకున్న సంగతి తెలిసిందే. జనవరి 20 (బుధవారం)తో దాదాపు అన్ని ఫ్రాంచైజీలు రిటైన్ ఆటగాళ్లతో పాటు రిలీజ్ చేసిన ఆటగాళ్ల ఫైనల్ లిస్టును విడుదల చేశాయి. కాగా ఐపీఎల్ మినీ వేలం ఫిబ్రవరి రెండో వారంలో జరగనుంది. ఈ నేపథ్యంలో స్టార్ ఫుట్‌బాలర్.. ఇంగ్లండ్ ఫుట్‌బాల్ కెప్టెన్ హారీ కేన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. హారీ కేన్‌కు ఐపీఎల్ అంటే మహా ప్రాణం.. ఇంగ్లీష్ ఫుట్‌బాల్‌ను ఎంతగా ఆస్వాదిస్తాడో ఐపీఎల్‌ను కూడా అంతే సమానంగా ఆదరిస్తాడు.. దీనికి ప్రధాన కారణం ఐపీఎల్‌లోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ). ఆర్సీబీ అంటే హారి కేన్‌కు విపరీతమైన ప్రేమ.. అందునా కెప్టెన్ విరాట్ కోహ్లి ఆట అంటే అతనికి చాలా పిచ్చి. తాజాగా ఆర్సీబీ రిటైన్, రిలీజ్ లిస్ట్ విడుదల చేసిన సందర్భంగా కేన్ ఫన్నీ కామెంట్స్ చేశాడు.చదవండి: 'నట్టూ.. నీకు కెప్టెన్ అయినందుకు గర్విస్తున్నా' 'నన్ను సెలెక్ట్ చేయనందుకు చాలా నిరాశతో ఉన్నా.. రిటైన్ లిస్ట్‌లో నా పేరు లేకపోవడం బాధాకరం కానీ ఇప్పుడు ఏం చేయడానికి లేదు.. ఆర్సీబీపై ఉన్న ఇష్టం మాత్రం చచ్చిపోదు.. జట్టులోని ఆటగాళ్లను ఉత్సాహపరియేందుకు నా వంతు సహకారం ఎప్పుడూ ఉంటుంది.' అంటూ ఫన్నీ కామెంట్స్ చేశాడు. ఈసారి ఆర్సీబీ 12 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకోగా.. 10 మంది ఆటగాళ్లను రిలీజ్ చేసింది. వారిలో స్టార్ ఆల్‌రౌండర్ క్రిస్ మోరిస్, ఆరోన్ ఫించ్, మెయిన్ అలీ లాంటి ఆటగాళ్లు ఉన్నారు. 10 మంది ఆటగాళ్లను రిలీజ్ చేసిన తర్వాత రూ. 35.7 కోట్లతో ఆర్సీబీ వేలానికి సిద్ధమవుతుంది. కాగా ఐపీఎల్ 13వ సీజన్ ముగిసిన తర్వాత హారి కేన్ తన బ్యాటింగ్ స్కిల్‌కు సంబంధించిన వీడియోను కోహ్లి, ఆర్సీబీ హాష్‌ట్యాగ్‌తో షేర్ చేశాడు. మీ టీమ్ తరపున మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడేందుకు నేను సిద్ధం. వచ్చే సీజన్లో అవకాశం ఉంటే నాకు ఒక చాన్స్ ఇవ్వండి .. నేనేంటో చూపిస్తాను అంటూ క్యాప్షన్ జత చేశాడు. దీనిపై కోహ్లి స్పందించాడు. కేన్ నీ బ్యాటింగ్ సిల్క్స్ సూపర్.. వచ్చే సీజన్లో కౌంటర్ అటాక్ బ్యాట్స్‌మన్‌గా తీసుకునేందుకు ప్రయత్నిస్తాం అంటూ లాఫింగ్ ఎమోజీతో తెలిపాడు. చదవండి: ‘ప్రాక్టీస్ వద్దంటే గోల చేసేవాడు.. లెజెండ్ అవుతాడు’ Got a match winning T20 knock in me I reckon. 😂🏏 Any places going for @RCBTweets in the @IPL next season @imVkohli?? pic.twitter.com/tjUZnedVvI — Harry Kane (@HKane) November 27, 2020 Bit disappointed not to be selected but nothing I can do now. Will still be cheering the boys on 😂🏏🔥 https://t.co/Jq17o1m3aO — Harry Kane (@HKane) January 20, 2021 -
నిన్ను జట్టులోకి తీసుకుంటామేమో: కోహ్లి
లండన్: ఇంగ్లండ్ ఫుట్‌బాల్ ఆటగాడు హారీకేన్ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి చేసిన ప్రతిపాదనపై ఆర్సీబీ స్పందించింది. ‘‘నీ కోసం ఇప్పుడే జెర్సీ నంబరు 10 సిద్ధం చేసి పెట్టాం’’ అంటూ అతడికి బదులిచ్చింది. టోటన్హాం హాట్స్పర్ క్లబ్ ఆటగాడు, ఇంగ్లండ్ జాతీయ జట్టు కెప్టెన్ హారీకేన్ సహచర ఆటగాళ్లతో కలిసి సరాదాగా క్రికెట్ ఆడాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాలో శుక్రవారం షేర్ చేశాడు. మ్యాచ్ విన్నింగ్ టీ20 ఇన్నింగ్స్ ఆడానని, ఐపీఎల్ టీం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టులో తనకు చోటు దొరుకుతుందా అంటూ సారథి కోహ్లిని అడిగాడు.(చదవండి: ఆ మూడు తప్పిదాలతోనే టీమిండియా మూల్యం!) వచ్చే ఏడాది అయినా తనను జట్టులోకి తీసుకునే అంశాన్ని పరిశీలించాలంటూ సరదాగా వ్యాఖ్యానించాడు. ఇక ప్రస్తుతం ఆస్ట్రేలియా టూర్లో బిజీగా ఉన్న కోహ్లి ఈ విషయంపై తాజాగా స్పందించాడు. బ్యాటింగ్ నైపుణ్యం బాగుందని, కౌంటర్ అటాక్ బ్యాట్స్‌మెన్‌గా ఆర్సీబీలో స్థానం కల్పిస్తామేమో అంటూ కామెంట్ చేశాడు. అదే విధంగా ఇంగ్లండ్ క్రికెటర్, రాజస్తాన్ రాయల్స్ ఆటగాడు జోస్ బట్లర్ సైతం ఈ వీడియోపై స్పందించాడు. బాగా ఆడుతున్నావని, 2021 ఐపీఎల్ వేలంలో పాల్గొనాల్సిందిగా ఈ స్ట్రైకర్‌కు సూచించాడు. కాగా 27 ఏళ్ల హారికేన్ ఈ ఏడాది ప్రీమియర్ లీగ్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు ఏడు గోల్స్ చేసిన అతడు.. 20 పాయింట్లతో టోటన్హాం జట్టును అగ్రస్థానంలో నిలపడంలో కీలక పాత్ర పోషించాడు. View this post on Instagram A post shared by Harry Kane (@harrykane) Haha good skills mate. Maybe we can get you in as a counter attacking batsman😃👏 @HKane https://t.co/rYjmVUkdwO — Virat Kohli (@imVkohli) November 28, 2020 -
కోహ్లికి ఆల్ ద బెస్ట్.. ఆ మ్యాచ్‌కు తప్పా!!
లండన్ : ఇంగ్లండ్ ఫుట్‌బాల్ స్టార్ ఆటగాడు, సారథి హ్యారీ కేన్ టీమిండియా సారథి విరాట్ కోహ్లికి ప్రపంచకప్ తదుపరి మ్యాచ్‌లకు ఆల్ ద బెస్ట్ చెప్పాడు. హ్యారీ కేన్, విరాట్ కోహ్లిలు తొలుత సోషల్ మీడియా స్నేహితులు.. అనంతరం ప్రపంచకప్ పుణ్యమా వీరిద్దరూ మంచి స్నేహితులు అయ్యారు. ప్రపంచకప్ కోసం టీమిండియా ఇంగ్లండ్‌లో అడుగుపెట్టిన వెంటనే హ్యారీ కేన్ తన స్నేహితుడు కోహ్లిని కలుసుకున్నాడు. తాజాగా టోర్నీ ముగింపు దశకు చేరుకున్న నేపథ్యంలో వీరిద్దరూ మళ్లీ కలిసుకొని కాసేపు క్రికెట్ ఆడి సరదాగా ముచ్చటించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను కేన్ తన అధికారిక ట్విటర్లో షేర్ చేశాడు. ‘ఈ మధ్య విరాట్ కోహ్లితో కలిసి లార్డ్స్ స్టేడియంలో గడిపిన క్షణాలు ఎంతో అద్భుతమైనవి.. మరిచిపోలేనివి. ప్రపంచకప్ తదుపరి మ్యాచ్‌లకు విరాట్ కోహ్లికి ఆల్ ద బెస్ట్(ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు తప్పా)’అంటూ హరికేన్ ట్వీట్ చేశాడు. అంతేకాకుండా వీరిద్దరూ కలిసి క్రికెట్ అడింది, ముచ్చటించుకున్న వీడియోను జత చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ హల్చల్ చేస్తోంది. ఇద్దరూ వారివారి ఆటల్లో దిగ్గజాలని, ఓటమి సులువుగా ఒప్పుకునే మనస్థత్వం కాని వారని మెచ్చుకుంటున్నారు. ఇక టీమిండియా శనివారం టోర్నీ లీగ్ చివరి మ్యాచ్‌లో శ్రీలంకతో తలపడనుంది. ఈ మ్యాచ్ ఫలితంతో సంబంధంలేకుండానే కోహ్లి సేన ఇప్పటికే సెమీస్‌కు చేరిన విషయం తెలిసిందే. -
కోహ్లికి ఆల్ ద బెస్ట్..
-
హ్యారీ కానె హ్యాట్రిక్..
మాస్కో : సాకర్కప్లో ఇంగ్లండ్ దుమ్మురేపింది. గ్రూప్ జీలో ఆదివారం పనామాతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు 6-1 గోల్స్ తేడాతో ఘన విజయం సాధించింది. హ్యారీ కానె హ్యాట్రిక్ గోల్స్‌తో విజయంలో కీలకపాత్ర పోషించాడు. అంతకుముందు ట్యునీసియాపై రెండు గోల్స్ సాధించిన కానె ఇప్పటివరకు మొత్తం 5 గోల్స్ తన ఖాతాలో వేసుకున్నాడు. తాజా విజయంతో గ్రూప్ జీలో ఆరు పాయింట్లతో ఇంగ్లండ్ అగ్రస్థానంలో నిలిచింది. తర్వాతి మ్యాచ్‌లో బెల్జియంతో ఇంగ్లండ్ తలపడనుంది.