Ranveer Singh Premier League Penalty Challenge In Pitch, Video Goes Viral - Sakshi
Sakshi News home page

Ranveer Singh: ఫుట్‌బాల్‌ మైదానంలో బాలీవుడ్‌ స్టార్‌ వింత ప్రవర్తన

Published Thu, Mar 17 2022 8:55 AM | Last Updated on Thu, Mar 17 2022 10:28 AM

Bollywood Super Star Ranveer Singh Penalty Challenge Viral FootBall Match - Sakshi

బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ రణ్‌వీర్‌ సింగ్‌ ఫుట్‌బాల్‌ మైదానంలో సందడి చేశాడు. అయితే మ్యాచ్‌ చూడడానికి వచ్చిన రణ్‌వీర్‌ తన వింత ప్రవర్తనతో అభిమానుల మనసులు గెలుచుకున్నాడు. విషయంలోకి వెళితే.. క్రిస్టల్‌ పాలెస్‌ ప్రీమియర్‌ లీగ్‌ వర్సెస్‌ మాంచెస్టర్‌ సిటీ మధ్య బుధవారం మ్యాచ్‌ జరిగింది. కాగా ఈ ప్రీమియర్‌ లీగ్‌కు రణ్‌వీర్‌ సింగ్‌ అంబాసిడర్‌ పాత్ర పోషించాడు. మ్యాచ్‌ హాఫ్‌ టైమ్‌ ముగిసిన తర్వాత రణ్‌వీర్‌ తన ఫుట్‌బాల్‌ నైపుణ్యం ప్రదర్శించాడు.

పెనాల్టీ చాలెంజ్‌ పేరుతో నిర్వహించిన ఫన్‌ గేమ్‌లో రణ్‌వీర్‌.. తన కాలికున్న బూట్లను తీసేసి.. కేవలం తన కాళ్లతోనే బంతిని గోల్‌పోస్ట్‌లోకి తరలించాడు. అనంతరం ఫుట్‌బాల్‌ స్టార్స్‌ చేసుకునే సెలబ్రేషన్‌తో మెరిశాడు. రణ్‌వీర్‌ సింగ్‌ చేష్టలు అభిమానులకు కాస్త వింతగా అనిపించినా.. సూపర్‌గా ఎంజాయ్‌ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను క్రిస్టల్‌ ప్యాలెస్‌ లీగ్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ.. ''హాఫ్‌ టైమ్‌ పెనాల్టీ చాలెంజ్‌ను రణ్‌వీర్‌ విజయవంతంగా పూర్తి చేశాడు.. కంగ్రాట్స్‌'' అంటూ క్యాప్షన్‌ జత చేసింది. తాజాగా ఈ వీడియో వైరల్‌గా మారింది. 

ఇక 2017 నుంచి రణ్‌వీర్‌ సింగ్‌ ఫుట్‌బాల్‌ ప్రీమియర్‌ లీగ్‌కు భారత్‌ నుంచి అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు. భారత్‌లో ఫుట్‌బాల్‌ను ప్రోత్సహించడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఫుట్‌బాల్‌కు భారత్‌ నుంచి క్రీడాకారులు రావాలని కోరుకుంటున్నారు. ఇక ఇప్పటికే అంబాసిడర్‌ పాత్రలో ఇంగ్లండ్‌లోని ఓల్డ్‌ ట్రాఫర్డ్‌, టోటెన్‌హమ్‌ హాట్స్‌పుర్‌ స్టేడియాలకు రణ్‌వీర్‌ సింగ్‌ వెళ్లి వచ్చాడు. ఇక క్రిస్టల్‌ ప్యాలెస్‌ లీగ్‌, మాంచెస్టర్‌ సిటీ మధ్య జరిగిన మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. 

చదవండి: AUS vs PAK: 'మా గుండె ఆగినంత పనైంది'.. అప్పుడు తిట్టినోళ్లే ఇవాళ పొగుడుతున్నారు

ICC Test Rankings: దుమ్మురేపిన శ్రేయాస్‌ అయ్యర్‌, బుమ్రా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement