ఫుట్‌బాల్ మ్యాచ్‌లో భాగంగా ఒక గోల్ ఆటగాడి రక్తం కళ్ల చూసింది. ఈ ఘటన వార్సాలో జరుగుతున్న చాంపియన్ లీగ్‌లో చోటుచేసుకుంది. లీగ్‌లో భాగంగా గ్రూఫ్-ఎఫ్‌లో రియల్ మాడ్రిడ్, షాఖ్తర్ దొనేత్సక్‌ల మధ్య బుధవారం తెల్లవారుజామున(భారత కాలామాన ప్రకారం) మ్యాచ్ జరిగింది. నిర్ణీత సమయం ముగిసే సమయానికి షాఖ్తర్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. మరో ఐదు నిమిషాలు అదనపు సమయం ఇవ్వడంతో రియల్ మాడ్రిడ్ గోల్ కొట్టడానికి ప్రయత్నించింది.
ఈ క్రమంలోనే ఆట 95వ నిమిషంలో రియల్ మాడ్రిడ్ ఢిఫెండర్ ఆంటోనియో రూడిగర్ హెడర్ గోల్ చేశాడు. ఇక్కడే ఊహించని పరిణామం జరిగింది. బంతిని తలతో బలంగా కొట్టే క్రమంలో రూడిగర్ పైకి ఎగరగా.. అదే సమయంలో షాఖ్తర్ గోల్ కీపర్ అనటోలీ ట్రూబిన్ అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఈ ప్రయత్నంలో ట్రూబిన్ తలభాగం రూడిగర్ నుదుటన గట్టిగా గుద్దుకుంది. అయితే అప్పటికే బంతి గోల్‌పోస్ట్‌లోకి వెళ్లిపోవడంతో రియాల్ మాడ్రిడ్- షాఖ్తర్ దొనేత్సక్ మ్యాచ్ డ్రాగా ముగిసింది.
తాము క్వార్టర్ ఫైనల్ చేరామన్న సంతోషంతో రియల్ మాడ్రిడ్ సంబరంలో మునిగిపోగా.. జట్టు ఆటగాడు రూడిగర్ తల పగిలి రక్తం కారసాగింది. అటు పక్కన ట్రూబిన్ తలకి కూడా బలంగానే తగిలింది. దీంతో గ్రౌండ్‌లోనే ఇద్దరు కాసేపు పడుకున్నారు. ఆ తర్వాత రూడిగర్, ట్రూబిన్‌లను ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స నిర్వహించారు. కాగా ట్రూబిన్ తల చుట్టూ బ్యాండేజీ వేయగా.. రూడిగర్ మొహానికి 20 కుట్లు పడే అవకాశం ఉన్నట్లు వైద్యులు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Rudiger scores the equalizer 🤍
— Omar Aref 🇦🇪 (@LosB1ancos_) October 11, 2022
He got into an accident with Shakhtar goalkeeper, hopefully both are well.pic.twitter.com/SkFpH0X1Lb
Comments
Please login to add a commentAdd a comment