లండన్ : ఇంగ్లండ్ ఫుట్‌బాల్ స్టార్ ఆటగాడు, సారథి హ్యారీ కేన్ టీమిండియా సారథి విరాట్ కోహ్లికి ప్రపంచకప్ తదుపరి మ్యాచ్‌లకు ఆల్ ద బెస్ట్ చెప్పాడు. హ్యారీ కేన్, విరాట్ కోహ్లిలు తొలుత సోషల్ మీడియా స్నేహితులు.. అనంతరం ప్రపంచకప్ పుణ్యమా వీరిద్దరూ మంచి స్నేహితులు అయ్యారు. ప్రపంచకప్ కోసం టీమిండియా ఇంగ్లండ్‌లో అడుగుపెట్టిన వెంటనే హ్యారీ కేన్ తన స్నేహితుడు కోహ్లిని కలుసుకున్నాడు. తాజాగా టోర్నీ ముగింపు దశకు చేరుకున్న నేపథ్యంలో వీరిద్దరూ మళ్లీ కలిసుకొని కాసేపు క్రికెట్ ఆడి సరదాగా ముచ్చటించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను కేన్ తన అధికారిక ట్విటర్లో షేర్ చేశాడు.
‘ఈ మధ్య విరాట్ కోహ్లితో కలిసి లార్డ్స్ స్టేడియంలో గడిపిన క్షణాలు ఎంతో అద్భుతమైనవి.. మరిచిపోలేనివి. ప్రపంచకప్ తదుపరి మ్యాచ్‌లకు విరాట్ కోహ్లికి ఆల్ ద బెస్ట్(ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు తప్పా)’అంటూ హరికేన్ ట్వీట్ చేశాడు. అంతేకాకుండా వీరిద్దరూ కలిసి క్రికెట్ అడింది, ముచ్చటించుకున్న వీడియోను జత చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ హల్చల్ చేస్తోంది. ఇద్దరూ వారివారి ఆటల్లో దిగ్గజాలని, ఓటమి సులువుగా ఒప్పుకునే మనస్థత్వం కాని వారని మెచ్చుకుంటున్నారు. ఇక టీమిండియా శనివారం టోర్నీ లీగ్ చివరి మ్యాచ్‌లో శ్రీలంకతో తలపడనుంది. ఈ మ్యాచ్ ఫలితంతో సంబంధంలేకుండానే కోహ్లి సేన ఇప్పటికే సెమీస్‌కు చేరిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment