Penalty Corner
-
Harry Kane: హీరో అనుకుంటే జీరో అయ్యాడు
ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్ కథ క్వార్టర్స్‌లోనే ముగిసింది. ఫ్రాన్స్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 2-1 తేడాతో ఓటమి పాలైంది. తద్వారా ఫిఫా వరల్డ్‌కప్‌లో ఏడుసార్లు క్వార్టర్స్‌లోనే వెనుదిరిగిన జట్టుగా ఇంగ్లండ్ చెత్త రికార్డు నమోదు చేసింది. అయితే మ్యాచ్‌లో ఇంగ్లండ్‌కు లభించిన ఒక్క గోల్ ఆ జట్టు కెప్టెన్.. స్టార్ ఆటగాడు హ్యారీ కేన్ నుంచి వచ్చిందే. అలా తొలి పెనాల్టీ కిక్‌ను గోల్‌గా మలిచి హీరో అయిన కేన్ చివర్లో జీరో అయ్యాడు. రెండో అర్థభాగంలో చివర్లో వచ్చిన రెండు పెనాల్టీ కిక్‌లను ఆటగాళ్లు గోల్ పోస్ట్‌లోకి పంపడంలో విఫలం కావడం ఇంగ్లండ్ కొంపముంచింది. ఆట 84వ నిమిషంలో పెనాల్టీ కిక్‌ను హ్యారీ కేన్ బంతిని గోల్పోస్టుపైకి తన్నాడు. ఇక ఆ తర్వాత అదనపు సమయం చివర్లో వచ్చిన మరో పెనాల్టీని ఈసారి రష్‌ఫోర్డ్ గోల్‌పోస్టు పైకి షాట్ కొట్టాడు. అంతే ఇంగ్లండ్ బాధలో మునిగిపోతే.. ఫ్రాన్స్ మాత్రం విజయ సంబరాల్లో మునిగిపోయింది. వాస్తవానికి మ్యాచ్‌లో ఫ్రాన్స్ కంటే ఇంగ్లండ్ స్పష్టమైన ఆధిక్యం చూపించింది. తొలి హాఫ్, రెండో హాఫ్ కలిపి ఇంగ్లండ్ ఆటగాళ్లు 503 సార్లు పాస్‌లు ఇచ్చుకుంటే.. ఫ్రాన్స్ మాత్రం 377 సార్లు మాత్రమే పాస్‌లు ఇచ్చుకుంది. బంతిని ఎక్కువగా ఆధీనంలో ఉంచుకుంది కూడా ఇంగ్లండ్ జట్టే. మరి ఇన్ని చేసి కూడా 1966 విజేత అయిన ఇంగ్లండ్ మరోసారి తమ పోరును క్వార్టర్స్‌తోనే ముగించడం బాధాకరం. Oh Harry, what have you done? 🫣 How costly was this miss for @England in #ENGFRA?#Qatar2022 #FIFAWorldCup #WorldsGreatestShow #FIFAWConJioCinema #FIFAWConSports18 pic.twitter.com/uI5IlBN5vg — JioCinema (@JioCinema) December 10, 2022 FIFA WC: ఎదురులేని ఫ్రాన్స్.. వరుసగా రెండోసారి సెమీస్‌కు -
మెస్సీతో మాములుగా ఉండదు మరి..
ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో అర్జెంటీనా స్టార్ ఆటగాడు లియోనల్ మెస్సీ తొలి మ్యాచ్‌లోనే గోల్‌తో మెరిశాడు. మంగళవారం గ్రూప్-సిలో సౌదీ అరేబియాతో మ్యాచ్‌లో మెస్సీ సూపర్ గోల్ చేశాడు. పెనాల్టీ కిక్‌లో తననెందుకు కింగ్ అంటారనేది మెస్సీ మరోసారి నిరూపించాడు. ఆట 9వ నిమిషంలో సౌదీ అరేబియా ఆటగాడి తప్పిదంతో అర్జెంటీనాకు పెనాల్టీ వచ్చింది. దీనిని మెస్సీ చక్కగా వినియోగించుకున్నాడు. పెనాల్టీ కిక్‌ను గోల్‌గా మలచడంలో మెస్సీని మించినవారు లేరు. గోల్‌పోస్ట్‌కు 12 యార్డుల దూరంలో నిల్చున్న మెస్సీ ఏ మాత్రం తడబాటు లేకుండా బంతిని గోల్‌పోస్ట్‌లోకి పంపించి అర్జెంటీనాకు ఈ ప్రపంచకప్‌లో తొలి గోల్ అందించాడు. తద్వారా అర్జెంటీనా 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇక నాలుగు ఫిఫా వరల్డ్‌కప్స్‌లో గోల్స్ చేసిన తొలి అర్జెంటీనా ఆటగాడిగా మెస్సీ చరిత్ర సృష్టించాడు. 2006, 2014, 2018, 2022లో మెస్సీ గోల్స్ కొట్టాడు.ఇక మ్యాచ్‌లో హాఫ్ టైమ్ ముగిసేసరికి అర్జెంటీనా 1-0తో సౌదీ అరేబియాపై ఆధిక్యంలో నిలిచింది. ✅ 2006 ✅ 2014 ✅ 2018 ✅ 2022 Messi becomes the first Argentinian to score in four World Cups! ✨#FIFAWorldCup | #Qatar2022 pic.twitter.com/lKzewHhVkV — FIFA World Cup (@FIFAWorldCup) November 22, 2022 చదవండి: ఖతర్‌లో వరల్డ్‌కప్.. కేరళలో తన్నుకున్న అభిమానులు -
ఫుట్‌బాల్ మైదానంలో బాలీవుడ్ స్టార్ వింత ప్రవర్తన
బాలీవుడ్ సూపర్‌స్టార్ రణ్వీర్ సింగ్ ఫుట్‌బాల్ మైదానంలో సందడి చేశాడు. అయితే మ్యాచ్ చూడడానికి వచ్చిన రణ్వీర్ తన వింత ప్రవర్తనతో అభిమానుల మనసులు గెలుచుకున్నాడు. విషయంలోకి వెళితే.. క్రిస్టల్ పాలెస్ ప్రీమియర్ లీగ్ వర్సెస్ మాంచెస్టర్ సిటీ మధ్య బుధవారం మ్యాచ్ జరిగింది. కాగా ఈ ప్రీమియర్ లీగ్‌కు రణ్వీర్ సింగ్ అంబాసిడర్ పాత్ర పోషించాడు. మ్యాచ్ హాఫ్ టైమ్ ముగిసిన తర్వాత రణ్వీర్ తన ఫుట్‌బాల్ నైపుణ్యం ప్రదర్శించాడు. పెనాల్టీ చాలెంజ్ పేరుతో నిర్వహించిన ఫన్ గేమ్‌లో రణ్వీర్.. తన కాలికున్న బూట్లను తీసేసి.. కేవలం తన కాళ్లతోనే బంతిని గోల్‌పోస్ట్‌లోకి తరలించాడు. అనంతరం ఫుట్‌బాల్ స్టార్స్ చేసుకునే సెలబ్రేషన్‌తో మెరిశాడు. రణ్వీర్ సింగ్ చేష్టలు అభిమానులకు కాస్త వింతగా అనిపించినా.. సూపర్‌గా ఎంజాయ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను క్రిస్టల్ ప్యాలెస్ లీగ్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ''హాఫ్ టైమ్ పెనాల్టీ చాలెంజ్‌ను రణ్వీర్ విజయవంతంగా పూర్తి చేశాడు.. కంగ్రాట్స్'' అంటూ క్యాప్షన్ జత చేసింది. తాజాగా ఈ వీడియో వైరల్‌గా మారింది. ఇక 2017 నుంచి రణ్వీర్ సింగ్ ఫుట్‌బాల్ ప్రీమియర్ లీగ్‌కు భారత్ నుంచి అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు. భారత్‌లో ఫుట్‌బాల్‌ను ప్రోత్సహించడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఫుట్‌బాల్‌కు భారత్ నుంచి క్రీడాకారులు రావాలని కోరుకుంటున్నారు. ఇక ఇప్పటికే అంబాసిడర్ పాత్రలో ఇంగ్లండ్‌లోని ఓల్డ్ ట్రాఫర్డ్, టోటెన్హమ్ హాట్స్పుర్ స్టేడియాలకు రణ్వీర్ సింగ్ వెళ్లి వచ్చాడు. ఇక క్రిస్టల్ ప్యాలెస్ లీగ్, మాంచెస్టర్ సిటీ మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. చదవండి: AUS vs PAK: 'మా గుండె ఆగినంత పనైంది'.. అప్పుడు తిట్టినోళ్లే ఇవాళ పొగుడుతున్నారు ICC Test Rankings: దుమ్మురేపిన శ్రేయాస్ అయ్యర్, బుమ్రా Cool as you like 🤣@RanveerOfficial completes the Selhurst Park half-time penalty challenge 👏#CPFC pic.twitter.com/pBj1YBwlmO — Crystal Palace F.C. (@CPFC) March 15, 2022 -
హాకీలో కొత్త నిబంధన అమల్లోకి..
అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్(ఎఫ్ఐహెచ్) హాకీలో కొత్త నిబంధన అమల్లోకి తీసుకొచ్చింది. ఇకపై పెనాల్టీ కార్నర్‌ను అడ్డుకునే సందర్భంలో ఆటగాళ్లు ఫేస్గేర్(హెల్మెట్లు) ధరించేందుకు అనుమతి ఇచ్చింది. అయితే బంతి 23 మీటర్ల దూరం దాటిన తర్వాత ఆటగాళ్లు ఫేస్‌గేర్‌ను తప్పనిసరిగా తొలగించాలని రూల్‌లో పేర్కొంది. అంతకుముందు పెనాల్టీ కార్నర్లను డిఫెండ్ చేసే ఆటగాళ్ళు బంతి ఫ్లిక్ అయిన వెంటనే సర్కిల్ లోపలే ఫేస్‌గేర్‌ను తీసేయాల్సి ఉండేది. తాజాగా హాకీ నిబంధనలోని రూల్ 4.2 ప్రకారం నిబంధనను సవరించినట్లు హాకీ ఫెడరేషన్ సంఘం ట్విటర్లో పేర్కొంది. కాగా డిసెంబర్ 2021లో భువనేశ్వర్‌లో జరిగిన జూనియర్ హాకీ మెన్స్ వరల్డ్‌కప్‌లో పెనాల్టీ కార్నర్ రూల్‌లో ఆటగాళ్లకు ఫేస్‌గేర్‌ను ట్రయల్‌గా అమలు చేశారు. దీనిపై హాకీ కోచ్‌లు, క్రీడాకారులు, ఇతర అధికారుల నుంచి మంచి ప్రయత్నమంటూ విశేష స్పందన రావడంతో అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్ ఈ నిబంధనను కొనసాగిస్తూ తాజాగా అమల్లోకి తెచ్చింది. -
భారత్ శుభారంభం
► జపాన్‌పై 2-1తో గెలుపు ► అజ్లాన్ షా కప్ హాకీ టోర్నీ ఇపో (మలేసియా): మాజీ చాంపియన్ భారత్... సుల్తాన్ అజ్లాన్ షా కప్ హాకీ టోర్నమెంట్లో శుభారంభం చేసింది. జపాన్‌తో బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 2-1 గోల్స్ తేడాతో విజయం సాధించింది. ఒకదశలో 0-1తో వెనుకబడిన భారత్ ఆ తర్వాత తేరుకొని ఎనిమిది నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ చేసి విజయాన్ని ఖాయం చేసుకుంది. ద్వితీయ శ్రేణి జట్టుతో బరిలోకి దిగిన జపాన్ నుంచి ఆద్యంతం భారత్‌కు గట్టిపోటీ ఎదురైంది. ఆట 17వ నిమిషంలో కెంజి కిటాజాటో గోల్‌తో జపాన్ ఆధిక్యంలోకి వెళ్లింది. లభించిన తొలి పెనాల్టీ కార్నర్‌నే జపాన్ గోల్‌గా మలచడం విశేషం. ఆ తర్వాత భారత ఆటగాళ్లు ప్రత్యర్థి వలయంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. 24వ నిమిషంలో లభించిన తొలి పెనాల్టీ కార్నర్‌ను కుడి వైపునకు డ్రాగ్ ఫ్లిక్ చేసి హర్మన్‌ప్రీత్ సింగ్ భారత్‌కు మొదటి గోల్‌ను అందించాడు. ఆ తర్వాత ఆట 32వ నిమిషంలో జస్జీత్ సింగ్ అందించిన పాస్‌ను అందుకున్న సర్దార్ సింగ్ రివర్స్ షాట్‌తో జపాన్ గోల్ కీపర్‌ను బోల్తా కొట్టించాడు. దాంతో భారత్ 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. మ్యాచ్ ముగిసేలోపు భారత్‌కు మరిన్ని గోల్స్ చేసే అవకాశాలు లభించినా ఫలితం లేకపోయింది. సహచర ఆటగాడు మన్‌ప్రీత్ సింగ్ తండ్రి మృతికి సంతాపంగా భారత ఆటగాళ్లు ఈ మ్యాచ్‌లో నల్ల రిబ్బన్ బ్యాండ్లు ధరించి బరిలోకి దిగారు. మ్యాచ్ ప్రారంభానికి కొన్ని గంటలముందు మన్‌ప్రీత్ సింగ్ తండ్రి మృతి చెందినట్లు సమాచారం అందింది. దాంతో మన్‌ప్రీత్ స్వదేశానికి బయలుదేరి వెళ్లాడు. గురువారం జరిగే రెండో లీగ్ మ్యాచ్‌లో ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాతో భారత్ తలపడుతుంది.