ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్ కథ క్వార్టర్స్‌లోనే ముగిసింది. ఫ్రాన్స్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 2-1 తేడాతో ఓటమి పాలైంది. తద్వారా ఫిఫా వరల్డ్‌కప్‌లో ఏడుసార్లు క్వార్టర్స్‌లోనే వెనుదిరిగిన జట్టుగా ఇంగ్లండ్ చెత్త రికార్డు నమోదు చేసింది. అయితే మ్యాచ్‌లో ఇంగ్లండ్‌కు లభించిన ఒక్క గోల్ ఆ జట్టు కెప్టెన్.. స్టార్ ఆటగాడు హ్యారీ కేన్ నుంచి వచ్చిందే.
అలా తొలి పెనాల్టీ కిక్‌ను గోల్‌గా మలిచి హీరో అయిన కేన్ చివర్లో జీరో అయ్యాడు. రెండో అర్థభాగంలో చివర్లో వచ్చిన రెండు పెనాల్టీ కిక్‌లను ఆటగాళ్లు గోల్ పోస్ట్‌లోకి పంపడంలో విఫలం కావడం ఇంగ్లండ్ కొంపముంచింది. ఆట 84వ నిమిషంలో పెనాల్టీ కిక్‌ను హ్యారీ కేన్ బంతిని గోల్‌పోస్టుపైకి తన్నాడు. ఇక ఆ తర్వాత అదనపు సమయం చివర్లో వచ్చిన మరో పెనాల్టీని ఈసారి రష్‌ఫోర్డ్ గోల్‌పోస్టు పైకి షాట్ కొట్టాడు. అంతే ఇంగ్లండ్ బాధలో మునిగిపోతే.. ఫ్రాన్స్ మాత్రం విజయ సంబరాల్లో మునిగిపోయింది.
వాస్తవానికి మ్యాచ్‌లో ఫ్రాన్స్ కంటే ఇంగ్లండ్ స్పష్టమైన ఆధిక్యం చూపించింది. తొలి హాఫ్, రెండో హాఫ్ కలిపి ఇంగ్లండ్ ఆటగాళ్లు 503 సార్లు పాస్‌లు ఇచ్చుకుంటే.. ఫ్రాన్స్ మాత్రం 377 సార్లు మాత్రమే పాస్‌లు ఇచ్చుకుంది. బంతిని ఎక్కువగా ఆధీనంలో ఉంచుకుంది కూడా ఇంగ్లండ్ జట్టే. మరి ఇన్ని చేసి కూడా 1966 విజేత అయిన ఇంగ్లండ్ మరోసారి తమ పోరును క్వార్టర్స్‌తోనే ముగించడం బాధాకరం.
Oh Harry, what have you done? 🫣
— JioCinema (@JioCinema) December 10, 2022
How costly was this miss for @England in #ENGFRA?#Qatar2022 #FIFAWorldCup #WorldsGreatestShow #FIFAWConJioCinema #FIFAWConSports18 pic.twitter.com/uI5IlBN5vg
Comments
Please login to add a commentAdd a comment